Mahmood Ali
-
కాంగ్రెస్‌పార్టీ మైనార్టీలను మోసం చేసింది: మాజీ హోం మంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గతంలో మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌పార్టీ ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోయిందని, ఓట్లు వేయించుకుని మైనార్టీలను కాంగ్రెస్‌పార్టీ నాయకులు మోసగించారని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మైనార్టీలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఏ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాన మంత్రి మోదీని బడే భాయ్ అని సంబోధించారని, అసలు కాంగ్రెస్‌పార్టీ సెక్యులర్ పార్టీయా.. కాదా..? అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. -
గణతంత్ర వేడుకలు: స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా స్పృహ తప్ప కిందపడిపోయారు. దీంతో, హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర బీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. pic.twitter.com/FkgrFqc0iF — Telugu Scribe (@TeluguScribe) January 26, 2024 -
‘కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’
సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై హోంమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముందు రేవంత్‌రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రం.. నంబర్‌వన్ సీఎం కేసీఆర్.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
నేరస్తులపై నిఘా పెంచండి
సాక్షి,హైదరాబాద్:నేరాలకు పాల్పడుతున్నవారిపై నిఘా పెంచాలని, అవసరమైతే రౌడీషిటర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. చీకటి ప్రదేశాల్లో, భారీ నిర్మాణాల దగ్గర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఫ్లై ఓవర్లు, పాఠశాలల వద్ద మద్యం, గంజాయి సేవించడంపై నిఘా ఉంచాలని సూచించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై–పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న నేరాలు, హత్యలపై హోంమంత్రి మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్ షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని సూచించారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను కొన్ని గ్రూపులు ప్రబలంగా ప్రసారం చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉందని హోంమంత్రి అన్నారు. ఫంక్షన్ హాళ్లలో అర్ధరాత్రి వరకు గడపవద్దని ప్రజలను కోరారు. విధి నిర్వహణలోని పోలీసులకు ప్రజలు సహకరించాలని, భద్రత కోసం ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు చేయూతనివ్వాలన్నారు. -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్ర మాసంగా పాటించే రంజాన్ నెల చివరి రోజైన ‘ఈద్ ఉల్ ఫితర్’పండుగ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నివాసంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందరికీ కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ ఆతిథ్యాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి కేసీఆర్ స్వీకరించారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, క్షమాగుణం, కరుణ తదితర ఆధ్యాతి్మక భావనలు తదితర అంశాలపై కేసీఆర్ తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, ఇతరులను పేరుపేరునా పలకరించి అలాయ్ బలాయ్ తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ తదితరులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించిన సీఎంకు మహమూద్ అలీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపికను బహూకరించారు. -
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్‌కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. -
గ్రూప్–1 మెయిన్స్ ఎంపిక నిష్పత్తిపై పరిశీలన..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న శాసనసభ సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్పీఎస్సీకి ప్రతిపాదిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం బిల్లులపై చర్చలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశంపై ఆయన స్పందిస్తూ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 నిçష్పత్తిలో టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని వివరించారు. నిష్పత్తిలో మార్పులు చేసి 1:100గా ఎంపిక చేయాలన్న సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్పీఎస్సీకి సూచిస్తామని తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు, కొత్త భవనాలపై సభ్యులు సూచనలు చేయగా..చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
రాష్ట్రానికి విచ్చేసిన బీఆర్ఎస్ అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి బీఆర్ఎస్ ఆహ్వానించిన ప్రముఖులు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వారికి మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్కు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు. కాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆహ్వానించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రవీంద్ర చారి, పర్వతాలు, స్టాలిన్ తదితరులు స్వాగతం పలికారు. కంటి వెలుగు కోసమే వచ్చా: కేజ్రీవాల్ తాను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చానని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇది ఒక అధికారిక కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన కేజ్రీవాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఇందిరా శోభన్, డాక్టర్ దిడ్డి సుధాకర్, శోభన్ బాబు భూక్య, బుర్ర రాము గౌడ్, డాక్టర్ అన్సారీ కలిశారు. -
హోం మంత్రి అలీతో డీజీపీ అంజనీకుమార్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కొత్త డీజీపీ అంజనీకుమార్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీని ఆయన అధికార నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సైతం హోం మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న జితేందర్, ఏసీబీ నూతన డీజీపీ రవిగుప్తా సైతం మహమూద్‌అలీని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్‌రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్‌ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్‌రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు. మహేందర్‌రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్‌లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్‌రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్‌రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీగా మహేందర్‌రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు. -
నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుక
సాక్షి, సిటీబ్యూరో: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. నగర పరిధిలోని చర్చిల వారిగా నిరుపేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీకి ఏర్పాట్లు, విందు నిర్వహణ కోసం నియోజకవర్గానికి లక్ష రూపాయల చొప్పున కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. మరోవైపు ప్రభుత్వం పక్షాన ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున విందు ఇవ్వనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకల ల«బ్ధి చేకూరనుంది. ఘనంగా ఏర్పాట్లు చేయాలి : తలసాని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై నగరంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రిస్మస్ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలోమంత్రి మహమూద్ అలీ, మండలి ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణి దేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలోనే ఉత్తమ వైద్యసేవలు
దూద్‌బౌలి(హైదరాబాద్): దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు ఉచిత వైద్యసేవలను అందించేందుకు ప్రభుత్వాసుపత్రులను సీఎం కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఇక్కడి పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో మూడు టిఫా స్కానింగ్ మెషీన్లను హెల్త్ కమిషనర్ శ్వేత మహంతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను అందిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు 35 శాతం నుంచి ప్రస్తుతం 66 శాతానికి పెరిగారని చెప్పారు. ఆన్లైన్లో సభనుద్దేశించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ గర్భిణులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడంలో భాగంగా రూ.10 కోట్లతో 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మెషీన్లను ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినప్పుడు స్కానింగ్ మెషీన్ల సమస్య ఉందని తెలపడంతో ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, రెండునెలల్లోనే పరిష్కరించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 లక్షల 66 వేల మందికి కేసీఆర్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు జీహెచ్ఎంసీ ఆసుపత్రులుండగా, ఇప్పుడు 26కు పెంచినట్లు హరీశ్ చెప్పారు. వైద్యసేవలను అందించడంలో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, డబుల్ ఇంజన్ సర్కార్‌గా చెప్పుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్ చివరిస్థానంలో ఉందన్నారు. ఆన్లైన్లోనే మంత్రి హరీశ్‌రావు రాజ్యలక్ష్మి అనే గర్భిణితో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. పని చేసే మంచి మంత్రి.. హరీశ్‌రావుతో ఆసుపత్రి సూపరింటెండెంట్ మాలతి ఆన్లైన్లో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రికి వస్తున్నారని తమ పనిమనిషికి చెప్పడంతో పనిచేసే మంచి మంత్రి హరీశ్‌రావు అని కితాబు ఇచ్చారని, అలాగే తనకు సంబంధించిన 20 గుంటల వ్యవసాయభూమి రిజిస్ట్రేషన్ కావడం లేదని మంత్రికి తెలపాలని కోరారని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత పత్రాలు, పనిమనిషి ఫోన్ నంబర్ హెల్త్ కమిషనర్‌కు ఇవ్వాలని, దానిని వెంటనే పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశం, డీఎంఈ రమేశ్ రెడ్డి, శ్రీవాత్సవ్, ఆర్ఎంవో జైన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటే
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమ వారం రవీంద్రభారతిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు. గత పాలకులు కులవృత్తులను విస్మరించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి స్థలంతో పాటు రూ.5 కోట్ల నిధులను కేటాయించినట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మత్స్యకారుల చేపల పెంపకం కోసం రూ.185 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం పలు రంగాల్లో రాణిస్తున్న ముదిరాజ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్, యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జగన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల సంక్షేమంలో తెలంగాణ టాప్’
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): పోలీసుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమమని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో టీఎస్ఎస్పీ కన్వెన్షన్ సెంటర్‌ను గురువారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రూ.12 కోట్లతో ఈ కన్వెన్షన్‌ను నిర్మించామని, పోలీసులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికి కేటాయిస్తామని పేర్కొన్నారు. పార్కింగ్తో పాటు అన్ని అత్యాధునిక వసతులతో ఈ కన్వెన్షన్‌ను నిర్మించినట్టు వివరించారు. కార్యక్రమంలో ఏసీబీ డీజీ అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ పాల్గొన్నారు. -
పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భార్య మృతి) -
భళా.. వుడ్ విల్లా
మహేశ్వరం: మ్యాక్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి కెనడియన్ వుడ్ విల్లాస్‌ను నిర్మించడం అభినందనీయమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మహేశ్వరం మండలం, తుమ్మలూరు సమీపంలో నిర్మించిన వుడ్ విల్లాస్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో ఎంతో ఆకర్షణీయంగా విభిన్న శైలిలో వుడ్ విల్లాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పర్యావరణ హితమైన డిజైన్, సృజనాత్మకత కలిగిన కళా నైపుణ్యాల మిశ్రమం ఈ వుడ్ విల్లాస్ సొంతమన్నారు. కాంక్రీట్, ఉక్కు నిర్మాణాలతో పోలిస్తే వుడ్ విల్లా శ్రేయస్కరమన్నారు. హైదరాబాద్‌లో వుడ్ విల్లా కల్చర్ రావాలని ఆయన ఆకాంక్షించారు. మ్యాక్ ప్రాజెక్ట్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. వుడ్ అనేది స్థిరమైన, పునరుత్పాదక, ప్రకృతి సిద్ధమైన నిర్మాణ సామగ్రి అన్నారు. మ్యాక్ ప్రాజెక్టులో కెనడియన్ వుడ్‌తో మరిన్ని విల్లాలను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కెనడా హై కమిషనర్ కామెరాన్ మాకే, ఫారెస్ట్రీ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ సీఈఓ మైఖల్ లోసేత్, కెనడియన్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధుపై సమగ్ర నివేదిక సమర్పించండి
సాక్షి, సిటీబ్యూరో: దళిత బంధు యూనిట్ల పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతగా దళిత బంధు కింద లబ్ధి పొందిన వారి వివరాలు, యూనిట్ ప్రస్తుత పనితీరు, సాధించిన ఫలితాలు తదితర వివరాలతో ఫోటో, వీడియో గ్రఫీని సేకరించి నివేదిక రూపంలో ఈ నెల 20 వ తేదీ లోగా అందజేయాలని సూచించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దళితబందు పథకం అమలు జరుగుతున్న తీరుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం అమలులో ఎలాంటి విమర్శలకు, ఫిర్యాదులకు అవకాశం లేకుండా నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన దళితులందరికీ.. ►అర్హులైన దళితులందరికి దశల వారిగా ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి ఆర్ధిక సహాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ►హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దరఖాస్తు చేసుకోగా, 1462 మంది ఖాతాలలో 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు మంత్రి వివరించారు. వీరిలో 1200 మంది లబ్ధిదారులకు వారి యూనిట్ లను అందజేయడం జరిగిందని చెప్పారు. ►మొదటి విడతలో మంజూరై గ్రౌండింగ్కానీ యూనిట్లను ఈ నెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సాయన్న, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘అపెక్స్’కు పాలమూరు, నక్కలగండి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ (ముందు జలాలు) నుంచి నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. కర్ణాటక ఆందోళనలు, అభ్యంతరాలకు తావు లేదని పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామని, నక్కలగండి డీపీఆర్‌కి తుదిరూపు ఇస్తున్నామని కౌన్సిల్‌కి నివేదించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోరగా.. సదరన్ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని, సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని అమిత్ షా సూచించారు. మాకే రూ.17,828 కోట్లు రావాలి ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండానే.. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.6,756 కోట్ల బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తమను ఏకపక్షంగా ఆదేశించిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిలపై సదరన్ కౌన్సిల్లో పరిశీలన జరపాలని గత మార్చి 28న 12వ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, కేంద్రం తొందరపడి ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టింది. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటాం ►ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన సమస్యను పరస్పర అంగీకారంతో ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ►మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, అత్యాచారాల కేసుల త్వరితగతిన విచారణ, పురోగతిపై అదనపు డీజీ స్వాతి లక్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అమిత్‌షా ప్రశంసించి ఇతర రాష్ట్రాలకు సైతం సహకరించాలని సూచించారు. ►పన్నుల విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్ట సవరణ జరపాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ►సెక్షన్ 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనతోపాటు సెక్షన్ 66పై ఏపీ అభ్యంతరాల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర హోంశాఖను అమిత్ షా ఆదేశించారు. ►షెడ్యూల్–9లోని 90 ప్రభుత్వరంగ సంస్థల విభజనను ఏకకాలంలో జరపాలని ఏపీ కోరగా, ఎలాంటి వివాదా లు లేని 53 సంస్థల విభజనను ముందుగా పూర్తి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన వివాదాలను క్రమంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జల వివాదాలను ఉమ్మడిగా పరిష్కరించుకోండి: అమిత్ షా నీటి వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలు వెదకాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఏపీ, తెలంగాణ తమ పెండింగ్ సమస్యలన్నింటినీ పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై గొడవలున్నాయని మంత్రి గుర్తు చేశారు. అనంతరం భేటీ విశేషాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘భేటీలో 26 అంశాలపై చర్చ జరిగింది. తొమ్మిదింటికి పరిష్కారం లభించింది. మిగతా 17 అంశాలపై మళ్లీ చర్చించాలని నిర్ణయం జరిగింది. వీటిలో 9 అంశాలు ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవే’అని పేర్కొంది. విభజన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం: హోంమంత్రి మహమూద్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటం పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన రాష్ట్రం తరపున పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంశాఖ చొరవతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. -
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోము: హోం మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ముస్లిం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలు పాతబస్తీలో మోహరించాయి. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ తాజాగా మీడియాతో మాట్లడుతూ.. ‘‘శాంతియుత వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. బీజేపీ రౌడీయిజం చేస్తే సహించేది లేదు. బీజేపీ అయినా.. ఎంఐఎం అయినా తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రాజాసింగ్‌కు మరో షాక్ -
పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు పొలిటికల్ లీడర్ల కొడుకులు కావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మహమూద్ అలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది. కాబట్టి వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి తొలగింపు నా పరిధిలో లేదు. అమ్నేషియా పబ్‌లో మైనర్‌పై లైంగిక దాడి కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘యాక్షన్.. ఓవరాక్షన్’ అసలు సంగతి ఇదే!..కానిస్టేబుల్‌పై వేటు -
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ లౌకికవాద రాష్ట్రంగా విరాజిల్లుతోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో... మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 3నుంచి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షల్లో ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రి వేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసేయించొద్దని సూచించారు. -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
మహిళల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
ఖైరతాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహిళా బంధు పేరుతో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలు లేనిదే ప్రపంచమే లేదన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా మారారని కొనియాడారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీతా యాదవ్‌తో పాటు ఆశా, పారిశుద్ధ్య కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎస్.కె.హైమద్, సలావుద్దీన్, వనం శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
శంషాబాద్ రూరల్: డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు శాంతిభద్రతల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఆదివారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో కొత్తగా నిర్మించిన శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌ను శ్రీత్రిదండి చినజీయర్‌స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరా అదుపునకు సీఎం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి, డీజీపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీస్ శాఖకు రూ.700 కోట్లు మంజూరుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరో రెండు నెలల్లో పోలీస్ కమాండింగ్ కంట్రోల్‌ను ప్రారంభిస్తామన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం కోటా కల్పించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. స్టార్ హోటల్ తరహాలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక హంగులతో రూ.4.5 కోట్ల వ్యయంతో మైహోం సంస్థ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
Flyover: అబ్దుల్ కలామ్ ఫ్లై ఓవర్ ప్రారంభం
-
‘సీటీ’జనులకు గుడ్‌న్యూస్... 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. హెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్’ ఫ్లై ఓవర్‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్‌కు ఆయన పేరును నామకరణం చేశారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఫ్లైఓవర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే రూ.80 కోట్ల వ్యయంతో 1.365 కిలో మీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారిగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) -
సదరన్ జోనల్ కౌన్సిల్‌కు మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బదులు రాష్ట్రం తరఫున ప్రతినిధిగా హోంమంత్రి ఎం.మహమూద్ అలీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిసోమేశ్కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళినాడు, కేరళ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్లు పాల్గొననున్నారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు, సహకార సమాఖ్య విధానం అమలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు, నీళ్ల పంపకాలు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలను ఇరు రాష్ట్రాలు ఈ సమావేశంలో ప్రస్తావించి తమ వాదనలు వినిపించే అవకాశముంది. -
ఈటల ఓటమికి ప్రయత్నించారంటూ వెయ్యికి పైగా ఫోన్లు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇచ్చారని, ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని ఆగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో పెట్టి ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండ్రోజుల నుంచి వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధిస్తోందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనను ఇటీవల అభినందించిన వ్యవహారాన్ని గుర్తుచేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి న్యాయం చేస్తామన్న హామీ లభించిందని కృష్ణయ్య తెలిపారు. (చదవండి: TSRTC: బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్) -
ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ప్రజా కవి కాళోజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాళోజీ జీవిత చరిత్రను పొందుపరిచామని, కాళోజి పేరుమీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమంత్రి సీరియస్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్‌లో తెలంగాణ డీజీపీ ప్రోటోకాల్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు బ్లాక్ చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు అంబులెన్స్‌లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అందులో ఎమర్జెన్సీ కేసులూ ఉన్నాయి. అంబులెన్స్ సైరన్ మోగుతున్న తమకేం పట్టన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించారు. ఈ ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు దాదాపు గంటకు పైగా చిక్కుకున్నాయి. ఎంత సేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి అంబులెన్స్‌లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే దారివ్వాలని కోరారు. అయితే దానికి ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా మాసబ్ ట్యాంక్ పోలీసుల నిర్లక్ష్యంపై హోంమంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఘటనపై హైదరాబాద్ సీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. అయితే మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని సీపీ హోంమంత్రికి తెలియజేశారు. -
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్: డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. -
లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులతో చర్చించాం.. అయితే లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. సమీక్ష తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, రాత్రికర్ఫ్యూ అమలుపై బుధవారం పోలీస్ శాఖ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని పోలీసుల అధికారులకు చెప్పారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజెక్షన్ వరకూ జరుగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ -
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్స వాల్లో సమర్పించే చాదర్(గిలాఫ్)ను సీఎం కేసీఆర్ గురువారం పంపారు. ప్రత్యేకంగా రూపొందించిన చాదర్‌ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమిం చాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరో గ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థిం చారు. ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో పుట్టి పెరిగారు. చట్టసభకు ఎంపికయ్యారు. రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నారు. బల్దియా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ ఆజంపురా కేంద్రంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు హోంమంత్రి మహమూద్ అలీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ► టీఆర్ఎస్ ఎన్ని డివిజన్లను కైవసం చేసుకుంటుంది? బల్దియాలో గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరిగింది. నగరం మెరుస్తోంది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి గ్రేటర్ జనం ఓటు వేస్తారని భావిస్తున్నాం. వంద డివిజన్లకుపైగా గెలుస్తాం. ► మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందా? మేం సొంతంగా 150 డివిజన్లలో బరిలో నిలిచాం. మాకు ఏ పారీ్టతోనూ పొత్తు లేదు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లలో గెలిచాం. పాతబస్తీలో ఈసారి 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం. మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ► నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో పోలీస్ శాఖ పని చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నగర శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలో వచి్చనప్పటి నుంచి నగర ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మతకల్లోలాలు, కర్ఫూలు, ఘర్షణలు లేవు. క్రైమ్ రేట్ ఇతర నగరాల కంటే చాలా తక్కువగా ఉంది. ►నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదనే విమర్శలపై మీరేమంటారు? టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నగరంలో గంటల తరబడి విద్యుత్తు ఉండేది కాదు. ప్రస్తుతం 24 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. తాగునీరు పుష్కలంగా వస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. రూ.5కు భోజనం అందిస్తున్నాం. విద్య, వైద్య వ్యవస్థలు మెరుగుపడ్డాయి ►టీఆర్ఎస్ పాలనలో మైనారిటీల సంక్షేమం ఎలా ఉంది? ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్యులర్ నాయకుడు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కేవలం మైనారిటీలనే కాదు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెట్టాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ►మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారానే విమర్శలున్నాయి? మతత్వ పార్టీలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పింగిచాలని చూస్తున్నాయి. ఆ పార్టీల ఆగడాలు సాగవు. నగర ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అన్ని మతాలను గౌరవిస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదు. -
త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది సబ్– ఇన్స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 18,428 మంది ఎస్ఐ, కానిస్టేబుళ్ల నియా మకం జరిపామని, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా నియ మించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తూ సాంకేతికతను విరివిగా ఉపయోగిం చడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణనిచ్చామని తెలిపారు. -
ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లా మారుతోందని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మాదిరిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, దోషులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నివాసాన్ని సంపత్‌తోపాటు కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అందరిని అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హోంమంత్రి సంపత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: టీఆర్ఎస్ నేతల బాహాబాహి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. ‘నిన్న(బుధవారం) కేసీఆర్ శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఆదర్శంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్‌కు సిగ్గు ఉందా. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టీఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు ఇది ఆదర్శంగా ఉందా. ఖమ్మంలో బాలికపై అత్యాచారయత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు. ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరామర్శించారా. ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. హోంమంత్రి రాజీనామా చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా.. -
టీఆర్ఎస్ నేతల బాహాబాహి
-
తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్
-
తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ కోవిడ్ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు నేడు రాగా, అందులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ( చదవండి : కరోనా: 24 గంటల్లో 19 వేల కేసులు) కాగా, రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది. టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం తెలంగాణలో కరోనా పరిస్థితి, రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించింది. కరోనా నివారణ చర్యలపై ఆరా తీసింది. అనంతరం గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌ను కూడా కేంద్ర బృందం పరిశీలించింది. మధ్యాహ్నం కంటైన్మెంట్ దోమలగూడ దోబీగల్లీలో పర్యటించనుంది. -
అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్రంట్లైన్లో ఉన్న పోలీస్ అధికారులు కరోనా వైరస్ బారిన పడుతున్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ధైర్యాన్ని కోల్పోకుండా అధికారులు విధులు నిర్వర్తించారని తెలిపారు. ఇప్పుడు చిన్న స్థాయి అధికారి నుండి పెద్దస్థాయి అధికారి వరకు కరోనా బారిన పడుతున్నారని, ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. (డేంజర్ బెల్స్ !) తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని భయాందోళనలకు గురికావొద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు. కరోనా బారిన పడిన పోలీసులు తిరిగి కోలుకుని విధుల్లోకి చేరారని, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. లాక్డౌన్ నుంచి నేటి వరకు విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎప్పుడు ముందున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. -
ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని
సాక్షి, హైదరాబాద్ : ఆగష్టు నెల నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో 50 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దసరా నాటికి లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి అందిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై బుధవారం మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ అధికారులు హజరయ్యారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. జీహెచ్ఏంసీ పరిధిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా ఇళ్ల నిర్మాణాలు ఆగలేదని, శరవేగంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. (డబుల్ బెడ్రూం నిర్మాణాలపై కేటీఆర్ సమీక్ష) -
ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు : హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. కోఠి, సుల్తాన్ బజార్లో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత సంతోష్‌గుప్తా ఆధ్వర్యంలో 500 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలను హోం మంత్రి పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ మే 7 వరకూ లాక్డౌన్ పొడిగించారని, ప్రజలంతా సహకరించాలని మహమూద్ అలీ కోరారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. -
హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమీక్ష నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో మహమూద్ అలీ సీఎంను కలిసేందుకు వచ్చారు. ప్రగతిభవన్ ప్రవేశ ద్వారం వద్దే ఆయన్ను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్ అలీ తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ముఖ్యమైన సమీక్ష నిర్వహిస్తున్నందున లోపలికి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని, హోంమంత్రి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన వెళ్లిపోయారని ముఖ్యమంత్రి ముఖ్య భద్రతా అధికారి ఎంకే సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఎవరూ అడ్డుకోలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన హోంమంత్రికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదని హోం మంత్రి కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెళ్లగా.. అదే సమయానికి ఆయన గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధపడ్డారని తెలిసి హోంమంత్రి వెనుదిరిగారని వివరించారు. ము ఖ్యమంత్రిని కలుసుకోవడంలో హోంమంత్రి మహమూద్ అలీకి ఏనాడూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవలేదని, ఆయనను ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదని స్పష్టంచేశారు. -
‘ఈనాడుపై వెయ్యి కోట్లకు దావా’
సాక్షి, హైదరాబాద్: తమ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారని, ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌గా నిలిచారని, నేరం జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని హోంమంత్రి ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనాడు కథనంలో వాస్తవాలు లేవని అన్నారు. రాజకీయ నాయకులు చెప్తే పోలీస్ పోస్టింగ్‌లు వస్తున్నాయనేది అవాస్తవమని, బదీలీల వ్యవహారాన్ని గమనించడానికి ఓ ప్రత్యేక విభాగం ఉందని వెల్లడించారు. ఏ అధికారి ఎలా పని చేస్తున్నారనే దానిపై నిఘా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ భద్రత పరంగా బాగుండడానికి పోలీసుల పనితీరే కారణమని, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. ఏ ఆధారాలతో కథనాలు రాశారో ఈనాడు ఎడిటర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనం ప్రచురించిన ఈనాడు సంపాదకులు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రభుత్వం తరపున వెయ్యి కోట్ల దావా వేస్తామని హెచ్చరించారు. (‘మేము బిజీగా ఉన్నాం.. వాళ్లకు పనిలేక’..) ఈనాడుపై చట్టప్రకారం చర్యలు: సజ్జనార్ ఈనాడు రాసిన కథనం పోలీసులను అవమానించేలా ఉందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. నేరాలు తగ్గే విధంగా పోలీసులు పనిచేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, పోలీసు అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసుల వివరణ కూడా తీసుకోవాలని సూచించారు. ఏ అధికారి తప్పు చేశారని తమ దృష్టికి వచ్చినా తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు పోస్టింగ్ ఇస్తున్నామని రాయడం బాధాకరమని, ఇది పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందన్నారు. ఈనాడుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు ‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం తెలంగాణ పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉందని చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం శ్రమిస్తోందని, ఇలాంటి వార్తలు ప్రచురించడం వలన పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడుపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివరణ ఇవాలి: అడిషనల్ డీజీపీ దొంగలతో దోస్తీ కథనంలో వాస్తవం లేదని, ఈ వార్తపై ఈనాడు వివరణ ఇవాలని అడిషనల్ డీజీపీ(శాంతి భద్రతలు) జితేందర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త రాయడం బాధాకరమని, వాస్తవాలు మాత్రమే ప్రచురించాలని అన్నారు. పోలీసుల పోస్టింగుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. శాంత్రి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. -
ఐదో రోజూ 144 సెక్షన్... ‘అంతా ప్రశాంతం’
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో 144 సెక్షన్ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ శుక్రవారం కావడంతో అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి నిర్మల్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి ప్రత్యేక అనుమతులు లభించినట్టు తెలిసింది. (చదవండి : ఎప్పుడేం జరుగుతుందో..?) అంతా ప్రశాంతంగా ఉంది : హోంమంత్రి భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి తప్ప అక్కడ ఎలాంటి అలజడి లేదని పేర్కొన్నారు. ఇక కేసులు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్ని డిపార్ట్మెంట్లో చేర్చుకోబోమని హోంమంత్రి స్పష్టం చేశారు. 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై ఉన్న కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని విధాలుగా విచారణ చేసిన అనంతరమే వారిని పోలీసు శాఖలో జాయిన్ చేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి : భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి) (చదవండి : ‘ప్రజలు రజాకార్ల పాలన చూడాల్సి వస్తుంది’) (చదవండి : భైంసా ప్రశాంతం) -
పీజీలు చదివి కానిస్టేబుల్ కావడం మంచిదే
సాక్షి, హైదరాబాద్: పీజీ చదివిన వాళ్లు కానిస్టేబుల్‌గా రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇప్పటివరకు విదేశీ పోలీసులను ఆదర్శంగా చూపించేవాళ్లం. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాతబస్తీలో కార్ హెడ్‌క్వార్టర్స్‌లో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు పోస్టుల భర్తీ తెలంగాణలో అధికం ఈ సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు మరింత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అధికంగా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మహమూద్ అలీ తెలిపారు. దేశంలోనే తెలంగాణ నంబర్ 1.. సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 100 డయల్, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, టెక్నాలజీ పోలీస్ సేవలు.. ఇలా అన్ని విధాలుగా తెలంగాణ దేశంలోనే నెంబర్1 స్థాయిలో ఉంది. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు 9 నెలల్లో స్కిల్స్, లా అండ్ ఆర్డర్, టెక్నాలజీ, కోర్టు ప్రోసీజర్, క్రైమ్ ఎవిడెన్స్, ట్రాఫిక్, వీఐపీ సెక్యూరిటీ అన్ని విధాలుగా శిక్షణ అందిస్తాం. కానిస్టేబుల్ శిక్షణ తీసుకునే వారందరూ ఓ రోల్ మోడల్‌గా ఉండాలి. ప్రజలే పోలీసులు-పోలీసులే ప్రజలు.. ఈ సూత్రం అందరూ గుర్తుంచుకోవాలి. సరైన సమయంలో యువత పోలీస్ శాఖలో చేరుతున్నారు. ఉన్నత చదువు చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి రావడం సంతోషకరం. ప్రతిభకు తగ్గట్లుగా వారిని పోలీస్ శాఖలో ఉపయోగించుకుంటాం. ఇక దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా పేరు సంపాదించింది. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’ అని అంజనీ కుమార్ పేర్కొన్నారు. -
తెలంగాణ పోలీసులకు పతకాలు
-
విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తోందన్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో సర్వీస్ మెడల్స్ డెకరేషన్ పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ విధుల్లో విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. పోలీసు అధికారులకు హోంమంత్రి అవార్డులు అందజేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో ప్రావీణ్యం చూపించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందించడం గర్వకారణమన్నారు. రాత్రనక, పగలనక, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన పోలీసు అధికారులకు పతకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టపడి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చారని పోలీసులను ప్రశంసించారు. పోలీసుల సేవకు వారి కుటుంబాలు అందించే ప్రోత్సాహమే కీలకమన్నారు. 400 మందికి పైగా పోలీసు అధికారులకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం రికార్డ్‌గా మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డులు, పీఎం సర్వీస్ మెడల్స్, ఉత్తమ సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర సర్వోన్నత పోలీసు పతకంతో పాటు పలు మెడల్స్‌ను పోలీసులు అందుకున్నారు. మొత్తంగా 418 మంది పోలీసు అధికారులకు పతకాలు బహుకరించారు. -
‘నిందితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై జరిగిన సంఘటనకు కారణమైన నిండితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, అబ్దుల్లాపూర్ మెట్టు తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిపై ఐపీసీ 302, 333, 307 సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అమరుల త్యాగాలే స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చదిద్దేందుకు అహరి్నశలు కృషి చేస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీసు అమరువీరుల దినోత్సవ వేడుకలు సోమవారం గోషామహల్ పోలీసు మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీ సులు విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్రంలో ఎలాంటి అలజడులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1959లో చైనా–భారత్ సరిహద్దులో చైనా దురాక్రమ ణను అడ్డుకునేందుకు ప్రాణాలరి్పంచిన సీఆరీ్పఎఫ్ జవాన్ల అమరత్వానికి చిహ్నం గా ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసు అమరులకు సీఎం కేసీఆర్ నివాళి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అరి్పస్తున్నారని, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉండిపోతారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. -
వీరులను స్మరించుకుందాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాను పాల్గొన్న కార్యక్రమ వివరాలతో ‘జై తెలంగాణ.. జై హింద్’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
‘షీ టీమ్స్ ఆధ్వర్యంలో 8,055 కేసులు’
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధిస్తున్న వారిపై షీ టీమ్స్ ఆధ్వర్యంలో 8,055 కేసులు నమోదు చేసినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఇందులో 2,554 ఎఫ్ఐఆర్ కేసులేనని శాసనసభకు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు పద్మాదేవేందర్, గొంగిడి సునీత, రేఖా నాయక్‌లు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలకు వాటిని విస్తరించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతికి సంబంధించి భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. -
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
-
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి అయింది. ప్రతిరోజు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈఫిల్ టవర్‌కు వినియోగించిన ఇనుము కంటే రెండున్నరెట్లు ఈ భవనానికి వాడారు. ఒకే సమయంలో 972 మంది వెళ్లగలిగేలా 49 లిఫ్టులున్నాయి. ఇవి సెకనుకు ఒక్కో అంతస్తును దాటతాయి. 86 మీటర్ల ఎత్తున్న ఈ భవనంలో విభిన్న రెస్టారెంట్లతో 24 గంటలూ నడిచే భారీ కెఫెటేరియా, హెలిప్యాడ్, 290 కాన్ఫరెన్స్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మాణానికి రూ. 1,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్ నుంచే.. అమెజాన్‌కు యూఎస్ వెలుపల ఇది ఏకైక సొంత భవనం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి. అన్ని కేంద్రాల విస్తీర్ణం 4 కోట్ల చదరపు అడుగులు ఉంది. భారత్‌లో 13 రాష్ట్రాల్లో 50 గిడ్డంగులున్నాయి. ఇక హైదరాబాద్‌లో కంపెనీకి ఎనిమిది ఆఫీసులున్నాయి. 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి నెలకొన్నాయి. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ టీమ్స్తోపాటు పెద్ద ఎత్తున కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. కాగా, నూతన క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. భారత్ నుంచి ఎగుమతులకు ఊతం.. భారత్‌లో అమెజాన్‌కు 30 ఆఫీసులున్నాయి. 62,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. వీరిలో 20,000కుపైగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.55 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ షోట్లర్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్ సెల్లింగ్ వేదిక ద్వారా ఇక్కడి చిన్న వర్తకులు విదేశాల్లో తమ ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కల్పించాం. 50,000 మంది విక్రేతలు 14 కోట్ల ఉత్పత్తులు అమ్మకానికి ఉంచారు. ఇప్పటి వరకు రూ.7,000 కోట్ల విలువైన ప్రొడక్టులు ఎగుమతి అయ్యాయి. వచ్చే మూడేళ్లలో ఇది రూ.35,000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ–కామర్స్ రంగంలో మందగమనం లేదు’ అని వివరించారు. ఆఫీసులో లోపలి ప్రదేశం ఉద్యోగులకు ఆటవిడుపు. ఇండోర్ క్రికెట్ విశాలమైన కార్యాలయం క్యాంపస్‌లో భారీ కెఫెటేరియా -
ముస్లింలకు స్వర్ణయుగం
సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ పాలన ముస్లిం మైనార్టీలకు స్వర్ణయుగం లాంటిదని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ మైనార్టీలకోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేటలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన హజ్‌హౌస్‌ను బుధవారం వారు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో మాత్రమే హజ్‌హౌస్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. దేశంలో ఎన్నోపార్టీలు ఉన్నాయని, వాటిల్లో టీఆర్ఎస్ ఒక్కటే సెక్యులర్ పార్టీ అని రుజువు చేసిందని మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాలను సమానంగా చూడటమే కాకుండా సంక్షేమానికి బడ్జెట్ కేటాయించారని పేర్కొన్నారు. గత పాలకులు మాటలు చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూము లు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఆ భూములన్నీంటిని పరిరక్షిస్తామని చెప్పారు. గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ముస్లిం మైనార్టీలు భాగస్వాములన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో మైనార్టీ సోదరులు ముందువరుసలో ఉన్నారన్నారు. ముస్లిం మైనార్టీల కోసం సీఎం 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ పాఠశాలలను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మహ్మద్ సలీం, ఫారూక్ హుస్సేన్, రాష్ట్ర హజ్ హౌస్ చైర్మన్ మసిహుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్‌యాత్రికులు టీకాలు వేయించుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రలో రోగాల బారిన పడకుండా ఉండేందుకు హజ్ యాత్రికులంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్ శిబిరాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..హజ్ యాత్రకు దాదాపు 150 వివిధ దేశాల నుంచి భక్తులు మక్కాకు వస్తారని, రాష్ట్ర యాత్రికులు అక్కడ రోగాల బారిన పడకుండా ముందస్తుజాగ్రత్తగా టీకాలు వేయిస్తున్నట్లు తెలిపారు. హజ్ యాత్రికులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వారికోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి హజ్ క్యాంప్ ఏర్పాట్లలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. అనంతరం హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ మాట్లాడుతూ..హజ్ యాత్రికుల గురువారం నుంచి మూడ్రోజుల పాటు హజ్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ ఇస్తారని, జిల్లా యాత్రికులకు జిల్లాలో టీకాలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ ఈఓ షఫీవుల్లా, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బోనాల ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు బోనాల పండగ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు, వివిధ పనుల కోసం జీహెచ్ఎంసీ ద్వారా రూ.22 కోట్లు కేటాయించనుందని తెలిపారు. జూలై 4న గోల్కొండ, 21న సికింద్రాబాద్, 28న పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ వాటర్ వర్క్స్ 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను ఏర్పాట్లు చేసిందని, ఆర్ అండ్ బీ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్, విద్యుత్‌కు అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సాంస్కృతిక శాఖ సహకారంతో దేవాలయాల వద్ద సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బోనాల నేపథ్యంలో భక్తుల కోసం అదనంగా మెట్రో ట్రిప్‌లు తిరిగేలా చూడాలన్నారు. ఉత్సవాలకు అవసరమైన ఏనుగును చూడాల్సిందిగా అటవీ శాఖకు సూచించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు అన్ని పనులను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈసారి మరింత మెరుగ్గా.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపుతామన్నారు. పురోహితులను, ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఇన్చార్జీ కమిషనర్, లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఎండీ వాటర్ వర్క్స్ దానకిషోర్, ఎండోమెంట్స్ కమిషనర్ అనీల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
‘అక్కడ ఏ ప్రార్థనా మందిరం కట్టినా ఊరుకోం’
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్ ఫ్లై ఓవర్ వివాదంపై బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్వర్యంలో మంగళవారం హోం మంత్రిని కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లో మా ఎమ్మెల్యేతో సీపీ, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఓ వర్గం వారు అంబర్‌పేట్‌లో స్థానికులపై రాళ్లు రువ్వారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్థన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్ చేస్తే స్థానిక అంబర్ పేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం వారు మందిరం కడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అండ చూసుకునే.. ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతుంది.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబర్‌పేటలో ఏ ప్రార్థన మందిరం కట్టినా ఊరుకోమని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన సీపీ, పోలీసులతో పాటు.. పాషా ఖాద్రి, వక్ఫ్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం
సూర్యాపేట: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని ఆలోచించేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, వివిధ ప్రభుత్వాలు దేశంలో మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో రూ.2,400 కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం పెరిగిందన్నారు. 2004లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ముస్లింల సంక్షేమానికి కేవలం రూ.80 లక్షలే కేటాయించారని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు కేసీఆర్‌లాంటి నాయకులను కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
వచ్చేది ఫెడరల్ ఫ్రంటే..
సాక్షి, జహీరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం రాత్రి జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు 100కు మించి సీట్లు రావని, బీజేపీకి 120కి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదన్నారు. దీంతో కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక పాత్రను పోషించడం ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీలతో జతకట్టి ఫెడరల్ ఫ్రంట్ అధికారం చేపట్టం ఖాయమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఏక ధాటిగా పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు గాను 14 సంవత్సరాల పాటు కేసీఆర్ ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. రాష్ట్రం సాధించి అభివృద్ధిని సాధించడమే కాకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రైతులకు రైతు బంధు, 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు తదితర పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు టీఆర్ఎస్కు మద్ధతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, బ్రూవరీస్ సంస్థ ఛైర్మన్ దేవీ ప్రసాద్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, పార్లమెంట్ ఇన్చార్జి భరత్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు మునిరుద్దీన్, ఎం.శివకుమార్, డి.లక్ష్మారెడ్డి, ఉమాకాంత్ పాటిల్, మంకాల్ సుభాష్, రాములు యాదవ్, తంజీం, వైజ్యనాథ్, మురళికృష్ణాగౌడ్,షేక్ ఫరీద్, నామ రవికిరణ్, వరలక్ష్మి పాల్గొన్నారు. పలువురు టీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తా జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ నుంచి సదాశివపేట, సంగారెడ్డిల మీదుగా సికింద్రాబాద్‌కు కొత్త రైలు మార్గం మంజూరైందని, పనులు త్వరగా ప్రారంభం అయ్యేలా చూస్తానన్నారు. నిమ్జ్ పనులు సైతం వేగవంతంగా సాగేలా చూస్తానన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణం పనులు జరిగేలా కృషి చేశానన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
లష్కర్లో గులాబీ రెపరెపలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో తలసాని సాయికిరణ్ యాదవ్ గెలుపుతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూ చిగా మారాయన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సాయి కిరణ్ గెలుపుతో దేశ చరిత్రలో అతిపిన్న వయస్కుడు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ సీనియర్ నేత వల్లభ్‌కుమార్‌కు మం త్రులు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 25న సాయి కిరణ్ నామినేషన్ ఈ నెల 25న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ వద్ద గల అమరవీరుల స్తూపం నుంచి సాయికిరణ్ యాదవ్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో వెళ్లి అబిడ్స్‌లోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. -
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ది కీలక పాత్ర
సాక్షి, బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే సభలు సమావేశాలతో జోరుమీదుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కిందకు వచ్చే ఖైరతాబాద్ బాధ్యతలను హోంమంత్రి మహమూద్ అలీకి అప్పగించారు. ఈయన నేతలకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాన్ని శనివారం బంజారాహిల్స్‌లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ఖైరతాబాద్ బలమేంటో ఈ సభలో చూపించాలని నేతలకు సూచించారు. దానం నాగేందర్‌తో పాటు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మెజార్టీకి మించి పార్లమెంట్ అభ్యర్థికి రికార్డు స్థాయిలో ఆధిక్యాన్ని తీసుకురావాలని శ్రేణులను ఆదేశించారు. ఇందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దేశం ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమే అయినా మెజార్టీ ఆధిక్యాన్ని చూపించాలని, ఆ మెజార్టీలో ఖైరతాబాద్ ముందుండాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్ర ప్రయోజనాలను తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి బండి రమేష్ కూడా పాల్గొన్నారు. -
ఏ ఇబ్బంది వచ్చినా 100కు ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను గౌరవ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి లక్డీకాపూల్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు మహిళ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. మహిళ భద్రతకి షీ టీమ్స్, క్యాబ్స్, పోలీసు స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మహిళల భద్రతపై ఎంత అప్రమత్తంగా ఉన్న ఇంకా దాడులు జరుగుతున్నాయని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నిందితులకు తగిన శిక్షపడే విధంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. విద్యార్థినులు మొబైల్స్‌లో హాక్ ఐ ఆప్లికేషన్ ఉంచుకోవాలని.. పోలీసులతో కలిసి ముందుకు నడవాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పోలీస్ శాఖకి పెద్ద పీట వేసినట్టు గుర్తుచేశారు. శాంతి భద్రతలను కాపాడటం కష్టం అవుతుందని అప్పటి సీఎం అన్నారని.. కానీ తెలంగాణ ఇప్పుడు శాంతి భద్రతలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో ఉమెన్స్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. షీ టీమ్స్ సారథి ఉన్న స్వాతి లక్రాను ఆయన అభినందించారు. తెలంగాణలో తొమ్మిది కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఐదు శాసనమండలి స్థానాలకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీకి మరోసారి టీఆర్ఎస్ అధినేత అవకాశం కల్పించారు. రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పేర్లను సీఎం శుక్రవారం ప్రకటించారు. మరోసీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా ముందుగా ఊహించినట్లుగానే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందుకు వారు కేసీఆర్‌ను ధన్యవాదులు తెలిపారు. -
టీఆర్ఎస్లో ఎమ్మెల్సీకి పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అధికార పార్టీలో ఎమ్మెల్సీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ (టీఆర్ఎస్), మహమ్మ ద్ సలీం (టీఆర్ఎస్), తిరువరంగరం సంతోష్ కుమార్ (టీఆర్ఎస్), మహమ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రె స్) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. మార్చి 12న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. నామినే షన్ల దాఖలు ప్రక్రియ ముగిసే ఫిబ్రవరి 28 లోపే అభ్యర్థులను ఖరారు చేయాలి. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో 120 మంది సభ్యులు ఉన్నారు. 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో ఒక్కో స్థానానికి 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అసెంబ్లీలో ప్రస్తుత బలాల ప్రకారం అన్ని స్థానాలూ టీఆర్ఎస్కే వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్కు 90, కాంగ్రె స్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. దీంతో ఎన్నికలు జరగనున్న 5 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకో నుంది. హోంమంత్రి మహమూద్ అలీకి మరోసారి అవకాశం అనివార్యం కానుంది. ఇతర పార్టీల్లో ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్ఎస్లో చేరిన అందరికీ సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇదే ప్రాతిపదికన మహమ్మద్ సలీంకు కూడా ఈసారీ అవకాశం దక్కనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సంతోష్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాటిపైనే ఆశలు.. షబ్బీర్ అలీ, పొంగులేటి సీట్లపైనే టీఆర్ఎస్లోని ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసేందుకు స్వామిగౌడ్ సుముఖంగా లేరు. ఎమ్మెల్యే కోటా లో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతిరాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను ఈ స్థానాల కోసం పరిశీలిస్తున్నారు. త్వరలో మరో రెండింటికి.. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానంలో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీ నామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన షెడ్యూల్లో ఈ స్థానాలను పేర్కొనలేదు. త్వరలో ఈ రెండు స్థానాలకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేశాం
సాక్షి, హైదరాబాద్: దండనీతిని పక్కనబెట్టి, ప్రజలకు పోలీసులను చేరువ చేయగలిగామని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో నూతనంగా నిర్మించిన రాచకొండ కమిషనరేట్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్ మహేశ్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పోలీసు ఠాణాకు రావాలంటే.. జనాలు జంకేవారు. నేడు పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇటు నేరాల్ని నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. రాచకొండ కమిషనరేట్‌ను రూ.5.1 కోట్లతో కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేయడం గొప్ప విషయం. భవిష్యత్‌లో ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపడతాం. ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలే కీలకం. అందుకే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.700 కోట్లు కేటాయించి గస్తీకి పెద్దపీట వేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్ వన్‌గా ఉంది. ఇటీవల కేరళ సీఎం వచ్చి పంజగుట్ట పోలీస్ ఠాణాను సందర్శించి ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే 18 వేల ఖాళీలు భర్తీ చేస్తాం. రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్. 13 నియోజకవర్గాలు, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్‌లో మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, పోలీసులు సమన్వయం పనిచేసి మంచిపేరు తేవాలి..’అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు.. పోలీసుల రికార్డులను భద్రపరిచేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ భవనంలో మొదటిసారిగా ఆటోమేటెడ్ రికార్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఆర్‌ఎమ్‌ఎస్) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. పుణేలోని టెక్–మార్క్ ఆటోమేషన్ సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. కానిస్టేబుల్ నుంచి కమిషనర్‡ వరకు.. అందరి సర్వీసు బుక్‌లు, పాలనా రికార్డులన్నీ ఏఆర్ఎంఎస్లో భద్రపరుస్తారు. రికార్డుల పూర్తి వివరాలను పీడీఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీని ఏఆర్ఎమ్ఎస్లోని కంప్యూటర్లో, ఆటోమేటిక్‌గా పనిచేసే ర్యాక్‌లో మ్యాన్యువల్ రికార్డులను ఉంచుతారు. అగ్నిప్రమాదం సంభవించినా, నీళ్లు పడినా ఎలాంటి నష్టం సంభవించకపోవడం ఈ ఏఆర్ఎంఎస్ ప్రత్యేకత. ఏఆర్ఎమ్ఎస్లో రికార్డులను పరిశీలించేందుకు కమిషనరేట్ కార్యాలయంలో పరిపాలనా విభాగం ముఖ్య అధికారులకు ప్రత్యేక పాస్వర్డ్లు, యూజర్ ఐడీలను కేటాయించి, ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల హృదయాలు గెలుచుకోవాలి: డీజీపీ పోలీసులు మెరుగైన పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకోవాలని డీజీపీ మహేందర్ అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఆశయాలను సాధించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతులయ్యారు. నగరంలో శాంతి భద్రతలకు సీఎం పెద్దపీట వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టి, 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందుకోసం పేద, ధనిక వర్గాలు ముందుకు రావడం అభినందనీయం. కేవలం గస్తీకే రూ. 350 కోట్లతో 11 వేల వాహనాలను సీఎం పోలీసుశాఖకు కేటాయించారు. ఈ కమిషనరేట్ ఏర్పాటు వల్ల సైబరాబాద్‌పై భారం తగ్గుతుంది’ అని వ్యాఖ్యానించారు ఏఆర్ఎమ్ఎస్తో క్షణాల్లో రికార్డులు: సీపీ కేవలం 18 నెలల్లోనే కమిషనరేట్‌ను పూర్తి చేసినందుకు టీఎస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎండీ మల్లారెడ్డికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏఆర్ఎమ్ఎస్ను ఇక్కడ ప్రవేశపెట్టాం. దీని సాయంతో అన్ని రికార్డులను క్షణాల్లో చూడొచ్చు. మేడిపల్లి వద్ద ప్రభుత్వం కమిషనరేట్‌కు 50 ఎకరాలు, యాదగిరిగుట్ట వద్ద పోలీసు శిక్షణ కేంద్రానికి మరో 36 ఎకరాలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
సేంద్రియ సేద్యం ఆరోగ్య మార్గం
హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనీ, ఇదే అందరి ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. బుధవారం శిల్పారామంలోని సాంప్రదాయ వేదికలో కేంద్ర మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ’ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఉత్సవాన్ని’ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రెండెకరాల భూమిలో తన తండ్రి సేంద్రియ వ్యవసాయం చేసేవారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయానికి చేయూతనిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే గతంలో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేవన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ క్లబ్‌ల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మహిళ, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి నందితా మిశ్రా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. మహిళా రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తుల అమ్మకాలకు ‘ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ’ఉపకరిస్తుందన్నారు. ఇందులో రెడ్ అండ్ బ్లాక్ రైస్, చిరుధాన్యాలు, లెంటీస్, కూరగాయలు, సీడ్స్ అండ్ సీడ్ జ్యువెలరీ, సుగంధ ద్రవ్యాలు, ఐస్‌క్రీమ్, సౌందర్య సాధనాలు, వస్త్రాలు, బేకరీ ఉత్పత్తులు, టీ, పండ్లు, తదితరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఉత్సవం ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందనీ సుమారు వెయ్యికి పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డబ్ల్యూసీడీ, ఎస్సీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జగదీశ్వర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎక్కువ భాగం భూమి కలుషితమైందని, పొలాలను మరలా శుద్ధి చేయడానికి 15 నుండి 20 ఏళ్ల సమయం పడుతుందన్నారు. సినీ నటి అమల మాట్లాడుతూ తమ కుటుంబమంతా సేంద్రియ పంటలే తింటామన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ గుండు సుధారాణి, హైదరాబాద్ రీజినల్ ఆర్గనైజర్ సుశీలారెడ్డి, రంగారెడ్డి రీజినల్ ఆర్గనైజర్ వీరమణిలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే ముస్లింల అభ్యున్నతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్రంలోని మైనార్టీ పిల్లలకోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా దేశంలోని ఏ రాష్ట్రమూ ఖర్చు చేయడం లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం అమ్మాయిల విద్యారేటు తక్కువగా ఉందని, వారు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. చంచల్‌గూడ మైదానంలో ఆదివారం జమియతుల్ మొమినాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీ పిల్లల కోసం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన 204 రెసిడెన్షియల్స్ స్కూళ్లలో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఒక్కో మైనార్టీ విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆకాశంలో సగం.. ఆదాయంలోనూ సగం మహిళలు ఆకాశంలో సగమని, ఇంటి ఆదాయంలో నూ సగంగా ఉండాలని హోంమంత్రి పిలుపునిచ్చా రు. ముస్లిం కుటుంబాలు వృథా ఖర్చులు మానుకో వాలని, మహిళలు తమ కుటుంబ ఆదాయం ప్రకార మే బడ్జెట్ రూపొందించుకోవాలన్నారు. బాల్యంనుంచే పిల్లల్ని నైతికత, క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పేద మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 లక్షలు ఉచితంగా అందిస్తోందని దీన్ని వారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యుడు, మతగురువు అల్లామా ఉబెదుల్లాఖాన్ మాట్లాడుతూ.. మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితానికి సంబంధించిన ఇస్లామీ షరియత్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం పట్ల ముస్లిం మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముస్లిం మహిళల హక్కును కేంద్రం కాలరాస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు, లౌకికవాదులంతా కలసి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమురుద్దీన్, జమియతుల్ మొమినాత్ సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ మస్తాన్అలీ, హఫెజ్ సాబెర్పాషా, ముఫ్తీ హసనుద్దీన్తో పాటు పలువురు మతగురువులు పాల్గొన్నారు. -
బాలికా సంరక్షణ దినోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ
-
ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: నగరం లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి హోంమంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. నింది తులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, ప్రత్యేక బృం దం ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని నగర కమిషనర్ అంజనీకుమార్‌ను సోమవారం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతోందన్నారు. బాధితురాలికి వైద్యసహాయం అందించాలని, ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా వేగంగా స్పందించాలని కమిషనర్‌కు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
ఎగ్జిబిషన్ ఆదాయంతో విద్య ప్రశంసనీయం
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయంతో 18 విద్యాసంస్థలు, 30 వేల మంది విద్యార్థులకు విద్యను అందించడం ప్రశంసనీయమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 79వ అఖిల భారత పారశ్రామిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే నం.1 సీఎంగా ఉన్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయడం తథ్యమ న్నారు. ఈ ఏడాది మెట్రోరైళ్లు అందుబాటులో ఉండటం వల్ల 3 నుంచి 5 లక్షల మంది సందర్శకులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తు న్నట్లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం మె ట్రో సమయాలను కూడా పొడిగించినట్లు వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలు, ఉత్పతులను ప్రజలకందించాలనే ఉద్దేశంతో నాడు నిజాం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఎగ్జిబిషన్లో వచ్చిన ఆదాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి జీవీ రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన నరసింహన్
-
రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన నరసింహన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలతో పాటు, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహులు, హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావులతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గవర్నర్‌తో ఫొటోలు దిగారు. సామాన్యులు, యువతి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి గవర్నర్ దంపతులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అందరి రాష్ట్రం అని.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన మిగిలే ఉందని.. దానిపై వర్కవుట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అందరికి మంచి జరగాలని అకాంక్షించారు. -
రండి.. రండి.. దయచేయండి!
హైదరాబాద్: 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–2019 (నుమాయిష్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1న ఈ నుమాయిష్ ప్రారంభం అవుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించే నుమాయిష్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15తో ప్రదర్శన ముగుస్తుంది. నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ సొసైటీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వివరాలను శనివారం ఈటల ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులతో కలసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్పత్తి అయ్యే కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించేందుకు వీలు కల్పించారు. ఈ ఏడాది 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రైవేట్ సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాళ్లను కేటాయించారు. ఈ సంస్థలు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాయి. మెట్రో రైలు కళ... ఈ ఏడాది నుమాయిష్‌కు మెట్రో రైలు కళ సంతరించుకోనుంది. మియాపూర్ నుంచి నాంపల్లి, ఎల్బీ నగర్ నుంచి నాంపల్లికి మెట్రో రైలు సౌకర్యం ఉంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సర్వీసులను అదనంగా నడిపేందుకు అధికారులు అంగీకరించారు. మెట్రో టికెట్లు కొనేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని మూడు గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉచిత పార్కింగ్... రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నుమాయిష్‌కు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నుమాయిష్ చుట్టుప్రక్కల ఉండే ప్రభుత్వ శాఖల భవన సముదాయాల్లో పార్కింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. గగన్ విహార్, చంద్రవిహార్, భీంరావ్ బాడా, గృహకల్ప, మనోరంజన్ కాంప్లెక్స్, అబ్కారీ భవన్ ఎదుట ఉచిత పార్కింగ్ స్థలాలుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీటితో పాటుగా తాజ్ ఐల్యాండ్ నుంచి చంద్రవిహార్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో సందర్శకుల నుంచి కాంట్రాక్టర్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి దోచుకునేవారు. లాభాపేక్షలేని సంస్థ ఇదిః ఈటల రాజేందర్ పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్ సొసైటీని ప్రారంభించారని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణతో వచ్చే ఆదాయాన్ని 18 విద్యా సంస్థలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత 78 సంవత్సరాలుగా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. కేసీఆర్ చొరవతో ఎగ్జిబిషన్‌ను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సరికొత్త సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు. కొనసాగనున్న రోజులు: 45 ప్రవేశ రుసుం: రూ.30 ఏర్పాటు చేసే మొత్తం స్టాల్స్: 2,500 మెట్రో రైలు సర్వీసులు: రాత్రి 11.30 వరకు పాల్గొననున్న వలంటీర్లు: 1,500 మంది -
హోం మంత్రిగా మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మహమూద్ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవోలో ఉప ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చని తెలిసింది. మహమూద్ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతలతో.. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు. అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పాల వ్యాపారం నుంచి.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మహమూద్ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్ మహ్మద్ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్ ఫాతిమా, అఫ్రోజ్ ఫాతిమా), కుమారుడు మహ్మద్ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. మలక్‌పేట ప్రాంతం నుంచి చురుకైన మైనారిటీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే మహమూద్ అలీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా.. 2005, 2007లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీ గురువారం మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. -
బిగ్ బ్రేకింగ్: మహమూద్ అలీకి కీలకమైన మంత్రిత్వశాఖ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, మైనారిటీ నాయకుడు మహమూద్ అలీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఆయనకు కట్టబెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన రెవెన్యూశాఖ బాధ్యతలను మహమూద్ అలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అలీకి రెండో పర్యాయంలోనూ కీలక మంత్రిత్వశాఖ దక్కింది. దీంతో గత పర్యాయంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నరసింహారెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఈసారి మంత్రివర్గంలో గణనీయమైన మార్పులు ఉంటాయని, పలువురు కొత్తవారికి అవకాశముంటుందని వినిపిస్తోంది. -
టీడీపీ, కాంగ్రెస్‌లతోనే తెలంగాణకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చాలా అన్యాయం చేశాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. బుధవారం తెలంగాణభవన్ లో మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ సమక్షంలో షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎంత అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల్లో రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ఉద్యమం ద్వారా వచ్చిందని స్పష్టంచేశారు. టీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే లీడర్ అని, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోతాయన్నారు. -
రోడ్డుపై దున్నపోతుల డిష్యూం..
హైదరాబాద్: రాజధానిలో ఏటా జరిగే సదర్ ఉత్సవాల కోసం హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు షహాన్‌షా, ధారాలు రోడ్డుపై చిన్నపాటి యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి. దున్నల మధ్య జరిగిన భీకర పోరు నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. దున్నలను చూసేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ దున్నల పొట్లాటకు ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తర్భాగ్ వేదికైంది. అనంతరం ఓ దున్న ముషీరాబాద్ ప్రధాన రహదారిపై రాజా డీలక్స్ వరకు పరుగులు తీయడంతో దానిని పట్టుకునేందుకు నిర్వాహకులు చెమటోడ్చాల్సి వచ్చింది. ఘటనలో మహమూద్ అలీ కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. శుక్రవారం (9వ తేదీ) జరిగే సదర్ ఉత్సవాల కోసం 2 భారీ దున్నపోతులు షహాన్‌షా, ధారాలను ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకువచ్చారు. ప్రదర్శన నిమిత్తం వీటిని గోల్కొండ చౌరస్తా సమీపంలోని సత్తార్‌బాగ్‌లో ఉంచారు. మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సత్తార్‌బాగ్‌కు చేరుకుని దున్నలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ధారా, షహాన్షాలను ఒకే చోటకి చేర్చి ప్రేక్షకులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఈ రెండు కలిస్తే కొట్లాడుకుంటాయనే విషయం వారికి తెలియదు. ఒక్కసారిగా రెండు దున్నపోతులు బరిలోకి దిగినట్లు కొమ్ములతో బలంగా ఢీకొట్టుకోవడం ప్రారంభించాయి. సమాచారం తెలుసుకున్న దున్నపోతుల నిర్వాహకులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దున్నపోతులు సత్తార్‌బాగ్ నుంచి రాజా డీలక్స్ వరకు పరుగులు తీశాయి. వాటి అరుపులు, దున్నపోతుల గాంభీర్యం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వాటి నిర్వాహకులు రాజా డీలక్స్ చౌరస్తా సమీపంలో ఒక దున్నపోతును పట్టుకోగా మరో దున్నపోతును స్థానిక మసీదు వీధిలో పట్టుకున్నారు. -
అధికార దాహంతోనే పొత్తులు
మెదక్ మున్సిపాలిటీ: అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీ రాజకీయ విలువలను దిగజార్చి అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నాయని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపించారు. ఆదివారం రాత్రి మెదక్‌కు వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ దొంగపార్టీ అన్నారని, ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. 14 ఏళ్లపాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రైతులకు 24గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయించిందన్నారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక హిందూ ముస్లింలంతా కలిసి మెలిసి జీవిస్తున్నారని అన్నారు. పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 21జిల్లాలు పెంచి 31జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
అధికార దాహంతోనే అక్రమ పొత్తులు’
మెదక్ మున్సిపాలిటీ: అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీ రాజకీయ విలువలను దిగజార్చి అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపించారు. ఆదివారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు వేయొద్దని ప్రజలను కోరారు. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్‌ను దొంగ పార్టీ అన్నారని, ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాటం జరిగిందని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): టీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం ఆయన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలను కాంగ్రెస్ మొదటినుంచి మోసం చేసిందని, సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని అలీ ప్రశ్నించారు. తెలంగాణను మరోసారి మోసం చేసేందుకు ఈ పొత్తులని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ 204 కేసులను వేసిన విషయాన్ని ప్రజలు గుర్తించి ఆ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రైతుల కోసం తాము బడ్జెట్లోనే రూ.12 వేల కోట్లు కేటాయించామని వివరించారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్న తాము మరోసారి గెలిస్తే రూ.10 వేలు ఇవ్వనున్నట్లు మహమూద్ అలీ ప్రకటించారు. అంతకుముందు ఆయన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రషీద్‌ఖాన్, మక్సూద్, మోసీన్‌ఖాన్, ఇఫ్తెకార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీలను ఏకం చేసి గెలిపిస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు జమాత్ ఎ హింద్ సంపూర్ణ మద్దతు తెలిపింది. జమాత్ ఎ హింద్ అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీలందరినీ ఏకం చేసి టీఆర్ఎఎస్ను గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో హమీద్ మహ్మద్ ఖాన్, ఇంజనీర్ అబ్దుల్ జబ్బార్ సిద్ధిఖీ, మాలిక్ మోతషామ్ ఖాన్, టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎండీ అజారుద్దీన్, ఎండీ సాదిక్ అహ్మద్, ఖాలిద్ జాఫర్, సయ్యద్ అబ్దుల్ బాసిత్ అన్వర్ తదితరులు సోమవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ముస్లిం వర్గాల అభ్యున్నతికి ఉపప్రణాళిక అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉపప్రణాళిక అంశాన్ని చేర్చాలని సూచించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను కోరారు. ఇంటర్మీడియట్, డిగ్రీలలో ఉర్దూ భాష పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మేనిఫెస్టోపై సీఎం కసరత్తు జమాతే ఎ హింద్ నేతలు సీఎం కేసీఆర్‌కు కోరిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుకు సూచించారు. మేనిఫెస్టో రూపకల్పన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫోస్టో ఉండాలని చెప్పారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాలు త్వరగా పూర్తి చేసి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చాలని సూచించారు. తొలి భారీ బహిరంగసభ.. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలతో ఫోన్లో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే. టీఆర్ఎస్ గెలుస్తుందనే చర్చ జరిగేలా సభ జరగాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుంచి సభకు జనం వచ్చేలా అభ్యర్థులు చర్యలు తీసుకోవాలి’అని కేసీఆర్ సూచించారు. అంగన్వాడీల మద్దతు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్న సంఘాల సంఖ్య పెరుగుతోంది. అంగన్వాడీ టీచర్ల సంఘం నేతలు 31 జిల్లాల బాధ్యులు సోమవారం నిజామాబాద్‌లోని ఎంపీ కవిత కార్యాలయానికి తరలి వచ్చారు. వేతనాలు పెంచి తమకు సమాజంలో గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాల మహానాడు నిజామాబాద్ జిల్లా సంఘంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మాల సంఘాల నేతలు కవితను కలసి టీఆర్ఎస్కు మద్దతిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. చిందు కళాకారులు సైతం ఇదే తరహాలో మద్దతు ప్రకటించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
మైనార్టీల అభివృద్ధికి కృషి
మంచిర్యాలటౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక, మొదటిసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ, మైనార్టీ ప్రజల అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తోందని రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని క్వారీ రోడ్డులో 2 వేల గజాల స్థలంలో నిర్మించనున్న క్రిస్టియన్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేసి, జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పటేల్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్ మైనార్టీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దేశం మొత్తమ్మీద మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని చెప్పారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనార్టీ ప్రజలను అస్సలు పట్టించుకోలేదని, అందుకే పూర్తిగా వెనకబడి పోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు 206 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించామని, ఒక్కో విద్యార్థిపై గతంలో రూ.20 వేలను ఖర్చు చేయగా, ప్రస్తుతం తాము రూ.1.35 లక్షలు ఏడాదికి ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఫాదర్లకు వేతనాలు ఇవ్వాలని పలువురు క్రిస్టియన్లు కోరుతున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ వేతనం ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ మాట్లాడుతూ క్రిస్టియన్ల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, మంచిర్యాలలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.57.50 లక్షలు కేటాయించారని, తన నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ బాల్క సుమన్ తన నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేకానంద మాట్లాడుతూ తన తండ్రి వెంకటస్వామి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్తు ద్వారా రూ.3 లక్షలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి అరిగెల నాగేశ్వర్రావు, తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ ఆర్గనైజర్ అత్తి సరోజ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఐక్య క్రిస్టియన్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు చల్లగుల్ల విజయశ్రీ, జిల్లా అధ్యక్షుడు సామ్యేల్, ప్రదాన కార్యదర్శి రజిని కుమార్, కల్వరి వ్యవస్థాపకుడు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ముస్లింలకు ప్రత్యేక పాఠశాలలు ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానా ముస్లిం మైనార్టీ ఫంక్షన్‌హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు జుల్ఫేకర్, మీనాజ్, షఫి, బద్రుద్దీన్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
కేరళ ప్రజలకు అండగా రాష్ట్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా పంపనున్నట్లు మంత్రులు తెలిపారు. పెన్షనర్లు సైతం... కేరళ బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 2.56 లక్షల మంది పెన్షర్లు ప్రతి ఒక్కరు రూ.100 చోప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి అధ్యక్షుడు రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. -
అన్నపూర్ణగా తెలంగాణ
శంకర్పల్లి (రంగారెడ్డి): రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోపాల్, వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశానికే ఆదర్శం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: రైతును రాజుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో వారు రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు పాస్‌పుస్తకాలు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని కొద్ది రోజుల్లో గోదావరి, కృష్ణా జలాలతో చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. పోచారం మాట్లాడుతూ.. రైతు అయిన కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. రైతుకు కావాల్సిన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, పండిన పంటకు మద్దతు ధర, పెట్టుబడి సహాయం అందించడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం అయిందని అన్నారు. రైతులు సమావేశమయ్యేం దుకు ప్రతి గ్రామంలో రూ.12 లక్షలతో సమన్వయ సమితి భవన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రైతుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్‌కు మతిమరుపు వ్యాధి చిన్నకోడూరు(సిద్దిపేట): సీఎం కేసీఆర్‌ను జాక్‌పాట్ ముఖ్యమంత్రిగా అభివర్ణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్లద్వారా పదవులు పొందే జాక్‌పాట్ నాయకులు కాంగ్రేస్ వాళ్లేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో గురువారం రాత్రి ఆయన రైతుబంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొనలేదని ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు. ఆకట్టుకున్న పోచారం పిట్టకథ కాంగ్రెస్ బస్సు యాత్రపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో చెప్పిన పిట్టకథ అందరినీ నవ్వించింది. గాంధీభవన్ నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్ నాయకుల బృందంలో బస్సు యాత్ర సిద్దిపేటకు రాగానే మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేసే రైతుబంధు చెక్కులు తీసుకునేందుకు 10 మంది దిగిపోయారని, అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లగానే మంత్రి కేటీఆర్ చెక్కులు పంచుతుండగా మరో పది మంది, తర్వాత కరీంనగర్లో ఈటల చెక్కుల పంపిణీ చూసిన మరో పది మంది, కామారెడ్డిలో మరో పదిమంది దిగిపోయారని, నిజామాబాద్ రాగానే డ్రైవర్ కూడా దిగిపోవడంతో బస్సు నడిపేవారు లేక ఉత్తమ్, జానాఒకరి ముఖం మరొకరు చూసుకోవాల్సి వచ్చింద న్నారు. ఇలా కాంగ్రెస్ వారంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, తలమడుగు(బోథ్) : అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అవతరించిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 40 శాతం భూరికార్డులు వివాదాలతో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో 96శాతం వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలను 17 రకాల సైక్యూరిటీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ పాస్‌బుక్‌లకు కాలం చెల్లినట్లే అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. దేశంలో రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తాం: మంత్రి పోచారం వ్యవసాయం అంటే పండుగలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సమన్వయ సంఘాలు రైతులకు సాగులో అండగా ఉంటూ వారికి సంబంధిత అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపా రు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర అందని పక్షంలో రైతు సమన్వయ సంఘాల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. వచ్చే జూన్ 2నుంచి రైతులకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతుకు అండగా సీఎం : మంత్రి రామన్న పెట్టుబడి కోసం రైతుల పడే ఇక్కట్లను గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి రైతులకు తొలివిడత చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం : ‘గుత్తా’ రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దని రైతు సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు సమితీలు గ్రామాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామంలోని రైతు లకు పట్టా పాస్ పుస్తకాలు, చెక్కలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ గోడాం నగేశ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా రైతు సమన్వయకర్త అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ రాంరెడ్డి, ఎం పీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ లక్ష్మీరమణ, ఏడీఏ రమేశ్, వైద్యాధికారి రాజీవ్‌రాజు,మండల రైతు సమన్వయకర్తలు గోవ ర్ధన్‌రెడ్డి, కేదారేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
రైతుబంధు దేశానికే ఆదర్శం
సాక్షి, కొత్తగూడెం/అశ్వారావుపేట : రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. అన్నదాతలు అప్పులు చేయకుండా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం అశ్వారావుపేట మండ లం అచ్యుతాపురం గ్రామంలో రైతుబంధు చెక్కుల ను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రూ.12వేల కోట్లు పెట్టుబడి కోసం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం భూములు వివాదాల్లో ఉన్నాయని, అయినా భూ రికార్డుల ప్రక్షాళనను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు సమర్థంగా నిర్వహించారని అన్నా రు. ప్రక్షాళనపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మొత్తంమీద 300 గంటలపాటు సమీక్ష చేశారని చెప్పారు. సెక్యూరిటీ ఫీచర్లతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారసత్వం కోసం గతంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని.. ఇప్పుడా సమస్య సమసిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో మొదటి విడతలో 79,184 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16,124కోట్లు రైతు రుణమాఫీ చేసిందన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో పడుతుందని అప్పటి సీఎం కిరణ్ చెప్పారని, అలాంటి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 24 గంటలపాటు, ఒక్క నిమిషం కూడా బ్రేక్‌డౌన్ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులు క్రమశిక్షణతో ఉన్నారని అభినందించారు. రాష్ట్ర అభివృద్దిలో ఈప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది కీలకపాత్ర అని అన్నారు. కేంద్ర రహదారుల శాఖామాత్యులు నితిన్గడ్కరీతో చర్చించి తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి రూ.2వేల కోట్లు సాధించారన్నారు. రైతు సమితుల బాధ్యతలు పెంచాం: వ్యవసాయ మంత్రి పోచారం రైతు సమన్వయ సమితుల బాధ్యతలు మరింత పెంచామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు మంచి వంగడాలు నాటి, చక్కటి దిగుబడి సాధించేందుకు, మద్దతు ధర అందించేందుకు రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,61,000 మంది సభ్యులు ఉన్నారని, వీరంతా ఒక్కొక్కరు 36 మంది రైతులను కలిస్తే సరిపోతుందన్నారు. 1611 టీఎంసీల గోదావరి నీరు, 600 టీఎంసీల కృష్ణానీరు వృథాగా సముద్రంలో కలుస్తుండగా వీటిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. రూ.93వేల కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 70 ఏళ్లలో రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిన అవసరమే లేకుండా.. బ్యాంకులు రుణాలివ్వాల్సిన అవసరం లేకుండా రైతులను అభివృద్ధిచేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పోచారం అన్నారు. 2022కి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ అన్నారని.. ఏమంత్రం వేసి రెట్టింపుచేస్తారని ప్రశ్నించారు. వ్యవసాయానికి మౌళిక వసతులు పెంచకుండా ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారని అన్నారు. రైతు సమన్వయ కమిటీలకు రానున్న రోజుల్లో రూ.300కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ రైతుకు రూ. 5 లక్షల బీమా : గుత్తా రైతు సమన్వయ సమితి రాష్ట్ర సమన్వయకర్త గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతుకు రూ.5లక్షల బీమా కల్పించేందుకు రూ.500కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 10వేల ట్రాక్టర్లను సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. కోనసీమను తలపించేలా ఇక్కడి వాతావరణం ఉందని కొనియాడారు. చిరస్థాయిగా గుర్తుంచుకుంటా: తుమ్మల తనకు 35ఏళ్ల రాజకీయ జీవితాన్నిచ్చిన సొంత నియోజకవర్గ ప్రజలను చిరస్థాయిగా గుర్తుంచుకుంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈప్రాంతానికి ఏం కావాలన్నా దగ్గరుండి అభివృద్ధి చేస్తానన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వివాదాలను పరిష్కరించి రెండోవిడతలో చెక్కులు అందిస్తామన్నారు. రైతు పక్షపాతి సీఎం: ఎంపీ పొంగులేటి రైతుబంధు చెక్కులతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వల్లనే టన్ను పామాయిల్ గెలల ధర రూ.10వేలకు పెరిగిందని.. ఈఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో వస్తారని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ త్వరలో రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సరిపోతుందన్నారు. ధరణి సాఫ్ట్వేర్ ద్వారా జూన్ 2నుంచి పాల్వంచ మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, ఆ తర్వాత జిల్లా మొత్తం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా రైతుసమన్వయ సమితి చైర్మన్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, జేసీ రాంకిషన్, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఏఓ అభిమన్యుడు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘పెట్టుబడి’ పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచి వాలయంలో రైతుబంధు, రైతు పాస్‌పుస్తకాల పంపిణీపై మీడియా సమావేశం జరిగింది. మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయలేని పనిని సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు పేరుతో చేస్తున్నారన్నారు. ఈ నెల 10న హుజూరాబాద్‌లో రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. 1.4 కోట్ల ఎకరాలకు 58.06 లక్షల చెక్కులు, రూ.5,608.09 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ముందుగా 1.3 కోట్ల ఎకరాల్లో 56.14 లక్షల ఎకరాలకు 5,392.29 కోట్లు పంపిణీ చేస్తారన్నారు. మొత్తం 10,823 గ్రామాల్లో పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, పంచాయతీరాజ్ బిల్డింగ్, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా మంచినీళ్లు, టెంట్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు రైతుకే ఇవ్వాలని, రైతు అక్కడికి రాకుంటే రైతు ఇంటికెళ్లి చెక్కులు ఇవ్వాలని సూచించామన్నారు. పాస్‌పుస్తకాల ముద్రణకు 8 కంపెనీలు ముందుకొచ్చాయని, టెండర్ల ద్వారా ఈ–ప్రక్రియ జరిగిందన్నారు. ముద్రణ టెండర్‌ను మద్రాసు కంపెనీ దక్కించుకుందన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లా డుతూ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గొప్ప ఆలోచనని కొనియాడారు. పాస్‌పుస్తకాల ముద్రణలో కొన్ని తప్పులుంటే వాటిని కలెక్టర్ కార్యాలయంలో సవరిస్తారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని తేల్చి చెప్పారు. దీన్ని మీడియా భూతద్దంలో చూపొద్దని, ఈ గొప్ప కార్యక్రమంలో మీడియా కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు చూపించి రైతుబంధు చెక్, పాస్‌పుస్తకాలు తీసుకోవచ్చని అన్నారు. మొత్తం రూ.90 కోట్లతో ముద్రణ జరిగితే 80 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. వ్యవసాయం చేయనివాడు చెట్టుమీద ఉండి ఏదైనా మాట్లాడొచ్చని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎనిమిది జాతీయ బ్యాంకుల ద్వారా డబ్బులు సమకూర్చామని అన్నారు. మూడు నెలల్లోపు రైతు ఎప్పుడైనా చెక్‌ను బ్యాంకులో వేసుకోవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, సభ్యులు పాల్గొంటారన్నారు. -
మసీదుల మరమ్మతుకు రూ.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్‌ను పురస్కరించుకుని మసీదుల మరమ్మతుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, నగర శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి రంజాన్ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ వచ్చే నెలలో రంజాన్ పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల పేద ముస్లి కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు యంత్రాంగం 24 గంటలు పనిచేస్తుందని నాయిని అన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ముస్లిం సోదరులు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
నాయినికి ‘లోహియా’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు. అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు..
శిశు మరణాలు తగ్గాయి: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో నవజాత శిశు మరణాలు తగ్గాయని చెప్పారు. ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో గతంలో 39 మంది చనిపోయేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 31కి తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని, మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పువ్వాడ అజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఏటా 6.5 లక్షల జననాలు నమోదవుతున్నాయని, అందులో లక్ష మందికి ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు. రోజూ 1.23 కోట్ల లీటర్ల పాల వినియోగం రాష్ట్రవ్యాప్తంగా 1,23,73,000 లీటర్ల పాల వినియోగం జరుగుతోందని, 1,05,68,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. అవసరానికి సరిపడా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని విజయ డెయిరీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న రెండు లక్షల లీటర్ల నుంచి పది లక్షల లీటర్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, సోలిసేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు. పహాడీ షరీఫ్ అభివృద్ధి: మహమూద్ అలీ రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ దర్గా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. దర్గాను ప్రస్తుతం ఉన్న రహదారికి అనుసంధానించేందుకు సీసీ రోడ్డు, విశాలమైన పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, సయ్యద్ అహ్మద్ ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మహమూద్ అలీ సమాధానం ఇచ్చారు. దర్గాకు ఇప్పటికే రూ.9.6 కోట్లు కేటాయించామని, రెండో దశలో రూ.25 కోట్లతో సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కి వంద స్థానాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో వంద స్థానాలు టీఆర్ఎస్వే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి బంగారు బాటలు వేస్తూ రాష్ట్రాన్ని విజయ తీరాల వైపు నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే యావత్తు దేశ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. నిజాం పాలనలో భూసర్వే తర్వాత రాష్ట్రంలో పాలించిన ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ రెవెన్యూ అధికారులతో చర్చించి సమగ్ర భూప్రక్షాళన సర్వేకు నాంది పలికారని గుర్తుచేశారు. -
దేశానికే తెలంగాణ ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: గుడుంబారహిత రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలాంటి ప్రాంతంలో గుడుంబా నిర్మూలన అంటే ఆషామాషి వ్యవహారం కాదన్నారు. ఈ ఘనత సాధించిన ఎక్సైజ్ అధికారులను ఆయన అభినందించారు. సోమవారం ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌తో కలసి పీపుల్స్ ప్లాజాలో గుడుంబా వృత్తి మానేసిన వారికి ఆటోలను పంపిణీ చేశారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వందశాతం గుడుంబా నిర్మూలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, ఎౖMð్సజ్ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నింగీ నేలను కలుపుతూ..
సాక్షి, హైదరాబాద్: రంగు రంగుల పతంగులు రకరకాల ఆకృతులతో నింగీ నేలను కలుపుతూ రివ్వున ఎగిరాయి.. ఆకాశానికి నిచ్చెన వేశారా అనిపించేలా గాలిపటాలు దూసుకుపోయాయి.. వంద లాది పతంగులు ఒకేసారి గాలి లోకి ఎగిరి అద్భుతాన్ని ఆవిష్కరించాయి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అంత ర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా కనిపించిన దృశ్యాలివీ. ఉదయం ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ రాత్రి వరకు కొనసాగగా.. తొలిరోజు దాదాపు 50 వేల మంది నగరవాసులు తిలకించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగుల పోటీదారులతో పరేడ్ మైదానం కోలాహలంగా మారింది. 3 రోజులపాటు పతంగుల పండుగ నగరవాసులకు కనువిందు చేయనుంది. అందరినీ ఏకతాటిపైకి తేవడానికే.. భాగ్యనగరంలో ఉన్న సకలజనులను ఏకతాటిపైకి తేవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వివిధ రకాల ఫెస్టివల్స్‌ను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో భాషా సాంస్కృతిక శాఖ–పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను మహమూద్ అలీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు. మహమూద్ మాట్లాడుతూ 15 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. పతంగుల పండుగలో నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ బాల్యదశలో దోస్తులతో కలసి సంక్రాంతి ఆనందంగా జరుపుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది సింగపూర్, థాయిలాండ్, కొరియా, జపాన్, చైనా సహా పది దేశాలు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 కైట్ ఫ్లేయర్ బృందాలు పాల్గొంటున్నాయని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. -
హజ్ యాత్రకు 4,066 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు 4,066 మంది ఎంపికయ్యారని ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. 2017 లో ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ హజ్ కమిటీని దేశంలోనే నంబర్ వన్ కమిటీ అని కేంద్ర హజ్ కమిటీ ప్రశంసించిందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌస్‌లో 2018 సంవత్సరానికి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న యాత్రికుల ఎంపిక డ్రా పద్ధతిలో జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు ఐదారువేల మంది వెళ్లేవారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేవలం రాష్ట్రం నుంచే 4,500 మంది యాత్రకు వెళుతున్నారని వివరించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగి ఐదువేల వరకు చేరుతుందన్నారు. కోటా పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారని తెలిపారు. యాత్రికు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌదీ అరేబియా ప్రభుత్వంతో కూడా మాట్లాడతామ న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్ కమిటీ వార్షిక బడ్జెట్ కేవలం రూ. 1.50 కోట్లుండేదని, వచ్చే ఏడాది నుంచి దాన్ని రూ. 5 కోట్లకు పెంచుతామన్నారు. 31 లోపు సర్టిఫికెట్లు సమర్పించాలి 2018 హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 17,130 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో 70 ఏళ్లకు పైబడినవారు ప్రత్యేక కేటగిరీలో నేరుగా 508 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ చెప్పారు. మిగతా 16,622 మంది యాత్రికులలో డ్రా పద్ధతిలో 3,558 మంది ఎంపికయ్యారన్నారు. డ్రాలో ఎంపికైన యాత్రికులు ఈ నెల 31 లోపు పాస్‌పోర్టు, మెడికల్ సర్టిఫికెట్లతో పాటు హజ్ యాత్ర తొలి కిస్తు రూ. 81 వేల డీడీని కూడా హజ్ కమిటీకి జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమ్రుద్దీన్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల కుదింపు ఆలోచనే లేదు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను కుదించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలకు సైతం శంకుస్థాపన చేసిన దృష్ట్యా, కొత్త జిల్లాల కుదింపు సమస్యే లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న 31 జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలను కుదిస్తారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 92 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని తెలిపారు. మొత్తం 568 మండలాల్లోని 10,806 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభించగా, 10,443 గ్రామాల్లో పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటివరకు 2,13,18,724 ఎకరాల భూరికార్డులు పరిశీలించి 1,97,10,172 ఎకరాల రికార్డులను సవరించినట్లు తెలిపారు. -
భూ రికార్డుల ప్రక్షాళన 90 % పూర్తి
పెర్కిట్(ఆర్మూర్): తెలంగాణలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన 90 శాతం పూర్తయ్యిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ వెళ్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో గల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో రికార్డుల ప్రక్షాళన పూర్తికావచ్చిందన్నారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 23 వేల మంది షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందారన్నారు. -
15 నుంచి హజ్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: హజ్ 2018 షెడ్యూల్‌ను కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిందని, ఈ నెల 15 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కోసం దరఖాస్తుల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్‌హౌస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర కమిటీ కార్యాచరణ రూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే రోజు హజ్ దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 15న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసారి కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు ఫారం పూర్తి చేసి.. రూ.300ల స్టేట్ బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ ద్వారా చలాన్ తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ జమచేయాలన్నారు. గ్రీన్, అజీజియా.. రెండు కేటగిరీలు ఉన్నాయని, దరఖాస్తులో కేటగిరీని నమోదు చేయాలని సూచించారు. గత మూడేళ్లకు ముందు హజ్ లేదా ఉమ్రాకు వెళ్లి వచ్చిన వారు తిరిగి హజ్ యాత్రికుడితో సహాయకుడిగా వెళ్తే యాత్రకయ్యే ఖర్చులతో పాటు అదనంగా 2 వేల సౌదీ రియాల్ జమ చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర హజ్ షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికుల ఎంపిక ప్రక్రియకు జనవరిలో డ్రా ఉంటుందన్నారు. జూలై 11 నుంచి హజ్ యాత్ర ప్రారంభమౌతుందన్నారు. హజ్ ఆరాధన 2019 ఆగస్టు 8న ఉంటుందన్నారు. హజ్ కొత్త పాలసీ విధివిధానాలు తేలియజేయడానికి నేడు అన్ని జిల్లాల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొత్త హజ్ పాలసీపై అసంతృప్తి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన హజ్ పాలసీపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హజ్ యాత్రలో కేంద్రం జోక్యాన్ని ముస్లిం ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నారు. హజ్ యాత్ర కోసం గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నవారు నాల్గవసారి దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు అవకాశం ఉండేది. ఈసారి ఈ కేటగిరీని రద్దు చేయడంపై యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇస్లామియా ధర్మశాస్తం ప్రకారం.. ఏ మహిళ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదని, దాన్ని పరిగణనలో తీసుకోకుండా కేంద్రం 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవచ్చనడం సరికాదన్నారు. -
దళితులకంటే దీనంగా ముస్లింలు
సాక్షి, హైదరాబాద్: ఈ ప్రాంతాన్ని 400 ఏళ్లు పాలించిన ముస్లింలు స్వాతంత్య్రానంతరం 70 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబాటుకు గురవటానికి.. మరింత బీదరికంలోకి నెట్టేయబడటానికి గత పాలకుల విధానాలే కారణమని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రభుత్వ పథకాలను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన జమాత్ ఇస్లామీ హింద్ సదస్సులో ఆదివారం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబడిన ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ముస్లింలు సైతం పాటుపడాలని, ముస్లిం వర్గాలు తమలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి సంఘటితం అవ్వాలని సూచించారు. ముస్లిం యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందిం చుకుని వ్యాపార రంగంలో ముందుకెళ్లాలని, మహిళలు కూడా అన్నిరంగాల్లో ముందడుగు వేసి భర్తకు చేదోడువాదోడుగా నిలవాలన్నారు. ముస్లింలు తమ పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముస్లిం పిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, వీటిలో 50 వేల మంది మైనారిటీ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ముస్లింల పాత్ర చిరస్మరణీయం శాసనమండలిలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ముస్లింల పాత్ర చిరస్మరణీయమని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ముస్లిం యోధుల జీవితాలను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు. ముస్లింలు తమ సంస్కృతీ సంప్రదాయాలతో దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. ఇస్లాం ధర్మం దేశంలో కత్తిబలంతో వ్యాపించలేదని, ప్రేమ, సోదరభావం, త్యాగస్ఫూర్తితో విస్తరించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి యోధుడు టిప్పుసుల్తాన్ను లక్ష్యంగా చేసుకోవడం విషాదకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రను మార్చే కుట్రలు పన్నుతోందని, ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదని హితవు పలికారు. కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ ఉపాధ్యక్షుడు సాదతుల్లా హుస్సేనీ, రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, కార్యదర్శులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ సదస్సు విజయవంతంగా పూర్తయిందని, జమాత్ ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు హఫీజ్ రషాదుద్దీన్ అన్నారు. దేశాన్ని బలహీనపరుస్తున్నారు.. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలోని ముస్లింలను అభద్రతాభావానికి గురిచేసే ఘటనలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం పాలకులను, యోధులను దేశద్రోహులుగా చిత్రీకరించి విద్వేష వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. విభజన రాజకీయాలు, గోరక్షణ, లవ్‌జిహాద్ తదితర సాకులతో విద్వేషం చిమ్మి.. మనుషుల ప్రాణాలను బలిగొని దేశాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. షరియత్ చట్టాల్లో జోక్యం సరికాదని, షరియత్ పరిరక్షణకు ధార్మిక, సామాజిక, రాజకీయ పార్టీల్లో ఉన్న ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రేమకు చిహ్నంగా కట్టిన తాజ్‌మహల్‌పై విషం చిమ్మే నీచ రాజకీయాలకు పాల్పడటం దారుణ మన్నారు. మత రాజకీయాలతో పబ్బం గడుపుకునే బీజేపీకి ప్రజలే బుద్ధిచెబుతారని, గుజరాత్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. -
పదేళ్లలో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని, రాబోయే పదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారడం ఖాయ మని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో వందేళ్ల క్రితం ప్రపంచంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా గుర్తింపు పొందిందని, తిరిగి కేసీఆర్ పాలనలో ఆ స్థాయికి చేరేందుకు కృషి జరుగుతోందని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యారంగానికి పెద్ద పీట వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యతో అభివృద్ధి సాధ్యమని గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. రాబోవు పదేళ్లలో ప్రపంచంలోనే లండన్ తరహాలో హైదరాబాద్ విద్యానగరిగా మారడం ఖాయమన్నారు. నిజాం రాజు హిందూ– ముస్లింలను సమాన దృష్టితో చూసేవారని, అదే తరహాలో సీఎం కేసీఆర్ కూడా సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. మైనారిటీల్లో వెలుగు.... తెలంగాణ ఏర్పాటు అనంతరమే మైనారిటీ కుటుంబాల్లో వెలుగు కనిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డిఅన్నారు. ఆంధ్రపాలకుల పాలనలో మైనారిటీల జీవన పరిస్ధితి దళితుల కంటే దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం హయంలో ముస్లిం ఉద్యోగులు 22 శాతం ఉండగా, ప్రస్తుతం ఒక శాతానికి పడిపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1.35 కోట్లు గురుకులాల కోసం కేటాయించిందని, దానిని రూ. 200 కోట్ల వరకు పెంచేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల కోసం సేవలు అందించిన డాక్టర్ మహ్మద్ హైదర్‌ఖాన్‌కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డు–2017 తో పాటు రూ.2.25 లక్షల నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు. జకాత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గయాసోద్దీన్ బాబుఖాన్‌కు కూడా అవార్డు అందజేసి సన్మానించారు. అనంతరం గురుకుల విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ వ్యవహార సలహాదారుడు ఏకేఖాన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, టీఎస్ ఎంఎఫ్సీ చైర్మన్ అక్బర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీర్, టెమ్రీస్ కార్యదర్శి షఫీఉల్లా, దిలావర్, విలాయత్ తదితరులు పాల్గొన్నారు. -
సొంత నియోజకవర్గంలో రేవంత్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే భారీ షాక్ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 700మంది కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పి మంత్రులిద్దరూ స్వాగతం పలికారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కొడంగల్ మండలం చిట్లపల్లి ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, శరణమ్మ, హనుమంతురెడ్డి, కొడంగల్ జెడ్పీటీసీ, టీడీపీ దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీడీపీకి చెందిన దౌల్తాబాద్ సర్పంచ్ పార్వతమ్మ, గుండెపల్లి సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, చంద్రకల్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ ఆశన్న, దౌల్తాబాద్ మండలం కో ఆప్షన్ మెంబర్ జాకీర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు(కోస్గి) చిన్నారెడ్డి, బిజ్జరాం టీడీపీ సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్య, బిజ్జారం గ్రామ పార్టీ అధ్యక్షుడు పటేల్ బస్వరాజు, దౌల్తాబాద్ మండలం అంతారం మాజీ ఉప సర్పంచ్ బసంత్ రెడ్డి, దౌల్తాబాద్ పీఏసీఎస్ డైరెక్టర్ రాజప్ప, దౌల్తాబాద్ మండలం గోకపస్లాబాద్ మాజీ ఎంపీటీసీ ఆనంతయ్య, దౌల్తాబాద్ మండల కేంద్రం నుంచి వార్డ్ మెంబర్లు నారాయణ, ఎల్లమ్మ, మల్కయ్య గౌడ్, శ్రీనివాస్, పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉన్నారు. -
వక్ఫ్ ఆదాయం పెంపు కోసం సర్వే
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సీఈవోను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వక్ఫ్ బోర్డుపై సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెలు, లీజులు చాలా తక్కువగా వసూలవుతున్నాయని, మరో మారు సర్వే నిర్వహించి మార్కెట్ ధరల ప్రకారం నిర్ణయించాలని సూచించారు. రెవెన్యూ సర్వే కొనసాగుతున్న దృష్ట్యా వక్ఫ్ భూముల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వక్ఫ్ సర్వే కమిషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వక్ఫ్ సర్వే కమిషన్ సమర్పించిన నివేదికను మరోమారు పరిశీలించాలన్నారు. అలాగే ప్రభుత్వం కేటాయించే గ్రాంట్ ఇన్ ఎయిడ్పై సమీక్షించారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్, వక్ఫ్‌బోర్డు సీఈవో ఫారుఖీ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక రంగంతో ఆర్థికాభివృద్ధి
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం ఎంతో దోహదపడుతోందని, అందుకే ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఏటా 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వస్తున్నారని, 2020 నాటికి విదేశీ పర్యాటకుల సంఖ్య పది లక్షలకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 78వ ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి పర్యాటక రంగ సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ అందరికీ ఇష్టమని, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే బతుకమ్మ, బోనాలు గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ సదస్సు వీలు కల్పించిందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం పుట్టినిల్లు హైదరాబాద్ అని అన్నారు. 30 శాతం ఫార్మా డ్రగ్స్ హైదరాబాద్‌లోనే తయారవుతాయని చెప్పారు. విజిట్ ఫర్ ఆల్ రీజన్ ఆల్ సీజన్ అనే నినాదంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ మాట్లాడుతూ.. వ్యాపారమంటే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుందని, నష్టాన్ని ఊహించుకుని ఊరుకోలేమని, సక్సెస్ అనేది మన నెట్‌వర్కింగ్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. పరస్పర సహాయ సహకారాలు ఎస్‌కేఏఎల్ వరల్డ్ ప్రెసిడెంట్ డేవిడ్ ఫిషర్ మాట్లాడుతూ.. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగుతుందన్నారు. ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రావెల్, టూరిజంలో ఎస్‌కేఏఎల్ క్లబ్‌లు సహాయ సహకారాలు అందించుకుంటాయని, ఇండో–యూఎస్ టూరిజం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని చెప్పారు. విశ్వనగరాలతో పోటీపడి హైదరాబాద్ ఈ సదస్సుకు ఎంపికయ్యిందన్నారు. భారత్‌కు ఎనిమిదిసార్లు వచ్చానని, హైదరాబాద్‌కు మూడుసార్లు వచ్చానని, హైదరాబాద్‌లో ముత్యాలు కొనుగోలు చేశానని చెప్పారు. హైదరాబాద్‌ను తనæ పుట్టినిల్లుగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుసన్న సరి, డైరెక్టర్లు లావొన్నె విట్మన్, జాసన్ శామ్యూల్, ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విలియం ర్యాన్, ఎస్‌కేఏఎల్ ఇండియా ప్రెసిడెంట్ మారియో, ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది అతి పెద్ద కార్యక్రమం.. ఇండియాకు చెందిన 9 ఎస్‌కేఏఎల్ క్లబ్‌లు.. అమెరికాకు చెందిన 13 ఎస్‌కేఏఎల్ క్లబ్‌లతో జత కట్టాయని, ఎస్‌కేఏఎల్ చరిత్రలోనే ఇది అతి పెద్ద కార్యక్రమం అని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బీ హడ్డా అభివర్ణించారు. ఈ ఏడాదిని ఇండో–యూఎస్ ట్రావెలింగ్ టూరిజం ఇయర్‌గా ఎస్‌కేఏఎల్ ప్రకటించిందన్నా రు. భారత్–అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గతం లో ఏడాదికి 20 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగితే.. గతేడాది ఏకంగా 115 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందన్నారు. 2009 నుంచి పోల్చి చూస్తే అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రెండింతలైందని, 2015లో 10 లక్షల మంది భారతీయులు నాన్ ఇమిగ్రేటెడ్ వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి
భవిష్యత్తులో మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్ల బడ్జెట్ ► వృద్ధి రేటులో రాష్ట్రం నంబర్ వన్: కేసీఆర్ ► హజ్ యాత్రను ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధన కోసం అల్లాను ప్రార్థించాలని హజ్ యాత్రికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని హజ్ ఆరాధనల్లో దువా చేయాలని కోరారు. మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికుల బస్సును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని తిరిగి రావాలని ఆకాంక్షిం చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందన్నారు. నిజాం పాలకులు మక్కా, మదీనాలో నిర్మించిన రుబాత్‌లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా 1,280 మంది యాత్రికులకు ఉచిత వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అడిగేవారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు దేశంలో ఎక్కడా లేవని వారికి చెప్పాను. వారికి తెలంగాణ కట్టుబాట్లు పరిచయం చేశాను. 1927లో గాంధీజీ హైదరాబాద్ సంస్థానానికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన, హిందూ.. ముస్లింల ఐక్యతకు ఎంతో ప్రభావితమయ్యారు. ఇక్కడి సంస్కృతిని ఉత్తర భారతీయులు నెర్చుకోవాలని ఆయన చెప్పారు. నిజాం దాన గుణం గల వ్యక్తి. ప్రపంచంలో హైదరాబాద్‌కు ధనిక సంస్థానంగా పేరుండేది. చైనా యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఆర్థిక సాయం కోరగా దేశంలో నిజాం తప్ప ఎవరూ స్పందించలేదు. నిజాం ఆరు టన్నుల బంగారం ఇచ్చి పంపించారు. బంగారాన్ని తిరిగి ఇస్తామంటే... ముందు దేశ రక్షణకు పాటుపడమని నిజాం పేర్కొన్నారు’ అని కేసీఆర్ కొనియాడారు. సీఎం అంటే ప్రధాన సేవకుడు... మూడేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు 21 శాతానికి చేరుకుందని సీఎం చెప్పారు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంద న్నారు. ఛత్తీస్‌గఢ్ 10.05 శాతంతో రెండో స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రా నికి ఎంతో నష్టం జరిగిందన్నారు. మైనార్టీ లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ‘మైనార్టీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన సాగిస్తున్నాం. ఓ గ్రామంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లినప్పు డు... విద్యా బోధన, సౌకర్యాల గురించి ఆరా తీశారు. తమ పిల్లలకు ఇలాంటి విద్య, సౌకర్యలు లభిస్తాయని ఉహించలేదంటూ తల్లిదండ్రులు కంట తడి పెట్టుకున్నారని ఫారుఖ్ చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోంది. మైనార్టీ సంక్షేమానికి ఈ ఏడాది రూ.12 వందల కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో దీనిని రూ.12 వేల కోట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సురక్షితంగా, సుఖశాంతులతో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రధాన సేవకుడు మాత్రమే’ అని సీఎం చెప్పారు. కేసీఆర్‌తోనే మైనార్టీల అభివృద్ధి: మహమూద్ అలీ దేశంలోని హజ్ కమిటీల ఏర్పాట్ల కంటే తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర హజ్ కమిటీ సభ్యులు కితాబిచ్చారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడు ఏకే ఖాన్, కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సేన్, ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ మైనార్టీ నేతలు ముజీబ్, మసీవుల్లాఖాన్ పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: వెనకబడిన కులాలు, పేద విద్యార్థుల ఉజ్వల భవితకు గురుకుల పాఠశాలలు పునాది వేయబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల బీసీ గురుకుల పాఠశాలల వసతి గృహాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.కిషన్‌రెడ్డితో కలసి ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీలు, బలహీనవర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
ఆ ఊళ్లో.. మూడొంతులు ఆయనదే!
- అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్లు - మియాపూర్‌లో 70శాతం భూమి ఒక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ - చుట్టూ ఉన్న మరో ఏడు గ్రామాలూ వారివేనట - హక్కుల బదలాయింపును రిజిస్ట్రేషన్ చేసిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ - 600 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ - సీరియస్‌గా స్పందించిన సీఎంవో.. అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ గ్రామం.. ఆ గ్రామంలోని 70 శాతానికిపైగా భూములు ఒకే వ్యక్తికి చెందినవంటూ రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు పరిసరాల్లోని మరో ఏడు గ్రామాల్లోని భూములపైనా హక్కులు కల్పించారు.. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి సందేహం వ్యక్తం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసేయడం.. చివరికి స్టాంపు డ్యూటీని కూడా మినహాయించారు.. వినడానికి చిత్రంగా ఉన్నా.. డాక్యుమెంట్లపరంగా ఇది పక్కా వాస్తవం. మియాపూర్ గ్రామంలోనే సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సంగతి ఇటీవలే బయటపడడం గమనార్హం. ఎన్నో అవకతవకలు.. సనత్‌నగర్‌కు చెందిన హిమయతున్నిసా బేగం అనే మహిళ ఇటీవల బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు చేయించారు. మియాపూర్ గ్రామంలోని 70 శాతం భూములతో పాటు పరిసర ఏడు గ్రామాలపై తమకు షనద్ హక్కులు ఉన్నాయని.. ఆ హక్కులను షఫ్లీగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫిల్‌కు బదలాయిస్తున్నామని ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. పత్రాలను పరిశీలించిన బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ ఎటువంటి సందేహాన్ని వ్యక్తం చేయకుండా గతేడాది జనవరి 18న రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు బుక్–1లో నమోదు చేయాల్సిన ఈ వివరాలను ఇతరులకు తెలియకుండా ఉండేందుకు బుక్–4లో నమోదు చేశారు. డాక్యుమెంట్ నంబర్ 23/బుక్4/2016 ప్రకారం సదరు ఆస్తి విలువను రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. కానీ ఈ స్థిరాస్తికి మార్కెట్ విలువ ఏమీ లేదని చూపుతూ... స్టాంపుడ్యూటీని పూర్తిగా మినహాయించడం గమనార్హం. ఈ ఉదంతంపై సమాచారం అందిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ల తీరుకు నివ్వెరపోతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై సీఎంవో నజర్ కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దీంతో సదరు అక్రమార్కులపై చర్యలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్చార్జి కమిషనర్ అనిల్‌కుమార్ ఉన్నతాధికారులతో చర్చించారు. బాలానగర్ ఉదంతంతో పాటు సీఎంవో నుంచి మరో 29 ఫిర్యాదులు అందాయని, వాటిపై తక్షణం విచారణ చేపట్టాలని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీఐజీలను ఆదేశించారు. సీఎంవో నుంచి అందిన ఫిర్యాదుల్లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై 9, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌పై 15, ఎల్బీనగర్ మాజీ సబ్ రిజిస్ట్రార్‌పై 5 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిసింది. ముమ్మరంగా తనిఖీలు: మహమూద్ అలీ రిజిస్ట్రేషన్ల శాఖ అక్రమాలను నిరోధించేం దుకు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. స్పెషల్ సీఎస్ బీఆర్ మీనా, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తరచూ సందర్శించి.. రికార్డులను తనిఖీలు చేయాలని సూచించారు. బుక్–1లో చేయాల్సిన రిజిస్ట్రేష న్లను బుక్–4లో చేస్తూ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ‘‘రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కావడంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అమీరున్నీసా బేగం, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ట్రినిటీ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథి, సువిశాల్ పవర్ కంపెనీ ప్రతినిధి పీవీఎస్ శర్మలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నాం..’’ – రఘునందన్రావురంగారెడ్డి జిల్లా కలెక్టర్ -
రంజాన్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తల సాని శ్రీనివాస్‌యాదవ్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహా దారు ఏకే ఖాన్, నగర శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి పండుగ వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరుగకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను మహమూద్ అలీ ఆదేశించారు. మసీదుల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాతబస్తీలో తాగునీరు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ప్రత్యేక డంపింగ్ బిన్లను ఏర్పాటు చేయాలని అధి కారులకు సూచించారు. చార్మినార్ ప్రాంతంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పండుగ సందర్భంగా 24 గంటలు హోటల్స్ తెరిచే ఉంటాయన్నారు. మసీద్‌ల రిపేర్ల నిమిత్తం రూ.5 కోట్లు, మక్కా మసీద్ రిపేరు కోసం రూ.8.48 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులకు గంట ముందుగా ఆఫీసు విడిచి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, అహ్మద్ పాషాఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మోజంఖాన్, మాగంటి గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, విద్యుత్ శాఖ సీఎండీ రఘుమారెడ్డి, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రగతి నివేదన’ సక్సెస్!
-
‘ప్రగతి నివేదన’ సక్సెస్!
2019 ఎన్నికలకు టీఆర్ఎస్ శంఖారావం - వరంగల్‌లో 16వ వార్షికోత్సవ సభ - భారీ సంఖ్యలో హాజరైన జనం, కార్యకర్తలు - ట్రాక్టర్లలో తరలివచ్చిన రైతులు - భారీ వేదిక.. పెద్ద సంఖ్యలో నేతలతో కళకళ - ఆకట్టుకున్న ధూం ధాం, సాంస్కృతిక కార్యక్రమాలు - మూడేళ్ల పనితీరును ప్రజల ముందు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ - సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వివరణ ∙కాంగ్రెస్‌పై మండిపాటు (వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): వచ్చే సాధారణ ఎన్నికలు లక్ష్యంగా.. తమ మూడేళ్ల పాలన తీరును వివరిస్తూ టీఆర్ఎస్ వరంగ ల్లో నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరం గసభ విజయవంతమైంది. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ పాలన లో సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెట్టా రు. నిర్ణీత సమయం కన్నా కొంత ఆలస్యంగా సభకు చేరుకున్న కేసీఆర్.. 30 నిమిషాల పాటు ప్రసంగించారు. పెద్దగా రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం సాధించిన ప్రగ తిని వివరించడంపైనే దృష్టి పెట్టారు. తెలం గాణ సాధన ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉన్న సమస్యలను గట్టెక్కే వరకు, విద్యుత్ సమస్యను తీర్చడం, సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తమ పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేం దుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవలే రైతులకు హామీ ఇచ్చిన ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయం తదితర పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యవహరించారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వివిధ వృత్తులకు వెన్నుదన్నుగా నిలి చేలా తీసుకుంటున్న చర్యల గురించీ వివరిం చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులను ట్రాక్టర్లలో సభకు తరలించాలన్న వ్యూహం ఫలితాన్నిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం! టీఆర్ఎస్ తమ 16వ ఆవిర్భావ సభను రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించడానికి సమర్థంగా విని యోగించుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో ఈ సభ ద్వారా టీఆర్ఎస్ ఒక విధంగా బలప్రదర్శన చేసింది. ఉద్యమమప్పుడే కాదు ఇప్పటికీ జన సమీకరణలో బలంగా ఉన్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ప్రగతి నివేదన బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. సభ కోసం దాదాపు నెల రోజుల ముందు నుంచి ప్రణాళికబద్దంగా పనిచేసిన పార్టీ నాయకత్వం ఇందులో విజయవంతమైంది. ఇక విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ, టీడీపీలతో పాటు ఇతర పార్టీలను పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా.. తమ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీయేనని మరోమారు తేల్చారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. ప్రజల అండ దండలు, దీవెనలు కావాలని కోరారు కూడా. భారీ వేదిక.. ఆకట్టుకున్న ధూం ధాం ► సీఎం సభకు చేరుకునే వరకు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో చేపట్టిన ధూం ధాం కార్యక్రమం ఆకట్టుకుంది. ► సభ కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. తొలిసారిగా పూర్తిస్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు.. ఇలా అందరూ వేదికపైనే ఆసీనులయ్యారు. ► ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావులకు మాత్రమే కొంతసేపు ప్రసంగించే అవకాశం వచ్చింది. డిప్యూటీ సీఎంలిద్దరూ కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. కేసీఆర్ ఏకైక బాహుబలి అంటూ కడియం తన ప్రసం గంలో పేర్కొనడంతో సభా ప్రాంగణం చప్పట్లు, ఈలలు, కేకలతో హోరెత్తింది. మైనారిటీలకు సర్కారు అండ దేశంలో ఎక్కడాలేని పథకాలు అమలు: మహమూద్ అలీ న్యూశాయంపేట: మైనారిటీల సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప జేశారని చెప్పారు. పేద ముస్లింల కోసం షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం 80 శాతం సబ్సిడీతో రుణాలు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు తక్కువగా బడ్జెట్‌ను కేటాయిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.1,200 కోట్లు కేటాయించిందన్నారు. జయశంకర్ సార్ యాది టీఆర్ఎస్ గతంలో హన్మకొండలో నిర్వహించిన సభలను కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జయశంకర్ సార్‌ను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇదే గ్రౌండ్లో అనేక సందర్భాల్లో మనం కలిసినం. ఉద్యమం గురించి మాట్లాడుకున్నం. అప్పటికీ, ఇప్పటికీ ఒక్కటే తేడా.. అప్పట్లో నేను మాట్లాడే ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడేవారు. ఇప్పుడాయన మన మధ్య లేరు. స్వర్గం నుంచి చూస్తున్నరు. జయశంకర్ సార్ అమర్ రహే.. అని మనమందరం ఆయనకు చప్పట్లతో నివాళి ఇవ్వాలి..’’అని పేర్కొన్నారు. దీంతో సభకు హాజరైన ప్రజలంతా చప్పట్లు కొట్టడంతో సభాస్థలి మారుమోగింది. ఇక తెలంగాణ కళాకారుల బృందం జయశంకర్ సార్‌పై పాడిన పాట ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఓరుగల్లు.. పోరుగల్లు తనకు సెంటిమెంట్ పరంగా కలిసొచ్చిన వరంగల్‌ను కేసీఆర్ బహిరంగసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యమంలో అండగా నిలిచిందంటూ ‘ఓరగల్లు.. పోరుగల్లు.. నిజమే కదా’అని వ్యాఖ్యానించారు. అదే స్థలంలో గతంలో నిర్వహించిన సభలను కూడా గుర్తు చేశారు. ఇక భారీ బహిరంగ సభ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగసభ ఏర్పాట్లు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు, గ్రేటర్ వరంగల్ మేయర్లను సభా వేదికపై అభినందించారు. భవిష్యత్‌లో కూడా వరంగల్ ప్రజలు తమ వెన్నంటి ఉండాలన్నారు. కుప్పకూలిపోయి కార్యకర్త మృతి హన్మకొండ: ప్రగతి నివేదన బహిరంగ సభ సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభాస్థలి నుంచి తిరిగి వెళుతుండగా.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాటకు చెందిన ఎనుముల పోచయ్య (38) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. ఆయనకు వెంటనే సభాస్థలిలోని వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మరణించారని బహిరంగసభ వైద్య కమిటీ సభ్యుడు డాక్టర్ మదన్‌కుమార్ తెలిపారు. ఈ సమాచారాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా.. పోచయ్య టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త అని, ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినట్లు తెలిపారు. -
ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే!
మైనారిటీ సంక్షేమంపై మండలి లఘు చర్చలో కాంగ్రెస్ ఫైర్ ► చేసిన పనుల కన్నా ప్రభుత్వానికి ప్రచారం ఎక్కువైందన్న షబ్బీర్ అలీ ► మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్లో 25 శాతమే ఖర్చు పెట్టారని వెల్లడి ► రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే 12% రిజర్వేషన్ బిల్లు: మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అల్ప సంఖ్యాక (మైనారిటీ) వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ‘మైనారిటీల సంక్షేమం–ప్రభుత్వ కార్య క్రమాలు’ అంశంపై మంగళవారం శాసన మండలి లఘుచర్చ వాడీవేడిగా కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ చర్చను ప్రారంభిస్తూ.. 20 ఏళ్ల సమైక్య పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,204 కోట్లు కేటాయించిందన్నారు. విపక్ష నేత షబ్బీర్ స్పందిస్తూ.. కేటాయించిన వాటిలో ఇప్పటివరకు 25 శాతం నిధులనే ఖర్చు చేసిందని ఆరోపించారు. మరో రెండు నెలల్లో మిగిలిన నిధులన్నీ ఖర్చు చేయడం సాధ్యమే నా అని ప్రశ్నించారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుకూ రుణం అందలే దన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికా రాలను కల్పిస్తామన్న ప్రభుత్వం, రెండున్న రేళ్లయినా హామీని నిలబెట్టుకోలేదన్నారు. మణికొండలో కబ్జా అయిన వక్ఫ్‌ల్యాండ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉర్దూ ద్వితీయ భాష హామీ ఏమైంది? రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ భాషగా చేస్తామ న్న ప్రభుత్వ హామీ నేటికీ అమలుకు నోచుకో లేదన్నారు. ఉర్దూ అకాడమీలో సిబ్బంది వేత నాలకు నిధులు మంజూరు చేయడం లేదన్నా రు. రాష్ట్రంలో ఇంతకు మునుపు 40 మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాలలుండగా, రాష్ట్ర ప్రభుత్వ చర్యల పుణ్యమాని 18 కళాశాలలు మూత పడ్డాయన్నారు. అజ్మీర్ దర్గా వద్ద తెలంగాణ భవన్ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంతవరకు భూమిని ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి 32 నెలలు దాటిందని, మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షబ్బీర్ అలీ విమర్శించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగింపు: మహమూద్ అలీ రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని మహమూద్ అలీ శాసన మండలిలో ప్రకటిం చారు. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతా నికి మించరాదనే నిబంధనను సడలించేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా (45/94) చట్టం తెస్తామన్నారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామన్నారు. రాష్ట్రంలో దళిత క్రిష్టియన్లకు ఎస్సీహోదాను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. క్రైస్తవులు చర్చిలను నిర్మించుకునేందుకు వీలుగా స్థానిక సంస్థల ద్వారానే అనుమతి పొందేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. గతంలో 35 మంది ఉద్యోగులతో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖను బలోపేతం చేసే దిశగా 80 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందన్నారు. మైనారిటీల కోసం ఈ ఏడాది 71 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఏడాది మరో 129 స్కూళ్లను ప్రారంభించబోతున్నామన్నారు. మొత్తం 200 పాఠశాలల్లో ఆడపిల్లలకు 100 పాఠశాలలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆదేశాలే తప్ప నిధులివ్వట్లేదు: షబ్బీర్ అలీ ధ్వజం రైతులకు డబ్బులు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో సరిపుచ్చుతోంది కానీ నిధులు విడుదల చేయడం లేదని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ‘రాష్ట్రంలో నేటికీ ఎక్కడో ఒకచోట రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది’ అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ ‘తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. సభలో కూడా రైతుల సమస్యలపై మంత్రులు ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు. రైతులకు రుణాల మాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ సరిగా జరగడం లేదు’ అంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం నకిలీ రైతు ప్రభుత్వంగా, కాంట్రాక్ట్‌ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. -
హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్రి కులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గతేడాది రాష్ట్రం నుంచి 4,900 మంది యాత్రికులను మక్కాకు పంపగా, ఈ ఏడాది ఎక్కువ మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. హైదరాబాద్‌లో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్నందున వారి సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. సోమవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆయన విడుదల చేశారు. హజ్ యాత్రికులకు మక్కాలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీమ్, ఫరూక్ హుస్సేన్ హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. -
24 ఎకరాల భూమి హాంఫట్
- బీబీనగర్ మండలం రాఘవాపురంలో అక్రమ రిజిస్ట్రేషన్ - విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాధితుడు దీపక్ - 21 మంది నిందితుల్లో 15 మంది అరెస్టు, పరారీలో ఆరుగురు - అరెస్ట్ అరుునవారిలో నయీమ్ కేసు నిందితుడు గోలి పింగలిరెడ్డి - వివరాలను వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్ చౌటుప్పల్: బీబీనగర్ మండలం రాఘవాపు రంలో ఓ ఎన్నారైకి చెందిన రూ.8.40కోట్ల విలువ చేసే 24 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం గుట్టు రట్టరుుంది. ఈ కేసుకు సంబంధించి 21 మంది నిందితుల్లో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులోని ప్రధాన నిందితుడు గోలి పింగలిరెడ్డి కూడా ఉన్నాడు. శనివారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎన్నారై దీపక్ కాంత్ వ్యాస్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురంలో 24 ఎకరాల భూమి ఉంది. అమెరికాలోని సెరుుంట్ లూరుుస్ ప్రాంతంలో నివాసం ఉండే ఈ ఎన్నారై అమెరికా- తెలం గాణ సంబంధాల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భూమి విషయం ఎవరికీ తెలి యకపోవడం, యజమానిని ఎవరూ గుర్తు పట్టే అవకాశం లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు అక్రమ మార్గాలకు తెరలేపారు. అన్నీ పక్కాగానే.. ఈ కేసులో ప్రధాన పాత్రధారి అరుున కొర్ని మహేశ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కావాల్సిన రికార్డులను తయారీ చేరుుంచాడు. భూ యజమాని దీపక్‌కాంత్ వ్యాస్‌కు చెందిన నకిలీ ఆధార్‌కార్డు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయంలో రికార్డుల మార్పిడి, నకిలీ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ల తయారు చేరుుంచాడు. నకిలీ పత్రాల ద్వారా ఎన్నారై స్థానంలో భూ యజమానిగా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన జితేందర్‌కుమార్ బండారి జైనును రంగంలోకి దింపారు. అంతా ఓకే అనుకున్నాకా బీబీ నగర్‌కు చెందిన పింగళిరెడ్డి, మల్లారెడ్డి కలసి భూమిని రిజిస్ట్రేషన్ చేరుుంచుకునేందుకు హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన జిల్లెల రవీందర్‌రెడ్డి, మల్లిపెద్ది అరవింద్‌రెడ్డిని రంగంలోకి దించారు. అందరూ కలసి అనుకున్న మేరకు 2016 మే 13న భూమిని రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు. చక్రం తిప్పిన డాక్యుమెంట్ రైటర్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బీబీనగర్‌లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ, విషయం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో తమ పాత పరిచయాలతో చౌటుప్పల్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ శ్రవణ్‌ను సంప్రదించి రూ. లక్షకు బేరం కుదుర్చుకున్నాడు.రూ.70 వేలు రిజిస్ట్రార్‌కు ఇచ్చి తను రూ.30 వేలు తీసుకున్నాడు. వెంటనే తతంగాన్ని సజావుగా పూర్తి చేరుుంచాడు. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎన్నారై తనకు జరిగిన అన్యాయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఎన్నారై దీపక్ కాంత్ వ్యాస్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేసీఆర్.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూచించారు. దీంతో ఆయన పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కేసును త్వరగా ఛేదించాలని ఆదేశించారు. అరెస్టరుున నిందితులు వీరే.. కొర్ని మహేష్ (రాఘవాపురం, బీబీనగర్ మండలం), బుయ్య సాంబయ్య (రాఘవాపురం, బీబీనగర్ మండలం), ముద్దోజు బాలాచారి (గుర్ల్ర దండి, బీబీనగర్ మండలం), బిజిలి యాదగిరి (రాఘవాపురం, బీబీనగర్ మండలం), సోనుమంకార్ శంకర్ (బాల్నగర్, రంగారెడ్డి జిల్లా), జితేందర్ కుమార్ బండారి జైన్ (కమలానగర్, గడ్డిఅన్నారం), బుయ్య బసవరాజు (రాఘవపురం, బీబీనగర్), తీగల నర్సింగ్ (సంజయ్‌పురి కాలనీ, జగద్గిరిగుట్ట), పంజాల పెంటయ్య (దమ్మారుుగూడెం, బీబీనగర్ మండలం), సారుునోజు వేణు గోపాలచారి (బాల్నగర్, రంగారెడ్డి జిల్లా), నాయకుని శ్రీను (పంచశిలకాలనీ, కుత్బు ల్లాపూర్), బాణోతు లక్ష్మణ్, (టీచర్స్ కాలనీ, భువనగిరి), కొమ్మిడి మల్లారెడ్డి, (హబ్సిగూడ, హైదరాబాద్), గోలి పింగళిరెడ్డి (మన్సూ రాబాద్, ఎల్బీనగర్), చింతకింది ప్రశాంత్ (శ్రీనివాస్‌నగర్ కాలనీ, జగద్గిరిగుట్ట). -
సీఎంతో భేటీలో సౌదీ రాయబారి అల్సతి
-
రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
సీఎంతో భేటీలో సౌదీ రాయబారి అల్సతి ► తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని వెల్లడి ► సౌదీ, హైదరాబాద్ మధ్య సాంస్కృతిక వారసత్వం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకుంటామని, పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్ధమని సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సాద్ మహమ్మద్ అల్సతి వెల్లడించారు. సౌదీ ప్రభుత్వ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధుల బృందంతో కలసి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అల్సతి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. రాష్ట్రం విద్య, వైద్య రంగాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో పురోగమిస్తుండటం, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుండటంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలతో ఇక్కడ జరిగిన భేటీ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకున్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా కసరత్తు చేయాలని తమ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక, వ్యాపార మంత్రిత్వ శాఖలను ఆదేశించిందన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం సౌదీ సంస్కృతితో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యార్థం ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ సౌదీలోని కాబాకు సమీపంలో రుబాత్ (వసతి గృహం) నిర్మించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన హజ్ యాత్రికులను సౌదీ ప్రజలు ‘అల్లా అతిథులు’గా గౌరవిస్తారని, ప్రపంచంలో మరెవరికీ దక్కని గౌరవం తెలంగాణ ప్రజలకు లభించిందని భావిస్తున్నామన్నారు. నిజాం కాలం నుంచే సౌదీతో తెలంగాణ ప్రజలకు సత్సంబంధాలున్నాయన్నారు. సౌదీ అరేబియా-తెలంగాణ మధ్య పాత స్నేహాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులతో స్నేహబంధం బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న సౌదీ రాయబారి... తమ దేశ ప్రభుత్వం సైతం మతాలకు అతీతంగా భారత విద్యార్థులకు 460 స్కాలర్షిప్లను అందిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయండి హైదరాబాద్ కేంద్రంగా సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ రాయబారికి సీఎం సూచించారు. 3 లక్షల మందికిపైగా తెలంగాణవాసులు సౌదీలో నివసిస్తున్నారని, గత హైదరాబాద్ సంస్థాన పరిధిలోని ఇతర ప్రాంతాల వారూ పెద్ద సంఖ్యలో సౌదీలోనే ఉన్నారన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వారంతా రాకపోకలు సాగిస్తున్నందున హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన అల్సతి...ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సౌదీలో తెలంగాణవాసులు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను తక్షణమే స్వరాష్ట్రానికి తరలించేందుకు సహకరించాలని సీఎం కోరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కె.కేశవరావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీల శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్, సౌదీ అధికారులు పాల్గొన్నారు. -
ప్రవాసుల కోసం ‘ఎన్నారై పాలసీ’
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుల కోసం త్వరలో ప్రత్యేక ఎన్నారై పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సోమవారం లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్-యూకే, హైదరాబాద్ అసోసియేషన్ యూకే సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయుల పాత్ర గొప్పదని అభివర్ణించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని... ప్రధాని మోదీ సీఎం కృషిని ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. త్వరలో రానున్న ఎన్నారై పాలసీ రూపకల్పన కోసం సలహాలు, సూచనలు ఉంటే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఎన్నారై టీఆర్ఎస్ కార్యదర్శి నవీన్ రెడ్డి, హైదరాబాద్ అసోసియేషన్ యూకే ఉపాధ్యక్షుడు షా నవాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే ల్యామ్ బెత్ మేయర్ సాలేహా జాఫర్, హౌన్‌స్లా మాజీ మేయర్ నసీర్ మాలిక్, ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీని ఘనంగా సన్మానించారు. -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
లండన్‌లో డెప్యూటీ సీఎం మహమూద్ అలీ రాయికల్ : బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని డెప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. లండన్‌లో సోమవారం ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్, యూకే, హైదరాబాద్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు ఇస్తోందన్నారు. గల్ఫ్ దేశాల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐ పాలసీపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. సందేహాలు, సలహాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు డెప్యూటీ సీఎంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, సెక్రటరీలు నవీన్‌రెడ్డి, దొంతుల వెంకట్‌రెడ్డి, యూకే ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి, శ్రీధర్‌రావు, లండన్ ఇన్చార్జి రత్నాకర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, హైదరాబా«ద్ అసోసియేషన్ అధ్యక్షుడు ముజీద్, ఉపాధ్యక్షుడు నవాజ్, ప్రధాన కార్యదర్శి షమి, టీడీఎఫ్ అధ్యక్షుడు రామారావు, జేపీఆర్‌డీసీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, టీఈఎన్ఎఫ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, టేకా అధ్యక్షుడు చంద్ర, తెలంగాణ అధ్యక్షుడు సంపత్ పాల్గొన్నారు. -
నేను అలా అనలేదు: మహమూద్ అలీ
ఒలింపింక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని సాధించిన ‘సింధూ’ దేశానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. అటువంటి సింధూను మనకిచ్చిన కోచ్ పుల్లెల గోపిచంద్ దేశం గర్వించదగ్గ కోచ్ అని ఆయన కొనియాడారు. వందమంది సింధూలను తయారు చేయగలిగిన సత్తా కోచ్ గోపిచంద్‌కు ఉందన్నారు. గోపిచంద్ మరో అకాడమీని స్థాపించే ఆలోచన ఉంటే సహకరిస్తానని మాట్లాడిన మాటలను మీడియా వేరే విధంగా చిత్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ఓ పత్రికా ఆవిష్కరణ సభలో ఆయన పై విధంగా స్పందించారు. మీడియా అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. రజత పథకం సాధించిన సందర్భంగా సింధూకు నిర్వహించిన సన్మాన సభలో గోపించంద్ భారత్ గర్వించదగ్గ కోచ్ అని, మరో అకాడమీ స్థాపించే ఆలోచన ఉంటే తాను సహకరిస్తానని చెప్పానన్నారు. గోపిచంద్ ఆధ్వర్యంలో మంచి టీమ్‌ను ఇచ్చేందుకు తన వంతు సాయం చేస్తానని సభా ముఖంగా తెలిపానన్నారు. వంద మంది సింధూలను తయారు చేసి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేగలిగిన సత్తా ఒక్క గోపించంద్‌కు ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను మీడియా మరోలా చిత్రీకరించడంతో దేశవ్యాప్తంగా తను విమర్శలను ఎదుర్కొనడం జరిగిందన్నారు. ఇటివల నీటి ఒప్పందాలపై మహరాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ మీడియా కూడా ఇదే విషయంపై ప్రశ్నించడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే ఉండి స్పందించడంతో ఉపశమనం పొందానన్నారు. ఒక వార్త రాసేప్పుడు సరైన ఆధారాలతో రాస్తే సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఎల్లప్పుడూ గోపించద్కు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. -
పవిత్ర యాత్ర..
సాక్షి, సిటీ బ్యూరో: నగరం నుంచి తొలి హజ్ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్ర–2016ను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హజ్ హౌస్‌లోని క్యాంప్ నుంచి యాత్రికుల బస్సుకు జెండా ఊపి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. పవిత్ర హృదయంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్ధించాలని డిప్యూటీ సీఎం యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. కాగా, తమవారు హజ్‌కు వెళుతుంటే బంధువులు ఉద్వేగానికి గురయ్యారు. -
నేటి నుంచి హజ్ యాత్ర
- జెండా ఊపి ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - 22న హజ్‌హౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ - 28న చివరి విమానం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర మక్కా హజ్ యాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ హజ్ హౌస్ నుంచి తొలి బృందానికి జెండా ఊపి యాత్ర ప్రారంభించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ నుంచి ఎయిరిండియా తొలి ఫ్లైట్ సౌదీ అరేబియాలోని జెద్దాకు బయలు దేరనుంది. సీఎం కేసీఆర్ ఈ నెల 22న హజ్ హౌస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని హజ్ యాత్రికుల మూడో బృందాన్ని సాగనంపనున్నారు. హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ యాత్రికుల కోసం ప్రతి రోజు రెండు విమానాల చొప్పున ఈ నెల 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. తొలి ఎనిమిది విమానాల్లో తెలంగాణ, తర్వాతి నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికులు బయలు దేరుతారు. మరో రెండు విమానాల్లో రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులు, చివరి విమానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వెయిటింగ్ జాబితా యాత్రికులు బయలుదేరుతారు. ఒక్కో విమానంలో 340 యాత్రికులు వెళ్లనున్నారు. హజ్ ప్రార్థనల అనంతరం అక్టోబర్ 4 నుంచి 11 వరకు మదీనా నుంచి బయలు దే రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రం నుంచి 2,800 మంది.. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు దాదాపు 2,800 మంది యాత్రికులు బయలు దేరనున్నారు. మక్కాలోని నిజాం రుబాత్‌లో సుమారు 678 మందికి ఉచిత భోజన, వసతి సౌకర్యం లభించనుంది. యాత్రికులకు సేవలందించేందుకు ప్రతి 200 మంది కి ఓ ఖాదీముల్ హుజ్జాజ్(ప్రభుత్వ వలంటీర్)లను ఎంపిక చేశారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో హజ్ క్యాంప్ రెండ్రోజుల ముందే ప్రారంభమైన విషయం తెలిసిందే. -
నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక!
-
నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తమ నివేదికను సమర్పించనుంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్యర్యంలోని సబ్‌కమిటీ వరుసగా మూడు రోజుల పాటు అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లతో భేటీ అయింది. జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల విభజన అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైంది. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులన్నింటినీ క్రోడీకరించి సబ్ కమిటీ నివేదికను రూపొందించింది. ‘జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలన్నీ తెలుసుకున్నాం. అందరి విజ్ఞప్తులు, ప్రజాభిప్రాయాలతో నివేదికను సిద్ధం చేశాం. మంగళవారం ముఖ్యమంత్రిని కలసి ఈ నివేదికను అందజేయాలనుకుంటున్నాం..’ అని మహమూద్ అలీ సోమవారం వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదని, 24 ఉండాలా.. కొత్తగా వచ్చిన డిమాండ్లతో 26కు పెంచాలా.. అన్నది తేలలేదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విషయంలోనే పీటముడి ఉందని, ఆ వివాదం కూడా త్వరలో సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలున్నాయి. దానికి బదులు మరో జిల్లాను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇక జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా చేయాలని ఆ ప్రాంత ప్రతినిధులు పట్టుబట్టారు. ఈ రెండు ప్రతిపాదనలను కూడా సబ్ కమిటీ నివేదికలో పొందుపరచనున్నట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాపై ప్రజా ప్రతినిధుల భేటీలో చర్చ జరగకపోవడం, నిర్మల్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో... సబ్ కమిటీ ఈ రెండింటిని నామమాత్రంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక జోనల్ వ్యవస్థను రద్దు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు నివేదికలో ఉండనున్నాయి. ముందుగా ఈనెల 16న అఖిల పక్ష సమావేశం, 17న కలెక్టర్లతో సబ్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే సీఎంతో సబ్ కమిటీ అనంతరమే ఈ రెండు సమావేశాలపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
త్వరలో 277 సర్వేయర్ల పోస్టుల భర్తీ
డెప్యూటీ సీఎం మహమూద్ అలీ కరీంనగర్ : భూ సమస్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 277 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నామని డెప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంగళవారం కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశమందిరంలో రెవెన్యూ, సీజనల్ వ్యాధులు, హరితహారంపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అ«ధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాదాబైనామాలను ఫాస్ట్ ట్రాక్‌లో విచారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించి పేద రైతులకు న్యాయం చేయాలన్నారు. మ్యూటేషన్ ఇరవై రోజుల్లో, విరాసత్ పది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ భూములు కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సైన్ బోర్డులు పెట్టాలన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ముద్రతో ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు, నిర్వహణ నిధులు, కార్లు, విద్యుత్ బిల్లులు మంజూరీ చేస్తామని తెలిపారు. మీసేవలో అవకతవకలున్నాయని దృష్టికి వచ్చిందని, అటువంటి వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెవెన్యూశాఖలో ఉద్యోగుల కొరత లేకుండా చేస్తామన్నారు. -
నిజాం రుబాత్‌లో 678 మందికి ఉచిత వసతి
- తొలి విడతగా 224 మంది హజ్ యాత్రికుల ఎంపిక - వారం రోజుల్లో మరో 454 మంది - లక్కీ డ్రా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి, హైదరాబాద్ : హజ్‌యాత్ర-2016 సందర్భంగా మక్కా నిజాం రుబాత్‌లో 678 మంది యాత్రికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడించారు. మొత్తం 678 యాత్రికుల్లో తొలివిడతగా 224 మందిని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. మరో వారంలో మిగిలిన 454 మంది యాత్రికులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాతబస్తీలోని చౌ మహల్లా ప్యాలెస్‌లో రుబాత్ ఉచిత బస కోసం నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిజాం హయాంలో హజ్ యాత్రికుల కోసం మక్కాలో భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. అప్పటి నిజాం రాజ్యంలో ఉన్న 21 జిల్లాల యాత్రికులకు రుబాత్‌లో ఉచిత సౌకర్యం వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని ఏడు, కర్ణాటకలోని నాలుగు జిల్లాల యాత్రికులు రుబాత్‌లో ఉచిత వసతికి అర్హులని పేర్కొన్నారు. నిజాం సర్కార్ మక్కాలో ఏడు భవనాలు నిర్మించగా రోడ్డు విస్తరణలో నాలుగు భవనాలను కూల్చివేశారని, ఒకటి శిథిలావస్థకు చేరిందని చెప్పారు. మిగిలిన రెండింటిలో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉచిత వసతి, భోజనం తదితర సౌకర్యాల కారణంగా ప్రతి యాత్రికుడికి సుమారు రూ.47,700 మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. భవిష్యత్తులో హజ్యాత్రికులందరికీ మక్కా, మదీనాలో ఉచిత బస ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఎం షుకూర్, రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
గతేడాదికన్నా ఘనంగా బోనాలు
♦ అధికారులకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆదేశం ♦ పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసానితో కలసి సమీక్ష సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా హైదరాబాద్‌లో జరుపుకునే బోనాలు పండుగను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. గతేడాదికన్నా ఘనంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి గురువారం సచివాలయంలో బోనాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర పండుగైన బోనాల పండుగ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తలసాని పేర్కొన్నారు. జూలై 17న బోనాలు హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి హోం, ఎక్సైజ్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. జూలై 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవస్థానంలో జరిగే బోనాల పండుగకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి అవసరమైన పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని మహమూద్ అలీ, తలసాని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున దేవాలయాల పరిసరాల్లో మొబైల్ టాయిలెట్లు, రోడ్లకు మరమ్మతులు, విద్యుత్ అలంకరణలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, హోర్డింగ్‌లు, సినిమా థియేటర్లలో ప్రకటనల ద్వారా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాలపై వారు ఆదేశాలు జారీ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జూలై 5న కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయాలవారీగా కమిటీలు వేసుకొని పండుగను విజయవంతంగా నిర్వహించుకోవాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, సమాచార, పౌరసంబధాలశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు అధికారులు శ్రీనివాస్, సుమతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హరిచందన, అగ్నిమాపకశాఖ అదనపు డెరైక్టర్ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. -
హోదా రెండు రాష్ట్రాలకూ అవసరం
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అనుమసముద్రంపేట: తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలోని శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా, నాయబ్ రసూల్ దర్గాలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం దర్గా సజ్జాదా నషీన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ దర్గాను దర్శించుకున్న తర్వాతే డిప్యూటీ సీఎం అయ్యానని తెలిపారు. అందుకు గాను మొక్కు తీర్చుకునేందుకు దర్గాకు వచ్చానని చెప్పారు. ఏఎస్‌పేట దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రతి రోజూ వందలాది మంది ఏఎస్‌పేటలోని హజరత్ వారి దర్గాకు వచ్చి వెళ్తున్నారన్నారు. వారి కోసం ఏఎస్‌పేటలో సౌకర్యాలతో హైదరాబాద్ భవన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తెలిపారు. కసుమూరులోని మస్తాన్‌వలీ దర్గాను కూడా ఆయన సందర్శించారు. -
'తెలంగాణలో కరువు తీవ్రంగా ఉంది'
హైదరాబాద్ : తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీని చాడా వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సీపీఐ నేతల బృందం కలసింది. రాష్ట్రంలో ఏర్పడిని కరువు పరిస్థితిని మహమూద్ అలీకి వివరించినట్లు ఆయన చెప్పారు. అనంతరం చాడా వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వడదెబ్బతో ప్రజలు చనిపోతున్నారని... ఈ నేపథ్యంలో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులు మూడు బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు. -
సెల్‌ఫోన్‌కు వడగాడ్పుల సమాచారం
ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు మించిన ప్రాంతాల్లో మొబైల్స్‌కు ఎస్సెమ్మెస్ సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను ముంద స్తుగా అప్రమత్తం చేసేందుకు ఐటీ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ నియంత్రణ పోర్టల్‌ను రూపొందిం చింది. దీని ద్వారా ఎండవేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల మొబైల్ ఫోన్లకు 15 రోజుల ముందుగానే ఎస్సెమ్మెస్ రూపంలో సమాచారం అందించనుంది. వాతావరణ శాఖ సహకారంతో ఐటీ అధికారులు రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. ముందస్తు సమాచారమిచ్చి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఐటీ శాఖ రూపొందించిన వెబ్‌పోర్టల్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా ఉష్ణోగ్రతల వివరాలను సేకరించేం దుకు రాష్ట్రాన్ని 855 భాగాలుగా విభజించామని, ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సెన్సార్లతో ఉష్ణోగ్రతల సమాచారాన్ని వాతావరణ శాఖ ద్వారా సేకరించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రాబోయే 15 రోజుల్లో ఉష్ణోగ్రతలపై ముంద స్తు అంచనాను వెబ్‌పోర్టల్‌లో ఉంచుతామన్నారు. ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీలు ఉంటే వడగాల్పులుగా పరిగణిస్తామని, అంతకుమించిన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశమున్నట్లైతే సీవియర్ హీట్‌వేవ్‌గా పరిగణిస్తామన్నారు. ఏ ప్రాంతంలోనైతే 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందో ఆ సమాచారాన్ని ఆ ప్రాంతంలోని ప్రజల మొబైల్స్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తామన్నారు. -
ముస్లిం రిజర్వేషన్‌పైస్టే కొనసాగాలి
మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అం శంపై స్టే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశా రు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పనకు కట్టుబడి ఉందని, విచారణ కమిషన్ నివేదిక కోసం ఎదురు చూస్తోందన్నారు. అప్పటివరకు నాలుగు శాతం రిజర్వేషన్‌పై స్టే కొనసాగితే, ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ రిజర్వేషన్‌పై ఈ నెల 18న సుప్రీంకోర్టులో జరిగే విచారణకు తాను హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టు స్టే విధించిందన్నారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉన్నం దున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదనపు న్యాయవాదిగా రాంచందర్‌రావును ని యమించినట్లు పేర్కొన్నారు. -
ఈ-చలాన్లతో రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు చెక్
ఈ-స్టాంప్స్ మాడ్యూల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే పనిలేకుండా ఈ-చలాన్లతో విని యోగదారులు ఎంచక్కా తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ అన్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ నూతనంగా రూపొందించిన ఈ-స్టాంప్స్ (ఈ-స్టాంప్ డ్యూటీ ఇన్ తెలంగాణ తెలంగాణ అసెస్మెంట్, మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్)మాడ్యూల్‌ను సోమవారం సచివాల యంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2014-15లో కన్నా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ సేవలతో పాటు త్వరలోనే ప్రభుత్వ భూములు, లిటిగేషన్లో ఉన్న భూముల వివరాలనూ ఆన్లైన్లో పెడతామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు వీలుగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో షిఫ్ట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, రెండు వారాల్లోగా అర్హులైన సిబ్బందికి పదోన్నతులు, ఉన్నత స్థాయిలో పూర్తిస్థాయి అధికారులను నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పట్టేదని, రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తిస్థాయి కంప్యూటరైజేషన్ ఫలితంగా ఆయా దశలన్నీ రెండు గంటల్లో పూర్తిచేసేందుకు వీలు కానుందని రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ చెప్పారు. ఆన్లైన్లోనే వినియోగదారుడు స్వయంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు స్టాంప్ డ్యూటీ అసెస్మెంట్నూ చేసుకోవచ్చన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ-చలాన్ల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నామని, రిజిస్ట్రేషన్ కోరుకునే విని యోగదారుడు ఆన్లైన్(ఇంటర్నెట్ బ్యాంకిం గ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా)తో పాటు ఆఫ్లైన్లోనూ ఏ ఎస్బీహెచ్ శాఖ నుంచైనా స్టాంప్‌డ్యూటీ చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ సీజేఎం విశ్వనాథన్, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహితపై ప్రతిపక్షాల దుష్ర్పచారం
జాతీయ హోదా, 18 అనుమతులు రాలేదు: హరీశ్ ♦ వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం ♦ లేకుంటే ప్రతిపక్ష సభ్యులు రాజీనామా చేస్తారా అని సవాల్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ఆకృతి మార్పునకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు షబ్బీర్‌అలీ, రంగారెడ్డి అడిగిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా ఆదివారం శాసనమండలిలో ఇరుపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రాణహిత పాత డిజైన్‌కు కేంద్రం నుంచి 18 అనుమతులు, జాతీయ హోదా లభించినట్లు రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని, లేకుంటే ప్రతిపక్ష సభ్యులు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 5 అనుమతులు మాత్రమే వచ్చాయని, జాతీయ హోదా విషయమై పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్విభజన బిల్లులో పేర్కొన్నారని చెప్పారు. క్లియరెన్సులు అన్నీ ఉంటే ఏడేళ్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్ద సరిపడినంత నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ వద్దకు ప్రాజెక్టును రీడిజైన్ చేశామని తెలిపారు. ప్రాజెక్ట్ రీడిజైన్‌తో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించగలుగుతామని, రెండు పంటలు పండించేందుకు వీలవుతుందన్నారు. ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వం పెట్టిన ఖర్చును 99 శాతం వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పేరును మార్చబోమని.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రెండేళ్లలో భూముల సమగ్ర సర్వే: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేను త్వరలోనే చేపట్టి రెండేళ్లలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రకటించారు. మండలిలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి జవాబిస్తూ.. జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద రూ.254 కోట్లతో సర్వే ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వంట నూనెల కల్తీ విస్తరణపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లకా్ష్మరెడ్డి బదులిస్తూ.. కల్తీని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులతో చర్చించి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలకు సంబంధించి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు జవాబిస్తూ.. జాతీయ రహదారులపై 999 మద్యం దుకాణాలు, 281 బార్లు ఉన్నాయని, రహదారుల భద్రత విషయమై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని చెప్పారు. పేద రైతులను పీడిస్తున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వ పరంగా చర్యలు చేపడతామని.. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహమూద్ అలీ చెప్పారు. గ్రూప్-2లో మరో 439 ఖాళీలు: ఈటల ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు, అధికారుల విభజన ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ పూర్తి చేస్తేనే ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలవుతుందని.. బీజేపీ ఎమ్మెల్సీ రాం చంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ముందుగా ప్రకటించినట్లు లక్ష ఉద్యోగాలను భర్తీ చే సేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటికే 11 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, త్వరలోనే 10 వేల టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టబోతున్నామని చెప్పారు. గ్రూప్-1 కింద 49, గ్రూప్-2 కింద 439 ఖాళీలను ప్రకటించడానికి టీఎస్పీఎస్సీకి అనుమతినిచ్చినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. దేవాలయ భూములకు సంబంధించి ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానమిస్తూ.. రాష్ట్రంలోని 2,924 దేవాలయాల కింద మొత్తం 84,730 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 14,030 ఎకరాలు అన్యాక్రాంతమైందని తెలిపారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఆ భూములను సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. -
సవతి ప్రేమ చూపింది మీ కన్న తల్లే
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు విసుర్లు సాక్షి, హైదరాబాద్: ‘నల్లగొండ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించడం దురదృష్టకరం. వాళ్ల కన్నతల్లే (కాంగ్రెస్ ప్రభుత్వం) సవతి తల్లి ప్రేమ చూపించింది. జిల్లా పట్ల సానుకూలంగా ఉన్నాం. ఫ్లోరైడ్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులపై ఆదివారం శాసనసభ స్వల్ప వ్యవధి ప్రశ్నల సమయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతి, స్థితిగతులను వివరించారు. వర్షాలు కురిస్తే వచ్చే ఖరీఫ్‌లో లో లెవల్ కెనాల్ కింద 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలసి రెండురోజులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టమీద తిరిగి ఆధునికీకరణ పనులను పరిశీలించానన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 35 శాతం పనులే చేస్తే, తాము ఏడాదిలోనే 50 శాతం పనులు చేశామన్నారు. మిగిలిన పనిని ఈ ఏడాదిలోగా చేస్తామన్నారు. నీటి సంఘాల ప్యాకేజీ పనులకు గత ప్రభుత్వం టెండర్లు పిలవలేదని, తాము టెండర్లు పిలిచి అప్పుడే 65 శాతం పనులు చేశామన్నారు. -
'అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం'
హైదరాబాద్: బల్దియా పీఠంపై తొలిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగురవేయబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు శాంతికాముకులని, ఎలాంటి అలజడులకు, వివాదాలకు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు తన కార్యాలయం నుంచే పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టిస్తే అటువంటి దుష్టశక్తులపై చర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వాల హయాంలో బల్దియాకు వెళ్లాలంటే లంచాలు ఇస్తేనే పనులు జరిగేవని... ఇప్పుడా దుస్థితి రాబోదన్నారు. అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ నగరంపై దృష్టి పెట్టారని... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. -
'తెలంగాణకు రూ.100 కోట్లు విడుదల'
న్యూఢిల్లీ : తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అలాగే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామన్నారు. ఆ బృందం నివేదిక అందించిన వెంటనే రాష్ట్రానికి మరింత సాయం అందిస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కరవు మండలాలను ఆదుకోవాలని కేంద్రమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. అలానే రాష్ట్రంలోని కరవు మండలాలకు రూ. 2, 514 కోట్లు సాయం అందించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. కరవు మండలాలకు సంబంధించి ప్రాధమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఈ సందర్బంగా తెలంగాణ మంత్రులు గుర్తు చేశారు. ఉద్యానవన వర్సిటీకి కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ జనవరి 7వ తేదీన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ యూనివర్శిటీ కోసం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఇప్పటికే స్థలం సిద్ధం చేశామని వారు చెప్పారు. ఆ భేటీ అనంతరం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ తో కలసి మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కడియం శ్రీహరిలు విలేకర్లతో మాట్లాడారు. -
'రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తాం'
శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా పెద్దగా ఉన్నందున ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈస్ట్ (తూర్పు), వెస్ట్ (పడమర)లుగా రెండుగా విభజించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. 30 రోజుల్లో అన్ని కార్యాలయాలను తనిఖీ చేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రెవెన్యూ విభాగంలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. -
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్‌లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్‌లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. -
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సరికాదు
హైదరాబాద్: శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను కూడా కూలగొడతామన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ హనుమంతరావు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ... మహమూద్ అలీ వ్యాఖ్యలు ప్రజల భావొద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. చారిత్రక కట్టడాలను మరమ్మతులు చేస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. కట్టడాలు పాతబడ్డాయని కూల్చివేస్తామనడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వీహెచ్ అన్నారు. -
రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు
సబ్ రిజిస్ట్రార్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా లక్ష్యా న్ని చేరుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సబ్- రిజిస్ట్రార్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సబ్-రిజిస్ట్రార్ల సంఘం రూపొందించిన కరదీపికను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బ్రోకర్లను నియంత్రించి, ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందు కు ‘హెల్ప్’ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఉపముఖ్యమంత్రికి తప్పిన ప్రమాదం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. వీరు ఇద్దరూ ఎల్.బీ. నగర్‌లోని ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ ఆస్పత్రిలో లిప్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో వారు లిప్ట్‌లోనే ఉండిపోయారు. వెంటనే సిబ్బంది వచ్చి లిప్ట్కు మరమ్మతులు చేయడంతో వారు బయటకు వచ్చారు. మంత్రి కారు టైరుకు పంక్చర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హొం మంత్రి నాయిని నరసింహా రెడ్డి సబ్ జైలుకు వెళుతుండగా కారు టైర్‌కు పంక్చర్ అయింది. దాంతో ఆయన కొద్దిసేపు నడిరోడ్డుపై నిలబడవలసి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న షాపులో టైర్‌కు పంక్చర్ వేయించిన తరువాత ఆయన వెళ్లిపోయారు. -
పదహారు పద్దులకు ఆమోదం
రాత్రి తొమ్మిది వరకు నిరాఘాటంగా కొనసాగిన సభ అర్థవంతమైన చర్చ కోసమే: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు సంబంధించి శాసనసభ పదహారు పద్దులకు ఆమోదం తెలిపింది. పురపాలన -పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, భారీ, మధ్యతరహా నీటిపారుదల, చిన్నతరహా నీటిపారుదల, ఇంధనం, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సహాయం, ఆబ్కారీ నిర్వహణ, వాణిజ్య పన్నుల నిర్వహణ, రవాణా నిర్వహణ, హోం పాలన, వ్యవసాయం, పశుసంవర్ధన, మత్స్యాగారాలు, సహకారం, పౌర సరఫరాల నిర్వహణ పద్దులకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు నిర్విరామంగా ఈ పద్దులపై చర్చ కొనసాగింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయని ప్రకటించిన స్పీకర్ రాత్రి తొమ్మిదింటికి ఆయా పద్దులు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందించాలి: హరీశ్‌రావు ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, దానికి ప్రస్తుతం సభ జరుగుతున్న తీరే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి పద్దులపై చర్చ అనంతరం ఆయన సభలో మాట్లాడారు. గతంలో ఇలా సభను నిర్వహిం చిన దాఖలాలు లేవని, కనీవినీ ఎరుగని రీతిలో తాము పద్దులపై అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించామన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా టీడీఎల్పీ తరహాలో అధికారపక్షం సభను నిర్వహిస్తోందని, దాన్ని గమనించి తెలంగాణ సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందిస్తాయని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణకు కమిటీలు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర జలవనరులపై చర్చించడానికి త్వరలోనే అఖిలపక్షంతో సమావేశం కానున్నట్టుగా హరీశ్‌రావు వెల్లడించారు. మిషన్ కాకతీయకు ఇది మొదటి సంవత్సరం కాబట్టి ప్రాథమిక సమస్యలుంటాయని, అన్నింటిపై సమగ్రంగా చర్చించడానికి అన్ని పార్టీలతో సీఎం సమావేశం అవుతారన్నారు. భూముల రీ-సర్వే: మహమూద్ అలీ త్వరలో భూములను రీసర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భూములను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. గీతదాటే వైన్స్‌లపై వేటు: పద్మారావు నిబంధనలను ఉల్లంఘించిన కల్లు, వైన్స్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు స్పష్టంచేశారు. ప్రార్థనామందిరాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 100 మీటర్లలోపు వైన్స్‌లు ఉన్నాయని సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మూసేస్తామన్నారు. కల్లుగీత వృత్తిలో ఇతర కులాలకు కొన్ని ప్రాంతాల్లో లెసైన్సులు ఇచ్చామన్నారు. పన్నులు పెంచేది లేదు: తలసాని వాణిజ్య పన్నులు పెంచాలని, టెక్స్టైల్ వంటివాటికి పన్నును విస్తరించాలనే యోచన ప్రభుత్వానికి లేదని వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్టాపుల్లో టాయిలెట్లు: మహేందర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న బస్టాపుల్లోనూ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్డు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి నడిపించడానికి 100 ఏసీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల్లో నడిపించడానికి 400 పల్లెవెలుగు కోసం కేటాయించినట్టు వెల్లడించారు. వ్యవసాయానికి పదేళ్ల యాక్షన్ ప్లాన్: చెన్నమనేని అంతకు ముందు పద్దులపై సుదీర్ఘ చర్చ జరిగింది. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అన్నారు. ‘సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అని సరైన ప్రాధాన్యతలనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. వ్యవసాయానికి సంబంధించి తక్కువ దిగుబడి, ఎక్కువ వ్యయం అనేది సమస్యగా ఉంది. దీనిని అధిగమించేందుకు పదేళ్ల కాలానికి వ్యవసాయ పర్స్పెక్టివ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. జానా బాగుందంటున్నారు..ఎమ్మెల్యేలు బాలేదంటున్నారు బడ్జెట్ బాగా ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి మెచ్చుకుంటే, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాగా లేదంటూ విమర్శిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యానిం చారు. ‘పనికి ఆహారపథకాన్ని సిమెంట్ పనులు, మిషన్ కాకతీయకు, చెరువుల పూడికతీత ఇతర పనులకు మళ్లించాలి’ అని కోరారు. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలి: చింతల రామచంద్రారెడ్డి విశ్వనగరంలో హైదరాబాద్‌ను పేర్కొంటున్నా అంతర్గతంగా పరిస్థితి భయంకరంగా ఉంది. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ‘వీసా గడువు ముగిసిన విదేశీయులు ఎంత మంది ఇక్కడ ఉన్నారో లెక్కలు తీయాలి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పర్మిట్‌రూమ్‌ల వల్ల ఆగడాలు: ఖాద్రీ మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్‌లకు అనుమతినివ్వడం వల్ల రోడ్లపై ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని ఖాద్రీ (ఎంఐఎం) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
7న అజ్మీర్‌కు డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఈ నెల 7న అజ్మీర్ వెళ్లనున్నారు. కొత్తగా ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పాటైన సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించి మొక్కుతీర్చుకుంటారు. అనంతరం రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వచ్చే యాత్రికుల వసతి కోసం దర్గా సమీపంలో ప్రత్యేకంగా విశ్రాంతి భవనం నిర్మాణానికి రెండెకరాల భూమి కేటాయింపుకోసం చర్చిస్తారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ రాసిన లేఖను వసుంధరకు అందజేస్తారు. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్‌బోర్డు తదితర సంస్థల పని తీరును పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారు. హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీ ఏర్పాటు, హైదరాబాద్ పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు, త్వరగా వక్ఫ్‌బోర్డు విభజన, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు తదితర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు. 11న ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
ఆగస్టు 17 నుంచి హజ్‌యాత్ర
సాక్షి, హైదరాబాద్: పవిత్ర హజ్‌యాత్ర-2015కు తెలంగాణ హజ్ కమిటీ సిద్ధమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హజ్‌హౌస్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు దరఖాస్తుల జారీ ప్రక్రియను ప్రారంభించి షెడ్యూలు విడుదల చేయనున్నారు. ఈ యాత్ర కోసం పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు స్వీకరించనున్నారు. ఈసారి కొత్తగా ‘ఆన్లైన్’లో దరఖాస్తుల స్వీకరణ, ఈ-పేమెంట్ సదుపాయం కల్పించారు. దరఖాస్తులను www.hajcommittee.comవెబ్‌సైట్‌కు పంపవచ్చు. అదేవిధంగా ఈ పేమెం ట్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. అంతర్జాతీయ పాస్‌పోర్టు కలిగి 2016 మార్చి, 20వ తేదీ వరకు గడువు ఉన్నవారే హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వుడ్ కేటగిరి కింద 70 ఏళ్ల వయస్సు పైబడినవారు, నాలుగు పర్యాయాలు దరఖాస్తు చేసుకొని ఈ యాత్రకు ఎంపిక కానీ వారిని పరిగణనలోనికి ఏ, బీ కేటగిరీలుగా తీసుకుంటారు. మార్చిలో యాత్రికుల ఎంపిక: హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఎంపిక మార్చి రెండోవారంలో జరగనుంది. రాష్ట్రానికి కేటాయించి కోటాను జిల్లా ముస్లిం జనాభావారీగా విభజించి లాటరీ పద్ధతిలో ఎంపికను నిర్వహిస్తారు. ఎంపికైనవారు తమ ఒరిజినల్ పాస్‌పోర్టుతోపాటు పే స్లిప్‌లను ఏప్రిల్ 23లోగా సమర్పిం చాల్సి ఉంటుంది. ఆగస్టు 17న హజ్‌యాత్ర కోసం తొలి ఫ్లైట్ బయలుదేరనుంది. -
ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. అవసరమున్న చోట ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు షిప్టుల్లో పనిచేయనున్నాయని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో షిప్టు ఉంటుందని తెలిపారు. నిజాం ప్రభువును ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించారు. నిజాం చేసిన మంచి గురించి చెబితే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. -
పింఛనుకు అర్హులు 2.13 లక్షల మంది
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా గుర్తించామని, వీరిలో ఇప్పటివరకు లక్షా అరవై ఐదువేల మంది పెన్షన్‌దారుల డేటాను ఎంట్రీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి తెలిపారు. సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో 2,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం 2,13,063 మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. ఇంకా 10వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆహర భద్రత కార్డులకు 7,21,852 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు వివరించారు. ఈ నెలాఖరులోగా పెన్షన్ దరఖాస్తుల పరశీలన పూర్తి చేయడంతో పాటు అర్హులందరికీ పింఛను పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సురేంద్రమోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్, డీఎస్వో గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలంబరితి కలెక్టరేట్ నుంచి పింఛన్లు ,ఆర్‌ఓఎఫ్‌ఆర్‌పై ఎంపీడీవోలు, తహశీల్దార్లతో, ఆర్డీవోలతో, ఫారెస్టు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు పెన్షన్ల ప్రకియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జాబితాలు ప్రదర్శించాలని, దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలపాలని సూచించారు. -
తెలంగాణ భూ సేకరణ ముసాయిదా విడుదల
సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టం ముసాయిదాను రూపొందించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర భూసేకరణ చట్టానికి లోబడి రాష్ట్ర భూసేకరణ చట్టంపై అధ్యయనానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలోని సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక ముసాయిదాను విడుదల చేసింది. ఈ భూసేకరణ చట్టం ముసాయిదాలో అభ్యంతరాలను, సూచనలను గెజిట్ ప్రచురించిన 15 రోజుల్లోగా తెలుపవచ్చునని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని అంశాలకు లోబడి రాష్ట్ర భూసేకరణ చట్టంలో పలు అంశాలను పొందుపర్చారు. భూసేకరణతో సామాజిక ప్రభావం, ప్రభావం అధ్యయనం చేయడానికి స్థానిక కమిటీ ఏర్పాటుచేయాలి. పునరావాసం, నష్ట పరిహారం వంటివాటికి గరిష్ట పరిమితులన్నీ కేంద్ర భూసేకరణచట్టం ప్రకారమే ఉంటాయని ఆ ముసాయిదాలో పేర్కొన్నారు. -
పేద యువతులకు ‘షాదీ ముబారక్’
హెల్ప్ లైన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ సుల్తాన్‌బజార్: పేద యువతులకు ‘షాదీ ముబారక్’ పథకం వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం అబిడ్స్ తిలక్‌రోడ్‌లోని బీమాభవన్‌లో ఉన్న కమిషనర్ మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో షాదీ ముబారక్ మద్దత్ హెల్ప్‌లైన్ (040-246760452)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహామూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధ తదితర మైనార్టీలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. పెళ్లికి నెల రోజుల ముందు మీసేవ, ఆన్లైన్ ద్వారా- epasswebsite.cgg.gov.in వెబ్సైట్లో షాదీ ముబారక్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. యువతులు జోరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుందని వివరించారు. అక్టోబర్ 2 తర్వాత పెళ్లి అయిన వారు పెళ్లి సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ డెరైక్టర్ ఎంజె. అక్బర్, డిప్యూటీ డెరైక్టర్ సుభాష్ చందర్‌గౌడ్, నవీన్ నికోలేస్( క్రిస్టియాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్), శుకూర్( మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్)తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి భీమ్రావ్ బాడా వివాదం
మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్రావ్బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు. గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు. డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి భీమ్రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు. అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు. -
ఇంజనీరింగ్ విద్యకు పెద్దపీట
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అరోరాలో ముగిసిన నేషనల్ ఫెస్ట్ చాంద్రాయణగుట్ట: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బండ్లగూడలోని అరోరా సైంటిఫిక్, టెక్నాలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో రెండు రోజుల పాటు కొనసాగిన ‘ఉద్భవ్’ జాతీయ స్థాయి ఫెస్ట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నతస్థానాలకు ఎదగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులకు కూడా నిధులు మంజూరు చేశామని చెప్పారు. అనంతరం ఆయన పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్, వెబ్ డిజైనింగ్, రోబోటిక్స్, సర్క్యూట్ మేకింగ్, కోడింగ్ మానియా, ల్యాన్ గేమింగ్, రివర్స్ ఇంజనీరింగ్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం కళాశాల డెరైక్టర్ శ్రీలత మాట్లాడారు. ఉత్తమ నమూనాలకు నగదు పురస్కారాలు అందించారు. విద్యార్థులకు స్లో బైక్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో కాలు కింద పెట్టకుండా కనిష్ట వేగంతో వెళ్లిన వారికి 10 వేల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ ఫెస్ట్‌లో మొత్తం 162 కళాశాలల విద్యార్థులు పాల్గొనగా 200కు పైగా నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు అరోరా కళాశాలల గ్రూప్ చైర్మన్ రాజబాబు, సెక్రటరీ రమేష్ బాబు, ఐఈఈఐ చీఫ్ ఇంజనీర్ ఐ.ఎస్.రాజు తదితరులు ప్రసంగించారు.