Panjagutta police
-
అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, బెంగళూరుతో ముడిపడ్డ భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పంజాగుట్ట పోలీసులు చేధించారు. పెద్ద ఎత్తున 4.75 గ్రాముల 10 ఎక్స్టెసీ మాత్రలు, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనా చెందిన సయీద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడితో పాటు దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్‌లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు సయూద్ విక్రయిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలలో ఉంటూ దేశవ్యాప్తంగా 14 మంది స్మగర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇందులో ఏడుగురు నైజీరియన్లు ఉన్నట్లు నిందితులు వెల్లడించారు. హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు నిందితుల నుంచి పోలీసులు రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందర్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
డ్రగ్ కేసు: టోనీ ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ టోనీ అయిదు రోజుల కస్టడీ బుధవారంతో ముగియనుంది. డ్రగ్ కేసులో నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో‚ డ్రగ్స్ కేసులో మరో ఎనిమిదిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టోనికి వ్యాపార వేత్తలకు ఏజెంట్లుగా పనిచేసిన10 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వివిధ రంగాలకు చెందిన పలువురిని పోలీసులు గుర్తించారు. అయితే టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్ ఫోర్స్ బృందాలు అతని కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్సైట్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా పరీశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ ట్రాన్సెక్షన్స్ పరిశీలించిన పోలీసులు.. టోనీని మరోసారి కస్టడీలోకి కోరే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో టోనీ అనుచరుడు అఫ్తాబ్. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో టోనీ డ్రగ్స్ లావాదేవీలను అఫ్తాబ్ పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని ఖాతాలో రోజుల వ్యవధిలోనే రూ.కోట్లలో లావాదేవీలు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అఫ్తాబ్ ఖాతాల్లో డబ్బులు పంపినవారి వివరాలను సేకరిస్తున్నారు . అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి.. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ వ్యాపారి టోనీకి కస్టమర్లుగా ఉన్న తొమ్మిది మంది వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం కొట్టివేసింది. డ్రగ్స్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున టోనీ అతని కస్టమర్లు నిరంజన్ కుమార్ జైన్, సశ్వత్ జైన్, యజ్ఞనాద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినీడి సాగర్, అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి పంపేందుకు హైకోర్టు నిరాకరించింది. చదవండి: హైదరాబాద్ టు ఢిల్లీ ‘వందేభారత్’.. పింక్ బుక్‌లో ఏముందో.. -
అమీర్‌పేట బస్టాండ్ వద్ద పోకిరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకా పోలీసులపై దాడికి యత్నించిన పోకిరీని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువతి బంజారాహిల్స్‌లోని తన సోదరుని ఇంటికి ఈ నెల 3న వచ్చింది. శనివారం రాత్రి తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లేందుకు అమీర్‌పేట బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించగా నా పేరు మహేష్ నాతో రావాలంటూ ఆమెపై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహేష్‌ని నిలువరించే ప్రయత్నం చేయగా వారిపై తిరగబడి దాడికి యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
శ్రావణి కేసు: నిర్మాత అశోక్‌రెడ్డి లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, అశోక్‌రెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అన్న సంగతి తెలిసిందే. (చదవండి: శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!) -
వారికి సంబంధం లేదు!
పంజగుట్ట: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన బాధితురాలే తనను బెదిరించి ఆ కేసులు పెట్టించారని, 139 మందిలో చాలామందికి ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఓ ప్రముఖ టీవీ యాంకర్, ఓ సినీ హీరో కూడా అత్యాచారం చేశారని గతంలో చెప్పిన ఆమె.. వారికి ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంచేసింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడింది. రాజారెడ్డి అలియాస్ డాలర్‌భాయ్.. తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడంతో పాటు అత్యాచారం చేసి ఈ కేసుతో సంబంధం లేని వారి పేర్లు రాయించాడని చెప్పింది. వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించాడని, అతడిపై కూడా త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. కర్ణునికి కవచకుండలం ఎంత ముఖ్యమో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ అంతే ముఖ్యమన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కేసులు దుర్వినియోగం కావడం బాధాకరమన్నారు. ఓ గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేశారనగానే తాను స్పందించకపోవడం పట్ల పలువురు విమర్శలు కూడా చేశారని, బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించడం కోసమే ఈ జాప్యం జరిగిందని తెలిపారు. ఆమెను విచారించగా, 139 మందిలో దాదాపు 30 శాతం మంది పదేళ్లలో అత్యాచారం చేశారని, మరికొందరు మానసికంగా వేధించారని చెప్పినట్టు వివరించారు. టీవీ, సినీ రంగానికి చెందిన వారికి కేసుతో సంబంధం లేదని, మాజీ ఎంపీ పీఏ మానసికంగా వేధించినట్లు మాత్రమే తెలుసుకున్నామన్నారు. అసలు బాధితురాలు ఇలా కావడానికి ముఖ్య కారణం విద్యార్థి సంఘం నాయకుడని.. అతన్ని, ఆశ్రయం కల్పించినట్లు నటించి మోసం చేసిన డాలర్ భాయ్‌ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మహిళాసంఘాల నాయకులు సంధ్య, సజయ, విమలక్క, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు. -
హీరోయిన్ను ముంబై రమ్మన్న అజ్ఞాత వ్యక్తి!
సాక్షి, హైదరాబాద్: ఓ అజ్ఞాత వ్యక్తి మాయ మాటలకు ‘రాహు’ సినిమా హీరోయిన్ కృతి గార్గ్ మోసపోయినట్టు తెలిసింది. ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేయాలని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి ఆమెను నమ్మించాడట. స్టోరీ వినడానికి ముంబైకి రమ్మని కృతిని ఆహ్వానించాడట. దాంతో అతని మాటలు నమ్మి ఆమె ముంబై బయలుదేరి వెళ్లారని.. అయితే, ముంబై వెళ్లిన కృతి ఫోన్ నెంబర్ సోమవారం ఉదయం నుంచి కలవడం లేదని ‘రాహు’ దర్శకుడు సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘రాహు’ మూవీ రివ్యూ) -
ఖాకీ నిర్లక్ష్యం ప్రాణం తీసింది!
పంజగుట్ట: జరగరానిది జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీసుస్టేషన్ వద్ద మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి, బుధవారం ఉస్మా నియా ఆస్పత్రిలో మృతిచెందిన లోకేశ్వరి ఉదంతమే దీనికి నిదర్శనం. చెన్నైకి చెందిన లోకేశ్వరి (37) శ్రీనివాస్‌ను 2000లో వివాహం చేసుకుంది. కుమార్తె పుట్టిన తర్వాత వీళ్లు విడిపోయారు. లోకేశ్వరికి 2012లో మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగరంలోని వారసిగూడకు చెందిన ఎస్.ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. 2013లో ఆమెను నగరానికి తీసుకువచ్చిన ప్రవీణ్ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అప్పట్లో సోమాజిగూడలో నగల దుకాణం నిర్వహించారు. మనస్పర్థలు రావ డంతో లోకేశ్వరిపై ప్రవీణ్ 2014లో పంజగుట్ట పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదు చేయించాడు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఆమె.. కుమార్తెను తీసుకుని చెన్నై వెళ్లిపోయింది. కేసు నమోదు చేయని పోలీసులు... ప్రవీణ్ తనకు రూ.7.5 లక్షలు ఇవ్వాలని లోకేశ్వరి చెబుతోంది. అతనికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడు కన్నన్‌తో శుక్రవారం ఇక్కడికి వచ్చింది. ప్రవీణ్ కోసం వెతికినా దొరక్కపోవడం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడం తో శుక్రవారమే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించిన పోలీసులు అతడి మాటలు నమ్మి కేసు నమోదు చేసేది లేదంటూ లోకేశ్వరితో చెప్పేశారు. దీంతో ఏసీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ఆమె ఆ పేరుతో ఫిర్యాదును సిద్ధం చేయించి మంగళవారం పంజగుట్ట ఠాణా వద్దకు వచ్చింది. 2 లీటర్ల పెట్రోల్‌ను తన వెంట తెచ్చుకుంది. ప్రవీణ్ మోసం.. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందిన లోకేశ్వరి ఠాణా ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 70 శాతం కాలిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు వెంట ఉన్న కన్నన్ను మంగళవారమే అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ పేరుతో లోకేశ్వరి సిద్ధం చేసిన లేఖను మాయం చేశారు. బుధవారం లోకేశ్వరి మృతిచెందడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె వస్తువుల్ని కన్నన్‌కు అప్పగించి రహస్యంగా చెన్నైకు పంపించేశారు. బుధవారం ప్రవీణ్‌పై చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతూ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించాం: తిరుపతన్న, పంజగుట్ట ఏసీపీ ‘2014లో లోకేశ్వరిపై నమోదైన కేసు అదే ఏడాది లోక్ అదాలత్‌లో రాజీ అయింది. తాజాగా లోకే శ్వరి శుక్రవారం పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై.. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించారు. లోకేశ్వరి ఆరోపణల్ని ఖండించిన ప్రవీణ్.. తాను బెంగళూరులో ఉన్నానని, 2 వారాల్లో వస్తానని చెప్పాడు. ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆమె కుటుంబం మృతదేహాన్ని చెన్నై తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేదని తెలిసింది. -
శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి.. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. (చదవండి : అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య) ఆ వ్యక్తితో సురేష్‌కు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సురేష్ కాల్‌డేటా, హత్యకు ముందు వాసవినగర్ కాలనీలో లభించిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సురేష్ తలకు గాయమైనట్లు ప్రైమరీ మెడికల్ హెల్త్ రిపోర్ట్‌లో తేలిందన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్ వస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. -
అనుమానమే అవమానమనుకుంది
హైదరాబాద్: ప్రియుడు అనుమానించడం అవమానంగా భావించి టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా సూర్యతేజ మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో అతనికి తెలిసిన వారికి పోలీసులు ఫోన్‌చేసి విచారణకు హాజరుకమ్మని చెప్పారు. దీంతో అతడు శనివారం రాత్రి పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చారు. సూర్యతేజను పూర్తిగా విచారించిన అనంతరం అనుమానమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఝాన్సీ ఫోన్ నంబర్‌ను సూర్యతేజ బ్లాక్‌లిస్టులో పెట్టడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం, సూర్యతేజకు ఇంట్లో వేరే సంబంధాలు చూడటం కూడా ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు పేర్కొంటున్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకుని అతనిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మధు అనే అమ్మాయి ద్వారా ఝాన్సీ పరిచయం కాగా అది ప్రేమగా మారిందని పోలీసులు చెప్పారు. వేరే వ్యక్తులతో ఝాన్సీ ఎక్కువగా మాట్లాడుతుండేదని, ఇది ఇష్టం లేని సూర్యతేజ సీరియల్స్‌లో నటించడం ఆపేయాలని ఒత్తిడి తీసుకురాగా అప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సీరియల్స్‌లో నటించేందుకు ఝాన్సీ సిద్ధమైంది. దీంతో సూర్యతేజ ఆమెతో గొడవపడి ఆమె మొబైల్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఫోన్ చేయగా దానికి అతడు స్పందించలేదు. వాట్సాప్ మెసేజ్‌లు పంపగా మొబైల్ నెట్ ఆఫ్ ఉండటంతో సూర్యతేజ వాటిని చూసుకోలేదు. నెట్ ఆన్ చేసుకునే లోపు ఝాన్సీ పంపిన మెసేజ్‌లను తనే డిలీట్ చేసేసిందని తెలిపారు. అవన్నీ అవాస్తవాలు: సూర్యతేజ నాగఝాన్సీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని సూర్యతేజ పోలీసుల విచారణలో తెలిపాడు. రూ.10 లక్షలు విలువ చేసే బంగారం ఇచ్చారన్నదాంట్లో వాస్తవంలేదని, కొంత బంగారం ఇవ్వగా అది తనఖా పెడితే రూ. రెండున్నర లక్షలు వచ్చాయని, అందులో మరో రూ. రెండున్నర లక్షలు కలిపి వారు ఓ స్థలం కొనే సమయంలో ఐదు లక్షలు తానే ఇచ్చానని తెలిపారు. తన పుట్టినరోజుకు మాత్రం రూ.లక్ష పెట్టి యమహా ఆర్15 ద్విచక్రవాహనం ఇప్పించిందన్నాడు. మా ఇంట్లో తమ ప్రేమ విషయం తెలిసినప్పటికీ తన ఇంటికి వచ్చి వారం రోజులు ఉందన్నది వాస్తవం కాదన్నాడు. గొడవలు ఉన్నమాట వాస్తవమే కానీ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని సూర్య తెలిపినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసులు అదుపులో సూర్య
-
పోలీసుల అదుపులో సూర్య..
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. కాగా అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. (ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం) పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఝాన్సీ తల్లీ, సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్న పోలీసులు నాని అలియాస్ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
’గజల్’ నుండి ఆడపిల్లల్ని కాపాడాలి
-
గజల్ కేసులో మరో ట్విస్ట్..మరిన్ని వీడియోలు!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గజల్ శ్రీనివాస్ రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పనిమనిషి పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ గలీజ్ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తోంది. పనిమనిషి పార్వతే తనను గజల్ శ్రీనివాస్ వద్ద వెళ్లాలని బలవంతపెట్టేదని బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్ బారిన పడిన బాధిత మహిళలు చాలామంది ఉన్నారని, చాలామంది మహిళల జీవితాలను అతను నాశనం చేశాడని చెప్పారు. అతని వ్యవహారంపై రెండు నెలలుగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బాధితురాలు వెల్లడించారు. గజల్ శ్రీనివాస్‌లాంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మోసగాళ్లను వదిలేస్తే..మరింత మంది జీవితాలు నాశనమవుతాయని అన్నారు. తాజా వీడియోలు వెలుగుచూడటంతో గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరింతగా బిగుసుకున్నట్టయింది. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలోని ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పనిమినిషిగా ఉన్న పార్వతి కూడా నిందితురాలిగా చేర్చారు. -
లలితా జ్యువెలర్స్ చోరీ గుట్టు రట్టు
-
లలితా జ్యువెలర్స్ చోరీ కేసులో లవర్స్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పంజగుట్ట పరిధిలోని సోమాజిగూడ సర్కిల్లో ఉన్న లలితా జ్యువెలర్స్ సంస్థలో గత సోమవారం చోటు చేసుకున్న ‘రెండో చోరీ’ కేసును పంజగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రేమజంటను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు జ్యువెలర్స్‌లో తస్కరించిన సొత్తును తమ స్వస్థలానికి తీసుకువెళ్ళి అక్కడున్న ఓ ఫైనాన్స్ సంస్థలో కుదువ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బంగారం రికవరీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కరీముల్లా, వాణి బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో నగరానికి వలసవచ్చారు. సికింద్రాబాద్ సింథికాలనీలోని బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్‌లో నివసిస్తున్న వీరిద్దరూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రేమజంట తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే వీరి దృష్టి సోమాజిగూడ చౌరస్తాలో ఉన్న లలితా జ్యువెలర్స్‌పై పడింది. గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో వీరిద్దరూ జ్యువెలర్స్‌కు వచ్చారు. బంగారు ఆభరణాల కోసం ఆరా తీస్తూ దుకాణం మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా మార్చుకున్న ఈ వీరు వివిధ రకాలైన ఆభరణాలు చూపించమంటూ సేల్స్‌మెన్ దృష్టిని మళ్ళించింది. అదును చూసుకుని అక్కడి కౌంటర్లో ఉన్న రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్లెట్ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్ సరిచూడగా తేడా కనిపించింది. దీంతో మంగళవారం పూర్తిస్థాయి ఆడిగింగ్ నిర్వహించిన యాజమాన్యం 66 గ్రాముల బరువుతో ఉన్న ఐదు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ జంట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా బుధవారం సంస్థకు చెందిన జి.మధుసూదన్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. నిందితుల్ని గుర్తించిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో చోరీ సొత్తును కరీముల్లా నందిగామలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో రూ.1.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. దీంతో ఆ సొత్తు రికవరీ చేయడానికి పంజగుట్ట పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కోఠిలో ‘ఆగిన’ మొదటి కేసు... ఈ నేరం జరగడానికి ముందే ఈ నెల 3న లలితా జ్యువెలర్స్‌లో ఓ దొంగతనం జరిగింది. బురఖా ధరించిన వచ్చిన ఇద్దరు మహిళలు రూ.6 లక్షల విలువైన 20 తులాల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్ళారు. సేల్స్‌మెన్ దృష్టి మళ్ళించి బంగారు నెక్లెస్ స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ది ఉంచారు. దీన్ని బట్టి ఆ నిందితులు అంతకు ముందే షోరూమ్‌కు వచ్చి ఉంటారని, అప్పడే ఫొటో తీసుకుని వెళ్ళి రోల్డ్‌గోల్డ్‌ది తయారు చేయించి ఉంటారని పోలీసులు అనుమానించారు. నిందితులు ప్రయాణించిన ఆటో ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఆ నిందితురాళ్ళు దుకాణానికి వచ్చిన ఆటోను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆ రోజు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు కోఠిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు కూడలివద్ద తన ఆటో ఎక్కినట్లు వెల్లడించాడు. దీంతో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లు సేకరించిన పరిశీలించారు. వీటిలో ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో ఆ కేసు దర్యాప్తు అక్కడితో ఆగిపోయింది. చోరీ దొంగతనం అనంతరం బుర్ఖా ధరించిన మహిళలు ఎక్కిన ఆటో వివరాలు తెలిస్తే ఫలితం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఆటో వెళ్ళిన మార్గంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పాటు వీరి ఎక్కిన ప్రాంతంలో లేకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. లలితా జ్యువెలర్స్ చోరీ కేసులో ప్రేమజంట అరెస్ట్ -
సెక్స్ వర్కర్ల దాడి.. కానిస్టేబుల్‌కు గాయాలు
పంజగుట్ట: కానిస్టేబుల్‌పై సెక్స్ వర్కర్లు రాళ్లతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే .. సికింద్రాబాద్‌కు చెందిన కుక్కమల్ల కిషోర్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి నిమ్స్ సమీపంలోని బస్టాప్‌లో నిలబడి ఉండగా, అక్కడికి వచ్చిన ఇద్దరు సెక్స్ వర్కర్లు బలవంతంగా ఇతని జేబులో ఉన్న రూ.1200 నగదు లాక్కున్నారు. దీనిపై బాధితుడు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం క్రైమ్ కానిస్టేబుల్ వాల్ధాసు కిషోర్‌ను ఘటనా స్థలానికి పంపించారు. విచారణ చేస్తుండగా ఫలక్నామా, ఒట్టెపల్లికి చెందిన షాహీన్, పర్వీన్ అనే సెక్స్ వర్కర్లు ఆటోడ్రైవర్ పాషాతో కలిసి కానిస్టేబుల్‌పై రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయపడిన కిషోర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాహీన్, పర్వీన్‌లను అదుపులోకి తీసుకోగా, పాషా పరారయ్యాడు. బాధితుడిని సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
ఘరానా దొంగ.. ఖరీదైన దొంగ
పంజగుట్ట: పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు పది లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య అలియాస్ శ్రీకాంత్ చౌదరి అలియాస్ అక్కినేని అలియాస్ కార్తీక్ (35) 2007లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇతని నేరచరిత్ర ప్రారంభం అయింది. అదే ఏడాది మొట్టమొదటి దొంగతనం వైజాగ్‌లో చేసి పోలీసులకు చిక్కాడు. తరువాత త్రివేండ్రం, బెంగళూరు, చెన్నైతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఉన్న 41 కేసుల్లో కేవలం చెన్నైలోనే 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్కడి పోలీసులు ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. కేవలం పదో తరగతి చదివిన సోమయ్య తెలుగు, తమిళం, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని ప్రలోభపెట్టి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్ఫోన్లు దొంగిలించుకొని పారిపోతాడు. ఇలా ఇతనిపై నర్సారావుపేట, విజయనగరం పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఖరీదైన హాస్టళ్లలో ఉంటూ వ్యాపారవేత్తగా చెప్పుకొని పలువురితో స్నేహాలు చేసి, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ఐపాడ్లు కాజేస్తాడు. కారు డ్రైవింగ్ రాకపోవటంతో క్యాబ్‌లలో తిరుగుతూ డ్రైవర్ల దృష్టి మరల్చి వారి ఖరీదైన ఫోన్లు కూడా మాయం చేస్తుంటాడు. ఇతనికి దక్షిణ భారతదేశంలోని తెలియని దేవాలయం లేదు. ఆయా ఆలయాల ఉన్నతాధికారులతో ఇతనికి పరిచయాలున్నాయి. దొంగసొత్తు కొంత నేరుగా ఆయా ఆలయాల ఈవో వద్దకు వెళ్లి పరిచయం చేసుకొని చందాల రూపంలో సమర్పించి ఈవోల గదిలోనే బస చేస్తాడు. ఇతనికి అన్నింటికన్నా సేఫ్ ప్లేస్దేవాలయాల ఇఓల గదులే. సోమయ్యకు మద్యం అలవాటు లేదు. ఖరీదైన ఫోన్లు వాడుతూ అద్దె కార్లలో తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. శ్రీనగర్‌కాలనీలో దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పంజగుట్ట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, ఒక యాపిల్ ఐ పాడ్, 14 ఖరీదైన సెల్ఫోన్లు, ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీ తెలిపారు. -
పెళ్లై వారం కాకముందే...
