సందర్భం
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.
1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.
భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.
నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్‌లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.
చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!
మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.
వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.
చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?
ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే!
- చాడ వెంకటరెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment