తక్కువ కులమని ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు | hyderabad house owner booked under Atrocity act | Sakshi
Sakshi News home page

తక్కువ కులమని ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు

Published Mon, Mar 3 2014 10:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad house owner booked under Atrocity act

హైదరాబాద్: తక్కువ కులమని తన ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ ఓ ఇంటి యజమాని అద్దెకున్న వారిని వేధిస్తుండడంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన ప్రకారం, పంజగుట్ట దుర్గానగర్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏ.సుమంత్ గత సంవత్సరం నుంచి అద్దెకుంటున్నాడు.

కొద్ది రోజుల క్రితం తక్కువ కులం అని తెలుసుకున్న లక్ష్మీ సుమంత్ ఇంట్లో నీళ్లు రాకుండా చేయడం, అకారణంగా సూటిపోటు మాటలనడం చేస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని వేధిస్తున్నది. ఇటీవల సుమంత్ తండ్రి రవితేజ రావడంతో ఆయనను కూడా దూషించింది. దీంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement