నా ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోండి
‘ట్యాపింగ్’కేసులో రాయబారాలు ప్రారంభించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
ఇప్పటికే ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి భంగపాటు
ఇప్పుడు ప్రభుత్వ పెద్దల దగ్గరకు ఆయన ప్రతినిధులు
ఈ కేసులో జోక్యం చేసుకోబోనన్న ఓ ముఖ్య నేత
కొనసాగుతున్న ఇద్దరు అదనపు ఎస్పీల విచారణ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ట్యాపింగ్ కేసులో తన చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో విదేశాల్లో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు రాయబారాలు మొదలు పెట్టారు. అయిందేదో అయింద ని.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కఠిన చర్యలు తీసుకో వద్దని కోరుతూ కొందరు ప్రతినిధులను ప్రభుత్వ పెద్దల వద్దకు పంపినట్టు తెలిసింది.
కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ‘ముఖ్య’ నాయకుడు ఈ దశ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసి నట్టు సమాచారం. మరోవైపు తమ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను సిట్ అధికారులు ఆదివారం కూడా లోతుగా ప్రశ్నించారు.
ఉన్నతాధికారి వద్ద భంగపడటంతో..
ఎస్‌ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాల ధ్వంసంపై అంతర్గత విచారణ గత ఏడాది డిసెంబర్‌లోనే మొదలైంది. దీనిపై ఆ విభాగంలోని తన మనుషుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్‌రావు.. ఓఎస్డీ పదవికి రాజీనామా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లిపోయారు. తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడం, ప్రణీత్‌రావు అరెస్టు తదితర పరిణామాలు జరిగాయి.
పంజగుట్ట పోలీసులు గత నెల మూడో వారంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఓ మీడియా అధినేతలపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్నవారి ఇళ్లలో సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించారు. దీనితో ఇలాంటి చర్యలు వద్దంటూ అమెరికా నుంచే ప్రభాకర్‌రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. ఆయన సమాధానం విని కంగుతిని ఫోన్ కట్ చేశారు.
రాధాకిషన్‌రావు అరెస్టుతో మారిన సీన్..
తర్వాత కొందరితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ప్రభాక ర్‌రావు మేకపోతు గాంభీ ర్యం ప్రద ర్శించారు. అక్రమ ట్యాపింగ్‌కు తానే ఎలా బాధ్యు డిని అవుతానని? తనపై ఉన్న అదనపు డీజీ, డీజీపీలకూ బాధ్యత ఉంటుందనే ధోరణిలో మాట్లాడారు. ఎస్‌ఐ బీ, ఇంటెలిజెన్స్‌ల్లో పనిచేసిన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతోపాటు మరో కీలక నిందితుడిగా ఉన్న హైదరా బాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్ రావునూ అరెస్టు చేశారు. దీనితో ప్రభాకర్‌రావు హడలిపో యారు.
స్వదేశానికి తిరిగొచ్చాక తనకూ ఇది తప్పదని భావించి.. ప్రభుత్వ పెద్దలు, ‘ముఖ్య’ నాయకుడి వద్దకు రాయబారం ప్రారంభించారు. తమ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుల ద్వారా కొందరు మధ్యవర్తులను పంపారు. వారు ఇటీవల ప్రభుత్వ పెద్దలను, ‘ముఖ్య’ నాయ కుడిని కలిశారు. అప్పటి పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా ట్యాపింగ్, ఇతర చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని, తదుపరి చర్యలు కఠినంగా లేకుండా చూడాలని ప్రభాకర్‌రావు కోరు తున్నట్టు వివరించారు. కానీ సదరు ‘ముఖ్య’ నాయకుడు తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఈ అంశంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తు న్నారని.. స్వదేశానికి తిరిగొచ్చి, దర్యాప్తు అధికారుల ఎదుట పూర్తి వాస్తవాలు బయట పెట్టాల్సిందేనని పేర్కొ న్నట్టు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావుకు సమీప బంధువైన ఓ మహిళ.. సీనియర్ ఐపీ ఎస్‌లను, ఉన్నతాధికా రుల భార్యలను కలుస్తూ ప్రభాకర్‌రావు తరఫున రాయబారాన్ని ప్రయత్నించినట్టు అయితే అన్ని ప్రయ త్నాలూ బెడిసికొట్టడంతో ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి రావాలని ప్రభాకర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది.
ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల పరిశీలన
సిట్ అధికారులు తమ కస్టడీ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు ఆదివారం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్ టాప్‌లను విశ్లేషిస్తున్నారు. ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌ల లో వీరి కింద పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందిని సిట్ ప్రశ్నించి.. వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఎస్‌ఐబీ పోలీసులు తమ వాహ నాల్లో ఓ పార్టీకి సంబంధించిన నగదు రవాణా చేసినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అదనపు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment