సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు మొత్తం రూ 3.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. 2015లో కేజ్రీవాల్ ఆస్తులు రూ 2.1 కోట్లుగా కాగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆస్తులు రూ 1.3 కోట్లు వృద్ధి చెందాయి. న్యూఢిల్లీ స్ధానానికి కేజ్రీవాల్ నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పేరిట ఉన్న నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు 2015లో రూ 15 లక్షల నుంచి 2020కి రూ 57 లక్షలకు పెరిగాయి.
సునీతా కేజ్రీవాల్‌కు రూ 32 లక్షల విలువైన నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వాలంటరీ రిటైర్‌మెంట్ ప్రయోజనాల కింద రాగా, మిగిలిన మొత్తం ఆమె సేవింగ్స్‌గా చూపారు. ఇక కేజ్రీవాల్ పేరిట 2015లో చూపిన నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ 2015లో రూ 2.2 లక్షల నుంచి 2020కి రూ 9.6 లక్షలకు పెరిగాయి. గత ఐదేళ్లలో కేజ్రీవాల్ స్ధిరాస్తులు రూ 92 లక్షల నుంచి రూ 1.7 కోట్లకు పెరిగాయి. 2015లో ఆయనకు ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లే ఇది సాధ్యమైందని ఆప్ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment