anchor
-
మహా కుంభమేళాను వదిలిపెట్టని యాంకర్ సుమ! అక్కడ కూడా.. (ఫోటోలు)
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
పెళ్లి రోజు కాలినడకన తిరుమలకు టాలీవుడ్ యాంకర్ లాస్య (ఫోటోలు)
-
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాలో యాంకర్ లాస్య ఫ్యామిలీ (ఫోటోలు)
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
రెడ్ డ్రెస్‌లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో చేసిన కామెంట్స్‌పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.అసలేం జరిగిందంటే..'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్‌ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిజామాబాద్‌లో నిర్వహించారు. 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. "I will file a case if you don't apologise for this comments" @MukhiSree https://t.co/VbhguoJwqI— Siri Vennela Goud Palle (@VennelaPalle) January 8, 2025 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
వెంకి మామతో ‘రాములమ్మ’ఫ్యామిలీ.. లంగా ఓణిలో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి (ఫోటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
ఇస్మార్ట్ జోడీ 3కి రంగం సిద్ధం: ఎవరెవరు పాల్గొంటున్నారంటే?
ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్‌తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. -
సుమ కనకాల తనయుడి కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
సోదరి పెళ్లిలో స్టెప్పులేసిన యాంకర్ రష్మి గౌతమ్ (ఫోటోలు)
-
జడలో మల్లెపూలు పెట్టి.. కళ్లు తిప్పుకోలేని అందంతో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
మెహందీ వేడుకలో యాంకర్ రష్మి.. ఫోటోలు వైరల్
-
ఇవి.. సహజసిద్ధ'మండి'!
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్ఫ్యూమ్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్లైన్లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
sravanthi_chokarapu: స్వర్ణగౌరి పూజ.. మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి (ఫోటోలు)
-
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం!
టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని.. చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.కాగా.. తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ నటించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్‌గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్, అంతకుమించి లాంటి చిత్రాలతో మెప్పించింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Sreemukhi: చిట్టిగౌనులో యాంకర్ శ్రీముఖి.. ఎలా ఉందో చూశారా?
-
Vishnupriya Bhimeneni: కనువిందు చేసే అందం విష్ణు ప్రియ సొంతం (ఫోటోలు)
-
స్టన్నింగ్ లుక్స్ లో మెరిసిపోతున్న శ్రీముఖి (ఫొటోలు)
-
చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్!
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహిళలకు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూనే..అవగాహన కలిగించే అంశాలను చెబుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి దిగ్గజ నటులపై ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ ఆమెను బ్యాన్ చేసింది. అయినా కూడా చిన్మయి తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ జాన్ చేసే వికృతాలను బయటపెట్టిన చిన్మయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీవీ షోలో ఓ యాంకర్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పిల్లల భవిష్యత్తుతో ఆటలా?ఓ టీవీ షోలో క ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్‌తో పాటు తల్లిదండ్రులు తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియక అయోమయోగానికి గురవుతాడు.టీవీల్లో ప్రసారం అయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అయితే చిన్మయి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందనే విషయం తెలియదుక కానీ.. గతంలో ఓ పిల్లల షోలో మాత్రం టాలీవుడ్‌కి చెందిన స్టార్ యాంకర్ అనసూయ ఓ పిల్లాడితో ఇలా లిప్ కిస్ చేయించుకుంది. అయితే ఆమెను ఉద్దేశించే చిన్మయి ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్!
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనసూయ ట్వీట్లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024 -
అనారోగ్యంతో ప్రముఖ యాంకర్ అపర్ణ మృతి
బనశంకరి: ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర కళాకారిణి అపర్ణ (58) గురువారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆమె శ్వాసకోశక్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యుత్ శ్మఽశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అపర్ణ భర్త నాగరాజ్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు సీనియర్ నటుడు దొడ్డణ్ణ, రమేశ్‌భట్, రాఘవేంద్రరాజ్‌కుమార్, సుధారాణి, సుందర్రాజ్, తారా అనురాధ, చంద్రు, గిరిధర్ లోకేశ్, దర్శకుడు నారాయణ్, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్‌జోషి, వాటాళ్ నాగరాజ్‌తో పాటు సాహితీవేత్తలు అపర్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి, సినీ నటులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్‌కు యాంకర్ సపోర్ట్
స్క్రీన్‌పై హీరోగా మెప్పించే దర్శన్ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్‌గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఒక్కసారి ఆ బంధంలో..ఈ కేసు విషయంలో అందరూ దర్శన్‌ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. ఆ గౌరవం అలాగే..జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టుకు దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా? -
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)
-
అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వేకేషన్ ట్రిప్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.అయితే తాజాగా ఓ టీవీ షో మెరిశారు అనసూయ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఏంటి నాన్సెన్స్ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్(బాధితురాలిగా) కార్డ్ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది. అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది. కాగా.. టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్ షర్ట్ విప్పుతూ కనిపించారు. దీనిపై నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ..'నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి. ఎలా ఉండే షో ఎలా అవుతుందో.. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి. కానీ బ్యాడ్ వైపు వెళ్తుంది. ఒక నటిగా మీరంటే ఇష్టమే..ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది' అని కామెంట్ చేశాడు. దీనిపై కూడా అనసూయ స్పందించింది. అనసూయ రిప్లై ఇస్తూ..'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.. పెద్ దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్‌బస్టర్ చేస్తారు.. అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్ ఇస్తారు. ఇది కేవలం ప్రోమో. స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది. అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్కే పరిమితం. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. Neeku nijangaa ardam kaatledaa andiElaa unde show elaa aithunnaai andulo mee paatra good lo undaali gaani bad ki velthundi andiWe really love you as a actor but ilaanti programs lo alaantivi cheyyakunte me better andi— Santosh (@Santosh54493715) June 23, 2024As someone belonging to the entertainment industry we explore certain things with the changing times and tastes of the audiences.. aina mee pratapam anta chinna tera ke parimitama andi.. pedda tera meeda yenno abhyantaramainavi ostunna meeru blockbusters chestaru.. also show anta…— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 23, 2024 -
నీలం దుస్తుల్లో మెరిసిపోతున్న యాంకర్ రష్మి గౌతమ్ (ఫొటోలు)
-
సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్ వర్తించవా?
సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.అలాంటి లిస్ట్‌లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ను రీల్స్‌కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
నన్ను పట్టించుకోలేదు.. అవమానంతో కుంగిపోయా.. రోజూ ఏడ్చేదాన్ని!
కొంతమంది క్రికెట్ విశ్లేషకుల వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానంటోంది నటి, యాంకర్ మందిర బేడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2003 వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ ఎక్స్‌పర్ట్‌తో కలిసి పని చేశాను. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే వారి ప్యానెల్లో అమ్మాయిలు ఉండేవారే కాదు. కొత్తగా ఒక అమ్మాయి వస్తుందంటే కూడా వాళ్లేమీ ఎగ్జయిట్ అవలేదు.నాకంత అవగాహన లేదునేను అడిగే ప్రశ్నలను కొన్నిసార్లు పట్టించుకునేవారే కాదు. క్రికెట్‌పై వారికున్నంత అవగాహన నాకు ఉండేది కాదు. నేను కాస్త పిచ్చి ప్రశ్నలడిగేదాన్ని. చాలామంది క్రికెట్ ప్రియులకు కూడా ఇలాంటి ప్రశ్నలే వారి బుర్రకు తట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవి అడగడంలో తప్పేముందని అనుకునేదాన్ని. నా మనసుకు ఏది అడగాలనిపిస్తే అది మొహమాటం లేకుండా అడిగేదాన్ని. కొన్నిసార్లు లైవ్‌లోనే వాళ్లు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు కాదు. పట్టించుకోనట్లు ఉండేవారు. అవమానంతో తల దించుకున్నా..షో అయిపోయాక అవమాన భారంతో తల దించుకుని ఏడ్చేదాన్ని. అసలు ఏం చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనేది ఎవరూ చెప్పలేదు, ఒక్కరూ సపోర్ట్‌గా నిలబడలేదు. వారం రోజులు భయపడుతూనే హోస్టింగ్ చేశాను. మధ్యమధ్యలో తడబడేదాన్ని. నాతో పాటు ఉండే మేల్ హోస్ట్ చక్కగా వారితో కలిసిపోయేవాడు. ఒక వారం తర్వాత ఛానల్ నిర్వాహకుల నుంచి పిలుపొచ్చింది. నన్ను తీసేస్తారేమో అనుకున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేవాళ్లేమో షో అంతా బోరింగ్‌గా ఉంది.. కాస్త జోష్ తీసుకురా అని చెప్పారు. అప్పుడు నేను నా విధానాన్ని మార్చుకున్నాను. భయాన్ని వదిలేశాను. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాలని గట్టిగా అడిగేదాన్ని. వారం రోజుల నరకం తర్వాత నేను మామూలయ్యాను. అందరితోనూ సరదాగా కలిసిపోయాను. ఒకసారి టైగర్ పఠౌడీ స్టూడియోకు వచ్చినప్పుడు.. అందరూ మాట్లాడుకుంటున్న మందిరా బేడి మీరే కదా అని అడిగాడు' అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. సినిమాల్లోనూ..కాగా మందిరా బేడి ఛాంపియన్స్ ట్రోఫీ (2004 & 2006)తో పాటు ఐపీఎల్ రెండో సీజన్‌కు, 2007 వరల్డ్ కప్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మందిర బేడీ.. యాంకర్‌గా, నటిగా ఫేమస్. ఈమె మన్మథ మూవీలో సైకియాట్రిస్ట్‌గా, సాహోలో కల్కిగా నటించింది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె స్మోక్, రోమిల్ అండ్ జుగల్, ఖుబూల్ హై 2, సిక్స్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ -
సోషల్ మీడియాలో ట్రోల్స్.. బెదిరింపు కాల్స్.. యాంకర్ శ్యామల ఆవేదన!
తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోనని వెల్లడించారు.అయితే ఎవరినీ కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఎవరి అభిమానం వారిదని.. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తనవంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు వైఎస్సార్సీపీ అప్పగించిన పనిని నిర్వర్తించానని శ్యామల పేర్కొన్నారు. -
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
-
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది. -
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్‌లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.రష్మి గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 -
టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
-
సీఎం జగన్ పై దాడి.. ఈనాడు తప్పుడు వార్త.. యాంకర్ హరి కౌంటర్
-
న్యూ ఇయర్ వేడుకల్లో యాంకర్ సుమ ఫ్యామిలీ!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ, తమిళ న్యూ ఇయర్‌గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యాంకర్ సుమ కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) -
Sreemukhi: అందాల బొమ్మ.. రాములమ్మ!
-
ముద్దుగుమ్మ శ్రీముఖి ఉగాది ముస్తాబు (ఫోటోలు)
-
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్‌లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Rashmi Gautam HD Photos: అలాంటి వ్యక్తితోనే నా పెళ్లి.. యాంకర్ రష్మి (ఫోటోలు)
-
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: ‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. రెండ్రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్‌లో తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్‌కు ఓ గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్‌లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్(ఎదురుగా స్క్రీన్ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్‌లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు అన్నారు. -
Anchor Anasuya: ట్రెండీ లుక్‌లో అనసూయ.. చూపు తిప్పుకోలేరు (ఫోటోలు)
-
మాటల మూట, 'హాఫ్ సెంచరీ' కొట్టేసింది (ఫొటోలు)
-
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
HYD: టీవీ ఛానల్ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్‌కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్‌లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్‌పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
జనసైనికులను నట్టేట ముంచుతున్న పవన్
-
మీ "కమ్మ” కళ్ళకు అవి కనబడవా
-
తల్లి వర్ధంతి.. యాంకర్ విష్ణుప్రియకు డైమండ్ గిఫ్ట్!
