
లండన్‌లో కేక పుట్టించారు వైఎస్సార్‌సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్‌లోని వైఎస్సార్‌సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
లండన్‌లోని ఈస్ట్‌హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్‌గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు.
ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment