Chada Venkat Reddy
-
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాట తప్పారు.. గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. వై.ఎస్. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో ముందుకు... సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్ఎస్ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. -
పొత్తుల కోసం వెంపర్లాడం
హుస్నాబాద్: బీఆర్ఎస్ పార్టీతో పొత్తులపై ముఖాముఖి చర్చలు జరగలేదని, పొత్తులకోసం వెంపర్లాడబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయ న తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో సీపీఐ వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. సీఎం కేసీఆర్ ఆనాడు తమను పిలి చి పొత్తుపెట్టుకున్నారని, వ చ్చే ఎన్నికల్లోనూ ఆయన పిలిస్తేనే పొత్తులపై చర్చిస్తామని చెప్పారు. బీఆర్ఎస్తో తమ స్నేహబంధం ముగియలేదన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసే పయనిస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణలో 15 సీట్లలో సీపీఐ బలంగా ఉందని, 5 సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొత్తగూడెం, వైరా, పెద్దపల్లి, మునుగోడు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తప్పకుండా పోటీ చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ డిపోల ఎదుట రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను నేరవేర్చాలని ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డిపోల ఎదుట తమ పార్టీ ఆ«ధ్వర్యంలో సేవ్ ఆర్టీసీ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచుతామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు ఇచ్చి న హామీని నేరవేర్చలేదని చాడ విమర్శించారు. వచ్చే నెల 7న ప్రజాసమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీ, దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదన్నా రు. గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపి క చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మణిపూర్ సంఘటనపై ఈనెల 25న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. -
కలసి నడుద్దాం
సాక్షి, హైదరాబాద్: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్‌లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎంబీ భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్‌కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే.. రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్ఎస్ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
గవర్నర్ వ్యవస్థతో అణచివేతకు పాల్పడుతున్న కేంద్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు. -
బీజేపీ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి: చాడ
కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలు మానుకుని రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హితవు పలికారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులివ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 21న అన్ని తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. -
దివంగత సీఎం వైఎస్‌ది గోల్డెన్ పీరియడ్: చాడ
హుస్నాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్ పీరియడ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం చాడ వెంకట్‌రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్‌లో జరిగిన లాకప్‌డెత్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు. నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ భగ్నం
సుందరయ్య విజ్ఞానకేంద్రం: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎస్వీకే వద్దకు చేరుకున్న వందలాది మంది కార్మికులతో సభ జరిగింది. అనంతరం కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ర్యాలీగా బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ర్యాలీని భగ్నం చేయటంతోపాటు పలువురిని అరెస్టు చేసి మలక్‌పేట, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, అలాంటి కార్మికుల శ్రమ దోపిడీ చేయటం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు సింగరేణి కార్మికులను పొగుడుతూనే, వారి సంక్షేమం విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ, ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం, బీఎంఎస్ నాయకులు నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు పేస్కేల్‌ను వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. -
బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉంది: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ముఖంగా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్ఎస్తో పని చేస్తాం అని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని, అందుకే సీపీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని చాడ గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై విమర్శ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సమయంలోనే.. కాంగ్రెస్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐని ఇబ్బంది పెట్టింది. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. ఉత్తమ్ కుమార్ ఇబ్బంది పెట్టారు అని చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రెస్మీట్లో సీపీఐ నారాయణ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: మునుగోడులో కాంగ్రెస్.. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం -
Munugode: సీఎం కేసీఆర్ కారులో సీపీఐ చాడ వెంకట్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఇక మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు! -
‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం చేనేత వస్త్రాలపై వేసిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడినవారిలో ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చేనేత వస్త్రాలు అందుబాటుధరల్లో లేకపోవడంతో చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోతుందని అన్నారు. -
వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం చాడ లేఖ రాశారు. ధరణిలో దొర్లిన తప్పులను సరిచేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏల అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల సమస్యను ప్రత్యేక దృష్టితో చూసి సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేఖలో చాడ కోరారు. -
ఎనిమిదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందని, విభజన చట్టంలోని హామీలను నేరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న విభజన చట్టంలోని హామీల సాధనకై కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామన్నారు. ప్రతి జిల్లా, మండల/పట్టణ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేసి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీగా సీపీఐ మొట్ట మొదటగా తీర్మానించి, అనేక పద్ధతుల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందించి రాష్ట్ర సాధన కోసం పోరాడిందని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్షతతో, రాజకీయ సంకుచిత ఆలోచనలతో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 1,800 మంది అమరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ అమరుల ఆశయాలను నేరవేర్చాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందని చాడ పేర్కొన్నారు. -
భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?
తెలంగాణతో భూమి అంశం తరతరాలుగా మమేకమైంది. వ్యవస్థ మార్పునకు, భౌగోళిక మార్పునకు ఇక్కడ భూమి కూడా కీలక కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్య పరిష్కారమవుతుందేమోనని ఎనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్నా, అది ఇప్పటికీ సాకారం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విషయంలో సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, ‘ధరణి’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ వాటిల్లో లొసుగుల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. ముఖ్యంగా ‘ధరణి పోర్టల్’లో చేతులు మారిన భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు మారకపోవడం, మోకాపై ఉన్న వారి పేరు లేక పోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిటికీ మించి ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు మూలమైన భూ సర్వే ఇంకా చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఏడాదిలో డిజిటల్ భూ సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాల వారీగా వివాదాలకు తావు లేకుండా భూముల గుర్తింపు చేస్తామని సీఎం ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ విడివిడిగానే రెవెన్యూ చట్టాలు, భూ కార్డులున్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. రికార్డులను సరిచేయడానికి ఉపశమన చర్యలు చేపట్టారు. భూ సమగ్ర సర్వే చేస్తే, భూముల అన్యాక్రాంతం, రికార్డులలో నెలకొన్న లొసుగులు బహిర్గతమయ్యేవి. కానీ అందుకు భిన్నంగా, ఆర్వోఆర్, అసైన్మెంట్ చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా అవి ప్రచారానికే పరిమితమైనాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పేమీ రాలేదు. 2004 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చ జరిపి ఆనాటి మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అనుభవపూర్వకంగా 104 సిఫారసులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలైనాయి. ఈ రకంగా తెలంగాణ భూములు ప్రయోగశాలకు నిలయమైనాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు భూ అంశంపైన అనేక అర్జీలిచ్చినా ప్రభుత్వం పట్టించు కోలేదు. రెవెన్యూ చట్టం అస్తవ్యస్తంగా ఉన్నదని 2020 సెప్టెంబర్ 11న కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించారు. మాన్యువల్ రికార్డుల స్థానే ‘ధరణి పోర్టల్’ తేవడం ఇందులోని ముఖ్యమైన అంశం. దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ‘ధరణి పోర్టల్’ సాఫ్ట్వేర్ మాత్రమే అమలుకు తెచ్చారు. దానిని పూర్తిగా నమ్ముకుంటే రైతుల భూ రికార్డులు తారుమారై బజారులో పడతారని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది రైతుల పైబడి భూ రికార్డులు, సర్వే నంబర్ హద్దులు అన్యాక్రాంతమై దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే... జిల్లా కలెక్టర్ దగ్గరకి వెళ్లమంటారు. వారికి సమయముండదు. రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రభుత్వం... సర్వే నెంబర్ వారీగా సమగ్ర భూ సర్వే (డిజిటల్) విధిగా చేపట్టాలి. సాదా బైనామాలకు ‘ధరణి పోర్టల్’లో ఆప్షన్ పెట్టాలి. అపరిష్కృతంగా ‘మీ సేవ’లో పెండింగ్ వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గతంలో ‘ధరణి’ వచ్చిన తరువాత తప్పుగా నమోదైన పేర్ల స్థానంలో ఒరిజినల్ పట్టాదారుల పేర్లు నమోదు చేయాలి. (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) పై అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, సవరణలు చేస్తూ చర్యలు చేపట్టగలిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. భూ రికార్డులు సరి అవుతాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది. (చదవండి: ‘రెవెన్యూ’కు 250 ఏళ్లు) - చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ సుల్తాన్‌బజార్: కార్మికుల రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో మొదటిరోజు సోమవారం పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. బ్యాంకుల్లోనూ కొంతమేరకు పని స్తంభించడంతో.. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. సింగరేణిలో సమ్మె ప్రభావం బలంగా కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సమ్మెలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, ఎంసీపీఐ (యు) తదితర పార్టీలు పాల్గొన్నాయి. సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహించారు. నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్మికులతో పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు అంతే లేకుండా పోయిందని, శిశుపాలుడి వంద తప్పుల మాదిరిగా ప్రజలు ఓపిక పడుతున్నారని, సహనం నశిస్తే కేంద్రాన్ని కూలదోస్తారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నర్సింహారావు చెప్పారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేంద్రం అవలంబిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెలో సంఘీభావంగా పాల్గొన్నారు. రైతు సంఘాలు, మహిళా సమాఖ్య, విద్యార్థి, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కోఠిలో ధర్నా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఇఏ), అఖిలభారత బ్యాంక్ అధికారుల అసోసియేషన్ (ఏఐబీఓఏ) సంయుక్త ఆధ్వర్యంలో కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఇండియా ప్రాంగణంలో ధర్నా జరిగింది. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బీసీ కులాల లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీ కులాల లెక్క తేల్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు బీసీలకు కాకికి ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తున్నారని విమర్శించారు. బీసీల జనగనణ చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సోమవారం ‘బీసీల హక్కుల సాధన సమితి’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి అధ్యక్షత వహించ గా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్ రావు, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పూలే–అంబేడ్కర్ సమితి నాయకుడు కోలా జనార్దన్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు దుర్గయ్య గౌడ్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ హాజరయ్యారు. చాడ మాట్లాడుతూ.. బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సగానికిపైగా జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ. 1,400 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఓబీసీ రిజర్వేషన్లు నాలుగో తరగతి, కింది స్థాయి పోస్టులకే అమలవు తున్నాయని.. తక్కువ జనాభా ఉన్న అగ్రవర్గాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారని అన్నారు. -
భూదాన్ భూములను పంచకుంటే ఆక్రమిస్తాం
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మౌనం వీడి భూదాన్ భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ భూములను ప్రభుత్వం పంపిణీ చేయకపోతే తామే వాటిని ఆక్రమించి నిరుపేదలకు పంచుతామని ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మార్చి 17 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. సోమవారం అఖిల భారత సర్వసేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భూదాన్ భూములను భూములు లేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద నిరుపేదలతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న చాడ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ఆచార్య వినోబాభావే భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాలను విరాళంగా సేకరించారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూదాన్ భూములను పరిరక్షించకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఎన్ని భూదాన్ భూములు కబ్జాకు గురయ్యాయో పూర్తి ఆధారాలతో ఇస్తామన్నారు. అనంతరం అఖిల భారత సర్వసేవా సంఘం జాతీయ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ పేద ప్రజలు భూమి విముక్తి కోసం పోరాడుతుంటే వారికి అండగా ఉండకుండా సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వినోబా భావే, మొద టి భూదాత రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అ«ధ్యక్షుడు శంకర్‌నాయక్, ట్రస్టీ షేక్‌హుస్సేన్, సంఘ సేవకులు కృష్ణప్రసాద్, సీపీఐ నగర కార్యదర్శి నర్సింహ తదితరులతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
దూసుకుపో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా గళం విప్పారని.. ఈ దూకుడు ఇంకా పెంచాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి.రాజా అన్నారు. స్వాతంత్య్ర సమర యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు డి.రాజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించి పోరాడిన ధర్మభిక్షం గొప్ప కమ్యూనిస్టు అని కొనియా డారు. ధర్మభిక్షం ఉద్యమ అనుభవాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోంది ‘భారతదేశం రాష్ట్రాల కూటమి అనే విషయాన్ని గుర్తించేందుకు మోదీ సిద్ధంగా లేరు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. ఇది ప్రమాదకర మైన చర్య. మోదీని నిలదీస్తూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ సీఎంలు స్టాలిన్, మమతా బెనర్జీ, కేసీఆర్ ముందుకు వస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. దేశ సంపదను అంబానీ, అదానీ, టాటాలకు మోదీ కట్టబెడుతున్నారు. ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ కలిసి పోరాడాలి..’ అని రాజా పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మభిక్షం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రభుత్వ పథకానికి ధర్మభిక్షం పేరు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకానికి ధర్మభిక్షం నామకరణం చేస్తామని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచిం చకుండా నిజమైన కమ్యూనిస్టుగా జీవించిన నాయకుల్లో ధర్మభిక్షం ఒకరని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను మోడల్ సైన్స్ పాఠ్యాంశంలో పొందుపర్చాల్సిందిగా ప్రణాళిక సంఘం తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి లేఖ రాస్తానని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ధర్మభిక్షం పేరుతో ప్రతిఏటా అవార్డులు ఇవ్వాలన్నారు. సమరయోధులకు సన్మానం అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మభిక్షం సహచరులుగా ఉన్న గుంటకండ్ల పిచ్చి రెడ్డి, దొడ్డా నారాయణ, తోడేటి కొమురయ్య, కందిమళ్ల ప్రతాప్‌లను డి.రాజా శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ సంయుక్తంగా రచించిన బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్ర ‘ప్రజల మనిషి’ పుస్తకాన్ని బోయినపల్లి వినోద్ ఆవిష్కరించారు. ధర్మభిక్షం జీవితంపై ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ రచించిన పాటల ఆడియో సీడీని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. బొమ్మగాని నాగభూషణం రచించిన ‘ఉద్యమ సంతకం’ కవితా సంపుటిని సురవరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ధర్మభిక్షం శతజయంతి నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) నేత కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గుండె చప్పుడు
పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్‌మన్‌గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్‌సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు. సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్ రాజబహదూర్ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్‌రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్‌రెడ్డి కూడా ఆయన హాస్టల్ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు. ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్ వర్కర్స్ సంఘం, లారీ డ్రైవర్స్ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు చేపట్టాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
15న ధర్మభిక్షం శతజయంతి ముగింపు ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు ఉత్సవాలు ఈ నెల 15న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పార్టీలకతీతంగా కదలివచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీలోని వివిధ ప్రజా సంఘాల బాధ్యుల సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్న సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... 15న రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డితో కూడిన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. -
బొమ్మగాని ధర్మభిక్షం నేటితరానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ధర్మభిక్షం మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించడంలో ఆదర్శప్రాయులని కొనియాడారు. ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ‘మహాసంకల్పం’పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థ ఏర్పడని సమయంలోనే ధర్మభిక్షం విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఉంటూ ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేగా, ఎంపీగా ఐదుసార్లు చట్టసభలకు వెళ్లిన ధర్మభిక్షం, సాధారణ జీవితాన్ని గడిపారన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేటలో మహా సంకల్పం పుస్తక చర్చను నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ధర్మభిక్షం శతజయంతి సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రొఫె సర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ధర్మభిక్షం అచ్చమైన ప్రజల మనిషి అని కొనియాడారు. ధర్మభిక్షం అంటేనే పోరాటం.. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ, మహాసంకల్పం పుస్తకం చదివితే ధర్మభిక్షం గురించి నేటి తరానికి తెలుస్తుందన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ, ధర్మభిక్షం, బండ్రు నరసింహులు గురించి మాట్లాడడం అంటేనే ప్రజా పోరాటాల గురించి మాట్లాడడమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ, ధర్మభిక్షం మానవతా ఉద్యమతార అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంలాగా ‘మహా సంకల్పం’పుస్తకం ఒక రూపాన్ని నిర్మించిందన్నారు. కార్యక్రమంలో పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, సినీ దర్శకుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘మహాసంకల్పం’పుస్తక ముద్రణకు సహకరించిన బూర మల్సూర్ గౌడ్‌ను జ్ఞాపికతో సత్కరించారు. -
గాలిలో మేడ కట్టారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికీ ఇళ్లు అనే వాగ్దానాలకు గతి లేకున్నా.. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అనడం హాస్యాస్పదమన్నారు. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటలకు కనీస మద్దతు ధరపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం.. కర్షకులకు నమ్మక ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తదితర విభజన హామీలను బడ్జెట్లో పేర్కొనకుండా.. మరోసారి మోసం చేసిందన్నారు. -
పోడు రైతులకు పట్టాలివ్వకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్: పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టాలివ్వకపోవడం అన్యాయమని, వెంటనే వారికి పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోడుసాగుదారులకు అన్యాయం జరిగిందని, ఎన్ని పోరాటాలు చేసినా పోడుసాగుదారులకు పట్టాలివ్వలేదని వాపోయారు. తెలంగాణ వచ్చి ఇప్పటికి ఏడేళ్లు గడుస్తున్నా పట్టాలివ్వకపోవడం శోచనీయమని, ధరఖాస్తులు తీసుకుని ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారో అర్థం కావడంలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోడుపట్టాలివ్వకపోవడం వల్ల రైతుబంధు అందడం లేదని, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా అందక రోడ్డున పడ్డారని, పంట రుణాలు ఇవ్వడం లేదని విచారం వ్యక్తంచేశారు. -
బలపడి.. తలపడదాం..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరం ఉంది..’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ముందుగా వామ పక్షాలు మరింత బలపడి, ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్లైన్లో.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ అజెండాను అమలు చేయడమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అదే ఈ రోజు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా త్వరలోనే ‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’అంటూ బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అవినీతి ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్దయెత్తున దాడి జరుగుతోందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బీజేపీ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఉదహరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న టీఆర్ఎస్: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పడే వాగ్దానాలను విస్మరించి, ఎన్నికల్లో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు ప్రధానంగా ప్రజాస్వామిక, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పొత్తు వార్తలను ఆయన ఖండించారు. పునరేకీకరణకు కృషి జరగాలి: చాడ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేప ట్టే పోరాటాల్లో సీపీఐ, సీపీఎంల మధ్య సారూప్యత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు తమ ఐక్యతకే కాకుండా పునరేకీకరణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలు వురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.