Affidavit Filed
-
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్‌రెడ్డి
-
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్‌రెడ్డి వివిద బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా.. భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు. -
శశి థరూర్‌కు రూ. 55 కోట్ల ఆస్తులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ సీటును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తనకు రూ.55 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.49 కోట్లు కాగా, రూ.6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4.32 కోట్ల ఆదాయం వచి్చనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండు కార్లు ఉన్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రూ.23 కోట్ల ఆస్తులు, 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.35 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు థరూర్ వెల్లడించారు. -
అంతా నిబంధనల మేరకే
న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది. ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
ఆ వివరాలు ఆఫిడవిట్లో.. పొందుపర్చలేదని.. బీఆర్ఎస్ అభ్యర్ధిపై దుమారం!
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠత కొనసాగింది. అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్ పరిశీలన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సంపత్ కుమార్, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌తోపాటు ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు, రాజీనామా చేసిన కాఫీని పొందపర్చలేదని ఎన్నికల నిబంధనల మేరకు తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి అమోదించినట్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి బయటికి వెళ్లడానికి వాహనం వద్దకు రాగా వారు అడ్డుపడుతూ.. నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధరణ అబ్జర్వర్ వసంత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రం వద్దనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటంతో ఉత్కంఠత కొనసాగింది. అనంతరం ఫిర్యాదు చేసిన అభ్యర్థులు బయటికి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలంపూర్ సీఐ రాజు, శాంతినగర్ సీఐ శివకుమార్ గౌడ్లు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకోని పర్యవేక్షించారు. ఇవి కూడా చదవండి: నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది! -
అఫిడవిట్లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పిదం చోటుచేసుకుంది. ఇందిర తన అఫిడవిట్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఉన్న కాలంలో అప్లికేబుల్ బదులు నాట్ అప్లికేబుల్ అని పూరించారు. ఈ విషయమై సోమవారం ఆర్ఓ కార్యాలయంలో జరిగిన స్క్రూట్నీలో బీజేపీ అభ్యర్థి విజయరామారావుతో పాటు స్క్రూట్నీలో పాల్గొన్న ఇతర అభ్యర్థులు ఆర్‌ఓతో చర్చించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ఏ పార్టీ నుంచి బీ–ఫారం జతచేస్తారో దానినే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళి మేరకు ఆమె నామినేషన్‌ను ఆమోదించామని తెలిపారు. వినయ్‌భాస్కర్.. తప్పుడు అఫిడవిట్.. బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని బీజేపీ నాయకుడు, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జరిమానా విఽధించిందని, ఈ జరిమానాను చెల్లించాడని, రూ.2 వేలకు పైగా జరిమానా చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తాను రూ.1,000 మాత్రమే జరిమానా చెల్లించినట్లు అఫిడివిట్లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వినయ్‌భాస్కర్ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పారదర్శకంగా విధులు, బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపించారు. రూ.3 వేలు జరిమానా విధించిన జడ్జిమెంట్ ప్రతిని, జరిమానా చెల్లించినట్లు ఆధారాలు అందించినా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై చర్యలు తీసుకోకుండా ఆమోదించారని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి చదవండి: 'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా? -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది. నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది. రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం రామ్మమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. -
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
AP: ఫ్రీ బీస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: ఫ్రీ బీస్ కేసులో సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ అఫిడవిట్ దాఖలు చేసింది. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టులో ఇంటెర్వీన్ పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఉచిత హామీలంటే ఏంటో తెలియాలి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు కాగా, ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ) తెలి యజేసింది. ఆయా పథకాల అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై సంబంధిత రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించిం ది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకొనే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేయకుండా అలా చేయలేమని ఉద్ఘాటించింది. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేశామని ఎన్నికల సంఘం వివరించింది. పార్టీల రిజిస్ట్రేషన్, డీ–రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశామని తెలిపింది. ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అశ్వినీకుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
దాచడానికి ఏమీ లేదు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో దాచేయడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి తటస్థులైన ప్రఖ్యాత నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పెగసస్‌పై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థలు అసలు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని, ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పెగసస్ అనేది దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. దీన్ని సంచలనాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. అత్యున్నత సాంకేతికతకు సంబంధించిన ఈ అంశాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఓ వెబ్ పోర్టల్‌లో ప్రచురించిన వార్తల ఆధారంగానే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, వాస్తవానికి పెగసస్‌పై తప్పుడు కథనాలు సృష్టించారని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సొంత లాభం కోసం తప్పుడు ప్రచారం: కేవలం ఊహాగానాలు, అనుమానాలు, బలమైన సాక్ష్యాధారాలు లేని మీడియా కథనాలను, అసంపూర్ణ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెగసస్ స్పైవేర్‌పై కొందరు స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఇప్పటికే సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. కొందరు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగసస్‌పై మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం దేశంలో 300కు పైగా ఫోన్లపై నిఘా పెట్టిందని, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం బాంబు పేల్చింది. దీంతో ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. పెగసస్‌పై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసిన విషయం తెల్సిందే. -
ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. 1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు. 2. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 3. పదేపదే వ్యాక్సిన్ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది. 4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్ వృథా అయ్యే అవకాశం ఉంది. 5. డోర్ టు డోర్ వల్ల కరోనా ప్రొటోకాల్స్ పాటించే అవకాశం ఉండదు. -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు..
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగా, ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నామని.. పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎస్ఈసీ పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని కూడా ఏపీ ప్రభుత్వం.. హైకోర్టుకు వాదనలు వినిపించింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విధితమే. -
ఆయన హయాంలో ఓ వ్యూహమంటూ లేదు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, ఉద్వాసనకు గురైన మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోంది. తాజాగా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాపై మిస్త్రీ మరిన్ని ఆరోపణలు చేశారు. టాటా హయాంలో పెట్టుబడులకంటూ ఓ వ్యూహమంటూ ఉండేది కాదని మిస్త్రీ పేర్కొన్నారు. టెలికం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత స్థాయిలో గ్రూప్ విలువ నాశనమైందని మిస్త్రీ ఆరోపించారు. 2012 డిసెంబర్లో టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినప్పట్నుంచీ రతన్ టాటాపై పెట్టిన వ్యయాలన్నీ ఆయన కంపెనీకి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. టాటా గ్రూప్ అఫిడవిట్లకు ప్రతిగా మిస్త్రీ కుటుంబ సంస్థలు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్‌గా టాటా సన్స్ తొలగించడం, అటుపైన సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అది చెల్లదంటూ నేషనల్ కంపెనీ లా అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే మే 29న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా తమ వాదనలు తెలియజేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది. మిస్త్రీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వాటిల్లాయని, అందుకే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని టాటా గ్రూప్ పేర్కొనడాన్ని మిస్త్రీ తప్పు పట్టారు. -
నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం తుది అఫిడవిట్‌ను హైకోర్టులో శుక్రవారం సమర్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రిలిమినరీ కౌంటర్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం కీలక అంశాలు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘ సంస్కరణల్లో భాగంగా కొత్త కమిషర్‌ను నియమించామని తెలిపింది. రిటైర్డ్ జడ్జిని ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేసింది. (నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు) మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాలపరిమితి వివరాలను కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 221 హింసాత్మక ఘటనలు జరగ్గా.. 2020లో 88 ఘటనలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎస్ఈసీగా బాధ్యాయుత పదవిలో ఉన్న రమేష్‌కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది. పోలీసులు, పరిపాలనా యంత్రాంగంపై నిమ్మగడ్డ ఆరోపణలు అవాస్తవమని చెప్పింది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారని.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. (రమేష్ కుమార్ పిటిషన్‌పై కీలక వాదనలు) -
కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశింకు నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాశింను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, కాశింపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ సహాయ పోలీస్ కమిషనర్ పి.నారాయణ కౌంటర్ దాఖలు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి కోసమే కాశిం ప్రొఫెసర్, జర్నలిస్ట్ అనే ముసుగులు వేసుకున్నారని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌గా ఉంటూ విద్యార్థుల్లో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నూరిపోసి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. బలమైన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కాశింను అరెస్టు చేశామని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పలువురు నేతలను పొట్టనబెట్టుకున్న నేర చరిత్ర కూడా మావోయిస్టు పార్టీకి ఉందని, అందుకే ప్రభుత్వం సీపీఎం (మావోయిస్టు) పార్టీని గతంలోనే నిషేధించిందని వివరించారు. అలాంటి పార్టీతో కాశింకు సంబంధాలు ఉన్నాయని గతంలో పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలిపారు. మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే సంస్థల్లో కాశిం ప్రముఖుడని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్ట ప్రకారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాశింపై పోలీసులు నమోదు చేసిన కేసు చట్టబద్ధమేనని.. గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టేయాలని కోరారు. కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు.. ‘కాశిం గళాన్ని అణచివేయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకల్ని నొక్కేయడం లేదు. మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేశారు. 2016లో ఉన్న కేసులు అరెస్టు చేయకపోవడం వల్లే పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాం. కాశిం ఇంట్లో సోదాలు ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే చేశాం. సోదాల సమయంలో వీడియో చిత్రీకరణ కూడా చేశాం. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, కంప్యూటర్ వంటి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పరీక్షల్లో ఏమీ తేలలేదు. కాశింపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. మరో రెండు కేసుల్లో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మావోయిస్టుల పేరుతో చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాకే కాశింను అరెస్టు చేశాం. అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులతో కార్తీక్ అనే పేరుతో కాశిం సంప్రదిస్తున్నారు. 2018లో శ్యాంసుందర్‌రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలంలో ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురే కాశిం భార్య స్నేహలత. ఆమె కూడా అదే కేసులో నిందితురాలు. అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశిం ప్రొఫెసర్ ముసుగులో వ్యాప్తి చేస్తున్నారు’అని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. -
ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు మొత్తం రూ 3.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. 2015లో కేజ్రీవాల్ ఆస్తులు రూ 2.1 కోట్లుగా కాగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆస్తులు రూ 1.3 కోట్లు వృద్ధి చెందాయి. న్యూఢిల్లీ స్ధానానికి కేజ్రీవాల్ నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పేరిట ఉన్న నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు 2015లో రూ 15 లక్షల నుంచి 2020కి రూ 57 లక్షలకు పెరిగాయి. సునీతా కేజ్రీవాల్‌కు రూ 32 లక్షల విలువైన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు వాలంటరీ రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రాగా, మిగిలిన మొత్తం ఆమె సేవింగ్స్‌గా చూపారు. ఇక కేజ్రీవాల్ పేరిట 2015లో చూపిన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ 2015లో రూ 2.2 లక్షల నుంచి 2020కి రూ 9.6 లక్షలకు పెరిగాయి. గత ఐదేళ్లలో కేజ్రీవాల్ స్ధిరాస్తులు రూ 92 లక్షల నుంచి రూ 1.7 కోట్లకు పెరిగాయి. 2015లో ఆయనకు ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లే ఇది సాధ్యమైందని ఆప్ నేతలు చెబుతున్నారు. చదవండి : 6 గంటలు కేజ్రీ వెయిటింగ్ -
ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు
నాగ్‌పూర్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవీస్ తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు. -
ఆర్టీసీ సమ్మె: డిమాండ్లు పరిష్కరించం.. చర్చలు జరపం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా.. తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చే అవకాశ ఉందని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని, అలాంటి సమ్మెను అక్రమమైనదిగా ప్రకటించాలని అఫిడవిట్లో కోరారు. ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని తేల్చిచెప్పారు. ఇక కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని కోర్టుకు తెలిపిన సునీల్ శర్మ, మరోసారి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయిందని కోర్టుకు తెలిపారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం టీఎస్ ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు యూనియన్ నేతలు పనికట్టుకున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, ఇప్పటికైనా సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని మరోసారి కోరుతున్నట్లు అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించేందుకే జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆరోపించారు. ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచించిన తిసభ్య కమిటీని ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీ తాజాగా దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. -
ఆదిత్య ఠాక్రే ఆస్తులివే..
ముంబై : శివసేన యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ఠాక్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్‌ఠాక్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠాక్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి. -
స్విస్ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!
సాధారణంగా అక్రమ సంపాదనపరులు తమ నల్లడబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారని అంటుంటారు. అక్కడి బ్యాంకుల్లో సొమ్మున్నట్టు బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. అయితే, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ జాఖఢ్ మాత్రం తన భార్యకు స్విస్ బ్యాంకులో ఏడు కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. తన భార్య సిల్వియా జాఖఢ్ పేరుమీద జ్యూరిక్ లోని జ్యూర్చర్ కాంటోనల్ బ్యాంకులో 7.37 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన అస్తిపాస్తుల వివరాల్లో వెల్లడించారు. మధ్య ప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీదేవల్తో తలపడుతున్నారు. స్విస్ బ్యాంకు సొమ్ము కాకుండా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 1.23 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని సునీల్ తెలిపారు. తన భార్యకు 12.06 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఇక సన్నీడియోల్ విషయానికి వస్తే ఆయనకు 60.46 కోట్ల విలువైన చరాస్తులు,21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య లిండా దేవల్‌కు 5.72 కోట్లు ఉన్నాయి. సన్నీదేవల్కు మొత్తం 49.3 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 1.66 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సన్నీ దేవల్ జీఎస్టీ కింద కోటి 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. -
రాహుల్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ హై(మోదీ దొంగ) అని సుప్రీంకోర్టు చెప్పిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టు ముందు 3 పేజీల అఫిడవిట్‌ను దాఖలుచేశారు. తనకు సుప్రీంకోర్టుపై చాలా గౌరవముందని వ్యాఖ్యానించారు. తాను చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా సుప్రీం తీర్పునకు ఆపాదించలేదనీ, అది అనుకోకుండా జరిగిందన్నారు. తనపై క్రిమినల్ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. రఫేల్ ఒప్పందం విషయంలో పిటిషనర్లు సాక్ష్యాలుగా సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు 2019, ఏప్రిల్ 10న తెలిపింది. ఈ నేపథ్యంలో అమేథీలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్ చోర్’ అని సుప్రీంకోర్టు కూడా తేల్చిందని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలను సుప్రీం తీర్పుకు ఆపాదించారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ విచారణను కొట్టేయండి.. ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్ తరఫున వాదిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుకు తన అభిప్రాయాన్ని ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నారు. అనుకోకుండా ఆ వ్యాఖ్యలను చేశాననీ, ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ అఫిడవిట్‌ను న్యాయస్థానం అంగీకరించి, తనపై జరుగుతున్న క్రిమినల్ ధిక్కార విచారణను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు’ అని తెలిపారు. బీజేపీ మీనాక్షి లేఖి పిటిషన్‌పై గతంలో రాహుల్ క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు అఫిడవిట్లు దాఖలుచేశారు. -
