నేడు నేషనల్ టూరిజమ్ డే
పర్యటనలకు మనదేశం పుట్టిల్లు. తీర్థయాత్రలు మన సంస్కృతిలో భాగం. పర్యటన... ఒక పాఠం... రచనకు అదే మూలం. జీవన వైవిధ్యత అధ్యయనానికి ఓ మాధ్యమం. పర్యటనలు ఒత్తిడి నుంచి సాంత్వన కలిగిస్తాయి.జీవితాన్ని కొత్తగా చూడడానికి కళ్లు తెరిపిస్తాయి.అణగారిన జీవితేచ్ఛను తిరిగి చిగురింప చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్‌తో టూర్‌లు... ఫ్యామిలీ టూర్‌లు... అలాగే... మహిళల సోలో ట్రావెల్స్ కూడా పెరిగాయి.
మహిళలు ఒంటరిగా పర్యటనలు చేయడానికి సందేహించాల్సిన అవసరమేలేదిప్పుడు. ప్రపంచంలో మనుషులందరినీ కలిపే భాష ఇంగ్లిష్. మనదేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా ఇంగ్లిష్ భాష వస్తే చాలు. అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లేక΄ోయినప్పటికీ మనకు అవసరమైన సమాచారాన్ని అడగగలగడం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. సేఫ్టీ, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగిస్తే మహిళలు ఒంటరిగా ప్రయాణించినా సరే ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నారు రజని లక్కా.
ఆత్మవిశ్వాసం ఉండాలి, కనీసం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించి తీరాలి. బిత్తర చూపులు చూస్తే మోసగించేవాళ్లు అక్కడిక్కడే ప్రత్యక్షమవుతారు. మరో తప్పనిసరి జాగ్రత్త ఏమిటంటే సహ ప్రయాణికులతో కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే పర్యటనను ఆస్వాదించాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సోలోగా పర్యటనకు వెళ్లిన వాళ్లు ఇంట్లో వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అయితే లైవ్ లొకేషన్స్ ఇతరులకు ఎవ్వరికీ షేర్ చేయవద్దు. సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం తాపత్రయపడి టూరిస్ట్ ప్లేస్‌లో ఫొటోలు తీసుకుని గంటకో పోస్ట్ పెడుతూ ఉంటే మన కదలికలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంటాయి. మనల్ని ఎవరైనా రహస్యంగా వెంటాడుతున్నట్లయితే చేజేతులా వారికి దారి చూపించినట్లవుతుంది.
పర్యటన వివరాలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో షేర్ చేయాలనుకుంటే పర్యటన పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో ఒంటరిగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు జెన్నిఫర్. మనవాళ్లకు అడ్వెంచర్ టూర్‌లు చేయడం కంటే నియమాలను ఉల్లంఘించడంలో సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఫొటోగ్రఫీ నిషేధం అన్న చోట ఫొటోలు తీసుకుంటారు. సెక్యూరిటీ కళ్లు కప్పి నిషేధిత ప్రదేశాల్లోకి, డేంజర్ జోన్‌లలోకి దొంగచాటుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరం మాత్రమే కాదు నేరం కూడా. పర్యటనను ఆస్వాదించడం కూడా ఒక కళ. ఎప్పటికీ వన్నె తగ్గని కళ.
(టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి)
మనదేశం ప్రపంచానికి ప్రతీక
కశ్మీర్‌లో తప్ప సోలో ట్రావెలర్‌గా మరెక్కడా నాకు ఇబ్బంది ఎదురుకాలేదు. తమిళనాడు ప్రజలు సింపుల్‌గా ఉంటారు. 76 దేశాల్లో పర్యటించిన తరవాత నాకనిపించిందేమిటంటే... ప్రపంచంలో ఉన్నవన్నీ మనదేశంలో ఉన్నాయి. మనదేశంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం బొలీవియాను తలపిస్తుంది. మన దగ్గర ఎడారులు, హిమాలయాలు, బీచ్‌లు ఒక్కొక్కటి ఒక్కోదేశంలో ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్‌ను తలపిస్తాయి. ఆర్కిటెక్చర్ పరంగా తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ కోటలకు ప్రపంచంలో మరేవీ సాటి రావు.- పొనుగోటి నీలిమ, ట్రావెలర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఇదీ చదవండి: ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
ట్రావెల్ లైట్... ట్రావెల్ సేఫ్
ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా పర్యటించాను. ఏడు దేశాలు కూడా చూశాను. మనల్ని మనం మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది పర్యటన ద్వారానే. సోలో ట్రావెల్ అయితే మన అభిరుచికి తగినట్లు టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు పర్యటనలకు సౌకర్యాలు బాగున్నాయి. సోలో ట్రావెల్‌లో అన్నీ మనమే సమకూర్చుకోవడం కష్టం అనిపిస్తే టూర్ ΄్యాకేజ్‌లో వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో స్థానికులతో కలిసి΄ోతున్నట్లుగా ఉండాలి. మనల్ని మనం ఎక్స్΄ోజ్ చేసుకునే ప్రయత్నం చేయరాదు. ఆ ప్రదేశానికి సరి΄ోలని వస్త్రధారణ, మాటల ద్వారా ఇతరుల దృష్టి మన మీద సులువుగా పడుతుంది. ప్రమాదాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. సోలో ట్రావెల్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ విషయంలో మాత్రమే. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, డైరెక్టర్
సురక్షితంగా వెళ్లిరావచ్చు!
ఒంటరి పర్యటనలు ఆస్వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. కెనడాలో మాంట్రియల్‌లో నేను ప్రయాణించిన టూరిస్ట్ బస్‌లో తొమ్మిది దేశాల వాళ్లున్నారు. అంతమందిలో ఇద్దరు మినహా అంతా సోలో ట్రావెలర్సే. అయితే వెళ్లే ముందు పర్యటనకు వెళ్లే ప్రదేశం గురించి ్ర΄ాథమిక వివరాలైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెంట్, జీపీఎస్ సౌకర్యాలున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ధైర్యంగా ఒంటరి ప్రయాణాలు చేయవచ్చు. భద్రంగా వెళ్లి, సంతోషంగా తిరిగి రాగలిన పరిస్థితులున్నాయి. – రజని లక్కా, సోషల్ యాక్టివిస్ట్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment