phone tapping case
-
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్‌రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 శ్రవణ్ రావుకు పోలీసుల నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్‌రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరద్దర్నీ పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఇక, తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ టాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని.. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్ రావు, ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో రైట్.. రైట్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం అందింది. దీంతో ఈ ఇద్దరు నిందితులను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమమైంది.తెలంగాణలో కిందటి ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు(Prabhakar Rao)తోపాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావుల(టీవీ చానెల్ మాజీ ఓనర్)పై సిట్ దృష్టిసారించింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా.. ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరమేర్పడిందని దర్యాప్తు బృందం చెబుతోంది. ప్రణీత్ రావు(Praneeth Ra0) అరెస్ట్ తర్వాత కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోం శాఖ.. కేంద్ర హోం శాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈలోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది.మరోవైపు.. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల నాంపల్లి న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. అయితే.. వీలైనంత త్వరగా వీరిద్దరినీ తీసుకొచ్చేందుకు పోలీసులు మమ్మర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నిందితులపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి పాస్‌పోర్టులను పోలీసులు రద్దు చేయించిన సంగతి తెలిసిందే. ఇక, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్కు(United States Department of Homeland Security) సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంది. అయితే.. రెడ్ కార్నర్ అంటే అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ ఏం కాదు. అది కేవలం రిక్వెస్ట్ మాత్రమే. ఇంకోవైపు.. భారత్‌కు వచ్చేందుకు ప్రభాకర్ సిద్ధంగా లేని పరిస్థితులు చూస్తున్నాం. దీంతో అక్కడి న్యాయస్థానాలను గనుక ఆయన ఆశ్రయిస్తే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురు కావొచ్చు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Interpol )కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు వాదనలు వినిపించగా.. విచారణ నిలుపుదల ఆదేశాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు రిజర్వు చేశారు. రాజకీయ కక్షతో చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన ‘ట్యాపింగ్’ కేసును కొట్టివేయాలంటూ హరీశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఇదే కేసులో మరో నిందితుడైన రాధాకిషన్‌రావు కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. పోలీసుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా గత విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు, హరీశ్ తరఫు న్యాయవాది దామ శేషాద్రినాయుడి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ అంశాన్ని వదిలేయాలని, మెరిట్‌పై వాదనలు కొనసాగించాలని సూచించారు. ఫిర్యాదుపై దర్యాప్తు విచారణ చేపట్టే అధికారం పోలీసులకు ఉంటుందని లూథ్రా చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని, ఇతర నిందితులను హింసించి హరీశ్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాలని పోలీసులు వేధిస్తున్నారని శేషాద్రి నాయుడు వాదించారు. రాజకీయ కక్షలో భాగంగా హరీశ్‌ను అరెస్టు చేయాలని సర్కార్ భావిస్తోందని.. అందుకే, ఫిర్యాదుదారు (చక్రధర్‌గౌడ్)కు వత్తాసు పలుకుతోందన్నారు. అలాగే రాధాకిషన్‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో వాదనలను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
-
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో తామూ చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోని అసమర్థుడు రేవంత్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అసమర్థతను బీజేపీపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కు అయ్యామో నిరూపించాలన్నారు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా.. బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీగా హైకోర్టులో కేసు వేయడమే కాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడుచోట్లా గెలిచే అవకాశాలుండగా, పోటీచేసిన ఆ ఒక్కసీటులోనూ ఓటమి భయంతో ఒత్తిడికి గురై రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు. ‘రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.పోలింగ్‌కు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఏం చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి’అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమని, ఎక్కడా తాము ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ముస్లింలను బీసీల్లో చేర్చడం బరాబర్ తప్పే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కోటాలో అధికమంది కార్పోరేటర్లుగా ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు నైతిక విలువలున్నాయి. రేవంత్ మాదిరిగా పార్టీలు మారలేదు. గంటకో మాట మాట్లాడలేదు. దయ్యం అని పిలిచిన సోనియాను దేవత అని పొగడలేదు’అని ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కిషన్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మళ్లీ మోసగించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది. -
ఫోన్ టాపింగ్ కేసులో ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..హరీష్ రావు పీఏ అరెస్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో సహా ముగ్గురు అరెస్ట్ అయ్యారు.సిద్ధిపేట్ జిల్లా, నియోజకవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలీకుండా అతని డాక్యుమెంట్స్‌తో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారు. ఆ సిమ్‌ను వినియోగించి చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గతేడాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. కాగా, ఇదే కేసులో ఏ-1గా హరీష్ రావు,ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో తాజాగా సుప్రీంకోర్టు మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను, నిందితులు సుదీర్ఘ కాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టు నిందితులకు పలు షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 8 వారాలపాటు ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్హెచ్ఓ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అవసరమై విచారణాధికారి కోరితే హాజరుకావాలని తెలిపింది. నిందితులు తమ పాస్‌పోర్టులను వెంటనే ట్రయల్‌కోర్టుకు సమర్పించాలని చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాకు‡్ష్యలను బెదిరించడం, కలవడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లాంటివి చేయవద్దని, మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించి 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి న్యాయస్థానాలు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉండటంతో ఆయన బయటే ఉన్నారు.ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, చంచల్‌గూడ జైలులో ఉన్న రాధాకిషన్‌రావు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన గురువారం తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిగణనలోకి.. ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిందితులు సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. మరో నిందితుడు ఎ.శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ కు బెయిల్
-
చంచల్‌గూడ జైలు నుంచి తిరుపతన్న విడుదల
సాక్షి,హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మాజీ అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో పదినెలల తర్వాత తిరుపతన్న బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించిన అనంతరం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్
-
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్
సాక్షి,న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి తెలంగాణ సర్కారుకు గట్టి షాక్ తగిలింది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి మొదటిసారి బెయిల్ లభించింది. కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం(జనవరి27) విచారించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేసు విచారణకు సహకరించాలని బెయిల్ ఇచ్చిన సందర్భంగా తిరుపతన్నను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని,అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని సూచించింది. కాగా, తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాలని,దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిందితుల్లో ఒకరైన తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో మరో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు నేతృత్వం వహించారని ఆరోపణలున్న టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌పోల్ ద్వారా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడి కాగా.. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26న ఆయన గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ కొనసాగుతోంది.ఇదిలా ఉండగా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఎక్స్ట్రడిషన్(నేరస్థుల అప్పగింత) అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దర్నీ అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.కాగా, కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్‌కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా.. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
హరీష్‌రావు క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నారు.కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సీరియస్
-
హరీశ్‌రావు అరెస్టు..10 గంటల హైడ్రామా
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్‌కు తీసుకెళ్లారు. అయితే హరీశ్‌రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కాగా హరీశ్‌రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావును పరామర్శించారు.ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి అరెస్టు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్‌లోని కోలా లగ్జారియా విల్లాస్‌లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కౌశిక్‌రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్‌విత్ 190, 3(5) కింద కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్‌రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్‌రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్‌రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్‌లకు తరలించారు. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్‌రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్‌పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది. -
