rekha gupta
-
Delhi: సీఎంకు ‘శీష్ మహల్’ అడ్డంకి.. దక్కని అధికార నివాసం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి సీఎంగా రేఖాగుప్తా(Rekha Gupta) భాధ్యతలు చేపట్టి, 50 రోజులు దాటినా ఆమెకు అధికార నివాసం దక్కలేదు. ప్రస్తుతం ఆమె షాలిమార్ బాగ్‌లోని తన ప్రైవేట్ నివాసంలోనే ఉంటున్నారు. దీనికి ‘శీష్ మహల్’ వివాదమే కారణమనే వాదన వినిపిస్తోంది. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివసించిన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని విలాసవంతమైన భవనాన్ని బీజేపీ ‘శీష్ మహల్’(అద్దాల మేడ)గా అభివర్ణించింది. ఈ నేపథ్యంలోనే నూతన సీఎం రేఖా గుప్తా ఆ బంగ్లాలో నివసించడానికి నిరాకరించారు. దానిని మ్యూజియంగా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పదవిని చేపట్టాక తాను శీష్ మహల్(Sheesh Mahal)లో ఉండబోనని, అది ప్రజల సొమ్ము అని, దానిని వినియోగించే హక్కు తనకు లేదని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్ విలాసవంతమైన జీవనశైలి కోసం ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. మరోవైపు సీఎం రేఖా గుప్తాకు ప్రత్యామ్నాయ అధికారిక నివాసం కేటాయించడం ఢిల్లీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు అధికారిక నివాసంగా మూడు బంగ్లాలను ఎంపిక చేసింది. సీఎం తన నివాసం కోసం వీటిలో ఒక బంగ్లాను ఎంపికచేసుకోవలసి ఉంటుంది.ప్రస్తుతం సీఎం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నివాసంలోనే ఉంటూ, ఢిల్లీ సెక్రటేరియట్ నుండి పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఈ పరిస్థితిని విమర్శిస్తూ, ‘బీజేపీ ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసింది. అయితే ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రికి నివాసం కూడా కేటాయించలేకపోతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదాలకు అతీతంగా సీఎం రేఖా గుప్తా బీజేపీ ఎన్నికల హామీలైన మహిళా సమృద్ధి యోజన, యమునా నది శుద్ధీకరణ వంటి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు.ఇది కూడా చదవండి: 108 దేశాల్లో ‘నవకార్ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ -
Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను కూడా సీఎం రేఖ గుప్తానే పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం అధికం. ఈ బడ్జెట్లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏఏ వరాలను అందించిందంటే..ఆరోగ్య బీమాఢిల్లీ ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.ఢిల్లీ బడ్జెట్లోని కీలక ప్రకటనలుమూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు.త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ యోజన అమలు.ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్ అందుతుంది. ఈ పథకానికి ₹2144 కోట్లు కేటాయించారు.మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయింపు.ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు. నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఎన్సీఆర్తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు.మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు.జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయింపు.ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయింపు.100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు. ఇందుకోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు.ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.సింగిల్ విండో వ్యవస్థ అమలు.పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి.వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ.ఇది కూడా చదవండి: Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్ -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
సీఎం గారు నిద్ర లేవండి.. మనం అసెంబ్లీలో ఉన్నాం
ఢిల్లీ : ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖాగుప్తా బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాల్ని తీసేయించారని ఆరోపణలు గుప్పించింది. ఆప్ నేత అతిషీ మర్లేనా ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 1౩ సెకన్ల వీడియోను షేర్ చేస్తూ ఇక్కడ నిద్ర పోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. తమకు సేవ చేయాలని ఢిల్లీ ప్రజలు రేఖాగుప్తాను అసెంబ్లీకి పంపించారు. కానీ అసెంబ్లీ సమావేశం జరిగే సమయంలో సీఎం గారు నిద్రపోతున్నారు’అని సెటైర్లు వేసింది. అంతేకాదు, సీఎం గారు అంబేద్కర్,భగత్ సింగ్‌ను అవమానించడంలో మీరు కొంత సమయం తీసుకున్నట్లయితే, దయచేసి అసెంబ్లీ చర్చపై కూడా కొంచెం దృష్టి పెట్టండి’అని వ్యాఖ్యానించింది. ఇక ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తున్న దృశ్యాల్ని చూడొచ్చు.CM मोहतरमा के दो रूप‼️1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना 2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025అయితే, ఆప్ షేర్ చేసిన వీడియోపై రేఖా గుప్తా అభిమానులు, బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. మా సీఎం అసెంబ్లీ చర్చను కళ్లుమూసుకుని శ్రద్దగా వింటున్నారని, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ఆప్ కావాలనే టార్గెట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. -
వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్,అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్,భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్‌కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు. -
మహిళలకు నెలకు రూ.2500.. ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం(ఫిబ్రవరి 24)ప్రారంభమయ్యాయి. తొలి సమావేశాల్లో సీఎం రేఖాగుప్తా సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)తరపున ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిషి ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మహిళలకు నెలకు రూ.2500 నగదు ఇచ్చే అంశంపై సీఎం రేఖాగుప్తా కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యం మహిళలకు నెలకు రూ.2500 స్కీమ్ అమలు చేయడమేనని సీఎం రేఖాగుప్తా అన్నారు. అయితే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయినందున స్కీమ్ అమలు కొంత ఆలస్యం జరగొచ్చని పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత అతిషి అభ్యంతరం తెలిపారు. తాము మంచి స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పగించామని కౌంటర్ ఇచ్చారు.అయితే సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ.2500 బదిలీ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఆమ్ఆద్మీపార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల హామీలను విస్మరించారని మాజీ సీఎం అతిషి ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. తొలి రోజే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సీఎం రేఖాగుప్తా ఆప్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలకు నగదు బదిలీపై ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి, మహిళా నేత రేఖా గుప్తా(Rekha Gupta)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఫిబ్రవరి 24న ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎన్నికల్లో ఓటమి పాలయిన కేజ్రీవాల్‌కు మాజీ సీఎంగా ఎంత పింఛన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి నెలా రూ.1.70 లక్షల జీతం అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని 2023, మార్చి నాటి ఆర్డర్ ప్రకారం నిర్ణయించారు. దీనిలో ఆమె ప్రాథమిక జీతం(Basic salary) రూ. 60,000. వీటికితోడు ఆమెకు పలు భత్యాలు కూడా లభిస్తాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియల్ సహాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి జీతంతో పాటు కారు, బంగ్లా సహా అనేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి తన ప్రైవేట్ కారును ఉపయోగిస్తే, ప్రతి నెలా రూ. 10,000 మొత్తం లభిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసానికి ప్రతి నెలా 5,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు. దీనికితోడు ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రూ.12 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయనకు రూ. 15,000 పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే, ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయినందున ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు లభిస్తాయి. దీనితో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్ మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.జితిన్ ప్రసాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.సెయింట్ స్టీఫెన్స్ కళాశాలశశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు.ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా, దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.హిందూ కళాశాలడాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.రాంజస్ కళాశాలచౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్‌గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్‌గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.కిరోరి మాల్ కళాశాలనవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.మదన్‌లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్‌లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.హన్స్‌రాజ్ కళాశాలకిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దయాల్ సింగ్ కళాశాలపంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు.అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దౌలత్ రామ్ కళాశాలరేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా అందుకున్నారు.ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు -
అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ రూపు 'రేఖ'లు మారేనా..?
-
ఢిల్లీ కొత్త సీఎంకు ‘ఏడు’ సవాళ్లు.. రూపు ‘రేఖ’లు మారేనా?
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజే మంత్రులకు శాఖలు కూడా ఏర్పాటు చేశారు. మంత్రివర్గ తొలి కూర్పులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశీశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. రేఖా గుప్తాకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.మరోవైపు, బీజేపీ కొత్త ప్రభుత్వానికి ఢిల్లీలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు తీర్చాల్సి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం హామీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రేఖా గుప్తా ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే...1. మహిళలకి నెలకు రూ.2500 ఉచిత ఆర్థిక సహాయం, గర్భిణులకు 21 వేల రూపాయల ఆర్థిక సహాయం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం.2. యమునా నది ప్రక్షాళన 3. వాయు కాలుష్య నిర్మూలన 4. మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం 5. 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీలు సహా సంక్షేమ పథకాల అమలు 6. మహిళల భద్రత 7. దేశ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కీలక సవాళ్లు
-
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్‌లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్‌పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్‌గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్‌లోని బోధ్‌గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్‌పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్‌పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్‌లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్‌వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్‌కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌కు సమరి్పంచిన అఫిడవిట్‌ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్‌జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్‌పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా
-
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
30 ఏళ్ల క్రితం.. ఢిల్లీ సీఎం ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తాకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా(Alka Lamba) ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రాజకీయాలకు పక్కనపెట్టి రేఖతో ఉన్న స్నేహబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షురాలిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తరఫున ఆల్కా లాంబా ప్రమాణం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీ తరఫున రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రేఖాకు అభినందనలు తెలియజేశారామె.రేఖా గుప్తా ముఖ్యమంత్రి అని తెలియగానే 30 ఏండ్లు వెనక్కి వెళ్లా. విద్యార్థి సంఘాల నేతలుగా మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు ఇంకా గుర్తు. సిద్ధాంతపరంగా మాకు ఎప్పుడూ పడేది కాదు. కానీ, ఏడాది పాటు మేం కలిసి పని చేసిన రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి అని అన్నారామె.ఇక యమునా నది(Yamuna River) ప్రక్షాళన ప్రధాన హామీగా బీజేపీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై దృష్టిసారించాలని ఆల్కా లాంబా సీఎం రేఖా గుప్తాకు సూచించారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు అభినందనలు. యమునా మాత శుభ్రమవుతుందని, యమునా పుత్రులంతా ఇక సురక్షితంగా ఉంటారని మేం ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారామె.1995 की यह यादगार तस्वीर - जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ.दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025 -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
Delhi: ఆ రోజు నుంచే మహిళల ఖాతాలకు రూ. 2,500
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతీనెల రూ. 2,500 అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై నూతన సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందన్నారు. మహిళలకు మార్చి 8న రూ.2,500 మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమచేయనున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) మొన్నటి ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 2,100 ఇస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ రూ. 2,500 ఇస్తామని ప్రకటించింది. బుధవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలివే..మహిళలకు నెలకు 2500 రూపాయలురూ. 500కే సిలిండర్. హోలీ, దీపావళికి ఒక్కో సిలిండర్ ఉచితంగర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు సాయం. ఆరు పోషకాహార కిట్లు అందజేతమురికివాడల్లోని ప్రజలకు ఐదు రూపాయలకే భోజనంఢిల్లీ పౌరులందరికీ ఉచితంగా రూ. 10 లక్షల మేరకు విలువైన వైద్య చికిత్సప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం అనేది ఢిల్లీలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యత అని రేఖా గుప్తా మీడియాతో అన్నారు. మహిళలకు ఆర్థికంగా సహాయం అందించే మా వాగ్దానాలన్నింటినీ మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. మార్చి 8 నాటికి డబ్బు ఖచ్చితంగా వారి ఖాతాలకు బదిలీ చేస్తాం’ అని అన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) 70 స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దశాబ్దాల ఆప్ పాలనకు బీజేపీ ముగింపు పలికింది.ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్ -
రేఖా గుప్తా అనే నేను
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా(Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఆమె కుమారుడు నికుంజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం ఆనందించాల్సిన విషయం. #WATCH | Delhi CM-designate Rekha Gupta's son, Nikunj says, "It is good that a woman has been given the opportunity to be the CM. We are confident that she will be able to shoulder her responsibility very well. Her 30-year-long hard work has proved to be successful. She has… pic.twitter.com/UXesCIMM8g— ANI (@ANI) February 20, 2025 ఆమె ఈ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలదని నేను నమ్ముతున్నాను. ఆమె 30 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం లభించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi)కి, పార్టీకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రేఖా గుప్తా అత్త మీరా గుప్తా తన కోడలికి అభినందనలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's mother-in-law Meera Gupta says, "...Work well."When asked if she sends her best wishes to the CM-designate, she says, "Yes, certainly..." pic.twitter.com/vTaT3RWgZq— ANI (@ANI) February 20, 2025 ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి? -
ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!
డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎట్టకేలకు ముఖమంత్రిని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది.నేడు (ఫిబ్రవరి 20న) బీజేపీకి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఢిల్లీ పీఠానెక్కనున్నారు. దివంగత సుష్మా స్వరాజ్ తర్వాత, బీజేపీ ఢిల్లీకి రేఖ గుప్తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి పదవికి యువ మహిళా నాయకురాలిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. రికార్డులురెండు దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ ఢిల్లీకి బీజేపీ తరపున తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మరో మహిళా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్ - మూడు దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించి రికార్డు సాధించారు. ఇపుడు ఆప్‌కి చెందిన అతిషి నుండి రేఖా గుప్తా మరో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. మహిళా సీఎంల విషయంలో ఢిల్లీదే రికార్డ్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ,తమిళనాడు బిహార్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు.రేఖ గుప్తా హర్యానాకు చెందినవారు. కానీ రేఖకు కేవలం 2 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం ఢిల్లీకి వచ్చింది. న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. షాలిమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖ గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గత దశాబ్దంలో అమలు చేయని వాగ్దానాలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పాలన ఆమెకు కత్తిమీద సామే. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.ఢిల్లీ పీఠమెక్కిన మహిళా మణులుదేశరాజధాని నగరంఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటివరకు ముగ్గురు అధిరోహించారు. ఇపుడు ఈ జాబితాలో నాలుగోవారిగా రేఖా గుప్తా చేరారు.సుష్మా స్వరాజ్ (బీజేపీ) బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబరు- 1998 డిసెంబరు వరకు ఆమె బాధ్యతలను నిర్వహించారు.షీలా దీక్షిత్, (కాంగ్రెస్)కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నారు. 1998 డిసెంబరు- 2013 డిసెంబరు వరకు ఆమె సీఎంగా సేవలందించారు. అతిషి మార్లెనా సింగ్ (ఆప్)8వ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు, 2024 - నుంచి ఫిబ్రవరి 2025 పనిచేశారు.రేఖా గుప్తా(బీజేపీ)రేఖా గుప్తా ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?
న్యూఢిల్లీ: బీజేపీ మహిళా నేత, ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) ఈరోజు(ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో నేడు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ ప్రవేశ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.ఎమ్మెల్యే ఆశిష్ సూద్ ఆశిష్ సూద్ బి.కామ్ పూర్తి చేశారు. జనక్‌పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ కూడా క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సిర్సా 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.ఎమ్మెల్యే రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ బిఎ పాసయ్యారు. పట్పర్గంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధ్యాపకుడు అవధ్ ఓజాను ఓడించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. రవీందర్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.కపిల్ మిశ్రా కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.పంకజ్ కుమార్ సింగ్ పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. బీహార్‌లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. వికాస్పురి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే? -
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: హర్యానాలోని జీంద్ జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా ఈరోజు (ఫిబ్రవరి 20) ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా (Rekha Gupta) పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారని తెలియగానే హర్యానా బీజేపీ మాజీ అధ్యక్షులు ఓంప్రకాష్ ధన్కర్ (Om Prakash Dhankar) ఆమెకు 501 రూపాయలు ఇచ్చారు. దీనిని చూసినవారంతా ఆనందంతో ఆశ్చర్యపోయారు.హర్యానాలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఓం ప్రకాష్ 501 రూపాయలను.. రేఖా గుప్తా ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు ఇచ్చారు. ఓంప్రకాష్ ధన్కర్ ఢిల్లీ సీఎం (Delhi CM) ఎంపికలో పర్యవేక్షకునిగా వ్యవహరించారు. రేఖా గుప్తాకు రూ. 501 ఇచ్చిన తరువాత ఓంప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ రేఖా మా హర్యానా (Haryana) ఆడపడుచు అని అన్నారు. 1974లో జన్మించిన రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. ఆమె గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి పోటీ చేసినప్పుడు ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తరువాత రేఖాగుప్తా ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేఖా గుప్తా తన ప్రత్యర్థి వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38,605 ఓట్లు వచ్చాయి. రేఖా గుప్తాకు 68,200 ఓట్లు దక్కాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
ఇవాళ ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500 బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.2. యమునా నది శుద్ధిబీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.3. పథకాలకు నిధులుఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తిగత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?
న్యూఢిల్లీ: రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆమె హర్యానాలోని జింద్లోగల నంద్‌గర్ గ్రామానికి చెందినవారు. రేఖా గుప్తాకు ముందు ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సుష్మా స్వరాజ్, కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే కావడం విశేషం. ఈ ముగ్గురికీ హర్యానాతో ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రేఖా గుప్తా(Rekha Gupta) తాత మణిరామ్ కుటుంబం నందఘర్లో ఉండేది. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రేఖా గుప్తా కంటే ముందు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా హర్యానాతో సంబంధం కలిగివున్నారు.రేఖా గుప్తారేఖ గుప్తా 1974, జూలై 19న జన్మించారు. రేఖ తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రేఖ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత ఆమె ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38605 ఓట్లు రాగా, రేఖా గుప్తాకు 68200 ఓట్లు వచ్చాయి.అరవింద్ కేజ్రీవాల్అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) 1968లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. 1991లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కేజ్రీవాల్ తొలుత ఢిల్లీలోని ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆయన 2006 లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అరుణా రాయ్ వంటి ఇతర సహోద్యోగులతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం ప్రచారాన్ని ప్రారంభించారు.సుష్మా స్వరాజ్సుష్మా స్వరాజ్(Sushma Swaraj) 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్డీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. సుష్మా 1975 జూలై 13న భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారిలో సుష్మా రెండవ వ్యక్తి. ఆమె 57 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే.. -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..
Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. #WATCH | BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lt Governor VK Saxena administers her oath of office. With this, Delhi gets its fourth woman CM, after BJP's Sushma Swaraj, Congress' Sheila Dikshit, and AAP's Atishi. pic.twitter.com/bU69pyvD7Y— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ ఇంద్రజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | BJP's Parvesh Sahib Singh takes oath as minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/0ertQiFXHO— ANI (@ANI) February 20, 2025 #WATCH | BJP's Kapil Mishra takes oath as a minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/PVDlRfsq1U— ANI (@ANI) February 20, 2025 BJP's Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh take oath as ministers in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/pzOXHgqXu1— ANI (@ANI) February 20, 2025 👉ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. #WATCH | Along with Delhi's new cabinet, led by CM Rekha Gupta, Prime Minister Narendra Modi greets the crowd at Ramlila Maidan. pic.twitter.com/jiy2AbWjUd— ANI (@ANI) February 20, 2025 👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుఢిల్లీలో కీలక పరిణామం..యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వంయమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 👉రామ్‌లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. #WATCH | Delhi CM-designate Rekha Gupta and BJP leader Parvesh Sahib Singh greet each other at Ramlila Maidan in Delhi. Parvesh Sahib Singh will also take oath today as part of her council of ministers. pic.twitter.com/k41QI69r4n— ANI (@ANI) February 20, 2025👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు. స్పీకర్ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్.. విజేందర్ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్ నేతలపై కామెంట్స్ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 2025 👉రామ్‌లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. #WATCH | Delhi swearing-in ceremony | BJP Mahila Morcha workers rejoice at Ramlila Maidan ahead of the swearing-in ceremony of CM-designate Rekha Gupta. pic.twitter.com/Hr8gMubHzo— ANI (@ANI) February 20, 2025 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.