సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్తనూ కాపాడేందుకు అన్ని చర్యలూ సత్వరం చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్-19పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణ పట్ల తమ చిత్తశుద్దికి ఎపిడమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 చేపట్టడమే నిదర్శనమని ప్రధాని ట్వీట్ చేశారు. ఆరోగ్య కార్యకర్తల భద్రతపై రాజీపడబోమని స్పష్టం చేశారు.
కాగా వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యులపై దాడులకు తెగబడితే మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment