
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.
ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రేఖ గుప్తా నికర ఆస్తుల విలువ
రేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.

రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి?
హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.

విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్‌లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment