'తెలంగాణలో కరువు తీవ్రంగా ఉంది' | chada venkat reddy meets Deputy CM Mahmood Ali in hyderabad | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో కరువు తీవ్రంగా ఉంది'

Published Wed, Apr 20 2016 11:19 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

chada venkat reddy meets Deputy CM Mahmood Ali in hyderabad

హైదరాబాద్ : తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీని చాడా వెంకట్రెడ్డి నేతృత్వంలో సీపీఐ నేతల బృందం కలసింది. రాష్ట్రంలో ఏర్పడిని కరువు పరిస్థితిని మహమూద్ అలీకి వివరించినట్లు ఆయన చెప్పారు. 

అనంతరం చాడా వెంకట్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వడదెబ్బతో ప్రజలు చనిపోతున్నారని... ఈ నేపథ్యంలో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులు మూడు బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement