సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ6 శ్రవణ్ రావును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎస్‌ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపైన నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు.. ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
అమెరికాలో ప్రభాకర్‌రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రవణ్‌రావు ఆచూకీని దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. శ్రావణరావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు సమాచారం.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని.. ఎస్‌ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌రావు అమెరికాకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment