delhi assembly
-
ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్ద ఆప్ ఎమ్మెల్యేల నిరసన
న్యూఢిల్లీ: ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ సహా సస్పెండైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్దే ధర్నాకు దిగారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, గేటు వెలుపలే నిరసన చేపట్టారు. మంగళవారం అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం సమయంలో ఆప్ సభ్యులు అంతరాయం కలిగించారు. సీఎం కార్యాలయంలో ఉన్న భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడంపై ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలకుగాను సభలో ఉన్న 21 మందిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ విజేంద్ర గుప్తా ప్రకటించారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తిరిగి గురువారం అసెంబ్లీ ప్రారంభమవగానే ఆవరణలోకి వచ్చేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయతి్నంచగా సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆతిశీ మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు హద్దే లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీ గేటు వెలుపలే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అంబేడ్కర్ ఫొటోలున్న ప్లకార్డులను చేబూని ‘జై భీం, బీజేపీ నియంతృత్వం చెల్లదు’అంటూ కంజర వాయిస్తూ నినాదాలు చేశారు. ‘అసెంబ్లీలో జై భీం అని నినాదాలు చేసినందుకే మమ్మల్ని మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు, మమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఇది చాలా తప్పు. ప్రతిపక్షం గొంతు మీరెలా నొక్కుతారు? యావత్తూ ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి దూరంగా ఎలా ఉంచుతారు?’అని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ప్రశ్నించారు.మాకు సమయమివ్వండి..: రాష్ట్రపతికి ఆప్ లేఖ శాసన సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆప్‌నకు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించింది. ఈ చర్య ఈ ఇద్దరు మహనీయులకే కాదు, దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికీ అవమానం. ఈ చర్యను ఆప్ వ్యతిరేకించింది. అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించేందుకు ప్రయత్నించిన ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడు రోజులపాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారు’అని ఆ లేఖలో ఆతిశీ వివరించారు. ‘గురువారం, అసెంబ్లీ గేటు వద్ద భారీ బారికేడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వలేదు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులును శాసనసభలోకి రానివ్వకపోవడం అప్రజాస్వామికం. తీవ్రమైన ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని, 28వ తేదీన మీతో మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వగలరు’అని అందులో కోరారు. -
Delhi: అసెంబ్లీలో హంగామా.. 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం)అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు. కాగ్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం ప్రారంభంకాగానే ఆప్ ఎమ్మెల్యేల నినాదాలతో గందరగోళం నెలకొన్న దరిమిలా ప్రతిపక్ష నేత అతిషితో సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.ఢిల్లీ అసెంబ్లీ బయట అతిషితో పాలు ఆప్ ఎమ్మెల్యేలు భగత్ సింగ్(Bhagat Singh) తదితరులు భీమ్రావ్ అంబేద్కర్ ఫోటోలను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఎందుకు తొలగించారని అతిషి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ఈ రోజంతా సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ ఝా మీడియాతో మాట్లాడుతూ ‘నిన్న సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ప్రధాని మోదీ గొప్పవారా? అని తామంతా స్పీకర్‌ను అడగడంతో ఆయన తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. వారు (బీజేపీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్(BR Ambedkar)ను ద్వేషించడాన్నిదేశం దీనిని అంగీకరించదు’ అని అన్నారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పలు నినాదాలు చేసిన దరమిలా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే ఆ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో విజయేందర్ గుప్తా ఆప్ నేత అతిషితో సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయినప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చెక్ పెట్టారు. ఇవన్నీ ఊహాగానాలేనని, కేవలం నిరాధార వార్తలేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశారు. ఫిబ్రవరి 8న వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేత రాజీనామా చేయించి, ఆ రాష్ట్రానికి సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇది కూడా చదవండి: Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం -
కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్‌ను ఓడించి జైంట్ కిల్లర్‌గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు. ఎవరీ పర్వేష్ వర్మ?ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు. -
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అతిషి రియాక్షన్
-
‘ఆప్’లోకి మోటివేషనల్ స్పీకర్.. ఢిల్లీ నుంచి పోటీ?
న్యూఢిల్లీ: ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఆన్లైన్ కోచింగ్ టీచర్ అవధ్ ఓజా ఈరోజు(సోమవారం) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అవధ్ ఓజా గతంలో బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, అది కుదరలేదు. ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారు. అవధ్ ఓజా గోండా నివాసి. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.మనీష్ సిసోడియా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పట్పర్గంజ్ నుంచి అవధ్ ఓజా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో బ్రాహ్మణ, గుర్జర్ ఓటర్లు అధికంగా ఉన్నారు. మనీష్ సిసోడియా ఈసారి జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అవధ్ ఓజా రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో అవధ్ ఓజా మాట్లాడుతూ, తాను అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని, అయితే ఆ అవకాశం రాలేదన్నారు.ఇది కూడా చదవండి: పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు! -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: వారికే ‘ఆప్’ టిక్కెట్లు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
Delhi: ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో ‘సారీ’
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవలే ఎనిమిదవసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటకు రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు. సోమవారం(మార్చి 4) తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చ్ 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఇదీ చదవండి.. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం -
రేపు ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ రేపు(సోమవారం) అత్యవసరంగా సమావేశం కానుంది. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు కాలపరిమితి విధించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలని ఎలా పక్కదోవ పట్టిస్తుందో అనే అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నట్లు ఢిల్లీ అసెంబ్లీ సెక్రటీ రాజ్ కుమార్ తెలిపారు. -
షాకింగ్.. అసెంబ్లీలో లంచం డబ్బు.. నోట్ల కట్టలతో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఒక కాంట్రాక్టర్ లంచం ఆశజూపి తన నోరు మూయించజూశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మొహీందర్ గోయల్ ఆరోపించారు. ఆ డబ్బు ఇదేనంటూ బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో కరెన్సీ కట్టలను చూపించారు. ‘‘ఓ ప్రభుత్వాస్పత్రికి సంబంధించి కొత్త కాంట్రాక్టర్ వచ్చాక 80 శాతం పాత కాంట్రాక్ట్ సిబ్బందిని తీసేసి లంచాలు తీసుకుని కొత్తవారిని నియమిస్తున్నాడు. దీనిపై నోరు మెదపకుండా ఉండేందుకు నాకు లంచం ఇవ్వబోయాడు. ఇది 2022 ఫిబ్రవరిలో జరిగింది. వెంటనే ఢిల్లీ పోలీసులకు, ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘నాకు వారి నుంచి ప్రాణ హాని ఉంది. కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌చేశారు. ఇది ఉన్నతస్థాయి కుట్ర అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, తీవ్రమైన అంశమని స్పీకర్ రాంనివాస్ అన్నారు. ఇది నిజమే అయితే లంచమిచ్చేటపుడే రెడ్ హ్యాండెడ్‌గా ఎందుకు పట్టుకోలేదని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. చదవండి: బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత -
ఆపరేషన్ లోటస్ విఫలమైంది: కేజ్రీవాల్
-
ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్
న్యూఢిల్లీ: ‘‘మిగతా రాష్ట్రాల్లో సఫలమైన బీజేపీ ఆపరేషన్ కమలం ఢిల్లీలో పూర్తిగా విఫలమైంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యేను కూడా లాగలేకపోయింది’’ అని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విశ్వాసపాత్రులని చాటి చెప్పేందుకే విశ్వాస పరీక్ష పెట్టామన్నారు. గుజరాత్లో ఆప్ ఓటు శాతం పెరిగింది గుజరాత్లో ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ అక్రమ దాడుల తర్వాత అక్కడ ఆప్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగిందన్నారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్‌చేస్తే మరో రెండు శాతం ఓటు శాతం ఎగబాకుతుందన్నారు. ‘‘సిసోడియా సొంతూర్లోనూ సోదాలు చేశారు. బ్యాంక్ లాకర్ తెరిపించారు. అయినా ఏమీ దొరకలేదు. ఈ దాడుల ద్వారా ఆప్‌కు, సిసోడియా నిజాయతీకి ప్రధాని మోదీనే స్వయంగా నిజాయతీ సర్టిఫికెట్ ఇచ్చేశారు’’ అన్నారు. మరోవైపు ఢిల్లీలో మళ్లీ పాత మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా తాను పాల్పడిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలన్న ఆప్ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ మండిపడ్డారు. చదవండి: శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా -
ఢిల్లీ అసెంబ్లీలో రగడ.. ఆప్, బీజేపీ నేతల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం రాత్రి హైడ్రామా నెలకొంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా రాత్రంతా ఆందోళనలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటా మంగళవారం ఉదయం వరకు అసెంబ్లీ ఆవరణలో గడిపారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాలేదని నిరూపించేందుకు తాను బలపరీక్ష ఎదుర్కొంటానని కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే అసెంబ్లీలో రగడ మొదలైంది. ఆప్ ఆరోపణలు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా 2016లో రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చెప్పారు. దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బీజేపీ ధర్నా.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల ముందు ధర్నాకు దిగారు. ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20కోట్లు ఆశచుపారని ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని నిరూపించేందుకు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో మంగళవారమే ఓటింగ్ జరగనుంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యే కుడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని నిరూపితమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా? -
బీజేపీ ఆపరేషన్ కమలం విఫలం.. అందుకే విశ్వాస తీర్మానం: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. అయితే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆప్ విశ్వాస తీర్మానం పెట్టిందని సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సభ్యలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. చదవండి: రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ.. విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువు చేసేందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని.. ఢిల్లీలోని అలాంటి ప్రయత్రాలు చేసిందని విమర్శించారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
Delhi Assembly: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు. పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్‌తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అభద్రతాభావంలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు. -
పిల్లల దుస్తులు కూడా వెతికారు.. అక్కడేముంది, ఏమీ లేదు!: మనీశ్ సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కమలం పార్టీ నేతలు సీరియల్ కిల్లర్లలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. సీబీఐ తన నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేసినప్పుడు అధికారులు తన దుస్తులు, పిల్లల దుస్తులు కూడా వెతికారని సిసోడియా తెలిపారు. తనిఖీల్లో వాళ్లకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐర్ మొత్తం ఫేక్ అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సభాముఖంగా తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేసేందుకు బీజేపీ నేతలు చాలా శ్రమిస్తున్నారని, ఆ శ్రద్ధ ఏదో స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణంపై పెట్టాల్సిందని సిసోడియా హితవుపలికారు. ఇతరులు మంచి పనులు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ అభద్రతాభావానికి లోనవుతున్నారని సిసోడియా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయి ఉంటే మోదీలా చేసేవారు కాదని సిసోడియా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకున్న ఎక్సైజ్ పాలసీని సిసోడియా సమర్థించారు. దాని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని సిసోడియా పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. వీడియో రికార్డు అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో ఫోన్‌తో వీడియో రికార్డు చేశారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ మహావర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా.. సభ నియమాలను ఉల్లంఘించి వీడియో తీసినందుకు మీ ఫోన్ ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పండి అని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. -
సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఢిల్లీ శాసనసభ పునరుద్ఘాటించింది. ఈ మేరకు శుక్రవారం సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా దీనికి మద్దతు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా, ప్రస్తుతం ఆప్‌నకు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రైతన్నలు శాంతియుతంగా పోరాటం సా గిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని శాసనసభ విమర్శించింది. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీరించాలని డిమాండ్ చేసింది. వారితో చర్చించాలని, సమస్యలను పరి ష్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొనేలా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న ఆన్నదాతల మద్దతు సంపాదించేందుకు ఢిల్లీలో శాసనసభలో తాజాగా తీర్మానం చేసినట్లు స్పష్టమవుతోంది. -
ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఆయన నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అధికార పక్షం ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. వివాదాస్పదుడైన ఓ అధికారిని దేశ రాజధానిలోని పోలీసు బలగాలకు అధిపతి కారాదని తీర్మానం పేర్కొంది. ఆస్తానా నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నా రు. నిబంధనలకు లోబడి కేంద్రం నియామకాలు చేపట్టాలన్నారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసున్న ఏ అధికారిని కూడా దేశంలో పోలీసు విభాగాధిపతిగా నియమించరాదంటూ 2019 మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఆస్తానాను నియమిస్తున్నట్లు మంగళవారం తెలిపిన కేంద్రం..ఆయన సర్వీసును ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ‘పదవీకాలం రీత్యా ఆయన అనర్హుడు కాబట్టే సీబీఐ డైరెక్టర్‌గా పరిగణనలోకి తీసుకోలేదు. మరి అదే నిబంధన ఢిల్లీ పోలీసు కమిషనర్ నియామకానికి కూడా వర్తించాలి కదా.. అని కేజ్రీవాల్ అన్నారు. -
‘అసెంబ్లీలో కలకలం: ఆత్మహత్యకు యత్నం’
న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె అధికార పార్టీకి చెందిన నాయకురాలే కావడం గమనార్హం. ఆమె చర్యతో ఆ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు అందరూ కల్పించుకుని ఆమెతో ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం ఆ సమస్యపై ఆమె ప్రభుత్వ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలోని మల్కాగంజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ గుడి దేవి మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి హాజరైంది. అయితే సమావేశానికి కిరోసిన్ బాటిల్‌తో వచ్చింది. తన ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్మికులను తొలగించారని ఆమె ఆందోళన చేసింది. 206 మంది ఉండాల్సిన కార్మికుల్లో 115 మందిని తొలగించడంతో ప్రస్తుతం 85 మంది ఉన్నారని తెలిపింది. దీంతో తన ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయింది. సమస్య పరిష్కరిస్తారా లేదా అని కిరోసిన్ బాటిల్‌తో గుడి దేవి హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్ డబ్బాను తీసుకుని శాంతపరిచారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. -
కేంద్రానికి కేజ్రీవాల్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిల్లుపై మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ తొలుత తీర్మానం చేసింది. -
అసెంబ్లీలో అధ్యయన కేంద్రం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ రీసెర్చ్ సెంటర్ (డీఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయనుంది. ఇందులో యువతకు ఫెలోషిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టనుంది. ఇందులో అప్రెంటిస్‌గా చేరిన విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల యువతకు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వీరు శాసనసభ్యులకు ఆయా రోజుల్లో చర్చించే అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎమ్మెల్యేలకు తాజా సమాచారం అందుతుంది. తత్ఫలితంగా వారికి కూడా ఆయా అంశాల విషయంలో నిష్ణాతులుగా మారుతారు. ఇలా ఇరువైపులా ప్రయోజకనకరమైన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం త్వరలో కార్యరూపంలోకి తీసుకురానుంది. అసెంబ్లీ సచివాలయం ఈ డీఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది. 50 మందికి ఫెలోషిప్‌తోపాటు మరో 90 మందికి అసిస్టెంట్ ఫెలోషిప్ ఇవ్వనుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఏడాది కాలానికి ఇస్తారు. ఎవరైనా పూర్తిస్థాయిలో నేర్చుకోలేదని అనిపిస్తే మరో ఏడాదికాలం పొడిగిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి ఏడాదిన్నర క్రితం ఈ అంశాన్ని సభ ముందుంచారు. తమకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు తగినంత వ్యవధి దొరకకపోతుండడంతో సోమ్‌నాథ్ ఈ ఆలోచనను సీఎం ముందుంచారు. ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించే బాధ్యతను స్పీకర్ రాంనివాస్ గొయల్ అప్పట్లో జనరల్ పర్పస్ కమిటీ (జీపీసీ)కి అప్పగించారు. ఏడాదిలోగా తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఔత్సాహికులు ఈ నెల 25వ తేదీలోగా డీఏఆర్‌సీ.డీటీయూ.ఏసీ.ఇన్’కు పంపాల్సి ఉంటుంది. డీఏఆర్సీలో విలువైన, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అధ్యయనం జరుగుతుందని, ఇది శాసనసభ్యులకు ఉపయుక్తంగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారం అందేందుకు దోహదం చేస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభ సచివాలయం పేర్కొంది. ఎంపిౖకైన యువకులు...శాసనసభ్యులు, అసెంబ్లీ సెక్రటరియేట్, ఆయా ప్రభుత్వ విభాగాలతో చక్కని సమన్వయంతో కలసిమెలసి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. -
ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ‘ఉగ్ర’ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేపాయి. సోమవారం అసెంబ్లీలో మంచినీటి సమస్యపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో నీటి సమస్యకు అధికారులే కారణమని ఆరోపించారు. దీనిపై ఆప్ సభ్యుడు అమానతుల్లా ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఓపీ శర్మ అనుచితంగా మాట్లాడారు. ‘తప్పు చేస్తే ఉగ్రవాదుల మాదిరిగా నువ్వూ జైలుకు పోతావ్. ఉగ్రవాదిలా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఉగ్రవాదిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్? నాతో పెట్టుకోకు. ఫన్నీఖాన్‌లాగా ఉండకు. కూర్చో’ అంటూ దూషించారు. ఈ వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్టకు భంగకరమంటూ ఆప్ సభ్యులు ఆందోళనకు దిగారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. -
విజిటర్స్‌గా వెళ్లి ఆప్ అసెంబ్లీని వణికించారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు నానా రచ్చ చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా లేచి మంత్రి సత్యేంద్ర జైన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. కాసేపట్లోనే గందరగోళ వాతావరణం నెలకొంది. నినాదాలు చేసినవరు వారు తాము ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్తలం అని చెప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ జరుగుతుండగా విజిటర్లుగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అనూహ్యంగా అక్కడి నుంచి లోపలికి దూసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైన్‌కు వ్యతిరేకంగా నినాదులు చేస్తూ ఆయన ఓ అవినీతిపరుడని గట్టిగా అరుస్తూ ఏవో కాగితపు ముక్కలను అక్కడ కూర్చున్న చట్ట సభ ప్రతినిధులపైకి విసిరారు. దీంతో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు వారితో గొడపడ్డారు. చేయికూడా చేసుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ప ఆ సమయంలోనే స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వారిని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి
-
ఢిల్లీ అసెంబ్లీలో మిశ్రాపై దాడి
ఆప్ ఎమ్మెల్యేల దుశ్చర్య న్యూఢిల్లీ: ఆప్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై నిండు సభలో దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆప్ ఎమ్మెల్యేలు బుధవారం ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఆయన గొంతు నులిమేంత పనిచేశాడు. మరొకరు పిడిగుద్దులు గుద్దాడు. సీఎం కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేలు ఈ చర్యకు పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్ మిశ్రాను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. మిశ్రా మాట్లాడుతూ కేజ్రీవాల్ అవినీతిపై చర్చించేందుకు రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సభలో డిమాండ్ చేయడంతో తనపై ఆప్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. జీఎస్టీ బిల్లుపై చర్చ అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా సభకు హాజరైన మిశ్రా రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని రాసి ఉన్న బ్యానర్‌ను సభలో ప్రదర్శించారు. స్పీకర్ ఆయనను వారించారు. ఈ సందర్భంగానే మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు భౌతిక దాడికి పాల్పడ్డారు. -
‘ముఖ్యమంత్రి బండారం బయటపెడతా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లో ఆరోపణలు చేసినందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్ మిశ్రాను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం కపిల్ మిశ్రా మాట్లాడుతూ ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు. తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇస్తున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. కాగా గత నెలలో కూడా ఆప్ మద్దతుదారులు కపిల్ మిశ్రాపై దాడికి యత్నించారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు విశ్వాసపాత్రుడుగా ఉన్న కపిల్ మిశ్రా... ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసినదంతా చివరకు ఓ ప్రహసనంలా మారింది. తాను ఒక మాజీ కంప్యూటర్ ఇంజనీర్‌నని, పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. తాను ఇప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూపిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ఒక డమ్మీ ఈవీఎంను ఆయన తయారుచేయించి తీసుకొచ్చారు. ఎన్నికలలో పోలింగ్ ప్రారంభం అయినప్పుడు అంతా మామూలుగానే ఉంటుందని, రెండు మూడు గంటల తర్వాత నుంచి దానికి ఒక సీక్రెట్ కోడ్ యాక్టివేట్ చేస్తారని ఆయన అన్నారు. ఆ కోడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఎవరు ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ ఒక పార్టీకే వెళ్తాయని చెప్పారు. ఇందుకోసం ఒక బొమ్మలాంటి ఈవీఎంను తీసుకొచ్చి, అందులో ఓట్లు వేసి, వాస్తవంగా పోలైన ఓట్లు, తుది ఫలితాలు ఇవంటూ ఆయన చూపించారు. అయితే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎంలు కాకుండా.. తాను సొంతంగా తయారు చేయించుకుని వచ్చినవి కావడంతో వాటిని ఎంతవరకు నమ్మొచ్చని వచ్చిన ప్రశ్నలకు అటు భరద్వాజ్ గానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే, సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ఎలా యాక్టివేట్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా జవాబులు రాలేదు. వేళ్లలోనే తప్పుందని అంటారు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బహిష్కృత ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత అటు నుంచి నేరుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రేపు వీళ్లు ఓటర్లనే తప్పుపడతారని, వాళ్ల వేళ్లలోనే తప్పుందని చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ సవాలు మీరు సొంతంగా తీసుకొచ్చిన ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కాదని, ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న అసలు ఈవీఎంలను ఎవరైనా తాము త్వరలో నిర్వహించే హాకథాన్‌లో ట్యాంపర్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా రావొచ్చని, అక్కడ చేసి చూపించాలని అన్నారు. -
‘మోదీ రూ. 25 కోట్ల లంచం తీసుకున్నారు’
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు పెద్దనోట్ల రద్దు పేదలకు కడఖ్ చాయ్ కాదని, అది వారికి విషప్రాయమని చెప్పుకొచ్చారు. మోదీ పేదలను దోచుకొని, తన కార్పొరేట్ స్నేహితులను కాపాడుకుంటున్నారని, వ్యాపారవేత్తలు ఆయనకు ముడుపులు ఇస్తుండగా.. వారి ఇళ్లమీద ఐటీదాడులు జరగకుండా మోదీ చూస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంగళవారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ మాట్లాడారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘2013 అక్టోబర్‌లో అప్పటి ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడిగా ఉన్న శుబేందు అమితాబ్‌పై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయన లాప్‌టాప్‌లు, బ్లాక్‌బెర్రీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించగా 2012 నవంబర్ 16న గుజరాత్ సీఎంకు రూ. 25 కోట్లు చెల్లించినట్టు ల్యాప్‌టాప్‌లో వివరాలు ఉన్నాయి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
అతి పెద్ద కుట్రను బయటపెడతా: సీఎం
తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు తనపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, దీని వెనక ఉన్న అతిపెద్ద కుట్రను అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం బయట పెడతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం శుక్రవారం నాడు అసెంబ్లీని ప్రత్యేకంగా ఒకరోజు సమావేశపరుస్తున్నారు. తద్వారా.. కేంద్రంతో మరో పోరాటానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ మీద, మంత్రుల మీద, ఆప్ ఎమ్మెల్యేల మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై అసెంబ్లీని ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపచరాలని ఢిల్లీ మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చెప్పారు. తమ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయించారని.. ఇదంతా చాలా పెద్ద కుట్రలో భాగమని, దాన్ని శుక్రవారం నాడు ఢిల్లీ అసెంబ్లీలో బయటపెడతానని కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లో అక్రమ నియామకాలపై ఏసీబీ మొదలుపెట్టిన విచారణలో భాగంగా ముఖ్యమంత్రి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఢిల్లీ సర్కారు అగ్గిమీద గుగ్గిలం అయింది. కేజ్రీవాల్‌ను తాము ప్రశ్నించబోమని ఏసీబీ చెప్పినా ఆగ్రహం మాత్రం తగ్గలేదు. ఇక తాను సత్యేంద్ర జైన్‌ను పిలిపించి పత్రాలన్నీ చూశానని, ఆయన నిర్దోషి అని కూడా అరవింద్ కేజ్రీవాల్ మరో ట్వీట్లో చెప్పారు. ఆయన తప్పు చేసి ఉంటే ఎప్పుడో బయటకు పంపేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఆయనకు అండగా ఉంటామని అన్నారు. ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రధానమంత్రి అంగీకరించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని, దీనివెనక ఉన్న కుట్రను తాము బయటపెడతామని కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో డెంగ్యూ, చికన్ గున్యాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వైఫల్యంపై కూడా ఆప్ ఎమ్మెల్యేలు గట్టిగా తమ వాణిని వినిపించనున్నారు. ఢిల్లీ మునిసిపాలిటీలు మూడూ బీజేపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలిన సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి.. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఢిల్లీలో లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాన్ని ఖండించడానికి ఆ బాధ్యత మొత్తం మునిసిపాలిటీదేనని ఆప్ మొదటినుంచి చెబుతున్న విషయం తెలిసిందే. False cases against AAP MLAs n ministers, FIR against me, CBI raid on me - why? A v big conspiracy. Will expose in Del Assembly on Fri — Arvind Kejriwal (@ArvindKejriwal) 27 September 2016 I summoned Satinder this morning. Saw all papers. He innocent, being framed. If he were guilty, we wud have thrown him out. We stand by him — Arvind Kejriwal (@ArvindKejriwal) 27 September 2016 -
'మా సీఎం సరే.. మీ పీఎం దేశంలోనే ఉండరేం?'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సభకు హాజరుకాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ముఖ్యమంత్రి సంగతి సరే ప్రధాని నరేంద్రమోదీ సంగతేమిటి.. ఆయన చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారు కదా అంటూ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. అయితే, ఇందులో ముగ్గురే కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. మిగితావారెవ్వరూ కూడా సభలో కనిపించలేదు. దీంతో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తా మాట్లాడుతూ 'ప్రత్యేక సమావేశం అంటూ పిలిచారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. మిగితా వారెవ్వరూ లేరు' అని అంటుండగానే ఆయన మైకును కట్ చేశారు. పంజాబ్ భారత దేశంలో భాగం కాదని మీరు అనుకుంటున్నారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే సీట్లో కూర్చొండని ఆదేశించారు. అయితే మాట్లాడుతుంటే మైకు కట్ చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని గుప్తా ప్రశ్నించారు. దీంతో ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి విషయం అట్లుంచితే.. ప్రధాని నరేంద్రమోదీ చాలా అరుదుగా దేశంలో కనిపిస్తున్నారుగా.. ఆయన సంగతేమిటి? ఆయన ఎందుకు దేశంలో కలియతిరగరు' అని ప్రశ్నించారు. -
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్‌కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
ప్రధాని కూడా జీతం పెంచుకోవాలి
-
ప్రధాని కూడా జీతం పెంచుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జీతం సరిపోదని.. ఆయన కూడా తన జీతం పెంచుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. ఈ జీతాలు పెంచిన తర్వాత కూడా ప్రముఖ మీడియాకు చెందిన ఎడిటర్లు, టాప్ టీవీ యాంకర్లు పొందేవాటిలో 120వ వంతు కూడా ఎమ్మెల్యేలకు రాదని కేజ్రీవాల్ అన్నారు. నెలకు లక్ష రూపాయల జీతం ఎందుకు సరికాదని, ఒకవేళ ప్రధాని జీతం దానికంటే తక్కువైతే ఆయన జీతం కూడా పెంచాల్సిందేనని చెప్పారు. ప్రధానమంత్రి జీతం పెంచాలని తామంతా డిమాండ్ చేస్తున్నామని కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రేపు ఒబామాను కలిస్తే తన జీతం ఎంతని చెప్పుకొంటారని, అందుకే ప్రధాని జీతం నెలకు కనీసం రూ. 8-10 లక్షలు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు తగినంత జీతం, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సిందేనని, అయినా వాళ్లు అవినీతికి పాల్పడితే మాత్రం వాళ్లను వదలకూడదని చెప్పారు. -
ఎమ్మెల్యేల జీతాలు 400% పెంపు!
ఢిల్లీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తమ జీతాలను నాలుగు రెట్లు పెంచేసుకున్నారు. ప్రస్తుతం వాళ్లకు నెలజీతం రూ. 88వేల వంతున ఉండగా, దాన్ని రూ. 2.35 లక్షలు చేయాలంటూ ఓ స్వతంత్ర కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ యథాతథంగా ఆమోదించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గురువారం నాడే ఈ బిల్లును ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదించేశారు. జీతాలు పెంచుకోడానికి ఇది సరైన సమయం కాదని బీజేపీ సభ్యులు వాదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో, తాము ఈ బిల్లు మీద ఓటింగుకు దూరంగా ఉంటున్నట్లు విపక్ష నేత విజేందర్ గుప్తా చెప్పారు. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ పెంపును సూచించింది. ప్రస్తుతం తమకొస్తున్న జీతాలతో నెల గడవడం కూడా కష్టంగానే ఉంటోందని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో ఆగస్టు 21న ఈ కమిటీని నియమించారు. అయితే ప్రభుత్వం తీవ్రంగా నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని ఓపక్క చెబుతూ మరోవైపు ఇలా గంపగుత్తగా జీతాలు పెంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు రూ. 70 వేలు, కార్యాలయాలను తీర్చిదిద్దుకోడానికి వన్ టైం అలవెన్సుగా లక్ష రూపాయలు, కంప్యూటర్ల కొనుగోలుకు లక్ష, ఆఫీసు అవసరాలకు మరో రూ. 60వేలు ఇచ్చారు. ఏడాదికి ప్రయాణ ఖర్చుల కింద ఏకంగా రూ. 3 లక్షలు కేటాయించారు. ప్రతియేటా బేసిక్ శాలరీ మీద 5వేల ఇంక్రిమెంటును మంజూరు చేసుకున్నారు. తామంతా అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చామని, అందువల్ల ప్రస్తుతం వస్తున్న జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని, తమకు వేరే ఆదాయం ఏమీ లేదని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పదో తేదీకల్లా జీతం అయిపోతోందని, నియోజకవర్గాల్లో కార్యాలయాలు, సిబ్బందికి జీతాలు.. ఇవన్నీ మోయలేని భారం అయిపోతున్నాయని సంజీవ్ ఝా అనే ఎమ్మెల్యే చెప్పారు. -
మైకు విరగ్గొట్టినందుకు.. కట్ చేశారు
న్యూఢిల్లీ: సభలో నానా రభస చేసి మైకు విరగ్గొట్టిన బీజేపీ ఎమ్మెల్యేకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మైకు విరగ్గొట్టిన ఓం ప్రకాశ్ శర్మ రూ.18,560 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం నాటి సభలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ చేయొద్దంటూ అందులో హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎమ్మెల్యే భవనా గౌర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా సభ్యులు దానిని ఆమోదించారు. ఢిల్లీలో మొత్తం 70మంది సభ్యలు ఉండగా అందులో 67మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాగా, ఈ తీర్మానాన్ని విజేందర్ గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. 'ఉద్దేశపూర్వకంగా శర్మ ఆపనిచేయలేదు. ఎలాంటి నష్టం కలిగించలేదు' అని గుప్తా తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో విశ్వాస్ నగర్ ఎమ్మెల్యే అయిన శర్మను మొత్తం సెషన్ సభకు రానివ్వకుండా వేటు వేశారు. తమ పార్టీ నేత అల్కా లంబాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా శర్మపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!
-
ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!
న్యూఢిల్లీ: అధికార ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన అభ్యంతరకరవ్యాఖ్యల వివాదం సోమవారం కూడా ఢిల్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ విషయమై ఆప్ మహిళా ఎమ్మెల్యేలతో బీజేపీ సభ్యుడు విజేందర్ గుప్తా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది సభలో తీవ్ర రచ్చ సృష్టించడంతో ఆయనను మార్షల్ బలవంతంగా ఎత్తుకొని.. బటయకు తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. గతవారం ఓపీ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆప్ ఎమ్మెల్యేలతో విజేందర్ గుప్తా వాగ్వాదానికి దిగడంతో ఆయనను 4 గంటలవరకు అసెంబ్లీ లోపలికి రావొద్దని స్పీకర్ రామ్నివాస్ గోయల్ ఆదేశించారు. దీంతో స్పీకర్ తీరును తప్పుబట్టిన గుప్తా సభ నుంచి బయటకు వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో మార్షల్స్ సభలోకి వచ్చి ఆయనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గుప్తా ఎంతకూ వెనక్కితగ్గకపోవడంతో మార్షల్స్ బలవంతంగా ఎత్తుకొని.. సభ బయటకు తీసుకుపోయారు. -
'బీజేపీ ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చి బయటపడేశారు'
న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీజేపీ నేతలు పలు అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించారు. సభలో ఉన్నది ముగ్గురు బీజేపీ నేతలే అయినా.. అధికార పార్టీకి మాత్రం చుక్కలు చూపించారు. దీంతో ఇక చేసేదేం లేక మార్షల్స్ రంగంలోకి దిగారు. ఎంత వారించినా వినకుండా.. అదేపనిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ నేత విజేందర్ గుప్తాను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చివరకు మార్షల్స్ ఎత్తుకొచ్చి బయటేశారు. తొలుత మర్యాదగా రావాల్సిందిగా ఆయనను బ్రతిమిలాడినా వినకపోవడంతో మార్షల్స్ అంతా కలిసి ఆయనను గాల్లోకి లేపి ఎత్తుకొచ్చి బయట దించేశారు. అంతకుముందు 'ఆయన అరిచి అరిచి స్వరం బొంగురు పోతున్నట్లుంది ఓ విక్స్ ఇవ్వండి' అంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. ఈ సమయంలో సభలోని సభ్యులంతా పెద్దగా నవ్వుతూ తమ ఎదురుగా ఉన్న బల్లలు చరిచారు. మంగళవారంనాటి తొలి రోజు సమావేశాల్లో నకిలీ డిగ్రీని కలిగి ఉండి జైలు పాలైన జితేందర్ సింగ్ తోమర్ విషయంపై విజేందర్ ప్రశ్నించగా.. రెండు రోజు సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మిగితా ఏ సభా వ్యవహారాలు జరగకుండా అడ్డుకున్నారు. తమ డిమాండ్‌పై చర్చ జరిగే వరకు ఏం అంశంపై సభలో చర్చ అక్కర్లేదంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని మార్షల్స్ ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది. -
ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం
-
ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం
మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయనగా.. ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి మాత్రం ఆయన ఛాంబర్లో లేరు. ప్రమాద విషయం తెలియగానే నాలుగు ఫైరింజన్లు ఢిల్లీ అసెంబ్లీకి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రమాదం చిన్నదే అయినా.. ప్రమాద సమయం, సందర్భం మాత్రం అనుమానాలకు కారణం అవుతున్నాయి. -
ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర భేటీ
కేంద్రం నోటిఫికేషన్‌పై చర్చ కోసం ఆప్ సర్కారు నిర్ణయం న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్(ఎల్జీ)తో తలెత్తిన ఘర్షణలో ఆప్ సర్కారు కొత్త ఆయుధాలు బయటికి తీస్తోంది. ప్రభుత్వాధికారుల నియామకం, పోలీసు, శాంతిభద్రతల అంశాల్లో ఎల్జీకి సర్వాధికారాలు ఉంటాయని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఈ నెల 26, 27న అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో శనివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని కూడా నిర్ణయించారు. వాస్తవానికి బడ్జెట్‌ను ఆమోదించేందుకు అసెంబ్లీ జూన్‌లో సమావేశం కావాల్సి ఉంది. అసెంబ్లీ అత్యవసర సమావేశాల్లో.. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తోపాటు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర సర్కారుకు, ఎల్జీకి మధ్య అధికార పంపిణీ అంశాలపైనా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సర్కారు ఈ నోటిఫికేషన్‌పై రాజ్యాంగ నిపుణుడైన కేకే వేణుగోపాల్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియంల అభిప్రాయాలు కోరగా, వారు అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారన్నారు. వేణుగోపాల్, సుబ్రమణియంల అభిప్రాయాలపై కేబినెట్ భేటీలో చర్చించారని సీఎం కార్యాలయం కూడా తెలిపింది. సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎల్జీ గత వారం నియమించడంతో ఆప్‌కు, ఎల్జీకి మధ్య ఘర్షణ తలెత్తడం తెలిసిందే. -
అసెంబ్లీకి హాజరుకావాలని డీఈఆర్సీ చైర్మన్‌కు స్పీకర్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీకి హాజరుకావాలని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్‌ను స్పీకర్ ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ డిస్కంల పనితీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని స్పీకర్ రాంనివాస్‌గోయల్ బుధవారం ఆదేశించారు. నగరంలో విద్యుత్ వినియోగదారులకు అధిక బిల్లులు వస్తున్నాయని, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయని పలువురు శాసనసభ్యులు ఆరోపించారు. విధానసభ సమావేశాలలో ఈ విషయంపై పలువురు ఎమ్మెల్యేలు గళం విప్పారు. అడ్డగోలుగా వ్యవహారిస్తున్న డిస్కంల ఆటకట్టించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ రాం నివాస్ గోయల్ కూడా సమస్యపై తన అనుభవాలను పంచుకున్నారు. వేగంగా తిరిగే మీటర్లను కూడా డిస్కంలే తమ ల్యాబ్‌కి తీసుకెళ్లి తనిఖీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల పనితీరుపై తమ సందేహాలను తీర్చడం కోసం డీఈఆర్సీ చైర్మన్‌ను సభకు హాజరయ్యేలా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు. వీరి వాదనతో ఏకీభవించిన గోయల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
న్యూఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ !
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌గా రాంనివాస్ గోయల్‌ను ఆప్ పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే డిఫ్యూటీ స్పీకర్ పదవికి బంధనా కుమారికి కట్టబెట్టాలని నిర్ణయించారు. రాంనివాస్ గోయల్ షహద్రా, బంధనా కుమారి షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైయ్యారు. ఫిబ్రవరి 14న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా రామలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దిశగా ఇప్పటికే పనుల చకచకా సాగిపోతున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన 70 స్థానాలు గల హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలను ఆప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న అంశంపై కూడా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలలో ఆరవింద్ కేజ్రీవాల్ భేటీ అయి.. చర్చించిన విషయం విదితమే. -
హస్తిన బరిలో నువ్వా.. నేనా!
ఎన్నికల నగారా మోగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రపతి పాలనలోనే ఉన్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ సోమవారం ప్రకటించారు. దాంతో హస్తిన ఎన్నికల రణరంగానికి తెరతీసినట్లయింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్జీ రాలేదు.. ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టారు. ఆయన కేవలం 49 రోజులపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేయడంతో.. అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 15తో రాష్ట్రపతి పాలన ముగియనుంది. వాస్తవానికి ఈసీ ప్రకటన రాక ముందు నుంచే హస్తినలో ఎన్నికల వేడి రగిలింది. ప్రధానమంత్ర నరేంద్రమోదీ రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన అరాచకవాదిగా అభివర్ణించారు. దానికి కేజ్రీవాల్ కూడా దీటుగానే సమాధానమిచ్చారు. ఎటు తిరిగీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేని పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్సే కావచ్చని పరిశీలకుల అంచనా. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్, ఇంకోవైపు రాహుల్ గాంధీ.. ముగ్గురూ ముమ్మర ప్రచారం చేయనుండటంతో ఈ ఎన్నికపై జాతి మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!
-
ఫిబ్రవరి 7న ఢిల్లీ ఎన్నికలు.. 10న ఫలితాలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించి, 10వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ ప్రకటించారు. ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.. నోటిఫికేషన్ తేదీ - 14 జనవరి నామినేషన్ల దాఖలుకు తుది గడువు - 21 జనవరి నామినేషన్ల పరిశీలన - 22 జనవరి నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు - 24 జనవరి ఎన్నికలు - 7 ఫిబ్రవరి కౌంటింగ్ - 10 ఫిబ్రవరి ఎన్నికల ప్రక్రియ ముగించాల్సిన తేదీ -12 ఫిబ్రవరి ''మొత్తం ఉన్న 70 నియోజవర్గాలలో 12 రిజర్వు అయి ఉంటాయి. అన్ని ఈవీఎంలలోను నోటా తప్పనిసరిగా ఉండాలి. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం అఫిడవిట్లో అన్ని కాలమ్‌లను అభ్యర్థులు పూర్తిచేయాలి. దేన్నయినా ఖాళీగా వదిలేస్తే.. రిటర్నింగ్ అధికారులు ఓ నోటీసు ద్వారా చెబుతారు. అప్పుడూ స్పందించకపోతే నామినేషన్ తిరస్కరిస్తారు. అన్ని రకాల పరిశీలకులను మోహరించి, ఎన్నికల వ్యయం, ఇతర ఘటనలపై నిఘా ఉంచాలి. ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మరింత నిఘా ఏర్పాటుచేయాలి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వయలెన్స్, ఆదాయపన్ను ఉన్నతాధికారుల మోహరింపు తప్పనిసరి. గుర్తించిన ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులంతా అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వారి ప్రవర్తనను అత్యంత నిశితంగా పరిశీలిస్తాం. ఏదైనా అవకతవకలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితులు, విద్యా సంవత్సరం, పండుగలు, శాంతిభద్రతలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూలు నిర్ణయించాం'' అని సంపత్ తెలిపారు. -
వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సంపత్ ఈ నెల 15న రిటైరవతున్నారు. ఈ లోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశాక రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. -
‘లోక్‌పాల్’కు కేజ్రీవాల్ తిలోదకాలు
న్యూఢిల్లీ: ‘జనలోక్‌పాల్’ ఉద్యమాన్ని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్యజించారని నయా దౌర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ చిబ్బర్ అన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై చిబ్బర్ పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సురక్షితమై ఢిల్లీ అసెంబ్లీ సీటును కేజ్రీవాల్ ఎంచుకోవద్దని కోరారు. అన్నా హజారే ఉద్యమానికి వెన్నెముకలా పనిచేసిన నిపుణులతో ఎన్డీపీ నూతనంగా ఏర్పడిందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది డాక్టర్లు, ఇంజినీర్లను ఎన్డీపీ రంగంలోకి దింపనున్నదని చెప్పారు. ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్‌తో తమ పార్టీ నిజాయితీగా ఎన్నికల యుద్ధానికి తలపడుతుందని చెప్పారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమంపై కేజ్రీవాల్ కట్టుబ డి ఉన్నాడా అని ప్రశ్నించారు. అయితే, కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎందుకు ఆ సీటు ను పరిత్యజించారని, మళ్లీ ఎన్నికలు నిర్వహిం చడం వల్ల ఖజానాపై మరింత భారం పడుతోందని అన్నారు. ‘తమ పార్టీ వివిధ రంగాల్లో నిపుణులైన వారితో ఏర్పాటైందని, అన్నా జన్‌లోక్‌పాల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఓటు బ్యాంక్ లేదా రాజకీయ విద్వేషాలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని’ చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ మొదటి జాబితాలో 10 అభ్యర్థులను ప్రకటించిందని, ఇందులో ఇద్దరు డాక్టర్లు, ఇద్ద సాయుధళాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారని తెలిపారు. ‘ మా పార్టీ ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఇంకా పలువురు వివిధ రంగాలకు చె ందిన నిపుణులు, అన్ని వర్గాల ప్రజలు ప్రాతినిద్యం వహిస్తున్నారని’ చెప్పారు. రక్షణరంగం, ఆరోగ్యం, విద్య, ఆర్థికం, విద్యుత్ తదితర ంగాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది సభ్యులున్నారని, 3 లక్షల మంది ఢిల్లీలో ఉన్నారని అన్నారని ఆ పార్టీ మీడియా ఇన్చార్జి బ్రిజేష్ భట్ పేర్కొన్నారు. -
కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే ఢిల్లీ ఎన్నికలు?
-
కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే ఢిల్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి..ఏ తేదీల్లో ఎన్నికలు జరపాలీ అనేది ఎన్నికల సంఘమే చూసుకుంటుందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికను యథాతథంగా కేంద్ర కేబినెట్ ఆమోదించి...రాష్ట్రపతికి పంపింది.దాంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత ఢిల్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవి నుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
-
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఆమోదం లాంఛనమైంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ రద్దుతో మూడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకుంది. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన రాజకీయాలపై ఎనిమిది నెలల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఇక లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదించటమే మిగిలింది. నివేదికను కేంద్రానికి పంపిన రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో సోమవారం చర్చించిన అనంతరం మూడు పార్టీలు విముఖత వ్యక్తం చేయటంతో అసెంబ్లీని రద్దు చేయాలని నజీబ్‌జంగ్ సిఫారసు చేశారు. మైనార్టీ సర్కారు ఏర్పాటుపై విముఖంగా ఉన్న కమలనాథులు ఎన్నికలను ఎదుర్కొనేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. తగినంత సంఖ్యా బలం లేనందువల్ల ప్రభుతాన్ని ఏర్పాటు చేయలేమని మూడు పార్టీలు తెలిపాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి వెంటనే కేంద్రానికి పంపారు. దీని ఆధారంగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలనే ప్రతిపాదనను హోంశాఖ కేబినెట్ ముందుంచింది. సాధారణంగా బుధవారం సమావేశమయ్యే కేబినెట్ తాజా పరిణామాలతో మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సంపూర్ణ మెజార్టీ సాధిస్తాం: కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు తలొగ్గి బీజేపీ ముందుగానే ఓడిపోయిందని ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నాలుగు నెలల నుంచి అవినీతి, అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో బీజేపీ దిగి వచ్చిందన్నారు. 49 రోజుల తమ పాలనలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రపంచంలో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దడం, అవినీతి నుంచి విముక్తి కల్పించడం ప్రచార అంశాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. తాను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పిన కేజ్రీవాల్ తుది నిర్ణయం పార్టీదేనన్నారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కు సంపూర్ణ మెజార్టీ కట్టబెడతారని విశ్వాసం వెలిబుచ్చారు. కాగా, అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది. డిసెంబర్లోనా వచ్చే ఏడాదా? ఢిల్లీలో తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరిపించాలన్న విషయంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఢిల్లీలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కూడా రద్దు చేయనున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున డిసెంబర్ నెలాఖరులో ఆఖరి దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని కొందరు అంటుండగా, జనవరిలో లేదా ఫిబ్రవరిలో హస్తిన ఎన్నికలు ఉంటాయని మరికొందరు భావిస్తున్నారు. ఢిల్లీలో గత ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 49 రోజుల పాలన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. -
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభను రద్దుకు కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమావేశం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్- ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేశారు. ప్రధాన పార్టీలు ఎన్నికలకే మొగ్గుచూపడంతో అసెంబ్లీ రద్దు అనివార్యమైంది. -
ఢిల్లీలో మళ్లీ ఎన్నికల భేరి..!
-
'మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి'
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బయట నుంచి ఎవరైనా మద్దతిస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆప్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నాలను న్యాయస్థానం సమర్థించింది. తదుపరి విచారణను నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా గత డిసెంబర్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే వైదొలిగారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వం అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సుప్రీం ఆదేశంపై హర్షం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ భవితవ్యాన్ని నిర్ణీత సమయంలో తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించడంపై కాంగ్రెస్, బీజేపీ, ఆప్ హర్షం వ్యక్తం చేశాయి. ఢిల్లీవాసులు కరెంటు, నీటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై త్వరగా తేల్చాలని కోర్టు ఆదేశించడం ముదాహవమని ఆ పార్టీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ మమ్నల్ని ఏ క్షణంలో పిలిచిన వెంటనే సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’మన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వమో, మైనారిటీ ప్రభుత్వమో లేక మళ్లీ ఎన్నికలు జరపడమో అనేది ఎల్జీ నిర్ణయిస్తారన్నారు. ప్రజలు విద్యుత్, మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి నుంచి ఢిల్లీవాసులకు విముక్తి రావాలంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఢిల్లీ శాఖ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. నిబంధనల ప్రకారం నగరంలోని తుగ్లకాబాద్, క్రిష్ణ నగర్, మెహ్రౌర్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపాల్సి ఉన్నందున, వాటిని తప్పించుకోవడానికి ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేయాలని శర్మ సూచించారు. ఇదిలా ఉండగా, అన్ని పార్టీల నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఎల్జీ ఎందుకు రాతపూర్వక సమాధానం కోరడం లేదని ఆప్ ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా తమ అభిప్రాయం చెప్పాలని బీజేపీని ఎల్జీ అడగాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అసెంబ్లీని రద్దుచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
ఎమ్మెల్యేలు ఇళ్లలో ఎందుకుండాలి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఎందుకుంచారంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇళ్లలో ఎందుకుండాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిని తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్‌తో విభేదించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడగా, బీజేపీ, ఆప్‌కు తగిన మెజార్జీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు రాగా, ఆప్ మాత్రం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. -
జంతర్ మంతర్ వద్ద ఆప్ ధర్నా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నిర్వహించింది. ఆదివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా ఆప్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ మెజార్టీ సంఖ్యకు కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్‌తో విభేదించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలలకే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. -
అసెంబ్లీని రద్దు చేయండి
అసెంబ్లీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు జరిపించవలసిందిగా ఆప్ శాససభ్యులు ఎల్జీ నజీబ్ జంగ్‌ను కోరారు. కేజ్రీవాల్ నేతృత్వంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలు నజీబ్‌జంగ్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే అవకాశం ఉందని జంగ్‌ను హెచ్చరించారు.ఎల్జీతో సమావేశం వివరాలను కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ..ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని తరచుగా బీజేపీ చెప్పుకుంటున్న మాటలను సవాలు చేశారు. ‘ఏ ఫార్ములాతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు ఎల్జీ వద్ద కూడా సమాధానం లేదు’ అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖమేన ని, ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడాని బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తే సంఖ్యాబలం చూపాల్సిందిగా జంగ్బీజేపీని కోరవచ్చన్నారు. తమ ఎమ్మెల్యేలను అందరినీనీ ఎల్జీ ముందు ఉంచి, వారెక్కడికీ పోవడం లేదని చెప్పినట్టు కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరూ తన వెంట ఉన్నట్లు స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో బీజేపీ ఏ ఫార్ములాతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఎన్నికలు జరిపించడానికి బీజేపీ ఆసక్తితో ఎందుకు లేదో తెలుసుకోవడానికి కూడా ఎల్జీ ఉత్సాహం చూపించారని వెల్లడించారు. కేజ్రీవాల్ తమ 24 మంది ఎమ్మెల్యేలతో తమతో భేటీ అయ్యారని, మొత్తం పరిస్థితిని పరిశీలించి, తగిన సంప్రదింపులు జరిపిన తరువాత జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తారని ఎల్జీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలూ తమ ఎమ్మెల్యేలంతా తమ వెంటనే ఉన్నారని ప్రకటించాయన్నారు. అటువంటుప్పుడు బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని ప్రశ్నించారు. అందువల్ల అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరామని చెప్పారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనడం లేదా బెదిరిస్తున్న విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు సిసోడియా వివరించారు. -
త్వరగా అసెంబ్లీని రద్దు చేయండి!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రివాల్ కోరారు. అసెంబ్లీ రద్దు ఆలస్యం కావడం వల్ల శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా డబ్బు ఎరగా వేస్తున్నారని, తమ శాసన సభ్యులకు బీజేపీ భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని జంగ్ దృష్టికి కేజ్రివాల్ తీసుకువచ్చారు. జంగ్ తో భేటి తర్వాత.. శాసన సభ్యులను లొంగ దీసుకునేందుకు రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు ఆలస్యం చేయవద్దని జంగ్ కు తెలిపానని కేజ్రివాల్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే తన ప్రశ్నకు జంగ్ వద్ద సరియైన సమాధానం లభించలేదని కేజ్రివాల్ తెలిపారు. గత ఎన్నికల్లో 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ రద్దుపై ఆప్ పిటిషన్
రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగింత సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి తక్షణం ఎన్నికలు జరిపించవలసింది గా ఆదేశించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిం చింది. రాష్ట్రపతి పాలనను సవాలుచేస్తూ ఆప్ దాఖలుచేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ అసెంబ్లీ రద్దుపై లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా రాష్ట్రపతి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీనిపై తాము మార్గదర్శకాలను జారీ చేయడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి అసెంబ్లీని తక్షణం రద్దు చేసిన మరుసటి రోజునే ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులకే వైదొలిగారు. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రజాస్వామిక ప్రభుత్వం అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటూ ఆప్సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
రాష్ట్రపతిని కలిసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తమకు మద్దతిస్తే మంత్రిపదవులు, ఆస్తులు, రూ. 20 కోట్ల వరకు నగదు ఇస్తామంటూ బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొన్ని రోజులుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆరోపించారు. ఆ ప్రలోభాలకు లొంగకపోవడంతో చంపేస్తామంటూ తమ ఎమ్మెల్యే వందన కుమారిని హెచ్చరించారన్నారు. నెలరోజుల్లోనే మోడీ ప్రభుత్వంపై ప్రజల ఆశలు ఆవిరయ్యాయని, ఆ విషయం అర్థమైన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమని భావించి, అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనుకుంటోందని పేర్కొన్నారు. -
'అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించండి'
న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని కేజ్రీవాల్ తన నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమైయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లకుండా హస్తినలో మరో సారి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎంగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల మధ్యకు వెళ్లనున్నట్లు తెలిపారు. శాసనసభకు ఎన్నికై...సీఎం పదవి చేపట్టి కేవలం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగి ఏడాది కూడా గడవక ముందే మరోసారి ఎన్నికలకు వెళ్తున్నందుకు కేజ్రీవాల్ ఈ సందర్బంగా హస్తిన వాసులకు క్షమాపణలు చెప్పారు. ఆ క్రమంలో వారం పది రోజుల్లో హస్తిన ప్రజల మధ్య పలు బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు కైవసం చేసుకుని ఐదేళ్ల పాటు కొనసాగించ లేకపోయామని ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు గెలుచుకోలేపోయినా, పంజాబ్‌లో నాలుగు ఎంపీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకున్న సంగతిని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. తమ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశమై తమ పార్టీ చర్చలు సాగిస్తోందని చెప్పారు. తొలుత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని చెప్పిన ‘ఆప్’, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత వైఖరిని మార్చుకోవడం గమనార్హం. -
సుప్త చేతనావస్థలో ఢిల్లీ అసెంబ్లీ
-
సుప్త చేతనావస్థలో ఢిల్లీ అసెంబ్లీ
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లేదా రాష్ట్రపతి పాలన విధించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన సిఫార్సులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తిరస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలని నిర్ణయించారు. సుప్త చేతనావస్థ అంటే.. ఎమ్మెల్యేలంతా యథాతథంగా అధికారంలో కొనసాగుతారు గానీ, వారికి మాత్రం చట్టాలు చేసే అధికారం ఉండబోదు. రాష్ట్రపతి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాదు, ఏదైనా రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారంటే, ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనాధికారాలను పార్లమెంటు తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అంటే, ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం కూడా ప్రస్తుతం పార్లమెంటు చేతుల్లోకి వెళ్లిపోతుందన్నమాట. ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించే అవకాశం ఉందని కథనాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మనిషిగా పేరుపొందిన నజీబ్ జంగ్, మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. -
'ప్రభుత్వాన్ని కాపాడుకోనేందుకే అసెంబ్లీకి రాలేదు'
-
అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లుపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో తిరస్కారానికి గురైంది. దాంతో సీఎం కేజ్రీ వాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బిల్లు ప్రవేశపెట్టడానికి జరిపిన ఓటింగ్ లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు తిరస్కారానికి గురికావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. దాంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదని ప్రకటించిన స్పీకర్ ప్రకటించారు. సాధారణ ఎజెండా ప్రకారం సభ కొనసాగుతోంది. ప్రస్తుతం బడ్జెట్‌పై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. -
క్రేజీవాల్ సర్కార్‌కి ఎదురుదెబ్బ
-
ఢిల్లీ అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లు
న్యూఢిల్లీ: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సలహాను బేఖాతరు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టారు. 'సభలో బిల్లును ప్రవేశపెట్టాం. బిల్లుపై సానుకూల చర్చ జరుగుతుంది' అని సభ వాయిదా పడిన తర్వాత న్యాయశాఖ మంత్రి సోమ్ నాత్ భారతి మీడియాకు వెల్లడించారు. సభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్పీకర్ ఎంస్ ధీర్ ను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. దాంతో సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. అవినీతిని తుదముట్టేంచేందుకు జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. -
న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై సభలో రగడ
సాక్షి, న్యూఢిల్లీ: సోమ్‌నాథ్ భారతి వ్యవహారంపై లోపలా, బయటా వెల్లువెత్తిన నిరసనలతో శాసనసభ ప్రాంగణం అట్టుడికిపోయింది. న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ పి సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయి నివాదాలు చేయడంతో తొలిరోజు గందరగోళం చెలరేగింది. ఈ కారణంగా కార్యకలాపాలు కొనసాగలేదు. మూడుసార్లు వాయిదావేసిన స్పీకర్... సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. చివరికి సభను శుక్రవారానికి వాయిదా వేవారు. అర్థరాత్రి సమయంలో విదేశీ మహిళల ఆవాసాల్లో సోదాలు జరిపించి నగరవాసులకు తలవంపులు తెచ్చిన న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు బీజేపీ సావధాన తీర్మాన నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఇందుకు మద్దతు పలికింది. స్పీకర్ ఎం.ఎస్. ధీర్ ఈ నోటీసును సభలో చదవి వినిపించి దానిపై సోమ్‌నాథ్ ప్రతిస్పందన కోరారు. సోమ్‌నాథ్ ప్రతిస్పందించిన అనంతరం బీజేపీ నోటీసుపై రూలింగ్ ఇస్తానని స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ నోటీసును స్వీకరించి చర్చ చేపట్టాలంటూ సభ్యులు పట్టుపట్టారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకొచ్చి సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసిన ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను మూడుసార్లు వాయిదావేసినా ఫలితం లేకపోయింది. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి సభ సజావుగా సాగడానికి సహకరించాలంటూ కాంగ్రెస్, బీజేపీలను కోరారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఓఖ్లా శాసన సభ్యుడు ఆసిఫ్ మహ్మద్‌ఖాన్ స్పీకర్ ముందున్న మైకు లాక్కొని దానిలోనుంచే సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముందున్న కాగితాలను చింపివేశారు. కేజ్రీవాల్ ముందున్న మైకును కూడా ఆయన విరగ్గొట్టారని అంటున్నారు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే బీజేపీ ఇచ్చిన నోటీసును స్వీకరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలు కాగా గురువారం మధ్యాహ్నం విధానసభ సమావేశాలను ప్రారంభిస్తూ స్పీకర్ చేసిన ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలైంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక సమావేశాలుగా పేర్కొనడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు. ఈ సమావేశాలను బడ్జెట్ సమావేశాలుగా పేర్కొనాలని వారు డిమాండ్ చేశారు. ఆ త ర్వాత విధానసభలో బీజేపీ నేత హర్షవర్ధన్ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు సావధాన తీర్మాన నోటీసు ఇచ్చారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ కూడా ఇందుకు మద్దతు పలికారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆర్ .పి. కాగితాలు చింపి సోమ్‌నాథ్ వైపు విసిరారు. కాంగ్రెస్ సభ్యులు కూడా సోమ్‌నాథ్ వ్యతిరేక నినాదాలకు గొంతు కలిపారు. కాంగ్రెస్ సభ్యుడు జైకిషన్ అల్లం, నిమ్మకాయలు తదితర వస్తువులను స్పీకర్ ఎదుట పెట్టగానే ‘బందర్ క్యా జానే అద్రక్ స్వాద్ (కోతికి ఏమి తెలుసు అల్లం రుచి) అంటూ ప్రతిపక్ష సభ్యులు కేజ్రీవాల్ సర్కారును ఎగతాళి చేయడం, సోమ్‌నాథ్ భారతి హాయ హాయ్ అనే సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సభను వాయిదావేశారు. 20 నిమిషాల తరువాత తిరిగి సమావేశ ం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యలోకి దూసుకువచ్చారు. సోమ్‌నాథ్ భారతి నగరంలో జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నారనే ప్లకార్డులను ధరించిన సభ్యులు సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ మరోసారి సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ తరువాత తిరిగి సభ సమావేశమైనప్పుడు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. దీంతో స్పీకర్ మూడోసారిసభను వాయిదావేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆప్ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ అధికార పార్టీ సభ్యులతోపాటు కూర్చోవడం కూడా కొంతసేపు వివాదానికి దారితీసింది. బీజేపీ సభ్యులు ఈ విషయమై బిన్నీని ప్రశ్నించగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తానుకూడా ప్రభుత్వ విప్ ప్రకారం ఓటు వేయవలసిందేనంటూ స్పీకర్ ఆదేశించారని, అందువల్ల తాను అధికార పార్టీ సభ్యుల పక్కనే కూర్చున్నానని చెప్పారు. సభ బయటా నిరసన జ్వాలలు శాసనసభలోనే కాకుండా బయటకూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ చార్జీల మాఫీని అందరికీ వర్తింపజేయాలని, సోమ్‌నాథ్ భారతిని మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చే యడమే కాకుండా కేజ్రీవాల్‌కే వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా ధర్నా చేశారు. భద్రతా సిబ్బంది వారిలో కొందరిని బస్సులో ఎక్కించి దూరంగా తీసుకెళ్లారు. -
ఆమోదం పొందకపోతే తప్పుకుంటా
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి కుండబద్దలు కొట్టారు. శాసనసభ సమావే శం తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ జన్‌లోక్‌పాల్ బిల్లును రేపు సభలో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తాం. ఒకవేళ దానిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వీగిపోయేవిధంగా చేస్తే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా కలిసికట్టుగా వ్యవహరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. ఈ రెండు పార్టీలు అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తాము కోరుకున్నది కూడా ఇదేనని, రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఈవిధంగా వ్యవహరించడానికి కారణం ఓ భారీ వ్యాపార సంస్థపై తాము చర్యలకు ఉపక్రమించడమే ఇందుకు కారణమన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు త మ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయన్నారు. సభా కార్యకలాపాలు జరగబోవని, ఇందుకు కారణం ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకోవడమేనన్నారు. కాగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో... జన్‌లోక్‌పాల్ బిల్లు, స్వరాజ్ బిల్లుల ఆమోదంకోసం ఆప్ సర్కారు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసినప్పటికీ తొలిరోజు వాటిని సభలో ప్రవేశపెట్టలేదు. స్వరాజ్ బిల్లును మంత్రిమండలి ఉదయం ఆమోదించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చని అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినప్పటికీ తరువాత ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు అందలేదని, సభ్యులు చదవడం కోసం వాటిని అందజేశాకే సభలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు స్పీకర్ ఎం.ఎస్. ధీర్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనుమతి లేకుండా స్పీకర్ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వకూడదన్న అభ్యంతరాలపై స్పందిస్తూ ప్రభుత్వం దానిని సభలో ప్రవేశపెట్టొచ్చని, అయితే ఎల్జీ అనుమతి లేకుండా దాని పై చర్చ జరిపించే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. ఇదిలాఉండగా బిల్లును విధానసభలో ఆమోదించడానికి ముందు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ న్యాయమంత్రిత్వశాఖ ఎల్జీకి సూచించింది. ఈ నేపథ్యంలో జన్‌లోక్ పాల్ బిల్లును సభలో ప్రవే శపెట్టలేకపోయినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతులను శాసనసభ్యులకు అందించి, దానిని సభలో ప్రవేశపెట్టాలా? వద్దా ? అనే అంశంపై అసెంబ్లీలోనే సభ్యుల అభిప్రాయాన్ని కోరవచ్చని అంటున్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడానికి మెజారిటీ సభ్యులు నిరాకరించినట్లయితే కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశముందని వారంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం సభలో ప్రవేశపెట్టవచ్చని మరికొందరు అంటున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాన్ని విధానసభలో కాక మరోచోట జరపకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారును నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేదార్కుమార్ మండల్ దానిని ఉపసంహరించుకున్నారు. దీనిపై నిర్ణయం స్పీకర్ ఇంకా ఓ నిర్ణయంతీసుకోనందువల్ల ఇప్పుడే ఇలాంటి పిటిషన్ దాఖలు చేయనవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తొందరపాటుగా అభివర్ణించింది. అవసర మని భావిస్తే తరువాత దాఖలు చేయొచ్చని న్యాయమూర్తులు బి. డి. అహ్మద్, సిద్దార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఇదిలాఉంచితే పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యతిరేకించారు. ఇది మంత్రి మండలి, లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించాల్సిన అంశమని, ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని ఆయన వాదించారు. అసెంబ్లీ భవనం వెలుపల విధానసభ సమావేశాన్ని నిర్వహించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారీఎత్తున డబ్బు ఖర ్చవుతుందనే విషయాన్నికూడా ప్రశాంత్ భూషణ్ ఖండించారు. ఎటూ తేల్చుకోలేకపోతోంది: లవ్లీ సాక్షి, న్యూఢిల్లీ: జన్‌లోక్ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో సందిగ్ధావస్థపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక అయోమయ పరిస్థితిని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లును సరైన పద్ధతిలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తాము చెప్పామని, ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అయితే ప్రభుత్వ వైఖరే స్పష్టంగా లేదన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తొలుత తమకు సర్క్యులర్‌ను జారీచేసిందని, అయితే దానిని ఉపసంహరించుకుందనే విషయం గురువారం సభలోకి వచ్చినతర్వాత తెలిసిందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి పాఠశాల పిల్లాడి చేష్టల్లా ఉన్నాయని ఆయన విమర్శించారు. -
‘జన్‌లోక్‌పాల్’ నచ్చితేనే మద్దతు
న్యూఢిల్లీ: అన్నాహజారే ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన జన్‌లోక్‌పాల్ బిల్లుకే తాను అసెంబ్లీలో మద్దతు ఇస్తానని.. లేకుంటే బిల్లుకు మద్దతు ఇవ్వడంలో పునరాలోచన చేస్తానని ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ స్పష్టం చేశారు. మద్దతు విషయంలో తనను ఏ పార్టీ విప్ ఆపలేదని తేల్చిచెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో శుక్రవారం చర్చకు రానున్న జన్‌లోక్‌పాల్ బిల్లుపై తన ఓటు హక్కు గురించి స్పీకర్ ఎంఎస్ ధిర్‌తో సంప్రదించానని చెప్పారు. కాగా, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ పార్టీ నుంచి బహిష్కృతులైన ఎమ్మెల్యేలైనా.. అసెంబ్లీలో ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలని స్పీకర్ సమాధానమిచ్చారన్నారు. అయితే ఇదే విషయమై 2010లో సుప్రీం కోర్డు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏ ఎమ్మెల్యే కూడా తాను బహిష్కృతమైన పార్టీకే అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని లేదని స్పష్టంగా ఉందన్నారు. తనకు ఆ విషయాన్ని స్పీకర్ తెలియజేయలేదని ఆయన చెప్పారు. దాంతో 2010 సుప్రీం ఆర్డర్ గురించి తనకు ఎందుకు సమాచారమివ్వలేదో 24 గంటల్లోగా సమాధానమివ్వాలని స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే కోర్టుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ఇంతవరకు ఆ బిల్లు ప్రతిని చూడలేదన్నారు. అయితే అది అన్నాహజారే పోరాట స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే మద్దతు ఇస్తానన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని తనను ఎవరూ బలవంతపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. -
అధిగమించారు
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ..అడుగడుగా పరీక్షలు ఎదుర్కొంటూనే వస్తోంది. అన్ని అవరోధాలను తమదైన శైలితో అధిగమిస్తూ వచ్చిన ఆప్ నాయకులు అత్యంత కీలకమైన విశ్వాస పరీక్షలోనూ ‘37’ మార్కులతో పాస్ అయ్యారు. గురువారం నాటి విశ్వాసపరీక్ష ఫలితం ఊహించినదే అయినా ఢిల్లీ అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఢిల్లీవాసులు ఆసక్తి కనబర్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభయ్యాయి. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశాల విశేషాలను ఉత్కంఠగా గమనించారు. మధ్యాహ్నం 4.10 గంటల నుంచి 4.40 గంటల వరకు టీ బ్రేక్ ఇచ్చారు. అనంతరం సమావేశాలు కొనసాగాయి. ఆప్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి మనీశ్ సిసోడియా విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయా పార్టీల సభ్యులు సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ సభలో ఒక్కోపార్టీ సభ్యుడికి అవకాశం ఇస్తూ సభను నడిపించారు. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ సర్కార్ ఏర్పాటు చేయడంపై బీజేపీ సభ్యులు విమర్శల వర్షం కురిపించారు. ఆప్ సర్కార్‌కి తాము మద్దతు ఇవ్వబోమంటూ బీజేపీ శాసనసభ పక్షనాయకుడు డా.హర్షవర్ధన్ ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామంటూ, కాంగ్రెస్‌పార్టీపై పోటీకి దిగిన ఆప్ అధికారం కోసం వారితో చేతులు కలిపిందంటూ దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులు తమతమ ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్, ఆప్ సభ్యులు అడ్డుతగలడంతో కొన్నిమార్లు అసెంబ్లీ వేడెక్కింది. మధ్య మధ్యలో కొందరు సభ్యులు తమ వాక్చాతుర్యంతో సభలో నవ్వులు పూయించారు. ఆమ్ఆద్మీఅని చెప్పుకుంటున్న పార్టీ ఎమ్మెల్యేల్లో 17 మంది వరకు కోటీశ్వరులేనని బీజేపీ సభ్యులు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ..ప్రజల సంక్షేమం కోసమే ఆమ్ఆద్మీపార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉందని, ఆప్ ఇచ్చిన ఉచిత మంచినీటి హామీతో వారికి ఎలాంటి లబ్ధి ఉండదని, అలాంటి వారి గురించి ఆలోచించాలంటూ కొందరు కాంగ్రెస్ సభ్యులు సూచించారు. ఆయా పార్టీల సభ్యులు ప్రసంగిస్తున్నంత సేవు వారి పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. జేడీయూ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ప్రసంగిస్తుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇక్బాల్ కాసేపు హంగామా సృష్టించారు. తన కోటు విప్పడంతోపాటు ముందుకు వెళ్లబోయారు. మిగిలిన ఎమ్మెల్యేలు కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షను చూసేందుకు ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సందడి వాతావరణం కనిపించింది. దేవుడి దయ... మన ప్రాప్తి: సీఎం కేజ్రీవాల్ దేవుడి దీవెనలు ఉన్నంత వరకు మన ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఆశీస్సులు లేకపోతే ఎంతభద్రత ఉన్న వీఐపీని రక్షించలేదని తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల భద్రత పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం సబబు కాదన్నారు. ప్రజా సొమ్ముతో ప్రత్యేక సౌకర్యాలు అనుభవిస్తూనే, సామాన్యుల జీవనానికి ఆటంకం కలిగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసు భద్రత లేకుండానే సొంత కారులో కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నానని, అన్ని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్‌లైట్ పడితే ఆగానని, దీనివల్ల తన సమయం వృథా అయిందని భావించడం లేదని ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి మాట్లాడారు. -
బలపరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం
-
బలపరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో ఈ సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన బలం నిరూపించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. బిజెపి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్‌కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్‌కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు పలికారు. -
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
-
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికే ప్రమాదకరమని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు దక్కించుకోవడంతో దేశ ప్రజల్లో ఒక ఆశ పుట్టిందని, కానీ కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ చేతులు కలపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కారణాలేంటో కేజ్రీవాల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చెత్తబుట్టలో పడేసిన పార్టీతో ఆమ్ఆద్మీపార్టీ ఎందుకు చేతులు కలిపిందని హర్షవర్దన్ ప్రశ్నించారు. నిజాయితీగల పార్టీకి ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారని, అందుకే నిజాయితీ గల బీజేపీకే ప్రజలు ఓటేశారని, అసెంబ్లీలో ఎక్కువ సీట్లు తమకే వచ్చాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాగా, విశ్వాస పరీక్ష అంటే తమకు ఏమాత్రం భయం లేదని.. భయపడితే తాము గుడికి వెళ్లి ఉండేవాళ్లమని ఉదయమే కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎటూ విప్ జారీ చేయడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం లాంఛనప్రాయమే అయ్యింది. -
విశ్వాస పరీక్ష అంటే భయం లేదు: కేజ్రీవాల్
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గురించి తానేమీ భయపడట్లేదని, ప్రభుత్వం ఎన్నాళ్లున్నా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా మీడియా ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించినప్పుడు ఆయనిలా స్పందించారు. తమకు ఏమైనా భయం ఉంటే ఈరోజు గుడికి వెళ్లి ప్రార్థించేవాడినని నవ్వుతూ చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు జరిగే అవకాశముంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ మార్కు 36 కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. సర్కారుకు బయటినుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులున్నారు. కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీచేసింది. -
నేడు కేజ్రీవాల్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష
-
నేడే ఆప్ సర్కారు బలపరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలాన్ని నిరూపించుకోనుంది. విశ్వాస పరీక్షలో గెలుపు ఓటముల గురించి తాము ఆందోళన చెందట్లేదని, ప్రజలకోసం మంచి పనులు చేయాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, జనవరి 3లోగా బలనిరూపణ చేసుకోవాలనిలెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గడువివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో తేదీనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ పర్యవేక్షణలో బలనిరూపణ జరగనుంది. విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రొటెం స్పీకర్ కూడా పాల్గొనవచ్చంటున్నారు. 70 మంది సభ్యులున్న విధానసభలో మెజారిటీ నిరూపించుకునేందుకు 36 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది శాసనసభ్యులు బయటినుంచి మద్దతు ఇస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఏకైక సభ్యుడు షోయబ్ ఇక్బాల్ కూడా సర్కారుకు మద్దతు ప్రకటించారు. బీజేపీ బలం 31. ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. సర్కారుకు తమ మద్దతు కొనసాగుతుందని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు షురూ: ఢిల్లీ విధానసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ మతీన్ అహ్మద్ ఐదవ విధానసభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణస్వీకారం చేశాక మిగతా శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్ పదవి స్వీకరించడానికి బీజేపీ ఎమ్మెల్యే జగ్దీశ్ ముఖి, జేడీ(యూ) ఎమ్మెల్యే ఇక్బాల్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్‌ను నియమించారు. కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీజేపీతోపాటు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక: విశ్వాస పరీక్ష అనంతరం.. ఆప్ సర్కారుకు మరో పరీక్ష స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రూపంలో ఎదురుకానుంది. వీరి ఎన్నిక శుక్రవారం జరగనుంది. స్పీకర్ పదవికి జంగ్‌పురా ఎమ్మెల్యే ఎం.ఎస్.ధీర్‌ను అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు ఆప్ ప్రకటించింది. బీజేపీ జగదీశ్ ముఖిని స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. సమావేశాలు ఈ నెల 7 వరకు జరుగుతాయి. లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 6న అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. కేజ్రీవాల్ ఇంటిముందు బారులు తీరిన ‘ఆమ్ ఆద్మీ’: కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు కౌశాంబిలోని ఆయన నివాసం ముందు భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ బుధవారం కూడా వైద్యుల సూచన మేరకు దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. ఢిల్లీ వాసులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆప్‌లో చేరిన ఇన్ఫోసిస్ బోర్డు మాజీ సభ్యుడు బెంగళూరు: ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుని పదవి నుంచి ఇటీవల వైదొలగిన వి.బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన బుధవారం బెంగళూరులో పీటీఐతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నిర్ధారించారు. దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవాన్ని ఆప్ తీసుకొచ్చిందని ఆయన అన్నారు. -
సర్కారు ఏర్పాటుకు ఆప్ సిద్ధం
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను ఆయన సోమవారం కలవనున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదివారమే ప్రకటించిన కేజ్రీవాల్ ఇందుకు కావల్సిన ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 70 మంది సభ్యులుండే ఈ అసెంబ్లీలో బీజేపీకి 31 స్థానాలు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల గెలిచింది. కొన్ని షరతులకు లోబడి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దీంతో ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా వద్దే అనే విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. ప్రజలు తమను అధికారంలో చూడాలనే భావిస్తున్నారని, అందువల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. అయతే, కాంగ్రెస్-ఆప్ పొత్తు అపవిత్రం, అనైతికమని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
కాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చిస్తున్న ఆప్
మద్దతు కోసం తాము విధించిన 18 షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావడంతో దానిపై చర్చించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఘజియాబాద్‌లో సమావేశమయ్యారు. అక్కడి కౌశాంబిలో గల పార్టీ కార్యాలయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన మొత్తం 28 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆప్ సభ్యుడు మనీష్ సిసోదియా తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఆరుగురు కేజ్రీవాల్ ఇంట్లో కలిశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకుని దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలని కొందరు ప్రతిపాదించారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. చివరకు పోస్టుకార్డుల ఉద్యమం మొదలుపెట్టి, ప్రజలకు 25 లక్షల ఉత్తరాలు రాయాలని, వాళ్లేం చెబితే అదే చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ కలిస్తే సరిగ్గా కనీస మెజారిటీ 36 సీట్లు వస్తాయి. -
కేజ్రీవాల్ అష్టాదశ షరతులు
ఢిల్లీ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తామంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ విషమ పరీక్షే పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ముందుకు తీసుకొచ్చిన 'రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)' సహా పలు అంశాల్లో భారీగా షరతులు విధిస్తూ వాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 షరతులు పెట్టిన కేజ్రీవాల్, వాటన్నింటికీ ఒప్పుకొంటేనే ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరిస్తానన్నారు. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ.. రెండింటికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఆ షరతులేంటో చూద్దాం.. వీఐపీ సంస్కృతి ముగింపు: మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఎర్రబుగ్గ కార్లు ఉండకూడదు. వారు ప్రభుత్వ బంగళాల్లో నివసించరాదు. ప్రత్యేక భద్రతను స్వీకరించకూడదు. జన్‌లోక్‌పాల్ బిల్లు: హజారే ప్రతిపాదించిన బిల్లును ఆమోదించి అమలుచేయాలి. స్వపరిపాలన: ప్రతి కాలనీలో నిర్వహించే సభల్లో ప్రజలే నేరుగా నిర్ణయం తీసుకుంటారు. సంపూర్ణ రాష్ట్ర హోదా: ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలి. డీడీఏ. ఢిల్లీ పోలీసులను కేంద్రం అజమాయిషీ నుంచి తప్పించాలి. ఢిల్లీలోని ప్రైవేటు విద్యుత్ కంపెనీలన్నింటికీ ప్రత్యేక ఆడిట్ జరపాలి. ఆడిట్లో పాల్గొనడానికి నిరాకరించే కంపెనీల లెసైన్సులను రద్దు చేయాలి. విద్యుత్తు మీటర్లను తనిఖీ చేయాలి. నీటి మాఫియా ఆట కట్టించాలి: ఢిల్లీలో వాటర్ మాఫియా ఆటకట్టించి ప్రతి ఇంటికి 700 లీటర్ల నీటిని ఉచితంగా అందజేయాలి. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ: 30 శాతం ఢిల్లీ జనాభా అనధికార కాలనీలలో నివసిస్తోంది. కాబట్టి వాటిని క్రమబద్ధీకరించాలి. జుగ్గీ జోపిడీవాసులకు పక్కా ఇళ్లు: మురికివాడల్లో నివసించేవారికి పక్కా ఇళ్లను అందుబాటు ధరలకు ఇవ్వాలి, అంతవరకు వారి ఇళ్లను కూల్చకూడదు. వారికి మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. చిన్న వ్యాపారులకు మద్దతు: రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి కనీస వసతులను సాధారణ వ్యాపారికి కల్పించాలి. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ వద్దు రాజధాని దగ్గరలోని గ్రామాలలో నివసించే రైతులకు సదుపాయాలు, సబ్సిడీ ఇవ్వాలి. 500 ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలల్లో డొనేషన్లను రద్దు చేసి వ్యవస్థను పారదర్శకంగా మార్చాలి. ఆరోగ్యం: మెరుగైన వసతులతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటుచేయాలి. మహిళల కోసం ప్రత్యేక భద్రతా యూనిట్లు ఏర్పాటుచేయడం, అన్ని వేధింపుల కేసులను మూడు నెలలలో పరిష్కరించడం వంటివి చేయాలి. ఆరు నెలల్లో అన్ని కేసులను పరిష్కరించేందుకు వీలుగా జడ్జీలను నియమించాలి. ఈ అంశాలపై అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఆప్‌కు సహకరిస్తాయా? అనే విషయంలో స్పష్టత ఉండాలి. -
హస్తిన గద్దెపై ఆసీనులయ్యేది ఎవరో!
ఢిల్లీ వాసులు ఇచ్చిన తీర్పుతో రాజకీయ పార్టీలు తలపట్టుకుంటున్నాయి. పదిహేనేళ్లుగా రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించడం వరకు అందరూ సంతోషంగానే కనిపించినా, ఇటు బీజేపీకి గానీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ ప్రజలు స్పష్టమైన మాండేట్ ఇవ్వలేదు. 31 స్థానాల వద్ద బీజేపీని, 28 స్థానాల వద్ద ఆప్‌ను ఆపేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెల స్థాయిని కూడా అందుకోలేక పూర్తిగా చతికిలపడింది. ఆ పార్టీకి కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక జేడీ(యూ), శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఒక్కో స్థానాన్ని పంచుకోగా, మరో స్వతంత్ర సభ్యుడు కూడా గెలుపొందారు. వీళ్లలో బీజేపీకి ఎటూ అకాలీదళ్ పార్టీ ఎన్డీయే భాగస్వామి కాబట్టి మద్దతిస్తుంది. స్వతంత్ర సభ్యుడు కూడా సరేనన్నాకూడా మరో ముగ్గురు సరేనంటే తప్ప ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు. ఇందుకోసం బీజేపీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఢిల్లీవాసులకు తాము మంచి ప్రభుత్వాన్ని అందజేస్తామంటున్న ఆ పార్టీ నాయకులు.. కొనుగోళ్లు, బేరసారాలకు మాత్రం దిగబోమని చెబుతున్నారు. ఒకవేళ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వచ్చినా, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ జేడీ(యూ) ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. అందువల్ల ఆ పార్టీ నుంచి మద్దతు ఆశించడం అనవసరం. అంటే అటు కాంగ్రెస్ నుంచి గానీ ఇటు ఆప్ నుంచి గానీ కనీసం ముగ్గురు బీజేపీ సర్కారుకు సరేననాలి. అయితే తాము బీజేపీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తామని ఆప్ నాయకులు ఇప్పటికే చెబుతున్నారు. 28 స్థానాలున్న తమను ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినా, ఇంత తక్కువ స్థానాలతో తాము ప్రభుత్వం ఏర్పాటుచేయడం సాధ్యం కాదనే చెబుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య బద్ధవైరం ఉంది కాబట్టి అటునుంచి ఏదో రూపంలో మద్దతు వస్తుందని ఆశించడం అనవసరం. ఆప్ నుంచి కూడా మద్దతు రాకపోవచ్చు. అయితే.. ఒకవేళ కాంగ్రెస్ లేదా ఆప్‌లలో ఎవరైనా కొంతమంది సభ్యులు విశ్వాసపరీక్ష రోజున అసెంబ్లీకి హాజరు కాకపోవడం లేదా ఓటు వేయకపోవడం చేస్తే మాత్రం ప్రస్తుతానికి బీజేపీ సర్కారు గట్టెక్కచ్చు. కర్ణాటక తరహా మంత్రాలు ఏవైనా వేస్తే మాత్రం ఎటునుంచైనా కొందరు సభ్యులను లాక్కుని, వాళ్లు అనర్హులైన తర్వాత మళ్లీ బీజేపీ టికెట్లపై గెలిపించి సాధారణ మెజారిటీ సాధించే చాన్సు సైతం ఉండనే ఉంది. రాజకీయ తెరపై ఏం జరుగుతుంతో చూడాలి మరి!! -
కాంగ్రెస్, బీజేపీలతో కలిసేది లేదు: ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీలో కొత్తగా రాబోయే ప్రభుత్వం ఏది? ఈ ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ఢిల్లీలో మాత్రం అధికారాన్ని చేపట్టడానికి ఐదు స్థానాల దూరంలోనే ఉండిపోయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తాము మాత్రం ఇటు బీజేపీకి గానీ, అటు కాంగ్రెస్ పార్టీకి గానీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా తెలిపారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం లేదా మళ్లీ ఎన్నికలైనా ఎదుర్కొంటాం తప్ప ఎవరికీ మద్దతు మాత్రం ఇవ్వబోమన్నారు. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన కోర్ గ్రూప్ సమావేశంలో పాల్గొని వచ్చిన అనంతరం ఆయనీ విషయం తెలిపారు. పొత్తు ఉండబోదన్న విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ముందే చెప్పారని సిసోదియా గుర్తుచేశారు. పైపెచ్చు, అసలు ఇంతవరకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమను ఏ పార్టీ కూడా సంప్రదించలేదని తెలిపారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని సిసోదియా చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు సాధించిన ఆప్.. రెండో అదిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. బీజేపీకి 31 స్థానాలు మాత్రమే వచ్చాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. -
ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్
ఢిల్లీలో ప్రజలు తమకు అందించిన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. ఇది ప్రజా విజయమని, ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. కనాట్ ప్లేస్‌లోని హనుమాన్ రోడ్డులో గల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ నృత్యాలు చేస్తుండగా వారికి చేతులు ఊపుతూ అభివాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఆయన తమ పార్టీ కార్యాలయం మొదటి అంతస్థు నుంచే అభివాదాలు తెలిపారు. ఆయన మద్దతుదారులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపురు కట్టలను చూపిస్తూ హర్షధ్వానాలు చేశారు. తమ పార్టీ విజయం పట్ల తనకు ఎప్పుడూ విశ్వాసం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్‌పై ఆయన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పక్కనే నిలబడిన ఆప్ నాయకుడు కుమార్ విశ్వాస్ మైకు తీసుకుని, గట్టిగా, 'భారత్ మాతాకీ జై', 'ఆమ్ ఆద్మీ హై హమ్, హమ్ ఆమ్ ఆద్మీ హై' అంటూ నినదించారు. -
వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్
ప్రస్తుత్తం మేము వెధవలమని మీ ఉద్దేశమా? (బెవకూఫ్ హై నా) అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియా రిపోర్టర్లపై మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీలా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీని, ఢిల్లీ ప్రజలు మనోభావాలను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మేము వెధలమా అంటూ కోపంగా జవాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును అంగీకరిస్తామని షీలా అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఎదురుగాలి తప్పదు అని సర్వేలు వెల్లడించాయి. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో దిగడంతో షీలాకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. -
ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు ఆశ్చర్యకరం: బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీనే కాదు.. బీజేపీని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా తమ ఆధిక్యాలు గణనీయంగా తగ్గిన విషయం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యంలో పడేసింది. కేజ్రీవాల్ పార్టీ ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని నాయకులు అంగీకరించినా.. తాము మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ''ఆప్ మాకు పోటీ ఇస్తుందని భావించామని, కానీ రెండంకెల సంఖ్యను చేరుకుంటుందని మాత్రం అనుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి విజయ్ గోయల్ అన్నారు. గడిచిన పదిహేనేళ్లలో తాము ఢిల్లీలో ఎంతో కష్టపడినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాటి ఫలితాలు అనుభవిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాలకు గాను కనీసం 38 వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ఆధిక్యాలు చూస్తే మాత్రం బీజేపీ ఫలితాలు కాస్త అటూ ఇటూగా సాగుతున్నాయి. స్పష్టమైన ఫలితాలు వెలువడే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. -
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదివారం బాగా కలిసొచ్చింది. దేశ రాజధాని నగరంలో తాము స్వయంగా అధికారంలోకి రాలేకపోయినా, కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టగలుగుతున్నామన్న ఆనందం ఆ పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలుండగా 25 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. కొడితే నేరుగా కొండనే ఢీకొట్టాలి అన్నట్లు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరిగాయి. సర్వేలలో ఏబీపీ - నీల్సన్ సంస్థ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 15 స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియాటుడే-ఓఆర్జీ, టైమ్స్ నౌ- సీ ఓటర్ మాత్రం 06, 11 స్థానాలు వస్తాయన్నాయి. వీటిని దాటుకుంటూ మరింత ముందుకెళ్లింది ఈ పార్టీ. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో పోలింగ్
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఢిల్లీ చరిత్రలో అత్యధికంగా 74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 1993లో తొలిసారి ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 61.75 శాతం ఓటింగ్ నమోదైంది. 2008 ఎన్నికల వరకు ఇదే అత్యధికం. తాజా ఎన్నికల్లో ఆ రికార్డు బద్దలైంది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. -
ఢిల్లీలో అందరి చూపు.. ఆ స్థానంపైనే
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే. హేమాహేమీలు పోటీపడుతున్న ఆ స్థానంలో అతిరథమహారథులు ఓటు హక్కు వినియోగించుకోవడమే కారణం. అదే న్యూఢిల్లీ నియోజకవర్గం. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ సీనియర్ నేత విజేందర్ గుప్తా బరిలో ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక ఈ నియోజకవర్గంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సహా చాలా మంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. షీలాదీక్షిత్‌తో కలసి వచ్చి సోనియా ఓటేశారు. అదే సమయంలో సోనియా తోడికోడలు, బీజేపీ నేత మేనకా గాంధీ అక్కడకు వచ్చారు. వీరిద్దరూ ఎదురుపడినా పలకరించుకోలేదు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కేంద్రమంత్రులు, సైన్యాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇదే నియోజకవర్గంలో ఓటేశారు. -
ఈవీఎం మొరాయింపు.. అబ్దుల్ కలాంకూ తప్పని నిరీక్షణ
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కనీసం గంట సేపు ఎదురు చూడాల్సివచ్చింది. కలాం ఓటు వేసేందుకు బుధవారం కె.కామరాజ్ మార్గ్ పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన గంట సేపు ఎదురు చూసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు ఈవీఎంను మార్చడటంతో కలాం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది చాలా సుదీర్ఘ సమయమని, ఈవీఎంను మార్చేందుకు పట్టిన సమయానికి కలాం ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చుండేవారని ఓ అధికారి చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రంలో కలాంతో పాటు చాలామంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆర్మీ, నేవీ దళాల అధిపతులు ఓటు వేశారు. 'ఈవీఎం మొరాయించే సమయానికి 412 ఓట్లు పోలయ్యాయి. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్, నేవీ చీఫ్ డీకే జోషీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఓటు వేశారు' అని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 112 ఈవీఎంలు మార్చినట్టు చెప్పారు. సాంకేతిక సమస్యలే కారణమని ఆయన వెల్లడించారు. -
ఢిల్లీలో మధ్యాహ్నానికి 48 శాతం పోలింగ్
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ క్రమేణా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 48 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఢిల్లీ శాసనసభలో ఉన్న 70 స్థానాలకు 810 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ తదితరులు ముందుగానే ఓట్లు వేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడా అత్యధిక పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు. -
ఢిల్లీలో తొలి మూడు గంటల్లో 17% పోలింగ్
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్.. ఇలా అనేకమంది ప్రముఖులు ఢిల్లీ ఎన్నికలలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో తొలి మూడు గంటల్లోనే దాదాపు 17% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల దారిలోనే ఇక్కడ కూడా అత్యధిక పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు. అలాగే, ఇంతవరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, అలాగే ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ తదితరులు ముందుగానే ఓట్లు వేశారు. ఈసారి కూడా తాము గెలిచి తీరుతామన్న ధీమాను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యక్తం చేశారు. నిర్మాణ్ భవన్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో ఆమె, సోనియాగాంధీ క్యూలో నిలబడి మరీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక రాహుల్ గాంధీ తన బ్రాండు కుర్తా పైజమా, హాఫ్ జాకెట్ ధరించి దాదాపు 32 నిమిషాల పాటు క్యూలో నిలబడి ఔరంగజేబ్ లేన్ బూత్‌లో ఓటేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అందరికంటే ముందుగా వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నచ్చిన పార్టీ అభ్యర్థికే ఓట్లు వేయాలి గానీ అసలు ఓటుమాత్రం తప్పకుండా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావొద్దని, తప్పకుండా ఓట్లు వేయడానికి వెళ్లాలని కోరారు. కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయలేదని ఫిర్యాదులు వచ్చాయి గానీ, అధికారులు వాటిని తర్వాత సరిచేశారు. పోలింగ్ ప్రారంభం కాగానే రాహుల్ ఓటు వేసేందుకు వెళ్లిన ఔరంగేజ్ లేన్ లోని ఈవీఎం పనిచేయలేదు. మరికొన్నిచోట్ల తాము ఓటు వేయాలనుకున్నవారికి వేయలేకపోతున్నామని, ఆ బటన్లు పనిచేయడంలేదని చెప్పారు. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే చలి బాగా ఎక్కువగా ఉండటంతో పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా, క్రమంగా ఊపందుకుంటోంది. ఇక్కడ ఉన్న మొత్తం 70 సీట్లకు గాను బరిలో 810 మంది అభ్యర్ధులున్నారు. ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1.19 కోట్లు. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని ఎన్నికల అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీ దీన్ని తలదన్నుతుందని అంటున్నారు. ఇక్కడ తొలిసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలో ఉంది. చీపురుకట్ట గుర్తుతో అరవింద్ కేజ్రీవాల్ బృందం జోరుగానే ప్రచారం చేసింది. ఈసారి ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావచ్చని, మూడు పార్టీలకూ దాదాపు సమాన స్థాయిలోనే సీట్లు రావచ్చని సర్వేలు అంచనా వేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కూడా ఓటు వేశారు. సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ సహా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికలలో ఓట్లు వేయనున్నారు. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
ఢిల్లీలో హంగ్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని, అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఓ సర్వే చెబుతోంది. ఏబీపీ న్యూస్- దైనిక్ భాస్కర్ - నీల్సన్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్ఈలో బీజేపీకి 33 శాతం ఓట్లతో 32 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 26 శాతం ఓట్లతో 25 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చాయి. ఇక బిల్లులు కట్టొద్దంటూ చీపురుకట్ట గుర్తుతో ప్రచారం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 23 శాతం ఓట్లు సాధించినా.. 10 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే మాత్రం ఎక్కువమంది బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన తర్వాత అత్యంత సమీపంలో కేజ్రీవాల్ నిలిచారు. అయితే.. దాదాపు 15-20 స్థానాల్లో అతి తక్కువ తేడాతో (రెండు శాతం) ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని కూడా సర్వే చెప్పింది. ధరల పెరుగుదల అంశం అధికార కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారుతుందని, గత 15 ఏళ్లుగా షీలాదీక్షిత్ చేసిన అభివృద్ధిని గుర్తించినా ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే యోచనలో లేరని సర్వే తేల్చింది. -
17 నుంచి కమలనాథుల ప్రచారం షురూ
విధానసభ ఎన్నికలకు కమలదళం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. గెలుపే లక్ష్యం అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం, ఇక క్షేత్రస్థాయిలో వాటి అమలుపై దృష్టి సారించనుంది. ప్రత్యర్థిపార్టీకి ఒక అడుగు ముం దుంటూ వస్తున్న బీజేపీ నాయకులు ఈనెల 17న తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నుట్ట ప్రక టించారు. శనివారం బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజ య్గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్ర పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలతోపా టు యువతకు చేరువయ్యేం దుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారు ప్రత్యేకంగా చర్చించారు. 17న నిర్వహించనున్న ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అసెం బ్లీ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కరీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరా జ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, జాతీ య ప్రధాన కార్యదర్శి అమిత్‌షా, అనంత్‌కుమార్ తదితరులు పాల్గొననున్నట్టు విజయ్‌గోయల్ తెలి పారు. ‘బీజేపీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్, నీటి బిల్లులు, కాంగ్రెస్‌పార్టీ నాయకుల అవినీతి, కుంభకోణాలు, అనధికారిక కాలనీలు, జేజే కాలనీలు, నిరుద్యోగం, గ్రామీణ ప్రాం తాల అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తాం. ఇందుకు సంబంధించి ఓ బుక్‌లెట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నామ’ని గోయల్ పేర్కొన్నారు. ఇంటింటికీ ప్రచారం... పార్టీ శ్రేణులంతా గ డప గడపకు తిరిగి ప్రచారం నిర్వహిస్తాయని గోయల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు ప్రజ లకు దీనిపై అవగాహన కల్పించేదుకు యత్నిస్తున్నట్టు వివరించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగ ట్టడంతోపాటు ప్రత్యేకించి పేద మధ్యతరగతి, యువతకు చేరవయ్యేలా కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనధికారిక కాలనీలు, జేజే కాలనీలు, మురికి వాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మెడీపై గోయల్ ప్రశంసల జల్లు... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని మంత్రిగా చేయాలని యువత కోరుకుంటోందని విజయ్‌గోయల్ అన్నారు. నరేంద్రమోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పార్టీకి మరింత బలాన్ని పెంచిందంటూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు గోయల్. 14ఏళ్లలో మోడీ నాయకత్వంలో గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని, అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గెలుపు సాధించేందుకు మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అంశమూ లాభం చేస్తుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 29న రోహిణిలోని జపనీస్ పార్క్ ప్రాంతంలో నిర్వహించనున్న ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని తె లిపారు. ర్యాలీకి దాదాపు 5 లక్షల మంది హారవుతారని ఆశిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్టు వివరించారు.