atrocity case
-
రోహిణి థియేటర్ నిర్వాహం.. కమల్ హాసన్ తీవ్ర ఖండన
చైన్నెలోని రోహిణి థియేటర్ నిర్వాహకం చర్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు శింబు కథనాయకుడిగా నటించిన చిత్రం పతు తల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. దీంతో శింబు అభిమానులు వేకువజాము నుంచే థియేటర్ ముందు గుమికూడారు. అలాంటి వారిలో సంచార జాతి ప్రేక్షకులు ఉన్నారు. వీరు స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్లో పత్తుతల చిత్రాన్ని చూడడానికి వచ్చారు. టికెట్లు కూడా కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ థియేటర్ కార్మికుడు వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొంత సమయం తర్వాత వారిని లోపలికి అనుమతించారు. டிக்கெட் இருந்தும் நரிக்குறவ மக்களை படம் பார்க்க அனுமதிக்காத @RohiniSilverScr திரையரங்கம் ... இவுங்களுக்கு நீ தனி ஷோ போட்டுக்காட்டத்தான் போற அத நான் பாக்கத்தான் போறேன் ...#RohiniTheatre #PathuThala @SilambarasanTR_ @CMOTamilnadu @IamSellvah pic.twitter.com/1Pd3rE8CsV — Viji Nambai (@vijinambai) March 30, 2023 అయితే ఈ వ్యవహారంపై థియేటర్ నిర్వాహకం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కమలహాసన్, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్, నటి ప్రియా భవానిశంకర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్ ట్విటర్లో పేర్కొంటూ టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. டிக்கெட் இருந்தும் நாடோடிப் பழங்குடியினருக்குத் திரையரங்கத்திற்குள் அனுமதி மறுக்கப்பட்டுள்ளது. சமூகவலைதளங்களில் எதிர்ப்பு கிளம்பிய பிறகே அவர்கள் அனுமதிக்கப்பட்டுள்ளனர். இது கண்டிக்கத்தக்கது. https://t.co/k9gZaDH0IM — Kamal Haasan (@ikamalhaasan) March 31, 2023 -
దళిత యువకుడికి ఘోర అవమానం.. పరారీలో మాజీ సర్పంచ్!
లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్ కుమార్(27) అనే దళిత యువకుడిపై.. తాజ్పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్ శక్తి మోహన్‌ను అరెస్ట్ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs. They also recorded the incident and made it viral to humiliate the SC people. pic.twitter.com/MeiPTfo9KF — Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022 ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
దాడి చేసొస్తే.. దాచేస్తాం!.. పరిటాల కుటుంబం తీరుపై సర్వత్రా విమర్శలు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరైనా తప్పు చేస్తే మందలించాలి. నేరం చేస్తే పోలీసులకు అప్పగించాలి. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ పరిటాల కుటుంబం మాత్రం తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కందుకూరు శివారెడ్డి హత్య కేసు నిందితులకు పరిటాల శ్రీరామ్ ఆశ్రయం ఇవ్వగా..తాజాగా గిరిజన యువకుడిపై హత్యాయత్నం కేసులోని నిందితులకు పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో పరిటాల కుటుంబం తీరుపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్ డ్రామా’ నిందితులను ఇంట్లో ఉంచుకున్న సునీత చిన్నాన్న రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో రఘు నాయక్ అనే గిరిజన యువకుడిపై గత నెల నాల్గో తేదీన అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బ్రహ్మ, శరత్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో నిందితులిద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు. వారికి మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి, ఆయన కుమారుడు ఎల్.నరేంద్ర చౌదరి ఆశ్రయం కల్పించారు. అనంతపురం నగరంలోని తమ నివాసంలోనే వారికి ఆశ్రయమిచ్చారు. సంఘటన గత నెల నాల్గో తేదీ జరగ్గా... ఎట్టకేలకు 29వ తేదీన ఎల్.నారాయణ చౌదరి నివాసంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఆశ్రయమిచ్చినందుకు ఎల్.నారాయణ చౌదరి (ఏ–11), ఆయన కుమారుడు ఎల్.నరేంద్ర చౌదరి (ఏ–12)పైనా రామగిరి పోలీసులు సెక్షన్ 212 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాడు హత్య కేసు నిందితులకు ఆశ్రయం గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన శివారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ట్యాంకర్‌తో గ్రామంలో నీరు ఉచితంగా అందిస్తూ సేవ చేస్తున్న శివారెడ్డిని నిష్కారణంగా చంపారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి గ్రామంలో ప్రజల మద్దతు తగ్గుతుందనే భావనతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా శివారెడ్డిని అంతమొందించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సాకే బాలకృష్ణ ప్రధాన నిందితుడు. నిందితులు పోలీసులకు చిక్కే వరకు పరిటాల శ్రీరామ్ ఇంట్లోనే ఆశ్రయం కలి్పంచారు. కేసులో అరెస్టయ్యి బెయిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిటాల శ్రీరామ్ పంచనే వారు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీరామ్ ప్రధాన అనుచరుల్లో బాలకృష్ణ ఒకరు కావడం గమనార్హం. ఆయన సమకూర్చిన వాహనంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు కందుకూరు గ్రామానికి నిందితులు వెళ్లగా.. జనం మూకుమ్మడిగా తరిమికొట్టారు. ఓటు సైతం వేయనీయలేదు. భయాందోళనలు సృష్టించేందుకేనా? గత సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గ ఓటర్లు పరిటాల కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. నియోజకవర్గంలో తిరిగి పట్టు సంపాదించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులకు ఆశ్రయం కల్పిస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నవ వధువును కిడ్నాప్ చేసిన టీడీపీ నేత
విడవలూరు: నూతనంగా వివాహం చేసుకున్న వధువు కత్తి ఉమామహేశ్వరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి కిడ్నాప్ చేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విడవలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహేంద్ర కథనం మేరకు.. విడవలూరులోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తి ఉమామహేశ్వరి, అన్నారెడ్డిపాళెం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నలబాయి హరి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు మేజర్లు కావడంతో శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పెంచలకోనలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆదివారం అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి విడవలూరుకు చెందిన టీడీపీ నాయకుడు సత్యవోలు సత్యంరెడ్డి దాదాపు 30 మందితో కలిసి ఆటోల్లో అన్నారెడ్డిపాళెంలోని హరి ఇంటికి వెళ్లి వధువు కత్తి ఉమామహేశ్వరిని బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆమె భర్త హరి అడ్డుపడగా అతన్ని కులం పేరుతో దూషించి పక్కకు తోసి వధువును బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని తెలిపారు. నలబాయి హరి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వధువు తల్లిదండ్రులకు ఈ ప్రేమపెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో పాటు వీరు టీడీపీ సానుభూతిపరులు కావడంతో సత్యంరెడ్డిని సంప్రదించారని, దీంతో వధువును సత్యంరెడ్డి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
అట్రాసిటీ కేసు: స్పందించిన దాసరి అరుణ్ కుమార్
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం పేరుతో దూషించారంటూ అరుణ్ పై నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో అరుణ్ పై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా దీనిపై అరుణ్ స్పందించాడు. అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పాడు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే ఆయన ఎవరో తెలియదని చెప్పడంతో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారన్నాడు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్‌లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని పేర్కొన్నాడు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని, నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని వెల్లడించాడు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేగాక ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించాడు. -
దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్ అనే టెక్నీషియన్ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్ ఔట్సోర్సింగ్ పనులు చేశారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ బాగా పరిచయం. 2018 నవంబర్ 15న దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. (చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్) ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒప్పందంపై తాను సంతకం చేయలేదని అరుణ్ చెప్పారు. ఈ నెల 13న రాత్రి 9 గంటల సమయంలో తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఎఫ్ఎన్సీసీకి రమ్మని చెప్పగా చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు తెలిపారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే అరుణ్‌కుమార్ కులం పేరుతో తనను దూషించారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 16న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ కమిషన్ ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ఏడాదిన్నరకు పైగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్‌తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్‌ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్‌కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. – బీఎస్ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ విప్లవాత్మక మార్పులు తెచ్చాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం. – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
సాక్షి, కృష్ణా : టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నా ఇల్లు- నా సొంతం కార్యక్రమం పేరుతో మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహల వద్ద టీడీపీ నేతలు వివాదానికి దిగారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గృహాల వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చి గొడవకు దిగారు. సైట్ ఇంజనీర్లుగా పని చేస్తున్న తలారి గోపి, వెంగళ నాగేంద్ర బాబులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు దిగారు. దీంతో సైట్ ఇంజనీర్లు ఇద్దరు రావి వెంకటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
జేసీ బెయిలు పిటిషన్ కొట్టేసిన కోర్టు
సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జేసీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా దళిత సీఐ దేవేంద్రను దూషించి, బెదిరింపులకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. -
జేసీని విచారించిన పోలీసులు
అనంతపురం క్రైం/కడప అర్బన్: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసులు విచారించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీని ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకుని అనంతపురం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు 4 గంటల పాటు జేసీని విచారించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, కడప కేంద్ర కారాగారానికి తిరిగి తరలించారు. ఈ నెల 6న విధుల్లో ఉన్న దళిత పోలీసు అధికారిని దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. -
అట్రాసిటీ కేసు: పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జేసీని ఆదివారం పోలీసులు విచారించనున్నారు. దళిత సీఐ దేవేంద్ర ను దూషించి బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!) ఫోర్జరీ డాక్యూమెంట్స్ కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పై విడుదలయిన వెంటనే దళిత పోలీసు అధికారి ని దూషించిన విషయాన్ని పిటీషన్లో పేర్కొన్నారు. కండీషన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) -
దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్‌పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: విడుదలైన 24 గంటల్లోపే జేసీపై మరో కేసు) మరోవైపు జేసీ, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన') -
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళిత, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తన కుల అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డాయి. విజయకుమార్‌కు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు పెట్టాలంటూ పోలీస్స్టేషన్లలో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి, అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని అంశాలను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదుగురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు నారాయణస్వామి, విశ్వరూప్, సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాకే చంద్రబాబు బయటకు రావాలన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి హోదాలో విజయకుమార్ బీసీజీ నివేదికపై మీడియాకు వివరించారని వారు గుర్తుచేశారు. దీనిపై చంద్రబాబు చేసిన విమర్శలు చౌకబారుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విజయకుమార్‌ను ‘గాడు’ అనడం ద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకార నిజస్వరూపం బయటపడిందని మంత్రులు గుర్తుచేశారు. విజయకుమార్ బాధ్యతలేంటో.. ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు ఇకపై నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజయకుమార్‌కు క్షమాపణ చెప్పాలి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా చంద్రబాబును మంత్రులు డిమాండ్ చేశారు. అలాగే, స్వయంగా విజయకుమార్ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇది జరిగే వరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ బాబును ఛీకొట్టాలన్నారు. జ్యుడీషియల్ విచారణ చేయించాలి చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక నేరాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి.. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. విజయకుమార్‌ను ‘వాడు’ అని సంబోధించడంలోనే చంద్రబాబులో ఉన్న అహంకారం ఏంటో తెలుస్తోంది. ఆయన గతంలోనూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎన్నో కేసుల నుంచి, కోర్టుల నుంచి మాజీ సీఎం తప్పించుకు తిరుగుతున్నారు. చంద్రబాబు దోపిడీదారు, అవినీతిపరుడు. దళితులను అవమానించటమేగాక దాడులు చేయించిన ఘనుడు. గతంలో నాయీబ్రాహ్మణులనూ తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. తాను ఉన్న సభలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు మాట్లాడలేదు. – కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నేత చంద్రబాబూ.. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధించడం ఆయన కుల అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి పోయేసరికి చంద్రబాబుకు చిన్న మెదడు దెబ్బతింది. ఆయన ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. – కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హేయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మాల ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. – నక్కా రాజశేఖర్, ఏపీ మాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దళితులు తలుచుకుంటే రోడ్డెక్కలేరు ప్రణాళికా సంఘం కార్యదర్శిగా విజయకుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా బీసీజీ నివేదికను రాష్ట్ర ప్రజలకు చదివి వినిపించారు. అతన్ని పట్టుకుని ‘విజయకుమార్ గాడు’ అని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని దళితులు తలచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరు. విజయ్‌కుమార్‌ను అవమానించినందుకు బాబు అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పకపోతే దళిత జాతి ఆయనను క్షమించదు. – ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర ఆయనదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరు ఆయనలోని నిరాశ, నిస్పృహలతో పాటు కుల అహంకారాన్ని బయటపెట్టింది. విజయకుమార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. అధికారులను, ఉద్యోగులను బెదిరించడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదే. – ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఆందోళన దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ ‘వాడు’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మా ఉద్యోగ సంఘం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. – రెడ్డిచర్ల ధనుంజయ్, సెర్ప్ ఎల్4, ఎల్5 స్థాయి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు అహంకారానికి నిదర్శనం విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ పథకాల అమలు, పేదలకు సేవలందించడంలో విజయకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా జేసీగా, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా విశేష సేవలందించారు. – తాళ్ళూరి బాబూరాజేంద్ర ప్రసాద్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిందే.. విజయకుమార్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక దళిత ఐఏఎస్ అధికారి విషయంలో ఆయన అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎస్.కృష్ణమోహన్‌రావు, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలి దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలి. అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి కుల అహంకారంతో దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. – మేడిద బాబూరావు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఆందోళనలు చేస్తాం రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడిన దళిత ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ కమిషన్లు ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం. – గోళ్ల అరుణ్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఖండించాలి విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబుపై సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా రాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి. – పెరికే వరప్రసాదరావు, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ఐఏఎస్ అధికారిపై వ్యాఖ్యలు సరికాదు ఒక బాధ్యతగల ఐఏఎస్ అధికారిని అవమానించేలా ప్రతిపక్షనాయకుడు దుర్భాషలాడటం సరికాదు. ప్రభుత్వానికి అందిన నివేదికలోని అంశాలను విజయకుమార్ సవివరంగా చెప్పడాన్ని సహించుకోలేక చంద్రబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం మంచిది కాదు. – ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు -
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. దీంతో పలు దళిత సంఘాలు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డాయి. విజయకుమార్‌ను అవమానించే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఇవి అహంకార పూరిత వ్యాఖ్యలని పలువురు నాయకులు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వివిధ దళిత నాయకులు ఏమన్నారంటే.. సుమోటోగా అట్రాసిటీ కేసు చంద్రబాబూ.. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను నీచంగా చూస్తావా? ‘వాడు’ అని సంబోధిస్తావా? ఎంత అహంకారం.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సుమోటోగా నమోదు చేస్తాం. దళితులు తగిన బుద్ధి చెబుతారు. – కారెం శివాజీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, విజయవాడ. బాబును దళితులు క్షమించరు పదవి పోయిన చంద్రబాబుకు పూర్తిగా మతిభ్రమించింది. ఒక దళిత ఐఏఎస్ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయనకు తగదు. దళితులు చంద్రబాబును క్షమించరు. ఆయన దళిత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. – పెదపాటి అమ్మాజీ, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ దళితులంటే బాబుకు చులకన గతంలో కూడా చంద్రబాబు, అప్పటి టీడీపీ మంత్రులు దళితులను చులకన చేసి మాట్లాడారు. దళిత ఐఏఎస్‌ను అవమానించిన చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దళిత ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు సమిష్టిగా ఈ విషయంపై స్పందించి బాబుకు తగిన బుద్ధి చెప్పాలి. – కొమ్మూరి కనకారావు, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ చంద్రబాబును అరెస్టు చేయాలి విజయకుమార్‌ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబునాయుడును అరెస్టుచేయాలి. ఒక ఐఏఎస్ అధికారినే ఇలా అన్నారంటే సామాన్యులను ఏ స్థాయిలో చూస్తారో అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదుచేయాలి. – కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షులు, ఐక్య దళిత మహానాడు ఐఏఎస్‌లంతా ఖండించాలి ఐఏఎస్ అధికారికి ఎవరైనా కనీస గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వ సూచన మేరకు బోస్టన్ కమిటీ నివేదికను వివరిస్తే ‘వాడు మాకు చెబుతాడా’.. అని అంటారా? ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఎంతో దిగజార్చాయి. దీనిని ఐఏఎస్‌లు అంతా ఖండించాలి. – నల్లి రాజేష్, రాష్ట్ర అధ్యక్షుడు, మాల మహానాడు ఉద్దేశపూర్వకంగా అవమానించారు చంద్రబాబునాయుడుకు ఐఏఎస్ అధికారి విజయకుమార్ దళితుడని తెలుసు. కావాలనే అహంకారంతో అవమానకరంగా మాట్లాడారు. పాలకునిగా పనికిరాడని ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు. – నీలం నాగేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, దళిత హక్కుల పోరాట సమితి రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఐఏఎస్ విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లేకుంటే దళితులు తగిన బుద్ధి చెబుతారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలి. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. – కొమ్ము సుజన్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు, మాదిగ సంక్షేమ పోరాట సమితి. బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోవడంలేదు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. – బత్తుల వీరాస్వామి, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్యూడల్ స్వభావం బయటపడింది చంద్రబాబు ఫ్యూడల్ స్వభావం బయటపడింది. దళితులను అవమానించడం ఆయనకు అలవాటు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. – దారా అంజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాలమహానాడు. -
కోడెల కుమారుడిపై అట్రాసిటీ కేసు
నరసరావుపేట టౌన్ : ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల కుమారుడి అవినీతి బాగోతం మరొకటి వెలుగు చూసింది. నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేత కాల్వ రవి తన బంధువు ఎం.నాగరాజుకు ఉద్యోగం ఇప్పించే విషయంలో కోడెల తనయుడు శివరామ్‌ను కలిశారు. నాగరాజుకు జిల్లా పరిషత్‌లో అటెండర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని శివరామ్, అతని పీఏ నాగప్రసాద్ నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని వారిద్దరినీ కాల్వ రవి నిలదీశాడు. దీంతో కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్ సీఐ ఐ.కృష్ణయ్య సోమవారం తెలిపారు. -
అట్రాసిటీ కేసులు జూన్ 6లోగా తేల్చండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల్ని జూన్ 6లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం కలెక్టర్లతో అట్రాసిటీ కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలపై ఆయన వీడియో సదస్సు నిర్వహించారు. అట్రాసిటీ కేసులను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్షిస్తున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని జోషి సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు నష్ట పరిహారాన్ని నిర్దేశిత కాలపరిమితిలోగా అందేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ రైతులకు 41,09,743 పాసుపుస్తకాలను పంపిణీ చేశామని, సీఎం కేసీఆర్ రోజూ జిల్లాల వారీగా పనితీరును సమీక్షిస్తున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి చెప్పారు. జూన్ 20లోగా మిగిలిన పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. -
మొదటి అదనపు జిల్లా జడ్జిగా వి.వి.శేషుబాబు
కర్నూలు(లీగల్): జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం, జిల్లా ఆరవ అదనపు న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేస్తున్న వి.వి.శేషుబాబును జిల్లా మొదటి అదనపు జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్ నుంచి మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉండటంతో ఆ స్థానంలో వి.వి.శేషుబాబును బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి వెంకట నాగసుందర్ను నియమించారు. -
అట్రాసిటీ కేసు నమోదు
పామిడి : పామిడి మండలం కత్రిమల గ్రామానికి చెందిన బోయ ఓబులయ్య, నడిపి మారెన్న, రామాంజి, ఎర్రెడ్డి, మహేశ్, ప్రసాద్, మాధవరాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శనివారం నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో సత్యమయ్య అంగడి వద్ద శుక్రవారం రాత్రి కడవకల్లు రాము ఫోన్లో ఎవరినో దుర్భాషలాడుతుండగా తమనే తిడుతున్నాడని భావించి పైన పేర్కొన్న వారు ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి రాము సహా గంగాధర్, నారాయణస్వామి, సునీల్, రామాంజి, ఓబులేసు, ఎల్లమ్మ సహా మరికొందరిపై పైన పేర్కొన్న వారు దాడి చేసి, గాయపరిచారన్నారు. బాధితుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరం పరిష్కరించండి
– ఆర్డీఓలు, డీఎస్పీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ఎస్సీ, ఎస్టీ కేసులను జాప్యం లేకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. బుధవారం తన చాంబరులో ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీలు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విచారణలో బాధితులకు సకాలంలో పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మొత్తం మీద 201 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో కలసి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ వివరించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
చదలవాడపై అట్రాసిటీ కేసు
నిండ్ర: ఫ్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో తలెత్తిన వివాదాలకు సంబంధించి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదైంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొప్పేడు దళితవాడకు చెందిన షణ్ముగం ఫిర్యాదు మేరకు... చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ నెల 25న కర్మాగారంలో గొడవ సృష్టిస్తుంటే తాము అడ్డుకున్నామని, ఆ సమయంలో తనను చదలవాడ అనుచరులు కులం పేరుతో దూషించారంటూ అదే రోజున షణ్ముగం నిండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అనంతరం బుధవారం చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఏఎస్ఐ దేవదాసు తెలిపారు. -
వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు
ఓ మహిళనుకులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌కు చెందిన బానోతు పద్మ (32) నగరంలోని తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్లో స్టోర్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఇక్కడే రవాణా విభాగంలో పనిచేసే గజానన్ కొన్ని రోజుల క్రితం పద్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పద్మ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా గజానన్ను పనిలో నుంచి తొలగించారు. ఇది మనసులో పెట్టుకున్న గజానన్ ఈ నెల 13వ తేదీన మద్యం సేవించి పద్మ ఇంటికి వచ్చి బెదిరించి కులం పేరుతో దూషించాడు. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గజానన్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలి'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. అమలాపురం జానకీపేటకు చెందిన ఇద్దరి వ్యక్తులపై 8 మంది అమానుషంగా దాడి చేశారు. వీరిద్దరు ఆవులను ఎత్తుకెళ్లారనే అనుమానంతో స్థానిక శ్మశానం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. నిందితులను 48 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అమలాపురం డీఎస్పీ మాట్లాడుతూ...ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. -
టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. నాయుడు ఇంటి ముందు చేపట్టిన మురుగు కాలువ పనుల్లో భాగంగా అడ్డు గా ఉన్న వేపచెట్టును కూలీలు తాతయ్య, మరో ఇద్దరు తొలగిం చారు. దీంతో వారిపై నాయుడు దాడి చేయడమే గాక కులం పేరు తో తమను దూషించి అవమానించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
మంత్రి జోగు రామన్నపై అట్రాసిటీ కేసు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/ఆదిలాబాద్ రూరల్: రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారని ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధరి పంచాయతీ మామిడిగూడకు చెందిన సిడాం ప్రసాద్ ఆదిలాబాద్ జెఎఫ్‌సీఎం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు మంత్రి రామన్నతోపాటు ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ సుభాష్‌చందర్ సహా మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి జోగు రామన్నతో పాటు, 26 మందిపై ఈనెల 4న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ ఎల్.రాజు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ స్థల వివాదం.. ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధరి గ్రామ శివారులో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరయ్యాయి. ఈ సబ్‌స్టేషన్‌ను ఈ గ్రామ శివారులోని సర్వేనెం.27/1, 29/ఏ స్థలంలో నిర్మించాలని ముందుగా భావించారు. అయితే స్థలాన్ని ఇదే గ్రామ శివారులోని మరో చోటకు మార్చి, అక్కడ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రామన్నతో పాటు, రెవెన్యూ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో తనను కులం పేరుతో దూషించారని ప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. ప్రసాద్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఈ కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించడంపై కేసు
చిలుకలగూడ (హైదరాబాద్): ఓ ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించి దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ బ్రాహ్మణబస్తీలోని సాయిలోక్పూజ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆపార్ట్మెంట్ వద్ద పిల్లలు ఆడుకునే సమయంలో ఫ్రొఫెసర్ కృష్ణయ్యకు మరికొంత మంది మధ్య వివాదం జరిగింది. దీంతో కొంతమంది కులం పేరుతో దూషిస్తూ మూకుమ్మడిగా దాడిచేసి కృష్ణయ్యను గాయపర్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సాయి (21), విజయ (31)లపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతపై కేసు నమోదు
శ్రీకాకుళం : ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి చేసిన టీడీపీ నేత కందాపు వెంకటరమణపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడిచేశారని, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాధిత ఉద్యోగి నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
రేణుకా చౌదరి అనుచరుడికి చెప్పు దెబ్బ
ఖమ్మం: తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్ రాంజీ నాయక్ భార్య కళావతి డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్‌ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని ఆమె తెలిపారు. తమ డబ్బులు తిరిగివ్వాలంటూ బుధవారం రేణుకా చౌదరి అనుచరుల మీడియా సమావేశాన్ని ఆమె అడ్డుకున్నారు. రేణుక అనుచరుడు సైదులు నాయక్ పై చెప్పుతో దాడి చేశారు. రేణుకా చౌదరి, ఆమె అనుచరులు కలిసి తమను మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించారని కళావతి ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే తన పిల్లలతో కలిసి రేణుకాచౌదరి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. అవసరమైతే సోనియా గాంధీని కలిసి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని తెలిపింది. కళావతి ఫిర్యాదు మేరకు రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. -
రేణుకా చౌదరిపై అట్రాసిటీ కేసు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై ఖ మ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. గిరి జన మహిళను కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదుతోపాటు, తన భర్తను రేణుకా చౌదరి మోసం చేశారని గిరిజన మహిళ, డాక్టర్ రాం జీనాయక్ భార్య కళావతి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై రాంజీనాయక్ సతీమణి కళావతి హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై కేసు నమో దు చేయాలని ఖమ్మం అర్బన్ పోలీసులను ఆదేశించింది. రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న కేసు నమోదైంది. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచ డం చర్చనీయాంశంగా మారింది. కాగా, రేణుకా చౌదరిపై 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఖమ్మంకు చెందిన డాక్టర్ భూక్యా రాంజీకు 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్‌ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. టిక్కెట్ రాకపోగా కోటి రూపాయలు ఖర్చు కావడంతో మానసికంగా కుంగిపోరుు మనోవేదనతో తన భర్త మృతి చెందాడని పేర్కొన్నారు. టికెట్ కోసం రాంజీ రేణుకా చౌదరికి, ఆవిడ అనుచరులకు ఎప్పుడు, ఎక్కడ ఎంత మొత్తంలో నగదు చెల్లించింది ఫిర్యాదులో వివరించారు. 2013 మే 30న ఇల్లెందు రోడ్డు లో ఉన్న ఎన్నెస్పీ విశ్రాంతి భవనంలో రూ . 10 లక్షలు, ఖమ్మంలోని ఆఫీసర్స్ విశ్రాంతి భ వనంలో 2013 డిసెంబర్1న రూ. 60 లక్షలు రేణుకాచౌదరికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదే రోజు రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డిలకు రూ. 15 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 మార్చి30 హైదరాబాద్‌లో రేణుకాచౌదరి ఇంటి వద్ద రూ. 50 లక్ష లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తమను కులం పేరుతో దూషిం చారని పేర్కొన్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణు కాచౌదరితో పాటు రామారావు, పుల్లయ్య, సైదులు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రేవంత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ అడ్వొకే ట్ జేఏసీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ‘దొరగారి బూట్లు నాకు పో’ అని వ్యాఖ్యలు చేసి, దళిత జాతిని అవమానపర్చారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు శనివారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నల్లాల ఒదెలును ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి కించపరిచారని, ఈ వాఖ్యలు దళిత జాతిని అవమానపర్చడమేనని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, గోవర్ధన్‌రెడ్డి, కొమరయ్య, బ్రహ్మానందరెడ్డి, కె.ఎస్.కృష్ణ తదితరులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కలెక్టర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్లు రాలేదని చెప్పుకునేందుకు వెళ్లిన వికలాంగుల పట్ల కలెక్టర్ దౌర్జన్యంగా వ్యవహరించడం గర్హనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో వీహెచ్పీఎస్ నేతలపై జిల్లా యంత్రాంగం చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్, ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు వచ్చిన పలువురు వికలాంగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వికలాంగులను కించపర్చేలా వ్యవహరించిన కలెక్టర్ శ్రీధర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుడైన వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కాళ్ల జంగయ్యను కలెక్టర్ తన చాంబర్‌నుంచి సిబ్బందితో గెంటివేయించారని అన్నారు. దళితునిపట్ల అనుచితంగా వ్యవహరించిన కలెక్టర్, సిబ్బందిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీధర్ 24గంటల్లో వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్నాలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వికలాంగుల పట్ల కలెక్టర్ చేసిన పరుషపదజాలానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కలెక్టర్‌పై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా వికలాంగుల సంఘ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ.. కలెక్టర్ సేవలను కొనియాడుతూ టీఎన్జీఓ నేతలు బుధవారం ప్రతికా ప్రకటన చేయడం కొసమెరుపు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిపై అట్రాసిటీ కేసు
కాకినాడ: కులం పేరుతో దూషించారని మాజీ కార్పోరేటర్ ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ పోటీ చేశారు. తన ఇంటిపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ మాజీ కార్పొరేటర్ కొప్పల విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచే విధంగా దూషించిన నానాజీని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టారు. -
తక్కువ కులమని ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు
హైదరాబాద్: తక్కువ కులమని తన ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ ఓ ఇంటి యజమాని అద్దెకున్న వారిని వేధిస్తుండడంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన ప్రకారం, పంజగుట్ట దుర్గానగర్ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ.సుమంత్ గత సంవత్సరం నుంచి అద్దెకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తక్కువ కులం అని తెలుసుకున్న లక్ష్మీ సుమంత్ ఇంట్లో నీళ్లు రాకుండా చేయడం, అకారణంగా సూటిపోటు మాటలనడం చేస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని వేధిస్తున్నది. ఇటీవల సుమంత్ తండ్రి రవితేజ రావడంతో ఆయనను కూడా దూషించింది. దీంతో బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీఎంపై దాడిచేసినవారి అరెస్ట్‌కు డిమాండ్
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 25న పొందూరు ఐకేపీ ఏపీఎం సవర వెంకట్రావుపై దాడి చేసినవారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. తొలుత ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశమయ్యారు.వైఎస్ఆర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. అక్కడ్నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ అందుబాటులో లేకపోవటంతో ఏజేసీ ఆర్.ఎస్.రాజకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగుల సంఘం ప్రనినిధులు వెంకట్రావు, వైకుంఠరావులు మాట్లాడుతూ 25న జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజల సమక్షంలో ఏపీఎం సవర వెంకట్రావుపై నందివాడ గ్రామ సర్పంచ్ గోపాలకృష్ణ, అతని అనుచరులు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. పజల పక్షాన పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ రాజకీయ అండదండలతో దాడులు చేస్తున్నారన్నారు. అధికారుల సమక్షంలోనే దాడి జరిగినా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. మండల స్థాయి ఉద్యోగులకే రక్షణ లేకపోతే గ్రామాల్లోని ఉద్యోగుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో ఎచ్చెర్ల, వీరఘట్టం తదితర ప్రాంతాల్లో మండల మహిళా సమాఖ్యల ఎన్నికల్లోనూ ఐకెపీ సిబ్బందిపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీలు, డీపీఎంలు నారాయణరావు, రాజ్‌కుమార్, జి.నారాయణరావు, రాజారావు, ఏపీఎంలు, సీసీలు, సీవీలు, వీఏవోలు, ఎన్‌పీఎం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాజారాంనగర్‌కు చెందిన నాగశ్రీ అ నే మహిళను కులం పేరుతో దూషించిన ఘటనలో వెంకటాద్రి, సత్యవతి, మురళి, రమేష్, చారిపై ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆకుల రామ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గోవింద్‌పేట్ గ్రామానికి చెందిన రవికి పట్టణానికి చెందిన నాగశ్రీతో 14 ఏళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది. నాగశ్రీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళ, కాగా ఇటీవల రవి, నాగశ్రీ ఆస్తులు పంచాలని రవి తల్లితండ్రులు వెంకటాద్రి, సత్యవతిని కోరారు. దీంతో వారు మురళి, రమేష్, చారీని సంప్రదించారు. అందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో తనను కులం పేరుతో దూషించారని నాగశ్రీ పైన పేర్కొన్న వారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
అట్రాసిటీ కేసుల్లో అందని సత్వర న్యాయం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎస్సీ,ఎస్టీ అత్యాచార కేసుల్లో సత్వర న్యా యం జరగక పోగా కేసు నమోదు సమయంలోనే బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, బాధితుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అనేక అట్రాసిటీ కేసులు పెండింగులో ఉంటున్నాయన్నారు. కేసులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని కమిటీ సభ్యుడు ధనరాశి శ్యాం సుందర్ అన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందడంలేదన్నారు. పెదపూడి మండలం కరకుదురులో ఆక్రమణలో ఉన్న14.55 ఎకరాల అసైన్డ్ భూమి విషయమై మూడుసార్లు కమిటీ సమావేశాల్లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా నాయకులు చెంగళరావు, అప్పారావు అన్నారు. 1976లో 27మంది ఎస్సీలకు పట్టాలు ఇచ్చి స్వాధీనం చేసిన ఈ భూమిని అగ్రవర్ణ వ్యక్తి ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ భూమిని లబ్ధిదారులకు స్వాధీనపరిచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సిరి, అదనపు వైద్యాధికారి పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసులో ఆరుగురి అరెస్టు
కామేపల్లి, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని బండిపాడు గ్రామానికి చెందిన ఆరుగురిని అట్రాసిటీ కేసులో అరెస్టు చేసినట్లు కామేపల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బండిపాడుకు చెందిన జాటోత్ మంగ్తు, అదే గ్రామానికి చెందిన వేగినాటి రామారావు పొలం వద్ద గత నెల 9న గొవడపడ్డారు. దీంతో మంగ్తుపై వేగినాటి రామారావు, కానబోయిన బిక్షం, కొల్లి శ్రీకాంత్‌తో పాటు మరో ముగ్గురు దాడి చేసి కులం పేరుతో దూషించారు. మంగ్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వేర్వేరు కేసుల్లో ముగ్గురు... ఎర్రుపాలెం: వేర్వేరు కేసుల్లో ముగ్గురిని సోమవారం అరెస్టుచేసి మధిర కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై టి.సురేష్ తెలిపారు. మండలంలోని మామునూరు గ్రామంలో ఇటీవల చోరీకి గురైన రెండు విద్యుత్ మోటార్లున కొనుగోలు చేసిన కేసులో కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గంధసిరి వెంకన్న(45) అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని కాచారంగ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అదే గ్రామానికి చెంది న మస్తాన్(40)ను, మండలంలోని రాజులదేవరపాడులో మోటారుసైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన ఏడూరి అప్పిరెడ్డి(20)ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. బ్యాటరీలు అపహరించిన కేసులో... ముదిగొండ : వాహనాల బ్యాటరీలను అపహరించి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై జంగం నాగేశ్వరరావు తెలిపారు. ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం... వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిలక కోయలపాడుకు చెందిన ఊడుగుల మహేష్, షేక్ చాంద్‌పాషా, జోగి ప్రశాంత్, ఊడుగుల పాపయ్య ముఠా గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముది గొండ, ఖమ్మం రూరల్ మండలంలోని క్వారీలు, గ్రానైట్ ప్యాక్టరీల్లోని టిప్పర్లు, పొక్లైయిన్లు, ట్రాక్టర్లు, లారీల నుం చి బ్యాటరీలను దొంగిలించారు. 28 బ్యాటరీలను ఆటో లో వల్లబికి తరలించారు. అక్కడినుంచి జగ్గయ్యపేటకు వెళ్లడానికి బస్టాండ్‌సెంటర్‌లో ఉన్నారనే సమాచారం మే రకు పోలీసులు అక్కడిని చేరుకుని నలుగురిని అరెస్టు చేశారు. వారినుంచి బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. -
ప్రేమించి మోసం చేసిన యువకుడిపై కేసు
తూప్రాన్, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసి, గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తూప్రాన్ మండలంలోని యావపూర్‌కి చెందిన ఓ యువతి (19), అదే గ్రామానికి చెందిన నీలం శంకర్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది. అయితే యువతికి అబార్షన్ చేయించాలన్న శంకర్ ప్రయత్నం విఫలం కావడంతో అమ్మాయిని వారి ఇంట్లోనే వదలి వెళ్లాడు. మరుసటి రోజు (జూలై 30న) ప్రియుడు ప్రియురాలిని వెంటబెట్టుకుని రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో ఉన్న ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించి స్థానిక వైద్యుల సాయంతో అబార్షన్ అయ్యేందుకు మందులు ఇప్పించాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు అబార్షన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి జరిగిన విషయమై ఆరా తీశారు. అనంతరం నీలం శంకర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.