పోలీస్ వర్సెస్ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి ప్రభాకర్‌రావు కూడా అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. దీనితో పోలీసులు వెర్సస్ ప్రభాకర్‌రావు అన్నట్టుగా మారింది. పరిణామాలను గమనించి అమెరికా వెళ్లిపోయి.. ఎస్ఐబీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాతి పరిణామాలను గమనించిన ఆయన... ఈ ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి, అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడి టెక్సాస్‌లో ఉండి, వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభాకర్‌రావు తనపై అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో... తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం జూన్ 26న తిరిగి వస్తానని వివరణ ఇచ్చారు. జూలైలో ఈ–మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారికి లేఖ రాసిన ఆయన... తనపై తప్పుడు కేసు, నిరాధార ఆరోపణలతో ఏర్పడిన మానసిక వేదన కారణంగా ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతోనూ (ఎంఈఏ) సంప్రదింపులు జరుపుతున్నారు. తొలుత పాస్‌పోర్ట్ ఇంపౌండ్ చేయించి... రాష్ట్ర పోలీసులు తొలుత రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీఓ) ద్వారా ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులను ఇంపౌండ్ (సస్పెన్షన్) చేయించారు. ఆపై ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభాకర్‌రావు తన న్యాయవాదుల ద్వారా పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఈ వివాదం పరిష్కారమైతే తప్ప పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఎవరైనా వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితే.. పాస్‌పోర్టు ఇంపౌండ్, రద్దుకు అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు విషయంలో ఈ మూడూ జరిగిన నేపథ్యంలో.. ఆయన పాస్‌పోర్టు త్వరలోనే రద్దవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దయినా ఇప్పట్లో రావడం కష్టమే! ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయినా ఆ సమాచారం ఎంఈఏ, ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా దీని ద్వారా గుర్తించలేరు. కేవలం పాస్‌పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగి.. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వా«దీనం చేసుకుంటారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్‌కు పంపుతారు. అలా కాకుండా ప్రభాకర్‌రావు తనంతట తానుగా తిరిగి వస్తే.. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. ప్రభాకర్‌రావును అమెరికా ప్రభుత్వమే తిప్పిపంపాలంటే మాత్రం పాస్‌పోర్టు రద్దు తర్వాత కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ద్వారా అమెరికా దేశ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీసాలో గడువులో మతలబులు ఎన్నో... కొన్నేళ్లుగా తరచూ అమెరికాకు వెళ్లి వస్తున్న, కుటుంబీకులు అక్కడే ఉంటున్న ప్రభాకర్‌రావు వంటి వారికి సాధారణంగా 10 నుంచి 15 ఏళ్ల గడువుతో కూడిన వీసాలు లభిస్తుంటాయి. అయితే ఒకసారి ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత గరిష్టంగా 180 రోజులలోపు తిరిగి వెళ్లాలనే నిబంధన ఉంది. దీనితో ప్రస్తుతం ఆయన 179 రోజులు అక్కడ ఉండి.. సమీపంలోని కెనడా, లేదా మరో దేశానికి కొన్ని రోజులు వెళ్లి రావొచ్చు. అలా మరో 179 రోజులు అమెరికాలో ఉండొచ్చు. అయితే ప్రభాకర్‌రావు వైద్యం చేయించుకుంటున్న నేపథ్యంలో వీసా గడువు తేలిగ్గా పొడిగించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు.. శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో జైపాల్ యాదవ్‌కు సంబంధించిన లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను జైపాల్ ముందుపెట్టి విచారించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు సమాచారం. రెండు ఫోన్ నంబర్ల విషయంలో.. ప్రధానంగా తిరుపతన్నకు జైపాల్‌యాదవ్ ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లపై విచారణ సాగినట్టు తెలిసింది. తమ కుటుంబానికి, మరో కుటుంబంతో వివాదాల నేపథ్యంలో అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశానని.. తిరుపతన్న తమ సామాజికవర్గం వ్యక్తికావడంతో వివాదం పరిష్కరించాలని కోరా నని జైపాల్‌యాదవ్ వెల్లడించినట్టు సమాచారం. తాను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేశారని.. అంతేతప్ప వారికి రాజకీయాలకు సంబంధం లేదని వివరించినట్టు తెలిసింది. ఫోన్ల నుంచి రికవరీ చేసిన డేటా ఆధారంగా.. ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదుకు, పోలీసు అధికారుల అరెస్టుకు మధ్య కొంత సమయం వచ్చింది. ఆ సమయంలో తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయడం చేశారు. అయితే ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత పోలీసులు వారి ఫోన్లు స్వాదీనం చేసుకుని.. చెరిపేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిపుణులు డేటాను వెలికితీసి పోలీసులకు అందించారు. అందులో తిరుపతన్న ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలో.. ఆయనతో చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు వారిని విచారణకు పిలిచి ప్రశ్నించారు. -
ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం దాదా పు 2 గంటలపాటు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్ని కల నేపథ్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించారా? ఆ రెండు ఫోన్ నంబర్లు ఎందుకు పంపారనే కోణంలోనే లింగయ్య విచారణ సాగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అప్పటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశాడు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగయ్యను సంప్రదించిన తిరుపతన్న బీఆర్ఎస్లో ఉంటూ ఆ పారీ్టకి వ్యతిరేకంగా పని చేస్తున్న, అసమ్మతితో ఉన్న నాయకులతోపాటు వారి అనుచరుల ఫోన్ నంబర్లను సేకరించిన ఎస్ఐబీ అధికారులు వాటిని నాటి డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయించారు. ఇందులో భాగంగా నకిరేకల్‌కు చెందిన వేముల వీరేశం (అప్పట్లో బీఆర్ఎస్ అసమ్మతి నేత)తోపాటు ఆయన అనుచరులపై నిఘా ఉంచాలని అందిన ఆదేశాల మేరకు ఆ వివరాలు సేకరించే బా«ధ్యతను తిరుపతన్నకు అప్పగించారు. వీరేశంతో సన్నిహితంగా ఉంటున్న పెదకాపర్తికి చెందిన రాజ్‌కుమార్, నకిరేకల్‌కు చెందిన మదన్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయాలని భావించారు. ఆ ఇద్దరి ఫోన్ నంబర్ల కోసం తిరుపతన్న అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సంప్రదించారు. గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేసి ఉండటంతో తిరుపతన్నకు లింగయ్యతో పరిచయం ఉంది. తొలుత రెండు–మూడుసార్లు ఫోన్లో సంప్రదించిన తిరుపతన్న ఆపై ఆ ఇద్దరి ఫోన్ నంబర్లు కావాలని కోరారు. దీంతో తనకున్న పరిచయాలతో మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ నంబర్లు తీసుకున్న లింగయ్య వాటిని తిరుపతన్నకు పంపారు. ట్యాపింగ్ కేసులో తిరుపతన్న అరెస్టుకు ముందే తన ఫోన్‌ను ఫార్మాట్ చేశారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ఆ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల ల్యాబ్ నుంచి ఆ నివేదిక పోలీసులకు అందింది. ఇందులో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న–లింగయ్య మధ్యఫోన్ కాల్స్, ఆపై లింగయ్యనుంచి తిరుపతన్నకు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ల ఫోన్ నంబర్లు వచ్చినట్లు తేలింది. దీని ఆధారంగా నోటీసులిచ్చి పోలీసులు లింగయ్యను విచారించారు. ఫోన్లో తిరుపతన్న ఏం అడిగారు? ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉందా? ఆ ఇద్దరి నంబర్లు ఎందుకు పంపారు? అనే వివరాలు ఆరా తీసి లింగయ్య వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పా..ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. చాలా కాలంగా పరిచయం ఉన్న అధికారి కాబట్టే తిరుపతన్నతో మాట్లాడాను. మదన్‌రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నంబర్లు అడిగితే నా అనుచరుల నుంచి తీసుకుని ఇచ్చా. అప్పట్లోనూ ఆ నంబర్లు ఎందుకని ప్రశ్నించా. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, ఆ వివరాలు తెలుసుకోవడానికే వారి నంబర్లు తీసుకున్నట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశాననేది అవాస్తవం. కేవలం మీడియాలో ప్రాచుర్యం పొందాలనే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. – మీడియాతో చిరుమర్తి లింగయ్య -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు చిరుమర్తి లింగయ్య
-
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
Updates..ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావుమధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావుఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టుఈరోజు సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువుదీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావుసోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును పొడిగించిన హైకోర్టువిచారణ సోమవారానికి వాయిదాహైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతదుపరి విచారణ సోమవారానికి వాయిదాఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య ముగిసిన విచారణఅడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌పైన విచారణ చేసిన పోలీసులుచినమర్ధి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే :-పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానుతనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడనుమదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడువారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరు తో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపత కి ఇచ్చానుఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాను.మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగాడు.ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానువేముల వీరేశం అనుచరులు ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవంమీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారుఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానుఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు.పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నా.నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు.ఎప్పుడు విచారణకు పిలిచిన వస్తాను. పోలీసులకు సహకరిస్తాను 👉 జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరయ్యారు. 👉జూబ్లీహిల్స్ పీఎస్‌లో మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. 👉ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా పర్సనల్ పని మీద వచ్చానని చెప్పారు. అనంతరం, పీఎస్ నుంచి వెళ్లిపోయారు.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేత విచారణకు హాజరు కావడం ఇదే ప్రథమం. 👉చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నాకు నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన నాకు నోటీసులు అందాయి. నేడు విచారణకు హాజరవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటానికి నేనేమీ అధికారిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. 👉తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.👉ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.👉ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. కాగా, నిన్న (సోమవారం) నాడు నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాజకీయ మలుపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు రాజకీయ నాయకుల వైపు మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని వారు కోరగా... మూడు రోజులు గడువు ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారికి లింగయ్య సమాచారం పంపారు. దీంతో గురువారం (14వ తేదీ) హాజరుకావడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న తరచూ లింగయ్యతో సంప్రదింపులు జరిపినట్టు తేలడంతో.. అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు పోలీసు అధికారుల చుట్టూనే.. ఈ ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచీ మొత్తం పోలీసు అధికారుల చుట్టూనే తిరిగింది. డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అరెస్టు అయ్యారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా చానల్ అధినేత శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. నిజానికి ఈ కేసులలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. ఇప్పటివరకు ఎవరికీ నోటీసులిచ్చి విచారించలేదు. గతంలో ఓ ఎమ్మెల్సీపై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయింది. అయితే తొలిసారిగా మాజీ ఎమ్మెల్యేను దర్యాప్తు అధికారులు విచారణకు పిలిచారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పారీ్టకి చెందినవారు కావడం గమనార్హం. ఫోన్ల నుంచి డేటాను వెలికితీసి.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత కొన్ని రోజులకు పోలీసు అధికారుల అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో నిందితులు తిరుపతన్న, మరికొందరు అధికారులు, మాజీ అధికారులు తమ ఫోన్లను మార్చేయడం, ఫార్మాట్ చేయడం వంటి చేశారు. అయితే పోలీసులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావుల అరెస్టు తర్వాత వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఫార్మాట్ చేసిన, డిలీట్ చేసిన డేటాను వెలికితీయడానికి (రిట్రీవ్) ఆ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవలే ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చాయి. నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతన్న ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఆయనతో చిరుమర్తి లింగయ్య చేసిన సంప్రదింపులు బయటపడ్డాయి. 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికతోపాటు గతేడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో.. వీరి మధ్య కీలక అంశాలకు సంబంధించి సమాచార మార్పిడి జరిగినట్లుగా గుర్తించినట్టు తెలిసింది. దీనితో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో విచారణకు హాజరుకావడానికి మూడు రోజుల సమయం ఇవ్వాలని లింగయ్య కోరగా.. గురువారం విచారణ రావాలని అధికారులు తెలిపారు. మరి కొందరు రాజకీయ నాయకులకూ..నిందితుల ఫోన్ల నుంచి వెలికితీసిన డేటా ఆధారంగా మరికొందరు రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింకు ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ డేటా ఆధారంగా లింగయ్యను విచారించిన తర్వాత మరికొందరు నేతలకు నోటీసులు జారీ చేసి, విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్, రాజకీయ పారీ్టకి చెందిన నగదు రవాణా అంశాలపైనే రాజకీయ నేతల్ని దర్యాప్తు అధికారులు ప్రశ్నించనున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు బీఆర్ఎస్ నేత గైర్హాజరు
హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
Phone Tapping Case: ప్రభాకర్‌రావు , శ్రావణ్ రావుల పాసుపోర్టు రద్దు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. ప్రభాకర్, శ్రవణ్ రావుకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్‌పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. -
ఫోన్‌ట్యాపింగ్ కేసు: సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) సీవీ ఆనంద్ తొలిసారిగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తుపై శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడుతూ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో కీలక నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చాడన్న ప్రచారంలో వాస్తవం లేదు.ఇప్పటికే ప్రభాకర్‌రావుపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం.ప్రభాకర్‌రావు దేశంలో ఎక్కడ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా మాకు సమాచారం వస్తుంది. ఆయనను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పారు.కాగా, ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా ప్రభాకర్‌రావు మాత్రం విదేశాల్లో ఉండిపోయారు. ఆయన ఈ కేసులో ఇంకా విచారణకు హాజరు కాలేదు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు ఈ కేసులో ఏప్రిల్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన ఇటీవలే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
ఆయన చేసిన నేరం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావులు గత మార్చి 23న అరెస్టు అయ్యారని చెప్పారు. తిరుపతన్న 211 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. చార్జ్ïÙట్ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలవుతోందని వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా... బెయిల్ పిటిషన్లను కొట్టివేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... 211 రోజులుగా నిందితుడు జైల్లో ఎందుకున్నారని, ఆయన చేసిన నేరం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్ రావు సమాధానమిస్తూ.... ‘ఎస్ఐబీ వింగ్ అనేది నా కంట్రోల్లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా నా విధి’అని తెలిపారు. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని, చట్టవిరుద్ధంగా చేయలేదని విన్నవించారు. ఈ వాదనలపై మరోసారి న్యాయస్థానం జోక్యం చేసుకొని... ‘‘ఇందులో నేరం ఏంటో మాకు అర్థం కావడం లేదు’అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్ దాఖలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు తిరుపతన్న
న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిందికాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్నకు ఈనెల ప్రారంభంలో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్‌లను డీఎస్పీ ప్రణీత్‌రావు, తదితరులు ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఏడు నెలలుగా ఈయన జైలులోనే ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడగా... ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. -
రెడ్ కార్నర్ నోటీస్ జారీ సులువు కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసు జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెస్‌లో ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి సమయం పట్టొచ్చన్నారు. ‘రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్‌పోల్ గైడ్‌లైన్స్ పాటించాలి. దేశాల మధ్య ఒప్పందాలనూ పరిశీలించాలి. ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్టుగా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయలేం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’అని జితేందర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ సీపీ, వెస్ట్‌జోన్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనన్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై జితేందర్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీజేల వాడకాన్ని తగ్గిస్తున్నాం..: ‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో మావోయి స్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచి్చనా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతోంది’అని డీజీపీ చెప్పారు. జైనూర్‌లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పండుగలు, ఉత్సవాల్లో డీజేల ను వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వీలైనంత వరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ.. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. సివిల్ తగాదాల్లో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచి్చన ఆరోపణలపై హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
‘ట్యాపింగ్’ కేసులో ఎమ్మెల్సీపై ఎల్ఓసీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న నవీన్‌రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్‌రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుతో కూడా కలసి నవీన్‌రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు. హార్డ్ డిస్‌్కల ధ్వంసంలోనూ పాత్ర గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్‌్కలను డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్‌రావుతో పాటు నవీన్‌రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్‌రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్‌రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్‌రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్‌రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్‌రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్‌రావు పాస్‌పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం. -
నెమ్మదించిన కీలక కేసుల దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో ఎంతో సంచలనంగా మారి.. నిత్యం వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఒక్కో కేసులో ఒక్కో అంశం కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వరుస అరెస్టులతో మొదట్లో హడావుడిగా నడిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిïÙట్ సైతం దాఖలుచేశారు. ఇక్కడి వరకు దర్యాప్తు ఫుల్‌స్పీడ్‌లో కొనసాగింది.అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్ అమెరికాలో ఉండటంతో వారిని అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకుంటే తప్ప దర్యాప్తులో ముందుకుసాగని పరిస్థితి. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. గొర్రెల కేసులో... ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత విచారణకు ఆదేశించిన మరో కీలక కేసు గొర్రెల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు అధికారి మారడంతో మళ్లీ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో ఈ కేసు ముడిపడి ఉండడం.. ఏసీబీలో సరిపడా సిబ్బంది లేకపోవడం సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జాప్యానికి కారణం అవుతోంది. రూ.1,000 కోట్ల జీఎస్టీ కేసులో.. అత్యంత సంచలనంగా మారిన మూడో కేసు.. వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను నిందితుడిగా చేర్చడంతో ఈ కేసుపైనా తీవ్ర చర్చ జరిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చి నా.. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సరిగా లేవని అంటున్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం సాధ్యం కాకపోవడంతో సీఐడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో అవసరమైన సమాచారం కోసం ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖకు లేఖలు రాశారు. ఆ సమాచారం వస్తే తప్ప దర్యాప్తులో ముందడుగు పడని పరిస్థితి. -
అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ ధైర్యం చేసి సైబరాబాద్ పోలీస్‌కమిషనర్ అవినాష్ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్‌అలీఖాన్ తండ్రి నవాబ్ మీర్ హషిమ్ అలీఖాన్‌కు వారసత్వంగా వచి్చంది.దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్ సూట్ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్ వీటి కోసం ఎస్ఎస్.మొయినుద్దీన్, యాసీన్ షేక్ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్.. వీరిద్దరిపై కేపీహెచ్‌బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్ కూకట్పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్ చేశాడు. దీంతో కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హషిమ్అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.ఈ క్రమంలోనే గ్రీన్కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్‌తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్ను కిడ్నాప్ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్ 30న కన్నుమూశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్ అలీఖాన్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో A2 భుజంగరావుకు ఊరట
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి క్రిమినల్ కోర్టు.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులపాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతు విధించింది. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్ట్ కు రంగం సిద్ధం
-
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
-
ప్రభాకర్‌రావును రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావుల మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్‌పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది.ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం(సిట్).. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించుకుంది. ఏ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే..ఈలోపు ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌ను కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఏపీ సీఐడీ సాయంతో సీబీఐ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్ మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయించింది సిట్. ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావును విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఎలాగైనా ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇంటర్‌పోల్ సాయం కోరే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం అమెరికాకు వెళ్లే అవకాశం కూడా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. గతంలోనే ప్రభాకర్‌రావు మీద రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ టైంలో అధికారులు అదంతా ఉత్తదేనని తేల్చారు.రెడ్ కార్నర్ నోటీసులు.. ఇతర దేశాలకు పరారైన నిందితుల్ని కోర్టు విచారణ కోసం రప్పించేందుకు లేదంటే దోషుల శిక్ష అమలు కోసం రప్పించేందుకు జారీ చేసే నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు. ప్రపంచంలో ఉన్న 195 దేశాల జాతీయ దర్యాప్తు సంస్థల ఒప్పందం మేరకే ఈ వ్యవహారం నడుస్తుంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ మధ్యవర్తితత్వం వహిస్తుంది. భారత్‌లో సీబీఐ సంస్థ రెడ్ కార్నర్ నోటీసుల జారీ, నిర్వహణను చూసుకుంటుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ6 శ్రవణ్ రావును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపైన నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.అమెరికాలో ప్రభాకర్‌రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రవణ్‌రావు ఆచూకీని దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. శ్రావణరావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు సమాచారం.కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌రావు అమెరికాకు వెళ్లిపోయారు. -
ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తమను అరెస్ట్ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
-
నేను ఇల్లీగల్ పనులు చేయలేదు.. అమెరికా నుంచి ప్రభాకర్ లేఖ
-
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలని, ట్యాపింగ్‌కు గురైన జడ్జిల వివరాలను వెల్లడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన జడ్జీల పేర్లు ఎక్కడ వాడొద్దు. వారి ఫోన్ నెంబర్స్, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దు. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు అని మీడియా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. అనంతరం.. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 23కి వాయిదా వేసింది. తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని నిందితులు విచారణలో చెప్పడం గమనార్హం. -
ఫోన్ ట్యాపరింగ్ కేసుపై హైకోర్టులో విచారణ
-
ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతో కౌంటర్ దాఖలు చేశారు.దీంతో పాటు తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో తెలిపారు.అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి.. ఇదే అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు గత నెల 29న హైదరాబాద్ సీపీ బదులిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేశారు. -
"నేను రాలేను.." ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది.అయితే, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్ రావుకు సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే అవకాశం లేదు.ఈ నేపథ్యంలో కేసు విషయమై ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రత్యామ్నాయం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్ధు కోరుతూ రీజనల్ పాస్‌పోర్ట్ అధికారికి కూడా పోలీసులు లేఖ రాశారు. అయితే, ప్రభాకర్ రావు పరారీలో లేనని సమాచారం ఇస్తుండటంతో విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్టు రద్ధు అంగీకారం అనుమానంగానే మారింది. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు శ్రావణ్ రావు సైతం విదేశాల్లోనే మకాం వేశారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ డోలాయమానంలో పడిపోయింది. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వస్తే తప్ప కేసు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్‌రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్‌ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్‌గా బీఆర్ఎస్కు రూ.13 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు వచ్చేదెప్పుడు?
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే.. అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నిందితులపై బెయిల్‌పై.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్ మెటీరియల్‌గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టును కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగ రావ్, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. -
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్‌షీట్‌లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్‌లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్‌రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్‌షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్‌లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఓనర్‌ను త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో సోదాలు చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు 5 మాక్ మినీ డివైజ్‌లు సిట్ సీజ్ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి పోలీసులు సేకరించినట్లు సిట్ వెల్లడించింది.. .. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్‌లను స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.చత్తీస్‌గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది.రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తేగా.. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా.. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో భుజంగరావు తిరుపతన్న ఉన్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజాశరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచి్చన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ, సీఎస్, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకొని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు్ల, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమ యంలో నగదు స్వాదీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచి్చన వాంగ్మూలంలో పేర్కొన్నారు.’అంటూ వచి్చన కథనాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
ఫోన్ ట్యాపింగ్ పై కోమటి రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్. కవాడిగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తోందని ఆరోపించింది. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధంగా ఉందని ప్రకటించింది.కేసులో సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందా?ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తె కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసీఆర్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.బీఆర్ఎస్ రద్దు కోరుతూ లేఖ రాస్తా: కొండా 2017కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవహారాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాల్లో నూ కేసీఆర్ వేలు పెట్టాడని తెలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నయీం తరహా పాలన సాగిందని, సొంత కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.రేవంత్‌ను సోనియా బెదిరించారు: బూర‘బీఆర్ఎస్పై కేసులు పెడితే నీపని అవుతుంది అని సోనియా గాంధీ బెదిరించారు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చిన్నగా చేసుకుని వచ్చాడు’ అని బూ ర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రులు జి.విజయ రామా రావు, ఇ.పెద్దిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్. రామ చంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మా రావు, ప్రేంసింగ్ రాథోడ్, భేతి సుభాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్‌రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. ఐపీఎస్ అధికారి రాజేష్ కుమార్ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్‌రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్‌రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్‌ను బీబీనగర్ ఎస్సైగా ప్రభాకర్‌రావు నియమించారు. 2016లో ప్రభాకర్‌రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్‌కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్‌రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్‌గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద పని చేయాలని ప్రణీత్‌కు ప్రభాకర్‌రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్‌కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్‌రావు చొరవతోనే ప్రణీత్‌కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌కు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ 17 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌తో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ల కథ నడిపారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడటమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్‌రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్ వద్ద 8 ఫోన్లు ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్‌లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్‌రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీమ్ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్‌లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు సూచించారు. దీంతో ప్రణీత్ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్ సహకారంతో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్‌డిస్క్‌ల్ని ఆర్ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్లిస్క్ల్ని ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి, పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్ చేసిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్స్ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి. -
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
-
1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించాడు. వాంగ్మూలం నివేదిక దర్యాప్తు అధికారులు బయటకు విడుదల చేయగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు చెప్పాడు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం టాప్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కొనసాగించాం. ఎనిమిది ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నా. అధికారికంగా మూడు ఫోన్లు వినియోగించా. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ట్యాపింగ్‌ను మానిటరింగ్ చేశాం. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం.పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం.ఇక.. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసాం. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపింగ్‌ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ కోసం ఏ ఒక్కరినీ వదల్లేదు!ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకొచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశాం. అందులో 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. ఆ 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడీపీఆర్(Inter-Domain Policy Routing) డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్‌లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చాడు.స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును మార్చి రెండో వారంలో ప్రత్యేక బృందం సిరిసిల్లలో అరెస్ట్ చేసింది. -
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
-
సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి సొంతంగా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. మేడిగడ్డలో ఎంతో కొంత నీళ్లు నింపి, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పంపినా.. అవి ఉంటాయో, ఊడుతాయో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక సైతం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు ‘80 వేల పుస్తకాలు చదివి, సొంత తెలివితేటలతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. అల్లుడు హరీశ్‌రావు వరల్డ్ రికార్డు కోసం ఆగమాగం పనులు చేశాడు. ఇప్పుడు అది కూలింది. మేడిగడ్డలో కూలిన బ్లాక్‌ను సరిచేసి నీళ్లు నిలిపితే, ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు. ఒకవేళ రెండున్నర మీటర్లలో మేడిగడ్డ నింపి అన్నారం, సుందిళ్లకు నీటిని పంపితే వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద నీరు, ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నుంచే కిందికి పోవాలి. ఇప్పటికే 52 టీఎంసీల ఎత్తిన నీళ్లు కిందకు పోయాయి. సముద్రంలోకి పోయిన నీటికి కరెంట్ బిల్లులు కట్టాం. 80 వేల పుస్తకాలు చదివిన తెలివి అట్లుంది. కాళేశ్వరం సమస్య.. 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చిన సమస్య లాంటిది కాదు. విరిగింది వెన్నెముక. మేడిగడ్డ పునరుద్ధరణ అంశంపై ఇప్పటికే మూడు కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన సిఫారసుల మేరకు ముందుకు వెళతాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది. ఇక్కడి తప్పిదాలకు ఎవరు బాధ్యులో అది తేలుస్తుంది. ఇది కాకుండా అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎస్కలేషన్ ఎంత..ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంపై విచారణ మొదలు పెడితే అది ఇక్కడితో ఆగదు. మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. అంచనాల పెంపులో అవకతవకలను విచారిస్తూ పోతే ఏ ప్రాజెక్టూ ముందుకు పోదు. ప్రభుత్వం కూడా పనులు చేయించలేదు. బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ పనులు కొనసాగిస్తే విచారణకు ఆదేశించాక కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని మీడియానే రాస్తుంది. అందుకే అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు. మేడిగడ్డ అంశం తేలాక దానిపై ఆలోచిస్తాం..’ అని సీఎం వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ‘రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో నేనేమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు నాకు కానీ, పారీ్టకి కానీ దక్కే ప్రయోజనం ఏంటి? ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతోంది. విచారణలో నిందితులు చెబుతున్న అంశాలు నేను కూడా పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నా. ప్రతి చిన్న అంశంపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మా ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ వంటి వెధవ పనులు చేయడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ పోలీసుల బదిలీలు జరగలేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కరెంట్ కోతల్లేవు..అంతరాయం మాత్రమే ‘రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతల్లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి తప్పితే ఎక్కడా కోతలు లేవు. తెలంగాణ రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీకి ఇచ్చాం. ఆయన దానికి కీరవాణితో సంగీతం సమకూర్చుకుంటారో, మరొకరితోనో అనేది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూదనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే కొత్త చిహ్నం ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా – సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహ్వానించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ సముచిత గౌరవం ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు. -
టాస్క్‌ఫోర్స్ కేంద్రంగా వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు, ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకి షన్‌రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయిని భుజంగరావు పోలీసుల ఎదుట వెల్లడించారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలా ల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభా కర్రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్‌రావు పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిష న్‌రావు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సెటిల్మెంట్లు పెద్దఎత్తున చేశారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్‌ఫోర్స్‌ను వినియోగించడంతోపాటు ప్రతిమ, యశోద ఆస్పత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు. 15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీమ్తనతోపాటు ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్‌తో పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, పది మంది కానిస్టేబుళ్లు, మరో పది మంది హెడ్ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజూ గరిష్టంగా 40 ఫోన్లు ట్యాప్ చేశారు. తన కార్యాలయంలో మూడు సిస్టమ్స్‌తోపాటు తొమ్మిది లాగర్స్‌ను ఏర్పా టు చేసుకున్నారు. ఇలా వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్‌రెడ్డి మిత్రులు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మిత్రు డు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, జి.వినోద్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసు కోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. -
ఫోన్ ట్యాపింగ్.. నేను అలాంటి పనులు చేయను: సీఎం రేవంత్
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్‌పై సమీక్ష జరపలేదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని, బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారించి అధికారులు తేల్చాల్సి ఉంది.అన్నింటికీ సీబీఐ విచారణ అడిగే హరీష్ రావు, కేటీఆర్.. ఫోన్ టాపింగ్ అంశాన్ని సీబీఐకి ఇవ్వాలని ఎందుకు అడగడం లేదని సీఎ రేవంత్ ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదని, అలాంటి పనులు కూడా చేయనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
-
బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ టీం ట్యాప్ చేసింది: రాధాకిషన్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు
-
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
ట్యాపింగ్ లింక్స్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్‌రావును దర్యాప్తు బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరగ్గా తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మొదటిసారి స్పందించారు. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.‘‘నేను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే. కారణం లేకుండానే నన్ను నల్లగొండ నుంచి బదిలీ చేశారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేసీఆర్‌ది, నాది ఒకే కులం అయినందున నన్ను నిందిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. చికిత్స పూర్తయ్యాక ఇండియాకు వస్తా’’ అని ప్రభాకర్ రావు తెలిపారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్‌రావు.. రాజేందర్‌కు కాంగ్రెస్‌కు సంబంధం లేదు. ఆయన కార్యకర్త కానేకాదు..ఏనాడూ ఉద్యమాల్లో పాల్గొనలేదు’అని బీజేపీ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘అసెంబ్లీ ఎన్నికల నుంచే రాజేందర్రావును ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు తెర ముందుకు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు రాజేందర్రావు ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పించారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు. కరీంనగర్ ఎంపీ టికెట్ వేరొకరు ఆశించినా, ఆయనకు సీఎం పూర్తి మద్దతు ఇచ్చినా, ఈ తతంగం నడపడం వల్లే ఆయనకు టికెట్ రాలేదు. ఇదంతా కేసీఆర్‌తో జిల్లా మంత్రి కుమ్కక్కై సాగించిన కుట్ర ఇది. అసలు కథ ఏంటంటే ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు ద్వారానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నారు. అమెరికాలోని అశోక్‌రావు కూతురు ఇంట్లోనే ప్రభాకర్‌రావు ఉంటున్నాడు. అమెరికా, దుబాయ్ వెళ్లొస్తున్నాడు. మరో 10 ఏళ్లపాటు వీసా ఉంది. ప్రభాకర్‌రావు ఇండియాకు తిరిగొచ్చేలా చర్యలెందుకు తీసుకోవడం లేదు. అమెరికా నుంచి తిరిగి రావొద్దనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ప్రభాకర్‌రావు వస్తే సిరిసిల్లలో కేటీఆర్ కనుసన్నల్లో జరిగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై నన్ను ఓడించే కుట్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు అయ్యి ఫోన్‌ట్యాపింగ్ కేసును నీరుగార్చడంతోపాటు..ఈ రెండు పార్టీలు ఒక్కటై కరీంనగర్లో నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసును సమగ్ర విచారణ నిమిత్తం సీబీఐకి, అవసరమైతే ఎన్ఐఏకు కూడా అప్పగించాలి. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్‌లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. వారిచ్చే సలహా, సూచనలకు అనుగుణంగా సదరు మంత్రి పని చేస్తున్నరు. ఒక అధికారి నా వద్దకు వచ్చి నాతోపాటు మా కుటుంబ సభ్యుల, సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పారు. నేను వాడే సిమ్ కార్డును డూప్ సిమ్ తీసుకొని నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. మా ఇంటి వద్దనున్న పెట్రోల్ బంక్ సమీపంలో, టెంపుల్ సమీపంలో వాహనాలను ఉంచి ఫోన్ ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావు కరీంనగర్లో మకాం వేసి మా ఫోన్లు ట్యాప్ చేశారు రాధాకిషన్‌రావు ప్రతిమ హోటల్లోని 314 రూంలో ఉంటూ (బిల్లులు చెల్లించకుండా) నా ఫోన్ ట్యాప్ చేశారు. నాతోపాటు పెద్దపల్లి, రామగుండం కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడంతో వాళ్ల పైసలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు ఇప్పటికీ ఫోన్‌ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాలున్నాయి. అందుకే ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్‌ల ద్వారా మాట్లాడుకునే దుస్థితి వచ్చింది. సీబీఐ విచారణకు అంగీకరిస్తే, నాదగ్గరున్న సమాచారమంతా అప్పగిస్తా. కరీంనగర్‌తో పాటు ఇతర లోక్‌సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఅర్ డబ్బులు పంపినట్టు అనుమానం కలుగుతోంది’అని సంజయ్ అన్నారు. అనంతరం పార్టీకార్యాలయంలో సినీనటి శైలజ, టీవీ యాక్టర్లు టి.జ్యోతి, డి.రమే‹Ùబాబు, మరికొందరు టీవీ సినీనటులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు.నలుగురు నిందితులపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ఠ్ కింద కేసు నమోదు చేయగా.. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. కాగా గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
నగదు అక్రమ రవాణాపైనా సిట్ నజర్!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు. ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కిడ్నాప్ చేసి.. బెదిరించి -
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు
-
కేసీఆర్‌కు అరెస్టు భయం.. అందుకే యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు భయంతో ప్రజల్లో సానుభూతి కోసమే కేసీఆర్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ కేసులో సంబంధిత చట్టం ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాప్రాతి నిథ్య చట్టం ప్రకారం, వరుసగా రెండేళ్లు జైలు శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదని, ఇక కేసీఆర్ రాజకీయాలు వదిలేస్తే మంచిదని సూచించారు. అరెస్టు భయంతోనే ఇప్పుడు కేసీఆర్ యాత్రలు చేస్తున్నారే తప్పించి ఏనాడూ ప్రజల గురించి చిత్తశుద్ధితో పనిచేయలేదని గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలపై తాను కేసీఆర్‌ను నిలదీస్తే, కేసీఆర్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనకు వారిలా బూర్చుఖలీఫాలో ఇల్లు లేదనీ, ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని వెల్లడించారు. ‘నాకు కంపెనీ ఉంటే నిరూపించాలని, గాలిమా టలతో తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదు. నీలా తప్పులు చేసే వ్యక్తిని కాదు, నా గురించి మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకుని మాట్లాడాలి’ అని సూచించారు. వర్షాభావం కాంగ్రెస్ వైఫల్యమా: పొంగులేటి వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపేందుకు కేసీఆర్ శతవి ధాలా ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదిన్న రేళ్లు సీఎంగా ఉండి, తన హయాంలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే ఏనాడూ పంటపొ లాలకు వెళ్లి రైతులను పరామర్శించని కేసీఆర్‌కు అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ వరకు వచ్చిన కేసీఆర్, పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని దెబ్బతిన్న పిల్లర్లను కూడా సందర్శించి ఉంటే బాగుండేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
Phone Tapping Case: పగలు చేశారా? రాత్రి చేశారా?
-
Phone Tapping Case: పగలు చేశారా? రాత్రి చేశారా?
నల్లగొండ/ హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాల్ని సేకరణ దిశగా దర్యాప్తు బృందం తీవ్రంగా యత్నిస్తోంది. ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కేసు వీగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న హోంగార్డు, ఎలక్ట్రిషియన్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)లో ఆధారాలు ధ్వంసం చేసిన ఎలక్ట్రిషియన్, హోంగార్డులను విడివిడిగా పోలీసులు విచారించారు. ‘‘ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారు?. జనవరి 4వ తేదీన ఎస్ఐబీలోకి రమ్మని ఎవరు పిలిచారు?. ఆ టైంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా?. అసలు ఎస్ఐబీ కార్యాలయంలోకి కట్టర్లతో ఎలా వెళ్లారు?.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, పెన్‌డ్రైవ్, ఇతర డివైజ్‌లను డే టైంలో ధ్వంసం చేశారా? నైట్‌టైంలో ధ్వంసం చేశారా?. ఎస్ఐబీ ఆఫీస్‌లో కాకుండా వేరే చోట కూడా ధ్వంసం చేశారా?’’ ఇలాంటి ప్రశ్నలు ఆ ఇద్దరికి సంధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వృథా కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్? ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అభియోగాలతో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నల్లగొండలో సర్వర్ రూం ఏర్పాటు చేసుకుని ఈ ఇద్దరూ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఓ మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఫోన్లను ఎప్పటికప్పుడు వీళ్లు అబ్జర్వ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరు అధికారుల హస్తం ఉందని భావిస్తున్నారు. రాధాకిషన్ అస్వస్థత ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. రెండోరోజు విచారణ సందర్భంగా.. హైబీపీకి ఆయన గురైనట్లు సమాచారం. అయితే బంజారాహిల్స్ పీఎస్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయ్’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని కేంద్రమంద్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని అన్నారు. రిటైర్డ్ అధికారుల నేతృత్వంలో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని దుయ్యబట్టారు. రాజకీయపరమైన కక్ష సాధింపు చర్య రాజకీయపరమైన లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు కిషన్‌రెడ్డి. వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం, నియమాల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యహరించిందన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అక్రమంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఉప ఎన్నిక సమయంలో తమ అభ్యర్థులు, నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల, సమాజంలో పెద్దల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిదిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై కిషన్ రెడ్డి రియాక్షన్ పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఒక ఎజెండాగా పెట్టుకుందన్నారు కిషన్ రెడ్డి. కుక్కలు, నక్కలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. కుక్కలు, నక్కలను పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రశ్నించారు. . దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పార్టీ మారాలని అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ. కోట్లు దోపిడికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగింది. ఫోన్ ట్యాపింగ్ వెనక కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందని విచారణలో బయటపడింది. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలి. కేంద్రహోంశాఖ అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు. కేటీఆర్ మొన్న అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చు అన్నారు... నిన్న నాకేం సంబధం అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో షాడో ముఖ్యమంత్రిలాగా కేటీఆర్ వ్యవహరించలేదా? ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి బీఆర్ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలి’ అని తెలిపారు. -
కస్టడీలో రాధాకిషన్.. కీలక విషయాలు వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారని, కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ‘‘ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్‌ని తయారు చేశాడు. బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీతరావుకి రాధాకృష్ణ సహకరించాడు. ప్రొఫైల్స్ సంబంధించిన వ్యవహారాలు బయటి రాకుండా ఉండేందుకే ఆధారాలను ధ్వంసం చేశాడు. కోర్టు అనుమతితో రాధాకృష్ణ రావు ని తిరిగి కస్టడీలోకి తీసుకున్నాం. పదో తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్‌ను విచారిస్తామని డీసీపీ వెల్లడించారు. కాగా, ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో ... -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో హ్యాండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు వచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో కూడా ప్రణీత్ రావు అండ్ కో టీమ్ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడయింది. వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎపిసోడ్‌కు కర్త, కర్మ, క్రియగా ఇద్దరు పోలీసు అధికారులు వ్యవహరించినట్టు తాజా విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను అనధికారికంగా ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డు చేసిన ప్రణీత్‌రావు.. వాటిని ప్రభుత్వం అందజేయగా.. అలర్ట్ అయినట్లు విచారణలో తేలిసింది. ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టే బాధ్యతను రాధాకిషన్ అండ్ కోకు అప్పగించినట్టు సమాచారం. దీంతో రాధాకిషన్ తన బృందంతో ఒక రోజు ముందు వెళ్లి సీసీ కెమెరాలను పక్కాగా అమర్చినట్టు వెల్లడైంది. గెస్ట్ హౌజ్‌లో ఏ రకమైన వ్యవహారమైనా పక్కాగా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను, మైక్‌లను అమర్చినట్టు తాజా విచారణలో బయటపడింది. ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ తరపున వచ్చిన బీఎల్ సంతోష్‌లను పక్కాగా ట్రాప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. త్వరలోనే మరికొందరిని కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలిసింది. నోటీసులిచ్చేందుకు ప్రత్యేక విమానామా? ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్పెషల్ విమానంలో ఆనాటి సిట్ బృందం తిరిగినట్లు విచారణలో తేలింది. అయితే, కేసు విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం సాధారణమే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్కు సంబంధించిన ఓ కీలక నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారులు ఈ స్పెషల్ ఫ్లైట్ ను వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే రాధా కిషన్‌రావును ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించానున్నారు. దీంతో గురువారం చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు A4గా ఉన్నారు. చదవండి: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు -
ట్యాపింగ్ ఫైల్స్..ఇద్దరి నుంచి కీలక సమాచారం సేకరణ
-
2014 నుంచి ట్యాపింగ్‌లపై విచారణ జరిపించాలి: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. 2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్‌రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్‌రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్‌రావు, సందీప్రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవగాహనతోనే విచారణ ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్‌రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు. రఘునందన్‌రావుపై కేసు నమోదు సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
కోర్టుకెళ్తా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slanderEither Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T— KTR (@KTRBRS) April 2, 2024 -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీలకు రిమాండ్
-
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్‌గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు. Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T — KTR (@KTRBRS) April 2, 2024 -
ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వాళ్లిద్దరినీ చెంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకు ముందు.. వాళ్లిద్దరి కస్టడీ ముగియడంతో తొలుత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 6వ తేదీ దాకా రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ ఇద్దరు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు.. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క.. మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో.. ఆయన్ని సైతం అరెస్ట్ చేస్తారా? లేదంటే నోటీసులిచ్చి కేవలం ప్రశ్నిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు.. ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు వేసిన బెయిల్ పిటిషన్‌పైనా ఇదే కోర్టులో విచారణకు రానుంది. ఇంకోపక్క.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది.తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు.బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.చదవండి: కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు రాజకీయంగానూ తీవ్ర దమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. తాజాగా ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ నగదు ప్యారడైజ్ వద్ద 70 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్ రావు, ఆయన బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహచరుల నుంచిరూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధకిషన్ రావు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
అమెరికా నుంచి హైదరాబాద్ కు..ప్రభాకర్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేర్లు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేసిన మరో సీనియర్ అధికారిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఎస్ఐబీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆ అధికారికి... ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1 అయిన ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. సీనియర్ అధికారితో పాటు ఓ ఇన్స్పెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం భావిస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఇవాళ నాలుగో రోజు విచారణ చేపట్టారు. అదే సమయంలో.. ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణ హాజరయ్యే అవకాశాలున్నాయనే చర్చా నడుస్తోంది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇంటర్‌పోల్ దాకా వెళ్లకముందే.. ప్రభాకర్‌రావు లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఆయన తిరుగు ప్రయాణమయారని.. విచారణ బృందం ఎదుట హాజరు కావొచ్చని సమాచారం. ఒకవేళ ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారితే గనుక ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు. రాధాకిషన్‌ను 10 రోజుల కస్టడీ కోరుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును అశ్రయించారు. మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు రాధాకిషన్‌ను నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో మధ్యాహ్నాం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్‌పై ఉత్కంఠ అదే సమయంలో ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై వాదనలు జరగాల్సి ఉంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కోసం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బెయిల్ కోసం ప్రణీత్‌రావు ఫోన ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది. -
అయిందేదో అయింది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ట్యాపింగ్ కేసులో తన చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో విదేశాల్లో తలదాచుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు రాయబారాలు మొదలు పెట్టారు. అయిందేదో అయింద ని.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కఠిన చర్యలు తీసుకో వద్దని కోరుతూ కొందరు ప్రతినిధులను ప్రభుత్వ పెద్దల వద్దకు పంపినట్టు తెలిసింది. కానీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ‘ముఖ్య’ నాయకుడు ఈ దశ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసి నట్టు సమాచారం. మరోవైపు తమ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను సిట్ అధికారులు ఆదివారం కూడా లోతుగా ప్రశ్నించారు. ఉన్నతాధికారి వద్ద భంగపడటంతో.. ఎస్ఐబీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాల ధ్వంసంపై అంతర్గత విచారణ గత ఏడాది డిసెంబర్లోనే మొదలైంది. దీనిపై ఆ విభాగంలోని తన మనుషుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్‌రావు.. ఓఎస్డీ పదవికి రాజీనామా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లిపోయారు. తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడం, ప్రణీత్‌రావు అరెస్టు తదితర పరిణామాలు జరిగాయి. పంజగుట్ట పోలీసులు గత నెల మూడో వారంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఓ మీడియా అధినేతలపై లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్నవారి ఇళ్లలో సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించారు. దీనితో ఇలాంటి చర్యలు వద్దంటూ అమెరికా నుంచే ప్రభాకర్‌రావు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. ఆయన సమాధానం విని కంగుతిని ఫోన్ కట్ చేశారు. రాధాకిషన్‌రావు అరెస్టుతో మారిన సీన్.. తర్వాత కొందరితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ప్రభాక ర్రావు మేకపోతు గాంభీ ర్యం ప్రద ర్శించారు. అక్రమ ట్యాపింగ్‌కు తానే ఎలా బాధ్యు డిని అవుతానని? తనపై ఉన్న అదనపు డీజీ, డీజీపీలకూ బాధ్యత ఉంటుందనే ధోరణిలో మాట్లాడారు. ఎస్ఐ బీ, ఇంటెలిజెన్స్‌ల్లో పనిచేసిన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతోపాటు మరో కీలక నిందితుడిగా ఉన్న హైదరా బాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్ రావునూ అరెస్టు చేశారు. దీనితో ప్రభాకర్‌రావు హడలిపో యారు. స్వదేశానికి తిరిగొచ్చాక తనకూ ఇది తప్పదని భావించి.. ప్రభుత్వ పెద్దలు, ‘ముఖ్య’ నాయకుడి వద్దకు రాయబారం ప్రారంభించారు. తమ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుల ద్వారా కొందరు మధ్యవర్తులను పంపారు. వారు ఇటీవల ప్రభుత్వ పెద్దలను, ‘ముఖ్య’ నాయ కుడిని కలిశారు. అప్పటి పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా ట్యాపింగ్, ఇతర చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని, తదుపరి చర్యలు కఠినంగా లేకుండా చూడాలని ప్రభాకర్‌రావు కోరు తున్నట్టు వివరించారు. కానీ సదరు ‘ముఖ్య’ నాయకుడు తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ అంశంలో పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తు న్నారని.. స్వదేశానికి తిరిగొచ్చి, దర్యాప్తు అధికారుల ఎదుట పూర్తి వాస్తవాలు బయట పెట్టాల్సిందేనని పేర్కొ న్నట్టు సమాచారం. మరో వైపు ప్రభాకర్‌రావుకు సమీప బంధువైన ఓ మహిళ.. సీనియర్ ఐపీ ఎస్‌లను, ఉన్నతాధికా రుల భార్యలను కలుస్తూ ప్రభాకర్‌రావు తరఫున రాయబారాన్ని ప్రయత్నించినట్టు అయితే అన్ని ప్రయ త్నాలూ బెడిసికొట్టడంతో ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి రావాలని ప్రభాకర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల పరిశీలన సిట్ అధికారులు తమ కస్టడీ లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు ఆదివారం వివిధ కోణాల్లో ప్రశ్నించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్ టాప్‌లను విశ్లేషిస్తున్నారు. ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌ల లో వీరి కింద పనిచేసిన పలువురు అధికారులు, సిబ్బందిని సిట్ ప్రశ్నించి.. వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఎస్ఐబీ పోలీసులు తమ వాహ నాల్లో ఓ పార్టీకి సంబంధించిన నగదు రవాణా చేసినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అదనపు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్
-
టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా.. గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది. అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు.. ఎస్ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే.. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్్కఫోర్స్లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది. భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
ఫోన్ ట్యాపింగ్: రేవంత్‌కు కొత్త సవాల్ విసిరిన ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. సందట్లో సడేమియా అన్నట్టుగా అధికారులు సర్దుకున్నారు. గత ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కును గత ప్రబుతం అణచివేసింది. తెలంగాణను అబాసుపాలు చేసింది. పోలీసుల అనుమతితో ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్‌లు జరగవచ్చని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలి. లీక్ వీరుడు కాదు.. గ్రీక్‌వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఎమ్మెల్సీ..
-
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన అధికారులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
HYD: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబీ కీలుబొమ్మగా మారింది. అధికారులు ఎస్ఐబి కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్లో ఎస్ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డిఎస్పీలు అక్కడే తిష్ట వేశారు. ప్రణీత రావు నేతృత్వంలో మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రణీతరావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్‌రావు లాగర్ రూమ్ నడిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నంబర్లను ట్రాప్ చేసిన మాజీలు.. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్డీ పేరుతో ఎస్ఐబీలో చలామణి అయ్యారు. సర్వీస్‌లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డీలు అక్రమాలను సిట్ గుర్తించింది. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర -
ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో బయటపెట్టాలని అన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని.. రేవంత్ రెడ్డి తననేం చేయలేడని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని హెచ్చరించారు. ‘లిక్కర్ స్కాంలో ఏం ఉందో అదంతా బయటపెడుతా అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఆ కేసు కోర్టులోనే ఉంది. నిజంగా తప్పు జరిగితే కోర్టులో పెట్టు.. కోర్టులో జడ్జి శిక్ష వేస్తారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునుడు కాదు.. సికింద్రాబాద్‌కు ఏం చేశావో చెప్పి ఓట్లు అడుగు’ అని కేటీఆర్ సూచించారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్ -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్‌కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్‌ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్‌తో హరీష్‌రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్‌ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్‌కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్‌తో ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్లు గుర్తించారు. అదే విధంగా ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. -
ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీ కోరిన పోలీసులు
-
కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు. దానం అవకాశవాది పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు. మనకు పోటీ బీజేపీతోటే.. ‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. కాంగ్రెస్‌కు 40 కూడా రావు.. బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. భయపడేవాళ్లు లేరు లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏసీబీ లిస్టులో అధికారుల చిట్టా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు. విలాసవంతమైన విల్లాలో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారులు చిట్టా, వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేశారు. భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో నిందితులు ఉన్నారు. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభాకర్‌రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు సదరు ఉన్నతాధికారి స్పందించకుండా.. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో.. ప్రభాకర్‌రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాల ప్రకారం.. నాటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించడంతో ఎస్ఈబీ డీఎస్పీ ప్రణీత్‌రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు(తాజాగా అరెస్టైన అదనపు ఎస్పీలు) కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావుకు పంపించారు. అయితే.. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్క్డిస్క్లు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు ప్రభాకరే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం.. ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమైన ప్రభాకర్‌రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి.. అటు నుంచి అటే అమెరికాకు వెళ్లారు. ఇక.. ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ మాజీ పోలీస్ అధికారిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూడా. ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని తేలింది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు పేరును ఏ2గా చేర్చింది దర్యాప్తు బృందం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాకర్ రావు అండ్ టీం.. కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు.. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజినట్లు నిర్ధారణ అయ్యింది. -
ట్యాపింగ్ ఫైల్స్..రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్‌రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్‌లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ-1గా ప్రభాకర్ రావు
-
ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో శనివారం అరెస్టు చేసిన అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలతోపాటు కస్టడీ ముగిసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావులను సిట్ అధికారులు ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రణీత్‌రావుకు బుధవారం వరకు, భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భుజంగరావు, తిరుపతన్నలను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందికి సిట్ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రధానాంశం ఫోన్ ట్యాపింగ్ కావడంతో ‘టెలిగ్రాఫిక్ యాక్ట్’ను కూడా జోడించాలని అధికారులు నిర్ణయించారు. ముగ్గురి కోసం ఔట్లుక్ సర్క్యులర్ పంజగుట్టలో నమోదైన ఈ ట్యాపింగ్ కేసులో శనివారం వరకు ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉండేవారు. సిట్ దర్యాప్తు, ప్రణీత్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నలను కూడా నిందితులుగా చేర్చినట్టు సిట్ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ అధిపతిని కూడా నిందితులుగా చేర్చినా.. విదేశాల్లో తలదాచుకున్నారు. దీంతో ఆ ముగ్గురి కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు అధికారులు లుక్ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. వ్యక్తిగత జీవితాలూ ‘ట్యాప్’.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉపరకణాలు, సాఫ్ట్వేర్లతో ల్యాండ్లైన్లు, సెల్‌ఫోన్ కాల్స్‌తోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేసిన ‘ప్రభాకర్‌రావు టీమ్’.. బెదిరింపు వసూళ్లకు పాల్పడటంతోపాటు కొందరి వ్యక్తిగత జీవితాలపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. హైప్రొఫైల్ వ్యక్తుల అంతర్గత వ్యవహారాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. వారికి ఆ వాయిస్‌లు, సందేశాలు చూపి, భారీ డిమాండ్లు నెరవేర్చుకున్నట్టు సమాచారం. అప్పటి ప్రతిపక్షనేత రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబీకులతోపాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు, కీలక వ్యక్తులపైనా ట్యాపింగ్ నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావుకు ఊహించిన షాక్.. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు నుంచి ఇక్కడి ఓ పోలీసు ఉన్నతాధికారికి కాల్ వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు ఎలా ట్యాపింగ్ కేసులో దూకుడుగా వెళ్తున్నారో.. అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాను ట్యాపింగ్‌లో జోక్యం చేసుకున్నానని ఆయన చెప్పినట్టు సమాచారం. మనం మనం పోలీసులమేనని, కేసు దర్యాప్తు పేరుతో ఇళ్లలో సోదాలు చేయడమేంటని కూడా ప్రభాకర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది. తాను వైద్యం కోసమే అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదంతా విన్న సదరు ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏం చెప్పాలనుకున్నా, ప్రశ్నించాలనుకున్నా నా అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపండి. అప్పుడే నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇస్తా..’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనితో ప్రభాకర్‌రావు మౌనంగా ఫోన్ కట్ చేసినట్టు సమాచారం. సిట్ దర్యాప్తునకు కొన్ని ఆటంకాలు! అక్రమ ట్యాపింగ్ వ్యవహారం మూలాలు బయటపడాలన్నా, సూత్రధారులను తేల్చాలన్నా సాంకేతిక ఆధారాలు కీలకం. అందుకే వాటిని సేకరించడానికి సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఓ నిఘా విభాగం నుంచి నగర పోలీసులకు సరైన సహకారం అందట్లేదని తెలిసింది. అందుకే దర్యాప్తు జాప్యం అవుతోందని సమాచారం. కేసు దర్యాప్తు కోసం అధికారులు అడిగిన పలు సున్నిత అంశాలు తెలపడానికి, ఉపకరణాల విశ్లేషణ కోసం సదరు నిఘా విభాగం అధికారి అనుమతించట్లేదని తెలిసింది. పోలీసులు వచ్చి తమ విభాగంలో అంశాలన్నీ పరిశీలిస్తే.. బయటి ప్రపంచానికి తెలిసిపోతాయని, తద్వారా వ్యూహాలు దెబ్బతింటాయని చెప్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము కీలక ఆపరేషన్లు చేపట్టలేమని సదరు అధికారి పేర్కొంటున్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నేతలు? భుజంగరావును శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఆయన నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను విచారించిన సమయంలో, ఉపకరణాల విశ్లేషణలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ట్యాపింగ్ చేయాల్సిన టార్గెట్ల వివరాలు ఆయనకు నేరుగా ఓ ముఖ్య నేత నుంచి వచ్చినట్టు తేలింది. డీఎస్పీ ప్రణీత్‌రావుకు మరో కీలక నేత నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఆ నేతల పాత్రకు సంబంధించి పలు ఆధారాలు లభించిన నేపథ్యంలో.. కేసులో వారి పేర్లను చేర్చాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయాలని, వారి స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించించారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ఈరోజు ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్‌రావు నైజిరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం...
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం: ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. ఫోన్లతో మొదలుపెట్టి.. నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది. ఉప ఎన్నికల వేళ ట్యాపింగ్.. దీనివల్ల జరుగుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకులు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సాఫ్ట్వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం. ‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు! కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయకుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం. -
‘ట్యాపింగ్’లో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ వేగం పెంచింది. ఎస్ఐబీకి చీఫ్‌గా వ్యవహరించిన ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు బృందంలో పనిచేసిన మరి కొందరు అధికారులను శుక్ర, శనివారాల్లో ప్ర శ్నించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న శనివా రం సిట్ ఎదుట హాజరుకాగా.. మరో అదనపు ఎస్పీ భుజంగ్రావును అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైద రాబా ద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతా ల్లో ఈ వ్యవహారంతో సంబంధమున్న వారి నివాసాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఫోన్లతో మొదలుపెట్టి.. నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్ల లో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది. దీనివల్ల ఒనగూ రుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకు లు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చే సేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేప థ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సా ఫ్ట్‌వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం. ‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు! కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయ కుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం. అమెరికా వెళ్లిపోయిన ఆ ఇద్దరు..: డీఎస్పీ ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడగానే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు దేశం దాటేశారు. ఈ వ్యవహారంపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదై, ప్రణీత్‌రావును అరెస్టు చేశాక హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఫార్మా కంపెనీ నిర్వహించే తమ సన్నిహితుడి వద్ద ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. విచారణలో కీలక అంశాలు.. సిట్ అధికారులు శుక్ర, శనివారాల్లో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ్రావులను విచారించారు. ప్రభాకర్‌రావు హయాంలో తిరుపతన్న ఎస్ఐబీలో, భుజంగ్‌రావు సాధారణ ఇంటెలిజెన్స్‌లో పొలిటికల్ వింగ్‌ను పర్యవేక్షించారు. వీరి నుంచి సిట్ అధికారులకు ట్యాపింగ్‌కు సంబంధించి కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ఇక ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుతోపాటు అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఇతరుల నివాసాలు కలిపి మొత్తం 10 చోట్ల సిట్ అధికారులు శనివారం సోదాలు చేశారు. నాలుగైదు నెలల ముందు నుంచే డేటా ధ్వంసం నిందితుడు ప్రణీత్‌రావు, అనుమానితుల వి చారణ, సేకరించిన ఆధారాలన్నింటినీ విశ్లే షించినా ప్రభాకర్‌రావు బృందం ఎందరి ఫో న్లను ట్యాప్ చేసిందనేది చెప్పలేకపోతున్నా మని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాజ కీయ అవసరాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కోసం ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ల ట్యా పింగ్ జరిగిందని.. ఆ డేటాను కొందరు ప్రైవే ట్ వ్యక్తులకూ కాపీ చేసి ఇచ్చారని తెలుస్తోందని తెలిపారు. ప్రణీత్‌రావు తదిత రులు గత ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నుంచే డేటాను ధ్వంసం చేయడం మొదలెట్టా రని.. డిసెంబర్ 4 రాత్రి హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం అందులో భాగమేనని సమాచారం. హార్డ్‌డిస్క్‌లతో పాటు హ్యాకింగ్ ఉపకరణాలు, సాఫ్ట్వేర్లనూ ధ్వంసం చేశారా? అనేది తేలాల్సి ఉంది.