saftey
-
పిన్నీసు మింగిన మూడునెలల పసికందు..ప్రాణం కాపాడిన ఆంకురా ఆస్పత్రి వైద్యులు
అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు. ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. -
కుటుంబాన్ని మింగేసిన గీజర్ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
వేడి నీటి కోసం ఉపయోగించే గీజర్నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కారణంగా హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఆధునిక కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ తమ వాష్ రూములలో చిన్నా, పెద్దా గీజర్లను వాడుతున్నారు. పైగా ఇపుడు వర్షాకాలం కూడా కావడంతో స్నానానికి వేడి నీటిని వాడటం ఇంకా అవసరం. ఈ నేపథ్యంలో గీజర్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వాటర్ హీటర్ మీ ఇంటికి సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోవాలి. వాటర్ హీటర్ చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనెక్షన్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు తొందరగా చల్లారిపోకుండా అదనపు మందపాటి ఇన్సులేషన్ వాడాలి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. వేడి నీటి హీటర్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా సెట్ చేయకూడదు. హాట్ వాటర్ హీటర్ నాబ్‌లు , బటన్లు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పిల్లలకు దూరంగా ఉండాలి.టెస్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్: అధిక ఒత్తిడి , అధిక ఉష్ణోగ్రతల విషయంలో మీ వాటర్ హీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా, సర్వీస్ టెక్నీషియన్ ద్వారానే మరమ్మత్తు చేయించడం ఉత్తమంగ్యాస్ గీజర్‌లో బ్యూటేన్ , ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్‌ను లాంటి హాని కరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలొస్తాయి. అందుకే బాత్రూమ్లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా అమర్చాలి. లేదా గాలి, వెలుతురు ఉండేలా అయినా జాగ్రత్త పడాలి.ముఖ్యంగా వర్షాకాలంలో గీజర్ ఆన్‌లోనే ఉండగానే షవర్ బాత్ చేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాదు, వీలైతే వేటి నీటిని బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసి తరువాత మాత్రమే స్నానానికి వెళ్లడం ఇంకా ఉత్తమం.ఎలక్ట్రిక్ హీటర్లు పర్యావరణానికి నష్టం కూడా. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిది. అలాగే హీటర్లను వినియోగించేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండాలి. -
రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్ రంజితసింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్ నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం? ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి ఈ-బైక్ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్ షాట్ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం క్లూస్ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్ సేఫ్టీ రూల్స్) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్ అధికారి ఏమన్నారంటే.. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తన మెసెంజెర్ యాప్‌లో కొత్త భద్రతా చర్యలను ప్రారంభించింది..యూజర్లకు తెలియకుండా తెర వెనుక జరిగే మోసాలను గుర్తించి, యూజర్లను అలర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా వీటిని మనిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా భావిస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంబందిత యూజర్ ను హెచ్చరిస్తుంది. మెసెంజర్ టెక్స్ట్ చాట్లలో సేఫ్టీ సందేశాలు పాపప్ అవుతాయని ప్రైవసీ అండ్ సేఫ్టీ నిర్వహణ డైరెక్టర్ జే సుల్లివన్ తెలిపారు. సంభాషణలను స్కామర్లు ఎవరూ వినకుండా , గమనించకుండా స్నేహితులు , ప్రియమైనవారితో సురక్షితంగా ప్రైవేటుగా కమ్యూనికేట్ చేయగలగాలన్నారు. ముఖ్యంగా మైనర్ యూజర్ల భద్రత తమకు ముఖ్యమన్నారు. సంబంధిత ఖాతారుదారుడు పంపించే మెసేజెస్, ప్రాంతం, అకౌంట్ నైజం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ స్కామర్లను గుర్తిస్తుందని ఫేస్బుక్ తెలిపింది. అలాంటి మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించక ముందే హెచ్చరిక నోటీసులు పాపప్ అవుతాయని,దీన్ని యూజర్లుగమనించాలని పేర్కొంది. ఈ ఫీచర్ తమ మిలియన్ల యూజర్లను భారీమోసాలు, హానికరమైన చర్యలనుంచి కాపాడుతుందని ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులోఉన్న ఈ ఫీచర్ వచ్చే వారం ఐఫోన్లలోని మెసెంజర్లో కూడా ప్రారంభిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. We’re introducing a new privacy-preserving safety feature that will help millions of people avoid potentially harmful interactions and possible scams. https://t.co/ajJagpJjJ9 — Messenger (@messenger) May 21, 2020 -
ప్రతి ఆరోగ్య కార్యకర్తనూ కాపాడుకుంటాం : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్తనూ కాపాడేందుకు అన్ని చర్యలూ సత్వరం చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్-19పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ప్రయోజనాల పరిరక్షణ పట్ల తమ చిత్తశుద్దికి ఎపిడమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 చేపట్టడమే నిదర్శనమని ప్రధాని ట్వీట్ చేశారు. ఆరోగ్య కార్యకర్తల భద్రతపై రాజీపడబోమని స్పష్టం చేశారు. కాగా వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యులపై దాడులకు తెగబడితే మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. చదవండి : ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు? -
నిబంధనలకు పాతర
జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కాలేజీలు నడుపుతూ విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. దీంతో ఏపీ ఉన్నత విద్యా మండలి జిల్లాలోని 24 డిగ్రీ కాలేజీలకు నోటీసులిచ్చింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దె భవనాలు..ఇరుకైన గదులు..ఆట స్థలం లేదు..అసలు కళాశాల వాతావరణమే కనిపించదు. ఫైర్ పర్మిషన్నూ ఉండదు. అంతెందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాల్సిన ఏ ఒక్కటీ కనిపించదు. జిల్లాలో చాలా వరకు డిగ్రీ కళాశాల తాజా పరిస్థితి ఇది. ఉన్నత విద్యామండలిలో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోకపోవడంతో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వసతుల సంగతి పట్టించుకోకుండా విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 డిగ్రీ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 12 ఎయిడెడ్ కళాశాలలుండగా, 112 అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా 25 వేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు డిగ్రీ కళాశాలను అనుమతిచ్చిన ఐదు సంవత్సరాల వరకు అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా సొంత భవనాల్లోనే కళాశాలలు నిర్వహించాలి. విద్యార్థులకు సరిపడా గదులుండాలి. ఆట స్థలం ఉండాలి. ఫైర్ సర్టిఫికెట్, కళాశాలలో పనిచేసే బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా 24 రకాల వసతులు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే డిగ్రీ కళాశాలలు అనుమతులను కొనసాగించాల్సి ఉంది. అయితే చాలా మటుకు కళాశాలలు అద్దె భవనాలు, ఆట స్థలాల్లేని ఇరుకైన గదుల్లో కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు అపార్టుమెంట్లు తీసుకొని ఎక్కడపడితే అక్కడే కళాశాలలు నిర్వహిస్తున్నారు. కళాశాలలకు ఆట స్థలం దేవుడెరుగు. విద్యార్థులు తెచ్చుకునే సైకిళ్లు, బైకుల్లాంటి వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలాల్లేని కళాశాలలు కోకొల్లలు. ఇక విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వసతులు, నాణ్యమైన విద్యాబోధన సంగతి గాలికొదిలేశాయి. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లోనే విద్యనభ్యసించాల్సి వస్తోంది. అన్ని వసతులతో కళాశాలలుండాలని ఏపీ ఉన్నత విద్యామండలి పలు డిగ్రీ కళాశాలలకు చాలాసార్లు మొక్కుబడిగా నోటీసులు జారీ చేయడం మినహా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. దీంతో యాజమాన్యాలు వారిని ఖాతరు చేయడం లేదు. కొందరు ఉన్నతాధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యాజమాన్యాలు పని చక్కబెట్టుకుంటున్నాయి. 24 కళాశాలలకు నోటీసులు: నిబంధనల మేరకు సొంత భవనాల్లో కళాశాలలు ఎందుకు నడపడం లేదంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఒంగోలు 3 డిగ్రీ కళాశాలలు, సంతనూతలపాడు 1, తర్లుపాడు 1, మార్కాపురం 2, మార్టూరు 1, మేదరమెట్ల 1, దర్శి 2, చీమకుర్తి 1, కంభం 2, గిద్దలూరు 1, కొమరోలు 1, చీరాల 2, పర్చూరు 1, కనిగిరి 1, బేస్తవారిపేట 1, అద్దంకి 1, యర్రగొండపాలెం 1 మొత్తం 24 కళాశాలలకు ఏపీ ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చిక్కుల్లో పడ్డాయి. ఉన్నత విద్యామండలి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే పలు డిగ్రీ కళాశాలలపై చర్యలు తప్పని పరిస్థితి. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి డిగ్రీ కళాశాలలు నిబంధనల మేరకు సొంత భవనాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంది. అలా కాకుండా అద్దె భవనాల్లో అక్రమంగా కళాశాలలు నిర్వహించటంతోనే చివరికి ఈ పరిస్థితి తలెత్తింది. ఆన్‌లైన్‌తో తిప్పలు ఉన్నత విద్యామండలి డిగ్రీ కళాశాలల వివరాలను ఈ ఏడాది నుంచి ఆన్లైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ శామ్స్‌తో అనుసంధానమైన ఉన్నత విద్యామండలి మొత్తం వివరాలను ఈ నెల 5 నుంచి ఆన్లైన్ చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం డిగ్రీ కళాశాలలకు సంబంధించిన కళాశాల డాక్యుమెంట్స్‌తో పాటు భవనం, గదుల వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. గదులకు సంబంధించి పంచాయతీరాజ్ లేదా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఇంజినీర్లతో సర్టిఫై చేయించి సర్టిఫికెట్ ఆన్లైన్లో పెట్టాలి. గ్రౌండ్ వివరాలతో పాటు బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్లో పెట్టాలి. ఫైర్ సర్టిఫికెట్ చూపించాలి. మొత్తంగా 24 కాలమ్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని కమీషన్ ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే కళాశాలలకు అనుమతులు లభిస్తాయి. -
రైళ్లలో 12 లక్షల సీసీటీవీ కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణానుభూతులను కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలోనే 11,000 రైళ్లు, 8500 రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే శాఖ కసరత్తు సాగిస్తోంది. 2018-19 రైల్వే బడ్జెట్లో దీనికోసం రూ 3000 కోట్లతో నిధి ఏర్పాటు కానుంది. రైల్వేల ప్రణాళిక ప్రకారం ప్రతి కోచ్‌లో ఎనిమిది సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నుంచి అన్ని ప్రదేశాలను కవర్ చేసేలా నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 395 స్టేషన్లు, 50 రైళ్లలో సీసీటీవీ వ్యవస్థ అందుబాటులో ఉంది. రాబోయే రెండేళ్లలో రాజధాని, శతాబ్ధి, దురంతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, ప్రీమియర్ రైళ్లలో ఆధునిక నిఘా వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా ఈ కార్యక్రమానికి భారీగా నిధులు సమీకరించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో రానున్న రైల్వే బడ్జెట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. -
గన్ సేఫ్టీపై చర్చిస్తూనే.. చర్చిలో కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో జనరల్‌గా నిర్వహించుకునే థాంక్స్ గివింగ్ మీల్ అనుకోని ప్రమాదానికి దారితీసింది. ఇటీవల టెక్సాస్ చర్చిలో జరిగిన కాల్పుల దుర్ఘటన నింపిన విషాదాన్ని తలుచుకుంటూ ఉండగా..మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. పెరుగుతున్న గన్ కల్చర్, ముఖ్యంగా చర్చిలో జరుగుతున్న కాల్పులు, హింసపై అక్కడ కొంతమంది పెద్ద వాళ్లు( సీనియర్ సిటిజన్స్) చర్చిలో సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం కాల్పులు, తదనంతర పరిణామాలు, గన్ సేఫ్టీపై చర్చించుకుంటున్నారు. కానీ తామూ తుపాకి కాల్పుల బాధితులమవుతామని...ఆ ఆహ్లాదకరమైన మధ్యాహ్నం ..భయంకరమైన మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు వారిలో ఓ వృద్ధ జంట. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల శరీరంలోకి దూసుకుపోయాయి. వివరాల్లోకి వెడితే.. న్యూయార్క్‌లోని ఈస్ట్ టెన్నెసీ చర్చ్‌లో థాంక్స్ గివింగ్ విందును ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది సీనియర్ సిటిజన్లు ఈ విందు హాజరయ్యారు. వారిలో యునైటెడ్ మెథడిస్ట్ చర్చి సభ్యుడు పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి, దాని వాడాలో అక్కడున్న వారికి వివరించాడు. 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్ గన్ను ఓపెన్ చేసి ,మ్యాగజైన్ లోడ్ చేసి అక్కడున్నవారికి చూపించాడు. దాన్ని అలాగే పక్కన పెట్టాడు. ఇంతలో మరో సభ్యుడు తనకూ చూపించమంటూ..వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అంతే క్షణాల్లో బుల్లెట్ పెద్దాయన అరచేతిలోంచి...పక్కనే వీల్ చైర్లో కూర్చుని వున్న భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకుపోయింది. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన భార్యాభర్తలిద్దరి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ, ఎవరిమీదా కేసు నమోదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి రుస్ పార్క్స్ తెలిపారు. ఇటీవలి మాస్ షూటింగ్ నేపథ్యంలో స్థానిక చర్చిలలో సెమినార్లు నిర్వహించాలని కౌంటీ షెరీఫ్ విభాగం నిర్ణయించడంతో వీరు కూడా సమావేశమయ్యారని తెలిపారు. కాగా టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
రాజధాని ఎక్స్‌ప్రెస్ నుంచి దురంతో వరకూ...
న్యూఢిల్లీః రైలెక్కితే గమ్యస్ధానానికి క్షేమంగా చేరుకుంటామో..లేదోనని ప్రయాణీకులు బిక్కుబిక్కుమని గడపాల్సిన పరిస్థితి. రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదం, పట్టాలు తప్పడం..ఇలా ఏ రూపంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2015-16లో జరిగిన రైలు ప్రమాదాల్లో అత్యధికంగా 60 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల కాగా, 33 శాతం లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారత రైల్వేలో భద్రత అతిపెద్ద సవాల్‌గా ముందుకొస్తున్నది. గత కొన్నేళ్లుగా మొత్తం రైలు ప్రమాదాల సంఖ్య కొద్దిగా తగ్గినా..వాటి సంఖ్య మాత్రం 100 పైనే ఉంది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన సహా రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే భద్రతకు ఎదురువుతున్న సవాళ్లు ఆందోళనకు గురిచేసేవే.... రైళ్లు పట్టాలు తప్పడం.. దేశంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాల్లో సింహభాగం రైలు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి. ఉత్తరాదిలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాలకు కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. మొత్తం లక్షా14వేల997 కిమీ రైల్వే ట్రాక్‌లో ఏటా 4500 కిమీ మేర ట్రాక్‌ను పునరుద్ధరించాలి. అయితే 2015-16లో 5000 కిమీ ట్రాక్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా కేవలం 2700 కిమీ ట్రాక్‌లోనే పునరుద్ధరణ పనులు జరపాలని నిర్ధేశించారు. మరోవైపు పట్టాలు తప్పిన సందర్భాల్లో కోచ్‌లు ఒకదానిపై ఒకటి పడకుండా ఉండేందుకు లింకే హాఫ్మాన్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు అమలుకు నోచుకోలేదు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు రైలు ప్రమాదాల్లో ఎక్కువ ప్రాణనష్టాలకు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఇప్పటికీ కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ఇప్పటికీ 14,440 కాపలాలేని లెవెల్ క్రాసింగ్‌లున్నాయి. 2014-15లో 40 శాతం రైలు ప్రమాదాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. 2015-16లో వీటి సంఖ్య 28 శాతంగా నమోదైంది. కాపలాలేని లెవెల్ క్రాసింగ్లను తొలగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యాలు కార్యాచరణకు నోచుకోలేదు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రైళ్లు వచ్చే సమయంలో రోడ్డుపై వెళ్లేవారిని అప్రమత్తం చేసేలా ఆడియో,విజువల్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకోలేదు. రైల్వే సిబ్బంది వైఫల్యంతో.... రైల్వేల్లో భద్రతను సమీక్షిస్తూ రైలు ప్రమాదాల్లో యాభై శాతం పైగా సిబ్బంది వైఫల్యాల వల్లే సంభవిస్తున్నాయని స్టాండింగ్ కమిటీ నిగ్గుతేల్చింది. పనిపట్ల నిర్లక్ష్యం కనబరచడం, పేలవమైన మెయింటెనెన్స్ వర్క్, భద్రతా నిబంధలను గాలికొదిలేయడం వంటి కారణాలను కమిటీ ఎత్తిచూపింది. ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే సిబ్బందికి విభాగాల వారీగా వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించింది. ఇక లోకో పైలట్లు ( ట్రైన్ ఆపరేటర్లు)చేసే సిగ్నలింగ్ పొరపాట్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. లోకో పైలట్ల విధినిర్వహణలో సమర్ధంగా పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక మద్దతు కొరవడింది. వీరు సమయానికి మించి పనిచేయాల్సి రావడంతో లోకో పైలట్లపై పనిభారం, ఒత్తిడి వేలాది ప్రయాణీకుల ప్రాణాలను రిస్క్‌లో పడవేస్తున్నది.లోకోపైలట్లకు మెరుగైన వైద్య వసతులు, పని పరిస్థితులను కల్పించాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. నిధుల లేమితో భద్రతకు గండి రైల్వేలు భద్రతపై భారీ మొత్తం వెచ్చించాల్సిన క్రమంలోనిధుల సమస్య ప్రధాన అవాంతరంగా ముందుకొస్తున్నదని పలు కమిటీల నివేదికలు స్పష్టం చేశాయి. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని రైల్వేలపై స్టాండింగ్ కమిటీ సహా అనిల్ కకోద్కర్ కమిటీ సైతం నొక్కిచెప్పింది. కకోద్కర్ కమిటీ 2012-17 వరుకూ రైల్వేలు భద్రతపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని పేర్కొంది. మొత్తంమీద గత కొన్నేళ్లుగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినా వాటి సంఖ్య 100కు పైగానే ఉండటం రైల్వే అధికారులు, పాలనా యంత్రాగం, ప్రయాణీకులను కలవరపరుస్తున్నది.