health workers
-
అనర్హులను ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ.. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది. -
హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హెల్త్ వర్కర్‌ను గుర్తు తెలియని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడుతున్న మహిళను వెనుక వచ్చి బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయ్ జిల్లాలో బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆమె విధుల్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టి, కౌగిలించికున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ.. అతనెవరో నాకు తెలియదు. నన్ను మానసికంగా హింసించాడు. ఆసుపత్రి కాంపౌండ్ గోడ దూకి ఎందుకు వచ్చాడు. అతడు నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నేను ప్రతిఘటించాను. వెంటనే నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. కానీ, గోడ దూకి అతను పారిపోయాడు. దీనికి కారణమైన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉంది. ముళ్ల కంచె వేసి ఆసుపత్రికి తరచుగా వచ్చే మహిళలను రక్షించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
తెలంగాణలోని టీచింగ్ ఆస్పత్రులపై కోవిడ్ పంజా
-
షాకింగ్ వీడియో: డ్యూటీకి డుమ్మా కొట్టిన నర్సు.. మరునాడు ఆస్పత్రికి వెళ్లగా
Hospital staff member attacking the woman: బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్రూట్లో ఒక మహిళా నర్సు ఒకరోజు విధులకు హాజరుకానందుకు సదరు ఆసుపత్రి సిబ్బంది మందలించారు. అంతేకాదు విధులకు హాజరు కానట్లయితే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి సదరు నర్సు పై అరవడం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి నర్సుపై దాడికి దిగాడు. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) దీంతో పక్కనే ఉన్న సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో గోడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆస్పత్రి సిబ్బంది ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో సదరు వ్యక్తి గొడవ పెద్దదవుతుందంటూ అధికారికి తెలియజేశాడు. ఇక ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఆరోగ్య సిబ్బంది పాత్ర పాత్ర చాలా కీలకం. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) वैक्सिनेशन के काम में लगे एक एएनएम के साथ जमुई ज़िले के चकाई रेफ़रल अस्पताल के वरीय स्टाफ़ कैसे मारपीट कर रहे हैं देखिए इसका एक विडीओ @ndtvindia @Anurag_Dwary @Suparna_Singh pic.twitter.com/HMPnQmJU9X — manish (@manishndtv) January 7, 2022 -
సీపీసీహెచ్ లేకున్నా.. దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, అమరావతి: మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేయని వారిని సైతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం (6వ తేదీ) చివరి రోజు అయిన నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సీపీసీహెచ్ లేని వారికి సంబంధించిన మెరిట్ జాబితాను మాత్రం తమ ఆదేశాల తరువాతే ప్రకటించాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సర్టిఫికెట్ ప్రోగ్రాం ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) పూర్తి చేసిన వారు మాత్రమే మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటనను సవాలు చేస్తూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అసనుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో సీపీసీహెచ్‌ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారని పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. 2019కి ముందు ఈ ప్రోగ్రాం లేదని, ప్రోగ్రాం తీసుకొచ్చిన తరువాత జరుగుతున్న మొదటి రిక్రూట్మెంట్ ఇదేనని వివరించారు. 2019కి ముందు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి అనర్హులవుతారని, ఇది ఏకపక్ష నిర్ణయమని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకుని, సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునే అనుమతినివ్వాలని కోరారు. ఈ నెల 6వ తేదీనే దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అని, ఇప్పుడు దరఖాస్తుల సమర్పణకు అనుమతివ్వకపోతే తమ ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని చెప్పారు. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, మిడ్ లెవల్ హెల్త్ వర్కర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి సీపీసీహెచ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినివ్వాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. -
వ్యాక్సిన్ వేసుకోలేదు.. 3000 మంది ఆరోగ్య కార్యకర్తలు సస్పెండ్
పారిస్: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమని వైద్యులు చెప్తున్నా కొందరు మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న అవాస్తవాలను నమ్మి టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకోవడం కంపల్సరీ అంటూ అల్టీమేటం జారీ చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో అయితే ఏకంగా కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేసింది అక్కడ ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసుకోవాలంటూ హెల్త్ వర్కర్స్కు డెడ్‌లైన్ విధించామని, అలా ఆచరించకపోతే జీతం కూడా చెల్లించకుండా సస్పెండ్ చేస్తామని ముందే వారికి తెలిపినట్లు, తాజాగా వాటినే అమలు చేస్తున్నామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందిలో టీకా తీసుకోని వారికి ఈ మేరకు బుధవారం నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు. అయితే కొంత మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోగా తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. దీని బట్టి స్పష్టమౌతోంది ఆ దేశంలో టీకాపై ఎన్ని అపోహలు ఉన్నాయో. ఇక భారీ సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది సస్పెండైనప్పటికీ ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. చదవండి: మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్జే గ్రూప్ హెచ్చరిక -
ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్‌కేర్ వర్కర్స్ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, హెల్త్ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్ 22న ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్ 29న నోటిఫై చేశామని లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్ కేర్ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చదవండి: సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి -
కరోనా పేషెంట్ మృతి.. హెల్త్ వర్కర్లపై దాడి
ఇంఫాల్: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్ వర్కర్లపై దాడి ఘటన మరువకముందే తాజాగా మణిపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జెన్‌ఐఎమ్‌ఎస్)లో కరోనా పేషెంట్ బంధువులు హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. దీంతో పాటు ఐసీయూ వార్డులోనూ మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. ఇవన్నీ అక్కడి ఆసుపత్రి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా 33 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఆదివారం కన్నుమూయడంతో ఆమె బంధువులు ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మూడ్రోజుల క్రితం కరోనాతో సదరు మహిళ మా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఐసీయూకు షిఫ్ట్ చేయాలని మహిళ బంధువులకు ఆసుపత్రి వర్గం తెలిపింది. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన కాసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి వచ్చి హెల్త్ వర్కర్లపై దాడికి దిగారు. అంతేగాకుండా ఐసీయూలోని మెడికల్ ఎక్విప్మెంట్ను నాశనం చేశారు. కాగా హెల్త్ వర్కర్లపై దాడిని జెన్‌ఐఎమ్‌ఎస్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కేహెచ్ లోకేశ్వర్‌సింగ్ ఖండించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం అవమానీయం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అని పేర్కొన్నారు. చదవండి: డాక్టర్‌పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి -
వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి
కశ్మీర్: హిమాలయ రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. కొండలు.. లోయలు.. నదులు దాటుకుంటూ వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. నది దాటుతూ ఆరోగ్య సిబ్బంది వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. వారి పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన రాజౌరి జిల్లాలో జరిగింది. రాజౌరి జిల్లాలోని కంది బ్లాక్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ వేసేందుకు ఆరోగ్య సిబ్బంది నలుగురు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో తావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా కూడా ఆ సిబ్బంది నదిలో నడుస్తూ వెళ్లారు. మోకాలి లోతు నీరు చేరగా ఓ వ్యక్తి సహాయంతో వ్యాక్సిన్ డబ్బాలు పట్టుకుని అతి జాగ్రత్తగా నది దాటారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి సహాయంతో మహిళలు అతి కష్టంగా నది దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసినట్లు కంది ప్రాంత బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ వైద్య సిబ్బందిని అభినందించారు. జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా 33,98,095 డోసుల వ్యాక్సిన్ వేశారు. -
వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేశారు. గంగుళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామకనార్ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ వర్కర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్ వర్కర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్ కాశ్యప్ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్‌తో బీజాపూర్‌లో కలకలం రేగింది. మావోయిస్టులను అరెస్టు చేయలేదు చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్ రేంజ్ ఐజీ సౌందర్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. చదవండి: రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు -
వరంగల్: టీకా తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్సీ పరిధిలోని దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ (హెల్త్‌కేర్ వర్కర్) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి వనిత కొద్దిపాటి అనారోగ్యంగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న 45 ఏళ్ల మహిళా ఆరోగ్య కార్యకర్త ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా సైడ్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణ కమిటీ నుంచి రాష్ట్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆ నివేదికను కేంద్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి పంపుతామన్నారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) -
టీకాపై అపోహలు తొలగిద్దాం
లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ నాయకులు అక్కడా, ఇక్కడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, కానీ శాస్త్రవేత్తల నిర్ణయం మేరకే తాను ముందుకి అడుగులు వేశానని అన్నారు. సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘‘కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు క్లీన్ చిట్ ఇస్తే ప్రజల్లో గట్టి సందేశం వెళుతుంది’’అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ అఫెక్ట్‌లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘వ్యాక్సిన్ అంటే ఒక ఇంజక్షన్ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను’’అని ఆమె వెల్లడించారు. డీడీయూ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ వి శుక్లాతో మాట్లాడిన ప్రధాని కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. డాక్టర్ శుక్లా కూడా వ్యాక్సిన్‌తో మేలే జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సైడ్ అఫెక్ట్‌లు వచ్చినా దానికి వారి అనారోగ్య సమస్యలే కారణమని చెప్పారు. టీకా ఇవ్వడంలో ఆస్పత్రుల మధ్య పోటీ ఉంటే రెండో విడతని త్వరగా ప్రారంభించవచ్చునని ప్రధాని సూచించారు. శాస్త్రవేత్తలు చెప్పిందే చేశాం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.‘‘వ్యాక్సిన్‌కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను. ఇది రాజకీయ నాయకుల పని కాదు’’అని అన్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు. మోదీకి హసీనా ధన్యవాదాలు కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 20 లక్షల డోసుల్ని భారత్ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్‌కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు. -
నేడే వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే, ప్రపంచం లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు. వ్యాక్సినేషన్లో వాడే దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది. ప్రజాభాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వం చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పీఎంవో పేర్కొంది. 3,006 సెషన్ సైట్లు వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,006 సెషన్ సైట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసినట్లు పీఎంవో తెలిపింది. మొదటి రోజు ప్రతి సెషన్ సైట్లో కనీసం 100 మందికి టీకా ఇస్తారని పేర్కొంది. మొదటి రోజు టీకా తీసుకునే కొందరు ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ జాబితాలో ఉన్న ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రుల అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం శాఖకు చెందిన నిర్మాణ్ భవన్‌లోని కోవిడ్ కంట్రోల్ రూంను సందర్శించారు. కేటాయింపుల్లో వివక్ష ఉండదు టీకా కేటాయింపులపై కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి స్పష్టతనిచ్చింది. ‘వ్యాక్సినేషన్ డోసుల కేటాయింపుల్లో ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రశ్నే లేదు. ఇది ముందుగా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు, రానున్న వారాల్లో డోసుల సరఫరా కొనసాగిస్తాం. టీకా సరఫరాలో లోటు జరుగుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు’అని పేర్కొంది. 31న పల్స్ పోలియో 16న జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో పోలియో టీకా కార్యక్రమం పల్స్ పోలియో జనవరి 31వ తేదీకి వాయిదా పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయం అధికారులతో సంప్రదింపుల అనంతరం పల్స్ పోలియోను రీ షెడ్యూల్ చేసినట్లు వివరించింది. గర్భవతులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దు గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదో చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది. 15 వేల కొత్త కేసులు దేశంలో 24 గంటల్లో 15,590 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683 కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో కరోనా కారణంగా 191 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,918కు చేరుకుందని పేర్కొంది. -
తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. ప్రధాని మోదీ సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై చర్చించారు. భారత్‌లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు. సైంటిస్టుల మాటే ఆఖరి మాట ఇప్పటికే అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ అంశంలో సైంటిస్టుల మాటే ఆఖరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు. మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి తొలి దశలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకే కరోనా టీకా అందుతుందని, వారు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని నరేంద్రమోదీ కోరారు. ప్రామాణికమైన ప్రొటోకాల్ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. బూత్‌లెవల్ వ్యూహం సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని తెలిపారు. బూత్ లెవెల్ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. కో–విన్ అనే డిజిటల్ వేదిక ఏర్పాటు చేశామన్నారు. టీకా తొలిడోస్ తీసకున్నాక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్ అప్రమత్తం చేస్తుందని వివరించారు. ఓటర్ జాబితాతో.. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
కరోనా టీకా: మొదట వారికే ఇస్తాం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు. ప్రస్తుతం 20 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్ఫర్డ్–సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత) క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్! ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్‌లో వ్యాక్సిన్‌కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్మస్కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు. వృద్ధుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సత్ఫలితాలు లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్‌లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్ఫర్డ్ వాక్సిన్ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు. -
‘వ్యాక్సిన్’ కోసం లక్షమంది వివరాలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒకపక్క యంత్రాంగం, ప్రజలు దీనితో పోరాడుతుండగా.. మరో పక్క దీనికి చెక్‌పెట్టే వ్యాక్సిన్ తయారీలో దేశవ్యాప్తంగా 9 ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. టీకాలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో కరోనా ను ఖాతరు చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత ఈ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో హెల్త్‌కేర్ వర్కర్స్ డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ తదితర సిబ్బంది సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేకరిస్తున్నారు. మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో వివిధ క్యాడర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్లలో కలిపి సుమారు లక్ష మంది వివరాలను సేకరించారు. జనరల్, జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, డిస్పెన్సరీలు, ఆయుష్ ఆస్పత్రులు, మథర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు తదితరాల్లో పనిచేస్తున్న వీరందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ డేటాను వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని వివిధ స్థాయిల ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ హోంలు, పాలిక్లినిక్‌లు, ఎన్జీఓ వసతి కేం ద్రాల్లోని స్టాఫ్ వివరాల సేకరణ కొనసాగు తోంది. ఈ ప్రక్రియను వచ్చేనెల 10లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. (చదవండి: కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) నాలుగంచెల్లో సమన్వయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారా మెడికల్ తదితర కేటగిరీల్లోని మొత్తం 7 లక్షల మంది వివరాలను వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా 6 లక్షల మంది ఉండొచ్చని అంచనా. వివరాల సేకరణ ప్రక్రియ సమన్వయానికి 4 అంచెల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. నేషనల్ స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, స్టేట్ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్.. ఇవి సమన్వయం చేస్తున్నాయి. ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ అయిన ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, నర్సులు/సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ విద్యార్థులు, సైంటిస్టులు/రిసెర్చ్ స్టాఫ్, క్లరికల్/అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర ఆరోగ్య వైద్య సిబ్బంది కేటగిరీల్లో పనిచేస్తున్న వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో మెడికల్ స్టాఫ్‌కు సంబంధించి 24 అంశాల్లో వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్, పోస్టల్ కోడ్, గుర్తింపు కార్డు, పనిచేస్తున్న ఆస్పత్రి పేరు, ఏరియా, కేటగిరీ తదితర సమాచారాన్ని తీసుకుంటున్నారు. -
కరోనాపై యుద్ధంలో సమిధలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది. ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్‌వైఫ్‌గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో లాక్డౌన్ లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్‌లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. -
రూ.50 లక్షల కరోనా బీమా
సాక్షి, హైదరాబాద్: కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ఇదివరకు ప్రకటించగా తాజాగా మార్గదర్శ కాలు విడుదల చేసింది. కరోనాతో మరణిస్తే కరోనా సంబంధ విధుల్లో ప్రమాదకర స్థితిలో మరణిస్తే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికీ పథకం వర్తించనుంది. అయితే ఈ మరణాలను రాష్ట్ర, జిల్లా స్థాయి లోని కమిటీలు నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ పథకం కింద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తారు. -
వ్యాక్సిన్ వస్తే ముందు వారికే!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పున్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని అందుబాటును పరిగణనలోకి తీసుకుని సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టడంపై ఈ భేటీలో చర్చించారు. వైద్య సరఫరా వ్యవస్థల నిర్వహణ, వైరస్ ముప్పున్న జనాభాలకు ప్రాధాన్యత, వివిధ ఏజెన్సీలు..ప్రైవేట్ రంగం, పౌరసమాజం మధ్య సమన్వయం వంటి నాలుగు సూత్రాల అధారంగా వ్యాక్సిన్ పంపిణీపై నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సినేషన్ కోసం సార్వజనీనంగా, అందుబాటు ధరలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యాలపై రియల్ టైం పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ అత్యున్నత సమావేశంలో నిర్ణయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే పనిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ర్టాజెనెకా సంస్ధతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి : కరోనా టీకా: మరో కీలక అడుగు -
కరోనా పోరు: కేంద్రం మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికమౌతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఉద్దేశించిన రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ వరకు కోవిడ్ వారియర్స్‌కు బీమా కవరేజీ ఉంటుంది. 22 లక్షల వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. కాగా, ఈ ఇన్సూరెన్స్‌ను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ద్వారా అందిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ మొదలైన గత మార్చి నుంచి ఈ బీమాను వర్తింపజేస్తున్నారు. (చదవండి: రెండో దశ మానవ పరీక్షలు షురూ..) జూన్ 30న ఈ బీమా గడువు ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, హెల్త్ కేర్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌కేర్ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే వెల్లడించారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!) -
44డిగ్రీల ఎండలో..25 నిమిషాల పాటు
భోపాల్: బయట ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలో కాస్తా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒళ్లంతా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు సేవలందించే వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. ఒంటి మీద పీపీఈ కిట్ వేడి.. బయట ఎండకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఓ ఆరోగ్య కార్యకర్త. దారుణం ఏంటంటే అతడు పని చేసే ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తికి చికిత్స అందించడానికి నిరాకరించింది. దాంతో దాదాపు 25 నిమిషాల పాటు 44 డిగ్రీల ఎండలో ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. తర్వాత అతని సహోద్యోగి ఒకరు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు. వివరాలు.. హిరలాల్ ప్రజాపతి అనే వ్యక్తి 108 అంబులెన్స్‌కు అనుబంధ ఉద్యోగిగా బుండేల్ఖండ్ మెడికల్ కాలేజీ(బీఎంసీ)లో పని చేస్తున్నాడు. టీబీ హాస్పిటల్ నుంచి బీఎంసీకి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లే విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్నంతసేపు ప్రజాపతి పీపీఈ కిట్ ధరించి ఉంటాడు. దాంతో అధిక వేడికి తట్టుకోలేక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎంసీ ప్రాంగణంలో కుప్పకూలాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రజాపతికి చికిత్స అందించడానికి నిరాకరించడంతో దాదాపు 25నిమిషాల పాటు అలా ఎండలోనే ఉండిపోయాడు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) అనంతరం ప్రజాపతి సహోద్యోగి ఒకరు పారామెడికల్ సిబ్బంది సాయంతో అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బీఎంసీ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి ఝలక్!
-
పారిస్‌లో వైద్య సిబ్బందికి జరిమానా
పారిస్ : కరోనా కష్టకాలంలో అహర్నిశలు కష్టపడుతున్న తమ సమస్యలను తీర్చాలని నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి పారిస్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిరసనకు దిగిన 50 మంది వైద్య సిబ్బందికి జరిమానా విధించగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందు నుంచే పారిస్‌లోని రాబర్ట్ డెబ్రే ఆసుపత్రి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇక కరోనా వ్యాప్తితో అక్కడి సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీనికి తోడూ వేతనాల్లో కత్తెర, వైద్య పరికరాల కొరత వంటి సమస్యలతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దాదాపు 400 మంది వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది నిరసనకు దిగారు. ఆసుపత్రికి మెరుగైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ర్యాలీ తీశారు. అయితే నిరసనకారులు సామాజిక దూరం విషయంలో నియమాలను ఉల్లంఘించారని పారిస్ పోలీసులు తెలిపారు. అక్కడున్నవారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా, అందుకు తిరస్కరించిన వారికి అక్కడే 150 డాలర్ల జరిమానా విధించారు. జరిమానా కట్టని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వేతనాల పెంపుతోపాటూ, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో వైద్య సిబ్బందిపై పనిభారం అధికమైందని నిరసనల్లో పాల్గొన్న వైద్యులు తెలిపారు. అంతేకాకుండా సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో తమకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మే ప్రారంభం నుంచే ఫ్రాన్స్‌లో లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ వస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. షాపులు, పాఠశాలలను కూడా తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన నిబంధనల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.