యూట్యూబ్ నుంచి వచ్చి బుల్లితెర సెలబ్రిటీగా మారింది యాంకర్ విష్ణుప్రియ. యాంకర్‌గా, నటిగా అలరించిన బ్యూటీ ఈ మధ్య షోలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ మానస్‌తో కలిసి జరీ జరీ పంచెకట్టి అనే ప్రైవేట్ సాంగ్‌లో ఆడిపాడింది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన ఈ పాట ఏకంగా 61 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. సిల్వర్ స్క్రీన్‌పై హవా తగ్గించేసిన ఈ బ్యూటీ తరచూ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు చెక్కేస్తోంది. చెల్లి గిఫ్ట్.. అక్క ఫుల్ ఖుషీ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడూ యూట్యూబ్‌లోనూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది. తాజాగా తనకు చెల్లి డైమండ్ నగలు బహుమతిగా ఇచ్చిందోచ్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఒకరోజు నేను నా చెల్లి పావనిని ఇంటినుంచి తరిమేశాను. ఆమె ఈ రోజు ఏ స్థాయికి ఎదిగిందంటే తన సొంతకారులో ఏఎమ్బీకి తీసుకెళ్లి వజ్రాభరణాలు కొనిచ్చింది. అమ్మ మొదటి వర్ధంతి.. తను కష్టజీవి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నప్పటినుంచి తనకు నేను ఎటువంటి లగ్జరీలు ఇవ్వలేదు. తను మాత్రం నాకు ఈ రోజు డైమండ్ కొనిచ్చింది. ఇక్కడో విషయం చెప్పాలి. గతేడాది జనవరి 26న అమ్మ చనిపోయింది. అమ్మ వర్ధంతికి ఒకరోజు ముందు తన రూపంలో ఈ గిఫ్ట్స్ నాకు వచ్చాయనుకుంటాను' అని చెప్తూ సంతోషపడిపోయింది. చదవండి: 12 ఏళ్ల కష్టం.. పొలం పని చేసుకుందాం, వెళ్లిపోదామన్నా.. -
బిగ్‌బాస్‌కి ఎంపిక చేయిస్తామని మోసం
హైదరాబాద్: తనను బిగ్ బాస్–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా టాలీవుడ్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్ ఇన్చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Anchor Swapna Chowdary: బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు -
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్‌తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్‌తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
యాంకర్ సుమ గొప్ప మనసు.. వారి కోసం ఆర్థిక సాయం!
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే సుమ యాంకరింగ్‌తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57 — Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023 -
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తనదైన నటనతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రంగమ్మత్త తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలోని ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. రామాయణంలోని యుద్ధకాండలో మహిళ గురించి శ్రీరాముడు చెప్పిన వాక్యాన్ని ట్వీట్లో ప్రస్తావించింది. 'ఇల్లు, దుస్తులు, ఇంటి గోడలు, తలుపులతో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. 😌 pic.twitter.com/P4s2t9jFBS — Anasuya Bharadwaj (@anusuyakhasba) December 19, 2023 -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
నా సపోర్ట్ ఆ పార్టీకే : జ్యోతక్క క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలంగాణ యాంకర్ శివజ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె బీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేస్తోందో వివరించింది. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనకు నచ్చినది చెప్తున్నానని క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్కు మద్దతివ్వడాన్ని ఆమె అంశాల వారిగా వివరిస్తూ సమర్థించుకున్నారు. నువ్వెందుకు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నావని తిడుతున్న వారి కోసమే వీడియో పెడుతున్నానని తెలిపింది. ‘సర్కార్‌తో హ్యాపీగా ఉన్నామని దేశంలో తెలంగాణ రైతులు మాత్రమే చెబుతున్నారు. కరెంటు లేకపోతే అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండె. అప్పులు కట్టలేనన్న రైతుల ఇండ్ల తలుపులు పీక్కుపోయిన ఘటనలున్నాయి. కరెంటే లేకపోతే ఫోన్ల చార్జింగ్‌లు ఎట్ల పెట్టుకునేటోళ్లం. యూ ట్యూబ్‌ల వీడియోలు ఇట్ల చూస్తుంటిమా. కళ్యాణలక్ష్మి ఇచ్చిందెవరు కేసీఆర్ సార్ కాదా. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య ఎప్పుడు పరిష్కారమైంది. ఎవరు పరిష్కారం చేశారు’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘పెద్దకొడుకు లెక్కముసలోల్లకు రూ.2016 పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ సార్ కాదా. ఉద్యోగాలివ్వాలని అడిగితే పెన్షన్ల గురించి ఎందుకు చెబుతున్నావని కొందరు అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలు రావు కదా. ఉద్యోగాలు రాని వాళ్ల తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి. మార్పు రావాలి అని అంటున్న వాళ్లతో 60 ఏళ్లు వెనక్కి పోతాం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుక్కుంటున్నరు. ముఖ్యమంత్రి పదవి కోసం కాదా వాళ్ల తాపత్రయం. వాళ్ల మోసాన్ని గమనించకుండా ఉద్యోగాల కోసం మార్పు కావాలనుకుంటే కరక్టేనా. దేశంలో అన్ని స్టేట్లలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ సర్కారు కాదా’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘కేసీఆర్ సారు రాజకీయాల్లో ఉన్నంత కాలం సారే సీఎం కావాలి. సార్ ఒక్క హ్యాట్రిక్ కాదు ఎన్నో హ్యాట్రిక్‌లు కొట్టాలి. మేమే ఇచ్చినం కదా అనేటోళ్లు ఎప్పుడిచ్చిండడ్రో ఆలోచించుకోవాలి. స్వాతంత్రం ఇచ్చిన బ్రిటీష్ వాళ్లు గొప్పోళ్లా సాధించుకున్న మనం గొప్పోళ్లమా. సార్ ఒక్క ఛాన్స్ కావాలని అడగలే సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినందుకు, అభివృద్ధి చేసినందుకే నేను బీఆర్ఎస్ పార్టీ సైడున్న. నెగెటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్ చేసినా సరే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని కోరతాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని జ్యోతక్క కోరారు. ఇదీచదవండి..మనమేమన్నా గొర్రెలమా..కాదని 30న చెప్పాలె -
మళ్లీ టంగ్ స్లిప్ అయిన సుమ.. ఈసారి అలా దొరికిపోయిందిగా!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా సుమ వ్యవహరించారు. తన మాటలు, కామెడీ ఆడియన్స్‌లో జోరు తెప్పించే యాంకర్ సుమ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే స్టేజీపై చాలా సందర్భాల్లో సుమ టంగ్ స్లిప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి యాంకర్ సుమ ఎలా దొరికిపోయిందో మీరు చూసేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై ఉన్న రష్మికకు సుమ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలోని ఓ సాంగ్‌ను పాడాలని కోరింది. అయితే మహేశ్, రష్మిక జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలోని 'అబ్బబ్బా అబ్బాయి ఎంత ముద్దుగున్నాడే'.. అనే సాంగ్‌లో 'హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్.. హీజ్ సో హ్యాండ్సమ్' అంటూ రష్మిక డ్యూయేట్ పాడుతుంది. ఈ సాంగ్ అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే యాంకర్ సుమ మాత్రం సర్కారు వారిపాటలోని ఈ పాటను పాడమంటూ రష్మికను అడిగింది. అయితే దీనిపై నెటిజన్స్ సుమక్కను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాట సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనిది కావడంతో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే హడావుడిలో సరిలేరు నీకెవ్వరు బదులుగా సర్కారు వారి పాట అనేసి దొరికిపోయింది. ఇటీవలే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ బి ఇంటర్వ్యూలో సుమకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రక్షిత్ శెట్టి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రశ్నలు వేసి దొరికిపోయింది సుమ. అయితే పెద్ద ఈవెంట్ కావడంతో అలా పొరపాటుగా అనేసి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
21 ఏళ్లకే విడాకులు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: నటి
పైకి నవ్వుతూ ఉన్నంతమాత్రాన వారి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నట్లు కాదు. కొందరు అంతులేని విషాదాన్ని, దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుని బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుగురినీ నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. తమిళ యాంకర్, నటి స్వర్ణమాల్య కూడా అదే కోవలోకి వస్తుంది. యుక్త వయసులోనే ఎన్నో కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. 21 ఏళ్లకే విడాకులు.. కారణం తెలీదు 'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్ ఇన్నొవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్‌స్టైల్ నాకు వంటపట్టలేదేమో! డిప్రెషన్, చచ్చిపోదామనుకున్నాను ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పుకొచ్చింది. కాగా యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్వర్ణమాల్య తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది. నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్.. ఎంతైనా ఆమె మనసు బంగారం! -
పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
ఆమె మాట్లాడితే థౌజండ్‌వాలా టపాసులు పేలినట్లు ఉంటాయి. అంత పెద్ద గొంతు మాత్రమే కాదు, అంతటి హుషారు, ఉత్సాహం కూడా ఆమె మాటల్లో ధ్వనిస్తుంటుంది. ఆ లేడీ యాంకరే శ్రీముఖి. నిజామాబాద్ ముద్దుబిడ్డ అయిన శ్రీముఖి బుల్లితెరపై టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. ఆ మధ్య బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. ఇప్పటికీ స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతున్న ఆమె దీపావళి పండగను నిజామాబాద్‌లో కొత్తింట్లో తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. వాళ్లకు స్వీట్లు.. వీరికి బంగారు బహుమతులు ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ పూజకు వచ్చిన అతిథులంందరికీ స్వీట్లు పంచారు. ఆ తర్వాత పేరెంట్స్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. తండ్రి రామకృష్ణకు బంగారు చైన్ బహుమతిగా ఇవ్వగా తల్లి లతకు వజ్రాల ఆభరణాన్ని అందించింది. ఇది చూసి శ్రీముఖి తల్లి ఒక్కసారిగా షాకైంది. డైమండ్ నెక్లెస్.. చాలా బాగుంది అని మురిసిపోయింది. ఇలా వారికి ఊహించని బహుమతులిచ్చి పండక్కి తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది శ్రీముఖి. జీవితాన్ని ప్రసాదించింది వీళ్లే 'ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం. ఒకే గదిలో ఉంతా ఉండేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈ రోజు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండగను జరుపుకోగలుగుతున్నామంటే అందుకు నా పేరెంట్సే కారణం. మాకు ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు వారికి మా తరపున ఈ చిన్న బహుమతి ఇచ్చాం అంటూ వారి కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్. ఇది చూసిన జనాలు ఎంతైనా శ్రీముఖి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 19 ఏళ్లకే పెళ్లి.. ఫేక్ స్మైల్.. రెండో పెళ్లి గురించి విమర్శలు.. ఎన్నో బాధలు.. ఎంతో ఏడ్చా: సింగర్ సునీత -
Anchor Suma Diwali Celebrations: యాంకర్ సుమ ఇంట్లో దీపావళి వేడుక (ఫొటోలు)
-
భర్తకు స్పెషల్‌గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టింది కేరళ అయినా.. తెలుగబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాక్షంలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు లేకుండా నా వృత్తిని కొనసాగించడం కష్టం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. లవ్ యూ రాజీవ్.' అంటూ లవ్ సింబల్ ఎమోజీలను పంచుకుంది. ఇది చూసిన ఆడియన్స్ సైతం రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
అందువల్లే హీరోయిన్ ఛాన్స్ రాలేదు: అనసూయ
యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తోన్న నటి అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన అనసూయ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!) అనసూయ మాట్లాడుతూ.. 'అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అయితే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని తెలిసి నేను చేయనని చెప్పా. ఎందుకంటే గుంపులో నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. నేను నో చెప్పడం తప్పు కాదు.. నా పద్ధతి సరైంది కాదేమో అని నాకనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని అందుకే కొంచెం కఠినంగా చెప్పేశా. అప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్ జరిగింది. అందుకే త్రివిక్రమ్‌కు సారీ చెప్పా' అని అన్నారు. హీరోయిన్ ఛాన్స్ రాకపోవడంపై స్పందిస్తూ..'షూటింగ్స్‌లో నా పని అయిపోగానే వెళ్లిపోతా. సినిమా అయ్యాక పార్టీలకు దూరం. అందువల్లే హీరోయిన్ ఛాన్సులు కోల్పోయా. అలా అయితేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. నాకే ప్రాధాన్యత ఉండాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్తా మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నటనతో గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగింది.'అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Anchor Rampalli Manjusha: లేటెస్ట్ ఫోటోలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న యాంకర్ మంజూష (ఫొటోలు)
-
కొత్తింట్లో చేరిన బిగ్ బాస్ శివజ్యోతి.. వీడియో చూశారా?
తీన్మార్ వార్తలతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలంగాణ ముద్దుబిడ్డ శివజ్యోతి. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని అందరి దృష్టని ఆకర్షించింది. వెంటితెరపై యాంకర్‌గానే పరిచయమైన శివజ్యోతి.. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మరింత ఫేమస్ అయింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: తన ఇంటిని చూపించిన శివజ్యోతి.. ఆ బాధతో కంటతడి!) అయితే ప్రస్తుతం తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన చెందిన శివజ్యోతి.. గంగూలీ అలియాస్ గంగులుని ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని గతంలో ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తాజాగా తన ఛానెల్ ద్వారా గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీడియో చూస్తే గేటేడ్ కమ్యూనిటీలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో శివజ్యోతి ఫ్రెండ్స్, బుల్లితెర నటీనటులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివజ్యోతి, గంగూలీ దంపతులు అతిథులందరికీ అద్భుతమైన వంటకాలతో స్వాగతం పలికారు. అయితే గతంలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసిన శివజ్యోతి కొన్ని రోజులకే అమ్మేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!) -
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
నంద్యాలలో జీవీ మాల్ ప్రారంభించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
నా కెరీర్ ఖతమన్నారు, మౌనంగా భరించాను, తిరిగొస్తున్నా: మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు 2017లో వచ్చింది. తర్వాత వచ్చిన సినిమాల్లో అతిథిగా మెరిశాడే తప్ప హీరోగా ఒక్క మూవీలోనూ కనిపించలేదు. దీంతో ఆయన పనైపోయింది, సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి సినిమా ప్రకటించాడు. కానీ, ఆ మూవీ గురించి తర్వాత ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇటీవలే గుడ్‌న్యూస్.. అంటూ వాట్ ద ఫిష్ అనే సినిమా ప్రకటించాడు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్‌లైన్. సేమ్ టు సేమ్.. ఈ సినిమా గురించి కూడా మళ్లీ ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. ఈ తరుణంలో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు మనోజ్.. ఓ ఓటీటీ కోసం ర్యాంప్ ఆడిద్దాం అనే షో చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు. 'నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్‌గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు.. ఇలా ఓ పండగలా జరిగిన నా లైఫ్‌లోకి సడన్‌గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడన్నారు, కెరీర్ ఖతమన్నారు, యాక్టింగ్ ఆపేశాడు.. ఇంక తిరిగి రాడన్నారు.. ఎనర్జీ స్టార్‌లో ఎనర్జీ తగ్గిందన్నారు.. విన్నాను, చూశాను, మౌనంగా భరించాను.. తిరిగిస్తున్నాను' అని ఈ ప్రోమోలో చెప్పుకొచ్చాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. Priyamiyna abhimanula kosam, Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki… YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!https://t.co/PPfTs4grcQ#RampAddidham #RockingStar #ComingSoon #ETVWin #PeopleMediaFactory@peoplemediafcy @etvwin @vishwaprasadtg… pic.twitter.com/4qBwN8nejB — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 22, 2023 చదవండి: మార్క్ ఆంటోని సక్సెస్.. 11 ఏళ్ల పోరాటం తర్వాత విశాల్‌కు సక్సెస్ -
పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లు, షోలపై నిషేధం విధించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. తమపై విషం చిమ్ముతున్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించింది. #WATCH | "There are some anchors who conduct provocative debates. We'll make a list of them and INDIA alliance partners will stop going to their shows.": AAP Rajya Sabha MP Raghav Chadha after meeting of INDIA alliance coordination committee.#AamAadmiParty #RaghavChadha… pic.twitter.com/GlGz2wEqXK — Free Press Journal (@fpjindia) September 13, 2023 నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయి ఎన్నికల ప్రచారం, సీట్ల షేరింగ్‌పై చర్చించారు. అక్టోబర్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. పైగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఛానళ్లను, షోలను, యాంకర్లను ఇకపై నిషేధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. BIG BREAKING: The INDIA alliance has prepared the list of TV anchors who propagate hatred. Next week the list will be published by all the opposition parties. -Aman Chopra -Amish Devgan -Arnab Goswami -Sushant Sinha -Chitra Tripathi -Deepak Chaurasia -Rubika Liyaquat These… — Amock (@Politics_2022_) September 13, 2023 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో కొన్ని మీడియా ఛానళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు వ్యతిరేకమైన అంశాలనే ప్రచారం చేసినట్లు తెలిపింది. జోడో యాత్రపై సోషల్ మీడియాలో విశేష స్పందన లభించినప్పటికీ ప్రధాన మీడియా పక్కకు పెట్టినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు. 'కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లు భారత్ జోడో యాత్రను నిషేధించారు. లక్షల మంది పాల్గొన్నప్పటికీ తగినంత ప్రచారం కల్పించలేదు. పైగా వ్యతిరేకమైన వార్తలనే ప్రచారం చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. 2019 మేలోనూ కొన్ని మీడియా ఛానళ్లపై కాంగ్రెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లకు కాంగ్రెస్ తమ ప్రతినిధులను పంపకూడదని సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అప్పట్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన -
యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సల్మా సుల్తానా మాయమయ్యాక.. కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్లో యాంకర్‌గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు. సల్మా తండ్రి మరణించాక.. సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో.. సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్‌ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు. ఒకరోజు తాగిన మత్తులో.. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్‌కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ.. కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు. అస్థిపంజరం కోసం తవ్వకాలు నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది: అనసూయ ట్వీట్ వైరల్!
బుల్లితెర యాంకర్ నుంచి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఓ వీడియో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అందులో బోరున విలపిస్తూ కనిపించింది. దీంతో అనసూయకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరా తీశారు. తీరా సోషల్ మీడియా నెగెటివిటీ గురించే అని అంతా అనుకున్నారు. కానీ మరో వీడియో షేర్ చేసిన అనసూయ.. మీరేంటి ఇలా అర్థం చేసుకున్నారా? అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో ఏడ్చింది నేను ఓ తీసుకున్న నిర్ణయం వల్లే కానీ.. సోషల్ మీడియా నెగెటివిటీపై ఏ మాత్రం కాదని అనసూయ వెల్లడించింది. అయితే తాజాగా మరో ట్వీట్ చేసిన అనసూయ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి ముఖ్యంగా హేటర్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్లో ప్రస్తావించింది. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అనసూయ ట్వీట్లో రాస్తూ..' మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటివ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వాళ్లమని ఫీలవుతుంటారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రం తట్టుకోలేరు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా నా జీవితంలో ముందుకెళ్తా. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే.. నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా ట్రీట్ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.' అంటూ ట్వీట్లో ప్రస్తావించింది. ఆ తర్వాత కూడా వరుస ట్వీట్స్ చేసింది. 'ఏది ఏమైనా ఇప్పటికే నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం. శక్తి' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత మరో ట్వీట్లో.. 'ఐ యామ్ సారీ.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్‌మీడియాలో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్ పొందడం కోసం కాదా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. #RiseAndShine ☀️ pic.twitter.com/osOFG9bmiu — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 20, 2023 Anyway.. I don’t want to indulge in these misunderstood immature responses .. just wanted to convey something right.. as it was misunderstood.. I clarified.. Hope you all have a good weekend .. much love always ❤️🤗 PS: Don’t blindly believe what ever you see.. please clarify 🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2023 Also enti meeru attention attention ani papam.. manam ee platforms lo unnade attention kosam.. who are we kidding.. atleast I am transparent enough to agree.. meerenduku musugulo guddulaatalu?? Ofcourse I need attention on everything I want to convey.. 😄 — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2023 -
వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా?
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ భరద్వాజ్ గుక్కపెట్టి ఏడ్చింది. తన బాధనంతా కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పైకి స్ట్రాంగ్ లేడీగా కనిపించే అనసూయ మనసులో ఇంత బాధ ఉందా? అసలేం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తోంది? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల క్రితంది అని పేర్కొంది అనసూయ. ఆ సమయంలో తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు పేర్కొంది. సోషల్ మీడియా ఉన్నది దేనికి? అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో 'హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్ చేసుకునేందుకే సోషల్ మీడియా ఉంది. ఆశ్చర్యమేంటంటే.. నిజంగా అదే జరుగుతోందా? సంతోషాన్ని షేర్ చేసుకున్నా.. ఇప్పుడు బాధను.. ఈ పోస్ట్ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్ ఇచ్చినా.. ఏం చేసినా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్‌లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకున్నాను. స్ట్రాంగ్‌గా ఉందామనుకున్నా.. కానీ.. మానవ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఒక సెలబ్రిటీగా నేను ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఏవీ పట్టించుకోనక్కర్లేదని భావించాను. వీలైనంతవరకు స్ట్రాంగ్‌గా ఉండాలనే ప్రయత్నించాను. అలా ఉండటమే అసలైన బలం అనుకున్నాను, కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నా బాధను వ్యక్తపరచడమే నా అసలైన బలం. నా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లనిచ్చి తిరిగి చిరునవ్వుతో లేచి నిలబడతాను. ప్రతిదానికీ సర్దుకుపోవడం అంత ఈజీ కాదు. దయచేసి అలా చేయొద్దు అందరినీ నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి సహృదయంతో మెదలండి. అవతలివాళ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి వారిని ఇంకా బాధించవద్దు. కాస్త ఆలోచించండి. ఈ వీడియో ఐదు రోజుల క్రితానిది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను' అని అనసూయ రాసుకొచ్చింది. కాగా అనసూయ ఇటీవల తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే తను చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: దెబ్బేసిన భోళా.. ఆగస్టు 22 కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్! ఎనీ సర్ప్రైజ్..