పంజాగుట్ట: పెళ్లి చేసుకున్న వారం రోజులకే తన భర్త తనను కాదని పోయాడని ఓ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన వివరాల్లోకి వెలితే మెదక్ జిల్లాకు చెందిన యువతి (25) సోమాజిగూడలోని వివేకానంద ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంది. ఈమెకు పార్క్ హోటల్లో విధులు నిర్వహించే హర్యానాకు చెందిన కపిల్ రోహిరా (26)తో పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారి గత సంవత్సరం నవంబర్ 28వ తేదీన వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కేవలం వారం రోజులకే కపిల్ కనిపించకుండా పోయాడు. అప్పటినుండి అతని ఫోన్ కూడా ఆఫ్‌లో ఉంది. కాగా సుమారు 10 నెలల తర్వాత కపిల్ సోమాజిగూడ ప్రాంతంలో సదరు యువతికి కనిపించగా ఆమె అతన్ని కలిసి తనను ఎందుకు వదిలి వెల్లావు అని ప్రశ్నించగా నీవంటే నాకు ఇష్టంలేదని అందుకే వెల్లిపోయానని సమాధానం చెప్పాడు. సదరు యువతి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు కపిల్ కోసం గాలిస్తున్నారు. -
రూ.5 ఇవ్వలేదని అదృశ్యం
పంజగుట్ట: తల్లిని ఐదు రూపాయలు అడిగితే ఇవ్వలేదని అలిగి ఓ యవకుడు కనిపించకుండా పోయాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముషీరాబాద్ బంగ్లాదేశ్ బస్తీలో నివాసముండే శివ(10) స్థానిక ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. తల్లి సరస్వతితో కలిసి మంగళవారం సోమాజిగూడలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం 10.30కి శివ తల్లిని రూ.5 అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 9490616610 నెంబర్లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. -
అసభ్యకర సందేశాలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ఓ మహిళ పట్ల అభ్యకరంగా వ్యవహరిస్తున్న యువకుడ్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్స్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు చింతల్‌బస్తీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అసభ్యకరంగా సంక్షిప్త సందేశాలను పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ... అమీర్‌పేట శాలివాహనానగర్ లోని నిర్మల నిలయం మూడవ అంతస్థులో ఓ ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నరన్న పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. నిర్వాహకురాలు కూకట్‌పల్లికి చెందిన సంధ్య(30) తోపాటు జీడిమెట్లకు చెందిన ఇద్దరు యువతులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పంజాగుట్టలో బోర్డు తిప్పేసిన కంపెనీ
-
పబ్ లో మహిళపై దురుసుగా ప్రవర్తించిన బౌన్సర్ల అరెస్ట్!
హైదరాబాద్: ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె సన్నిహితుడిపై చేయి చేసుకున్న ఇద్దరు బౌన్సర్లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో గత రాత్రి చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బౌన్సర్లను అంథోని, అనీష్ లుగా గుర్తించినట్టు ఫిర్యాదులో భాదితులు పేర్కొన్నారని పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ఎస్ మోహన్ కుమార్ తెలిపారు. పబ్ లో ఓ బాస్కెట్ దెబ్బతిన్న విషయంపై బౌన్సర్లు ప్రశ్నించగా మాటా మాట పెరిగి వివాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పంజగుట్ట పోలీసులు వెల్లడించారు. -
పబ్‌లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన
నగరంలోని ఓ పబ్‌లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బౌన్సర్లలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు బుధవారం వెల్లడించారు. పరారీలో ఉన్న బౌన్సర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.... కొంత మంది యువతులు స్నేహితులతో కలసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని పబ్‌కు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంత మంది బౌన్సర్లు ఆ యువతులు పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు. బౌన్సర్లును వారించేందుకు యువతి స్నేహితులు ప్రయత్నించారు. దాంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహించిన బౌన్సర్లు... యువతులతో వచ్చిన స్నేహితులపై దాడి చేశారు. ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పబ్ సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు హుటాహుటిన పబ్‌కు చేరుకున్నారు. పబ్ సిబ్బంది వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బౌన్సర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. -
తక్కువ కులమని ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు
హైదరాబాద్: తక్కువ కులమని తన ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ ఓ ఇంటి యజమాని అద్దెకున్న వారిని వేధిస్తుండడంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన ప్రకారం, పంజగుట్ట దుర్గానగర్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ.సుమంత్ గత సంవత్సరం నుంచి అద్దెకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తక్కువ కులం అని తెలుసుకున్న లక్ష్మీ సుమంత్ ఇంట్లో నీళ్లు రాకుండా చేయడం, అకారణంగా సూటిపోటు మాటలనడం చేస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని వేధిస్తున్నది. ఇటీవల సుమంత్ తండ్రి రవితేజ రావడంతో ఆయనను కూడా దూషించింది. దీంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.