వెండితెరకు రక్షణ్‌ | VJ Rakshan To Make His Debut With Actor Dulquer Salmaan | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 10:19 AM | Last Updated on Thu, Mar 8 2018 10:19 AM

VJ Rakshan To Make His Debut With Actor Dulquer Salmaan - Sakshi

హీరో దుల్కర్‌ సల్మాన్‌తో రక్షణ్‌

తమిళసినిమా: బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్‌ అయిన చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా మరో బుల్లితెర నటుడు సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించే అవకాశాన్ని అందుకున్నారు. అతనే వీజే.రక్షణ్‌. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కావడం సంతోషంగా ఉందని బుల్లితెర నటుడు వీజే.రక్షన్‌ అంటున్నాడు. 

కాదల్‌ కణ్మణి, సోలో చిత్రాల తరువాత యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌. దేసింగ్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాన్సిస్‌ కన్నూక్కడన్‌ నిర్మిస్తున్నారు. వేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి వీజే.రక్షణ్‌ మాటాడుతూ నటనలో ఘనత సాధించాలన్నది తన చిరకాల కల అని చెప్పాడు. అందుకు ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. 

ఇది చాలా ఫ్రెష్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం అని, ఇలాంటి మంచి కథా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని, ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నానని అన్నారు. తొలి చిత్రంలోనే దుల్కర్‌ సల్మాన్‌ లాంటి హీరోతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని వర్థమాన నటుడు వీజే.రక్షన్‌ చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement