పారిస్: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమని వైద్యులు చెప్తున్నా కొందరు మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న అవాస్తవాలను నమ్మి టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకోవడం కంపల్సరీ అంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో అయితే ఏకంగా కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేసింది అక్కడ ప్రభుత్వం.
వ్యాక్సిన్ వేసుకోవాలంటూ హెల్త్ వర్కర్స్‌కు డెడ్‌లైన్ విధించామని, అలా ఆచరించకపోతే జీతం కూడా చెల్లించకుండా సస్పెండ్ చేస్తామని ముందే వారికి తెలిపినట్లు, తాజాగా వాటినే అమలు చేస్తున్నామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందిలో టీకా తీసుకోని వారికి ఈ మేరకు బుధవారం నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు. అయితే కొంత మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోగా తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. దీని బట్టి స్పష్టమౌతోంది ఆ దేశంలో టీకాపై ఎన్ని అపోహలు ఉన్నాయో. ఇక భారీ సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది సస్పెండైనప్పటికీ ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు.
చదవండి: మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్‌జే గ్రూప్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment