Solo
-
'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..
సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే..కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట. కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది. అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది. కలిగే ప్రయోజనాలు..సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది. అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది. మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది. కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!) -
పిల్లల్లేకుండా, సోలోగా హాలిడే ట్రిప్, తొలి అనుభవం : నటి ఫోటోలు వైరల్
సాధారణంగా మహిళలు పెళ్లి , పిల్లలు తరువాత చాలా బాధ్యతల్లో మునిగిపోతారు. పిల్లల పెంపకంలో సెలబ్రిటీలైనా, సినీ తారలైనా అమ్మలకు ఈ బాధ్యత తప్పదు. ఈ క్రమంలో తమ ఉద్యోగాల్ని, తన అభిరుచుల్ని ఆంక్షాల్ని కూడా పక్కన పెట్టి మరీ పిల్లల పెంపకంలో మునిగి పోతారు. వాళ్లు కాస్త పెద్దవాళ్లయిన తరువాత తిరిగి ఉద్యోగాల్లో చేరడం, మరికొంతమంది స్నేహితులతో హాలిడే ట్రిప్‌లు, తమ కలలకు పదును పెట్టడం లాంటివి చేస్తారు. సినీ నటి సమీరా రెడ్డి పిల్లలు, గిల్లలు ఇలాంటి బాదర బందీ ఏ మాత్రం లేకుండా మరింత గ్రాండ్‌గా సోలో ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. "మీరు పిల్లలు లేకుండా సోలో హాలిడే ఎంజాయ్ చేశారా? నా మొదటి అనుభవం’’ అంటూ గ్రీస్‌లో గడిపిన మెమరబుల్ ఫోటోలను షేర్ చేసింది. దీంటో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా?
Election Results: దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కనపెడితే ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నామామాత్రపు సీట్లకు పరిమితమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ పరాజయానికి మిత్ర పక్షాలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. అన్ని చోట్ల ఒంటరిగా వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమని తేల్చేస్తున్నాయి. ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ స్పష్టం చేసింది. బీజేపీ ఆరోపించిన మతోన్మాద రాజకీయాలను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆరోపించారు. కృత్రిమంగా ‘ఇండియా’ కూటమి బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ‘ఇండియా’ (INDIA) కూటమి ఏర్పాటైంది. రాష్ట్రాలలో విడిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దగా సమావేశాలు నిర్వహించుకుండా, పొత్తుతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా ‘ఇండియా’ కూట మి చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో జేడీయూ కూడా విడిగా 5 స్థానాల్లో అక్కడ పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటమికి అదే కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదివరకే ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. -
గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ
‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది. ‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు. గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది. సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్ఈఎల్లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్షాప్కు వెళ్లింది. తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో చిత్రీకరించారు. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్. (చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!) -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోటీ: బీజేడీ
భువనేశ్వర్: ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని, ఏ కూటమిలోనూ తాము భాగస్వామి కాదని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, దీనిపై తమ అధినేత నవీన్ పట్నాయక్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలియజేశారు. అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తున్నామని వివరించారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నవీన్ పట్నాయక్ మిత్రుడైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని అన్నారు. నవీన్ పట్నాయక్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్‌లో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్ అంతకుముందు నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. -
సోలో ఫ్లైట్ జర్నీ.. రూ.13 వేలకే ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణం!
ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు. (Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!) న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్‌కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాల్‌కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది. (ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి) ఎయిర్పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్‌ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్‌కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్‌లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు. -
మహానటి హీరో ‘అతడే’
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు దుల్కర్ సల్మాన్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. దుల్కర్ నటించిన తొలి తెలుగు సినిమా మాత్రం మహానటే. తొలి సినిమాతోనే నటిగా దుల్కర్ కు మంచి గుర్తింపు రావటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో గతంలో నటించిన మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. హేయ్ పిల్లాగాడా, 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాతో టాలీవుడ్లో సందడిచేసిన దుల్కర్ త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సోలో సినిమాను తెలుగులో ‘అతడే’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ నాలుగు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకుడు. ఇటీవల ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
తెలుగు రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సోలో’
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సోలో. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ రుద్ర, శివ, శేఖర్, త్రిలోక్ లు గా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మాలీవుడ్ లో మంచి సక్సెస్సాధించిన ఈసినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దుల్కర్ సరసన ధన్సిక, నేహ శర్మ, శ్రుతి హరిహరన్‌లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో వెంకట సాయి ప్రియాన్సి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ వెంకట్ సాయి విశాల్ సమర్పణలో గాజుల వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శర వేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ కశ్యప్, ఉమర్జి అనురాధలు తెలుగు వర్షన్ మాటలు అందిస్తున్నారు. -
వెండితెరకు రక్షణ్
తమిళసినిమా: బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మరో బుల్లితెర నటుడు సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించే అవకాశాన్ని అందుకున్నారు. అతనే వీజే.రక్షణ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కావడం సంతోషంగా ఉందని బుల్లితెర నటుడు వీజే.రక్షన్ అంటున్నాడు. కాదల్ కణ్మణి, సోలో చిత్రాల తరువాత యువ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్. దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాన్సిస్ కన్నూక్కడన్ నిర్మిస్తున్నారు. వేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి వీజే.రక్షణ్ మాటాడుతూ నటనలో ఘనత సాధించాలన్నది తన చిరకాల కల అని చెప్పాడు. అందుకు ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఇది చాలా ఫ్రెష్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం అని, ఇలాంటి మంచి కథా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని, ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. తొలి చిత్రంలోనే దుల్కర్ సల్మాన్ లాంటి హీరోతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని వర్థమాన నటుడు వీజే.రక్షన్ చెప్పాడు. -
నలుగురు ముద్దుగుమ్మలతో సోలోగా..
తమిళసినిమా: యువ నటుడు దుల్కర్సల్మాన్ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడన్న విషయం తెలిసిందే.ఈయనకు కోలీవుడ్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఇంతకు ముందు వాయై మూడి పేశవు, కాదల్ కణ్మణి చిత్రాల్లో నటించిన దుల్కర్సల్మాన్ తాజాగా సోలో అంటూ నలుగురు ముద్దుగుమ్మలతో వస్తున్నారు. రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్‌జైన్ నెఫెక్స్ ఎంటర్టైనర్ పతాకంపై గెట్అవే ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం సోలో. తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రానికి బిజాయ్నంబియార్ దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా సాయి ధన్సిక, నేహాశర్మ, శృతి హరిహరన్, ఆర్తీ వెంకటేశ్ నలుగురు అందగత్తెలు హీరోయిన్లుగా నటించడం విశేషం. అదేవిధంగా దుల్కర్సల్మాన్ ఈ చిత్రంలో నాలుగు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలో ఈ నెల 5వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు. అనంతరం సమావేశంలో చిత్ర హీరో దుల్కర్సల్మాన్ మాట్లాడుతూ మీరిప్పుడు చూసింది టీజర్ మాత్రమేనని, మెయిన్ చిత్రం ఇంకా అదుర్స్‌గా ఉంటుందని అన్నారు. నాలుగు కథలతో కూడిన ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దర్శకుడు బిజాయ్ నంబియార్ తనకు కలిగించడం అదృష్టంగా భావిస్తున్నట్లు దుల్కర్సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు బిజాయ్ నంబియార్, నేహాశర్మ, శృతిహరిహరన్, ఆర్తీవెంకటేశ్, సతీష్, నిర్మాత అనిల్‌జైన్ పాల్గొన్నారు. సోమవారం చిత్ర దర్శక నిర్మాతలు నటుడు రజనీకాంత్‌ను కలిసి చిత్ర ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. ట్రైలర్ చాలా బాగుందంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసించారని వారు తెలిపారు. -
బాలీవుడ్ బాటలో సౌత్ హీరో..!
ఓకె బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్, తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమాతో నార్త్ లో అడుగుపెడుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఎక్కువ భాగం కేరళలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రావెల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆకర్ష్ ఖురానా దర్శకుడు. ప్రస్తుతం సోలో సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న దుల్కర్ త్వరలో బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. -
యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా..
తమిళసినిమా: యాక్షన్‌కింగ్ అర్జున్‌కు అర్ధాంగిగా నిపుణన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది నటి శ్రుతిహరిహరన్. అర్జున్, ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం నిపుణన్. అరుణ్‌వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇందులో అర్జున్‌కు జంటగా నటించిన నటి శ్రుతిహరిహరన్ తన సంతోషాన్ని పంచుకుంటూ చిత్రం విజయం సాధిస్తే అందులో నటించిన తారలకు, సాంకేతిక వర్గానికి మంచి పేరుతో పాటు, మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. అలా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న నిపుణన్ చిత్రంలో నటిస్తూ తానూ ఒక భాగం కావడం ఆనందంగా ఉందని అంది. ఇందులో అర్జున్‌కు భార్యగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఇక పోలీస్అధికారి ఎదుర్కొనే వృత్తిపరమైన, శారీరకపరమైన సమస్యలో భాగం పంచుకునే భార్యగా చాలా మంచి పాత్రను తనకిచ్చిన దర్శకుడు అరుణ్వైద్యనాథన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని మహిళలను ఆదరించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పింది. ఒక తమిళ అమ్మాయిగా నిపుణన్ చిత్రంతో కన్నడంలోనూ మంచి గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని తెలిపింది. నిపుణన్ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను అందిస్తుందనే నమ్మకం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్‌కు జంటగా సోలో అనే చిత్రంలో నటిస్తున్నానని శ్రుతిహరిహరన్ తెలిపింది. -
సోలోకు ముగ్గురు ఛాయాగ్రాహకులు
తమిళసినిమా: ఇప్పుడు సినిమాను ఆషామాషీగా తీస్తే ప్రేక్షకులు చూడడం లేదు. ఏదో కొత్తదనం కావాలి. అదీ ఆకర్షణీయంగా ఉంటేనే ప్రేక్షకదేవుళ్లు ఆదరిస్తారు. అలాంటి ఒక కొత్త ప్రయోగంతో సోలో అనే చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఇం దులో మాలీవుడ్ యువ నటుడు దుల్కర్సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కార్పొరేట్ సంస్థ రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్ జెయిన్ చిత్రనిర్మాణరంగంలోకి ప్రవేశించి గేట్ అవే ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు బి జాయ్ నంబియార్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం సోలోనేనన్నా రు. ఇంతకు ముందు డేవిడ్ అనే చిత్రాన్ని చేసినా అది హిందీ చిత్రం అని, తమిళంలో అనువాద చిత్రమేనని చెప్పారు. కాగా సోలో చిత్రం తమిళం, మలయాళ భాషల్లో నేరుగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్ర కథానాయకుడు దుల్కర్సల్మాన్ మాట్లాడుతూ తనకిప్పటి వరకూ మంచి దర్శకులే అమిరారని, అందుకే మంచి చిత్రాలను అందించగలుగుతున్నానని పేర్కొన్నారు. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో చేస్తున్న ఈ చిత్రం 8 చిత్రాల్లో నటించినందుకు సమా నం అని పేర్కొన్నారు. తమిళంలో తన మూడు చిత్రా ల కార్యక్రమాల్లోనూ దర్శకుడు మణిరత్నం పాల్గొన్నారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. దర్శకుడు మణిరత్నం మా ట్లాడుతూ ఇక్కడ తాను చూసిన సోలో చిత్ర ట్రైలర్ తనను చాలా ఆకట్టుకుందన్నారు. ఈ చిత్రానికి ముగ్గు రు ఛాయాగ్రాహకులు, 11 మంది సంగీతదర్శకులు పనిచేస్తున్నారట. ఇందులో ఒక్కో వెర్షన్‌కు 15 పాటల చొప్పున మొత్తం రెండు భాషలకు కలిపి 30 పాటలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...
చీకటిని చూసి భయపడితే ఎప్పటికీ భయంగానే ఉంటుంది...ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఇంచుమించుగా ఇటువంటి అనుభవాన్నే ఆ మహిళ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంది. భారత దేశంలో మహిళ ఒంటరి ప్రయాణం సురక్షితం కాదు.. అన్న అనుమానం నిజమా కాదా అన్నది నిరూపించాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ జరిగే భయంకరమైన ఘటనల గురించి విని, చదివి భయపడే వారికి భిన్నంగా ఆలోచించింది. దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించి తన అనుభవాలను వివరించింది. ముఖ్యంగా అంతా భయపడే ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ బస్తర్ లో ఓ మహిళ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంది స్వాతీ జైన్. అక్కడివారంతా తనను ఎంతో వింతగా చూస్తారని అభిప్రాయపడింది. కానీ వారు తనపై చూపిన ఆదరణ, సహాయ సహకారాలకు ఆశ్చర్యపోయింది. మొదటి 96 గంటలపాటు 1300 కిలోమీటర్లు గిరజన ప్రాంతంలో ప్రయాణించిన ఆమె.. దూరంగా చూసి ఏ విషయానికీ భయపడకూడదన్న సత్యాన్ని గ్రహించింది. ఏ ఒక్కరూ తనవైపు వింతగా చూడలేదని, ముట్టుకోడానికి ప్రయత్నించలేదని, భయపెట్టలేదని చెప్తోంది. నిజంగా అనుమానం పెనుభూతం అన్న సామెతకు ఇదే ఉదాహరణ అంటోంది. ఛత్తీస్‌గఢ్ లో తన ఒంటరి ప్రయాణం కోసం ముందుగా ట్రావెల్ వెబ్ సైట్లు, పుస్తకాలు సందర్శించిన ఆమె... బస్తర్ ప్రయాణంపై పర్యాటకులకు సలహాదారులు వ్యతిరేక సమాచారం ఇవ్వడాన్నే చూసింది. అయితే అక్కడి పార్కులు, గుహలు వంటి సందర్శనా స్థలాలతోపాటు... వారు జరుపుకునే దసరా వేడుకను చూడాలన్న ఉద్దేశ్యంతో బస్తర్ లో ప్రయాణించింది. అలాగే తాను రాజస్థాన్ ప్రాంతంలో ప్రయాణించేప్పుడు ఓ నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగిపోయినప్పుడు... ఓ దంపతులు ట్రాక్టర్ లో ఎక్కించుకొని తనకు అక్కడికి దగ్గరలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారని చెప్తోంది. ముందుగా తాను ఒంటరిగా వారితో ప్రయాణించేందుకు భయపడి... తనతోపాటు పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకున్నానని, అయితే వారు ఆ అర్థరాత్రి సమయంలో సహాయం అందించడమే కాక.. మరుసటిరోజు ప్రయాణానికి కూడా సహకరించారని తెలిపింది. అలాగే కార్గిల్ లోని జాన్స్ కర్ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు తన షేర్ టాక్సీలోని ఓ వ్యక్తి తన కజిన్ గెస్ట్ హౌస్ లో ఆశ్రయం కల్పించాడని, తన ఇల్లులాగే ఫీల్ అవ్వమంటూ ఎంతో మర్యాదగా చూశాడని ఆ ఒంటరి ప్రయాణీకురాలు తన అనుభవాలను వెల్లడించింది. ప్రతి విషయానికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ ప్రాంతంలోనైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని అంటోంది. అంతేకాదు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకన్నా భారత దేశంలోనే మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమని తాను భావిస్తున్నట్లు వివరిస్తోంది. ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించిన ఆమె... ప్రతివారూ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేసి, ప్రత్యేక అనుభవాలను మూటగట్టుకోవాలని సలహా ఇస్తోంది. -
కెరీర్లో మంచి మలుపు తెచ్చింది
న్యూఢిల్లీ: బాలీవుడ్‌లోకి అడుగిడిన ఆదిత్యరాయ్ కపూర్ కెరీర్ ‘ఆషికి-2’ సినిమాతో భారీ మలుపు తిరిగింది. తొలినాళ్లలో 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘ఏదో ఒకరోజు కెరీర్లో మంచి మలుపు వ స్తుందనే నమ్మకం నాకు మొదటినుంచీ ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు. అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. ఏదో ఒకరోజు మంచి అవకాశం లభిస్తుంద నే నమ్మకం మాత్రం ఉండేది. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. ‘ఈ సినిమాతో అప్పటిదాకా ప్రేక్షకులకు నాపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో అత్యంత విభిన్నంగా కనిపించా. అందులోనూ సోలో హీరోగా నటించా. హీరోగా నన్ను చూడాలనుకునేవారంతా ఈ సినిమాను వీక్షించాలి. ఈ సినిమా తరువాత బాలీవుడ్లో నాకు అవకాశాలు వెల్లువెత్తాయి. నా సత్తా ఏమిటో ఈ సినిమాతో బయటపడింది. తగినంత గుర్తింపు వచ్చింది’అని అన్నాడు. ప్రస్తుతం ఆదిత్య.... ‘దావత్ ఎ ఇష్క్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పరిణీతిచోప్రా కథానాయిక. ఈ సినిమాలోనూ ఆదిత్య ప్రధాన పాత్రలోనే కనిపించనున్నాడు. -
సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా....
విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ అందాలంటే తనకెంతో ఇష్టమని తాను సినిమాలకు రాసే కథలు, డైలాగులు ఇక్కడికే వచ్చి రాసుకుంటానని వర్థమాన సినిమా కథల రచయిత డైమండ్ రత్నంబాబు తెలిపారు. కటుంబ సభ్యులతో నాగార్జున సాగర్ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దిల్ రాజు బ్యానర్‌పై తీసిన 'పిల్లా నీవులేని జీవితం' సినిమా ఈ నెల 30న విడుదల కానుందని ఆ సినిమాకు కథలో పాటు డైలాగులు తానే రాసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి మేనల్లుడు సాయిరామ్తేజ హీరో నటించినట్లు చెప్పారు. కల్యాణ్‌రాం హీరోగా తీసిన షేర్ సినిమా, సీమశాస్త్రి సినిమాకు కథలు తానే రాసినట్లు రత్నంబాబు తెలిపారు. 'సోలో' సినిమాకు డైలాగులు సాగర్‌లో కూర్చొని రాసినట్లు ఆయన వివరించారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు కథతో పాటు డైలాగులు రాసినట్లు చెప్పారు. తన శ్రమను గుర్తించిన ప్రముఖ హీరో మోహన్ బాబు సినిమా ఆడియో ఫంక్షన్లో తనకు లక్ష నగదు ప్రోత్సాహకం ఇవ్వడం మరచిపోలేనన్నారు. ఇప్పటికీ 7 సినిమాలకు కథలు మరికొన్ని సినిమాలకు డైలాగులు రాసినట్లు వివరించారు. నాగార్జున సాగర్‌తో పాటు తాను ఇక్కడ నుంచి బాపట్లకు వెళ్లి సముద్ర సమీప రిసార్ట్‌లలో కూర్చోని కథలు, డైలాగులు రాసుకుంటానని రచయిత రత్నంబాబు చెప్పారు.