Prabhakar Rao
-
వ్యూహమా? ప్రభాకర్‌రావుపై ప్రేమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా వినిపించింది టి.ప్రభాకర్‌రావు పేరే. ఆ విభాగ మాజీ చీఫ్ అయిన ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ట్యాపింగ్ కేసు నమోదుతో అమెరికా వెళ్లిపోయారు. ఈ కేసు దర్యాప్తు కొలిక్కిరావాలంటే ఆయన్ను వెనక్కి రప్పించడం, విచారించడం అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడెందుకో పోలీసులకు ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న శ్రవణ్‌రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా (ప్రకటిత నేరస్తుడు) ప్రకటించాలంటూ ఇటీవల నాంపల్లి కోర్టులో పోలీసు విభాగం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభాకర్‌రావు పేరును మాత్రం ఇందులో చేర్చలేదు. మరోపక్క పి.రాధాకిషన్‌రావు, భుజంగరావులకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసు విభాగం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మొదలు.. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీసులు 2024 మార్చి 10 కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ప్రణీత్‌రావుపై నమోదైన ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కీలక నిందితులుగా పేర్కొంటూ అదే నెలలో అడిషనల్ ఎస్పీలు నాయిని భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్‌కుమార్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు గత జూన్‌లో చార్జీషీట్ దాఖలు చేశారు. అప్పట్లో ట్యాపింగ్‌కు గురైన వారిలో కాంగ్రెస్ నేతలు, ఓ న్యాయమూర్తి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతోపాటు కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఇంకా విచారణ సాగుతున్నందున అదనపు చార్జీïÙట్ దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. విచారణ ఇంకా పూర్తికాలేదంటూ... ఇప్పటికీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. ట్రయల్ కోర్టు రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా స్పందన లేదు. ఇటీవల పోలీసులు కోర్టుకు సమరి్పంచిన సీల్డ్ కవర్ నివేదికలో ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. నిందితుల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు రిట్రీవ్ చేసిన డేటాలో వీటిని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరందరి నంబర్లూ ట్యాపింగ్ అయినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దశలో కీలక నిందితులకు బెయిల్ ఇవ్వడం విచారణను ప్రభావితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, వివరాలతో వాదనలు సిద్ధం చేయాలని పీపీకి పోలీసు విభాగం సూచించింది. ‘ప్రొక్లైమ్డ్ అఫెండర్’ ఒక్కరిపైనే ఎందుకు? ఒకరిని న్యాయస్థానం ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా ప్రకటిస్తే.. వారి ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు వస్తుంది. ఇలా ఒత్తిడి తీసుకొచ్చి నిందితులను విదేశాల నుంచి రప్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిటిషన్‌ను ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావుపై దాఖలు చేయకుండా, శ్రవణ్‌కుమార్‌పై దాఖలు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కట్లేదు. పోలీసు విభాగం ఇలా వ్యవహరించడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? లేక వ్యూహంలో భాగమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడి కాగా.. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26న ఆయన గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఎక్స్ట్రడిషన్(నేరస్థుల అప్పగింత) అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దర్నీ అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.కాగా, కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్‌కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా.. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్‌రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్‌పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
పోలీస్ వర్సెస్ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్‌రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్‌రావు అన్నట్టుగా మారింది. పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి.. ఎస్ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్‌లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు. జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు. తొలుత పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయించి... రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీఓ) ద్వారా ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్‌పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్‌పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే! ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్‌రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్‌పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీసాలో గడువులో మతలబులు ఎన్నో... కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది. దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. ప్రభాకర్, శ్రవణ్ రావుకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్‌పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
నెమ్మదించిన కీలక కేసుల దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో ఎంతో సంచలనంగా మారి.. నిత్యం వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఒక్కో కేసులో ఒక్కో అంశం కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వరుస అరెస్టులతో మొదట్లో హడావుడిగా నడిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిïÙట్ సైతం దాఖలుచేశారు. ఇక్కడి వరకు దర్యాప్తు ఫుల్‌స్పీడ్‌లో కొనసాగింది.అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉండటంతో వారిని అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తులో ముందుకుసాగని పరిస్థితి. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. గొర్రెల కేసులో... ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత విచారణకు ఆదేశించిన మరో కీలక కేసు గొర్రెల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు అధికారి మారడంతో మళ్లీ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో ఈ కేసు ముడిపడి ఉండడం.. ఏసీబీలో సరిపడా సిబ్బంది లేకపోవడం సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జాప్యానికి కారణం అవుతోంది. రూ.1,000 కోట్ల జీఎస్టీ కేసులో.. అత్యంత సంచలనంగా మారిన మూడో కేసు.. వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చడంతో ఈ కేసుపైనా తీవ్ర చర్చ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి నా.. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సరిగా లేవని అంటున్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం సాధ్యం కాకపోవడంతో సీఐడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారం కోసం ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు లేఖలు రాశారు. ఆ సమాచారం వస్తే తప్ప దర్యాప్తులో ముందడుగు పడని పరిస్థితి. -
రావును రప్పించగలరా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి వెనక్కు రప్పించడం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఆయన వైద్యపరమైన కారణాలతో ఆ దేశంలో ఉండటం, ఇంటర్‌పోల్ కేవలం బ్లూకార్నర్ నోటీసు మాత్రమే జారీ చేసే అవకాశం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన డిపోర్టేషన్ (బలవంతంగా రప్పించడం) పై మల్లగుల్లాలు పడుతున్నారు. సుదీర్ఘకాలం ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు గత డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తదితర పరిణామాలను గమనించిన ఆయన తిరుపతికి ప్రయాణమై కనీసం కుటుంబీకులకు కూడా చెప్పకుండా అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెల 12న ప్రభాకర్‌రావు కుమారుడిని విచారించిన పోలీసులు ఆయన తిరిగి ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఇటీవల ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాశారు. జూన్ నాటికి పూర్తిగా కోలుకుని తిరిగి వచ్చేస్తానని భావించానని, నిరాధార ఆరోపణలతో కలిగిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ అయినప్పటికీ... హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావుపై తొలుత ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించాలని భావించారు. అయితే ఆ విభాగం దృష్టిలో ఈ కేసు అంత తీవ్రమైంది కాదనే ఉద్దేశంతో బ్లూ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐని ఆశ్రయించారు. ఇవి జారీ అయినా ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు ఆచూకీ కనిపెట్టి, ఆయన కదలికలపై నిఘా ఉంచుతుంది తప్ప బలవంతంగా తిప్పి పంపదు. ఒకవేళ ఏదో ఒకవిధంగా డిపోర్టేషన్ ఉత్తర్వులు పొందినా.. అవి అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదం పొందాలి. అమెరికా న్యాయవ్యవస్థ వద్ద వెయ్యికిపైగా వివిధ నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 56 నోటీసుల అమలుకే అనుమతి ఇ చ్చింది. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తుల ప్రాణాలు, ఆరోగ్యానికి విలువ ఎక్కువ. ప్రభాకర్‌రావు అక్కడ మెడికల్ గ్రౌండ్స్‌పై ఉంటున్నందున ఆయనపై నోటీసు జారీ అయినా డిపోర్టేషన్‌కు అనుమతించే అవకాశాలు చాలా తక్కువే. వీసాగడువులో మతలబులుఎన్నో...తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న ఆయా వ్యక్తుల కుటుంబీకులు, అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి బయటకు వచ్చేయాలనే నిబంధన ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి, ఆపై కెనడా లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి వస్తే.. మళ్లీ 179 రోజులు అమెరికాలో ఉండే అవకాశం దక్కుతుంది. ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంది. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా ఆయన పాస్‌పోర్టు రద్దుకు ప్రయత్నాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావుల మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్‌పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..ఈలోపు ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్ మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్‌రావు మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్‌లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ6 శ్రవణ్ రావును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపైన నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అమెరికాలో ప్రభాకర్‌రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రవణ్‌రావు ఆచూకీని దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. శ్రావణరావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు సమాచారం.కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌రావు అమెరికాకు వెళ్లిపోయారు. -
నేను ఇల్లీగల్ పనులు చేయలేదు.. అమెరికా నుంచి ప్రభాకర్ లేఖ
-
"నేను రాలేను.." ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది.అయితే, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్ రావుకు సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే అవకాశం లేదు.ఈ నేపథ్యంలో కేసు విషయమై ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రత్యామ్నాయం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్ధు కోరుతూ రీజనల్ పాస్‌పోర్ట్ అధికారికి కూడా పోలీసులు లేఖ రాశారు. అయితే, ప్రభాకర్ రావు పరారీలో లేనని సమాచారం ఇస్తుండటంతో విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్టు రద్ధు అంగీకారం అనుమానంగానే మారింది. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు శ్రావణ్ రావు సైతం విదేశాల్లోనే మకాం వేశారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డోలాయమానంలో పడిపోయింది. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వస్తే తప్ప కేసు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇండియాకు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు వచ్చేదెప్పుడు?
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే.. అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితులపై బెయిల్‌పై.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్ మెటీరియల్‌గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టును కోరారు. -
కరెన్సీ తరలింపులో మరికొందరు ఖాకీలు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ‘పోలీసు వాహనాల్లో ఎలక్షన్ ఫండ్ రవాణా’ వ్యవహారంలో మరికొందరు ఖాకీల పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఓ మాజీ ఎస్పీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకరు ఇప్పటికే అరెస్టు కాగా మరొకరిని పోలీసులు విచారించారు. తెరవెనుక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో ఇతర జిల్లాలకు నగదు తరలినట్లు నిర్థారించారు. ఈ మొత్తాలను ఆయా జిల్లాల్లో రిసీవ్ చేసుకున్నది ఎవరు? అక్కడ నుంచి ఎవరి వద్దకు చేరాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఎస్పీ, మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. ప్రధానంగా ఎన్నికల సమయంలోనే..టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ అధికారులు ప్రధానంగా గతంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమాయాల్లోనే నగదు అక్రమ రవాణా చేసినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ మొత్తం వివిధ జిల్లాల్లో ఉన్న కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి వీటిని వాడటం మొదలెట్టారు. 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భాల్లో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువ జరిగినట్లు అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌లోని వ్యక్తుల నుంచి ఆ మొత్తాలను తరలించే బాధ్యతల్ని అప్పటి రాధాకిషన్‌రావు నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లాలకు తీసుకువెళ్లే అంశాన్ని ఎస్ఐబీలోని కొందరు అధికారులు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ మొత్తాలను సురక్షితంగా వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందిన స్థానిక అధికారుల సహకారం తీసుకుని ఉంటారని అనుమానించారు. ప్రభాకర్‌రావు లేదా రాధాకిషన్రావుల్లో ఎవరో ఒకరు వారితో మాట్లాడి, నగదు తరలింపులో సహకరించేలా ఒప్పించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీసిన ఉన్నతాధికారులు ఓ ఎస్పీ స్థాయి అధికారి పాత్రను గుర్తించినట్లు సమాచారం. మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. కొందరికి నోటీసులు ఇచ్చి విచారించిన సిట్... అన్ని అంశాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చాక మిగిలిన వారికీ నోటీసులు జారీ చేసి విచారించాలని, వాంగ్మూలాలు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సంప్రదింపులు ఆపేసిన ప్రభాకర్రావుసుదీర్ఘకాలం ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆపై ఎస్ఐబీలో జరుగుతున్న పరిణామాలు, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావుపై కేసు నేపథ్యంలో అమెరికా వెళ్లిపోయారు. పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో పాటు మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టుల తర్వాత తిరిగి రావాలని భావించారు. అప్పటి నుంచి కొన్నాళ్లు కొందరు పోలీసు అధికారులు, తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్న వారితో సంప్రదింపులు పూర్తిగా ఆపేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా ఆయన్ను రప్పించాలని నిర్ణయించారు. -
విదేశాల్లో ప్రభాకర్‌రావు, శ్రావణ్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు మంగళవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులతోపాటు పరారీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, శ్రావణ్ రావులను నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపారు. పరారీలో ఉన్న ఇద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో కుట్ర, నమ్మకద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసు ఆపై ట్యాపింగ్ టర్న్ తీసుకుంది. దీంతో టెలిగ్రాఫ్ యాక్ట్, సైబర్ టెర్రరిజం చట్టాలను జోడించారు. నిందితుడిగా ఉన్న ప్రణీత్‌ను మార్చి 12న, భుజంగరావును తిరుపతన్నలను 23న, రాధాకిషన్‌రావును 28న అరెస్టు చేశారు. చట్ట ప్రకారం ఓ నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో అతడిపై అభియోగపత్రం దాఖలు చేయకుంటే న్యాయస్థానం అతడికి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మంగళవారం ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్ïÙట్ దాఖలు చేశారు. ట్యాపింగ్... వసూళ్లు ట్యాపింగ్ కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సంబం«దీకులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా అక్రమ నిఘా ఉంచినట్లు వివరించారు. అలాగే, బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగపత్రాల్లో పేర్కొన్నారు. వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారని, అలా తెలుసుకున్న విషయాలతో వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకు రాధాకిషన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. మొత్తమ్మీద నిందితులు 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని, బాధితుల్లో హైకోర్టు న్యాయమూర్తి కాజా శరత్ కూడా ఉన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోపక్క డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు జరిగాయని నిందితుల తరఫు న్యాయవాది, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. -
బీఆర్ఎస్ నేతలపైనా నిఘా!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఆపరేషన్ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్ వేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్ఎస్ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్ ద్వారా ఆర్ఎస్ఎస్ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్ఎస్తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్ఎస్కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్ తదితర సోషల్ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్–నవంబర్‌ల్లో ట్యాపింగ్ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్ సంస్థ అధినేత శ్రావణ్ కుమార్ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్ చేసిన వ్యక్తులను ట్రోల్ చేయడానికి శ్రావణ్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. -
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్‌రావును దర్యాప్తు బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరగ్గా తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశా
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు తొలిసారి అధికారికంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ప్రత్యేక మైన అధికారాలు లేవని, అప్పటి డీజీపీ, నిఘా విభాగం అధిపతి పర్యవేక్షణలోనే తాను పని చేశానని చెప్పారు. పోలీసుల పిటిషన్ నేపథ్యంలో తనపై అరెస్టు వారెంట్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిన ప్రభాక ర్రావు వైద్యం పేరుతో అక్కడే ఉన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మాట్లాడటం మినహా ఇప్పటివరకు దేనిపైనా స్పందించలేదు. అయితే పంజగుట్ట పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు వారెంట్ కోసం పిటిషన్ వేయడంతో మౌనం వీడారు. ఆయనతో పాటు ఓ మీడియా సంస్థ అధినేత శ్రావణ్‌కుమార్‌పై అరెస్టు వారెంట్లు కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అలా వారెంట్లు జారీ చేయవద్దని కోరుతూ ప్రభాకర్‌రావుతో పాటు శ్రావణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన న్యాయవాది వి.సురేందర్‌రావు ద్వారా వేసిన పిటిషన్లో ప్రభాకర్‌రావు పలు అంశాలు ప్రస్తావించారు.అనుభవం దృష్ట్యానే..దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నట్లు తాను ఎస్ఐబీ చీఫ్ కావడానికి సామాజిక వర్గం కారణం కాదని, తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే నాటి డీజీపీ ఎంపిక చేశారని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. నల్లగొండ ఎస్పీగా పని చేస్తున్న తనను రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి హఠాత్తుగా బదిలీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తనకు డీఐజీ నుంచీ ఐజీగా రావాల్సిన పదోన్నతి కూడా చాలా ఆలస్యమైందని తెలిపారు. తాను అమెరికా వెళ్లడానికి కారణం కేసుల భయం కాదని, వైద్యం కోసమే అని వివరించారు. అది పూర్తయిన తర్వాత స్వదేశానికి వస్తానని కోర్టుకు తెలిపారు. సోదరి అనారోగ్య కారణాల నేపథ్యంలో తాను అమెరికా వెళ్లినట్లు శ్రావణ్‌కుమార్ కూడా తన న్యాయవాది (సురేందర్‌రావు) ద్వారా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
నగదు అక్రమ రవాణాపైనా సిట్ నజర్!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు. ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వాళ్లిద్దరినీ చెంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకు ముందు.. వాళ్లిద్దరి కస్టడీ ముగియడంతో తొలుత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 6వ తేదీ దాకా రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ ఇద్దరు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు.. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క.. మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో.. ఆయన్ని సైతం అరెస్ట్ చేస్తారా? లేదంటే నోటీసులిచ్చి కేవలం ప్రశ్నిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు వేసిన బెయిల్ పిటిషన్‌పైనా ఇదే కోర్టులో విచారణకు రానుంది. ఇంకోపక్క.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
అమెరికా నుంచి హైదరాబాద్ కు..ప్రభాకర్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేర్లు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేసిన మరో సీనియర్ అధికారిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఎస్ఐబీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆ అధికారికి... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1 అయిన ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. సీనియర్ అధికారితో పాటు ఓ ఇన్స్పెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం భావిస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఇవాళ నాలుగో రోజు విచారణ చేపట్టారు. అదే సమయంలో.. ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయనే చర్చా నడుస్తోంది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇంటర్‌పోల్ దాకా వెళ్లకముందే.. ప్రభాకర్‌రావు లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆయన తిరుగు ప్రయాణమయారని.. విచారణ బృందం ఎదుట హాజరు కావొచ్చని సమాచారం. ఒకవేళ ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారితే గనుక ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు. రాధాకిషన్‌ను 10 రోజుల కస్టడీ కోరుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును అశ్రయించారు. మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు రాధాకిషన్‌ను నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో మధ్యాహ్నాం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్‌పై ఉత్కంఠ అదే సమయంలో ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై వాదనలు జరగాల్సి ఉంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కోసం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బెయిల్ కోసం ప్రణీత్‌రావు ఫోన ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది. -
అయిందేదో అయింది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ట్యాపింగ్ కేసులో తన చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో విదేశాల్లో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు రాయబారాలు మొదలు పెట్టారు. అయిందేదో అయింద ని.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కఠిన చర్యలు తీసుకో వద్దని కోరుతూ కొందరు ప్రతినిధులను ప్రభుత్వ పెద్దల వద్దకు పంపినట్టు తెలిసింది. కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ‘ముఖ్య’ నాయకుడు ఈ దశ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసి నట్టు సమాచారం. మరోవైపు తమ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను సిట్ అధికారులు ఆదివారం కూడా లోతుగా ప్రశ్నించారు. ఉన్నతాధికారి వద్ద భంగపడటంతో.. ఎస్ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాల ధ్వంసంపై అంతర్గత విచారణ గత ఏడాది డిసెంబర్లోనే మొదలైంది. దీనిపై ఆ విభాగంలోని తన మనుషుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్‌రావు.. ఓఎస్డీ పదవికి రాజీనామా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లిపోయారు. తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడం, ప్రణీత్‌రావు అరెస్టు తదితర పరిణామాలు జరిగాయి. పంజగుట్ట పోలీసులు గత నెల మూడో వారంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఓ మీడియా అధినేతలపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్నవారి ఇళ్లలో సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించారు. దీనితో ఇలాంటి చర్యలు వద్దంటూ అమెరికా నుంచే ప్రభాకర్‌రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. ఆయన సమాధానం విని కంగుతిని ఫోన్ కట్ చేశారు. రాధాకిషన్‌రావు అరెస్టుతో మారిన సీన్.. తర్వాత కొందరితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ప్రభాక ర్రావు మేకపోతు గాంభీ ర్యం ప్రద ర్శించారు. అక్రమ ట్యాపింగ్‌కు తానే ఎలా బాధ్యు డిని అవుతానని? తనపై ఉన్న అదనపు డీజీ, డీజీపీలకూ బాధ్యత ఉంటుందనే ధోరణిలో మాట్లాడారు. ఎస్ఐ బీ, ఇంటెలిజెన్స్‌ల్లో పనిచేసిన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతోపాటు మరో కీలక నిందితుడిగా ఉన్న హైదరా బాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్ రావునూ అరెస్టు చేశారు. దీనితో ప్రభాకర్‌రావు హడలిపో యారు. స్వదేశానికి తిరిగొచ్చాక తనకూ ఇది తప్పదని భావించి.. ప్రభుత్వ పెద్దలు, ‘ముఖ్య’ నాయకుడి వద్దకు రాయబారం ప్రారంభించారు. తమ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుల ద్వారా కొందరు మధ్యవర్తులను పంపారు. వారు ఇటీవల ప్రభుత్వ పెద్దలను, ‘ముఖ్య’ నాయ కుడిని కలిశారు. అప్పటి పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా ట్యాపింగ్, ఇతర చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని, తదుపరి చర్యలు కఠినంగా లేకుండా చూడాలని ప్రభాకర్‌రావు కోరు తున్నట్టు వివరించారు. కానీ సదరు ‘ముఖ్య’ నాయకుడు తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ అంశంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తు న్నారని.. స్వదేశానికి తిరిగొచ్చి, దర్యాప్తు అధికారుల ఎదుట పూర్తి వాస్తవాలు బయట పెట్టాల్సిందేనని పేర్కొ న్నట్టు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావుకు సమీప బంధువైన ఓ మహిళ.. సీనియర్ ఐపీ ఎస్‌లను, ఉన్నతాధికా రుల భార్యలను కలుస్తూ ప్రభాకర్‌రావు తరఫున రాయబారాన్ని ప్రయత్నించినట్టు అయితే అన్ని ప్రయ త్నాలూ బెడిసికొట్టడంతో ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి రావాలని ప్రభాకర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల పరిశీలన సిట్ అధికారులు తమ కస్టడీ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు ఆదివారం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్ టాప్‌లను విశ్లేషిస్తున్నారు. ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌ల లో వీరి కింద పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందిని సిట్ ప్రశ్నించి.. వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఎస్ఐబీ పోలీసులు తమ వాహ నాల్లో ఓ పార్టీకి సంబంధించిన నగదు రవాణా చేసినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అదనపు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) ఫోన్ టైపింగ్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు (సోమవారం) హైదరాబాద్‌కు రానున్న తెలుస్తోంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ.. ఈ కేసు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్ఐబీ చీఫ్‌గా ఉండి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డ ప్రభాకర్ రావు.. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుకు సైతం14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు. వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివాదాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కారణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు.. యూఎస్ నుంచి ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది! -
టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా.. గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది. అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు.. ఎస్ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే.. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్్కఫోర్స్లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది. భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
రీల్ కాదు.. ‘కాల్’ నాయక్!
