vaccine
-
టీకా వికటించి శిశువు మృతి
తంగళ్లపల్లి (సిరిసిల్ల): టీకా వికటించి శిశువు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి లలిత–రమేశ్ దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు హన్షిత్ (9), కూతురు(45రోజులు) ఉన్నారు. కూతురుకు నేరెళ్ల పీహెచ్సీలో బుధవారం టీకా వేయించారు. ఇంటికెళ్లాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు శిశువు అప్పటికే మృతిచెందిందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. పాప మృతదేహంతో నేరెళ్ల పీహెచ్సీ వద్ద ధర్నాకు దిగారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ వారికి నచ్చజెప్పినా వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారి రజిత అక్కడికి చేరుకొని బుధవారం ముగ్గురు చిన్నారులకు టీకాలు వేస్తే ఇద్దరు బాగానే ఉన్నారన్నారు. పాప మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా తల్లిదండ్రులు వినలేదు. వీరికి తోడుగా సిద్దిపేట–సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావుతోపాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పాప కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.లక్ష చెక్కు అందించారు. తంగళ్లపల్లి తహసీల్దార్ గురువారం మరో రూ.లక్ష అందజేయనున్నట్లు ప్రకటించారు. -
క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!
వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జనరల్ డైరెక్టర్ అయిన అండ్రే కప్రిన్ ప్రకటించారు.చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలా పని చేస్తుందంటే.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అంటే..RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్ఎన్ఏ పీస్‌ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.ఏఐ పాత్ర కూడా.. కాగా, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
కాబోయే అమ్మలకు 'టీకా'పలా!
కాబోయే అమ్మలకు టీకాపలా!గర్భవతులు తమ ఆరోగ్యం కోసం కొన్ని, తమకు పుట్టబోయే చిన్నారి ఆరోగ్యం కోసం మరికొన్ని వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. అయితే గర్భం రాకముందు కూడా కొన్ని వ్యాక్సిన్లు వేసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఇంకొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి రావచ్చు. గర్భం కోసం ప్లాన్ చేసుకునే మహిళలు, ఆపై గర్భం ధరించాక గర్భవతులు... ఇలా మహిళందరూ తాము తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలుసుకోడానికి ఉపయోగపడే కథనం ఇది. గర్భవతినని తెలియగానే ఆమె తనకు వచ్చేందుకు అవకాశమున్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. గర్భిణులు తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవి... టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్: టెటనస్ వచ్చిన బాధితుల్లో కండరాలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడి, అది శ్వాస సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇక ‘కోరింత దగ్గు’ అని పిలిచే పెర్టుసిస్ అనే వ్యాధితోపాటు పైన పేర్కొన్న మరో రెండు.. అన్నీ కలిసి మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి. సంక్షిప్తంగా ‘టీ–డాప్’ అని పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు దీన్ని తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి సైతం ఆ వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభించే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్: గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. నిజానికి కేవలం గర్భవతులే కాదు... ప్రజలందరూ తీసుకోవడం మంచిదే. అయితే గర్భవతుల్లో ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ప్రతి సీజన్లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులైతే మరింత తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ప్రభావంపై అధ్యయనాలు పెద్దగా లేవు. పైగా గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకునే ఈ వ్యాక్సిన్ బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ రక్షణ ఇస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్వైరస్తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం పీల్చే వ్యాక్సిన్‌ను అస్సలు వాడకూడదు.గర్భం దాల్చడానికి ముందుగానే తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు... గర్భం దాల్చాలనుకున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను తప్పక తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత తీసుకుంటే ఈ వ్యాక్సిన్లు గర్భవతికి ప్రమాదకరంగా పరణమించవచ్చు. అందుకే వీటిని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే తీసుకోవాలి. ఒకవేళ వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) పెద్దగా లేని గర్భవతికీ లేదా ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉన్న మహిళలకు ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకారులు కావచ్చు. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... మరీ చె΄్పాలంటే... ఇంకా గర్భం దాల్చక ముందే తీసుకోవడం మంచిది. (ఈ వ్యాక్సిన్లను రొటీన్ వ్యాక్సినేషన్లో భాగంగానే ఇస్తారు. ఒకవేళ అలా తీసుకోనివారు తప్పక ఈ వ్యాక్సిన్లు తీసుకోవాలి). ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్ఎమ్ఆర్) వ్యాక్సిన్‌ను బాల్యంలో తమ రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే ఆ విషయాన్ని తమ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా ఆ వ్యక్తి ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అని తెలుసుకుంటారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భందాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో ఆ వ్యాధులు (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) సోకితే గర్భస్రావం అయ్యే అవకాశాలూ ఉంటాయి.ఒకవేళ రుబెల్లా వైరస్ గానీ అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకిందంటే... అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అర్లీ ప్రెగ్నెన్సీలో కాకుండా... రెండో త్రైమాసికం తర్వాతగానీ ఇవే ఇన్ఫెక్షన్లు సోకినా అవి బిడ్డపై అవి పెద్దగా ప్రభావం చూపవు. వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్ గర్భవతికి సోకవం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. కాబట్టి గర్భం దాల్చాలనుకునేవారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడానికి నెల్లాళ్ల ముందే దాన్ని తీసుకోవడం మేలు. హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిజానికి ఈ వైరస్‌ను యాక్టివ్ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే తీసుకుంటే దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ సైతం నివారితమవుతుంది.గర్భిణికి ఇవ్వకూడని వ్యాక్సిన్... జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్. కాబట్టి దీన్ని గర్భం దాల్చినవారికి ఇవ్వరు. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి ఆస్కారం ఉండదు. ఇవీ... గర్భవతులు, గర్భం దాల్చాలనుకునే వారితో పాటు ఇతర మహిళలూ తెలుసుకోవాల్సిన వ్యాక్సిన్లు, వాటి గురించి వివరాలు. -
డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్
పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్‌లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి -
వణికిస్తున్న మంకీపాక్స్‌కు చెక్.. వ్యాక్సిన్ విడుదల
జెనీవా: ప్రపంచదేశాలను ప్రస్తుతం మంకీపాక్స్ వణికిస్తోంది. ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దవారిలో ఎంపాక్స్ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.కాగా, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నందున వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని వెల్లడించింది. ఇక, తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.మరోవైపు.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అంటువ్యాధులను నివారించడానికి, వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి, వ్యాక్సిన్లు అత్యంత అవసరం అని అన్నారు. Kasama na sa prequalification list ng World Health Organization #WHO ang #mpox vaccine ng Denmark-based Bavarian Nordic.Ito ang kauna-unahang beses na inaprubahan ng ahensya ng #UN ang isang bakuna kontra mpox. #News5 | via Reuters pic.twitter.com/FoqBdJqxUm— News5 (@News5PH) September 13, 2024 ఇది కూడా చదవండి: గూఢచర్యం ఆరోపణలు..బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా -
కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు
భారత్‌పాటు ఇతర అల్పాదాయ దేశాలలో విస్తృత-స్పెక్ట్రమ్ యాంటీ-మైక్రోబయల్ వ్యాక్సిన్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం అలోపెక్స్ ఇంక్‌తో భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు భారత్‌తోపాటు ఇతర లైసెన్స్ భూభాగాల్లో వ్యాక్సిన్ AV0328 అభివృద్ధి, వాణిజ్యీకరణ చేపడతాయని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఒప్పందం ప్రకారం.. వన్‌టైమ్ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో AV0328 వ్యాక్సిన్ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది."వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్లను అందించాలనే మా మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, AV0328 వ్యాక్సిన్ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. -
ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసిన భారత్ బయోటెక్
ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 'ఓరల్ కలరా వ్యాక్సిన్' (OCV) ప్రారంభించింది. 'హిల్చోల్' (HILLCHOL) పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. దీనిని సింగపూర్‌కు చెందిన హిల్మాన్ లేబొరేటరీస్ లైసెన్స్‌తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.కలరా అనేది నివారించదగినది. అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,479 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను 200 మిలియన్ డోస్‌ల వరకు ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్, భువనేశ్వర్లలో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కలరా నివారించడానికి 'హిల్చోల్' ఓ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. 2030 నాటికి కలరా సంబంధిత మరణాల సంఖ్య 90 శాతం తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.కలరా ఎలా వ్యాపిస్తుంది?పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల వల్ల, పరిశుభ్రమైన నీరు లభించని ప్రాంతాల్లో నివసించే ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. కలరా సోకినా తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్‌లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్‌లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్‌లాండ్‌లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్‌ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్‌లో 2023 ఆగస్టులో, థాయ్‌లాండ్‌లో అక్టోబర్‌లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్‌లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?
మంగళవారం రాజ్యసభలో తొలి ప్రసంగంలో రెండు కీలక అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యరిచారు సుధామూర్తి. ముఖ్యంగా తన ప్రసంగంలో సర్వైకల్ వాక్సినేషన్, టూరిజం గురించి హైలెట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణంగా ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రముఖంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ఇక రాజ్యసభలో మహిళ ఆరోగ్యంపై మాట్లాడటమే గాక దాని పరిష్కారం గురించి కూడా వివరించి దటీజ్ సుధామూర్తి అని చెప్పకనే చెప్పారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమె రాజ్యసభ ఎంపీ హోదాలో కూడా ఆమె ప్రజా సేవకే పెద్ద పీట వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటీ? ఎందుకు వేయించుకోవాలి అంటే..సర్వైకల్ వ్యాక్సినేషన్ని గర్భాశయ కేన్సర్ నిరోధక టీకా అని పిలుస్తారు. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ కేన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుంచి 80 శాతం వరకు తొలగించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. బాలికలు ఈ టీకా తీసుకుంటే కేన్సర్ రాకుండా నివారించొచ్చు. వచ్చాక చికిత్స తీసుకుని నయమయ్యేలా చేయడం కంటే ముందుగానే నివారించడం ఉత్తమం. 26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు. దీన్ని 9 నుంచి 14 ఏళ్ల లోపు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్నే సుధామూర్తి రాజ్యసభ ప్రసంగంలో హైలెట్ చేసి మాట్లాడారు. మన దేశం కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయగలిగినప్పుడూ ఈ సర్వైకల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా విజయవంతమవుతుందని అన్నారు. కాస్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే ప్రతి కుటుంబ ఒక తల్లిని కోల్పోదని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి చనిపోతే ఆస్పత్రిలో ఒక మరణంగా నమోదవ్వుతుంది. కానీ ఓ కుటుంబం తల్లిని కోల్పోతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేశామని, గత 20 ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది చాలా బాగా పనిచేస్తోందని కూడా చెప్పారు. ఈ వ్యాక్సిన ఖరీదు రూ. 1400. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ వ్యాక్సిన్‌ను కేవలం రూ. 700 నుంచి రూ. 800లకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. పైగా మన దేశంలో జనభా ఎక్కువ కాబట్టి మన ఇంటి ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ మేలు చేస్తుందని అన్నారు సుధామూర్తి. కాగా, అందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ సుధామూర్తిని ప్రశంసించారు . పైగా తన తొలి ప్రసంగంలో మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు ధన్యావాదాలని కూడా చెప్పారు మోదీ. (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
-
'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్‌టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్‌లను మెలిస్సా మెక్‌టీ లీక్ చేశారు.మెలిస్సా మెక్‌టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్‌బ్లోయర్‌ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్‌టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.I AM A PFIZER WHISTLEBLOWERTHE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEEI AM TIRED.I am tired of feeling like an imposter.I am tired of feeling like I have no hope. I am tired of fighting, debating, posting, researching.. But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024 -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్‌ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024 -
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది. -
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాతో టీబీ కొత్త వ్యాక్సిన్!
క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా..చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఇది మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వస్తుంది. క్షయ ఈ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. అలాంటి ఈ వ్యాధికి ఇప్పటి వరకు బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ మరియు గురిన్), బోవిన్ టీబీ పాథోజెన్ అటెన్యూయేటెడ్ వేరియంట్ అనే ఏళ్ల నాటి పాత వ్యాక్సిన్లే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ పరిమిత ప్రభావమే ఉంది. అందువల్లే ప్రభావవంతంగా పనిచేసేది, ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). ఇది మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియా నుంచే క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేలా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఇది ఎంత ప్రభావవంతంగా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని(మార్చి 24) పురస్కరించుకుని ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది. ఆ ట్రయల్స్ ద్వారా ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేస్తారు. ఈ ఎంటీబీ వ్యాక్సిన్ బీజీజీ కంటే ప్రభావవంతమైనది, ఎక్కువకాలం పనిచేసే వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు పరిశోధకులు. ఇది పెద్దలు, యుక్త వయసులు వారికి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా అని చెప్పొచ్చన్నారు. ఈ మేరకు బయోఫ్యాబ్రి సీఈవో ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ మాట్లాడు.. ఈ క్షయ వ్యాధి కారణంగా ఏటా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోతున్నారు. అంంతేగాక ప్రపంచవ్యాప్తంగా క్షయకు సంబంధించిన కేసులు దాదాపు 28% ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ కొత్త ఆశను రేకెత్తించేలా భారత్‌లోనే పెద్దలు,కౌమర దశలో ఉన్నవారిపై ట్రయల్స్ నిర్వహించడం అనేది గొప్ప మైలురాయి అని అన్నారు. ఇక బయోఫ్యాబ్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం పడ్డ అన్వేషణ ఇన్నేళ్లకు ఫలించింది. దీనికి తోడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రొత్సాహం అందినట్లయ్యిందన్నారు. ఈ కొత్త టీబీ వ్యాక్సిన్‌ని ఆవిష్కరించడంలో డాక్టర్ ఎస్టేబాన్ రోడ్రిగ్జ్, డాక్టర్ కార్లోస్ మార్టిన్ల భాగస్వామ్యం ఎంతగానో ఉందన్నారు. ఈ ట్రయల్స్‌కి ముందే ఈ వ్యాక్సిన్ అనేక మైలు రాళ్లను సాధించింది. వాటిలో ఫేజ్2 డోస్ ఫైండింగ్ ట్రయల్ ఇటీవలే పూర్తైయ్యింది. ఇక నవజాత శిశువులలో డబుల్ బ్లైండ్, కంట్రోల్డ్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్ 2023లో ప్రారంభమైంది. కాగా, ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి ఏడు వేల మంది, మడగాస్కర్ నుంచి 60 మంది, సెనెగల్ నుంచి 60 మంది నవజాత శిశువులకు టీకాలు వేయనున్నారు. ప్రధానంగా శిశువుల్లో ఈ ఎంటీబీ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని, సామర్థాన్ని అంచనావేయడమే లక్ష్యం. అంతేగాదు హెచ్ఐవీ-నెగిటివ్, హెచ్ఐవీ-పాజిటివ్ పెద్దలు ,కౌమారదశలో ఉన్నవారిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అంచనా వేయనుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ని 2024 ద్వితీయార్ధంలో సబ్-సహారా ఆఫ్రికాలో ప్రారంబించనున్నారు. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
చైనాలో కొత్తవైరస్ టెన్షన్.. ఆస్పత్రుల్లో పిల్లలు (ఫొటోలు)
-
చైనాలో కొత్త వైరస్.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది.
ఢిల్లీ: కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో వైరస్ వచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి. కోవిడ్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా అక్కడి నుంచి మరో వ్యాధి పుట్టుకువస్తుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చైనాలోని చిన్నారుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల పిల్లలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపరితిత్తుతుల ఇన్ఫెక్షన్, జ్వరం వంటివి వ్యాపిస్తుండటంతో బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఈ కొత్త వైరస్‌పై హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందకూరి స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పిల్లలో నమోదవుతున్న న్యూమోనియయా కేసుల్లో కొత్త వైరల్ ఏది లేదని తెలిపారు. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టీకాలు తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా కేసులపై ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ చైనా నుంచి వివరణాత్మక వివరణ కోరిందని చెప్పారు. ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2)తో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా డైరెక్టర్ అజయ్ శుక్లా హెచ్చరించారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే ఇతర వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని అధికారులు చెబుతున్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు. డాక్టర్ శుక్లా మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలకు వెళుతున్నట్లయితే, వారికి దగ్గు, జలుబు, జ్వరం లేదా ఇతర లక్షణాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. తరగతి గదిలో పిల్లలెవరికైనా న్యుమోనియా ఉంటే ఉపాధ్యాయుడికి తెలియజేయండి. పిల్లలు అనారోగ్యంతో ఉంటే పాఠశాలకు పంపవద్దు." అని పేర్కొన్నారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ గురించి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన వివరాలు లేవని తెలిపిన డాక్టర్ శుక్లా.. డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటు.. చైనాలో శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్ని కేంద్రాలలో దాదాపు 1200 మంది పిల్లలు పెరిగినట్లు వారు నివేదించారు. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్‌లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు.. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Mysterious Pneumonia Outbreak: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు -
టీకాతో అకాల మరణాల ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు
ఢిల్లీ: కరోనా వాక్సినేషన్ యువకుల్లో అకాల మరణాలను పెంచబోదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. కనీసం టీకా ఒక్క డోసు తీసుకున్నా.. అకాల మరణాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కరోనా టీకా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పుకు సంబంధించి ఐసీఎమ్ఆర్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీకాతో అకాల మరణాలు ముప్పు అంశంపై ఐసీఎమ్ఆర్ అక్టోబరు 1, 2021 నుండి మార్చి 31, 2023 మధ్య అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో రోగులను పరిశీలించారు. ముఖ్యంగా 18-45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై దృష్టి సారించారు. వారిలో ఎలాంటి ఆనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్లేషణలో 729 కేసులను పరిశీలించారు. టీకా రెండు డోసులను తీసుకున్నవారికి అకాల మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని అధ్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అకాల మరణ ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలను అధ్యయనం గుర్తించింది. వీటిలో కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగుల ఆరోగ్య చరిత్ర, ఆకస్మిక మరణానికి సంబంధించిన వ్యక్తి కుటుంబ ఆరోగ్య చరిత్ర ప్రభావితం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరణానికి ముందు 48 గంటలలోపు అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వంటి పదార్ధాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమలో పాల్గొనడం వంటివి అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతున్నాయని గుర్తించారు. ఇదీ చదవండి: IndiGo Flight Viral Incident: ప్రయాణీకులు ఆరుగురే అని... దించేసి పోయారు! -
టీబీకి టాటా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ వ్యాధి (టీబీ) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పెద్దలకు టీకా పంపిణీకి వైద్య శాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోనూ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతం దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇదిలా ఉండగా మరింతగా దేశంలో పెద్దలకు టీబీ నుంచి రక్షణ కోసం బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో వచ్చే నెలలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు అంశాల ప్రాతిపదికగా.. ఆరు అంశాల ప్రాతిపదికగా వివిధ వర్గాల వ్యక్తులకు తొలుత టీకా పంపిణీ చేపడతారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు, ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18 కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు ఇలా ఈ ఆరు వర్గాలకు చెందిన వారికి తొలుత టీకాలు వేస్తారు. టీకా పంపిణీకి ఎంపిక చేసిన 12 జిల్లాల్లో ఈ వర్గాలకు చెందిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నట్టు వైద్య శాఖ ప్రాథమికంగా నిర్థారించింది. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి టీకా పంపిణీకి అర్హులైన వారి ఎంపిక చేపడుతున్నారు. కాగా, ఇప్పటికే వైద్య శాఖ పిల్లలకు టీకా పంపిణీ చేస్తోంది. గత ఏడాది నుంచి వైద్య శాఖ ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించింది. తొమ్మిది నెలలలోపు పిల్లలకు మూడు డోసులుగా టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోగా మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలోనే నిర్ధేశించిన పరిమాణంలో పెద్దలకు టీకాలు పంపిణీ చేయనున్నారు. టీకా పంపిణీకి అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాలను ఎంపిక చేశారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత పంపిణీ వ్యాక్సిన్ వెయిల్స్, సిరంజ్‌లు ఎంపిక చేసిన 12 జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. 59 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాం. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి
కోవిడ్ మహమ్మారి ప్రజలను ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నుంచి సురక్షితంగా బటపడేందుకు బయోఎన్‌టిక్ కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ క్యాన్సర్ మహమ్మారిని రాకుండా కూడా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్ వేసుకున్నట్లే క్యాన్సర్ వ్యాక్సిన్లు వేసుకొవచ్చేనే ఆలోచనకు పురిగొల్పింది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ అటాక్ అయ్యే దశలో ఉన్న వాళ్ల పాలిట ఈ వ్యాక్సిన్ వరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఇది ఏ రకమైన క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతుంది? అధ్యయనంలో కనుగొన్న సరికొత్త విషయలేంటీ?.. కోవిడ్‌కి సంబంధించిన ఎంఆర్ఎన్ వ్యాక్సిన్లపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ సరికొత్త విషయం వెల్లడైంది. ఇది క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి చెందిన డేవిడ్, రూబెన్‌స్టెయిన్ సెంటర్ ఫర్ ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ రీసెర్చ్‌కు సంబంధించిన శాస్త్రవేత్త వినోద్ బాలచంద్రన్ల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ప్యాక్రియాటిక్ క్ అంటే.. జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉండే శరీర అవయవం. ప్యాంక్రియాస్ నిర్వహించే ముఖ్యమైన విధులేంటంటే.. జీర్ణక్రియను సులభతరం చేసే ఎక్సోక్రైన్ ఫంక్షన్, రరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఎండోక్రైన్ పనితీరు. అయితే ఈ అవయవం వెలుపల అసాధారణ కణుతులు వస్తే దాన్ని ప్యాక్రియాటిక క్యాన్సర్ అంటారు. దీని వల్ల ఆహారం అరగదు. నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించటం కష్టం. దీనఇన తొలి దశలో గుర్తిస్తేనే రోగికి చికిత్స అందించి ప్రాణాలను కాపడగలం. అలాంటి ప్రమాకరమైన ప్యాక్రియాటిక్ క్యాన్సర్‌ని ఈ వ్యాక్సిన్ రాకుండా ఆపగలదని చెబుదున్నారు వైద్యులు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్ కణాలను గుర్తించేలా హెచ్చారిస్తాయి. తత్ఫలితంగా ప్యాంక్రియాటిక్ కణితుల్లో కనిపించే నియాయాంటిజన్ ప్రోటీన్లు అలారం గంటలుగా పనిచేసేలా చేసి రోగనిరోధక వ్యవస్థను సమీకరిస్తుంది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే టీ కణాలు నిర్దిష్ట రోగ నిరోదక కణాల ఉత్పత్తిని ప్రేరిపించే లక్ష్యంతో పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. దీంతో రోగుల్లో ఈ క్యాన్సర్ కణితిని సులభంగా గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తొలగించగలుగుతారు వైద్యులు. అంతేగాదు మళ్లీ ఈ క్యాన్సర్ పునరావృత్తం గాకుండా చేస్తుంది డాక్టర్ బాల చంద్రన్ అన్నారు. దాదాపు ఏడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులలో ఎలా పనిచేస్తుందనే ఆలోచనను రేకెత్తించిందని ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అన్నారు వైద్యులు. ఈ టీకాలు సంప్రదాయ టీకాల వలె కాకుండా జన్యు సంకేత విభాగాన్ని ప్రేరేపించి నిర్దిష్ట ప్రోటీన్ ఉత్పతి చేసేలా నిర్దేశిస్తుంది. తద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ ప్యాక్రియాంటిక్ క్యాన్సర్‌ని రాకుండా నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనలు ప్యాంక్రియాంటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు జీవితంపై సరికొత్త ఆశను అందిస్తాయని అన్నారు వైద్యులు. దాదాపు 20 మంది రోగులపై చేసిన క్లినికల్ ప్రయోగాల్లో ఈ చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒకరకంగా పరిశోధనలు వ్యాక్సిన్ల ఆవశక్యత తోపాటు ఇతర క్యాన్సర్లను నివారించేలా మరిన్ని వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే ఆలోచనకు నాంది పలికిందన్నారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సవాలుకు చెక్‌పెట్టేలా చేసి రోగుల జీవితంలో కొత్త ఆశాజ్యోతిని వెలిగించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ కీలకం: పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
చికున్ గున్యాకు తొలి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: చికున్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. ఇక్స్చిక్ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చికున్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్గకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణావసరాన్ని ఈ వ్యాక్సిన్ తీరుస్తుందని నమ్ముతున్నాం’’ అని వివరించింది. ‘‘ఇక్స్చిక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచి్చంది’’ అని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ చెప్పారు. బయోటెక్ కంపెనీ ‘వాల్వెవా ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. -
2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్
స్టాక్‌హోమ్: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్) వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్‌మన్‌కు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ పరిశోధనలతో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పట్ల ఎంఆర్ఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తున్న దానిపై వీరిద్దరి పరిశోధన మన అవగాహనను పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గాను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు తెలియజేసింది. ఇదిలా ఉండగా, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మంగళవారం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. ఈ నెల 9న అర్థశాస్త్రంలో ఈ బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు. విజేతలకు డిసెంబర్ 10న నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. సంకల్పానికి తోడైన కృషి 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్‌మన్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్డీ పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో హెచ్ఐవీ వైరస్‌పై పరిశోధనలు చేశారు. ఆ తరువాతి కాలంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వ్యాక్సిన్లపై పరిశోధనలకు శాస్త్రవేత్తల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాటలిన్ కరికో ఎంఆర్ఎన్ఏ బయో కెమిస్ట్రీలో నిపుణులు. ఎంఆర్ఎన్ఏను వైద్యానికి ఉపయోగించాలన్న సంకల్పం ఇరువురిలోనూ మెండు. వేర్వేరు ఆర్ఎన్ఏ రకాలపై వీరు పరిశోధనలు చేపట్టగా 2005లో న్యూక్లియోటైడ్ బేసెస్లో మార్పులకు, దు్రష్పభావాలకు మధ్య సంబంధం స్పష్టమైంది. దీని ఆధారంగానే వారు ఆ బేస్‌లను మారిస్తే అప్పటివరకూ ఉన్న పరిమితులు తొలగిపోతాయని ప్రతిపాదించారు. తదుపరి పరిశోధనలతో దాన్ని రుజువు చేశారు. ఎంఆర్ఎన్ఏ బేస్‌లు మార్చారు.. టీకా సిద్ధం చేశారు! 2019లో మొదలై నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలినాళ్లలో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కావాల్సిన టీకా అంత తొందరగా తయారవుతుందా? తయారయ్యేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ.. మానవ సంకల్పం, ఆధునిక టెక్నాలజీల పుణ్యమా అని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం పెను విపత్తు నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. అంతేకాదు, ఈ టీకాల్లో ఒక రకం (ఎంఆర్ఎన్ఏ) మనకు అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలైన కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌ల పరిశోధనలు కీలకమయ్యాయి! ఎందుకు? ఏమిటి? ఎలా? 30 ఏళ్లుగా పరిశోధనలు టీకాల తయారీకి శాస్త్రవేత్తలు వందేళ్లుగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యాధికారక సూక్ష్మజీవిని నిరీ్వర్యం చేసి వాడేది ఒక రకమైతే.. ఆ సూక్ష్మజీవి భాగాన్ని ఉపయోగించుకోవడం ఇంకో పద్ధతి. వీటితోపాటు మరికొన్ని పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కానీ.. సుమారు 30 ఏళ్ల క్రితం శరీర కణాల్లోని అతి సూక్ష్మ భాగమైన ఎంఆర్ఎన్(మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్)ను కూడా వాడుకోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలైతే జరిగాయి గానీ సాధించిన ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కోవిడ్ వ్యాధి ప్రపంచంపై పంజా విసిరిన సందర్భంలో మాత్రం పరిస్థితి వేగంగా మారిపోయింది. వ్యాధి నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకా సిద్ధమైంది. ఎన్నో వ్యాధుల నియంత్రణకు ఉపయోగకరం? ఎంఆర్ఎన్ఏ టీకాలనేవి ప్రస్తుతం మనం కోవిడ్ నియంత్రణకు వాడుకున్నాం కానీ.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగానూ పనికొస్తుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్ తరువాత జంతువుల నుంచి మనుషులకు వైరస్ సంబంధిత వ్యాధులు సోకే అవకాశాలు పెరిగినట్లు ప్రపంచం గుర్తించింది. అయితే, ఇప్పటికీ గుర్తించని వైరస్ రకాలు చాలా ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్ ఏదైనా మనిషిపై దాడి చేస్తే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2000లో ఏర్పాటైన క్యూర్‌వ్యాక్, 2008లో ఏర్పాటైన బయో ఎన్‌టెక్, 2010 ఏర్పాటైన మోడెర్నా కంపెనీలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈ మూడు కంపెనీల శాస్త్రవేత్తలు యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ టెక్నాలజీ సాకారమయ్యేలా చేయగలిగారు. జీకా వైరస్ విరుగుడుకు ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ వైరస్ ఒకటి అందుబాటులో ఉండగా హెచ్10ఎన్8, హెచ్7ఎన్9 ఇన్ఫ్లుయెంజా వైరస్ల కట్టడికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏమిటీ ఎంఆర్ఎన్ఏ? మన కణాల్లోపల కణ కేంద్రకం.. అందులోపల మైటోకాండ్రియా, ఉండచుట్టుకుని క్రోమోజోములు ఉంటాయని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే అది... మెలితిరిగిన నిచ్చెన ఆకారంలోని డీఎన్ఏ అని కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రెండు పోగులుంటాయి. ఈ డీఎన్ఏలో అక్కడక్కడ కొంత భాగంలో శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది. కొన్ని రసాయన ప్రక్రియల కారణంగా ప్రొటీన్ల తయారీ సమాచారమున్న డీఎన్ఏ భాగాలు పోగు నుంచి విడిపోతుంటాయి. ఇలా విడిపోయిన భాగాన్నే ఎంఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఎంఆర్‌ఎన్‌ఏలను టీకాలుగా వాడుకునేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలైతే జరుగుతున్నాయి. అయితే దు్రష్పభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని వాడటం అసాధ్యమైంది. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏలు తగినంత మోతాదులో ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలిగేవి కాదు. ఈ నేపథ్యంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌లు చేసిన పరిశోధనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంఆర్ఎన్ఏ పోగులోని న్యూక్లియోటైడ్ బేసెస్(అడినైన్, థయామీన్, సైటోసైన్, గ్వానైన్ అని నాలుగు బేస్‌లు ఉంటాయి. రెండు పోగుల డీఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటే.. నిచ్చెన మెట్లకు రెండువైపుల ఉండే ఆధారం ఈ బేస్‌లు)మారితే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించలేదని, తద్వారా ప్రొటీన్ ఉత్పత్తి పెరగడమే కాకుండా దు్రష్పభావాలూ ఉండవని వీరు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలకు మరికొన్ని ఇతర పరిశోధనలూ తోడు కావడం వల్లనే కోవిడ్–19 విరుగుడుకు రికార్డు సమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. BREAKING NEWS The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19. pic.twitter.com/Y62uJDlNMj — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 “For the 20 years that we worked together before anybody knew about us or cared it was literally the two of us sitting side by side at a bench and working together. Usually at 3 or 5am we would be emailing each other with new ideas.” - 2023 medicine laureate Drew Weissman on… pic.twitter.com/WF3hNLJbK3 — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీకాలంటే పిల్లలకేనా?.. పెద్దల వ్యాక్సినేషన్‌కు.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అంటురోగాల నివారణ కోసం పిల్లలకు వ్యాక్సిన్లూ వేయిస్తూ ఉంటాం. అలాగే పెద్దలకూ పలు రకాల జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. కానీ వాటిని తీసుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. టీకాలు అంటే కేవలం పిల్లలకేననే అభిప్రాయం మరో కారణం. ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా (ఏపీఐ)’, ప్రముఖ పరిశోధన సంస్థ ఇప్పోస్లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో వయో జనుల వ్యాధి నిరోధక టీకాల స్వీకరణ తక్కువగా ఎందుకు ఉందన్న అంశంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వయోజనులు, వారి సంరక్షకులు, వైద్యులను కలసి సర్వే చేశారు. ఈ సందర్భంగా.. 50 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో 71 శాతం మందికి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉన్నా.. కేవలం 16 శాతం మంది మాత్రమే వయోజన వ్యాక్సిన్లను తీసుకున్నట్టు తేలింది. దీనికి రోగులు, వైద్యులు పలు రకాల కారణాలు చెప్తుండటం గమనార్హం. మార్గదర్శకాలుఏవీ లేక.. వయోజన ఇమ్యునైజేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల.. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఆసక్తి లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతానికిపైగా వైద్యులు చెప్పారు. తమకంటూ ఉన్న కొన్ని పరిమితుల వల్ల కూడా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి చర్చించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక నివారణ కంటే చికిత్సకు రోగులు ప్రాధాన్యత ఇస్తారని భావించడం కూడా ఒక కారణమేనని అంటున్నారు. పెద్దల్లో 69 శాతం మంది, వారి సంరక్షకుల్లో 76 శాతం మంది వయోజన టీకా గురించి వైద్యులను ఎప్పుడూ అడగలేదని.. అవసరమైతే వైద్యులే తమకు సిఫార్సు చేస్తారని భావిస్తున్నామని సర్వేలో వెల్లడించారు. వయోజనులు టీకా తీసుకోవడం పెరగాలంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన తరహాలో అవగాహన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వయోజనుల్లో 55 శాతం, వారి సంరక్షకుల్లో 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. అపోహలతోనూ దూరం.. వయోజన వ్యాక్సినేషన్ గురించి ఉన్న కొన్ని అపోహలు పెద్దలు టీకాలు తీసుకోకుండా నిరోధిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. దశలవారీగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకుంటే.. తాము అతిగా టీకా లపై ఆధారపడేలా మారుతామని వయోజనుల్లో 50 శాతానికిపైగా నమ్ముతున్నారని తేలింది. వయోజనుల్లో 58%, వారి సంరక్షకుల్లో 62% మంది రోగాల నుంచి రక్షించుకోవడానికి టీకా కంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారని వెల్లడైంది. ‘షింగిల్స్’పై అవగాహన లేదు పెద్దల్లో వచ్చే ప్రధానమైన, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధి షింగిల్స్. దీని నివారణ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై విడిగా సర్వే నిర్వహించారు. పిల్లల్లో చికెన్ఫాక్స్కు కారణమయ్యే వైరస్ వల్ల పెద్దవారిలో షింగిల్స్ వ్యాధి వస్తుంది. చర్మంపై కురుపులతో నొప్పి, బాధాకరమైన పరిస్థితి కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. షింగిల్స్‌కు, ఇతర చర్మ సంబంధ సమస్యల మధ్య తేడాను గుర్తించడం కష్టం. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ దీనికి గురైనా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని.. వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నివారించవచ్చని 73శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది. హైదరాబాదీల్లో అవగాహన ఉన్నా.. హైదరాబాద్ నగరంలో 50 ఏళ్లు దాటిన వయోజనుల్లో 53% మంది తమకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉందని చెప్పారు. కానీ వారిలో కేవలం 4% మందే వయోజన వ్యాక్సిన్లు తీసుకున్నారు. హైదరాబాద్‌లో 67 శాతం మంది కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు టీకాలు వేయాల్సినంత తీవ్రంగా లేవని భావిస్తున్నారు. పెద్దల్లో 67 శాతం, వారి సంరక్షకుల్లో 82% మంది వయోజన వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో లేవని చెప్తున్నారు. ఇక 81శాతం మంది టీకాలు తీసుకోవాలని వైద్యులు చెప్తే విశ్వసిస్తామని చెప్పారు. కానీ తమకు వైద్యులు వ్యాక్సిన్లను సిఫార్సు చేశారని 7 శాతం మందే చెప్పడం గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున 16 శాతం వైద్యులు వయోజన వ్యాక్సినేషన్‌ను సిఫార్సు చేస్తున్నట్టు సర్వేలో తేలగా.. దక్షిణాదిలో వారు 10 శాతమే. పెద్దల్లో అవగాహన కల్పించాలి పిల్లల్లో రోగనిరోధకత ఆవశ్యకతను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నప్పటికీ పెద్దల్లో అవగాహన లేదు. సందర్భాన్ని బట్టి టెటనస్ టాక్సాయిడ్, యాంటీ–రేబిస్ టీకా వంటివి మినహా పెద్దలు ఇతర వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. – బిపిన్ కుమార్ సేథీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ టీకాలు ప్రజలకు మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయి. టీకాలు తీసుకున్న యువతలో సైతం, రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా గుండెపోట్లతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణహాని కూడా కలుగుతోంది’’ అని పలువురు అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను విధిగా కోవిడ్ టీకాలు తీసుకోవాల్సిందే అని ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గతంలోనే తేల్చి చెప్పిన నేపథ్యంలో.. ఇక మీదటైనా టీకాలు తీసుకోవాలా లేదా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోవాలని వారు సూచించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు తమ దేహాలను సులభమైన హోమియో, ప్రకృతి చికిత్సల ద్వారా డీటాక్స్ చేసుకుంటే మంచిదని పిలుపునిచ్చారు. అవేకన్ ఇండియా మూవ్మెంట్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ‘యువతలో ఆకస్మిక గుండెపోట్లు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రసంగించారు. చర్చాగోష్టికి అధ్యక్షత వహించిన స్వచ్ఛంద సేవకురాలు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కవుల సరస్వతి మాట్లాడుతూ కోవిడ్‌ను విటమిన్ సి, డి, మెలటోనిన్, యాంటి ఫంగల్ చికిత్సల ద్వారా సులువుగా నయం చేయవచ్చని అల్లోపతి, హోమియోపతి, ప్రకృతి, యునానీ వైద్యులు నిరూపించారని గుర్తు చేశారు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తి కోసం.. ప్రసిద్ధ హోమియో వైద్యులు డా.అంబటి సురేంద్ర రాజు ప్రసంగిస్తూ.. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం కోసం తుజ–30, వాక్సినీనమ్–30, మలాండ్రినమ్–30 అనే హోమియో మందులు వాడుకోవచ్చని సూచించారు. ఈ గుళికలను ఒక్కొక్క రకాన్ని రోజుకు ఒకసారి 6 గుళికల చొప్పున 3 రోజుల పాటు మొత్తం 9 రోజుల పాటు చప్పరించాలన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా, డాక్టర్ సునీల్ డేవిడ్ విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి, తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా కొత్త రూపం దాల్చింది.. జాగ్రత్త సుమా! -
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్‌ను రూపొందిస్తుంది. -
పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త బాటలు
-
కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త మృతి.. అసలేం జరిగింది?
కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యన్ శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బోటికోవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోవిడ్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. 47 ఏళ్ల బోటికోవ్ తన అపార్ట్మెంట్లోనే విగతజీవిగా కనిపించాడు. అతను గామాల్యే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథ్‌మెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నట్లు రష్య స్థానిక మీడియా పేర్కొంది. ఆయన చేసిన కృషికి గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్ల్యాండ్ అవార్డుతో సత్కరించారు. 2020లో స్పుత్నిక్ వీ అనే కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. ఐతే ఆయన్ను ఎవరో బెల్ట్‌తో హింసించి హతమార్చినట్లు కొందరు చెబుతున్నారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా దర్యాప్తు అథారిటీ పేర్కొంది. ఐతే ఈ ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు రష్యా ఫెడరల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడని అతనికి నేర చరిత్ర కూడా ఉన్నట్లు ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీ వెల్లడించింది. (చదవండి: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!) -
జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్ ప్రారంభం
స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేగాదు ఈ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్‌కి రూ. 325లకి, ప్రైవేట్ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్‌లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్కు సంబంధించిన వ్యాక్సిన్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు) -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్‌గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
బీఈ టీకాకు డీసీజీఐ అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 14–వాలెంట్ పీడియాట్రిక్ న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా తయారీ, విక్రయాలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించినట్లు బయోలాజికల్ వెల్లడించింది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియాకు సంబంధించిన ఈ టీకాను 6, 10, 14 వారాల పిల్లలకు 3 డోసులు కింద ఇవ్వొచ్చని పేర్కొంది. భారత్‌లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అయిదేళ్ల లోపు పిల్లల మరణాలకు ఎక్కువగా ఎస్ న్యూమోనియా కారణమవుతోందని తెలిపింది. పీసీవీ14తో కోట్ల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలమని కంపెనీ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో పశు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని (వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ప్రకటించింది. సంస్థ ఎండీ డాక్టర్ కె.ఆనంద్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్ఎస్ఎన్ భార్గవ సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ (పాదాలు, నోటి ద్వారా సంక్రమించే వ్యాధులు)తో పాటు ఇతర పశు వ్యాధులకు సంబంధించిన టీకాలు ఈ కేంద్రంలో తయారు చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. దీని ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు దొరకనుండగా, ఏడాదికి 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఐఐఎల్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ పేరు ఇనుమడిస్తుంది: కేటీఆర్ జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఐఎల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకటిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఐఐఎల్ సరఫరా చేస్తోంది. గచ్చిబౌలిలో ఉన్న ఐఐఎల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఇప్పటికే ఏటా 300 మిలియన్ డోసులను తయారు చేస్తోంది. ప్రస్తుత పెట్టుబడితో మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. తమ వ్యాక్సిన్‌తో పశు వ్యాధుల నియంత్రణ జరుగుతుందని, రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆనందకుమార్ పేర్కొన్నారు. కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ పేరు ఇనుమడిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ఫార్మా, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్‌నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్‌లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
కోవిడ్ వ్యాక్సిన్‌పై మాట మార్చిన కేంద్రం.. తెరపైకి కొత్త కంపెనీ!
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోసుగా బయోలాజికల్–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నామో బూస్టర్ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్ బూస్టర్ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. కోవిడ్–19పై నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫార్స్ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్ లేదంటే కోవాగ్జిన్ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్‌ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
Monkeypox: మంకీపాక్స్‌తో సీరియస్ అయితే ఆ టీకా వాడొచ్చు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలవరపరుస్తున్న మంకీపాక్స్ వైరస్ నియంత్రణకు టీకాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) అదర్ పూనావాలా చెప్పారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మంకీపాక్స్ వైరస్ సోకడం వల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిడుబు అనే రోగానికి వాడే టీకాను వాడవచ్చని సూచించారు. మంకీపాక్స్ నియంత్రణకు త్వరలోనే టీకాను కనిపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. టీకాను కనిపెట్టడానికి గాను తాము నోవావాక్స్ సంస్థతో చర్చలు జరిపామని వెల్లడించారు. మంకీపాక్స్ టీకా కోవిడ్–19 టీకా కంటే భిన్నంగా ఉంటుందని పూనావాలా వివరించారు. ఈ టీకా నిల్వ, నిర్వహణకు ప్రత్యేక కంటైన్మెంట్ సౌలభ్యాలు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేయడానికి సదుపాయాలు లేవని, కానీ పరిస్థితి మారవచ్చని తెలిపారు. మూడు నెలల్లో భారత్‌కు టీకాలు డెన్మార్క్‌లోని బవేరియన్ నార్డిక్ సంస్థ నుంచి మంకీపాక్స్ టీకాలను దిగుమతి చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. రెండు నుంచి మూడు నెలల్లో టీకాలు భారత్‌కు అందవచ్చని తెలిపారు. భారత్‌లో ఇప్పటిదాకా మంకీపాక్స్ కేసులో స్వల్ప సంఖ్యలోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. -
కోవిడ్, మంకీపాక్స్‌కు తేడా ఏంటి? ఏది ఎక్కువ డేంజర్?
కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో పెనుముప్పు ఎదురవుతోంది. ఈ వ్యాధి ఇప్పటికే 70దేశాలకు పైగా వ్యాపించింది. 16 వేలకుపైగా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌లోనూ ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కోవిడ్, మంకీపాక్స్ రెండు వైరస్‌లకు ఉన్న తేడా ఏంటి? వ్యాధి తీవ్రత విషయంలో ఏది మనిషి ప్రాణాలపై అధిక ప్రభావం చూపిస్తుంది అనే చర్చ మొదలైంది. రెండూ భిన్నం.. కోవిడ్ 19, మంకీపాక్స్ వైరస్లు పూర్తిగా భిన్నం. సార్స్ కోవ్-2 వల్ల కరోనా వస్తుంది. మంకీపాక్స్.. పాక్స్విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. ఇందులో వేరియోలా వైరస్ (మశూచి కారకం), వ్యాక్సినియా వైరస్ (మశూచి వ్యాక్సిన్‌లో ఉపయోగించేది), కౌపాక్స్ వైరస్లు ఉన్నాయి. సార్స్ కోవ్-2 వైరస్ మనుషుల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా లోనికి ప్రవేశించి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడి చేస్తుంది. మంకీపాక్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ రెండింటి మధ్య తేడాను మెరీలాండ్ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్ సింపుల్‌గా తేల్చారు. కోవిడ్ పాము కాటుతో సమానం అయితే.. మంకీపాక్స్ నల్లుల లాంటివని పేర్కొన్నారు. లక్షణాలు ఇలా.. కోవిడ్, మంకీపాక్స్ లక్షణాలు చూడటానికి కాస్త ఒకేలా కన్పించినప్పటికీ రెండింటి మధ్య తీవ్రత విషయంలో చాలా తేడా ఉంటుంది. కరోనా రోగుల్లో జ్వరం, చలి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది, అలసట, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, గొంతులో నొప్పి వంటి లక్షణాలుంటాయి. మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. వ్యాప్తి ఇలా.. కరోనా ఒకరి నుంచి ఒకరికి సులభంగా, వేగంగా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, ఒకరు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ మాత్రం ప్రధానంగా స్కిన్ టు స్కిన్ (చర్మం చర్మం కలుసుకోవడం) ద్వారా ప్రబలుతుంది. వ్యాధి సోకిన వారు ఉపయోగించిన వస్త్రాలు, దుస్తులను ఇతరులు వాడినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ లైంగికంగా సంక్రమిస్తోందని ఇప్పటికే తేలగా.. వ్యాధి విస్తరణకు ఇంకా ఇతర కారణలేమైనా ఉన్నాయా? అని కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. చికిత్స ఏంటి? కోవిడ్ మహమ్మారి బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పరిశోధనల అనంతరం కరోనా వైరస్ నివారణకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో మరణాలు రేటు తగ్గింది. అయితే మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. అయితే కరోనా వ్యాక్సిన్లలా మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేయడం లేదు. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
ఉచిత బూస్టర్ డోస్ 24/7
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం ఊపందుకుంటోంది. గత ఏప్రిల్ 10 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్లు పైబడిన వారికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం నిర్వహించగా, తాజాగా దీనిని 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా విస్తరించారు. రెండో డోస్ నుంచి 6 నెలల వ్యవధి వచ్చిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ టీకా అందించే ప్రక్రియను గత శుక్రవారం ప్రారంభించారు. నగర వ్యాప్తంగా మొత్తం 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం కొనసాగనుంది. ఆఫీసులు.. కళాశాలల్లోనూ.. ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం, కొత్త వేరియంట్ల రాకపై అంచనాల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కోవాగ్జిన్, కోవిషీల్డ్ బూస్టర్డోస్లకు ఆర్డర్ ఇచి్చంది. ఇవి అందుబాటులోకి రావడంతో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో కూడా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలలోనూ ఏర్పాటు చేస్తున్నారు. గత శనివారం వరకూ వానల కారణంగా విద్యా సంస్థలు మూసి ఉండడంతో సోమవారం నుంచీ వీటి ఏర్పాటు మొదలైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి స్పందన చాలా బాగుందని, తొలిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యవధి నిర్ణయించుకోగా లబి్ధదారులు పెరగడంతో రాత్రి 8 గంటల దాకా కూడా కొనసాగించామని సెంటర్ ఇన్చార్జి సుధా ఓంకార్ చెప్పారు. 20 వేలు దాటిన ఫ్రీ బూస్టర్ గత 15వ తేదీ నుంచి మంగళవారం దాకా 20,485 వరకు వ్యాక్సిన్లు అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అభ్యర్థనను అనుసరించి 100 మందికి మించి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ బూస్టర్ డోస్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 24/7 కొనసాగుతుందన్నారు. (చదవండి: డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్! ) -
స్త్రీ జాతికి శుభవార్త!
అవును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ అన్నట్టు ఇది స్త్రీ జాతికి శుభవార్త. తక్కువ వెలతో, అందరికీ అందుబాటులో ఉండే దేశీయ టీకా గనక భారత మహిళా లోకానికి మరీ మంచివార్త. గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్‌పై విజయానికి మనమిప్పుడు మరింత చేరువయ్యాం. దేశంలోనే తొలి ‘క్వాడ్రివలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్’ (క్యూహెచ్‌పీవీ)కి భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ మంగళవారం ఆమోదం తెలిపారు. పుణేకు చెందిన ప్రసిద్ధ ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ దేశీయంగా వృద్ధిచేస్తున్న ఈ ‘సర్వావ్యాక్’ టీకా ఈ నవంబర్ కల్లా అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి తరచూ వచ్చే క్యాన్సర్లలో నాలుగోదీ, 15 నుంచి 44 ఏళ్ళ మధ్య భారతీయ మహిళలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో రెండోదీ అయిన సర్వికల్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం ఇప్పుడిక మన చేతుల్లోనే ఉంది. మన దేశంలో ఏటా 1.23 లక్షల పైచిలుకు మంది ఆడవారు ఈ మాయదారి రోగం బారిన పడుతుంటే, సగం మందికి పైగా (67 వేల మంది) ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, యుక్తవయసుకు రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ హెచ్‌పీవీ టీకానిస్తే గర్భాశయ క్యాన్సర్‌ను సమూలంగా దూరం చేయవచ్చని సౌమ్య లాంటి శాస్త్రవేత్తల మాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది లైంగికంగా వ్యాపించే కొన్ని వైరస్ల సమూహం. ఎక్కువ రిస్కుండే హెచ్‌పీవీల వల్ల క్యాన్సర్ వస్తుంది. నూటికి 95 సర్వికల్ క్యాన్సర్లు ఈ హెచ్‌పీవీ పుణ్యమే. సాధారణంగా గర్భాశయద్వార క్యాన్సర్ బయటపడేందుకు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ, వ్యాధినిరోధకత బాగా తక్కువగా ఉన్న స్త్రీలలో అయిదు నుంచి పదేళ్ళలోనే ఇది రావచ్చు. హెచ్ఐవీ లేని వారి కన్నా ఉన్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. అయితే, క్రమం తప్పకుండా తరచూ పరీక్ష చేయించుకొంటే, ముందుగానే రోగ నిర్ధారణ, చికిత్స జరిగి బయటపడవచ్చు. తొమ్మిది నుంచి 14 ఏళ్ళ లోపు ఆడపిల్లలు టీకా వేయించుకుంటే, ఈ వ్యాధి రాదని డబ్ల్యూహెచ్ఓ లెక్క. మన దేశంలో అభివృద్ధి చేస్తున్న కొత్త టీకా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మరో 4 టీకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆ టీకాలకు మన దేశంలో ఒక్కో వ్యక్తికీ కనీసం రూ. 5 వేల నుంచి 8 వేల దాకా ఖర్చవుతుంది. కానీ, మన దేశవాళీ కొత్త టీకా అంతకన్నా చాలా తక్కువకే దొరకనుంది. నిజానికి, పుణేలోని సీరమ్ సంస్థ చేస్తున్న ఈ టీకా ప్రయోగాలు 2019 నుంచి నాలుగేళ్ళుగా జరుగుతున్నాయి. 12 ప్రాంతాల్లో 9 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసులోని 2 వేల మందికి పైగా వ్యక్తులపై ఈ టీకాను ప్రయోగించి చూశారు. మూడు విడతలుగా ఈ ప్రయోగాలు సాగాయి. వైరస్ నిరోధకతకు అవసరమైన ప్రాథమికస్థాయి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ టీకా ప్రభావశీలమని ప్రయోగాల్లో తేలింది. టీకా వేసుకున్నవారిలో నూటికి నూరు మందిలో అద్భుత వ్యాధినిరోధకత అభివృద్ధి చెందినట్లూ, అంతా సురక్షితంగా ఉన్నట్లూ ఫలితాలు రావడం విశేషం. ప్రపంచంలో ప్రతి లక్ష మంది మహిళలనూ ప్రమాణంగా తీసుకుంటే, 18 ఏళ్ళ వయసుకే భయపెడుతున్న ప్రాణాంతక రోగమిది. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు గత 15 ఏళ్ళుగా రకరకాల సర్వికల్ క్యాన్సర్ టీకాలు వాడుతున్నాయి. ఇక, మన దేశంలో ఎప్పుడు లెక్కతీసినా కనీసం 4 లక్షల మందికి పైగా మహిళలు ఈ రోగపీడితులే. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ అయిదేళ్ళకోసారి ఈ గర్భాశయద్వార క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకం. వసతుల లేమి, అవగాహన లోపంతో ఆచరణలో అది జరగడమే లేదు. అందుకే, ఇప్పుడు దేశీయంగా టీకా అభివృద్ధి ఓ పెనుమార్పు తేనుంది. 15 ఏళ్ళ లోపు ఆడపిల్లల్లో నూటికి 90 మందికి 2030 నాటికల్లా హెచ్‌పీవీ టీకాలతో రక్షణ కల్పించాలని డబ్ల్యూహెచ్ఓ లక్షిస్తున్న వేళ ఈ చొరవ సమయానికి అంది వచ్చింది. నిజానికి, ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రోగులను రక్షించేంత ప్రాథమిక వసతులు నేటికీ మన దేశంలో లేవు. దేశంలో సగటున ప్రతి 10 వేల మంది క్యాన్సర్ రోగులకూ కేవలం ముగ్గురు రేడియేషన్ ఆంకాలజిస్టులే ఉన్నారన్నది కఠోర వాస్తవం. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ప్రధానం గనక, ఈ కొత్త టీకా ఉపయోగకరం. సర్వికల్ క్యాన్సర్ టీకాలను కూడా దేశ సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని 2018లోనే టీకాకరణపై జాతీయ సాంకేతిక సలహా బృందం సూచించింది. కానీ, మెర్క్, గ్లాక్సో లాంటి బహుళ జాతి ఔషధ సంస్థల అంతర్జాతీయ టీకాలు ఖరీదైనవి కావడంతో ఆ పని జరగలేదు. అంతర్జాతీయ టీకాల ఆధిపత్యానికి గండికొడుతూ ఇప్పుడు దేశవాళీ చౌక రకం టీకా వచ్చింది గనక, ఆ బృహత్కార్యానికి వీలు చిక్కింది. ప్రతి 8 నిమిషాలకూ ఓ మహిళను సర్వికల్ క్యాన్సర్ బలితీసుకుంటున్న మన దేశంలో మహిళా ఆరోగ్య సంరక్షణలో ఈ కొత్త టీకా ఓ చరిత్రాత్మక పరిణామం. ప్రభుత్వం బరిలోకి దిగితే కనీసం 5 కోట్ల మంది బడి వయసు పిల్లలకు ఇది తక్షణం ఉపయుక్తం. దీని గురించి యువతుల్లో, తల్లితండ్రుల్లో చైతన్యం తేవాలి. కౌమారంలోనే ఈ టీకాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి. సర్వికల్ క్యాన్సర్‌పై విజయం సాధించాలి. ఇప్పటికే, కరోనా వేళ టీకాల అభివృద్ధి, తయారీల్లో సాధించిన పురోగతితో మన దేశాన్ని ‘టీకాల రాజధాని’ అంటున్నారు. ‘సర్వావ్యాక్స్’ లాంటి కొత్త టీకాలు ఆ పేరును నిలబెడతాయి. మరిన్ని కొత్త టీకాల పరిశోధన, అభివృద్ధికి వసతులు కల్పించి, మన శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం పాలకుల కర్తవ్యం. -
వ్యాక్సిన్ తీసుకుంటే రూ.5 వేల రివార్డు! నిజమెంత..
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్, రాష్ట్రాన్ని బట్టి కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇదిలా ఉంటే.. వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 'కోవిడ్-19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్ అందిస్తోంది' అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఆ మెసేజ్ హిందీలో ఉంది. అది 'ముఖ్యమైన సమాచారం.. ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ప్రధానమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.5వేలు అందుతాయి. ఈ అవకాశం జులై 30 వరకే. ' అని ఉంది. మరోవైపు.. తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఓ లింక్ సైతం ఏర్పాటు చేశారు. एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck: ▶️ इस मैसेज का दावा फर्जी है ▶️ कृपया इस फर्जी मैसेज को फॉरवर्ड न करें pic.twitter.com/AV8asQzexu — PIB Fact Check (@PIBFactCheck) July 12, 2022 ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేయొద్దు.. కరోనా వ్యాక్సిన్‌పై వాట్సప్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో అది ఫేక్‌న్యూస్‌గా పీఐబీ ఫాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించింది.' ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేసే ముందు అది పూర్తిగా ఫేక్‌న్యూస్‌గా మీరు గుర్తుంచుకోవాలి. కరోనా టీకా తీసుకున్నవారికి రూ.5వేలు రివార్డ్ అందుతుందనే వార్త పూర్తిగా తప్పు.' అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. అందులో ఉండే లింక్‌పైన ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని, అలాంటి వాటితో సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్‌లైన్ -
'బీఏ5 వేరియంట్' కలవరం.. మూడు డోసులు తీసుకున్నా ఇన్ఫెక్షన్
కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిని భయపెడుతోంది ఈ మహమ్మారి. కొద్ది రోజులుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌పై విస్తుపోయే విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.5 హరిస్తోందని తేల్చారు. వారాల వ్యవధిలోనే మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్ కారణంగానే భారత్, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. 'ఈ వేరియంట్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోందంటే.. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే. 2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ బీఏ1 వేరియంట్ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదు' అని తెలిపారు కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధులు నిపుణులు బ్లూమ్‌బెర్గ్. ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదురుకునే వేరియంట్‌గా అభివర్ణించారు లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వెల్లడించారు. ఇదీ చదవండి: 'సూపర్ మూన్'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. -
తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూణేకి చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను వృద్ధి చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌కమిటీ(SEC) ఈ వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతూ.. అత్యవసర వినియోగం శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. డీసీజీఐ మంగళవారం రాత్రి అనుమతులు జారీ చేసింది. రెండు డోసులతో పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు.. 28 రోజుల టైంతో ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్‌కు ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్‌ను స్టోరేజ్ చేయొచ్చు. దేశంలోనే ఈ తరహా వ్యాక్సిన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. సాధారణంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను.. అత్యంత లో-టెంపరేచర్లలో(సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటిది జెన్నోవా వ్యాక్సిన్‌కు అలాంటి ఆటంకాలేవీ లేవని కంపెనీ చెబుతోంది. పూణేకు చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్.. దేశంలోనే తొలి కొవిడ్-19 m-RNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మూడు దశలుగా ఈ వ్యాక్సిన్ టెస్టింగ్‌లకు సంబంధించిన నివేదికలను డ్రగ్ రెగ్యులేటరీకి సమర్పించింది కూడా. ఫేజ్2, 3లను నాలుగు వేలమందిపై ప్రయోగించింది కంపెనీ. జెన్నోవా వ్యాక్సిన్‌తో పాటు సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి (ఏడు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు) డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ ఇచ్చింది. చదవండి: వైరస్ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! -
కోవిడ్ అలర్ట్: భారీగా కొత్త కేసులు.. బాధితుల్లో 10 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుదల నమోదవడం దేశవ్యాప్తంగా భయాందోళనలను రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 న 8,013 కేసులు నమోదవగా మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే బయటపడ్డాయి. 10 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మొత్తం బాధితుల్లో కిత్రం రోజు 4,216 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కేసుల్లో క్రమం తప్పకుండా పెరుగుదల నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40,370 కు చేరింది. చదవండి👉 అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా గురువారం 7,584 కోవిడ్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రోజు వ్యవధిలోనే కేసులు 745 ఎగబాకాయి. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో నాలుగో వేవ్ కూడా ఉంటుందా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఈ భయాలు రెట్టింపవుతున్నాయి. అయితే, వైరస్ బారినపడుతున్న వారిలో స్వల్ప లక్షణాలే ఉండటం.. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు రాకపోవడం గమనించదగ్గ విషయం. ఏదేమైనా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వాలు చెప్తున్నాయి. చదవండి👉🏼 స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని.. -
Sakshi Cartoon: కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్‌గేట్స్
కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్‌గేట్స్ -
రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' కరోనా వ్యాక్సిన్ ప్రచారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్‌లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు. (చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ) -
దేశంలో తొలిసారి.. వైరస్ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా!
సాక్షి హైదరాబాద్: టీకా తయారీ విషయంలో భారత్ కీలకమైన ముందడుగు వేసింది. కోవిడ్‌తోపాటు అనేక ఇతర వ్యాధుల నిరోధానికి టీకాలు తయారు చేసేందుకు వీలు కల్పించే మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టెక్నాలజీపై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పట్టుసాధించారు. అంతేకాకుండా వ్యాధికారక సూక్ష్మజీవులు తమ రూపాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నా ఎప్పటికప్పుడు వేగంగా కొత్త టీకాలను తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. దేశంలో ఈ సాంకేతికతను తొలిసారి రూపొందించిన సంస్థ ఇదే కావడం విశేషం. ఇప్పటివరకూ ఈ టెక్నాలజీ మోడెర్నా, ఫైజర్ వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద మాత్రమే ఉంది. దేశంలో రెండో దశ కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో సీసీఎంబీ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని, కేవలం పది నెలల్లో పట్టు సాధించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నంది కూరి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కోవిడ్ కారక వైరస్ నుంచి ఆర్ఎన్ఏను వేరుచేసి, కొవ్వులతో కలిపి ఎలుకల్లోకి ఎక్కించినప్పుడు వాటి రోగనిరోధక వ్యవస్థ చైతన్యవంతమై యాంటీ బాడీలను ఉత్పత్తి చేసిందని చెప్పారు. ప్రస్తుతం హ్యామ్స్టర్ రకం ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నామన్నారు. క్షయ, మలేరియా, డెంగీ వంటి అనేక వ్యాధులకు ఈ టెక్నాలజీ ఆధారంగా టీకాలు చేయొచ్చని తెలిపారు. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ ఎంఆర్ఎన్ఏ సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని తాము ఉపయోగించుకున్నామని, అయితే తాము సిద్ధం చేసిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ భిన్నమైందని చెప్పారు. కోవిడ్ కోసం చేసిన టీకా 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో యాంటీ బాడీలను ఉత్పత్తి చేసిందని వివరించారు. పలు సంస్థలు ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ సాయంతో ప్రాణాంతక కేన్సర్‌కూ చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలతోచేతులు కలుపుతాం ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని సీసీఎంబీ అనుబంధ సంస్థ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సీఈఓ డాక్టర్ వి.మధుసూదనరావు తెలిపారు. టీకా తయారీకి బలమైన మౌలిక సదుపాయాలన్నీ ప్రైవేట్ సంస్థల్లోనే ఉన్నాయన్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అభివృద్ధి చేసే క్రమంలో తాము కొన్ని ఖరీదైన రసాయనాల స్థానంలో స్థానికంగా లభించే వాటిని ఉపయోగించామని చెప్పారు. ఫలితంగా దేశీ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో టీకాలు తయారుచేయటం చౌక అవుతుందని చెప్పారు. ఏయే వ్యాధులకు టీకాలు చికిత్స అభివృద్ధి చేయాలో ప్రస్తుతానికి నిర్ణయించలేదన్నారు. -
3 లక్షల మందికి జ్వరం..18 వేల మందికి కరోనా లక్షణాలు!
Covid hits North Korea six people Deand With Fever: ఉత్తరకొరియాలో కరోనా కలకలం తర్వాత తాజగా జ్వరంతో బాధపడుతున్న ఆరుగురు చనిపోయారుని శుక్రవారం ప్రకటించింది. వారిలో ఒక వ్యక్తికి కరోనా పరీకలు చేయగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ పాజిటివ్‌గా వచ్చింది. ప్రసుత్తం మూడు లక్షల మందికి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే వారిలో సుమారు 18 వేల మంది కరోనాకి సంబంధించిన లక్షణాలను కనిపించినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి 16 వేల మంది చికిత్స పోందుతున్నారని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారనేది స్పష్టం చేయలేదు. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ-వైరస్ కమాండ్ సెంటర్‌ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా దేశంలో లాక్‌డౌన్‌ని అమలు చేశాడు. శాస్త్రీయ చికిత్సా విధానం ద్వారా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేలా బలోపేతం చేయాలంటూ కిమ్ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ఆరోగ్య అధికారులు కూడా జ్వరంతో బాధపడుతున్నవారిని సాధ్యమైనంత వరకు వేరుగా ఉంచి చికిత్స అందించడం ప్రారంభించామని, సత్వరమే ఈ మహమ్మారి నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు సరఫరా చేసే ఆలోచన లేదు కరోనా కలకలంతో టెన్షన్ పడుతున్న ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ప్రణాళికలు ఏమి లేవని యూఎస్ స్పష్టం చేసింది. గతంలో కోవాగ్జిన్‌కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని తెలిపింది. కానీ ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దుత ఇస్తామని తెలిపింది. (చదవండి: నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్ టైమ్ మాస్కులో కిమ్ జోంగ్ ఉన్) -
టీకాలు.. రక్షణ కవచాలు
ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్లకు అమిత ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఫ్లూ వ్యాక్సిన్ ను తీసుకోవడం భారతదేశంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. అంటువ్యాధుల ద్వారా సంభవించే మరణాలలో 25% వరకూ టీకాలు నివారిస్తాయి. ఈ నేపధ్యంలో అంటువ్యాధుల నివారణ కోసం జీవితమంతా రోగ నిరోధక టీకాలను వేయించడం అవసరం. చాలామంది టీకాలనగానే పిల్లలుకు మాత్రమే అనే భ్రమలో ఉంటారు. అయితే పెద్దవారికి కూడా టీకాలు వేయించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. , వ్యాక్సిన్ తో నివారించగల వ్యాధుల వ్యయాన్ని తగ్గించడానికి పెద్దలలో కూడా టీకాలపట్ల సుముఖత పెంచాలి. ఈ ప్రపంచ రోగ నిరోధక వారంలో భాగంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమం పట్ల ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తప్పుడు సమాచారం పట్ల అవగాహన కల్పించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. పెద్దలకు మేలు... ఫ్లూ, న్యుమోనియా లాంటి సంక్రమణ వ్యాధులకు వ్యతిరేకంగా తగిన రీతిలో టీకాలను తీసుకోకపోవడం వల్ల హాస్పిటలైజేషన్ , చికిత్స పరంగా అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి. ‘‘భారతదేశంలో 2–3% మంది పెద్దలు కూడా టీకాలు వేయించుకోవడం లేదు. అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్దగా ప్రజలకు చేరువ కావడం లేదు. తగిన టీకా షెడ్యూల్ పాటించడం ద్వారా హాస్పిటలైజేషన్ అవసరాన్ని తగ్గించుకోవచ్చు. తీవ్ర అనారోగ్య నివారణకు టీకాలు తప్పనిసరి అని ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మరోవైపు ప్రపంచ మధుమేహ, సీఓపీడీ రాజధానిగా ఇండియా వెలుగొందుతోంది. భారతీయులు ఈ రెండు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. హెచ్1ఎన్ 1 లాంటి వ్యాధులు విపత్తును కలిగిస్తుంటే హెప్ బీ ప్రాంణాంతికంగా మారుతుంది. ఈ సమస్యలను వ్యాక్సిన్ లతో నివారించవచ్చు’’ అని అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి అన్నారు. డిఫ్తీరియా, టెటానస్ లాంటి టీకాలను సైతం తీసుకోవడం ద్వారా మరణాలు లేదా అనారోగ్యం నివారించవచ్చు. భారతప్రభుత్వంతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా చిన్నారులకు టీకాలను వేయించడం ప్రాధాన్యతాంశంగా చూస్తుంటాయి. అంటు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలుండటం కూడా దీనికి కారణం. పిల్లలకు తప్పనిసరి... ‘‘ఐదేళ్ల లోపు పిల్లల్లో అధికశాతం మంది మరణించడానికి న్యుమోకోకల్ బ్యాక్టీరియా కారణమవుతుంది వ్యాధులకు చికిత్సకంటే నివారణ మేలు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి టీకాలు తప్పనిసరి. అయితే వీటి గురించి ముందస్తుగా డాక్టర్లతో చర్చించడం అవసరం ’’ అని డాక్టర్ ఎం సురేంద్రనాథ్, పీడియాట్రిషియన్ అన్నారు. -
Covovax Vaccine: కోవోవాక్స్ వ్యాక్సిన్ ధర తగ్గింపు
న్యూఢిల్లీ: కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ఒక్కోడోసు ధరను రూ. 900 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే డోసు ధరను రూ. 225 ప్లస్ జీఎస్టీగా నిర్ధారించినట్లు కేంద్రానికి కంపెనీ తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 150 వరకు సర్వీస్‌చార్జి వసూలు చేయవచ్చు. కోవిన్ పోర్టల్‌లో కూడా టీకా ధరను సవరించి పొందుపరిచారు. ప్రస్తుతం 12ఏళ్ల పైబడిన పిల్లలకు ఇండియాలో కోర్బెవాక్స్, కోవాగ్జిన్, కోవోవాక్స్ అందుబాటులో ఉన్నాయి. -
‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
డెహ్రాడూన్: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు /వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
కోర్బేవ్యాక్స్ టీకాకు అత్యవసర అనుమతి
హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ -ఇ కంపెనీ రూపొందించిన కోర్బేవ్యాక్స్ టీకా ఉపయోగానికి అత్యవసర అనుమతులను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంజూరు చేసింది. కోవిడ్ రాకుండా అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగించవచ్చు. కోర్బేవ్యాక్స్కి సంబంధించి ఫేజ్ 2, 3 ట్రయల్స్‌లో 312 మంది పిల్లలకు 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ అందించి పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో వీటిని పరిశీలించిన డీసీజీఐ కోర్బేవ్యాక్స్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలకు దేశీయంగా తొలి వ్యాక్సిన్‌ను బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసింది. పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల కోవిడ్ పూర్వ స్థితికి పరిస్థితులు వస్తున్నట్టే అంటూ ఆ కంపెనీ ఎండీ మహిమ దాట్ల తెలిపారు. చదవండి: మనదేశంలో రుణం..'కొందరికే' పరిమితం! -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన వ్యాక్సిన్ల ధర
వ్యాక్సిన్ తయారీ సంస్థలు శుభవార్త చెప్పాయి. కరోనాకి విరుగుడుగా పని చేసే వ్యాక్సిన్ల ధరలను భారీగా తగ్గించాయి. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ల తయారీ సంస్థలు శనివారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో దేశంలో తొలి, మలి వ్యాక్సిన్లుగా వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటున్న ప్రతీసారీ కొత్త వేరియంట్ తెరమీదకు వస్తోంది. ఒమిక్రాన్ ముచ్చట మరిచిపోయేలోగానే ఎక్స్ఈ వేరింట్ దాడి చేస్తోంది. దీంతో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తప్పనిసరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు హాస్పటిల్స్‌కి కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్సిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. సీరమ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక డోసు ఇంతకు ముందు రూ.600గా నిర్ణయించారు. కాగా ఈ ధరను రూ.225కి తగ్గించారు. ఇదే సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.1,200 ఉండగా ఇప్పుడది రూ. 225కి మార్చారు. కరోనా కొత్త వేరియంట్ల నేపథ్యంలో 18 ఏళ్ల వయసుపైబడి సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు ముందు జాగ్రత్తగా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. -
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోసు!
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. -
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ.. హెటిరోకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నివారణలో వాడే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ తయారీ, విక్రయానికై హైదరాబాద్ కంపెనీ హెటిరో బయోఫార్మాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నుంచి ఈ మేరకు ఆమోదం పొందామని కంపెనీ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్లో నేరుగా వ్యాక్సిన్‌ను విక్రయించడానికి సంస్థకు ఈ ఆమోదం వీలు కలిపిస్తుంది. 18 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్–19 నివారణ కోసం 0.5 మిల్లీలీటర్ల ఒకే మోతాదులో ఈ వ్యాక్సిన్‌ను ఇస్తారు. భారత్‌లో స్థానికంగా తయారైన ఉత్పత్తికి.. తయారీ, మార్కెటింగ్ ఆమోదం పొందిన మొదటి బయోఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కావడం విశేషం. దేశంలో ప్రస్తుతం ఆమోదం పొందిన అన్ని ఇతర వ్యాక్సిన్లు రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి మంజూరు చేసింది. స్పుత్నిక్ లైట్ ఔషధ పరీక్షల్లో కోవిడ్–19ను తట్టుకునే స్థాయిలో అధిక యాంటీబాడీలను చూపిందని హెటిరో క్లినికల్ డెవలప్మెంట్, మెడికల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ శుభదీప్ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. -
Covid Vaccine : చిన్నారులకు కోవిడ్ టీకాలు (ఫొటోలు)
-
మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు
పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్‌లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్‌లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్ డోస్‌ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్‌లు, 7.68 మిలియన్లు రెండవ డోస్‌లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్‌లు వేశారు. (చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన) -
Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్నవాళ్లకు బుధవారం(మార్చి 16వ తేదీ) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతోపాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. बच्चे सुरक्षित तो देश सुरक्षित! मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है। साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे। मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ। — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022 కొత్త కేసులు.. 27 మరణాలే! మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. భారత్‌లో Corona Deaths ఇప్పటి వరకు 5,15,877గా నమోదు అయ్యింది. -
అందుబాటులోకి రానున్న మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్!
Medicagos Two-Dose Vaccine Can Be Given To Adults: మెడికాగో అనే మొక్క ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను 18 నుంచి 64 ఏళ్ల పెద్దలకు ఇవ్వవచ్చని కెనడియన్ అధికారులు తెలిపారు. అయితే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ మేరకు 24 వేల మంది పెద్దవాళ్లపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు కోవిడ్ -19 నిరోధించడంలో ఈ టీకా 71% ప్రభావంతంగా ఉందని తెలిపారు. మెడికాగో అనే మొక్క వైరస్ లాంటి కణాలను పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్‌ను కప్పి ఉంచే స్పైక్ ప్రోటీన్‌ను అనుకరిస్తుంది. మొక్కల ఆకుల నుండి కణాలు తొలగించి శుద్ధి చేస్తారు. ఇది బ్రిటీష్ భాగస్వామి గ్లాక్సో స్మిత్‌క్లైన్ తయారు చేసిన అడ్జువాంట్గా పిలిచే రోగనిరోధక శక్తిని పెంచే మరొక వ్యాక్సిన్. ప్రపంచవ్యాప్తంగా అనేక కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య అధికారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల సరఫరాను పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని పరిశోధనలను చేస్తున్నారు. క్యూబెక్ సిటీ-ఆధారిత మెడికాగో మెడికల్ ల్యాబ్ అనేక ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా మొక్కల ఆధారిత వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. (చదవండి: వీధి కుక్కకు హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం!..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!) -
దేశంలో12-18 ఏళ్ల పిల్లలకు కొత్త కోవిడ్ వ్యాక్సిన్..
-
నేనింతే... టీకా తీసుకోను.. అవసరమైతే..
లండన్: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వ్యాక్సినేషన్‌పై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీకా తీసుకునే ప్రసక్తేలేదని, ఇది తప్పనిసరంటే ఏ మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని, గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమైనా సరేనని ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇంకా జొకోవిచ్ ఏమన్నాడంటే... ‘వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛ ఉండాల్సిందే. నా శరీరానికి ఏది అవసరమో అందరికంటే నాకే బాగా తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. నా వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించే నేను టీకా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణ యం వల్ల కలిగే పర్యావసనాలు తెలుసు. దీనివల్ల ఎన్నో టోర్నీలకు దూరంకావోచ్చు. అయినా సరే నా నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఇలా ఏ టోర్నీకి అనుమతించకపోయినా, ఆడనివ్వకపోయినా సరే అన్నింటికి సిద్ధం. నా శరీరం కోసం నేను తీసుకునే నిర్ణయం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఏ టైటిల్ ఎక్కువా కాదు. అయితే చాలామంది నేను వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకినని భావిస్తున్నారు. ఇది సరికాదు. టీకా వద్దనే హక్కూ సదరు వ్యక్తికి ఉండాలని అంటున్నాను తప్ప టీకా వ్యతిరేకిని కాదు. అలాంటి ఉద్యమానికి మద్దతివ్వలేదు. మాట్లాడిందీ లేదు’ అని జొకోవిచ్ వివరించాడు. -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్‌కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
సూది, నొప్పి లేకుండా వ్యాక్సిన్.. మనదేశంలోనే!