కుటుంబ ‘రుణాలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా.. వీరంతా తల్లి, కొడుకు, కూతురు తదితర కుటుంబసభ్యులకు బాకీ ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వీరంతా కుటుంబ సభ్యులకు బకాయి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. రాహుల్ తన తల్లి సోనియా నుంచి అప్పు తీసుకోగా, ములాయం కొడుకు అఖిలేశ్ నుంచి, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నుంచి రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్‌కు రూ.5 లక్షల అప్పు యూపీలోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి రూ.5 లక్షలను అప్పు రూపంలో తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇది తప్ప ఇతర అప్పులేవీ లేవని తెలిపారు. సోనియా మాత్రం ఎవరి వద్దా రుణం తీసుకోలేదని పేర్కొన్నారు. యూపీలోని మైన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ తన కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ నుంచి రూ.2.13 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో భార్య సాధనా యాదవ్‌కు రూ.6.75 లక్షలు, కొడుకు ప్రతీక్‌కు రూ.43.7 లక్షలు, కుటుంబ సభ్యురాలు మృదులా యాదవ్‌కు రూ.9.8 లక్షలు అప్పు ఇచ్చినట్లు ములాయం తెలిపారు. కూతురి నుంచి రూ.10 కోట్ల అప్పు పట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కూతురు, సినీ నటి అయిన సోనాక్షి సిన్హాకి రూ.10.6 కోట్లు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, తన కుమారుడు లవ్ సిన్హాకు రూ.10 లక్షలు, భార్య పూనమ్ తదితరులకు రూ.80 లక్షల మేర అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు. యూపీలో లక్నో నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పూనమ్ సిన్హా తన కూతురు సోనాక్షి నుంచి రూ.16 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎటువంటి రుణం లేదని వెల్లడించారు. శత్రుఘ్న సిన్హా ప్రత్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎటువంటి బకాయిలు లేవని తెలిపారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, ఆర్జేడీ తరఫున పాటలీపుత్రలో బరిలో ఉన్న మిసా భారతి వ్యక్తిగత రుణాలు లేవని, తన భర్త శైలేష్ కుమార్‌కు మాత్రం రూ.9.85 లక్షల బ్యాంకు లోన్ ఉందని పేర్కొన్నారు. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తాను రూ.28 లక్షలు, తన భర్త రూ.2.9 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీకి చెందిన ఆమె ప్రత్యర్థి రామ్‌కృపాల్ రూ.17.17 లక్షలు‡ తన కూతురి కోసం విద్యారుణం తీసుకున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగిగా పేర్కొన్న కన్హయ్యకుమార్ బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తనకు రూ.5.86 లక్షలు, తన భార్యకు రూ.26.5 లక్షలు రుణం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనకు రూ.75 లక్షలు, తన భార్యకు రూ.15 లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈయన ప్రత్యర్థిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ బ్యాంకు అకౌంటు లేదని, నిరుద్యోగినని తెలిపారు. చండీగఢ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కిరణ్ ఖేర్ తన కుమారుడి నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు, భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన అనుపమ్ ఖేర్‌కు రూ.35 లక్షలను రుణంగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. దక్షిణ ముంబై నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరా తన భార్య పూజాకు బదులు రూపంలో రూ.4.96 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. -
రఫేల్ రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
అసెంబ్లీ బరిలో పచ్చ రౌడీలు
తూటాలు దూసుకొస్తున్నాయి.. కత్తులు కరాళనృత్యం చేస్తున్నాయి.. తంతారో, నరుకుతారో మీ ఇష్టం అనే భరోసా. అడ్డూఅదుపులేని ఆర్థిక నేరాలు. ఆనవాలు కూడా దొరకని హత్యలు. పసుపు కండువాలకు అంటుకున్న రక్తపు మరకల్ని కుంకుమ అంటూ మభ్య పెట్టే ప్రయత్నాలు. మహిళల నుదుటన బొట్టును చెరిపేసే.. ఖద్దరు చీకటి కోణాలకు సజీవ సాక్ష్యాలు ఇవిగో. భావి తరాలకు ఎలాంటి సందేశం ఇద్దాం.. ఎవరికి ఓటేద్దాం.. ఆలోచించండి. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేర చరిత్ర కలిగిన టీడీపీ అభ్యర్థుల్లో ప్రముఖుడు. ఈయనపై నాలుగు కేసులు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపి హతమార్చేందుకు యత్నించారు. తీవ్ర రక్తగాయాలు కాగా.. ఒక కిడ్నీ తొలగించారు. అతికష్టం మీద ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని అప్పట్లో నిమ్స్ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా బాలకృష్ణ తరచూ ఎవరి మీదనో ఒకరిమీద చేయి చేసుకుంటూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పరిటాల శ్రీరాం రామగిరి పోలీసుస్టేషన్లో కిడ్నాప్, హత్యాయత్నం తదితర నేరాల కింద( నెంబర్ 57/2018) పరిటాల శ్రీరాంపై కేసు నమోదైంది. ఇదే కాదు రాప్తాడు మాజీ మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి హత్యకేసులో ఇతని ప్రమేయం ఉందని అప్పట్లో మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేయలేదు. కందుకూరు శివారెడ్డి హత్య శ్రీరాం చేయించారని శివారెడ్డి కుమారుడు స్టేషన్లో ఏకంగా ఫిర్యాదు చేశారు. ఇతను రాప్తాడు నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న కాలవ శ్రీనివాసులుపైనా నాలుగు కేసులు ఉన్నాయి. మూడు కేసులు ఉంటే రౌడీషీట్ తెరవచ్చు. కాకపోతే అధికారపార్టీ నేత కావడంతో పోలీసులు ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈయన మంత్రి. వరదాపురం సూరి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణపై స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో కేసు(సీసీ నెంబర్:48/2014) పెండింగ్‌లో ఉంది. దీన్ని ఇటీవలే విజయవాడ స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. ఈయన ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్నెళ్ల్ల పాటు ఎవరినైనా చంపేసుకోవచ్చు. కేసులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. కందికుంట ప్రసాద్ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట ప్రసాద్‌పై మొన్నటి వరకు ఏడు కేసులు ఉండేవి. ప్రస్తుతం సీబీఐ కోర్టులో(సీసీ నెంబర్2/2003, సీసీ నెంబర్ 33/2007) ఓ కేసు నడుస్తోంది. చెక్‌బౌన్స్ కేసుల్లో శిక్షపడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవలే ఆ తీర్పుపై స్టే తెచ్చుకుని తిరిగి పోటీలో ఉన్నారు. ‘అనంత’లో ఎలాగైనా ఎన్నికలు గెలవాలనే ఏకైక లక్ష్యంతో ఎన్ని అరాచకాలు చేసేందుకైనా వెనుకాడకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించుకుంది. ఆ పార్టీ బరిలో దింపిన అభ్యర్థులను చూస్తే ఈ విషయం బోధపడుతోంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు జిల్లాకు ఫలానా మంచి చేసినట్లు చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. శంకుస్థాపనలకు పరిమితమైన సంస్థలు కేంద్రప్రభుత్వానివి! సిమెంట్ రోడ్ల నిధులు ఉపాధిహామీ పథకానికి చెందినవి. చివరకు చంద్రన్నబీమా లాంటి పథకాలు కూడా కేంద్రానివే! తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకాన్నీ చంద్రబాబు అమలు చేయలేకపోయారు. ఇది టీడీపీపై ప్రజావ్యతిరేకతను పెల్లుబికేలా చేసింది. నేర చరితులకు టికెట్లు ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడంతో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని చంద్రబాబుకు స్పష్టంగా తెలిసిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు సవాల్‌గా మారాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు కుటుంబం ఉనికి కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే వయోభారంతో నలిగిపోతున్న చంద్రబాబు.. తన వారసుడి రాజకీయ భవిష్యత్తుపై అంతులేని బెంగతో నలిగి పోతున్నారు. ఆయన వారసుడికి రాష్ట్రంలో ఎంత గొప్ప పేరు ఉందో తెలియంది కాదు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ధనబలం, కండబలం ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. డబ్బు.. దౌర్జన్యం ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం చంద్రబాబు తొలిమార్గం. అందుకు అనుగుణంగానే ఈ ఐదేళ్లు ప్రజలను నిలువునా దోచేసిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.2 వేలు నుంచి రూ. 3వేలు పంచేందుకు టీడీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక చంద్రబాబు రెండో మార్గం.. డబ్బుకు లొంగని వారిని భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందడం. ఇందుకు నేరస్తులైతే సరిపోతారు. ఈ లక్ష్యంతోనే ‘నేరస్తుల టీఎం’ను చంద్రబాబు ఎంపిక చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి పాత నేర చరిత్ర చూస్తే భవిష్యత్తులో వీరు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు లోపించి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు పేర్కొన్న నేరచరిత్ర పరిశీలిస్తే.. - హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై యు/ఎస్ 500 ఐపీసీ కింద సీసీ నంబరు 48/2014 కేసు అమరావతి ప్రత్యేక కోర్టులో ఉంది. గుంతకల్లు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో యు/ఎస్ 174(ఎ), 147 ఆఫ్ రైల్వే చట్టం ప్రకారం ఎస్టీసీ నంబర్ 1477/2013, ఎస్టీసీ నంబరు 473/2013, ఎస్టీసీ 313/2013 కేసులు ఉన్నాయి. - పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథిపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రై మ్ నంబర్ 193/2013 కేసు పెండింగ్‌లో ఉంది. అనంతపురం ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ వద్ద సీసీ నెం: 88/2018 పెండింగ్‌లో ఉంది. ఈ కేసులు యూ/సెక్షన్ 147, 148, 336, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద నమోదయ్యాయి. - నందమూరి బాలకృష్ణపై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్లో సీఆర్.నెం.10/09, గుత్తి పోలీసు స్టేషన్లో సీఆర్.