
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, పేద ప్రజలకు సంక్షేమాన్ని పంచిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌పార్టీ పాతికేళ్ల పండుగ సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో తన ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.
⇒ ప్రజలు ఒక్కసారి చేసే పొరపాటుతో కాంగ్రెస్‌ను ఐదేళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొం ది. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్ అని, బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ద్వారా మరోసారి రుజువు కానుంది.
⇒రెండున్నర దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే తెలంగాణ రాష్ట్ర సాధన కల సంతృప్తి ఇచి్చంది. హైదరాబాద్ పాతబస్తీ నుంచి పాతికేళ్లుగా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నా, టీఆర్‌ఎస్ పార్టీ అవిర్భావం కంటే ముందు పత్రికలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం రాబోతున్నట్లు చదివి వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కలిశా..
⇒హైదరాబాదీ ముస్లిం – తెలంగాణ ఉద్యమంలో ఎలా కలిసివస్తావని పలువురు ప్రశి్నంచారు. అప్పుడు నేను విద్యార్ధి దశలోనే 1969 తెలంగాణ ఉద్యమ్యంలో కీలక పాత్ర పోషించా. ఆ తర్వాత ఉద్యమం చల్లారడం కుటుంబ వ్యాపారంలో నిమగ్నమయ్యా.
⇒తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల పెత్తనం పోయి మా నీళ్లు. మా విద్యుత్, మా ఉద్యోగాలు మాకు వర్తిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. అప్పుడు నన్ను పై ఫ్లోర్‌కు తీసుకేళ్లి నా పేరు అడిగి మహమూద్ భాయి.. మాతో జత కలవండి ...కోట్లాది తెలంగాణ సాధిద్దామని చెప్పి భరోసా ఇచ్చాÆరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పిలుపు..
⇒ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక తండ్రిగా కేసీఆర్ ను గౌరవిస్తూ వ్యూహాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నా. పార్టీ ఆవిర్భావం నుంచి తన నివాసంలోని అఫీస్‌లో కేసీఆర్‌కు ప్రత్యేక చాంబర్, కుర్చీ ఉందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పారీ్టలో జీవిత కాలం రెండో సభ్యత్వం నాదే..
⇒ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుంటే తన తల్లి, సతీమణి మినహా బంధువులు, మిత్రులు, తోటి వ్యాపారులందరూ ఉద్యమం పేరుతో తూటాలు, లాఠీ దెబ్బలు ఎందుకు తింటావు... ప్రశాంతంగా వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు.
⇒ కానీ, తెలంగాణ సాధన కల లక్ష్యంతో ముందుకు సాగితే.. ప్రత్యేక రాష్ట్ర సాకారంతో పాటు ఊహించని విధంగా డిప్యూటీ సీఎం,హోం మంత్రి లాంటి కీలక పదవులు నిర్వహించే భాగ్యం కలిగింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా.. ఆయన చేతికి ఇమామ్–ఎ–జామీన్ కడుతున్నా.
⇒ఒక సారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1000 కార్ల ర్యాలీ బయలు దేరినప్పడు తాను జ్వరంతో ఇమామ్–ఏ జామిన్ కట్టడం మర్చిపోగా.. మహమూద్ భాయి దట్టీ తేలేదా అని అడిగి చాంద్రాయణ గుట్ట వద్ద అరగంట సేపు ర్యాలీ నిలిపి వేశారు .దట్టి తీసుకొచ్చి కట్టి తర్వాత ర్యాలీ ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు.