delhi assembly special session
-
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
-
అక్కడ ఎక్కడినుంచో ఎందుకు తెచ్చారు?
ఓ భారీ కుట్రను వెల్లడించడానికి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి సస్పెండయిన ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా హాజరయ్యారు. కేజ్రీవాల్ బంధువుల పేరు మీద జరిగిన భూ కుంభకోణాలు, మంత్రుల విదేశీ పర్యటనలు తదితర అంశాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా అటు నుంచి అటే అసెంబ్లీ సమావేశానికి ఆయన వచ్చేశారు. ఇక ఈ సమావేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రస్తావించారు. ఆప్ నాయకులతో కలిసి తాను ఈవీఎంల గురించి పలు ప్రశ్నలతో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లానని, అయితే తమకు అక్కడినుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని ఆమె చెప్పారు. అయినా ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ఎక్కడో రాజస్థాన్ నుంచి ఈవీఎంలు తేవాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. విచారణ కోసం ఈవీఎంలను స్వాధీనం చేసుకోవాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిందని, అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఏకంగా 2446 ఈవీఎంలను సీజ్ చేసిందని చెప్పారు. ఎన్నికలలో ఓడిపోయినందుకో లేదా ప్రచారం కోసమో ఈవీఎంల అంశాన్ని లేవనెత్తడం లేదని ఆమె చెప్పారు. పదేళ్ల పాటు ఎంసీడీలో దుష్ట పరిపాలన చేసిన తర్వాత బీజేపీ మళ్లీ ఈ స్థాయిలో మెజారిటీ సాధిస్తుందని ఎవరూ అనుకోలేదని, అందువల్ల ఇందులో వాస్తవం ఏంటో బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో అన్న అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ అసెంబ్లీలో చేసి చూపించారు.