
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల్ని జూన్ 6లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం కలెక్టర్లతో అట్రాసిటీ కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలపై ఆయన వీడియో సదస్సు నిర్వహించారు. అట్రాసిటీ కేసులను జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్షిస్తున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని జోషి సూచించారు.
డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు నష్ట పరిహారాన్ని నిర్దేశిత కాలపరిమితిలోగా అందేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ రైతులకు 41,09,743 పాసుపుస్తకాలను పంపిణీ చేశామని, సీఎం కేసీఆర్ రోజూ జిల్లాల వారీగా పనితీరును సమీక్షిస్తున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి చెప్పారు. జూన్ 20లోగా మిగిలిన పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment