ratnakar
-
UK : లండన్‌లో YSRCP సిద్ధం
లండన్‌లో కేక పుట్టించారు వైఎస్సార్సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్‌లోని వైఎస్సార్సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లండన్‌లోని ఈస్ట్హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్‌గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: టీడీపీకి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికాలో మిస్సోరిలో కొన్ని నెలలుగా ఒక తెలుగు యువకుడిని బంధించి వేధించిన కేసు కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితులపై సత్తారు వెంకటేష్ రెడ్డి (35), శ్రావణ్ వర్మ (23), నిఖిల్ (27)పై విచారణ, చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు అక్కడి అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఇక్కడే మరోసారి టీడీపీ తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రధాన నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఖండించారు. "మన రాష్ట్రం, మనదేశం కానీ ఒక ప్రాంతంలో జరిగిన నేరాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ, ప్రభుత్వం పై టీడీపీ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టి లబ్ధిపొందాలన్న ఆలోచనతో టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని, నిందితులు ఎవరైనా సరే నేరం నిరూపణ అయిన పక్షంలో శిక్షార్హులని" ఆయన వెల్లడించారు. "టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నేరప్రవృత్తి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే నేరాలకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? టీడీపీ నేతలు మహిళలపై చేసే అఘాయిత్యాలకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత తీసుకుంటారా? అని రత్నాకర్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ సత్తారును అడ్డంపెట్టుకుని ఈ నేరాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని, తద్వారా లబ్ధిపొందాలని చూసే టీడీపీ.. ముందుగా ఏపీలో టీడీపీ నేతలు నడిపే కాల్ మనీ సెక్స్ రాకెట్లపై సమాధానం చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో జరిగే నేరాలను మాకు ముడిపెట్టడం కాదు.. ఏపీలో టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు" రత్నాకర్. "కాల్ మనీ దందాలు, సెక్స్ రాకెట్లు నడిపి వేలాది మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టిన నీచమైన చరిత్ర టీడీపీ నేతలది. వీరి సెక్స్ రాకెట్ దందా ఏపీ నుండి అమెరికా వరకు విస్తరించింది. గతంలో ఎన్నారై టీడీపీ నేతలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టీడీపీ నేరప్రవృత్తి కలిగిన పార్టీ..అందుకే ఏపీ ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అనైతిక ప్రచారం తో 2024 ఎన్నికల్లో తెదేపా తెలంగాణ లో మాదిరి గానే తుడిచి పెట్టుకు పోతుందని" పేర్కొన్నారు. ఇదే తెదేపా సంస్కారం ? మీరు చేస్తే సంసారం ... ఇంకోళ్ళు చేస్తే .....చారం .. రాష్ట్రం ఐనా , దేశం ఐనా ... విదేశం ఐనా ... చట్టానికి ఎవరు చుట్టం కాదు .. తన పని చట్టం చేసుకుంటది ..#ENDOFTDP pic.twitter.com/qqLE1LaOSM — Kadapa Rathnakar (@KadapaRathnakar) December 1, 2023 మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ NRI మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ డాక్టర్. వాసుదేవరెడ్డి స్పందించారు. 'అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీతో పాటు ప్రతి ఒక్క ఎన్నారై తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా, అది వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేయడమే టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. -
ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. సాధ్యమైనంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి విన్నవించే సాహసం చేయలేకపోతున్నా. నా విన్నపాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రిని కోరుతున్నా..’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. తాను బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు వార్తలు వస్తే మరోలా భావించరాదని విద్యుత్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జెన్కో ఆడిటో రియంలో జరిగింది. మంత్రి జగదీ శ్‌రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా మంత్రి సమక్షంలో ప్రభాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విద్యుత్ ఉద్యోగు లతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పదవీ విరమణ ఆలోచనను విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు సభా వేదికపై నుంచి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గత నెల 5న విద్యుత్ సౌధలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో సైతం ప్రభాకర్‌రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించకపోవడంతో అప్పట్లో పెద్దగా చర్చ నీయాంశం కాలేదు. ప్రభాకర్‌రావు 2014 జూన్ 5 నుంచి జెన్కో, 2014 అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలోనే ఆయన సీఎండీగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత ఆయ న్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించినా, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. చివరిసారి పొడి గింపు సమయంలో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని పేర్కొంది. సూర్యుడి మీద ఉమ్మేయడమే: మంత్రి జగదీశ్‌రెడ్డి కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్‌స్టాండర్డ్ గాళ్లు.. సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారి మీద అవాకు లు చెవాకులు పేలడం సూర్యుడి మీద ఉమ్మేయడ మే నని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆశించినదానికంటే అధిక పీఆర్సీ: ప్రభాకర్‌రావు విద్యుత్ ఉద్యోగులు ఆశించినదానికంటే అధిక పీఆర్సీ ఇచ్చామని ప్రభాకర్‌రావు చెప్పారు. వెయిటేజీ లేకుండా 10 నుంచి 15 శాతం పీఆర్సీని ఉద్యోగులు ఊహించు కుంటే, జీతాలు మాత్రం 18.5 శాతం పెరిగాయని అ న్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా, కో–చైర్మన్ శ్రీధర్, కో–కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్‌కు మరో అవకాశం
సాక్షి, అమరావతి: అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడో సారి పదవీ కాలాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మూడో సారి ఈ బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల, తన పట్ల నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పండుగాయల రత్నాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని, సీఎం జగన్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని రత్నాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చేపడుతున్న వివిధ పనులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ఎన్నారైల సభలు, సమావేశాలతో పాటు వివిధ వేదికల ద్వారా ఏపీ ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దీని వల్ల ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నారైల భాగస్వామ్యం పెంచామని రత్నాకర్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వేర్వేరు పాఠశాలల్లో ఎంతో మంది ప్రవాసాంధ్రులు తమ వంతుగా విరాళాలందించే దిశగా కృషి చేస్తున్నామని, అలాగే ఆస్పత్రుల అభివృద్ధి కోసం నిధులిచ్చేలా ప్రోత్సహించామని తెలిపారు. కరోనా విపత్కాలంలో వెంటిలేటర్లతో పాటు బెడ్స్‌ను ఏర్పాటు చేయడంలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేశామన్నారు. దీంతో పాటు పుట్టిన నేల రుణం తీర్చుకునేలా ఎన్నారైలను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ‘‘విద్యా మూలం ఇదం జగత్" అన్న నానుడిని మనసావాచ నమ్ముతున్న ముఖ్యమంత్రి.. విద్యయే ప్రభుత్వానికి ప్రధాన అంశంగా భావిస్తూ అడుగులు వేస్తున్నారని రత్నాకర్ తెలిపారు. భారత దేశ చరిత్రలోనే విద్యా వ్యవస్థ పై ఇంతలా దృష్టి సారించిన నాయకుడు మరెవ్వరూ లేరని, ఏ రాష్ట్రంలోనూ విద్య కోసం ఇన్ని పథకాలు, ఇంత ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. అన్ని సమస్యలకు చదువే సమాధానం అని సీఎం నమ్మడం ఆయనలోని ఓ కొత్తతరం నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యావ్యవస్థ బాగుచేయడంతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు రత్నాకర్. పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, 8 మేజర్ పోర్టుల నిర్మాణం, వ్యవసాయ-ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, తదితర ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వచ్చే రెండేళ్లలో గొప్పగా అభివృద్ధి చెందబోతోందని, ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని పేర్కొన్నారు. -
మరోసారి నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్ నియామకం
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(నార్త్ అమెరికా) పదవికి పండుగాయల రత్నాకర్ ను సీఎం వైయస్ జగన్ మరోసారి ఎంపిక చేశారు. 2 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ ఇప్పుడు మరో 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రత్నాకర్ పార్టీ విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా అమెరికాలో ముందుండి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 2015లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి విశేష సేవలు అందించారు. సీఎం వైయస్ జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రెండో సారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్, పార్టీలో ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని రత్నాకర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా(నార్త్ అమెరికా) తనను మరోసారి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, సీఎం జగన్ గారికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన దేశానికే ఆదర్శమని, విద్య- వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రత్నాకర్ అన్నారు. -
ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి చేసే సహాయంతో ఏపీలో మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు అని గుర్తుచేశౠరు. మరింత వేగంగా ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మీరు చేసే సహాయం మరిన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు అని రత్నాకర్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ముందుకు వస్తే ఏపీలో ఆరోగ్య సౌకర్యాల కల్పన వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి శక్తికి మించి ప్రజలకు కరోనా నుంచి సేవలు చేస్తున్నారని గుర్తుచేశారు. మనం బాధ్యతగా ఏపీవాసులకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ చెప్పారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం -
అమెరికా: మహానేతకు ఘన నివాళులు
న్యూయార్క్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా భావిస్తూ.. ఆయన స్ఫూర్తి, అలోచనలతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అన్ని విధాలుగా అవిశ్రామంగా పనిచేస్తుందని అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతిని పురష్కరించుకుని ఘన నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్‌ని తండ్రిని మించిన తనయుడుగా యావత్ భారత దేశం కొనియాడుతుందన్నారు. -
విశాఖలో ‘బోస్టన్’ కొత్త కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు లైన్ క్లియర్ కావడంతో పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల ఆగస్టు 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, బోస్టన్ గ్రూప్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఛైర్మన్ సుబ్బు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. విశాఖలో ఏర్పాటు కానున్న ఈ కొత్త కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు చేస్తుంది. వైజాగ్ వంటి టూ టైర్ నగరాల్లో గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ నిపుణుల ప్రతిభ ఆర్ధిక ప్రగతికి బాటలు వేస్తుందని సుబ్బు కోట అన్నారు. (వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విజయవాడకు చెందిన సుబ్బు.. భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తగా, ఫిలాంత్ర ఫిస్ట్గా గుర్తింపు పొందారు. అమెరికాలో నివాసముంటున్న సుబ్బు కోట గత 50 ఏళ్లలో దాదాపు 50 కంపెనీలను ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఇ-లెర్నింగ్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో విస్తృత అనుభవాన్ని గడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో తమ సంబంధాలు బలోపేతం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో విశాఖ దేశంలోనే అతిముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమని, ఆర్థిక కేంద్రంగా ఎదిగేందుకు విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి సహకారాలు ఎంతో అవసరమన్నారు. పీపుల్ ప్రైమ్ వరల్డ్‌వైడ్ (ది బోస్టన్ గ్రూప్ అనుబంధ సంస్థ) సీఈవో రవి అలెటి మాట్లాడుతూ “కనెక్టివిటీ, కాస్మోపాలిటన్ పాపులేషన్, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీలతో విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్ లో ప్రపంచ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. విశాఖలోని సెజ్ జోన్లలో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తామని రవి తెలిపారు. విశాఖను ఐటీ హబ్ గా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేదుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని, ప్రతిభావంతులైన నిపుణులు, ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు విశాఖ నెలవు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన విధానాన్ని తెచ్చారన్నారు . బోస్టన్ గ్రూప్ గురించి.. 1988 లో ది బోస్టన్ గ్రూప్ స్థాపించబడింది. ఫార్చ్యూన్ 500, మిడ్-మార్కెట్ క్లయింట్లకు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ మరియు ఐటి సేవలను అందించే ప్రధాన వ్యాపారంతో ఈ సంస్థ ప్రారంభమైంది. నాటి నుండి, టిబిజి తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఐటి ఔట్ సోర్సింగ్, ఇ-లెర్నింగ్, ఇ- గవర్నెన్స్ తదితర సేవలను అందిస్తోంది. మొత్తం ఐదు దేశాలలో టీబీజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫార్మా, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వస్తు తయారీ, బ్యాంకింగ్, రిటైల్ వంటి అనేక రకాల పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. -
చంద్రబాబు సమావేశాలు అర్థరహితంగా సాగుతున్నాయి: రత్నాకర్
-
మీ వాళ్లకు ఇక్కడ భయం లేదు
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పెద్దన్న అమెరికాను కూడా గడగడలాడిస్తుంది. రోజు రోజుకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా సోకి మరణించిన వారి సంఖ్యలో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికాలో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి రత్నకర్ ఆర్ పాండుగయాలా ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో ఏప్రియల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుంది. అదే విధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 2.5 లక్షల వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటిని సోదా చేస్తూ ఏ కొంచెం కరోనా లక్షణాలు ఉన్నా వారికి వెంటనే వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చరిత్రలో చూసి ఉండరు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... ‘నార్త్ అమెరికాలో ఉంటున్న తెలుగువారందరికి మీ కుటుంబం పట్ల మీరు భయపడాల్సిన పని లేదని నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల శ్రద్దతో కరోనా వైరస్వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీరు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండండి. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన మార్గదర్శకాలు పాటించి కరోనా వైరస్ విస్తరించకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించండి. ఎప్పటిప్పుడు చేతులను శానిటైజర్‌తో కడుక్కోండి. మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చూపించుకోండి. సామాజిక దూరాన్నిపాటించి ప్రభుత్వాలకు సహాకరించండి. మనం కలిసికట్టుగా పోరాడితే ఈ కష్టకాలం నుంచి బయటపడవచ్చు’ అని పేర్కొన్నారు. -
‘పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిలో మన పాత్ర పోషిద్దాం’
ఓహియో(అమెరికా): ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెస్తోన్న అద్భుతమైన మార్పులు విద్యార్థులకు ఎంతో మేలు చేయనున్నాయని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తెలిపారు. ఆ యజ్ఞంలో తమ వంతు పాత్రగా ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషిస్తే.. మెరుగైన ప్రణాళికలో భాగస్వామ్యులు అవ్వాలని కోరారు. ‘విద్యామూలం ఇదం జగత్’, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న రెండు కార్యక్రమాలను తక్షణ కర్తవ్యంగా ఎంచుకున్నామని రత్నాకర్ వెల్లడించారు. అభిమాన మిత్రుడికి ఆత్మీయ సత్కారం అమెరికాలోని గ్రేటర్ క్లీవ్ లాండ్ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా పండుగాయల రత్నాకర్‌ను సత్కరించింది. ఓహియో క్లీన్ లాండ్లో సబర్బన్ ప్రాంతమైన మిడిల్ బర్గ్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల కోసం రత్నాకర్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తిందన్నారు. అమెరికా, కెనడా దేశాలలో ప్రవాసాంధ్రులకు ఏ ఇబ్బంది ఉన్నా.. నేనున్నానంటూ ముందుకొచ్చే రత్నాకర్.. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార రంగంలోకి వచ్చిన ఎంతో మందికి తనవంతు సహకారం అందించారని చెప్పారు. భవిష్యత్తులో రత్నాకర్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రవాసాంధ్రులకు చేరువవుతారని నార్త్ ఈస్ట్ ఒహాయో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీకృష్ణ ప్రసాద్ మువ్వ, ఉపాధ్యక్షులు శివ భీమవరపు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ తెలుగు అసొసియేషన్ ట్రస్టీ గిరిరాజు అయ్యగారి, సంస్థ ఫౌండర్ డా.సీతారామరెడ్డి తొండపు, డా.లక్కిరెడ్డి మురళి, డా. ఛార్లెస్ తోడెటి, రాజశేఖర్ కల్లం, హరినాథ్ బత్తిని, సూర్య బుద్ధవరపు, యోగశ్వరరెడ్డి, కిషోర్ కుమార్, అర్జున్, పవన్ కుమార్, శశిధర్, రమేష్ పసుమర్తి పాల్గొన్నారు. అలాగే క్లీవ్ లాండ్లో వైఎస్సార్సీపీ సభ్యులు రవి పచిపాల, సలీం షేక్, వెంకట్ మట్ట, రామ్ మేడపాటి, రవి నూక, నరేష్ బొద్దు, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్‌పై ఈ కపటత్వం ఎందుకు?
సమాజంలో పేదలు, అట్టడుగు వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వారు ప్రాథమిక చదువుల కోసం ఆధారపడే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలంటూ, విద్యా మూలమిదమ్ జగత్ అనే నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోగానే కొన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. హఠాత్తుగా వారికి తెలుగు భాష గుర్తుకొచ్చింది. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ తెలుగు మీడియంలో చదివించని వీరంతా తెలుగు భాష గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతున్నారు. కడపలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడలేక, పూర్తి స్థాయి ప్రావీణ్యత లేక ఎన్నో అవకాశాలు కోల్పోయా. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చినా.. భాష పూర్తిగా రాకపోవడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సాఫ్ట్వేర్ నిపుణుడిగా అమెరికా వచ్చిన నాకు ఇంగ్లిష్ భాషలో పట్టు లేకపోవడం వల్ల మొదట్లో నా కెరియర్‌కు ఎంతో నష్టం జరిగింది. ఇంగ్లిష్ భాష గురించి నిజాయితీగా కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. మన మనస్సాక్షిని ప్రశ్నిం చుకుంటే నిజాలు బయటపడతాయని ఆశి స్తున్నా. 1. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ ముఖ్యమైన పని చేయాలన్నా, బిజినెస్ నిర్వహించాలన్నా ఇంగ్లిష్ అవసరం కాదా? 2. ఉన్నత కొలువులకు బాటలు వేసే ఏ చదువు చదవాలన్నా ఇంగ్లిష్ తప్పనిసరి కాదా? 3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ యూనివర్సిటీలో విద్య అభ్యసించాలన్నా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకుంటే నిరాశే మిగలదా? 4. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఇంటర్నెట్ నుంచి సమాచారం కావాలన్నా.. ఇంగ్లిష్‌పైన ఆధారపడడం లేదా? 5. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో ఉండి కూడా ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేక అమెరికా/యూకే వీసాలు తిరస్కరింపబడి మనకు తెలిసిన వాళ్లెందరో నిరాశకు గురి కావట్లేదా? ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమే ఉంది. డబ్బున్న వారంతా తమ పిల్లలను ఇంగ్లిష్‌లోనే చదివిస్తున్నారు. అంటే ఇంగ్లిష్ మీడియం వ్యతిరేకించే వారి లక్ష్యం పేద, బడుగు, బలహీన వర్గాలా? వాళ్లు ఇంగ్లిష్ చదువుకోవడం వీరికి ఇష్టం లేదా? అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్ల అప్పో సప్పో చేసి మరీ ప్రైవేట్ కాన్వెంట్లలో చదివించే వారి కష్టాలు ఎప్పుడు తీరాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించుకునే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో వీరందరికీ ఇంగ్లిష్ మీడియం వల్ల ఎంతో ప్రయోజనం జరగనుందని కచ్చితంగా విశ్వసిస్తున్నా. ఏపీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభించేలా బాటలు వేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిద్దాం. రత్నాకర్, నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి -
‘సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిద్దాం’
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్ స్వాగతించారు. సీఎం జగన్ నిర్ణయం పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తు పునాది అవుతుందన్నారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ కూడా తెలుగు మీడియంలో చదివించని వాళ్లు.. ఇప్పుడు తెలుగు భాష గురించి పుంఖాను పుంఖాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరక ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సమాజంలో పేదలు, అట్టడుగు వర్గాలు , ఆర్ధికంగా వెనుకబడ్డ వారు ప్రాధమిక చదువుల కోసం ఆధార పడే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలంటూ , విద్యా మూలం మిదత్ జగత్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోగానే కొన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. హఠాత్తుగా వారికి తెలుగు భాష గుర్తుకొచ్చింది. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ తెలుగు మీడియంలో చదివించని వీరంతా తెలుగు భాష గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్నారి మొదటి నుంచే కచ్చితంగా ఇంగ్లీషు మీడియంలో చదివితే ఎన్నో ప్రయోజనాలుంటాయన్నది సొంతగా నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కడపలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడలేక, పూర్తి స్థాయి ప్రావీణ్యత లేక ఎన్నో అవకాశాలు కోల్పోయా. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లీషు మీడియంలోకి వచ్చినా.. భాష పూర్తిగా రాకపోవడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సాఫ్ట్ వేర్ నిపుణుడిగా అమెరికా వచ్చిన నాకు ఇంగ్లీషు భాషలో పట్టు లేకపోవడం వల్ల మొదట్లో నా కెరియర్‌కు ఎంతో నష్టం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మాట్లాడే భాష ఇంగ్లిష్. దాదాపు 150కోట్ల మంది మాట్లాడే ఇంగ్లీష్ వల్ల వ్యవహారం అంతా ఆ భాష చుట్టే తిరుగుతోంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ లెక్కల ప్రకారం చైనాలో దాదాపు 35కోట్లమంది ప్రజలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంది. భారత్‌లో ఆ సంఖ్య 10కోట్లే. ఇంగ్లీషు భాష గురించి నిజాయతీగా కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. తమ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే నిజాలు బయటపడతాయని ఆశిస్తున్నా. 1. నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా ఏ ముఖ్యమైన పని చేయాలన్నా, బిజినెస్ నిర్వహించాలన్నాఇంగ్లీషు అవసరం కాదా? 2. ఉన్నత కొలువులకు బాటలు వేసే ఏ చదువు చదవాలన్నాఇంగ్లీషు తప్పనిసరి కాదా? 3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ యూనివర్సిటీలో విద్య అభ్యసించాలన్నా.. ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకుంటే నిరాశే మిగలదా? 4. పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నా, ఇంటర్నెట్ నుంచి సమాచారం కావాలన్నా.. ఇంగ్లీషుపైనా ఆధారపడడం లేదా? 5. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో ఉండి కూడా ఇంగ్లీషు సరిగా మాట్లాడలేక అమెరికా/యూకే వీసాలు రిజెక్ట్ అయి మనకు తెలిసిన వాళ్లెందరో నిరాశకు గురి కావాట్లేదా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంగ్లిష్‌కు దాని విలువ తెలిసి ప్రాధాన్యమిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మొదట తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించి తరవాతే తమ భాష నేర్పుతున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవడమే మార్గమని నమ్ముతున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవాలు పరిశీలించండి. అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియమే ఉంది. డబ్బున్న వారంతా తమ పిల్లలను ఇంగ్లీషులోనే చదివిస్తున్నారు. అంటే ఇంగ్లీషు మీడియం వ్యతిరేకించే వారి లక్ష్యం పేద, బడుగు, బలహీన వర్గాలా? వాళ్లు ఇంగ్లీషు చదువకోవడం వీరికి ఇష్టం లేదా? అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల అప్పో సప్పో చేసి మరీ ప్రైవేట్ కాన్వెంట్లలో చదివించే వారి కష్టాలు ఎప్పుడు తీరాలి? సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాందించుకునే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో వీరందరికి ఇంగ్లీషు మీడియం వల్ల ఎంతో ప్రయోజనం జరగనుందని కచ్చితంగా విశ్వసిస్తున్నా. ఏపీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభించేలా బాటలు వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మనస్పూర్తిగా స్వాగతిద్దాం. పార్టీలకు అతీతంగా.. ఇంగ్లీషు మీడియం నిర్ణయానికి జై కొడదాం’ అని రత్నాకర్ అన్నారు. -
‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్
సాక్షి, అమరావతి : అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో జ్యోతి ప్రజల్వన చేయడానికి నిరాకరించి.. హిందువులను కించపరిచారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ట్విటర్లో చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతి ప్రజ్వలన విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా సీఎం రమేశ్, బీజేపీ శ్రేణులు చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం రమేశ్ అజ్ఞానంతో, హిందువులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి అమెరికాలోని స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన లాంటిది చేయనివ్వరని, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్డేడియం లోపల లైటర్ కానీ, అగ్గిపెట్టెను కానీ వాడటానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించబోరని, అయినా, మైదానంలోకి ప్రవేశించే ముందే సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి నుంచి హారతి తీసుకొని, బొట్టు పెట్టుకొని ఆయన స్టేడియంలోకి ప్రవేశించారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి.. సీఎం రమేశ్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నారు. సీఎం రమేశ్‌కు కౌంటర్ సీఎం రమేశ్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడు కడప రత్నాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని స్టేడియంల లోపల జ్యోతి వెలిగించడానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతివ్వలేదని, స్టేడియం లోపల ఎలాంటి నిప్పు వెలిగించరాదని కఠిన నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే స్డేడియంలో వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నట్లు చంద్రబాబులా వైఎస్ జగన్ యాక్టింగ్ చేయలేదని వివరించారు. అందుకే స్టేడియం లోపలికి వెళ్లేముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కానీ కావాలని బీజేపీ, టీడీపీ నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తి, మతం ముసుగులో రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీరిని అరికట్టకపోతే మతాన్ని భ్రష్టుపట్టిస్తారని ఆయన మండిపడ్డారు. -
ఏపీకి మంచి రోజులు రావడం ఖాయం : రత్నాకర్
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్సీపీ అమెరికా విభాగం కన్వీనర్ రత్నాకర్‌తో పాటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గంలో ఉన్న వైఎస్ జగన్‌కు పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఎన్ఆర్ఐల తరపున రత్నాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పార్టీ ఘనవిజయం సాధించాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరినట్టు రత్నాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే అది కేవలం వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. ఈ సంవత్సరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు, రాష్ట్రానికి హోదా రావాలని ఆకాంక్షించారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ ఈ ఏడాదైనా విరుగుడు అవుతుందన్నారు. చంద్రబాబు పాలనకు ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు చరమగీతం పాడతారని, మరోసారి రాజన్న రాజ్యాన్ని వైఎస్ జగన్ తీసుకొస్తారని అభిలషించారు. గత కొన్ని నెలలుగా తాను కూడా పాదయాత్రలో పాల్గొంటున్నానని, ప్రజల తీరును గమనిస్తున్నానని, ఈ ఏడాది రాష్ట్రానికి మంచి రోజులు రావడం ఖాయం అన్నారు. -
వెన్నుపోటు,యూటర్న్‌లకు కేరాఫ్ చంద్రబాబు
-
కార్పొరేటర్ భర్త హల్చల్
విజయవాడ: కృష్ణా జిల్లాలోని మొగల్రాజపురంలో కార్పొరేటర్ భర్త రత్నాకర్ హల్చల్ చేస్తున్నాడు. అక్కడ కొండపై నివశిస్తున్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వేదిస్తున్నాడు. ఒకవేళ ఇళ్లు ఖాళీ చేయకపోతే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి అడ్డొచ్చిన వారిపై తన అనుచరులతో దాడి చేయించి, ఇళ్లను పడగొట్టించాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రశ్నల హీరో ఎక్కడ?
ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం చంద్రబాబు : రత్నాకర్ రాజమహేంద్రవరం : అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తానంటూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించకుండా తిరుగుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. దీక్షలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు ఇద్దరు ఎస్పీలను అనుమతి అడిగినా ఒప్పుకోకపోవడం దారుణమన్నారు. ఆయనను ఓ ఉగ్రవాదిలా చూస్తోందన్నారు. చంద్రబాబు నైజం చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలపెట్టే రకం గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను, కాపుల రిజర్వేషన్లు పేరుతో కాపులను అణగదొక్కేందుకు చూస్తే చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు. -
రేడియాలజిస్ట్ రత్నాకర్ సస్పెన్షన్
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రేడియాలజిస్ట్ రత్నాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేడు ఆసుపత్రిలో విచారణ చేయనున్నారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళాల పట్ల వైద్యులు, సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా రేడియాలజిస్ట్ రత్నాకర్‌ను సస్పెండ్ చేశారు. -
‘లింగ’ అనుమతి నా దృష్టికి రాలేదు
జిల్లా ఇన్చార్జ్ మంత్రి కిమ్మెన రత్నాకర్ శివమొగ్గ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదంపై జిల్లా ఇన్చార్జి మంత్రి కిమ్మెన రత్నాకర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వ ద్ద లింగ షూటింగ్‌కు అనుమతి ఎలా ఇచ్చారని విలేకరులు మంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వివరణ ఇస్తూ ఈ విషయం తనకు తెలియదని, సంబంధిత మంత్రితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో సిటీ బస్సులు : శివమొగ్గ-భద్రావతిలో కేఎస్ఆర్టీసీ బస్సులను నడపటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంపై రవాణా శాఖ అధికారులకు కూడా పలు సూచనలు చేశామని మంత్రి చెప్పారు. మరో మూడు నెలల్లోపు బస్ డిపో, బసాండ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే అధికారులు పనులు వేగవంతం చేశార ని మంత్రి కిమ్మెన తెలిపారు. -
మాటల యుద్ధం
శాసనమండలిలో రాష్ట్ర విద్యారంగానికి సంబంధించి సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రులు కిమ్మెన రత్నాకర్, ఆర్వీ దేశ్‌పాండే సమాధానలిచ్చారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లపై ఉన్న ఆరోపణలకు సంబంధించి మధుసూదన్ ప్రశ్నించినప్పుడు మాటల యుద్ధం కొనసాగింది. పరిస్థితి గందరగోళానికి దారితీయడంతో అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. - సాక్షి, బెంగళూరు ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు విడుదల చేయనున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... తమ ప్రాంతాల్లో పాఠశాల దుస్థితిని ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన వాటికి అదనమని పేర్కొన్నారు. ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అన్నారు. మూడు నెలల్లోపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన దాదాపు పూర్తి అవుతుందని అన్నారు. కాగా, రాష్ట్ర వ్యాపంగా 44,200 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ఉప కులపతులపై ఆరోపణలు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల(వీసీ)పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 17 విశ్వవిద్యాలయాలు ఉండగా మాజీ, ప్రస్తుత వీసీలలో ఎనిమిది మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. వీరికి సంబంధించి దర్యాప్తు నివేదికలు అందిన వెంటనే పరిషత్‌లో ప్రవేశపెడుతామన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగిందని, ఆ నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. దీంతో సభ్యులంతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ అధికారి అవినీతి సంబంధించి రిపోర్టు అందలేదని చెప్పడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇందుకు అధికార పక్షం అభ్యంతరం తెలిపారు. ఈ దశలో వాగ్వాదం చోటు చేసుకుని గందరగోళానికి దారితీసింది. చివరకు అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ‘డీమ్డ్’ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం డీమ్డ్ విశ్వవిద్యాలయాల వల్ల ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే అంగీకరించారు. అయితే ‘డీమ్డ్’కు అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది డీమ్డ్ యూనివర్శిటీలు ఉన్నాయన్నారు. కాగా, వివిధ పథకాల కింద ప్రతి ఏడాది రాష్ట్రంలోని వైద్య, దంతవైద్య, ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్య కోర్సులకు సంబంధించి దాదాపు 4,800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. -
16వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు
మంత్రి కిమ్మనె రత్నాకర్ త్వరలో పీయూ పుస్తకాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వచ్చే అక్టోబరు లోగా 16,200 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను నియమించనున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. శాసన సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు ఈ. తుకారాం ప్రశ్నకు బదులిస్తూ ఖాళీలున్న పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులను నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 28 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 12 వేల మంది ఉపాధ్యాయులను నియమించడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించిందన్నారు. మరో ఐదు వేల మందిని నియమించుకోవడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ఇప్పటికే టీచర్ల అర్హతా పరీక్ష (టెట్)ను నిర్వహించినట్లు గుర్తు చేశారు. వారంలోగా పీయూ పుస్తకాలు రాష్ట్రంలో పీయూ విద్యార్థులకు వారంలోగా అన్ని పుస్తకాలను సమకూర్చతామని మంత్రి తెలిపారు. సభ్యుడు మొహియుద్దీన్ బాబా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇప్పటికే 60 శాతం పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మిగిలిన పుస్తకాలను కూడా త్వరితంగా ముద్రించి అందజేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రమేశ్ కుమార్ ఆగ్రహం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి, సొంత పార్టీ సభ్యుని ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన రమేశ్ కుమార్ పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి, ఆఖరికి మూడు, నాలుగు కోట్లు విదిలిస్తారని దెప్పి పొడిచారు. దీనికీ చాలా మంది అధికారుల అనుమతి అవసరమని అన్నారు. పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజక వర్గానికి రూ.40 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై రమేశ్ కుమార్ మండిపడుతూ, శాసన సభ్యులకేమైనా కానుకలిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ప్రాథమిక సదుపాయాలు లేక అనేక పాఠశాలలు మూతపడే స్థాయికి చేరుకున్నాయని ఆయన విమర్శించారు. -
ఏటా టీచర్ పోస్టుల భర్తీ
మంత్రి కిమ్మెన రత్నాకర్ ‘పీయూసీ’లోని ఖాళీలూ భర్తీ పాఠశాలల మౌలిక సదుపాయాలకు నిధులు ప్రతి మాధ్యమిక పాఠశాలకూ హెచ్ఎం బ్లాక్మార్కెట్లో పాఠ్యపుస్తకాలపై దర్యాప్తునకు ఆదేశించాం త్వరలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖలో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి గురించి బెంగళూరులోని సర్వశిక్ష అభియాన్ ప్రధాన కార్యాలయంలో మీడియాకు బుధవారం వివరించారు. ఏడాదికి నాలుగు నుంచి ఐదు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖకు ఇటీవలే ఆదేశించారన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలతో పాటు పీయూసీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే ఐదేళ్లలోపు భర్తీ చేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమున్న ప్రతి నియోజకవర్గానికీ రూ.40 లక్షలు కేటాయించనున్నామన్నారు. ఇవి బడ్జెట్లో పేర్కొన్న నిధులకు అదనమని పేర్కొన్నారు. ప్రస్తుతం 60 మంది పిల్లలు ఉన్న మాధ్యమిక పాఠశాలకు మాత్రమే ప్రధానోపాధ్యాయుడు ఉంటున్నారన్నారు. దీని వల్ల హెడ్మాస్టర్ లేని పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందువల్ల విద్యార్థుల సంఖ్యతో సంబంధం లే కుండా ప్రతి మాధ్యమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు రూపొందించనున్నామన్నారు. ప్రా థమిక దశలో మాతృభాషలోనే తప్పక విద్యాబోధన జరగాల్సిన పనిలేదని సుప్రీం కోర్టు పేర్కొనడం కన్నడకే కాక ఆ యా ప్రాంతీయ భాషల అభివృద్ధికీ గొడ్డలిపెట్టువంటిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశార ని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పీయూసీ పాఠ్యపుస్తకాల బ్లాక్‌మార్కెట్ వ్యవహారంపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, విద్యాశాఖలో చేపట్టిన పలు సంస్కరణలవల్లే ఈ ఏడాది పాఠశాలల ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వడానికి వీలవుతోందన్నారు. న్యాయసంబంధ ఇబ్బందుల వల్లే సైకిళ్లను విద్యార్థులకు ప్రస్తుతానికి అందించలేకపోతున్నామని, త్వరలో వాటిని కూడా విద్యార్థులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. -
వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్తగా రత్నాకర్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా దాడి రత్నాకర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాడి వీరభద్రరావు తనయుడైన ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షునిగా పనిచేశారు. తండ్రితోపాటే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్త లేరు. దీంతో ఆ స్థానంలో దాడి రత్నాకర్‌ను నియమించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.