అట్రాసిటీ కేసు నమోదు
Published Sun, Feb 5 2017 12:01 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM
పామిడి : పామిడి మండలం కత్రిమల గ్రామానికి చెందిన బోయ ఓబులయ్య, నడిపి మారెన్న, రామాంజి, ఎర్రెడ్డి, మహేశ్, ప్రసాద్, మాధవరాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శనివారం నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో సత్యమయ్య అంగడి వద్ద శుక్రవారం రాత్రి కడవకల్లు రాము ఫోన్‌లో ఎవరినో దుర్భాషలాడుతుండగా తమనే తిడుతున్నాడని భావించి పైన పేర్కొన్న వారు ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి రాము సహా గంగాధర్, నారాయణస్వామి, సునీల్, రామాంజి, ఓబులేసు, ఎల్లమ్మ సహా మరికొందరిపై పైన పేర్కొన్న వారు దాడి చేసి, గాయపరిచారన్నారు. బాధితుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Advertisement
Advertisement