Chief Minister
-
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం గురుగ్రామ్‌లోని తన నివాసంలో మరణించారు.దేశానికి 6వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో చౌతాలాలో జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చివరి పదవీకాలం 1999 నుండి 2005 వరకు కొనసాగింది.ఆరురోజుల సీఎంఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.టీచర్ల నియామకాల్లో అవినీతి.. పదేళ్లు జైలు శిక్షహర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలు సంపాదించుకున్న ఓం ప్రకాష్ చౌతాలా రిక్రూట్మెంట్ స్కామ్‌తో సహా పలు కేసుల్లో జైలు జీవితాన్ని గడిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.అయితే కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. इंडियन नैशनल लोकदल के प्रमुख चौधरी #OmPrakashChautala का निधन।pic.twitter.com/5rXmDjJaSR— कटाक्ष (@Kataksh__) December 20, 2024అక్రమ ఆస్తుల కేసులోఅక్రమ ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది.హర్యానా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది.పదో తరగతి ఫెయిల్చౌతాలా పదో తరగతిలో ఇంగ్లీష్ సబ్జెట్లో ఫెయిలయ్యారు. దీంతో చదువుకు పులిస్టాప్ పెట్టారు. అయితే లేటు వయస్సులో పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. 2021లో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. విచిత్రం ఏంటంటే? చౌతాలా అక్రమాస్తుల కేసులో తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. ఆ సమయంలో పదోతరగతి పాస్ అవ్వకుండానే కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన పదో తరగతి ఇంగీష్ పరీక్ష రాశారు. విడుదలైన ఫలితాల్లో 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు.తీహార్ జైల్లో.. ఫస్ట్ క్లాస్‌లో ఇంటర్ పాస్సుప్రీం కోర్టు తీర్పుతో తీహార్ జైలులో శిక్ష అనుభవించే చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 82 ఏళ్ల వయసులో చౌతాలా ఇంటర్ చదివారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఇంటర్లో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. -
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
సాక్షి,బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ (సోమనహళ్లి మల్లయ్య కృష్ణ) (92) ఏళ్ల వయసులో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు ఉదయం 2.30 -2.45 గంటల సమయంలో తన నివాసంలో మరణించారు. ఎస్ఎం కృష్ణ అక్టోబర్ 11,1999 నుండి మే 28,2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 1993 నుండి 1994 డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. 2009-2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అయితే, కాంగ్రెస్‌తో దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలికారు. 2017 మార్చిలో బీజేపీలో చేరారు. పద్మవిభూషణ్ అవార్డ్తోప్రజా వ్యవహారాల (Public Affairs) రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డ్‌తో సత్కరించింది.సిలికాన్ సిటీ కేరాఫ్ ఎస్ఎం కృష్ణకర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఎస్ఎం కృష్ణ తన పదవీ కాలంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్లే బెంగళూరు సిలికాన్ వ్యాలీగా అవతరించిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జాన్ కెన్నెడీ తరుఫున కృష్ణ ఎన్నికల ప్రచారం ఎస్ఎం కృష్ణ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ (డల్లాస్), జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 1960లో మాజీ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తరుఫున ప్రచారం చేశారు. నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తన తరుఫున ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ 28 కృష్ణకు లేఖ రాశారు. దీంతో ఆయన జాన్ కెన్నెడీ మద్దుతగా ప్రచారంలో పాల్గొన్నారు. 1961లో కెన్నెడీ 35వ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కృష్ణ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. 1962లో కృష్ణ.. మద్దూరు నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 👉చదవండి : నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు! -
అమృత ఫడ్నవీస్ : ఆయనతో పెళ్లంటే మొదట్లో భయపడింది, కానీ
తెలుగు పంచాంగం ప్రకారం రోజులో కొంత సమయాన్ని ‘అమృత ఘడియలు’ అంటారు.కొందరికి మాత్రం ఆత్మీయులు దగ్గర ఉంటే ఎప్పుడూ అమృత ఘడియలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు అమృత భార్య మాత్రమే కాదు... ఆత్మీయ నేస్తం. ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగానే కాదు...‘మల్టీ టాలెంటెడ్ స్టార్’గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అమృత ఫడ్నవీస్... ‘మీరు ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలుసు’ అంటారు సన్నిహితులు దేవేంద్ర ఫడ్నవీస్‌తో సరదాగా. ఆ రహస్యంలో ‘అమృత’ పేరు దాగి ఉంది. దేవేంద్ర భార్య అయిన అమృత మల్టీటాలెంట్కు మారుపేరు. నిత్య ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్. ఫైనాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్పోర్ట్స్... పలు రంగాల్లో ప్రతిభ చాటుకున్న అమృత ఫడ్నవీస్ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.నాగ్‌పూర్‌కు చెందిన అమృత డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. పుణేలో ఎంబీఏ చేసింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అమృతకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. తన గానంతో శ్రోతల ప్రశంసలు అందుకునేది. ప్రకాష్ ఝా సినిమా ‘జై గంగా జల్’లో ఒక పాట కూడా పాడింది. సామాజిక సందేశంతో కూడిన పాటలను రూపొందించడంలో ముందు ఉండే అమృత నది కాలుష్యం నుంచి గృహహింస వరకు ఎన్నో అంశాలపై పాటలు ఆలపించింది. స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాటలు రూపొందించింది. ఆపదలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాల పిల్లల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.అమృత ప్రతిభలో పాటే కాదు ఆట కూడా ఉంది. స్టేట్–లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా అండర్–16 టోర్నమెంట్స్‌లో ఆడింది. ‘సోషల్ మీడియా స్టార్’గా కూడా బాగా పాపులర్ అయిన అమృతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆమె ఇన్స్పైరింగ్ పోస్ట్‌లకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కెరీర్, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న అమృత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అక్షరాలా ఆత్మీయ బలం.పెళ్లికి మొదట్లో భయపడింది!దేవేంద్ర–అమృత వివాహం ప్రేమ వివాహం అనుకుంటారు చాలా మంది. కాని వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమృత తండ్రి శరద్ రానడే, తల్లి చారులత... ఇద్దరూ వైద్యులే. అయితే తమలాగే కూతురు కూడా డాక్టర్ కావాలని వారు అనుకోలేదు. కుమార్తెకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే... పెళ్లికి ముందు దేవేంద్ర, అమృత ఒకరికొకరు అపరిచితులు. వీరిని ఒక కామన్ ఫ్రెండ్ శైలేష్ జోగ్లేక్ ఇంట్లో పెళ్లి కోసం తీసుకువచ్చారు పెద్దలు. అప్పటికే దేవేంద్ర శాసనసభ్యుడు అయ్యాడు.‘రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవడం గురించి మొదట్లో భయపడ్డాను. అయితే ఆయన నిరాడంబర వ్యక్తిత్వంతో నాలో భయం ఎగిరిపోయింది. నా అభిప్రాయం మారిపోయింది’ అని భర్త దేవేంద్ర గురించి చెబుతుంది అమృత.చాలామంది రాజకీయనాయకులలాగే దేవేంద్ర కూడా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన సరదాగా ఉండేలా, అదేపనిగా నవ్వేలా చేయడం అంటే ఆషామాషీ కాదు. అయిననూ... శ్రీమతి అమృత భర్త దేవేంద్రను నవ్విస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పెదాలపై కనిపించే నవ్వు... అమృత సంతకం! -
మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
షిండేజీ ఇలా ప్రమాణం చేయకూడదు.. అసలు ఏం జరిగిందంటే..?
ముంబై : మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, డిప్యూటీ సీఎంగా చేసిన ఏక్నాథ్ షిండే ప్రమాణం స్వీకారం చేసిన తీరుపై వేదికపై ఉన్న ప్రముఖుల ముఖాలు ఎర్రబారాయి. వెంటనే పక్కనే ఉన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ‘షిండేజీ మీరు ఇలా ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పడంతో.. మరోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024అసలు ఏమైందంటే?దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం అనంతరం ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వద్దకు వెళ్లారు. గవర్నర్ అను నేను.. ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో మాతృభాషలో ఏక్నాథ్ షిండే అనే నేను .. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. అంటూ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా చేయలేదు. బదులుగా ఏక్నాద్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను హిందూ హృదయ సామ్రాట్ అని ప్రస్తావించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి, మహరాష్ట్ర ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. వెంటనే గవర్నర్ అప్రమత్తమయ్యారు. ప్రమాణ స్వీకారం రాజ్యాంగం ప్రకారం చేయాలంటూ ఏక్ నాథ్ షిండేను ఆపారు. దీంతో తాను ముందుగా సిద్ధం చేసుకున్న ప్రమాణ స్వీకార స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి గవర్నర్ చెప్పినట్లుగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. -
చేజారిన సీఎం పదవి.. స్పందించిన ఏక్నాథ్ షిండే
ముంబై : ముఖ్యమంత్రి పదవి చేజారడంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే స్పందించారు. మహాయుతి కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు అని వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తో పాటు శివసేన నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతృత్వంలోని అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.ఈ తరుణంలో మహరాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు బుధవారం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యచరణను పూర్తి చేశారు. షిండేకి నా కృతజ్ఞతలుఅనంతరం,ఏక్నాథ్ షిండే,దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేకి నా కృతజ్ఞతలు. మంగళవారం షిండేతో భేటీ అయ్యాను. ఈ భేటీలో మంత్రి వర్గంలో కొనసాగాలని కోరా. దానికి ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టినా.. నిర్ణయాలు కలిసే తీసుకుంటాం’ అని అన్నారు. ఎవరూ ఎక్కువా కాదు.. తక్కువా కాదు‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేను సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. గత 2.5 ఏళ్లలో మహాయుతి కూటమి నేతృత్వంలోని మేం ముగ్గురం, మా బృందం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన కృషి అమోఘం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మేం తీసుకున్న నిర్ణయాలపై మేం సంతోషంగా ఉన్నామని తెలిపారు. బాంబు పేల్చిన షిండేరేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.చమత్కరించిన అజిత్ పవార్షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. -
రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం.. పేరు మార్చుకున్న దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ అధికారికంగా తన పేరును మార్చుకున్నారు.మహరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. దీంతో ఫడ్నవీస్ రేపు (డిసెంబర్5న) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం కొనసాగుతున్నాయి.ఈ ప్రమాణ స్వీకారంలో ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ ఇన్విటేషన్లను సిద్ధం చేశారు. ఆ ఇన్విటేషన్లలో దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ బదులు ‘దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్’పేరుతో ఇన్విటేషన్లు పంపిస్తున్నారు.దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సైతం దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ పేరుతో సిద్ధం చేస్తున్నారు.అఫిడవిట్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ పేరుతో అఫిడవిట్లను సమర్పించారు.2014,2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫడ్నవీస్ తన తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఈ సారి అనూహ్యంగా తల్లి,తండ్రి పేరు కలిసేలా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.యుక్త వయస్సులో తండ్రి దూరమై.. ఫడ్నవీస్ తల్లిపేరు సరితా ఫడ్నవీస్,తండ్రి గంగాధర్ ఫడ్నవీస్. బీజేపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఫడ్నవీస్ యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ క్యాన్సర్ కారణంగా మరణించారు. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ బ్యాంకర్,సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఫడ్నవీస్ దంపతులకు కుమార్తె దివిజ ఉన్నారు. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
కార్పొరేటర్ టు సీఎం..రాజకీయ వ్యూహాల్లో దిట్ట ఫడ్నవీస్
ముంబయి: మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(54) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు. ఫడ్నవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రిపేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్‌లో, ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో గంగాధర్ ఫడ్నవీస్ పనిచేశారు. కార్పొరేటర్ టు మూడుసార్లు సీఎంవిధేయతకు ఫడ్నవీస్ మారుపేరు. వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరమనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి గురువారం (డిసెంబర్ 5)న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. విద్యార్థి నేతగా చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్‌పుర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఎన్నియ్యారు.1997లో నాగ్‌పూర్ అక్కడి మేయర్ పదవిని చేపట్టేప్పుడు ఆయన వయసు 27 ఏళ్లంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిచిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండోవ్యక్తి ఆయన.మోదీ,అమిత్‌షాలకు వీర విధేయుడు తొలిసారి 1999లో నాగ్‌పుర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికలతో కలిపి ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.2014లో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు. అయిదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శరద్‌పవార్ తర్వాత అతి చిన్న వయసులో (44ఏళ్లకే) మహారాష్ట్ర సీఎం అయిన రికార్డు ఫడ్నవీస్ సొంతం. 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన(ఉద్ధవ్) పార్టీ హ్యాండివ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ -
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్షం బుధవారం ముంబైలో సమావేశమై ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన్ను కోరారు. బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వారికి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను ప్రతిపాదిస్తున్నా: షిండేఅనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలో షిండే, అజిత్ సహా మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైనట్లు లేఖ అందజేశారు. కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహా్వనించారు. గురువారం సాయంత్ర 5.30కు ఆజాద్ మైదాన్‌లో కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు’’ అని తెలిపాయి. అనంతరం షిండే, అజిత్‌లతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసుంటే క్షేమంగా ఉంటాం. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే. మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. షిండే, అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాం’’ అన్నారు. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండున్నరేళ్లపాటు సీఎంగా చేశానని, అందుకు సంతృప్తిగా ఉన్నానని షిండే పేర్కొన్నారు. ‘‘నాడు నన్ను సీఎం పదవికి ఫడ్నవీస్ ప్రతిపాదించారు. నేడు ఆయనను ఆ పదవికి నేను ప్రతిపాదిస్తున్నా. మేమంతా బృందంగా కలిసికట్టుగా పని చేస్తాం’’ అన్నారు.పరస్పర ఛలోక్తులు మీడియా భేటీలో మహాయుతి నేతలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా సాయంత్రం దాకా వేచి చూడండని షిండే బదులిచ్చారు. అజిత్ కల్పించుకుని తాను మాత్రం కచ్చితంగా ప్రమా ణం చేస్తానని అనడంతో గొల్లుమన్నారు. ‘‘అవునవును. ప్రమాణ స్వీకారాల్లో దాదా (అజిత్)కు చాలా అనుభవముంది. ఉదయం, సాయంత్రం ప్ర మాణం చేసిన అనుభవముంది’’ అనడంతో మరో సారి నవ్వు లు విరిశాయి. 2019లో అజిత్ తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. పదవి తీసుకోండి షిండేపై సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటూ షిండేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. బుధవారం షిండేతో భేటీలో వారు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టును షిండే తీసుకుంటే పొత్తు ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చేరితే పార్టీనీ బలోపేతం చేసుకోవచ్చన్నారు. -
మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. -
మెరుగుపడని ఆరోగ్యం.. ఆస్పత్రికి ఏక్నాథ్ షిండే
ముంబై: మహరాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. ప్రస్తుత, మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆస్పత్రి పాలయ్యారు.గతవారం అనారోగ్యం కారణంగా ఏక్నాథ్ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో షిండేని అత్యవసర చికిత్స నిమిత్తం థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు.పలు రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఏక్నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడలేదని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.కొద్ది సేపట్లో మహాయుతి కూటమి కీలక సమావేశంఓ వైపు ఏక్నాథ్ షిండే అనారోగ్య రిత్యా ఆస్పత్రిలో చేరాగా.. మరోవైపు మహాయుతి కూటమి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.వేర్వేరు నగరాల్లో మహాయుతి కీలక నేతలుమహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతుంది. మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో కీలక నేతలు వేర్వేరు నగరాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కీలక నేతలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టత ఇచ్చారు. గత వారం ఏక్నాథ్ షిండే అనారోగ్యంతో తన స్వగ్రామానికి వెళ్లారు. నాటి నుంచి మహాయుతి కూటమి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఏక్నాథ్ షిండేని పరీక్షించిన వైద్యులు వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా, మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం కుదుట పడకపోవడంతో థానేలోని జూపిటర్ ఆస్పత్రికి వెళ్లారు. 'Tabiyat agar bhadiya hai' then what exactly is Eknath Shinde doing in the hospital while Maharashtra waits for its Chief Minister?#EknathShinde #MaharashtraCM pic.twitter.com/9eZwOpqe70— Sneha Mordani (@snehamordani) December 3, 2024 -
‘మహ’ సీఎం ఎంపిక : పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు. మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి పయనమయ్యారు. కేబినెట్ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్ షెడ్యూల్ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం. Union Finance Minister @nsitharaman and Former Gujarat Chief Minister Vijay Rupani have been appointed as #BJP's Central Observers for Legislature Party meeting to elect leader in #Maharashtra. pic.twitter.com/3wb1DryKVD— All India Radio News (@airnewsalerts) December 2, 2024 -
ఆ మాత్రం అలక సీను చేయకుంటే ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని గ్యారంటీ లేదు మరి!
-
కీలక సమావేశానికి షిండే డుమ్మా.. మహాయుతిపై ఆదిత్య ఠాక్రే సెటైర్లు
ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. To not be able to decide on a chief minister, and form government, for more than a week after result day, is not just an insult to Maharashtra (for taking our state so lightly) but also to the assistance provided by their dearest Election Commission. It seems that rules only…— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2024 ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్‌కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్నాథ్ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
మంత్రి పదవులపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘన విజయంతో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు అధికార పంపిణీపై మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే సీఎం పదవిపై స్పష్టత వచి్చనట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇవ్వడంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. కీలక పోర్ట్‌ఫోలియోలపై మూడు పార్టీలూ కన్నేయడంతో నేరుగా కూర్చుని మాట్లాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ సారథులు బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్‌షాను కలిశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోనిæషా నివాసంలో చర్చలు జరిపారు. సామాజిక సమీకరణాలతోనే పోస్ట్‌లు సామాజిక సమీకరణాలను బట్టే మంత్రి పదవులను కట్టబెట్టాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీలోని ఓబీసీ లేదా మరాఠా నేతకే సీఎం పదవి కట్టబెట్టాలని చూస్తోందని తొలుత వార్తలొచ్చాయి. అన్ని పార్టీల్లో మరాఠా వర్గానికి చెందిన వాళ్లే అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆర్ఎస్ఎస్ లాబీయింగ్ బలం పనిచేస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్‌కే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని ఢిల్లీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అజిత్, షిండే డిప్యూటీ సీఎంలుగా ఉంటారని వార్తలొచ్చాయి. అయితే సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎవరేం కోరుతున్నారు? పోర్ట్‌ఫోలియోలపై ఎవరికివారు కరీ్చఫ్ వేసేస్తున్నారు. తమ పార్టీకి ఈ శాఖలే కావాలని పట్టుబడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య శాఖలు తమకు కేటాయించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు. కీలకమైన ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వర్గం డిమాండ్చేస్తోంది. అయితే మెజారిటీ సీట్లు గెలిచిన తమ వద్దే కీలకమైన శాఖలను అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ( అజిత్ పవార్) 41 చోట్ల గెలిచాయి. ఒక్కో పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యను బట్టి కేబినెట్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎంగా చేసిన షిండే ఇకపై డిప్యూటీ సీఎం పదవి చేబడితే పట్టణాభివృద్ధి శాఖతోపాటు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖనూ తన వద్ద అట్టిపెట్టుకోవాలని చూస్తున్నారు. రెవిన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, సామాజిక న్యాయ శాఖలను తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్చేస్తున్నారు. అజిత్ డిమాండ్లు ఏంటి ? డిప్యూటీ సీఎం పోస్ట్‌తోపాటు ఆర్థికశాఖ తనకే ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరుతున్నట్లు వినికిడి. అయితే కీలకమైన ఆర్థికశాఖతోపాటు ప్రణాళిక శాఖను తన వద్దే ఉంచేసుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వ్యవసాయం, ఆహార, పౌర సరఫరాలు తదితర శాఖలు తమకు కేటాయించాలని అజిత్ అడుగుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాటేంటి? కూటమిలో అత్యధిక సీట్లు గెలిచినందున కీలకమైన ఏ శాఖనూ కూటమి పార్టీలకు ఇచ్చేది లేదని బీజేపీ పట్టుదలగా ఉందని తెలుస్తోంది. హోం, గృహ, పట్టణాభివృద్ధి, ఆర్థికం, నీటిపారుదల, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి శాఖలు తమ ఆధ్వర్యంలోనే కొనసాగాలని బీజేపీ ఆశిస్తోంది. గెలిచిన ప్రతి ఆరు సీట్లకు ఒక కేబినెట్ పోస్ట్ చొప్పున మంత్రి పదవులను పంచాలన్న సూత్రాన్ని అమలుచేస్తే బీజేపీకి 21 లేదా 22, శివసేనకు 10 లేదా 12, ఎన్సీపీకి 8 లేదా 9 మంత్రి పదవులు దక్కుతాయి. -
సీఎం పదవిపై నాకు ఆశలేదు: ఏక్నాథ్ షిండే
ముంబై : మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని, బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారాయన. బుధవారం థానేలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. సీఎం పదవిపై నాకు ఆశ లేదు. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. అంతిమంగా.. మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం’’ అని అన్నారాయన.మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు నా కృతజ్ఞతలు. కూటమికి మద్దతు పలికిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. బాల్ ఠాక్రే ఆశయాలతో ముందుకెళ్తా. మహయుతి కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. నా జీవితంలో నేను సీఎం అవుతానని అనుకోలేదు. ఎన్నో ఒడిదుడుకులు చూశాను. పేదల కష్టాలు, బాధలు చూశాను. మహాయుతి కూటమిలో ఓ కార్యకర్తగా పనిచేశా. ప్రధాని మోదీ మద్దతు నాకు ఉంది అని అన్నారు.ఇక కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరు? అనేది బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని చేసినా తనకు అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి చెప్పాను. పీఎం మోదీ మాటకు కట్టుబడి ఉంటాను’ అని ఉత్కంఠకు తెర దించారు ఏక్నాథ్ షిండే.#WATCH | Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "For the past 2-4 days you must have seen rumours that someone is miffed. We are not people who get miffed...I spoke with the PM yesterday and told him that there is no obstruction from our end in… pic.twitter.com/IvFlgD5WQI— ANI (@ANI) November 27, 2024 -
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. తదుపరి మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. షిండే రాజీనామా కీలకంగా మారింది. మరోవైపు నేటితో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి.శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా మరోవైపు శాసన సభ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన 10 మంది, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)కి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుందనే అంశాలపై నేడు స్పష్టత లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం..బుధవారం కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పలు రకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ, మహాయుతి కూటమి అత్య«ధిక స్థానాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన, ముఖ్యమంత్రిగా అయిదేళ్ల అనుభవమున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవినివ్వాలని బీజేపీ నేతలు కోరుతుండగా మరోవైపు శివసేన (షిండే) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగింది. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, చూపిన ప్రభావం వల్లే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మహాయుతి కూటమి రికార్డు స్థాయి స్థానాలను కైవసం చేసుకుందని శివసేన నేతలు చెబుతున్నారు. కాగా సీఎం పదవిరేసుకు ఏక్నాథ్ షిండే పేరును పరిశీలించే పక్షంలో అజిత్ పవార్ పేరును కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్ఠానంతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు చర్చల అనంతరం స్పష్టం కానుందని చెప్పవచ్చు. కాగా ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్టయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
‘మహా’ పోరు: ఇంతకీ రెండు కూటముల ‘సీఎం’ ఎవరంటే..
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి...మరోవైపు ఎన్నికల్లో విజయంపై అటు ప్రతిపక్ష కూటమి మహ వికాస్ అఘాడీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా.. ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమే అధికారం చేపడుతుందని భావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన నేపథ్యంలో మహారాష్ట్రలోనూ సర్వేల ఫలితాలు తారుమారు అవుతాయని గట్టిగా నమ్ముతోంది. ఇక మరో 24 గంటల్లో మహారాష్ట్ర భవితవ్యం తేలనుంది. నవంబర్ 23న అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.అయితే ఫలితాల ముందే అటు మహాయూతి, ఇటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు నుంచి ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తమ పార్టీ నాయకత్వంలోనే మహారాష్టట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఓటింగ్ ట్రెండ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలను మిత్రపక్షమైన శివసేన(ఉద్దవ్) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా చర్చించ నిర్ణయం తీసుకుంటామని స్పఫ్టం చేశారు. పటోలే ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.అటు మహాయుతి కూటమిలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లు పేర్కొననారు. పోలింగ్ నాడు ఓటర్లు షిండేకు తమ ప్రాధాన్యతను చూపించారని ఆయనే మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. షిండేనే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే.. అది దేవేంద్ర ఫడ్నవీసే అని తెలిపారు.ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారీ తన పార్టీ చీ ఫ్ఉ, ప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు. ఫలితాలు ఏమైనప్పటికీ, ఎన్‌సిపి కింగ్‌మేకర్ అవుతుందని అన్నారు. మహాయుతి కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటాయని మిస్టర్ ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందది, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనేదానిపై రేపటి(శనివారం) ఫలితాల తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थीVIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం? -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా?