
కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న తెలంగాణ ఎస్‌ఐబీ చీఫ్
కోటపల్లి (చెన్నూర్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలంగాణ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సిబ్బంది వివరాలు, పనితీరు, స్టేషన్ పరిసరాలు, సరిహద్దు ప్రాంతాలపై ప్రస్తుత పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోని ఫెర్రి పాయింట్ల వివరాలు, మావోయిస్టు ప్రభావిత గ్రా మాలు, ఇక్కడి అటవీప్రాంతంపై ఆరా తీశారు. సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అల సత్వం ప్రదర్శించవద్దని సూచించారు. సానుభూతిప రులు, మిలిటెంట్లు, మావోయిస్టులకు సహకరించే వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. మావోయిస్టుల కట్టడి లో తెలంగాణ పోలీసులు పూర్తిగా సఫలీకృతం అయ్యా రని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో సందర్శించి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని చట్టపరి ధిలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్ర మంలో మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ నరేందర్, సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్, నరేశ్ పాల్గొన్నారు.