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్’ అనే సినిమాలో.. నాయక్ భాయ్‌గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్ సీన్‌తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్ సీన్ ఒకటి గతంలో హైదరా బాద్ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు. నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నుంచి అందిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. టార్గెట్లు నిర్దేశించి మరీ.. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్రావు, పి.రాధాకిషన్‌రావు ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్‌రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశా రు. వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్ టీమ్‌కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్‌కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్ ఆడియోలను వినిపించే వారు. అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్ టీమ్ ఇన్చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం. తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ప్రణీత్‌రావు టీమ్ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్ చెప్తోంది. ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న పి.రాధాకిషన్‌రావు నిర్వర్తించారు. తన టీమ్ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్‌రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్ రికార్డులను కూడా ప్రభాకర్‌రావుకే అందించేవారని తెలిసింది. ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు టీమ్ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. పరిచయస్తులకు ప్రభాకర్‌రావు ఫోన్లు! ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్ జరిగిన సమయంలో తాను రెగ్యులర్ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుత్రరత్నం లీలలు.. ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్‌తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి, తన కుమారుడు ఫోన్ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసే సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్‌హౌస్ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక వ్యక్తుల పేర్లు
-
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభాకర్‌రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు సదరు ఉన్నతాధికారి స్పందించకుండా.. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో.. ప్రభాకర్‌రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాల ప్రకారం.. నాటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించడంతో ఎస్ఈబీ డీఎస్పీ ప్రణీత్‌రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు(తాజాగా అరెస్టైన అదనపు ఎస్పీలు) కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావుకు పంపించారు. అయితే.. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్క్డిస్క్లు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు ప్రభాకరే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం.. ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమైన ప్రభాకర్‌రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి.. అటు నుంచి అటే అమెరికాకు వెళ్లారు. ఇక.. ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ మాజీ పోలీస్ అధికారిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూడా. ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని తేలింది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు పేరును ఏ2గా చేర్చింది దర్యాప్తు బృందం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాకర్ రావు అండ్ టీం.. కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు.. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ-1గా ప్రభాకర్ రావు
-
ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో శనివారం అరెస్టు చేసిన అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలతోపాటు కస్టడీ ముగిసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావులను సిట్ అధికారులు ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రణీత్‌రావుకు బుధవారం వరకు, భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భుజంగరావు, తిరుపతన్నలను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందికి సిట్ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రధానాంశం ఫోన్ ట్యాపింగ్ కావడంతో ‘టెలిగ్రాఫిక్ యాక్ట్’ను కూడా జోడించాలని అధికారులు నిర్ణయించారు. ముగ్గురి కోసం ఔట్లుక్ సర్క్యులర్ పంజగుట్టలో నమోదైన ఈ ట్యాపింగ్ కేసులో శనివారం వరకు ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉండేవారు. సిట్ దర్యాప్తు, ప్రణీత్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నలను కూడా నిందితులుగా చేర్చినట్టు సిట్ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ అధిపతిని కూడా నిందితులుగా చేర్చినా.. విదేశాల్లో తలదాచుకున్నారు. దీంతో ఆ ముగ్గురి కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు అధికారులు లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. వ్యక్తిగత జీవితాలూ ‘ట్యాప్’.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉపరకణాలు, సాఫ్ట్వేర్లతో ల్యాండ్లైన్లు, సెల్‌ఫోన్ కాల్స్‌తోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేసిన ‘ప్రభాకర్‌రావు టీమ్’.. బెదిరింపు వసూళ్లకు పాల్పడటంతోపాటు కొందరి వ్యక్తిగత జీవితాలపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. హైప్రొఫైల్ వ్యక్తుల అంతర్గత వ్యవహారాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. వారికి ఆ వాయిస్‌లు, సందేశాలు చూపి, భారీ డిమాండ్లు నెరవేర్చుకున్నట్టు సమాచారం. అప్పటి ప్రతిపక్షనేత రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబీకులతోపాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు, కీలక వ్యక్తులపైనా ట్యాపింగ్ నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావుకు ఊహించిన షాక్.. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు నుంచి ఇక్కడి ఓ పోలీసు ఉన్నతాధికారికి కాల్ వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు ఎలా ట్యాపింగ్ కేసులో దూకుడుగా వెళ్తున్నారో.. అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాను ట్యాపింగ్‌లో జోక్యం చేసుకున్నానని ఆయన చెప్పినట్టు సమాచారం. మనం మనం పోలీసులమేనని, కేసు దర్యాప్తు పేరుతో ఇళ్లలో సోదాలు చేయడమేంటని కూడా ప్రభాకర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది. తాను వైద్యం కోసమే అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదంతా విన్న సదరు ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏం చెప్పాలనుకున్నా, ప్రశ్నించాలనుకున్నా నా అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపండి. అప్పుడే నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇస్తా..’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనితో ప్రభాకర్‌రావు మౌనంగా ఫోన్ కట్ చేసినట్టు సమాచారం. సిట్ దర్యాప్తునకు కొన్ని ఆటంకాలు! అక్రమ ట్యాపింగ్ వ్యవహారం మూలాలు బయటపడాలన్నా, సూత్రధారులను తేల్చాలన్నా సాంకేతిక ఆధారాలు కీలకం. అందుకే వాటిని సేకరించడానికి సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఓ నిఘా విభాగం నుంచి నగర పోలీసులకు సరైన సహకారం అందట్లేదని తెలిసింది. అందుకే దర్యాప్తు జాప్యం అవుతోందని సమాచారం. కేసు దర్యాప్తు కోసం అధికారులు అడిగిన పలు సున్నిత అంశాలు తెలపడానికి, ఉపకరణాల విశ్లేషణ కోసం సదరు నిఘా విభాగం అధికారి అనుమతించట్లేదని తెలిసింది. పోలీసులు వచ్చి తమ విభాగంలో అంశాలన్నీ పరిశీలిస్తే.. బయటి ప్రపంచానికి తెలిసిపోతాయని, తద్వారా వ్యూహాలు దెబ్బతింటాయని చెప్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము కీలక ఆపరేషన్లు చేపట్టలేమని సదరు అధికారి పేర్కొంటున్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నేతలు? భుజంగరావును శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఆయన నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను విచారించిన సమయంలో, ఉపకరణాల విశ్లేషణలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ట్యాపింగ్ చేయాల్సిన టార్గెట్ల వివరాలు ఆయనకు నేరుగా ఓ ముఖ్య నేత నుంచి వచ్చినట్టు తేలింది. డీఎస్పీ ప్రణీత్‌రావుకు మరో కీలక నేత నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఆ నేతల పాత్రకు సంబంధించి పలు ఆధారాలు లభించిన నేపథ్యంలో.. కేసులో వారి పేర్లను చేర్చాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయాలని, వారి స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
‘ట్యాపింగ్’లో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ వేగం పెంచింది. ఎస్ఐబీకి చీఫ్‌గా వ్యవహరించిన ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు బృందంలో పనిచేసిన మరి కొందరు అధికారులను శుక్ర, శనివారాల్లో ప్ర శ్నించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న శనివా రం సిట్ ఎదుట హాజరుకాగా.. మరో అదనపు ఎస్పీ భుజంగ్రావును అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైద రాబా ద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతా ల్లో ఈ వ్యవహారంతో సంబంధమున్న వారి నివాసాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఫోన్లతో మొదలుపెట్టి.. నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్ల లో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది. దీనివల్ల ఒనగూ రుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకు లు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చే సేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేప థ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సా ఫ్ట్‌వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం. ‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు! కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయ కుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం. అమెరికా వెళ్లిపోయిన ఆ ఇద్దరు..: డీఎస్పీ ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడగానే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు దేశం దాటేశారు. ఈ వ్యవహారంపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదై, ప్రణీత్‌రావును అరెస్టు చేశాక హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఫార్మా కంపెనీ నిర్వహించే తమ సన్నిహితుడి వద్ద ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. విచారణలో కీలక అంశాలు.. సిట్ అధికారులు శుక్ర, శనివారాల్లో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ్రావులను విచారించారు. ప్రభాకర్‌రావు హయాంలో తిరుపతన్న ఎస్ఐబీలో, భుజంగ్‌రావు సాధారణ ఇంటెలిజెన్స్‌లో పొలిటికల్ వింగ్‌ను పర్యవేక్షించారు. వీరి నుంచి సిట్ అధికారులకు ట్యాపింగ్‌కు సంబంధించి కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ఇక ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుతోపాటు అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఇతరుల నివాసాలు కలిపి మొత్తం 10 చోట్ల సిట్ అధికారులు శనివారం సోదాలు చేశారు. నాలుగైదు నెలల ముందు నుంచే డేటా ధ్వంసం నిందితుడు ప్రణీత్‌రావు, అనుమానితుల వి చారణ, సేకరించిన ఆధారాలన్నింటినీ విశ్లే షించినా ప్రభాకర్‌రావు బృందం ఎందరి ఫో న్లను ట్యాప్ చేసిందనేది చెప్పలేకపోతున్నా మని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాజ కీయ అవసరాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కోసం ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ల ట్యా పింగ్ జరిగిందని.. ఆ డేటాను కొందరు ప్రైవే ట్ వ్యక్తులకూ కాపీ చేసి ఇచ్చారని తెలుస్తోందని తెలిపారు. ప్రణీత్‌రావు తదిత రులు గత ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నుంచే డేటాను ధ్వంసం చేయడం మొదలెట్టా రని.. డిసెంబర్ 4 రాత్రి హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం అందులో భాగమేనని సమాచారం. హార్డ్‌డిస్క్‌లతో పాటు హ్యాకింగ్ ఉపకరణాలు, సాఫ్ట్వేర్లనూ ధ్వంసం చేశారా? అనేది తేలాల్సి ఉంది. -
Phone Tapping Case: నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్‌రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త, కర్మ, క్రియ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే అని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. నిఘా ముసుగులో ప్రభాకర్&టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌లు చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున్న బ్లాక్ మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత అధికార పార్టీతో అంటకాగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేపిస్తూ వచ్చారు. నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో.. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఇక.. ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ టీంకు రవి పాల్ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్ సూచన మేరకే సూట్‌కేసులో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేత ఇళ్ల వద్ద ఎస్ఐబీ టీం మాటు వేసేది. ట్యాపింగ్ ఎంత పక్కాగా జరిగేదంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనల కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందా బృందం. మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా.. వ్యాపారస్తులను సైతం ప్రభాకర్ బృందం టార్గెట్ చేసింది. సుమారు 30 మందికిపైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి.. అక్రమంగా ఫోన్ల ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా.. రూ. 500-600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజా సోదాలు జరిగినట్లు సమాచారం. సంబంధిత వార్త: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ప్రణీత్‌పై వేటుతో అప్రమత్తమై.. ప్రభాకర్‌రావు తెలంగాణ ఏర్పడ్డాక సీసీఎస్ డీసీపీగా పని చేశారు. 2020లో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గతేడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్ పోస్టుకు ప్రభాకర్ రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావుపై వేటు పడింది. ప్రణీత్‌రావు ప్రభాకర్‌రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్‌రావు అప్రమత్తం అయ్యారు. కుటుంబంతో విహరయాత్ర పేరుతో హైదరాబాద్ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. ప్రభాకర్‌రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. -
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం. హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి ఎస్ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ (ఎల్ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది. కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్ టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు 2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
అన్ని వేళ్లూ అటు వైపే!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ‘సైన్యానికి’, నల్లగొండ జిల్లాకు లింకు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు గతంలో ఆ ఉమ్మడి జిల్లాలో పని చేసిన వాళ్లే కావడం గమనార్హం. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్ అధికారులు మూడో రోజైన మంగళవారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. మరోపక్క ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లను సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు 2014కు ముందు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్స్ చాలా తక్కువ చేశారు. అలాంటి వాటిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీ కూడా ఒకటి. ప్రభాకర్‌రావుకు ప్రణీత్ అక్కడే పరిచయమైనట్లు తెలిసింది. అతడితోపాటు ఎస్ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావుకు, కొందరు రాజకీయ నాయకులకు ప్రైవేట్ సైన్యంలా పని చేసిన అనేక మంది అధికారులు ఆయన హయాంలో నల్లగొండ జిల్లాలో పని చేసిన వాళ్లే అని పోలీసులు చెబుతున్నారు. అలా తనకు నమ్మకస్తులుగా మారిన కొందరిని ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ఆ విభాగంలోకి తెచ్చుకున్నారు. వీళ్లందరూ అక్రమ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇలాంటి అధికారుల్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం వరంగల్ పరిధిలో పని చేస్తున్నారు. విదేశాల నుంచి సాఫ్ట్వేర్లు... ప్రభాకర్‌రావుతోపాటు ఓ కీలక రాజకీయ నేత ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు అండ్ టీమ్ సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే అక్రమంగా ట్యాపింగ్ చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను విదేశాల నుంచి ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎస్ఐబీ కార్యాలయంలో ప్రణీత్ ఏర్పాటు చేసుకున్న 17 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్వేర్లు ఉండొచ్చని, ఆ విషయం బయటకు రాకూడదని సంబంధిత హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రణీత్‌కు ఇన్ఫార్మర్గా పని చేసి, అతడితో కలిసి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ ఎస్ఐబీ కార్యాలయంలోపాటు సదరు మీడియా సంస్థ ఆఫీస్, వరంగల్, సిరిసిల్లలోనూ కొన్ని కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు మరో నేత సహకారంతో ఇవి ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉంచి ఏం చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
TS:సీఎం ఆదేశించినా ఆబ్సెంట్..రివ్యూకు రాని ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. ఇదీచదవండి..జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్‌లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్‌రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్‌రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్‌రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్‌గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్‌కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్‌లో ఆరుగురు, ట్రాన్స్‌కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. సాధ్యమైనంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి విన్నవించే సాహసం చేయలేకపోతున్నా. నా విన్నపాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రిని కోరుతున్నా..’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. తాను బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు వార్తలు వస్తే మరోలా భావించరాదని విద్యుత్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జెన్కో ఆడిటో రియంలో జరిగింది. మంత్రి జగదీ శ్‌రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా మంత్రి సమక్షంలో ప్రభాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విద్యుత్ ఉద్యోగు లతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పదవీ విరమణ ఆలోచనను విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు సభా వేదికపై నుంచి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గత నెల 5న విద్యుత్ సౌధలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో సైతం ప్రభాకర్‌రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించకపోవడంతో అప్పట్లో పెద్దగా చర్చ నీయాంశం కాలేదు. ప్రభాకర్‌రావు 2014 జూన్ 5 నుంచి జెన్కో, 2014 అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలోనే ఆయన సీఎండీగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత ఆయ న్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించినా, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. చివరిసారి పొడి గింపు సమయంలో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని పేర్కొంది. సూర్యుడి మీద ఉమ్మేయడమే: మంత్రి జగదీశ్‌రెడ్డి కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్‌స్టాండర్డ్ గాళ్లు.. సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారి మీద అవాకు లు చెవాకులు పేలడం సూర్యుడి మీద ఉమ్మేయడ మే నని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆశించినదానికంటే అధిక పీఆర్సీ: ప్రభాకర్‌రావు విద్యుత్ ఉద్యోగులు ఆశించినదానికంటే అధిక పీఆర్సీ ఇచ్చామని ప్రభాకర్‌రావు చెప్పారు. వెయిటేజీ లేకుండా 10 నుంచి 15 శాతం పీఆర్సీని ఉద్యోగులు ఊహించు కుంటే, జీతాలు మాత్రం 18.5 శాతం పెరిగాయని అ న్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా, కో–చైర్మన్ శ్రీధర్, కో–కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్‌రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్‌ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్‌కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
యాదాద్రి పవర్ కీర్తి కాంతులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యావత్ దేశం కీర్తి ప్రతిçష్టలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే పవర్ ప్రాజెక్టును చేపట్టామని, రాష్ట్ర రైతులు, ప్రజా శ్రేయస్సును కాంక్షించి ఇలాంటివి ప్రభుత్వ రంగంలోనే చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో వేగం మరింత పెంచాలని, ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పవర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన.. మొదట పవర్ ప్లాంట్ ఫేజ్–1, యూనిట్–2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ అంతస్తులో ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం తీరుపై జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. అందులోని అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. నాలుగు గంటలకు పైగా సీఎం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ ప్రజలకు ఉపాధి కోసం.. ‘ప్లాంట్ ఆపరేషన్ నిమిత్తం కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఈ ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన నీటిని కృష్ణా నది నుంచి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశాం. పవర్ ప్లాంట్‌లో పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలి. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్‌లో సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు కేటాయించాలి. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలి. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాఫ్‌కు అవసరమైన క్వార్టర్స్ నిర్మించాలి. టౌన్షిప్ నిర్మాణంలో బెస్ట్ టౌన్ ప్లానర్స్ సేవలను వినియోగించుకోవాలి..’ అని కేసీఆర్ సూచించారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్ ప్లాంట్ వరకు ఏడు కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల సీసీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే డిసెంబర్ కల్లా రెండు యూనిట్లు పూర్తి ► 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో ఒక యూనిట్ 2023 సెప్టెంబర్ నాటికి, మరొకటి డిసెంబరు నాటికి పూర్తవుతాయని ముఖ్యమంత్రికి ప్రభాకర్‌రావు వివరించారు. 2024 మార్చిలో మూడో యూనిట్, 4, 5 యూనిట్లు అదే ఏడాది జూన్‌లో పూర్తవుతాయని తెలిపారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్నారు. కాగా ప్లాంటు నిర్మాణం జరుగుతున్న తీరుపై ప్రభాకర్‌రావును సీఎం అభినందించారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలి ► ‘యాదాద్రి పవర్ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన రైతులతో పాటు, గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు సహకరించిన రైతుల పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో పాటు, స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన ముఖ్యమంత్రి.. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్రనాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, వెలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సీఎం వచ్చారన్న సమాచారంతో మండలంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంలోని భూనిర్వాసితులు పవర్‌ప్లాంట్ వద్దకు చేరుకుని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని, ఇంటికోఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా: ప్రభాకర్‌రావు
కోటపల్లి (చెన్నూర్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలంగాణ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సిబ్బంది వివరాలు, పనితీరు, స్టేషన్ పరిసరాలు, సరిహద్దు ప్రాంతాలపై ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోని ఫెర్రి పాయింట్ల వివరాలు, మావోయిస్టు ప్రభావిత గ్రా మాలు, ఇక్కడి అటవీప్రాంతంపై ఆరా తీశారు. సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అల సత్వం ప్రదర్శించవద్దని సూచించారు. సానుభూతిప రులు, మిలిటెంట్లు, మావోయిస్టులకు సహకరించే వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మావోయిస్టుల కట్టడి లో తెలంగాణ పోలీసులు పూర్తిగా సఫలీకృతం అయ్యా రని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరి ధిలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్ర మంలో మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ నరేందర్, సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్, నరేశ్ పాల్గొన్నారు. -
17 వేల మెగావాట్ల సరఫరాకు సిద్ధం: ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,000 మెగావాట్లకు పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధతతో ఉన్నా మని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,333 మెగావాట్ల విద్యుత్ లభ్యత (కాంట్రాక్ట్‌డ్ కెపాసిటీ) ఉందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. -
‘యాదాద్రి ప్లాంట్’ను గడువులోగా పూర్తిచేయాలి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యంపై జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్ పనులపై శుక్రవారం ఆయన బీహెచ్ఈఎల్ డైరెక్టర్ ఉపేందర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ కోపికర్తో సమీక్ష నిర్వహించారు. కూలింగ్ టవర్లు, కోల్/యాష్ ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, వేగం పెంచాలని కోరారు. అలాగే అన్ని యూనిట్లలో పనులు నిరంతరాయంగా జరగాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జూన్ నాటికి యాదాద్రి కేంద్రంలోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు మూడో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయనకు బీహెచ్ఈఎల్ డైరెక్టర్ హామీ ఇచ్చారు. -
మార్చి 2024లోగా యాదాద్రి ప్లాంట్ పూర్తి చేయాలి
సాక్షి,హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని 2024 మార్చినాటికి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులను కోరారు. బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన ఇక్క డ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను కొనాల్సి వస్తోందన్నారు. కాబట్టి యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. -
త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఖాళీ ఏఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. సోమ వారం విద్యుత్‌సౌధలో టీఎస్ఈఏఈఏ డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి సంస్థలను దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో పనులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉత్తర డిస్కంతో సమానంగా దక్షిణ డిస్కంలో కాంట్రాక్ట్ పనుల ధరలను సవరించాలని కోరింది. అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో సమావేశమయ్యారు. పనుల అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్ఐ, సెస్, కాంట్రాక్టర్ల అలవెన్సులను కలపాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, సంయుక్త కార్యదర్శి సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు పాల్గొన్నారు. -
ఇలకు దిగిన ప్రేమ
క్రిస్మస్ సమయంలో చర్చిలపై, ఇండ్లపై, వీధులలో, క్రిస్మస్ ట్రీలపై ప్రజలు ఆనందోత్సాహాలతో స్టార్స్ అలంకరిస్తారు. దీనికి కారణం యేసు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించి, స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టిన రాత్రి ఆకాశంలో ఒక దేదీప్య తార వెలిసింది. దేవుడే మానవావతారుడై భూమిపై వెలశాడు. క్రిస్మస్లో వెలిగించే రంగురంగుల విద్యుత్ దీపాల ప్రకాశం, నక్షత్రం, పెద్ద చిన్న తారలతో చాలా ఆత్మీయ భావాలు ఇమిడి ఉన్నాయి. కోట్లాది లెక్కించలేని నక్షత్రాలు గగనంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రం ప్రత్యేకం. దేవుని నమ్మిన అబ్రహాం సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరిస్తారని, ఆయన సంతతి నుండి లోక రక్షకుడు ఉదయిస్తాడని నిర్ధారణ అయింది. ఈ తార మిగిలిన వాటి నుండి తగ్గించుకుని కిందకి దిగి వచ్చాడు. మనం కూడా పాపం నుండి, చెడు నుండి వేరు కావాలి. యేసు సాత్వికుడై దాసుని రూపం ధరించాడు. మనుష్యులు పరలోకానికి దారి చూడాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. మోసగాడైన యాకోబులో ఉదయించిన నక్షత్రం రాజును పోలిన ఇశ్రాయేలీయులనుగా మనుష్యులను మార్చడానికి క్రీస్తు వచ్చాడు. దేవుని దూతలు వేరు, మోసం చేసే తేజోనక్షత్రం సాతాను వేరు. నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను’ అని యేసు చెప్పాడు (ప్రకట:22:16). దారి చూపు వెలుగును వెంబడించు వారు గుంటలో పడరు. పాపమున్న చోటను నడువరు. అందువలన యేసు శిశువు నుండి సిలువ వరకు అక్కడి నుండి పునరుత్థానుడై వెళ్లువరకు ‘నేను లోకానికి వెలుగునై ఉన్నాను‘ అని తెలిపాడు. యేసు నుండి రక్షించబడిన వారు నక్షత్రాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు’ (దానియేలు 12:3) మరణించినా జీవించునట్లు దారి చూపు వారు వీరే. మోషే, దానియేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, ఎస్తేరు లాంటి బైబిలు వ్యక్తులు అట్టివారే. ఏ నక్షత్రాన పుట్టామనేది ప్రాముఖ్యం కాదు. కాని క్రిస్మస్ నక్షత్రాన్ని వెంబడిస్తే ప్రేమ, నీతి, పరిశుద్ధత, మంచి తండ్రిగా, తల్లిగా, నాయకుడి మాదిరిగా, మదర్ థెరిస్సావలె ప్రకాశిస్తారు. ‘కాంతి గల నక్షత్రాల్లారా, మీరందరూ ఆయనను స్తుతించండి (కీర్తనలు 148:3) అని కీర్తనకారులు పాడినారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మారరాదని బైబిలు హెచ్చరిస్తుంది. బైబిల్ ఎవరి చేతిలో ఎవరి హృదయంలో ఉండునో వారు ప్రకాశించే దివిటీలు. జాలరి నుండి శిష్యునిగా మారిన పేతురు ‘తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచితే మీకు మేలు’ (2 పేతురు 1:19) అని రాశారు. లోకం హత్యలతో, అత్యాచారాలతో, ధనాశతో, దుర్వ్యసనాలతో, అసమాధానంతో చీకటిలో ఉన్నప్పుడు, అట్టి జనం మధ్యకు మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుతున్నారు (ఫిలిప్పీ 2:16) అని పరిశుద్ధ పౌలు తెలిపాడు. విద్యలో, నీతిలో, మాదిరిలో, ప్రావీణ్యతలో గొప్ప తారలుగా మనుషుల్ని మార్చాలి. అమెరికా అంతర్యుద్ధంలోనికి తమ పిల్లలను పంపేవారు, వారు చనిపోయినప్పుడు ఒక ఎర్రటి నక్షత్రం కట్టుకొనేవారట. అయితే ఒక తండ్రి, కుమారుని నడిపిస్తూ, రెండు ఎత్తైన కట్టడాల మధ్య ఆకాశంలో బంగారు వర్ణ నక్షత్రం చూచి కుమారుడు, ‘నాన్న! దేవుడు తన కుమారుని యుద్ధానికి పంపాడు’ అన్నాడు.‘ఈ స్టార్ వార్‌లో సిలువలో సాతాను ఓడిపోయాడు. యేసు మృత్యుంజయుుడై గెలిచాడు గనుక నేటికీ వెలుగుల క్రిస్మస్. ‘దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపాడు’. (1 యోహాను 4:10). ఇది సజీవ క్రిస్మస్ తార, నేటికీ ప్రకాశించి అనేకులకు దారి చూపుతోంది. ఈ లోకం శాశ్వతం కాదు. ధనం, గౌరవం, సంపద, ప్రఖ్యాతి ఎంత ఉన్నా, రెండవ రాకడ ఆసన్నమయే సమయంలో ఏవీ ఎన్నతగినవి కావు. యేసు మొదటి రాక క్రిస్మస్ పాపులను రక్షించడానికి ప్రభువు రెండవ రాకడ తను నమ్మిన పరిశుద్ధులను నిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్లడానికి ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి (మత్తయి 24: 29) అని ప్రభువే తెలిపాడు. ఎంత గొప్పవాడైనా బెత్లహేం నక్షత్రం వలె పని అయిన తరువాత కనుమరుగవుతుంది. ఇది సత్యం. క్రిస్మస్ నక్షత్రాలు, పండుగ సందడి, వ్యాపార సమయం అయిన తరువాత పాతబడి పనికి రాకపోవచ్చు గాని, కుటుంబం, కుమారులు, కుమార్తెలు, సత్ప్రవర్తన, పరిశుద్ధత, ఇతరులకు దారి చూపుతూ బతికితే... నిరంతరం నిలుచు నక్షత్రాలుగా ఉంటారు. ‘నీతిమంతులైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు’ అదే నిత్య క్రిస్మస్ ఆనందం. – తంటిపూడి ప్రభాకరరావు -
పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది దసరా పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రాంతీయ అధ్యక్షుడు తఖీ, ఉపాధ్యక్షుడు వి.దానయ్య శుక్రవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావును కలిసి పండుగ ప్రోత్సాహకాలు అందజేయాలని వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది పండుగ ప్రోత్సాహకాలు అందజేయలేమని ప్రభాకర్‌రావు వారికి వివరించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 7–15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిరీత్యా గతేడాది నుంచి ప్రోత్సాహకాలను నిలిపివేశారు. -
సంతోషం, సంతృప్తి... సాంకేతికత లక్ష్యం
సమాజంలో మనుషుల జీవనం నిరంతర ప్రవాహం. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగైన జీవనం సాగించాలనే తపన సహజం. మానవాళి అవసరాల్ని తీర్చే సాధనాలు సమకూరితేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు దోహ దపడేది శాస్త్ర, సాంకేతికత. వర్త మాన అవసరాలు తీర్చుతూనే భావి భారతంలో ప్రజలు మెరుగైన జీవనం సాగించేలా శాస్త్ర, సాంకేతికతపై పూర్వ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దృష్టి పెట్టారు. సై¯Œ ్స అండ్ టెక్నాలజీ ద్వారానే మెరుగైన, సంతోషకరమైన జీవనం సాధ్యమవుతుందని విశ్వసించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా మనిషికి తన పట్ల, ప్రపంచం పట్ల ఆలోచించే దృక్పథం మారుతుందన్న నెహ్రూ మాటల్ని పీవీ గుర్తుచేసేవారు. జైపూర్‌లో జరిగిన సైన్ ్స కాంగ్రెస్ వేదికపై పీవీ ప్రసంగం సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆయన దార్శనికతకు నిదర్శనం. సైన్స్ అండ్ టెక్నాలజీతో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా మార్గాలు అన్వేషించాలని ఈ వేదికపై నుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. పూర్వకాలంలోనే మన వద్ద మెరుగైన సాంకేతిక నైపుణ్యం ఉందని చెబుతూ పలు ఉదాహరణల్ని పేర్కొన్నారు. రాజస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ కాలువల ద్వారా జరుగుతున్న సమర్థ నీటి పారుదల ఇందుకు నిదర్శనమని చెప్పారు. భూమి ఉపరితలం మీదనే కాకుండా భూగర్భంలోనూ నీటి ప్రవాహం ఉంటుందని మన పూర్వీకులకు తెలుసుననీ; అలాంటి విజ్ఞానానికి రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం కూడా తోడయితే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. గత వైభవం నుంచి మనం స్ఫూర్తి పొందుతున్నట్టుగానే వర్తమానంలో మనం చేసే కృషి నుంచి భావితరాలు స్ఫూర్తి పొందేలా విజ్ఞాన సంపద పెరగాలని చెప్పారు. శాటిలైట్, మిస్సైళ్లను ప్రయోగించడంలో భారత్ విజయాలు ఇందుకు నిదర్శనమని వివరించారు. న్యూక్లియర్ రియాక్టర్లు, కమ్యూ నికేషన్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, గైడెడ్ మిస్సైళ్ల తయా రీలో భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. ఇంతటి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి ఎలా సాధించవచ్చు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా దొరకాల్సి ఉందని అన్నారు. శాస్త్ర, సాంకేతికత ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం గురించి ఆలోచించాలని శాస్త్రవేత్తలకు సూచిస్తూనే పీవీ తన మదిలోని ఆలోచనల్ని పంచుకున్నారు. భారత్ నుంచి ఎగుమతుల్లో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, జౌళి, వస్త్రాలు, జెమ్స్, నగలు, తోలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ద్వారా ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎగు మతుల్లో పురోగతి అవసరమని ఉద్ఘాటించారు. ‘దేశంలో ఏటా ధాన్యం, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల విలువ ప్రోత్సాహకరంగా ఉన్నా ఆహార తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌కు మిషనరీ అవసరం. వస్త్ర, తోలు, గని పరిశ్రమల స్థితి కూడా ఇలాగే ఉంది. తగిన టెక్నాలజీ ఉంటే ఉత్పత్తులను వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌గా తయారు చేయవచ్చు. దేశంలోని పారి శ్రామిక ఉత్పత్తుల్లో చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యం 40 శాతం ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రంగానికి టెక్నాలజీ తోడయితే చిన్న తరహా పరిశ్రమలు అద్భుత ప్రగతి సాధించగలుగుతాయి’ అని చెప్పారు. పశ్చిమ దేశాలైనా, జపాన్‌లో అయినా ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరి గింది. ఇది భారత్‌లోనూ జరగాల్సి ఉందని అన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్ అండ్ డీ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందని కూడా చెప్పారు. ఇందులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం 15 శాతం కంటే తక్కువే. రీసెర్చ్ అండ్ డెవ లప్మెంట్ రంగంలో మెరుగైన మార్పులు సంభవించనున్నా యని ఆనాడే అంచనా వేశారు. భారత్ సాంకేతికంగా బల మైన దేశంగా ఎదగాలంటే ఆర్ అంyŠ డీ అనేది కేవలం పరిశ్రమల్లోనే కాకుండా విశ్వవిద్యాలయాల్లోనూ జరగాల్సిన అవసరం ఉందని 27 ఏళ్ల క్రితమే పీవీ చెప్పారు. యూని వర్సిటీల్లో జరిగే ప్రయోగాల కోసం పరిశ్రమలు పెట్టుబ డులు పెట్టాలని సూచించారు. 1986లో తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలోనూ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధాన ఆవశ్యకతను పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సై¯Œ ్స అండ్ టెక్నాలజీ ద్వారా ఆర్థిక ప్రగతి సాధించి, సంపద సృష్టించాలని పీవీ చెప్పారు. సృష్టించిన సంపద న్యాయబద్ధమైన పంపిణీ జరిగినప్పుడే ప్రతి ఒక్క రిలో సంతోషం కనిపిస్తుందని చెప్పిన దార్శనికుడు పీవీ. పి.వి. ప్రభాకరరావు వ్యాసకర్త పీవీ తనయుడు (ఇది పీవీ శతజయంతి సంవత్సరం) -
భయంతో కింద పడిపోయాడు: ఐజీ ప్రభాకర్‌రావు
-
‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3 లోపు తక్కువ ధరతో విక్రయించేందుకు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోవాలో ఎన్టీపీసీ నిర్వహించిన దక్షిణాది ప్రాంత వినియోగదారుల సమావేశానికి ప్రభాకర్‌రావు హాజరై ఆ సంస్థ సీఎండీ గురుదీప్ సింగ్‌తో చర్చలు జరిపా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం వచ్చే ఏడాది విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని ఈ సమావేశంలో గురుదీప్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్ల సౌర విద్యు త్ విక్రయించేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదనను తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులతో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మధ్య పెద్దగా బేధం లేకుండా పోయిందని ఈ సమావేశంలో సీఎండీ అభిప్రాయపడ్డారన్నారు. -
‘కేసీఆర్ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ సీఎండీలుగా నియమిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం వారిని తొలగించి పదవీ విరమణ చేసిన వారిని సీఎండీలుగా చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసుకుంటున్న అడ్డగోలు ఒప్పందాలపై ఐఏఎస్‌లు సంతకాలు పెట్టకపోవడంతోనే వారిని తొలగించి రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావు, గోపాలరావు లాంటి వారిని సీఎండీలుగా నియమించారని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలు 74 వేల కోట్లు అప్పులు తెస్తే.. కేవలం 35 కోట్లు మాత్రమే తెచ్చామని సీఎండీ ప్రభాకర్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావు దీనిపై వివరాలు బయటపెట్టాలని రేవంత్ సవాల్ చేశారు. ప్రభాకర్ రావు ఏదో నీతిమంతుడు అయినట్లు కొంతమంది చెంచాలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దోపిడియే లేకుంటే ప్రభుత్వం ఆధీనంలోని సంస్థల విద్యుత్ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతోందని నిలదీస్తే.. ఉద్యోగులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్ రావును విద్యుత్ సంస్థల సీఎండీగా నియమించడానికి అర్హతే లేదన్నారు. అర్హత లేని ప్రభాకర్ రావు కింద పని చేయలేక సమర్థవంతమైన ఐఏఎస్‌లు బదిలీలు చేయించుకొని వెళ్లిపోతున్నారన్నారు. కరెన్సీ కట్టల కోసం కేసీఆర్ విద్యుత్ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు మీద నిషేధం విధించినప్పుడు మాట్లాడని సంఘాల నేతలు నిన్న ఎందుకు రోడెక్కి ధర్నాలు చేశారని ప్రశ్నించారు. చెన్నూరులో ఒక అధికారి కేసీఆర్, కేటీఆర్ మీద మాట్లాడితే చర్యలు తీసుకున్నారు.. మరి నా గురించి ఇంత మంది ఉద్యోగులు మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను మొక్కలు అని ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని, ఏ తేదిలోపు చేయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేసీఆర్‌కు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోయిందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఆపార్టీలో స్థానం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. -
‘విద్యుత్’ సీఎండీల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు, టీఎస్ రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్యతో పాటు మరో 21 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారంతా తమ పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు పదవీకాలం వచ్చేనెల 4న ముగియనుండగా.. మిగిలిన సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం ఈ నెల 31తో పూర్తికానుండటంతో ప్రభుత్వం వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జెన్కో డైరెక్టర్లు పీహెచ్ వెంకటరాజం (హైడల్), ఎం.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్), ఎ.అశోక్‌కుమార్ (హెచ్ఆర్), బి.లక్ష్మయ్య (థర్మల్), ఎ.అజయ్ (సివిల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్ట్స్), టి.జగత్‌రెడ్డి(ట్రాన్స్మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), బి.నర్సింగ్‌రావు (గ్రిడ్ ఆపరేషన్), టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్ రెడ్డి (ఆపరేషన్స్), టి.శ్రీనివాస్ (ప్రాజెక్ట్స్), కె.రాములు (కమర్షియల్), జి.పర్వతం (హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు (పీఅండ్ఎంఎం), ఎస్.స్వామిరెడ్డి (ఐపీసీ), టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి.సంధ్యారాణి (కమర్షియల్), పి.గణపతి (ఐపీసీ, పీఏసీ), డి.నర్సింగ్‌రావు (ఆపరేషన్స్) పదవీకాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు. -
హైదరాబాద్‌కు ‘హై’పవర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. కొత్త టవర్లు నిర్మించకుండానే, కొత్త లైన్లు వేయకుండానే ప్రస్తుత లైన్లకు ‘హై టెంపరేచర్ లాసాగ్’ (హెచ్‌టీఎల్‌ఎస్) కండక్టర్లను అమర్చి హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ 220 కేవీ విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో రూ.1,100 కోట్లు ఆదా చేయడంతోపాటు మూడేళ్లు పట్టే పనిని 3నెలల్లో పూర్తిచేసింది. సామర్థ్యం పెంచేందు కు ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం ప్రారంభించారు. అధిక లోడ్ లైన్ల సామ ర్థ్యం పెంపుతో హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానున్నాయి. రూ.1,100 కోట్లు ఆదా..: పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ లోడ్ గల రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు తప్పట్లేదు. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్‌ను తీసుకొచ్చే మామిడిపల్లి– శివరామ్‌పల్లి, మల్కాపురం– షాపూర్‌నగర్, శంకరపల్లి–గచ్చిబౌలి లైన్లపై అధిక ఒత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా చేయడం వల్ల రూ.1,200 కోట్ల వ్యయం అవుతుంది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా రెట్టింపు చేసింది. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్‌పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కేవీ లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్‌కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది. టెస్ట్ రన్ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. 4 వేలకు పైగా డిమాండ్ తట్టుకునే సామర్థ్యం పెరిగింది. మూడేళ్ల వరకు ఢోకా లేకుండా హైదరాబాద్‌కు విద్యుత్ సరఫరా చేయొచ్చు. దీనికి రూ.100 కోట్ల వ్యయమైంది. 400 కేవీ రింగ్ ఏర్పాటు ‘హైదరాబాద్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్ర మలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతల్లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ ఏర్పాటు చేశాం. నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’ – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
విద్యుదుత్పత్తి పెరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుదుత్పత్తి జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్వంలో రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ కార్మాగారాన్ని శనివారం సీఎం సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు, ప్రస్తుత ఉత్పత్తి, భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే డిమాండ్ వంటి అంశాలపై వీరితో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావొచ్చిందని.. రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు వేగవంతమయ్యాయన్నారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని, దానికి దాదాపు 6వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా.. పునర్విభజన చట్టంలో 4వేల మెగావాట్ల పవర్ప్లాంట్లను కేటాయించినందున.. తెలంగాణ విద్యుత్ కర్మాగారానికి ప్రధానమంత్రి 2016 ఆగస్టులో శంకుస్థాపన చేశారని ఎన్టీపీసీ అధికారులు గుర్తుచేశారు. వేగంగా ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో అల్ట్రాసూపర్ టెక్నాలజీని వినియోగిస్తూ.. ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి ప్లాంట్‌ను అక్టోబర్ 2020లోగా.. 2,400 మెగావాట్ల సామర్థ్యమున్న రెండవ యూనిట్‌ను ఫిబ్రవరి 2021 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే.. నిర్ణీత గడువుకంటే ముందే ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం వారిని కోరారు. తెలంగాణలో రైతులకు సాగునీరందించడానికి గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం ఒకటే మార్గమని, దానికి విద్యుత్ అందించేందుకు ఎన్టీపీసీ సైతం సహకరించాలని సీఎం కోరారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్టీపీసీ ప్లాంట్ల ద్వారానే విద్యుత్ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరతాయని, ధర కూడా కలిసొస్తుందని సీఎం అన్నారు. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు.. ఈ విషయంపై సమన్వయం చేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. బొగ్గు విధానం మార్చాలి విద్యుదుత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో ఉత్పత్తి వ్యయం తగ్గించేలా సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానన్నారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఎన్టీపీసీ నుంచి 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సౌర విద్యుదుత్పత్తి కోసం ఎన్టీపీసీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు. విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతోందన్నారు. పీజీసీఎల్ విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్టీపీసీ సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు సీఎం అభినందించారు. బొగ్గు గనుల వద్దే ప్లాంట్లుండాలి ‘విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా.. 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్ ధర పెరుగుతుంది. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ విద్యుత్ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్‌హెడ్ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్కో సింగరేణి బొగ్గునే వాడుతోంది. రామగుండం ఎన్టీపీసీ కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా’అని సీఎం స్పష్టం చేశారు. 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ స్టేజ్–2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) పూర్తి కాలేదని అధికారులు సీఎంకు వెల్లడించారు. నిర్మాణానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్నప్పటికీ, పీపీఏ పూర్తయితేనే పనులకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈనెలలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో చర్చించి స్టేజ్–2కి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచే రామగుండం ఫర్టిలైజర్స్ రామగుండంలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్‌సీఐని తిరిగి తెరిపించేందుకు తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్‌సీఐఎల్ సీఈఓ రాజన్ థాపర్ చెప్పారు. రామగుండలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైతే.. తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సీఎం అన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ నాయకత్వంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందని ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కలెక్టర్ దేవయాని తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. కన్నెపల్లికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. దాదాపు 7గంటల పాటు ఆయన కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తారు. ఉదయం 6.30 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామి దర్శనం తర్వాత కన్నెపల్లికి అక్కడినుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తారు. మధ్యాహ్నం 1.30 వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనుల పరిశీలన, ప్రగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రామగుండంలో మధ్యాహ్న భోజనం, విరామం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరతారు. -
కాళేశ్వరానికి నిరంతరం కరెంటు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతరం విద్యుత్‌సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్‌కు నీళ్లు తరలించడానికి సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ పంపుహౌస్ వద్ద 134.8 మెగావాట్ల సామర్థ్యం గల పంపునకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో 400 కేవీ సబ్ స్టేషన్, నీటిపంపింగ్ వ్యవస్థను నియంత్రించే కంట్రోల్ రూమ్ ఉన్నాయి. అక్కడి విద్యుత్లైన్లు, మోటార్లు, టన్నెల్‌ను ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఏర్పాట్లపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పంపింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రాజెక్టు కోసం ప్రతి పంపుహౌస్ వద్ద డెడికేటెడ్ సబ్‌స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అం శాలపై ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నామన్నారు. పంపుసెట్ల పనితీరును ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నట్లు వెల్లడించారు. పంపుసెట్లకు అవసరమైన విద్యుత్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు భవిష్యత్తులో నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. నీటిని ఎత్తిపోయడం అత్యంత ముఖ్యం తెలంగాణకు లైఫ్‌లైన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రభాకర్‌రావు చెప్పారు. నీటిని లిఫ్టు చేయడానికి సకాలంలో సబ్ స్టేషన్లు నిర్మించి, లైన్లు ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. మిడ్‌మానేరుకు చేరిన నీరు అక్కడి నుంచి అంతగిరి రిజర్వాయర్ చేరుకుంటుంది. అంతగిరి నుంచి రంగనాయక్ సాగర్‌కు వస్తుంది. రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీరు చేరాలంటే 110 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 539.20 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపులతో లిఫ్టు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కోటి 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను బిగించారు. దీనికి కావాల్సిన విద్యుత్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు చంద్లాపూర్ లో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించారు. అక్కడే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో జేఎండీ సి.శ్రీనివాస రావు, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్ రెడ్డి, నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో జెన్కో సీఎండీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకరరావు బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మ్యాతో భేటీ అయ్యారు. సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, అధికారుల బృందాన్ని, తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో జోన్ ఇస్తున్న సహకారాన్ని ప్రభాకరరావు ప్రశంసించారు. ఇదే విధమైన సహకారాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దక్షిణ మధ్య రైల్వే కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మణుగూరు భద్రాద్రి పవర్‌ప్లాంట్, విష్ణుపురం యాదాద్రి పవర్‌ప్లాంట్, భూపాలపల్లి పవర్‌ప్లాంట్ వంటి విద్యుత్ ఉత్పాదక కేంద్రాల అనుసంధానంపై వారిద్దరూ చర్చించారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, చీఫ్ ఫ్రైట్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ బి.నాగ్యతో కూడా ప్రభాకరరావు సమావేశమై సరుకు రవాణాలో విశేషమైన రికార్డు సాధించినందుకు వారిని అభినందించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి దక్షిణ మధ్య రైల్వే రవాణా సౌకర్యం ద్వారా తెలంగాణ రాష్ట్ర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు గత సంవత్సరం 2,969 రేక్ బొగ్గు సరఫరా చేస్తే, ఈ సంవత్సరం 3,194 రేక్ బొగ్గును సరఫరా చేసింది. అంటే గత ఏడాది కంటే 225 రేక్‌లు అధికం. తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేను అనుసంధానించే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభాకరరావు కోరారు. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ దృష్ట్యా, పాల్వంచ వద్ద కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి అవసరమైన బొగ్గును పంపడానికి సరిపడినన్ని రేక్‌లను సరఫరా చేయాలని రైల్వే ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. -
ఎంఎస్ ప్రభాకర్ నామినేషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఎస్ ప్రభాకర్‌రావు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్‌కు అందజేశారు. మొదటి సెట్పత్రాలను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు గద్వాల్ విజయలక్ష్మి, మమతాగుప్తాలతో కలసి దాఖలు చేశారు. రెండోసెట్ నామినేషన్ పత్రాలను ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మాజీమేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ మహ్మద్ నజీరుద్దీన్లతో కలసి దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 5 చివరి తేదీ కాగా 6న పరిశీలన, 8న ఉపసంహరణ, అవసరమైన పక్షంలో 22న పోలింగ్ జరుగుతుంది. ఠీనియోజకవర్గంలో ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 14 మంది ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిధిలోని 84 మంది కార్పొరేటర్లు, 8 మంది కంటోన్మెంట్ బోర్డు సభ్యులు వెరసి మొత్తం 129 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
విద్యుత్‌పై మేధోమథనం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలు పనిచేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించామని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు పునరంకితం కావాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులైన ప్రభాకర్‌రావు నేతృత్వంలో జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు శనివారం ఇక్కడ సమావేశమై మేధోమథనం జరిపారు. ‘తెలంగాణ విద్యుత్ రంగానికి పునరంకితం’అన్న ప్రధాన ఎజెండాతో జరిగిన ఈ భేటీలో 24 గంటల విద్యుత్ సరఫరా, ఆదాయం పెంపు, నష్టాల తగ్గింపు తదితర కీలక అంశాలపై చర్చించారు. వచ్చే రబీ సీజన్లో గరిష్ట డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. లోటుపాట్లు సవరించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ల నిర్మాణం పురోగతిపై చర్చించారు. వచ్చే నెల 2,3 తేదీలలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన ధర్మాధికారి కమిటీ సమావేశం ఉన్నందున ఈ విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేశారు. ఈ ఏడాది వర్షాకాలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి పంపింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, విద్యుత్ సరఫరా వ్యవస్థ సర్వసన్నధ్ధం కావాలని నిర్ణయించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఇతర రంగాలకు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నందున గరిష్ట డిమాండ్ వచ్చే అవకాశం వుంది. ఈ డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు అనుసరించాల్సిన వ్యూçహాన్ని సమావేశంలో ఖరారు చేశారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించినందున, వారి సర్వీసు నిబంధనలను చర్చించి ఖరారు చేశారు. ‘రైతులకు 24 గంటల పాటు కరెంట్ అందించాలి. ఈసారి ఎత్తిపోతల పథకాలకు కూడా ఎక్కువ కరెంట్ అవసరమవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలు సరైన ప్రణాళికలు వేసుకుని ముందుకు పోవాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలు సాధించాయి. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు పునరంకితం కావాలి’’అని ప్రభాకర్‌రావు ప్రారంభోపన్యాసంలో చెప్పారు. ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.గోపాలరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ట్రాన్స్‌కో సీఎండీకి ఘన సన్మానం విద్యుత్ రంగంలో యాభై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును విద్యుత్ సంస్థల డైరెక్టర్లు శనివారం ఘనంగా సన్మానించారు. తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్న డైరెక్టర్లు..ప్రభాకర్ రావు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. -
50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారంతో విద్యుత్ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయన సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కేసీఆర్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు. రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఫర్ ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ పవర్ యుటిలిటీస్ 2013లో ఆయనకు ఇండియా పవర్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్‌ను ఆయనతో కట్ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
విద్యుత్ సరఫరాపై తిత్లీ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: తిత్లీ తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులపాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సూచించింది. సోమవారం విద్యుత్ సౌధలో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన టీఎస్పీసీసీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించి తిత్లీ తుపాను ప్రభావం వల్ల కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని రంగాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్, హైడల్ పవర్ స్టేషన్ల ద్వారా పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని థర్మల్ స్టేషన్లలో చాలినంత బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కేవలం రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారానే విద్యుత్ అందాల్సి ఉన్నందున ఏ ఒక్క పవర్ ప్లాంటులో కూడా ఏ ఒక్క యూనిట్‌లోనూ ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జెన్కో అధికారులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎంత దొరికితే అంత విద్యుత్‌ను ఎంత ధరైనా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇవీ ఇబ్బందులు.. తిత్లీ తుపాను వల్ల ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య విద్యుత్ సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు దేశంలో ఎటువైపు నుంచి కూడా విద్యుత్ అందడం లేదు. ఉత్తర–దక్షిణాది గ్రిడ్‌కు అంతరాయం ఏర్పడింది. తాల్చేరు–కోలార్, అంగూల్–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణకు రావాల్సిన 3 వేల మెగావాట్ల విద్యుత్ అందడం లేదు. దీనికి తోడు సెంట్రల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత వల్ల కూడా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ షేర్ కింద రాష్ట్రానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అందాల్సి ఉండగా, కేవలం 1,500 మెగావాట్లు మాత్రమే అందుతోంది. ఛత్తీస్‌గఢ్ ద్వారా 1,000 మెగావాట్లు రావాల్సి ఉండగా, కేవలం 350 మెగావాట్లు మాత్రమే వస్తోంది. ఒకవైపు బయట నుంచి రావాల్సిన విద్యుత్ రాకపోవడం సరఫరాపై ప్రభావం చూపుతుండగా, మరోవైపు ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 40 శాతం మేర పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 7,538 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌కు అది 10,600 మెగావాట్లకు చేరింది. ప్రజలు సహకరించాలి తిత్లీ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు రాష్ట్రంపైనా ఉంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థల అధికారులు సిద్ధం గా ఉండాలి. లైన్ల పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారింది. మరో 3 రోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. విద్యుత్ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి కరెంటు కోతలు లేకుండా చూస్తున్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. – దేవులపల్లి ప్రభాకర్‌రావు,సీఎండీ జెన్కో, ట్రాన్స్‌కో ‘అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా’ ఎలాంటి అంతరాయం లేకుండా గ్రేటర్ వాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. టీఎస్జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయా సర్కిళ్ల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో రఘుమారెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం గ్రేటర్లో 55.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం, డిస్కం పరిధిలో 155 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతుందని చెప్పారు. తిత్లీ తుపాన్ ప్రభావం వల్ల ఉత్తరాది నుంచి రావాల్సిన విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు రఘుమారెడ్డి తెలిపారు. -
నెలాఖరులోగా విద్యుత్ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్సీ) గురువారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్ మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఫిట్మెంట్కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై విద్యుత్ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు... విద్యుత్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్ కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేసింది. -
ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం
-
విద్యుత్ వినియోగంలో కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ వినియోగంలో రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 7.33 గంటల సమయంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,429 మెగావాట్లకు ఎగబాకి గత మార్చి 8న నమోదైన 10,284 మెగావాట్ల పాత రికార్డును చెరిపేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. దీనిపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సౌధలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోవడం రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని అభివర్ణించారు. విద్యుత్ డిమాండ్ 12,500 మెగావాట్లకు పెరిగిన సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సంసిద్ధతతో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతిమాట నిజమవుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ గరిష్ట డిమాండ్ 6,660 మెగావాట్లు మాత్రమే ఉన్నా, అప్పట్లో అవసరాలకు సరిపడా విద్యుత్ లేక కోతలు విధించాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే కోతలను అధిగమించామని చెప్పారు. పవన, సౌర విద్యుత్‌కు మళ్లీ టెండర్లు లేవు.. నిబంధనల ప్రకారమే ప్రైవేటు సౌర, థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గాయని, మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పుడు టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న డెవలపర్లు గడువులోగా సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకపోయినా, రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఉన్నా మళ్లీ అవే ధరలతో గడువు పెంచారని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి బదులిస్తూ ఈ అంశం ఈఆర్సీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల కోసం మళ్లీ టెండర్లు నిర్వహించే యోచన లేదన్నారు. కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణం రెండు మూడేళ్లలో పూర్తి అయితే, సాగునీటి ప్రాజెక్టుల విద్యుత్ డిమాండ్ 10,852 మెగావాట్లకు పెరగనుందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 30 శాతం గృహాలు, 30 శాతం పరిశ్రమలు, 30 శాతం వ్యవసాయ రంగాల వాటా ఉండగా, మిగిలిన 10 శాతం వాటాను వాణిజ్య, ఇతర రంగాల వారు వినియోగించుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు అశోక్‌కుమార్, సచ్చిదానందం, రాధాకృష్ణ, వెంకటరాజం, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం: సీఎం కేసీఆర్ 10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును, విద్యుత్ సంస్థల సిబ్బందిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్‌రావు అనుభవం తెలంగాణలో విద్యుత్ విజయాలకు అక్కరకొచ్చిందని సీఎం ప్రశంసించారు. జెన్ కో, ట్రాన్స్ కోలకు ఒకరే అధిపతిగా ఉంటే, సమన్వయం బాగుండి విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తాను నమ్మానని, నేడు అదే నిజమైందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో చిమ్మచీకట్లు తప్పవనే జోస్యాలను అబద్ధమని తేల్చి.. నేడు అన్ని రంగాలకు 24 గంటల సరఫరా చేసే స్థితికి చేరడం అందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం జాతీయ సగటుకన్నా 33 శాతం అధికంగా ఉండటం.. తెలంగాణ ప్రగతికి సంకేతమని చెప్పారు. తెలంగాణలో నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉండటం, భవిష్యత్తులోనూ కరెంటుకు ఢోకా లేదనే పరిస్థితి ఏర్పడడం వల్ల పలు పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. ఇది అంతిమంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయ దిగుబడులు సైతం పెరుగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలకు కావల్సిన విద్యుత్‌ను సరఫరా చేయడానికి గడువు కన్నా ముందే ఏర్పాట్లు పూర్తి చేశారని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయన్నారు. ఖరీఫ్‌లో 11,500 గరిష్ట డిమాండ్ ఏర్పడుతుందనే అంచనా ఉందని, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. -
విద్యుత్ వాహనాలదే భవిష్యత్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల పరిశ్రమ పురోగతిలో ఉందని, దీనికి తగ్గట్లుగా విద్యుత్ సంస్థలు సంసిద్ధం కావాలని దక్షిణాది విద్యుత్ సంస్థల సంఘం(ఎస్సార్పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. పాండిచ్చేరిలో శనివారం జరిగిన ఎస్సార్పీసీ 33వ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధి పతులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సమస్యలు, ఇతర అంశాలపై ప్రభాకర్‌రావు స్పందించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణహిత వాహనాల వాడకాన్ని అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, భారత్‌లో కూడా విద్యుత్ వాహనాల పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 2030 నాటికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలో నూరు శాతం, వ్యక్తిగతస్థాయిలో 40 శాతం విద్యుత్ వాహనాల వినియో గం ఉండాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. పెట్రోల్ పంపుల మాదిరిగా వాహనాలకు విద్యుత్ చార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. విద్యుత్ సంస్థలు సంసిద్ధం కావాలని, చార్జింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆయా రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లతో సంప్రదించి, విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసే ఏజెన్సీలను ప్రత్యేక విద్యుత్ వినియోగదారులుగా గుర్తించాలని, వారికి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించాలన్నారు. విద్యుత్ రంగంలో సైబర్ భద్రతకు సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అప్రమత్తంగా ఉందని, విద్యుత్ సంస్థలకు సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. 24 గంటల విద్యుత్‌పై ఎస్సార్పీసీ హర్షం రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంపై ఎస్సార్పీసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ డైరెక్టర్ తంగపాండ్యన్ కొనియాడారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, పాండిచ్చేరి, రైల్వేస్, కోల్ ఇండియా, పీజీసీఎల్ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా అభినందనలు తెలిపారు. సమావేశంలో ఎస్సార్పీసీ సభ్యకార్యదర్శి ఎస్ఆర్ భట్, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి విద్యుత్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, రైల్వేస్, కోల్ ఇండియా, పీజీసీఎల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
అనుమానాలుంటే తీరుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్, సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిపట్ల ఎవరికైనా అనుమానాలుంటే, ఏ వేదిక నుంచైనా నివృత్తి చేసేందుకు సిద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. డాక్యుమెంట్లను ఆధారంగా చూపి స్పష్టత ఇస్తామని చెప్పారు. నిరంతర విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీలేదని, దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో మిగులు విద్యుత్ లభ్యత ఉండడంతో సాధ్యమైందని కాంగ్రెస్, టీ జేఏసీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. పూర్తి సమాచారం తెలియకుండానే కొందరు అలా మాట్లాడుతున్నారని అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పవర్ ఎక్సే ్చంజీల్లో చౌక గా విద్యుత్ లభ్యత ఉన్నా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాత్కాలిక ఒప్పందాల ద్వారా వ్యయసగటు యూనిట్‌కు రూ.3.87 అయితే, పవర్ ఎక్స్ఛేంజీల్లో రూ.3.98 ఉందన్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లను పారదర్శకంగా జరుపుతున్నామని పేర్కొన్నారు. 24 గంటలపై పునరాలోచన లేదు.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై పునరాలోచన లేదని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి తమకు అలాంటి సూచనల్లేవన్నారు. మోటార్ల ఆటోస్టార్టర్లను తొలగించాలని రైతులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఎక్కడా బలవంతం పెట్టడం లేదని చెప్పారు. ఆటోస్టార్టర్ల నష్టాలను వివరిస్తున్నామన్నారు. వాటి తొలగింపుపై సీఎం త్వరలో రైతులకు విజ్ఞప్తి చేయనున్నారని తెలిపారు. వ్యవసాయానికి 2016–17లో 14,300 మిలియన్ యూనిట్లు, 2017–18లో 15,600 ఎంయూ విద్యుత్ సరఫరా చేయగా, 2018–19లో 16,853 ఎంయూలను సరఫరా చేయాల్సి ఉంటుంద ని అంచనా వేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పెరిగే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని చెప్పారు. అందుకే రాష్ట్రం లో విద్యుత్ చార్జీలను పెంచడం లేదన్నారు. విద్యుత్ సబ్సిడీని రూ.5,400 కోట్లకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారన్నారు. నిరంతర విద్యుత్‌తో గ్రామీణ ప్రాంతాలకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశముందన్నారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై ఇతర రాష్ట్రాల అధికారులు తనకు ఫోన్ చేసి వివరాలు సేకరించారని వెల్లడించారు. ఏఈ సిలబస్‌లో మార్పులుండవు ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం కొత్త సిలబస్‌తోనే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. అభ్యర్థులు కోరుకున్న సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. గేట్ సిలబస్ ఆధారంగానే రాత పరీక్ష ఉంటుందన్నారు.