నెం.20/09, విజయవాడ స్పెషల్ కోర్టులో సీసీ 40/18, సీసీ 43/18, విజయవాడ కోర్టులో యూ/ఎస్ 188, 283 ఆఫ్ ఐపీ, యు/ఎస్ 188, 283 ఐపీసీ కేసులు ఉన్నాయి. - మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్నపై మడకశిర పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 171–ఇ, 188 ఆఫ్ ఐబీపీ కింద క్రైమ్ నెం: 76/2013 కేసు నమోదైంది. మడకశిర జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సీసీ నెం: 91/2013 ఉన్న ఈ కేసు విజయవాడ స్పెషల్ కోర్టుకు (సీసీ నెం: 7/19) బదిలీ అయింది. - తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిపై ఎలాంటి కేసులు లేవు. అయితే ఇతని తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి గతంలో రౌడీషీటర్! తాడిపత్రి టౌన్ పోలీసుస్టేషన్లో డిసెంబర్ 1, 1993న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 240/ఏఎన్ నంబర్‌తో రౌడీషీట్ తెరిచారు. ఇతనిపై రౌడీషీటే కాదు పదుల సంఖ్యలో వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తర్వాత కొట్టేయించుకున్నారు. తన కుమారుడి గెలుపు కోసం ఓటర్లపై రౌడీయిజం చెలాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. - ధర్మవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జి.సూర్యనారాయణపై ఐపీసీ 500 కింద సీసీ నెం:48/2014గా ధర్మవరం జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కేసు ఉంది. ఈ కేసు ఇటీవలనే విజయవాడలోని స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. - మంత్రి కాలవ శ్రీనివాసులుపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 147, 148, 336, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద క్రైమ్ నెం: 193/2013 కేసు నమోదైంది. బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 283, 188 ఐపీసీ కింద క్రైమ్ నెం: 10/2009 ఓ కేసు, గుత్తి పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 283, 188 కింద ( క్రైమ్ నెం: 20/2009) మరో కేసు నమోదైంది. - కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై బెళుగుప్ప పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 143, 188, ఆర్/డబ్ల్యూ34 ఆఫ్ ఐపీసీ కింద క్రైమ్ నెం:62/2019 కేసు నమోదైంది. కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో పీఓఆర్ నెం:21/2016–17 మరో కేసు నమోదైంది. - పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై అండర్ సెక్షన్ 188, 283 ఆఫ్ ఐపీసీ కింద గుత్తి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 20/2009 కేసు నమోదైంది. - రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ మీద రామగిరి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నెం: 57/2018 (సెక్షన్లు 363, 324, 384, 342, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ) నమోదైంది. బోయ నారాయణ అలియాస్ సూర్యం అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. - ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మీద బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ 10/2009 కేసు నమోదైంది. అనంతపురం మొదటి క్లాస్ మెజిస్ట్రేట్ ఫర్ ఎక్సైజ్ అఫెన్స్ కోర్టులో ఉన్న ఈ కేసును ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు పరిశీలించే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. - కదిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌పై హైదారాబాద్ సీబీఐ కోర్టులో సీసీ నెం:2/2003, సీసీ నెం:33/2007 కేసులు నడుస్తున్నాయి. - గుంతకల్లు అభ్యర్థి జితేంద్రగౌడ్ మీద గుంతకల్లు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నెం:99/2005 కేసు నమోదు అయింది. -
‘అందుకే నా విగ్రహాలు ప్రతిష్టించా’
సాక్షి, న్యూఢిల్లీ : దళిత మహిళ పోరాట పటిమకు సంకేతంగానే ఉత్తర్ ప్రదేశ్ అంతటా తన విగ్రహాలతో పాటు, బీఎస్పీ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. మాయావతి సహా బీఎస్పీ నేతల విగ్రహాలను ప్రభుత్వ నిధులు రూ 2000 కోట్లు వెచ్చించి యూపీ అంతటా ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ 2009లో దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా మాయావతి అఫిడవిట్ దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీల అజెండాలను ముందుకు తీసుకువెళ్లే కార్యకలాపాల కోసం రాష్ట్ర బడ్జెట్ల నిధులను వాడరాదని పిటిషనర్ వ్యాఖ్యానించారు. కాగా, తన విగ్రహాలపై వెచ్చించిన ఖర్చును తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్ధానం మాయావతిని కోరిన నేపథ్యంలో ఆమె అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన మీదట, అన్ని నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే విగ్రహాలను ఏర్పాటు చేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆయా పార్టీల నేతల విగ్రహాలను ఏర్పాటు చేశాయని చెప్పుకొచ్చారు. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాజకీయ దురుద్దేశంతోనే ఈ పనిచేశారని విగ్రహాల అంశం లేవనెత్తడంలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఎక్కువ చోట్ల పోటీపై ‘సుప్రీం’ విచారణ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకుండా నివారించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నివారించేలా చట్టం తేవాలంటూ 2004లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా చేసిన ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనలను అన్ని పార్టీలు ఆమోదించినప్పటికీ, 1998లో అప్పటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తోసిపుచ్చిందని తెలిపింది. ఒక వ్యక్తి పోటీ చేసిన రెండు చోట్లా ఎన్నికల్లో గెలిస్తే..రాజీనామా చేసిన స్థానంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును ఆ అభ్యర్థి నుంచి శాసనసభకైతే రూ.5 లక్షలు, లోక్‌సభకైతే రూ.10 లక్షలు రాబట్టాలనే ప్రతిపాదన ఉందని పేర్కొంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నివారించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది. రఫేల్ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారంతా ఐపీసీ కింద దోషులే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది. -
రాఫెల్ డీల్ : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వం సోమవారం సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఒప్పందంలో ఏ భారత వాణిజ్య సంస్థ పేరును ప్రభుత్వం ఆఫ్సెట్ పార్టనర్‌గా సిఫార్సు చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై పూర్తి వివరాలను పిటిషనర్‌తో పాటు ప్రజా బాహుళ్యానికి వెల్లడించాలని అక్టోబర్ 31న సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు రాఫెల్ విమానాల కచ్చిత ధరను సైతం సుప్రీం న్యాయమూర్తులకు సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికలో కేంద్రం పొందుపరిచింది. ఆఫ్సెట్ పార్టనర్ విషయంలో దసాల్ట్ ఏవియేషన్ నుంచి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ వాస్తవంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే వివరాలను కేంద్రం అఫిడవిట్లో పొందుపరచలేదు. ఇక రాఫెల్ విమానాల సేకరణలో 2013 డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విధానాలను పాటించామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం పొందామని, ఫ్రాన్స్‌తో భారత బృందం సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఫ్రాన్స్‌తో సంప్రదింపులు ఏడాదిపాటు సాగయని, ఒప్పందంపై సంతకం చేసేముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి తీసుకున్నామని పేర్కొంది. దసాల్ట్ ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వాముల ఎంపికలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. -
ఆరు పట్టణాల్లో క్రైమ్ సీన్ చిత్రీకరణ
న్యూఢిల్లీ: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్‌లలో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తరువాత దేశమంతా ఈ పద్ధతిని అమలుచేసేందుకు ఆరు నెలల గడువు కోరింది. ఈ మేరకు కేంద్రం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలుచేసింది. నేర విచారణను చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు గతంలో కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. ఈ విషయంలో చొరవచూపిన గుజరాత్.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘మొబైల్ పాకెట్ యాప్’ అనే అప్లికేషన్‌కు అనుసంధానమయ్యే ఒక సెంట్రల్ సర్వర్‌ను రూపొందించింది. పోలీస్ స్టేషన్‌కు సమకూర్చిన ప్రతి సెల్ఫోన్లో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గుజరాత్ నమూనా ఆధారంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన మరో యాప్‌ను పరీక్షించాలనుకుంటున్నట్లు కోర్టు తెలిపింది. ‘నేర విచారణ చిత్రీకరణకు సంబంధించి గుజరాత్ మంచి పురోగతి సాధించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించేలా ఒక సమగ్ర నమూనాను కేంద్రం రూపొందిస్తుందని ఆశిస్తున్నాం’ అని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన లాయర్ శిరిన్ ఖాజురియా మాట్లాడుతూ..కోర్టు గత ఉత్తర్వుల మేరకు కేంద్రీయ పర్యవేక్షణ విభాగం(సీఓబీ) ఏర్పాటైందని తెలిపారు. నేరం జరిగిన చోటును వీడియోతీసే ప్రణాళికపై సీఓబీ తొలి సమావేశం మే 24న నిర్వహించారని చెప్పారు.నేరం జరిగిన చోటును వీడియో తీసే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైందని ఏప్రిల్ 5న కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు విచారణలో వీడియోగ్రఫీ వినియోగం, కాల పరిమితిపై హోం శాఖ నియమించిన కమిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదిస్తూ ఈ విధంగా స్పందించింది. -
ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై కేంద్రం అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఎటువంటి తుదిగడువు లేదని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పొందుపరిచిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో గురువారం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు కలిపి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఏపీ సర్కార్ చొరవ తీసుకుంటే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందనే సంకేతాలు పంపింది. భవనాలు, మౌలిక వసతులను ఏపీ సర్కార్ కల్పిస్తే కేంద్రం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని తెలిపింది. కాగా, కేంద్రం అఫిడవిట్ నేపథ్యంలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. -
బంతి సుప్రీంకోర్టులో..
న్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టే తేల్చాలని కేంద్రం పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377లోని ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికిపోవొద్దని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరమని పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377 పరిధి దాటి మరేదైనా విషయాన్ని కోర్టు పరిశీలించదలచుకుంటే, దాని ప్రభావం ఇతర చట్టాలపై తప్పక ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ‘వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377పై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తోంది. సెక్షన్ 377 పరిధి దాటి ఇతర విషయాల్ని కోర్టు పరిశీలించదలచుకున్నా, ఎల్జీబీటీ వర్గాల హక్కులకు సంబంధించి ఏదైనా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, బదులుగా మరో సవివర అఫిడవిట్ దాఖలు చేస్తాం’ అని కేంద్రం తెలిపింది. అదో ఏవగింపు చట్టం.. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీచేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం ‘సామాజిక ఏవగింపు’నకు ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటి వాటిని చెల్లవని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఎల్జీబీటీ వర్గీయులు గౌరవంగా జీవించేందుకు సాయపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్వలింగ సంపర్కుల ఉపాధికి ఈ చట్టంలోని శిక్షార్హమైన నిబంధనలు తీవ్ర విఘాతంగా మారాయని తెలిపింది. అయినా, స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్నదానిపైనే విచారణ జరుపుతామని, ఎల్జీబీటీ హక్కుల అంశం తమ ముందుకు రాలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377ను సవాలు చేస్తూనే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్రం తెలపింది. ఆ పరిధిని దాటి విచారణ కోర్టు జరపాలనుకుంటే చట్టబద్ధ దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసే అవకాశం ఇవ్వకుండా, సెక్షన్ 377 కాకుండా ఇతర విషయాలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వివాదం లేకుంటే విచారణ వద్దు.. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ..వివాదంలో లేని వ్యవహారాలపై విచారణ అక్కర్లేదని అన్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా..‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కు’ అన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందుకు జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ సంక్లిష్ట విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఇద్దరు వయోజనుల మధ్య సంబంధం ఆర్టికల్ 21కి సంబంధించిందా? కాదా? అనే విషయంపైనే దృష్టిపెడుతున్నామని స్పష్టతనిచ్చారు. -
లోక్‌పాల్ నియామకమెప్పుడు?
న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోక్‌పాల్‌ను నియమించాలని గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయలేదని పేర్కొంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేంద్రం లోక్‌పాల్‌ను నియమించే వరకు సుప్రీం తన అధికారంతో ఆర్టికల్ 142 ప్రకారం లోక్‌పాల్‌ను నియమించాలని కామన్ కాజ్ తరఫు సీనియర్ లాయరు శాంతి భూషణ్ కోరారు. -
నాలుగు వారాల్లోగా సమాధానమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు తీర్పును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పదవీ విరమణ పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కార్పొరేషన్ సంస్థలు, సొసైటీలు, గిరిజన, సాంఘిక, గురుకుల విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితి పెంపును అమలు చేయలేదని ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆగస్టు 9న ఉద్యోగులకు అనుకూల తీర్పును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 58 ఏళ్లకే పదవీ విరమణ పొంది ఉండి ఇంకా పదవీ విరమణ వయస్సు దాటనిపక్షంలో వారిని ఉద్యోగంలో కొనసాగనివ్వాలని, పదవీ విరమణ వయస్సు దాటిన పక్షంలో వారు ఉద్యోగం నుంచి వైదొలగిన సమయం నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చిన నాటికి గల కాలానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని, అమలుకు షరతులు పెడుతున్నదని పేర్కొంటూ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలకు జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసు జారీ చేసింది. -
చిక్కుల్లో నటుడు చలపతి
-
చిక్కుల్లో నటుడు చలపతి
హైదరాబాద్: అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావుకు చుక్కెదురైంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా చలపతిరావు చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో ఆయనపై పలువురు మేధావులు, రచయిత్రులు, మహిళా నాయకులు మండిపడుతున్నారు. మహిళల గౌరవానికి భంగకరంగా, వెకిలిగా మాట్లాడిన ఆయనపై మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు నటుడు చలపతిరావుపై జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన లో ఫిర్యాదు చేశాయి. భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త దేవి తదితరులు పోలీసులకు తమ ఫిర్యాదును అందించారు. మహిళలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రమదాక్షరీ ఉమెన్ రైటర్స్ ఫేస్ బుక్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్లో అమ్మాయిలు మానసిక ప్రశాంతతకు హానికరమా అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతిరావు అమ్మాయిలపై చాలా అవమానకరంగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అట్రాసిటీ కేసు నమోదు
పామిడి : పామిడి మండలం కత్రిమల గ్రామానికి చెందిన బోయ ఓబులయ్య, నడిపి మారెన్న, రామాంజి, ఎర్రెడ్డి, మహేశ్, ప్రసాద్, మాధవరాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శనివారం నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో సత్యమయ్య అంగడి వద్ద శుక్రవారం రాత్రి కడవకల్లు రాము ఫోన్లో ఎవరినో దుర్భాషలాడుతుండగా తమనే తిడుతున్నాడని భావించి పైన పేర్కొన్న వారు ఘర్షణకు దిగారు. మాటామాటా పెరిగి రాము సహా గంగాధర్, నారాయణస్వామి, సునీల్, రామాంజి, ఓబులేసు, ఎల్లమ్మ సహా మరికొందరిపై పైన పేర్కొన్న వారు దాడి చేసి, గాయపరిచారన్నారు. బాధితుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
కోర్టుకు హాజరైన బాలీవుడ్ జంట
ముంబై: బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అర్బాజ్, మలైకా పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. అర్బాజ్, మలైకా 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకాకు ఎఫైర్ ఉందని, దీంతో అర్బాజ్‌తో విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్టు గత మార్చిలో ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత మలైకా, అర్బాజ్ కలసిఉండేలా ఇరు కుటుంబాలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ నిన్న కోర్టుకు వచ్చారు. మ్యారేజి కౌన్సిలింగ్‌కు కలసి వచ్చిన ఇద్దరూ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత కోర్టు ఆరు నెలల సమయం ఇస్తుంది. అప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకుంటే విడాకులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మలైకా అర్బాజ్‌కు దూరంగా ఉంటోంది. -
విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన బాలీవుడ్ జంట!
ముంబై: విభేదాల కారణంగా విడిపోయారని, కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక్కటయ్యారంటూ వార్తల్లో నిలిచిన బాలీవుడ్ జంట మలైకా అరోరా ఖాన్, అర్బాజ్ ఖాన్ వ్యవహారం చివరకు కోర్టుకు చేరింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ (49), మలైకా (43) పరస్పర అంగీకారంతో విడాకుల కోసం గతవారం కోర్టును సంప్రదించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గత మార్చిలో విడిపోతున్నామంటూ ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు కుటుంబాల సభ్యుల జోక్యంతో ఈ జోడీ అప్పట్లో కోర్టు వరకు వెళ్లలేదు. వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అర్బాజ్, మలైకా డిన్నర్, పార్టీలకు హాజరవడంతో మళ్లీ కలసిపోయారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ విడిపోవాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 1998లో అర్బాజ్, మలైకా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. అర్బాజ్, మలైకా పలు సినిమాల్లో నటించారు. -
మార్కెట్ విలువ సవరణపై కౌంటర్ దాఖలు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. చట్టప్రకారం నిర్దిష్ట కాలవ్యవధిలోపు మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ బాధ్యతకు సంబంధించిన చట్టబద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రతీ రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ భూముల విలువను సవరించరాదని ఏమైనా నిషేధం ఉందా? అంటూ ప్రశ్నించింది. లేదని ఏజీ సమాధానం ఇవ్వడంతో 2014 నాటి భూముల ధరలకు, ప్రస్తుత ధరలకు ఎంతో వ్యత్యాసం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ జీవో 123 ద్వారా భూములను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం పాత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తోందని, మార్కెట్ విలువను సవరిస్తే ఎటువంటి న్యాయపోరాటం అవసరం లేకుండానే రైతులు ఎకరాకు రూ.13 లక్షల వరకు పొందే అవకాశం ఉందని వివరించారు. -
కౌంటర్లు దాఖలు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ఏర్పాటును, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటును సవాలు చేస్తూ హుస్నాబాద్ న్యాయవాదుల సంఘం కార్యదర్శి, మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. -
మాజీ ఎమ్మెల్యే జయమంగళపై కేసు నమోదు
కైకలూరు : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ, మరో ఇద్దరిపై కైకలూరు టౌన్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 31న ఆలపాడు చెక్‌పోస్టు వద్ద చేపల చెరువుకు తూములతో వెళుతున్న ట్రాక్టరు, డ్రైవర్‌ను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కైకలూరు ఫార్టెస్ట్ ఆఫీసుకు తరలించారు. ఈ నెల ఒకటో తేదీన జయమంగళ వెంకటరమణ, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కొట్టాడ సర్పంచ్ మైలా నరసింహస్వామి, మరో 60 మంది గ్రామస్తులు కలసి ట్రాక్టరు, డ్రైవర్‌ను బలవంతంగా విడిపించుకుపోయారు. ఆ సమయంలో ఫారెస్ట్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది జె.అంజీ, టి.సురేష్‌బాబు, ఎస్.కుమార్‌ను దుర్భాషలాడారు. ఈ ఘటనపై అదేరోజు డీఆర్వో ఈశ్వరరావు తమ విధులకు ఆటంకం కలిగించారని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై జయమంగళ వెంకటరమణతోపాటు, బలే ఏసు, మైలా నరసింహస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పబ్‌పై క్రిమినల్ కేసులు
బంజారాహిల్స్: నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన సమయాన్ని మించి పబ్‌ను నడుపుతున్న వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు పబ్‌లపై తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 37లో ఉన్న 36 డ్రైవ్ఇన్ పబ్ అర్ధరాత్రి వ్యాపారం చేయడమే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంకా తెరిచిఉన్నట్లు తేలడంతో ఈ పబ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాక్షరభారత్ కోఆర్డినేటర్‌పై కిడ్నాప్ కేసు
జలుమూరు : సాక్షరభారత్ మండల కోర్డినేటర్ బొంగు ఎర్రయ్యపై కిడ్నాప్ కేసు నమోదైంది. లింగాలవలస పంచాయతీ హరికృష్ణమ్మపేటకు చెందిన మైనర్ బాలికను గత నెల 30న ఎర్రయ్య కిడ్నాప్ చేసినట్టు బాలిక తండ్రి మొజ్జాడ కసవయ్య పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎర్రయ్య చల్లవానిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. కిడ్నాప్‌పై ఎస్ఐను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేశామని చెప్పారు. -
ఫలితాలు ఇప్పుడే విడుదల చేయలేం
న్యూఢిల్లీ : ఓ వైపు యజమాని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు యూనిటైడ్ బేవరీస్ హోల్డింగ్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) ఆర్థిక సంవత్సర ఫలితాల విడుదల చేయలేమంటోంది. తమ గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా కేసుల నేపథ్యంలో ఫలితాల విడుదలకు తమకు జూలై వరకు గడువు కావాలని కోరుతోంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆడిటడ్ ఫలితాలను మే 31న విడుదలచేయాల్సి ఉంది. యూబీహెచ్ఎల్ గ్రూప్ లో ఒకటైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగొట్టిన సంగతి తెలిసిందే. వీటికి చైర్మన్ గా ఉన్న విజయ్ మాల్యా తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే కన్సార్టియం అధినేతగా ఉన్న ఎస్ బీఐకు సెటిల్ మెంట్ ఆఫర్ ను విజయ్ మాల్యా ప్రకటించి, సుప్రీంకోర్టు ముందు ఉంచినట్టు తన లేఖలో పేర్కొంది. వాయిదాల రూపంలో రుణాలను చెల్లిస్తామని ప్రకటించిన ఈ సెటిల్ మెంట్ ఆఫర్ ను ఎస్ బీఐ తిరస్కరించింది. మొత్తం రుణాలను వెంటనే చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై ఏప్రిల్ 26న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యూనల్ కు ఈ కేసును బదలాయించింది. రెండు నెలల్లో ఈ సెటిల్ మెంట్ ఆఫర్ పై ట్రిబ్యునల్ తీర్పు ప్రకటించింది. దీనిపై మొదటి విచారణ జూన్ 2న జరుగనుంది. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదలచేయలేమని, 60రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తామని యూబీహెచ్ఎల్ అభ్యర్థిస్తోంది. అయితే సెబీ నిబంధనల మేరకు ప్రతి కంపెనీ ఆర్థికసంవత్సరం(మార్చి30కి) ముగిసిన 60రోజుల వ్యవధిలోనే వాటి ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది. -
బీటెక్ విద్యార్థిపై కేసు నమోదు
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ బీటెక్ విద్యార్థి కటకటాల పాలయ్యాడు. వివరాలివీ.. హైదరాబాద్ పాతబస్తీ సదాత్నగర్ వాసి సయీద్ హమీద్ కుమారుడు అమేర్(19) బీటెక్ చదువుకుంటున్నాడు. అతడు గురువారం ఇంటికి సమీపంలోనే ఉండే బాలిక(8) వీధిలో ఆడుకుంటుండగా కుర్కురే కొనిస్తానని లోపలికి పిలిచాడు. అసభ్యకరంగా ప్రవర్తించటంతో భయపడి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛత్రినాక పోలీసులు అమేర్‌ను అదుపులోకి తీసుకుని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పన్ను చెల్లింపులు 4 శాతమే!
న్యూ ఢిల్లీః పన్ను ఎగవేతదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారన్న విషయం ప్రభుత్వ తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా... వారిలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయం ఇటీవలి ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. పెద్దమొత్తంలో సంపాదించే వారు కూడ ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పన్ను చెల్లింపులు ఏమాత్రం పెరగడం లేనట్లు లెక్కలు చెప్తున్నాయి. నెలసరి ఆదాయం 21 వేల రూపాయలు దాటితే ఆ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపు పరిథిలోకి వస్తాడు. దేశంలో సంవత్సరానికి కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారు అధికంగానే ఉన్నా చెల్లింపులు మాత్రం నాలుగు శాతానికి మించడం లేదని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టాక్స్ చెల్లింపులు ధాఖలు చేసిన భారతీయులు కేవలం 4 శాతమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వార్షిక ఆదాయం పది లక్షలకు మించి ఉన్నవారు అధికంగానే ఉన్నా... పన్ను చెల్లింపుల విషయంలో మాత్రం పది లక్షల మంది కూడ కనిపించడం లేనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నవారిలో... పన్ను చెల్లింపులు దాఖలు చేసినవారు 20,000 కు లోపుగానే ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేవలం 3.1 కోట్ల చెల్లింపులు మాత్రమే ఆ సంవత్సరంలో దాఖలయ్యాయి. 2000-01 నుంచి 2014-15 వరకు విశ్లేషణాత్మక గణాంకాలను ఇటీవల ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది. అయితే ఈ గణాంకాల విడుదల ఓ మైలు రాయిగా చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. పన్ను చెల్లింపులపై పారదర్శకతను తెలియజేయడానికి ఇదో మంచి విధానం అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి
సాక్షి, హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ రుణం కేసులో కేంద్రమంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణం చెల్లింపు వ్యవహారంలో మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. మారిషస్ బ్యాంక్ తనపై దురుద్దేశాలతో కేసు పెట్టిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా తన ప్రతిష్టను దెబ్బతియ్యాలన్న ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టిందని సుజనా చౌదరి ఆరోపించారు. కేసుల ద్వారా పరోక్షంగా తనపై ఒత్తిడి తెచ్చి వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ బ్యాంకు ఆలోచన అని పేర్కొన్నారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న హేస్టియా లిమిటెడ్ మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకుందని, సుజనా యూనివర్సల్‌లో తాను కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌ను మాత్రమేనని వివరించారు. ఆ కంపెనీ రోజువారీ వ్యవహారాలతో తనకు ఎంతమాత్రం సంబంధం లేదన్నారు. అధికారిక కార్యక్రమాలు, ముందస్తు షెడ్యూళ్ల వల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల మినహాయింపునివ్వాలని కోరినా కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు
కనీసం రూ.500 కోట్లు సమీకరణ లక్ష్యం... న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీచేయడంతో పాటు ప్రస్తుత షేర్హోల్డర్లు 2.66 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఆఫర్లో విక్రయిస్తారు. లేలాండ్ ఫైనాన్స్ సంస్థ వివిధ వాహనాల కొనుగోళ్లకు రుణాలందజేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ ఐపీఓ: బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని బీఎస్ఈ యోచిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో సెబీకి బీఎస్ఈ సమర్పించవచ్చని సమాచారం. ఐపీవో బాటలో 23 ఎస్ఎంఈలు: దాదాపు 23 చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు(ఎస్ఎంఈ)ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ మార్చి క్వార్టర్లో సెబీకి సమర్పించాయి. ఈ సంస్థలు ఐపీఓల ద్వారా రూ200 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. మళ్లీ సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ: విద్య సంబంధిత సేవలందించే సీఎల్ ఎడ్యుకేట్ కంపెనీ ఐపీఓ పత్రాలను దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సెబీకి సమర్పించింది. -
ఏఐఎస్ఎఫ్ నేతలపై కేసులు
విజయవాడ: విజయవాడలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సభలో జరిగిన ఘటనపై 30 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ సభలో తనపై ఏఐఎస్ఎఫ్ నేతలు దాడి చేశారని, తను ప్రదర్శించిన జాతీయ జెండాను చించివేశారంటూ బీజేవైఎం నేత అనిల్ కుమార్ శుక్రవారం గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు... ఏఐఎస్ఎఫ్ నేత లెనిన్ సహా 30 మందిపై 324, 323, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
ఓ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం
పిల్లలకు పాఠాలు బోధించే ఓ ప్రధానోపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. దళిత మహిళా సర్పంచ్ పప్పీదేవి పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. కుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయించాడు. గ్రామంలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో గ్రామ అధికారిగా పప్పీ దేవి పరిశీలనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించేందుకు కాన్పూర్‌లోని దేహత్ పాఠశాలను పప్పీదేవి సందర్శించారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోశ్ శర్మను నిలదీశారు. పేద విద్యార్థులకు పెట్టాల్సిన భోజనాన్ని జాగ్రత్తగా అందించాలని.. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్పంచ్ హెచ్చరికలను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పైగా మరింత రెచ్చిపోయాడు. 'నన్ను అడిగేంత ధైర్యం నీకెక్కడిది.. నా ముందే కుర్చీలో కూర్చుంటావా' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎందుకు కూర్చోకూడదని నిలదీసిన పప్పీదేవిని చంపేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఆమె భర్తపై కూడా బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆయన ఆగ్రహం చల్లారలేదు. ఆమె కళ్లముందే ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయమని విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు వచ్చి ఆ కుర్చీని శుభ్రం చేసేదాకా వదిలిపెట్టలేదు. దీంతో కలత చెందిన పప్పీదేవి తనకు జరిగిన అవమానాన్ని జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. వివక్షాపూరితగా వ్యవహరించి, తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్నారు. తనను, తన భర్తను తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరించాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక తహసీల్దారును ఆదేశించారు. -
ఇదేమి రాజ్యం..!
-
'మా అన్నను కలుస్తాం.. అనుమతించరూ..'!
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయి ప్రస్తుతం ఢిల్లీలో సీబీఐ అధికారుల అదుపులో ఉన్న చోటా రాజన్‌ను కలిసేందుకు ఆయన సోదరిమణులు వచ్చారు. శుక్రవారం తన సోదరుడిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఇద్దరు సోదరీలు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ అయిన చోటా రాజన్ ను అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో అతడిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. అయితే 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్‌కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. -
ట్యాక్స్ ఆడిట్ చేయిస్తున్నారా?
కమ్ సెప్టెంబర్.. కమ్ సెప్టెంబర్.. అలనాటి పేరు పొందిన పాట. పాట పూర్తయ్యే లోపల రానే వచ్చింది సెప్టెంబర్ 2015. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అదే 30-09-2015. గడువు తేది.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్‌ను పూర్తి చేసిన తర్వాత రిపోర్టును జతపరుస్తూ 2015 సెప్టెంబర్ 30లోగా అసెసీలు ఆన్ లైన్ ద్వారా దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. డిజిటల్ సంతకం కావాలంటే గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలు డిజిటల్ సంతకాన్ని నమోదు చేస్తాయి. ఈ సంతకం లేనిదే రిటర్న్ వేయలేము. ముందుగా సీఏలు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ని ఆన్లైన్లో దాఖలు చేస్తారు. ఆ తర్వాత అసెసీ ఈ-ఫైలింగ్ ద్వారా రిటర్న్ ఫైల్ చేస్తారు. ఎవరికి వర్తిస్తుంది...? - ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే, - ఒక ఆర్థిక సంవత్సరంలో వృత్తి ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, ఇరవై ఐదు లక్షల రూపాయలు దాటితే, - కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతం లేదా ఎక్కువ లాభ శాతం ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ అక్కర్లేదు. ఇటువంటి వారు తక్కువ లాభాన్ని చూపిస్తే అకౌంట్స్ రాయాలి. ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీ.. ట్యాక్స్ ఆడిట్ చేసిన తర్వాత రిపోర్టుని ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీలోనే ఇవ్వాలి. ఇది కాకుండా లోటుపాట్లు, అవకతవకలు పొందుపరుస్తారు. గతంలో చెప్పాల్సిన వివరాల కన్నా కొత్త ఫారంలో అదనపు వివరాలు ఇవ్వాలి. 3సీడీలో ఎన్నో అంశాలు పొందుపరుస్తారు. ఈ అంశాల సంఖ్య.. పేజీల పరంగా పది పైగా ఉంటాయి. అంశాలను విడిగా లెక్కపెడితే వందలు దాటతాయి. లెక్కలేనన్ని అంశాల మీద లెక్కపూర్వకంగా వివరాలివ్వాలి. తప్పనిసరిగా అవసరమైన ఎన్నో వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ అంటే..? ఆడిట్ అంటే అకౌంట్స్‌ని తనిఖీ చేయడం. ఆదాయ పు పన్ను చట్టప్రకారం చేయించే ఆడిట్‌ని ట్యాక్స్ ఆడిట్ అంటారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీ ద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదా యం ఉన్న వారికి.. ఈ ఆడిట్ వర్తించదు. అలాగే, తక్కువ టర్నోవరు, వసూలు ఉన్న వ్యాపారస్తులకి, వృత్తి నిపుణులకి వర్తించదు. ఈ ట్యాక్స్ ఆడిట్‌ని ప్రాక్టీసులో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లతో చేయిం చాలి. అస్సెసీ చేత క్రమంగా... సక్రమంగా లావాదేవీలను నమోదు చేయించడం, బుక్స్ రాయడం, ఎటువంటి అవకతవకలు లేకుండా చూడటం ఈ ఆడి ట్ లక్ష్యం. పెనాల్టీలు వడ్డిస్తారు... పెనాల్టీలూ ఉంటాయి సెక్షన్ 271బీ ప్రకారం ఆడిట్ పూర్తి చేసిన గడువు తేదీ లోపల రిటర్న్ దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు మొత్తంలో 0.5 శాతం లేదా రూ. 1,50,000.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే దాన్ని పెనాల్టీగా చెల్లించమంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పన్ను భారం కంటే పెనాల్టీ భారం ఎక్కువ అవుతుంది. ఆలస్యం ఎందుకు.. మీకు గాని ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తే.. వెంటనే వృత్తి నిపుణులను సంప్రదించి, సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి. -
పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలలో బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని భారతపు సమ్మయ్య (32) అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సమ్మయ్య రోజూ మాదిరిగానే బుధవారం సముద్రాలలోని సొంత పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అక్కడ కేజీవీల్స్ బిగించి దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ బురదలో దిగబడింది. ఈ క్రమంలో ఎక్స్‌లేటర్‌ను ఒక్కసారిగా తొక్కడంతో ట్రాక్టర్ ఇంజన్ లేచి బోల్తా పడింది. దానికిందనే ఇరుక్కుపోయిన సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య స్వర్ణలత, తొమ్మిదిరోజుల కూతురు ఉంది. -
వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
- అంబేడ్కర్ వర్సిటీ సేవల వివాదంపై హైకోర్టు - ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ కేంద్రాలకు సేవల నిలుపుదల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు గురువారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువునిచ్చింది. అప్పటి వరకూ ప్రాంతీయ కేంద్రాలకు సేవలందించాలని టీ సర్కార్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేర కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైం దని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ గత నెల 25న సాక్షి ‘కథనం’ ప్రచురించింది. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏజీ కొండం రామకృష్ణారెడ్డి ఏపీ తమతో ఒప్పందం కుదుర్చుకోనప్పుడు సేవలం దించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏపీ ఏజీ పరాంకుశం వేణుగోపాల్ వాదనలు విని పిస్తూ సార్వత్రిక వర్సి టీ కార్పస్ ఫండ్ కింద రూ.400 కోట్లు ఉన్నాయని చెప్పగా ‘కార్పస్ ఫండ్‌లో నుంచి కొంత మొత్తాన్ని ఏపీ ప్రాంతీ య కేంద్రాలకు వెచ్చించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి?’ అని రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ధర్మా సనం వ్యాఖ్యానించింది. సార్వత్రిక వర్సిటీ రెండేళ్ల ఆస్తిఅప్పుల పట్టీలను తమ ముందుం చాలని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. -
ఎలా అనుమతి ఇచ్చారు
- ఓపెన్ ఎయిర్ జిమ్‌పై ఎంసీజీఎంను ప్రశ్నించిన హైకోర్టు - ఆగస్టు 6 లోగా స్పందించాలని బీఎంసీకి ఆదేశం ముంబై: మెరైన్ డ్రైవ్‌లో ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఎలా అనుమతిచ్చారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం)ను బాంబే హైకోర్టు ఆదేశించింది. విజయ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్‌తో కూడిన ధర్మాసనం, ఆగస్టు 6 లోపల స్పందించాలని దాఖలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేని, వారసత్వ సంపదగా గుర్తించిన చోట జిమ్ ఏర్పాటు చేశారని పిటిషన్లో విజయ్ ఆరోపించారు. ‘ఫుట్‌పాత్ ఉన్నది నడవడానికి, కాని శివసేనతో సంబంధం ఉన్న డీఎన్ ఫిట్నెస్ అనే సంస్థ అక్కడ జిమ్ ఏర్పాటు చేసింది. ఎంసీజీఎం శివసేన నేతృత్వంలో ఉండటంతో అక్రమంగా ఏర్పాటు జరిగింది’ అని విజయ్ విమర్శించారు. 2013లో ఓ కాంగ్రెస్ ఎంపీ జిమ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినపుడు ‘వారసత్వ సంపద’ అన్న కారణంతో నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ సారోగి అన్నారు. -
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీఎంసీ
ముంబై: యాంటిబయాటిక్ డ్రగ్స్ స్కాంకు సంబంధించి బాంబే హైకోర్టులోృబహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అఫిడవిట్ దాఖలు చేసింది. గతేడాది ప్రభుత్వాస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఇచ్చిన యాంటిబయాటిక్స్ వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిల్‌కు స్పందనగానే బీఎంసీ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్ లోని ఔషధ కంపెనీలను తనిఖీ చేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ బ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారమే ఆ కంపెనీలు ముందులు తయారీ చేస్తున్నాయని బీఎంసీ కోర్టుకు తెలిపింది. ‘2014 ఆగస్టు 18న బాబా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కాఫ్ట్రియాక్సోన్, నెఫొటాక్సిమ్ సూదులు వేయడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 45 రోగులకు ఇన్జక్షన్స్ వేయగా 28 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సైరా షేక్ అనే మహిళను కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ అస్పత్రికి(కేఈఎం), సియోన్ ఆస్పత్రికి తర లించారు. 24 గంటల తరువాత ఆమె మరణించింది. ఆహార, ఔషధ శాఖ అధికారులు కేఈఎం అస్పత్రిలో ఆమె రికార్డులను, ఏడు శాంపుల్స్‌ను సీజ్ చేశారు’ అని కోర్టులో పిల్ దాఖలైంది. ‘2014 అక్టోబర్ 18-19న నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ఔషధ ఫ్యాక్టరీలను తనిఖీ చేసింది. కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు పాటించలేదని తనిఖీల్లో తేలింది. అయితే హెచ్చరిక లేఖలు పంపడంతో వారు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు’ అని అఫిడవిట్లో బీఎంసీ పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలోని కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలపై ఎఫ్‌డీఏకు సమాచారం అందింది. ఎఫ్‌డీఏ కూడా వారిపై ఓ కన్నేసి ఉంచింది’ అని కోర్టుకు తెలిపింది. డ్రగ్ రియాక్షన్స్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని బీఎంసీపై ఆరోపణలు రావడంతో ఈ విషయంపై సీఐడీ విచారణ కూడా జరిగింది. -
హంతకులు ఎందుకు చిక్కడం లేదు?
* పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు * అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం సాక్షి, ముంబై: పట్టపగలు, నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే హంతకులు ఎలా తప్పించుకుంటున్నారని బొంబాయి హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు విభాగాన్ని కోర్టు ఆదేశించింది. పుణేలో మూఢ నమ్మకాల నిర్మూలన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర ధబోల్కర్, ముంబైలో ఆంగ్ల దిన పత్రిక సీనియర్ రిపోర్టర్ జేడే, పుణేలో నిఖిల్ రాణే, సమాచార హక్కు కార్యకర్త సతీష్ శెట్టి తదితరులు పట్టపగలు, రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. హంతకులు వస్తున్నారు, శవాలను చేసి పారిపోతున్నారు. కానీ ఆ హంతకులను మాత్రం ప్రభుత్వం పట్టుకోలేకపోతోంది. పుణేలో నడిరోడ్డుమీద నిఖిల్ రాణేపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ నిఖిల్ భార్య అశ్విని రాణే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిటిషన్‌పై న్యాయమూర్తులు వి.ఎం.కానడే, శాలినీ ఫన్సాల్కర్ జోషిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నడిరోడ్డుపై, పట్టపగలు జరిగిన అనేక హత్య కేసులను పోలీసులు ఛేదించలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. హంతకులు విచ్చలవిడిగా తిరగడంవల్ల సామాన్య ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని అశ్వినీ రాణే తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలు విఫలమైనట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. అయితే తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు లేకపోవడంవల్లే హంతకులు, నేరస్తులు తప్పించుకుపోతున్నారని క్రితంసారి జరిగిన విచారణ సందర్భంగా పోలీసు శాఖ స్పష్టం చేసింది. నియమాల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయుధాలకు సంబంధించిన విధానాన్ని సమీక్షించాలి. కానీ 2010 తరువాత ప్రభుత్వం ఇటువైపు దృష్టిసారించలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ముంబై పోలీసుల వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి తుపాకులు, రివాల్వర్లు ఉన్నాయి. వాటిని భుజానికి వేసుకుని వెళుతుండగా లేదా శుభ్రం చేస్తుండగా పేలుతున్నాయే (మిస్ ఫైర్) తప్ప అవసరమైనప్పుడు పేలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హంతకులను, నేరస్తులను సకాలంలో పట్టుకోలేకపోతున్నారని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. -
ఫిజీ సాంకేతిక వృద్ధికి భారత్ సహకారం: మోదీ
సువా: ఫిజీ సాంకేతికతంగా మరింతగా అభివృద్ధి చెందేందుకు భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభయమిచ్చారు. ఫిజీ పార్లమెంటులో ఆయన బుధవారం ప్రసంగించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధునికీకరణ కోసం 5 మిలియన్ డాలర్లను తక్షణ సాయంగా మోదీ ప్రకటించారు. మరో 70 మిలియన్ డాలర్లను దశలవారీగా అందిస్తామని తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫిజీ యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆయన అభిలాషించారు. ఫిజీలో పాడి పరిశ్రమ అభివృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. కాగా అంతకు ముందు మోదీ...ఫిజీ ప్రధాని బైనీమర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిజీతో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత 33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగి రానున్నారు. -
విద్యార్ధుల పై పెట్టిన కేసులు ఎత్తేయాలి:గద్దర్
-
లిఫ్టుల ఏర్పాటు ఈజీ
అఫిడవిట్ దాఖలును రద్దుచేసిన డీడీఏ డీడీఏ నిర్మించిన ఫ్లాట్లలో నివసిస్తున్నవారికి శుభవార్త. ఈ భవనాల్లో అవసరమని భావించినవారు లిఫ్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం డీడీఏ నుంచి ఎటువంటి అనుమతి పొందాల్సిన అవసరమే లేదు. న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్మించిన ఫ్లాట్లలో లిఫ్టుల ఏర్పాటు సులభతరంగా మారింది. ఇందుకోసం ఈ సంస్థకు ఇకమీదట ఎటువంటి అఫిడవిట్‌నూ దాఖలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయా ఫ్లాట్లలో ఏమైనా మార్పులుచేర్పులను చేపట్టాలంటే ముందుగా డీడీఏకి ఓ అఫిడవిట్‌ను విధిగా దాఖలు చే యాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను డీడీఏ రద్దు చేసింది. దీంతో లిఫ్టు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాబోవు. లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి ఈ నిబంధన అవరోధంగా పరిణమించింది. దీంతో గత కొన్ని నెలలుగా అనేక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అంతేకాకుండా ఈ నిబంధనను రద్దు చేయాలంటూ పట్టణ అభివృద్ధి శాఖకు లేఖలు రాశారు. ఆది నుంచి ఈ నిబంధన ఆటంకంగా పరిణమించినందువల్ల గతంలో నిర్మించిన భవనాల్లో లిఫ్టుల ఏర్పాటు సాధ్యం కాలేదంటూ వాదించాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారని ఆరోపించాయి. లిఫ్టులకు సంబంధించిన విధానాన్ని డీడీఏ గతంలో అనేక పర్యాయాలు మార్పులుచేర్పులు చేసింది. చివరిగా ఈ నెల ఒకటో తేదీన కూడా సవరణలు చేసింది. లిఫ్టులను ఏర్పాటు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిందేనని పేర్కొంది. ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లాట్లలో నివసించేవారికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులుచేర్పులు చేస్తున్నామన్నారు. అనధికార నిర్మాణాలనేది మరొక అంశమని, దానిని దీనితో ముడిపెట్టలేమని అన్నారు. తాము నిర్మించిన ఫ్లాట్లలో నివసించేవారికి సంబంధించి ఏ ప్రక్రియ అయినా సులభతరంగా ఉండేవిధంగా చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ నిబంధన ఎత్తివేతకు మరేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ఈ విషయమై అనేక పర్యాయాలు అయా ఫ్లాట్లలో నివసించేవారితో సంప్రదింపులు కూడా జరిపామన్నారు. కాగా లిఫ్టుల ఏర్పాటులో ఆంక్షల రద్దు వల్ల దాదాపు నాలుగు లక్షలమంది లబ్ధి పొందనున్నారు. -
స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు నమోదు
-
స్పీకర్‌కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్‌కు పిటిషన్ అందజేశారు. మొత్తం 11 పేజీల పిటిషన్‌ను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వైఎస్ విజయమ్మ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే నష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిటిషన్లో వివరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ... రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. -
స్పీకర్‌కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పిటిషన్