సూది, నొప్పి.. రెండూ లేకుండా కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వడం సాధ్యమేనా?. అవును.. మన దేశంలోనూ ఈ తరహా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం పాట్నా(బిహార్)లో మూడు వ్యాక్సిన్ సెంటర్లలో ఈ తరహా ప్రయోగాన్ని అమలు చేశారు. సూది, నొప్పికి భయపడి చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేకించి రూరల్ ఏరియాల్లో సూది మందు మంచిది కాదంటూ అపోహలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఆ భయం పొగొట్టేందుకు జైకోవ్-డి నీడిల్‌లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. రేజర్ తరహాలో ఉండే టూల్‌తో జస్ట్ షాట్‌ను ఇస్తారు అంతే. పైగా వ్యాక్సిన్ తీసుకున్నాక నొప్పులు కూడా రావని చెప్తోంది కంపెనీ. జైకోవ్-డి.. దేశీయంగా వచ్చిన రెండో వ్యాక్సిన్(మొదటిది కోవాగ్జిన్). జైడస్ క్యాడిల్లా రూపొందించిన మూడు డోసుల వ్యాక్సిన్. 28 నుంచి 56 రోజుల గడువుల వ్యవధితో రెండు భుజాలకు రెండేసి షాట్స్ చొప్పున(మొత్తం ఆరు షాట్స్) ఇస్తారు. ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్‌తో డెవలప్ చేయడం వల్ల ఈ సూదిరహిత వ్యాక్సిన్‌ను ప్రత్యేకంగా భావిస్తున్నారు. ముందుగా పెద్దలకు, ఆపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ ఇచ్చేందుకు కూడా అనుమతి ఉంది. Bihar | Painless and Needleless ZYCOV-D Covid Vaccine launched in Patna Three doses will be given at intervals of 28 days and 56 days. This program has been started at 3 vaccination centers. It is good for people who are afraid of needles: Civil surgeon Dr Vibha Singh (04.03) pic.twitter.com/bJ9JlidrZh — ANI (@ANI) February 4, 2022 -
94 శాతం మందికి రెండు డోసుల టీకా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన జనాభాలో 93.94 శాతం మందికి కోవిడ్ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో టీకాల ప్రక్రియలు జరగడంవల్లే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా తొలిడోసు నూటికి నూరు శాతం పూర్తయింది. అలాగే, 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తికాగా.. ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది. మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మొత్తం మీద రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన 50.28 లక్షల మందికి మాత్రమే రెండు డోస్‌ల టీకా వేయాల్సి ఉంది. వీరికి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయడంవల్లే.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తిచేయడంవల్లే కోవిడ్ మూడవ వేవ్‌లో మరణాల సంఖ్య దేశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. అంతేకాక.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు కూడా చాలా స్పల్పంగా ఉండడంవల్ల కేవలం వారం రోజుల్లోనే అందరూ కోలుకుంటున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషనే కోవిడ్‌కు పరిష్కారమని తొలి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడమే కాక రాష్ట్రంలో ఆచరణలో అమలుచేసి చూపించారు. దీనివల్లే ఇప్పుడు కోవిడ్ కేసులతో పాటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దేశంలో మరణాల రేటు 1.20 శాతం ఉంటే రాష్ట్రంలో కేవలం 0.64 శాతమే ఉంది. అందుకే మరణాల రేటు తక్కువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించడంవల్లే రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారిలో 93.94 శాతం మందికి రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తయింది. దీని ఫలితం ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగైదు రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడమే కాకుండా మరణాల రేటు దేశంతో పాటు ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కూడా లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను రాష్ట్రంలో వేగంగా పూర్తిచేయడమే ఇందుకు కారణం. ఈ నెలాఖరుకల్లా మిగతా వారికీ పూర్తిచేస్తాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు
టొరెంటో: కరోనా టీకా తప్పనిసరి నిబంధన, కోవిడ్ నిబంధనల పాటింపును వ్యతిరేకిస్తున్నవారి నిరసనలు కెనెడాలో పెరిగిపోయాయి. ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్ హిల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కొందరు నిరసనకారులు జాతీయ మృతవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధిపై డ్యాన్సులు చేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఆందోళనకారులు స్వస్తిక్ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వీరికి దేశీయుల నుంచి పెద్దగా సానుభూతి లభించకున్నా వీరు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. ఇలాంటివారి సంఖ్య స్వల్పమని, అబద్ధాలను వీళ్లు ప్రచారం చేస్తున్నారని కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో దుయ్యబట్టారు. కేవలం టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేయడంతో తమ నిరసన ఆగదని, ట్రూడో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల్లో చాలా నిబంధనలను ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. -
కోవిడ్‌పై యుద్ధం.. అన్ని విధాలా సన్నద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 కేసుల నేపథ్యంలో నియంత్రణకు, చికిత్సలకు అవసరమైన అత్యవసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి అదనంగా చికిత్సలకు, వైద్య సిబ్బందికి అవసరమైన అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తోంది. దీంతో పాటు పెద్ద ఎత్తున ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. మరో పక్క 175 నియోజకవర్గాల్లో 186 కోవిడ్ కేర్ సెంటర్లలో 28,342 బెడ్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బందికి 5.21 లక్షల ఎన్–95 మాస్క్‌లను అందుబాటులో ఉంచగా, కొత్తగా మరో 25 లక్షల ఎన్–95 మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 24.43 లక్షల సర్జికల్ మాస్క్‌లను అందుబాటులో ఉంచగా, కొత్తగా 50 లక్షల సర్జికల్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 46.23 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉండగా, అదనంగా మరో 30 లక్షల గ్లౌజులు కొనుగోలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 4.68 లక్షల పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచారు. 9.02 లక్షల వీటీఎంలను అందుబాటులో ఉంచారు. ఏకంగా 8.78 లక్షల హోం ఐసొలేషన్ కిట్లను సిద్ధం చేశారు. చురుగ్గా ఫీవర్ సర్వే కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి 36వ విడత ఫీవర్ సర్వే ఇటీవల ప్రారంభించాం. సర్వే వేగంగా సాగుతోంది. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాం. పాజిటివ్‌గా నిర్ధారణై హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్యంపై ఏఎన్ఎం, ఆశవర్కర్లు వాకబు చేస్తున్నారు. వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు ఆందోళన వద్దు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. వ్యాక్సిన్ వేసుకోని వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే కొంత ప్రభావం ఉంటోంది. అయినా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలి. – డాక్టర్ వినోద్ కుమార్, కరోనా వైద్య నిర్వహణ ప్రత్యేక అధికారి -
ఏ వ్యాక్సిన్‌కైనా పీత రక్తమే దిక్కు.. లీటర్ రక్తం ధరెంతో తెలుసా?
Horseshoe Crab Blood: కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. రెండు డోసులు అయింది. బూస్టర్ డోసు వచ్చింది. తర్వాతా అవసరం పడొచ్చని అంటున్నారు. ఇంత అత్యవసరమైన వ్యాక్సిన్లు ఎంత భద్రమో తేల్చేది ఎవరో తెలుసా? ఎక్కడో సముద్రాల్లో బతికే ఓ చిన్నపాటి పీత. మనకు దాని రక్తం ధారపోసి బతుకునిస్తున్న ఈ పీతల వల్లే.. భారీస్థాయిలో కరోనా వ్యాక్సిన్లు త్వరగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే కాదు.. ఏ వ్యాక్సిన్, ఔషధమైనా ప్రమాదకర బ్యాక్టీరియా లేదని తేల్చేందుకు వాటి రక్తమే దిక్కు. మరి ఆ పీతలేమిటి, మనకు జరుగుతున్న ప్రయోజనమేమిటో తెలుసుకుందామా.. తాబేలుకు ఉన్నట్టుగా డొప్పలాంటి తల భాగం.. దానిపై పది కళ్లు.. డొప్ప మధ్యలో వేలాడుతున్నట్టుగా శరీరం.. పదునుగా ఉండే ముళ్లు.. మధ్య నుంచి పొడవాటి తోక.. చిత్రమైన శరీరమున్న జీవి ‘హార్స్‌షూ క్రాబ్’. కోట్ల ఏళ్లుగా పరిణామం చెందకుండా ఉండిపోయిన ‘హార్స్‌షూ’ పీతలు.. ఒక్క విషయం మాత్రం అత్యంత అద్భుతమైన సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. అదే వాటి రోగ నిరోధక శక్తి. అత్యంత సూక్ష్మస్థాయిలో (వెయ్యి కోట్లలో ఒక వంతు) కూడా బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మజీవులు ఉన్నా గుర్తించగల సామర్థ్యం వాటి సొంతం. 1960వ దశకంలో శాస్త్రవేత్తలు దీని ప్రత్యేకతను గుర్తించారు. అప్పటి నుంచీ వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్ ఇంప్లాంట్లు వంటివి ప్రమాదకర సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని తేల్చుకునేందుకు ఈ పీతల రక్తాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ►ఈ పీత రక్తకణాలను వేరుచేసి ‘ఎల్ఏఎల్ (లిమ్యులస్ అమిబోసైట్ లైసేట్)’ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. సదరు వ్యాక్సిన్/ఇంజెక్షన్/ఔషధంలో ప్రమాదకర బ్యాక్టీరియా ఏమాత్రం ఉన్నా.. ఎల్ఏఎల్ గుర్తిస్తుంది. ► బ్యాక్టీరియా ఉన్నట్టు సదరు వ్యాక్సిన్/ఔషధాన్ని పడేస్తారు లేదా శుద్ధిచేసి మళ్లీ పరీక్షిస్తారు. ప్రమాదమేమీ లేదని తేలితే.. ప్యాకేజింగ్ చేసి, విక్రయానికి పంపుతారు. ►శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్ పరికరాలను కూడా ఎల్ఏఎల్తో పరీక్షిస్తారు. ► కోవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వందల కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటన్నింటినీ హార్స్‌షూ రక్తంతో పరీక్షించి, భద్రమని తేల్చాకే మార్కెట్లోకి వస్తున్నాయి. లీటర్ రక్తం రూ.12 లక్షలు! ‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులే. దీనితో ఈ రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షలు (16 వేల డాలర్లు) పైనే ఉంటుంది. అందుకే నీలి బంగారం (బ్లూగోల్డ్) అని పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్ఏఎల్) కోసం వెచ్చిస్తుంటాయి. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! గుండె నాళానికి సూది గుచ్చి.. సముద్రం, తీర ప్రాంతాల నుంచి హార్స్‌షూ పీతలను సేకరించి, ల్యాబ్‌కు తీసుకొస్తారు. అక్కడ వాటి బరువును తూచి, రక్తం సరిపడా ఉన్నవాటిని వేరుచేస్తారు. అనంతరం ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికిపైగా లాగేశాక.. తీసుకెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తారు. ఈ సేకరణ, తరలింపు, రక్తం తగ్గిపోవడం క్రమంలో దాదాపు మూడో వంతు పీతలు చనిపోతుంటాయి. సెప్సిస్‌ను గుర్తించేందుకు.. సాధారణంగా ఏదైనా దెబ్బతగలడం, వ్యాధి వల్ల, శస్త్రచికిత్స ద్వారా అయిన గాయాలు మానకుండా.. పుండ్లుగా మారి, చీముపట్టడాన్ని సెప్టిక్ అంటాం. సదరు గాయంలోని ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించి.. శరీర అవయవాలను దెబ్బతీసే స్థితిని ‘సెప్సిస్’గా చెప్తారు. మొదట్లోనే దీన్ని గుర్తించలేక.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది చనిపోతున్నట్టు అంచనా. హార్స్‌షూ పీతల రక్తం నుంచి తీసే ‘ఎల్ఏఎల్’ ద్వారా ‘సెప్సిస్’ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రకంగానూ హార్స్‌షూ పీతలు మానవాళికి మేలు చేస్తున్నాయి. లేత నీలి రంగులో.. మనుషుల రక్తంలోని హిమోగ్లోబిన్లో ఇనుము (ఐరన్) ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ‘హార్స్‌షూ’ పీతల రక్తం లేత నీలి రంగులో ఉంటుంది. వాటి రక్త కణాల్లో ఉండే రాగి (కాపర్) అణువులే దీనికి కారణం. ఇది ఈ పీతల మరో ప్రత్యేకత. ప్రమాదం అంచుకు చేరడంతో.. గత 40 ఏళ్లలో ఈ పీతల సంతతి 80 శాతం మేర అంతరించి పోయిందని అంచనా. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లతో వాటికి మరింత కష్టమొచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. వాటి టెస్టింగ్ కోసం భారీగా పీతలను పడుతూ, రక్తాన్ని సేకరిస్తున్నారు. సాధారణంగా ఏటా ఒక్క అమెరికా తూర్పు తీరప్రాంతంలోనే 5 లక్షలకుపైగా ‘హార్స్‌షూ’ పీతలను సేకరిస్తారని అంచనా. అంతేకాదు మెక్సికో, చైనా, మరికొన్ని దేశాల్లోనూ భారీ ఎత్తున హార్స్‌షూ పీతలను సేకరిస్తుంటారు. మనుషులు రక్త పిశాచాల్లా ఏటా లక్షలాది ‘హార్స్‌షూ’ పీతల నుంచి రక్తాన్ని పిండేస్తున్నారని.. ఇది జీవహింస అని కారుణ్యవాదులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కోట్ల ఏళ్లుగా మారకుండా.. ఒకప్పటి గొరిల్లా/చింపాంజీల నుంచి మనుషులు అభివృద్ధి చెందినట్టుగా.. కాలం గడిచినకొద్దీ ప్రతి జీవి పరిణామం చెందుతుంది. కానీ ‘హార్స్‌షూ’ పీతలు పెద్దగా పరిణామం చెందకుండా.. సుమారు 45 కోట్ల ఏళ్ల కిందట (డైనోసార్ల కంటే ముందటి కాలం నుంచి) ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని బతికున్న శిలాజాలుగా పిలుస్తున్నారు. -
దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్!
డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ని కట్టడి చేసేలా మరో సరికొత్త ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) వ్యాక్సిన్ రానుంది. ఈవ్యాక్సిన్ను పూణేకు చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ సమర్థతకు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ వచ్చే నెలలో (ఫిబ్రవరి)లో ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. ఈ మేరకు జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫేజ్-2 పరిశోధన డేటాను సమర్పించింది. అంతేగాక తదుపరి ఫేజ్-3కి సంబంధించిన డేటాను కూడా సిద్ధం చేసింది. పైగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసీ) త్వరలో ఈ డేటాలను సమీక్షించనుందని అధికారులు వెల్లడించారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏంటంటే.. అభివృద్ధి చేసిన భారత్ ఆధారిత తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించిన ఫేజ్-2, ఫేజ్-3 పరిశోధనలను డీసీజీఐ ఇంతకుముందే ఆమోదించిందని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వెల్లడించింది. కాగా ఈ వ్యాక్సిన్ పేరు ‘HGCO19’ అని పేర్కొంది. జెనోవా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఫేజ్-1కి సంబంధించిన పరిశోధనలను భారత నేషనల్ రెగ్యూలేటరీ అథారిటికి సంబంధించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కి సమర్పించినట్లు కూడా పేర్కొంది. అయితే ఫేజ్I పరిశోధనలను సమీక్షించిన నిపుణులు ఈ వ్యాక్సిన్ HGCO19 సురక్షితమైన ఇమ్యునోజెనిక్‌గా గుర్తించినట్లు కంపెనీ మీడియాకి తెలిపింది. ఈ వ్యాక్సిన్లు న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్ల వర్గానికి చెందినవి, ఇవి వ్యాధిని కలిగించే వైరస్లు లేదా వ్యాధికారక క్రిముల నుండి వచ్చే జన్యు పదార్థాన్ని ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపింది. అయితే తదుపరి రెండు దశలకు సంబంధించిన క్లినికల్ ట్రియిల్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. -
Vaccination: 12-14 ఏళ్ల వాళ్లకు కూడా వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి నాటికి పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్కే అరోరా తెలిపారు. జనాభాలో 15-18 ఏళ్ల వాళ్లు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని వారిలో దాదాపు 3.45 కోట్ల మందికి పైగా కోవాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారని తెలిపారు. కాగా తదుపరి డోసు 28 రోజుల్లో ఇస్తారని ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం గతేడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకి తర్వాత ఫ్రంట్‌లైన్ కార్మికులకు వేయడం జరిగింది. అలాగే గతేడాది మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి, ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల వారికి, మే 1 నుండి 18 ఏళ్లు పైబడినవారికి.. ఇలా దశాల వారికి వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అంతేకాదు ప్రభుత్వం కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది దగ్గర నుచి 60 ఏళ్లు పైబడిన వారందరి కోసం ముందుజాగ్రత్త చర్యగా ప్రికాషనరీ వ్యాక్సినేషన్ని ఈ నెల 10 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
Hyderabad: జాంబాగ్ పీహెచ్సీలో వ్యాక్సిన్లు చోరీ
హైదరాబాద్: పాతబస్తీ జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు పడ్డారు. రెండు కంప్యూటర్లతో పాటు వ్యాక్సిన్ వయల్స్‌ను దొంగిలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పంజేషాలోని జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం వైద్య సేవలు అందించిన అనంతరం సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు వచ్చి చూడగా.. ఆస్పత్రి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రెండు కంప్యూటర్ మానిటర్లు, 2 సీపీయూలు, 2 కీ బోర్డులు, మౌస్‌లతో పాటు 17 కోవాగ్జిన్ వయల్స్, 27 కోవిషీల్డ్ వయల్స్, 22 బీసీజీ, 44 ఓపీవీ, 15 డీటీపీ, 7 ఐపీవీ 7, 39 హెపాటీబీ, 38 ఎంఆర్, 7 పీసీపీ, 23 పెంటా, 21 డీటీ, 2 ఏఈఎఫ్ఐ కిట్స్‌చోరీకి గుర య్యాయి. ఆస్పత్రి గోడకు ఉన్న స్మార్ట్ టీవీని సైతం దొంగిలించేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ ఘటనపై ఎంఓ లింగమూర్తి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సైబర్ బొంకు..బూస్టర్ డోస్ పేరుతో నేరగాళ్ల నయా పన్నాగం
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమతుంటే.. దీనిని సాకుగా తీసుకుని సైబర్ నేరస్తులు సరికొత్త మోసాలకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నకిలీ లింక్‌లు పంపిస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి నేరస్తుల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తాజాగా బూస్టర్ డోస్, ఉచిత ఒమిక్రాన్ పరీక్షల పేరిట మోసాలకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫలానా రోజున, ఫలానా ప్రాంతంలో బూస్టర్ డోస్ కోసం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగర ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఓటీపీతో హ్యాంకింగ్.. బూస్టర్ డోస్ ప్రచారాన్ని ప్రజలను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మెడికల్, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నంబర్లను డిస్ప్లే అయ్యేలా స్పూఫింగ్ చేయడంతో మోసగాళ్లు ఫోన్ చేసినా సరే బాధితుల ఫోన్లో ‘వ్యాక్సిన్ డిపార్ట్మెంట్’ అని సెల్ఫోన్లో కనిపిస్తుంటుంది. దీంతో అటువైపు నుంచి బాధితులు కూడా సులువుగా నమ్మేస్తారు. టీకా కోసం షెడ్యూల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మెసేజ్, వాట్సాప్, ఈ– మెయిల్స్‌కు నకిలీ లింక్‌లు పంపిస్తున్నారని తెలిసింది. తమ పేర్ల నమోదు నిర్ధారణ కోసం సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) తెలపాలని కోరుతున్నారు. ఓటీపీ తెలపగానే.. బాధితుల సె ల్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు హానికరమైన సాఫ్ట్వేర్లను పంపిస్తారు. దీంతో బాధితుడి ఎలక్ట్రానిక్ ఉపకరణం హ్యాక్ అయిపోతుంది. ఆపైన సెల్ఫో న్లోని క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఆధార్, పాన్ కార్డ్ నంబర్లు, ఈ– మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. వాటి సహాయంతో మోసాలకు పాల్పడే ప్రమాదముంది. 56 కేసులు నమోదు.. కరోనా ప్రారంభ దశలో సైబర్ నేరస్తులు కోవిడ్ మందులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల, కాన్సట్రేటర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే సాధనాలు వంటివి సరఫరా చేస్తామనే మాయమాటలతో ప్రజలను నమ్మించి దోచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కరోనా మందుల బ్లాక్ మార్కెట్‌పై 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బూస్టర్ డోస్ ఇస్తామని వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్‌లు కూడా ఓటీపీ అడగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటీపీ అడిగితే మోసమే బూస్టర్ డోస్ తీసుకుంటే సురక్షితమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో డోస్ ఇప్పిస్తామని నకిలీ మెసేజ్, ఫోన్లు, లింక్‌లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎవరైనా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు, యూపీఐ, ఓటీపీ అడిగారంటే మోసమేనని గుర్తించాలి. – డాక్టర్ లావణ్య, డీసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ -
సంపూర్ణ లాక్డౌన్ అమలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసుయంత్రాంగం ప్రకటించింది. దీంతో శనివారం చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేలకు అటుఇటుగా.. కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఆదివారం లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు. దీంతో శనివారం మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లలో రద్దీ నెలకొంది. లక్ష మందికి రెండో డోస్... 18వ విడతగా రాష్ట్రంలో శనివారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 వేల శిబిరాల్లో లక్షలాది మందికి రెండో డోస్ టీకా వేశారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్లలోపు బాల, బాలికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక, చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఫీవర్ టెస్టులు విస్తృతం చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త ఏర్పాట్లు జరిగాయి. చెన్నైలో మాస్క్ ధరించని 7,616 మందికి జరిమానా విధించి రూ. 15 లక్షలు జరిమానా వసూలు చేశారు. తమిళనాడులో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్డౌన్ అవసరం రాదని.. కరోనా ప్రజల జీవితంలో కలిసి పయనిస్తుందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక, చెన్నైలో కరోనా కట్టడి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేయడం కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే చెన్నైలో ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళల్లో రెండు డోస్‌ల టీకా వేయించుకున్న వారినే సోమవారం నుంచి అనుమతించనున్నారు. చదవండి: కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు -
కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి
గ్రేటర్ జిల్లాల్లో టీనేజర్లు కోవిడ్ టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఈ నెల 3 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 20 శాతం మంది టీనేజర్లు కూడా టీకా వేసుకోలేదు. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండగా..మరోవైపు టీకా వేసుకునేందుకు ముందుకు రాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది సాక్షి హైదరాబాద్: తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టీకాలు వేసుకుని ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలువాల్సిన వారు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవడంలోనే కాదు...టీకాలు వేసుకునేందుకు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి వరుస స్థానాల్లో నిలవగా..22వ స్థానంలో హైదరాబాద్, 26వ స్థానంలో మేడ్చల్, 29వ స్థానంలో రంగారెడ్డి జిల్లాలు నిలవడం, మిగతా జిల్లాలతో పోలిస్తే రాజధాని జిల్లాలు వెనుకబడి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ...టీకా వేసుకుంటే జ్వరం, ఒంటి నొప్పులు వంటి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అపోహతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించకపోవడం కూడా టీకాల్లో వెనుకబడి పోవడానికి కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసుకుంటారా..? వెనుకాడుతారా...? కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ డోసు టీకాల విషయంలో ఆశించిన దానికంటే అధికశాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. ఈ విషయంలో ఇతర జిల్లాలకు గ్రేటర్ జిల్లాలు మార్గదర్శకంగా నిలిచాయి. అయితే టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో మాత్రం బాగా వెనుకబడ్డాయి. 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి కోవాగ్జిన్ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 1,84,822 మంది ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం రోజు నాటికి 55,347 మందికి టీకాలు వేశారు. మేడ్చల్ జిల్లాలో 1,65,618 మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 46,970 మందికి టీకాలు వేశారు. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది టీనేజర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 35,104 మందికి మాత్రమే టీకాలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు కాలేజీలు, విద్యాసంస్థల్లో టీకాలు వేస్తున్నప్పటికీ చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లోనే ఆసక్తి చూపని వారు సెలవుల్లో స్వయంగా ఆరోగ్య కేంద్రాలకు చేరుకుని టీకాలు వేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కరోజే 1902 కేసులు గ్రేటర్ జిల్లాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1452 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాల్లో 232 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాల్లో 218 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 1902కు చేరడం గమనార్హం. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా..సిటిజన్లు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌లు లేకుండా హోటళ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. పెరుగుతున్న తీవ్రత ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తుండటం, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై...ఆస్పత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1318 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 373 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతుండగా, 945 మంది ఐసీయూ, వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతుండటం గమనార్హం. కేసులు మరింత పెరుగుతుండటంతో నగరంలోని గాంధీ, టిమ్స్ సహా కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో వైద్యులు అ ప్రమత్తమయ్యారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చడంతో పాటు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. -
టీకా సిత్రాలు.. ఆందోళనలో ప్రజలు!
దౌల్తాబాద్‌కు చెందిన అనురాధ కరోనా నివారణకు కొద్ది రోజుల క్రితమే తొలిడోస్‌ను తీసుకున్నారు. అయితే రెండో డోస్ కూడా తీసుకున్నట్లు ఆమె భర్త సెల్‌కు మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు. మరో ఘటనలో.. దౌల్తాబాద్‌కు చెందిన సత్యనారాయణ మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌కు వైద్యసిబ్బంది దగ్గరకు వెళ్ళగా మీరు తీసుకున్నారు కదా అని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. నా సెల్‌కు మెసేజ్ రాలేదు కదా అంటే సమాధానం లేదు. సాక్షి,దౌల్తాబాద్(హైదరాబాద్): కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకడుగు వేసిన ప్రజలు రెండో వేవ్ ఉధృతం కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో మొదటిడోస్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రెండో డోస్‌లోనే.. మొదటి డోస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యసిబ్బంది రెండో డోస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్లు ప్రజల సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వారంతా కంగారు పడుతున్నారు. టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆతృతనా..? మరేమైనా కారణంతోనా..? తెలియదు కానీ మెసేజ్‌లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతోనే ఆన్లైన్లో అంకెల గారడీ ప్రదర్శించేందుకే అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 9 ఉపకేంద్రాల పరిధిలో.. మండలంలో 39,065 మందిని వ్యాక్సిన్‌కు అర్హులుగా గుర్తించి వందశాతం లక్ష్యాన్ని ఇటీవలే అధిగమించారు. రెండో డోస్‌కు మండలంలోని 9 ఉపకేంద్రాల పరిధిలో ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది రెండోడోస్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 15,551 మందికి రెండో డోస్ వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది సిబ్బంది తొలిడోస్ వేసుకున్న వారికి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.రెండోడోస్ వేసుకున్నారా..?ఆన్లైన్లో నమోదు చేయమంటారా..? అంటూ అడుగుతున్నారు. ఈ క్రమంలో రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్ -
కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!
high school teacher in New York arrested after she vaccinated a pupil at home: కొంతమంది మంచిగా చదువుకుని కూడా తెలితక్కువగా ప్రవర్తిస్తున్నారని అనాలో లేక అన్ని తెలుసు అన్న గర్వంతో చేస్తున్నారో కూడా తెలియదు. అయితే ఇలాంటి పనుల వల్ల కొంతమంది అభాసుపాలైతే మరికొందరు కటకటాల పాలవుతున్నారు. అచ్చం అలానే ఒక ఉపాధ్యాయుడు చట్టపరమైన అనుమతి లేకుండా ఒక విద్యార్థికి కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాలపాలైంది. (చదవండి: మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని లారా రస్సో అనే 57 ఏళ్ల సైన్స్ టీచర్ 17 ఏళ్ల అబ్బాయికి కోవిడ్ -19 వ్యాక్సిన్ వేసింది. నిజానికి కోవిడ్ వ్యాక్సిన్‌ను వ్యాక్సినేషన్ కేంద్రాలలో లేదా వైద్యా నిపుణుల సమక్షంలో వేయించుకోవాలి. ఈ మేరకు ఆ టీనేజర్ తల్లి ఈ విషయం తెలుసుకుని వెంటనే న్యూయార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే లారా రస్సో అనే బయోలజీ టీచర్ని అరెస్టు చేశారు. అయితే ఆ టీచర్ తల్లిదండ్రుల అనుమతి కూడా లేకుండా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిందని, పైగా ఆ వ్యాక్సిన్ ఆమెకు ఎక్కడ నుంచి లభించిందనేది కూడా విచారణలో తెలియాల్సి ఉందని పోలీస్ కమీషనర్, పాట్రిక్ రైడర్ పేర్కొన్నారు. దీంతో లారా రస్సో పనిచేస్తున్న హెరిక్స్ హైస్కూల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫినో సెలానో ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!)