
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.
అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్‌నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment