ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు TV5 Sambasivarao: Another Sensation Came To Light In Phone Tapping Case | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు

Published Thu, Jul 4 2024 3:41 PM | Last Updated on Thu, Jul 4 2024 5:03 PM

TV5 Sambasivarao: Another Sensation Came To Light In Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్‌లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్‌రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్‌ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్‌ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్‌గా బీఆర్‌ఎస్‌కు రూ.13 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న  హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు, కాల్‌ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేసి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది.

సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్‌ఎస్‌కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.

శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్‌ఎస్‌ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.

అడ్డంగా దొరికిన టీవీ5 సాంబశివరావు

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement