సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. సాధ్యమైనంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి విన్నవించే సాహసం చేయలేకపోతున్నా. నా విన్నపాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రిని కోరుతున్నా..’ అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. తాను బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు వార్తలు వస్తే మరోలా భావించరాదని విద్యుత్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జెన్‌కో ఆడిటో రియంలో జరిగింది. మంత్రి జగదీ శ్‌రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా మంత్రి సమక్షంలో ప్రభాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విద్యుత్ ఉద్యోగు లతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పదవీ విరమణ ఆలోచనను విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు సభా వేదికపై నుంచి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గత నెల 5న విద్యుత్ సౌధలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో సైతం ప్రభాకర్‌రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించకపోవడంతో అప్పట్లో పెద్దగా చర్చ నీయాంశం కాలేదు. ప్రభాకర్‌రావు 2014 జూన్ 5 నుంచి జెన్‌కో, 2014 అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో ఇన్‌చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో గత నెలలోనే ఆయన సీఎండీగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత ఆయ న్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించినా, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. చివరిసారి పొడి గింపు సమయంలో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని పేర్కొంది.
సూర్యుడి మీద ఉమ్మేయడమే: మంత్రి జగదీశ్‌రెడ్డి
కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్‌స్టాండర్డ్ గాళ్లు.. సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారి మీద అవాకు లు చెవాకులు పేలడం సూర్యుడి మీద ఉమ్మేయడ మే నని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఆశించినదానికంటే అధిక పీఆర్సీ: ప్రభాకర్‌రావు
విద్యుత్ ఉద్యోగులు ఆశించినదానికంటే అధిక పీఆర్సీ ఇచ్చామని ప్రభాకర్‌రావు చెప్పారు. వెయిటేజీ లేకుండా 10 నుంచి 15 శాతం పీఆర్సీని ఉద్యోగులు ఊహించు కుంటే, జీతాలు మాత్రం 18.5 శాతం పెరిగాయని అ న్నారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా, కో–చైర్మన్ శ్రీధర్, కో–కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment