
ఎండలు ముదురుతున్నాయి. సూర్యుడి భగభగలను తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. అయితే ఏసీల పని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలమంతా వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కాబట్టి ఇపుడు వాడేటపుడు మెయింటెనైన్స్‌పై దృష్టి పెట్టాలి. ఏసీలోని భాగాలను శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండాకాలంలో ఏసీల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసు కుందాం ఈ కథనంలో...
కొన్ని చోట్ల ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మెయింటెనెన్స్
వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం, ప్రొఫెషనల్ టెక్నీషియల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులై టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల ఏసీలో ఉన్న లోపాలను ముందుగనాఏ గుర్తించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ లాంటి ప్రధానం చెక్ చేసుకోవాలి.
వైరింగ్ తనిఖీ
ఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి.
రిమోట్‌లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్‌లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. మోడ్‌లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
వెంటిలేషన్
ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.
ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి.
ఏసీ టెంపరేచర్‌ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం కూడా ముఖ్యం
ఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.
ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.
ఎలాంటి ఏసీలను తీసుకోవాలి?
నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్‌లను మాత్రమే కొనుగోలు చేయాలి.
నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు.
ఇదీ చదవండి : సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment