
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.
మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment