
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయినప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చెక్ పెట్టారు. ఇవన్నీ ఊహాగానాలేనని, కేవలం నిరాధార వార్తలేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశారు. ఫిబ్రవరి 8న వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేత రాజీనామా చేయించి, ఆ రాష్ట్రానికి సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి.
ఇది కూడా చదవండి: Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం
Comments
Please login to add a commentAdd a comment