#WATCH | Delhi CM designate Rekha Gupta says, "It is a miracle, it is a new motivation and a new chapter. If I can be the CM, this means ways are open for all the women... Anyone who has been corrupt will have to give an account of each and every rupee..." pic.twitter.com/F1GUVRELVp— ANI (@ANI) February 20, 2025 #WATCH | Swearing-in ceremony of Delhi CM-designate Rekha Gupta and her council of ministers to take place at Ramlila Maidan today. Visuals from the venue. pic.twitter.com/d6acoUYOSr— ANI (@ANI) February 20, 2025మోదీకి థ్యాంక్స్: రేఖా గుప్తా భర్త👉రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's husband, Manish Gupta says, "...We never thought that she (Rekha Gupta) would become the Chief Minister of Delhi. It seems like a miracle... It is a matter of happiness for us that the party has given us so much respect..." pic.twitter.com/I7rX6X9PaW— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్ వర్మ, అశిశ్ సూద్, మన్జిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్‌సింగ్ ఉన్నారు. Delhi swearing-in ceremony | Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa, Ravinder Indraj Singh, Kapil Mishra and Pankaj Kumar Singh to take oath as Ministers today. pic.twitter.com/1Gbvkq9xK7— ANI (@ANI) February 20, 2025👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.#WATCH | NSG (National Security Guard) commandos, Delhi Police personnel and RAF (Rapid Action Force) personnel deployed on security at Ramlila Maidan. Delhi CM-designate Rekha Gupta and her new cabinet ministers will take oath here today. pic.twitter.com/9WMgoncQtb— ANI (@ANI) February 20, 2025రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.మోదీకి కృతజ్ఞతలు👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. -
Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్‌కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత ప్రవేశ్ వర్మ హర్షం వ్యక్తి చేశారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
నేడే ఢిల్లీ సీఎం పట్టాభిషేకం
-
Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ టిక్కెట్‌పై పోటీచేసి, గెలుపొందిన రేఖా గుప్తా(Rekha Gupta) ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఆమె పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ప్రకటించగానే హర్యానాలోని జింద్‌లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జింద్‌లోని జులానా ప్రాంతంలోని నంద్‌గఢ్ రేఖా గుప్తా పూర్వీకుల గ్రామం. హర్యానాలోని ఆల్ ఇండియా అగర్వాల్ సమాజ్(All India Agarwal Samaj) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికవడం అగర్వాల్ సమాజానికి, జింద్‌కు గర్వకారణమని అన్నారు. కృషి, దృఢ సంకల్పం, సామాజిక సేవా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రేఖ గుప్తా నిరూపించారని గోయల్ పేర్కొన్నారు.రేఖా గుప్తా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఆమె ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్వీకుల గ్రామం కూడా హర్యానాలోనే ఉండటం, ఆయన కూడా అగర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన గతంలో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుటుంబాన్ని కూడా ఆయన ఢిల్లీకి తీసుకువచ్చారు. దీంతో రేఖా గుప్తా పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బీని ఢిల్లీలోనే పూర్తిచేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖాగుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత వందన కుమారిని ఓడించారు.ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: పదకొండు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశమిస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టం కడుతూ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశి (ఆప్) తర్వాత ఆమె ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం కానున్నారు. మదన్‌లాల్ ఖురానా, సుష్మ, సాహెబ్‌సింగ్ వర్మ తర్వాత రాష్ట్రానికి మొత్తమ్మీద నాలుగో బీజేపీ సీఎం కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగానూ రేఖ నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎం అవుతారు. గురువారం సాయంత్రం రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగే బహిరంగ సభలో రేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేఖకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆమె నాయకత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లూ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. తాజా మాజీ సీఎం ఆతిశితో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రేఖకు అభినందనలు తెలిపారు.పర్వేశ్ అనుకున్నా...ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఆప్ పదేళ్ల పాలనకు తెర దించడం తెలిసిందే. రాష్ట్రంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టబోతోంది. మాజీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మకు సీఎంగా చాన్స్ దక్కుతుందని తొలుత భావించారు. కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో ఆయన పేరు మార్మోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతుండటంతో రేఖ పేరు ప్రముఖంగా విన్పించింది. చివరికదే నిజమైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. రేఖను శాసనసభా పక్ష నేతగా పర్వేశ్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్పీ భేటీకి పరిశీలకులుగా వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రవిశంకర్ ప్రసాద్ తదితరులతో కలిసి రేఖ రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు.‘‘నాకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్ర నేతలకు కృతజ్ఞతలు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా. నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తా’’– రేఖా గుప్తా..అలా కలిసొచ్చింది! రేఖా గుప్తాను వరించిన అదృష్టంకలిసొచ్చిన బనియా సామాజికవర్గంఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు వైశ్య (బనియా) సామాజికవర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ది కూడా బనియా సామాజికవర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఆతిశి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనక ఈ రెండు అంశాలనూ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కన్పిస్తోంది. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది.మహిళల్లో మరింత ఆదరణ కోసం...ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు.ఆరెస్సెస్‌తో బంధం50 ఏళ్ల రేఖ వివాదాలకు సుదూరం. ఆర్ఎస్ఎస్తో ఆమెది సుదీర్ఘ అనుబంధం. 1974 జూలై 19న హరియా ణాలో జన్మించారు. ఢిల్లీలోని దౌలత్‌రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత న్యాయ విద్య అభ్యసించి కొంతకాలం అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. 2002లో బీజేపీలో చేరి యువజన విభాగం జాతీయ కార్యదర్శి సహా పలు హోదాల్లో పని చేశారు. మూడుసార్లు ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) మేయర్‌గా సేవలందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు. బాలికల విద్య కోసం సుమేధ యోజన ప్రారంభించారు. 2022లో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడారు. ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్ నుంచి 29,595 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థిపై గెలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బొగ్గు గౌను.. మైనం చీర..ఫ్యాషన్ డిజైనర్ సృజన
కాలానుగుణంగా దుస్తులను రూపొందించి, విభిన్న మోడల్స్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్ డిజైనర్లను ఎంతో మందిని చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీ జిల్లా వాసి ఫ్యాషన్ డిజైనర్ గుప్తా పరిచయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ట్‌ను సైన్స్‌ను కలగలిపి వినూత్న డిజైన్లు రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడుసార్లు గుర్తింపు తెచ్చుకుంది. టిష్యూ పేపర్‌తో చేసిన గౌను, మైనంతో చేసిన డ్రెస్, ఫెవికాల్తో చేసిన తెల్లటి దుస్తులు, బొగ్గు, తారుతో చేసిన గౌన్లు్ల, స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన లెహెంగా, వైట్ సిమెంట్‌తో చేసిన డ్రెస్, లిక్విడ్ సోప్‌తో చేసిన చీర.. ఇలా ఆమె రూపొందించిన వినూత్నమైన ఏడురకాల దుస్తులకు ఏడు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రాఖీ డ్రెస్ డిజైన్స్‌లో చేస్తున్న ఆసక్తికర ప్రయోగాలు తెలుసుకున్నా కొద్దీ ఆసక్తికరంగా ఉంటాయి. మోడల్ దుస్తులతో సైన్స్ ప్రాజెక్ట్ రాఖీ గుప్తా కుటుంబంలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. రాఖీ కూడా డాక్టర్ అవుతుంది అని అనుకున్నారు ఆమె తల్లీ తండ్రి. కానీ, చిన్ననాటి నుంచి రాఖీ ప్రవర్తన వేరుగా ఉండేది. తినడానికి ప్లేట్లో రొట్టెలను పెడితే, వాటిని అందంగా అలంకరించేది. స్కూల్లో టీచర్ సైన్స్ ప్రాజెక్ట్ చేయమంటే వార్తాపత్రికల కటింగ్‌తో డ్రెస్ డిజైన్స్ చేసి, పుస్తకంలో అతికించేది. ‘రెడ్ కార్పెట్‌పై నడిచే మోడల్స్ ధరించే దుస్తులంటే నాకు చాలా ఇష్టం. నా మనసు ఆసుపత్రిలో కాకుండా దేవకన్యలు, యువరాణుల దుస్తులలో చిక్కుకుంది. దీంతో నేను ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఎంచుకున్నాను’ అంటుంది రాఖీ. సరైన దారి.. 2009లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. ఆ కోర్సు సమయంలోనే ఫ్యాషన్ షోలు చేశాను. అక్కడ నా డిజైన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం నాన్న చనిపోయారు. సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. డిజైనింగ్ నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. రంగుల ప్రపంచంపై నాకున్న ఇష్టాన్ని పదే పదే చెప్పేది. దీంతో తిరిగి డిజైనింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిజైనింగ్‌లో ఏదో కొత్త పని చేస్తూనే ఉన్నాను. సైన్స్, కళల కలయికకు గుర్తింపు ఫ్యాషన్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇందులో డిజైనర్లందరూ తమ సృజనను చూపుతూనే ఉంటారు. నేను సంప్రదాయ దుస్తులను ముఖ్యంగా పెళ్లి డ్రెస్సులను డిజైన్ చేసేదాన్ని. ఫ్యాషన్ అనేది కేవలం బట్టలకే పరిమితం కాదని, ఏదో కొత్తదనాన్ని చూపాలనుకున్నాను. అప్పుడే సైన్స్ ద్వారా ఏదైనా సృష్టించాలనుకున్నాను. ఆ తర్వాత నా ఆలోచనలపై పరిశోధన చేస్తూనే ఉన్నాను. ప్రజలు ఊహించని విధంగా మైనం, బొగ్గు బేస్ చేసుకొని రెండు డ్రెస్సులను తయారు చేశాను. ఆ రెండింటికీ లిమ్కాబుక్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఎంతో మంది చేత ప్రశంసలు, గౌరవం దక్కాయి. డిజైనింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఇతర వస్తువులనూ ఉపయోగిస్తూ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం, వాటితో డ్రెస్సులను రూపొందించడం నా హాబీ. దీంట్లో భాగంగానే వైట్ సిమెంట్, ఫెవికాల్, సోప్ లిక్విడ్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ చీరలు, డ్రెస్సులు రూపొందించాను. ఏడురకాల ఈ దుస్తులకు ఏడుసార్లు లిమ్కా బుక్రికార్డులో చోటు దక్కించుకున్నాను’’ అని వివరించారు రాఖీ గుప్తా. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, సైన్స్‌ను కళను కలిపి తయారుచేసే డిజైన్లతో రికార్డులు సాధిస్తూ తీరిక లేకుండా ఉండే రాఖీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటుంది. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళుతుంది. వృద్ధాశ్రమంలోని బామ్మలకు నచ్చిన చీరలు ఇచ్చి వస్తుంటుంది. పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుంది. బహుమతులు, భోజనం అందిస్తుంది. వినూత్నంగా ఆలోచించమని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఆమె చేస్తున్న కృషికి గాను మహిళా సాధికారత అవార్డు, విశిష్ట పౌర పురస్కారం లభించాయి. -
మార్కులు ఇవ్వలేదని.. టీచర్ పై ఇంకు దాడి
కట్ని: పరీక్షల్లో మంచి మార్కులు వేయలేదని టీచర్ పై కోపం పెంచుకున్న ముగ్గురు అమ్మాయిలు ఆమె ముఖంపై నల్ల ఇంకును చల్లిన ఘటన మధ్యప్రదేశ్ లోని కట్నిలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పూర్ణిమ ప్యాసి (18), శివాని ప్యాసి (18), పల్లవి అగర్వాల్ (18) ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో సీనియర్ ఇంటర్ (12వ తరగతి) చదువుతున్నారు. ఫిజిక్స్ సబ్జక్ట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా వాటిలో ముగ్గురికి తక్కవ మార్కులు వచ్చాయి. అవమానంగా భావించిన ముగ్గురు మార్కులు తక్కువగా వేసిన టీచర్ పై కోపం పెంచుకున్నారు. మంగళవారం ఫిజిక్స్ లెక్చరర్ రేఖా గుప్తా (35) తరగతి గదికి రావడంతోనే ఆమె ముఖంపై నల్ల ఇంకు చల్లి అవమానించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.