Communist parties
-
మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
మానవ సమాజ పరి ణామ క్రమంలో పుట్టుకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవ స్థలో... యజమాని, కూలి వంటి వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాల మధ్య అంతర్గత మైన అణచివేతలు, దోపిడీ కొనసాగింది. రైతులు, కూలీలు చేసిన ఉత్ప త్తులను యాజమానులు సంపదగా మలుచుకొని దోపిడీకి తెగబడ్డారు. మానవ సమాజాన్ని కారల్ మార్క్స్ అధ్యయనం చేసి దోపిడీ చేసే వర్గం సమాజంలో తక్కువగా ఉన్నదనీ, దోపిడీకి గురయ్యే వర్గం ఎక్కువగా ఉన్నదనీ చెప్పాడు. దోపిడీకి గురైన వారు ఐక్యంగా ఉండి తిరగ బడినప్పుడు మాత్రమే దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపాడు. దానికి మొదటగా 1848లో మొదటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ప్రవేశ పెట్టాడు. మానవ కల్యాణానికి వర్గ రహిత సమాజ నిర్మాణానికి కారల్ మార్క్స్ కృషి చేశాడు.1895 అమెరికాలోని షికాగో నగరంలో అణచి వేయబడిన కార్మికులు... తడిచిన రక్తంలో తడిచిన కండువాను ఎర్రజెండాగా ఎగురవేసి కార్మికుల హక్కులకై పోరాటం చేశారు. ఈ ఉద్యమం అణచివేత, ఆవేదన, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వామపక్ష పార్టీలు విస్తరించాయి. ఈ విస్తరణలో భాగంగా శ్రీలంకలో వామపక్ష పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్‌లోని అన్ని వామ పక్షాలూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాలి.భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ వామపక్ష భావజాలా నికి స్థానం ఉంది. అయితే విస్తరించడానికి అడ్డంకులు ఉన్నాయి. భారతదేశంలో 1925లో కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన జరిగింది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల వలన ఇది అనేక పార్టీలుగా చీలిపోయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ కుల, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో కమ్యూనిస్టులు శ్రమజీవుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కమ్యూనిస్టులు పోరాటాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో హక్కులను పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వామపక్ష పార్టీలలో మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారానే హక్కులను సాధించుకుందామనే ఆలోచనతో పోరాటం చేస్తున్నారు. వారు చేస్తున్న పోరాట రూపం తప్పు కావచ్చు. కానీ లక్ష్యం సరైనదే.నరేంద్రమోదీ, అమిత్‌షాలు వామపక్ష పార్టీలే ప్రధాన బద్ధశత్రువులుగా చూస్తున్నారు. వామపక్ష భావాలు కలిగిన వారిపై ఉపా, రాజద్రోహం కేసులు పెడుతూ బెయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచటం చూస్తున్నాము. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వందలమంది మావోయిస్టులను బలిగొంటున్నారు. వచ్చే ఏడాదికి నక్సలైట్లను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఇస్తున్నారు. దానికి కారణం భారతదేశంలో వామపక్ష పార్టీలు లేకుండా చేయాలనే దుర్బుద్ధి తప్ప మరొకటి కాదు.చదవండి: ఆ ప్రాజెక్టుకు 10 లక్షల చెట్ల బలి!మావోయిస్టు పార్టీలే కాదు... పార్లమెంట్ పంథాలో పనిచేస్తున్న వామపక్షాలు కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓట్లు కీలకమైనందున ఓట్లు రాబట్టడానికి వామపక్షేతర పార్టీలు అడ్డమైనదారులు తొక్కుతూ అధికారమే పరమావధిగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనాలను ఆశ్రయిస్తున్నాయి. డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల ఎర చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. అందుకే అవి గెలుస్తు న్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. కాని దోపిడీ శక్తులూ, వారికి అండగా ఉండే మతోన్మాద శక్తులూ అధికారం హస్తగతం చేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు, కూలీలు, బడుగు బలహీనవర్గాల శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. సామాజిక న్యాయం నినాదానికే పరిమితం అయ్యింది.వామపక్ష పార్టీలు ఎక్కడ అణచివేతలు, దోపిడీ ఉంటాయో అక్కడే ఉంటాయి. కొన్ని పార్టీల వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఉగ్రవాదులని అంటున్న వారికీ ప్రజా మద్దతు ఉన్న విషయాన్ని మరువరాదు. ఇదే తరుణంలో మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలకు పదును పెట్టాలి.చదవండి: గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?ప్రజలు తమ వంతుగా ప్రజాస్వామ్య ఫలాలు పొందడానికి పాలకులను ఆలోచింప చేసే విధంగా చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వ దమన చర్యలను ప్రజాస్వామ్య పద్ధతులలో మావోయిస్టులు తిప్పిగొట్టాలి. ‘కన్నుకు కన్ను... చావుకు చావు’ అనే సిద్ధాంతం నుండి కాకుండా కమ్యూ నిస్టులు ఐక్య పోరాటం చేసి అణచివేతలను వర్గ రహిత సమా జాన్ని నిర్మించాలి. మితవాద, మతవాద శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ దశలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా దానిని తిప్పికొట్టాలి. అందుకు తరుణమిదే! - చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు -
వేగు చుక్కలే..తోకచుక్కౖలై
బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా, తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా, సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి.. 1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్‌కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి. అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం. విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా, సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం.. రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు. ఎందుకీ దుస్థితి అంటే.. కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి. కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని, మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్‌లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు కమ్యూనిస్టు పార్టీలు ఎదగకపోవటానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు కుమ్మరించడం, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుండటం వల్ల ప్రజాపోరాటాలు లేకుండా పోయాయి. వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు పెద్దగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. బూర్జువా పార్టీల నాయకులు వ్యాపారాలు చేస్తూ కార్యకర్తలను తమతో తిప్పుకుంటున్నారు. తమ తమ ప్రాంతాల్లో పెళ్లిళ్లయినా, ఏ ఇతర శుభకార్యాలైనా వెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాయకులు ఎన్ని తప్పు పనులు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేయకపోవడం వల్ల ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. బూర్జువా పార్టీల నాయకులు డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను తమ వెంట తిప్పుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కానీ కమ్యూ నిస్టులు ఇవేవీ చేయకుండా త్యాగాలు చేయాలని కోరడం ఎవరికీ నచ్చడం లేదు. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఇప్పుడు లేకుండాపోయాయి. ధనమే అన్నింటికీ మూలంగా మారింది. రాజకీయ విశ్లేషకుల మాట... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడంలో కమ్యూనిస్టులు విఫలం అవుతున్నారు. తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు దగ్గర కావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. కొందరు నాయకుల తీరు, వారి వ్యవహార శైలి ప్రజలను ఆకట్టుకోవ డం లేదు. కమ్యూనిస్టు ఆదర్శాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి నేతలు తమ సాధారణ జీవన శైలితో కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలు లేరన్న విమర్శలు ఉన్నాయి. -
ఘనమైన చరిత్ర నుంచి గట్టెక్కలేని స్థితికి..
స్వతంత్ర భారతావనికి జరిగిన తొలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎంపీతోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా దక్కని ఆ ఖ్యాతి కమ్యూనిస్టులకు దక్కింది. 1952 మార్చిలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల అభ్యర్థి రావినారాయణ రెడ్డి, నెహ్రూకన్నా అత్యధిక మెజారిటీలో విజయం సాధించారు. రావి నారాయణ రెడ్డికి ఆ ఎన్నికల్లో 3,09,162 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్ జౌన్పూర్ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూకు మాత్రం 2,33,571 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అరుదైన అవకాశం కమ్యూనిస్టులకు దక్కినట్లయ్యింది. ఇపుడు ఈ చరిత్రనంతా నెమరు వేయడం ఎందుకంటే.. కమ్యూనిస్టుల ప్రాభవం ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవడం కోసం.. ఇప్పటి వారి పరిస్థితిపై ఓ అంచనాకు రావడం కోసం. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటాల గురించి చర్చించుకోవడం కోసం. తెలంగాణ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ నిరాదరణకు గురై, కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచినా ఆ పార్టీ పట్టించుకోక పోవడంతో ఇపుడు ఎలాంటి ఎన్నికల పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకునే స్థితి నుంచి కమ్యూనిస్టులు ఎపుడో కిందకు జారిపోయారు. కమ్యూనిస్టులది ఘనమైన చరిత్రే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1983 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరి వర్గాలు కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా విడివడ్డాక క్రమేణా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుక్కోవడంలో ఉభయ కమ్యూనిస్టులు విఫలమవుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి దగ్గరై, పోత్తులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. నాటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, తెలుగుదేశంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో వామపక్షాలది తీసివేయలేని పాత్ర. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ ప్రభంజనలో సైతం వామపక్షాలు తమ ఉనికిని చాటాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 నియోజకవర్గాల్లో, సీపీఎం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అంటే అప్పటికి ఆ పార్టీలకు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయలేం. కానీ, తర్వాత వరసగా జరిగిన 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీతో జతకట్టి బరిలోకి దిగాయి. ఇక్కడి వరకు సవ్యంగా సాగిన టీడీపీ, లెఫ్ట్ పార్టీల స్నేహం ( ఒక విధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఉన్నన్ని రోజులు..) ఆతర్వాత బ్రేక్ అయ్యింది. చంద్రబాబు అవకాశవాదంతో టీడీపీకి దూరమైన వామపక్షాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన 1999 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు అవకాశవాదానికి షాకైన వామపక్షాలు, టీడీపీకి దూరమయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, సీపీఐకి ఒక్క చోటా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో లాభపడిన సీపీఐ 6, సీపీ ఎం 9 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌తో వచ్చిన పొరపొచ్చాల వల్ల 2009 ఎన్నికల్లో మహాకూటమి లో భాగంగా టీడీపీ, బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తో ఎన్నికలు వెళ్లాయి. అప్పుడు కూడా సీపీఐ 4 చోట్ల , సీపీఐఎం ఒక చోట గెలిచాయి. గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంలో అంటే 1983 నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక పార్టీ అండలేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేని స్థితికి వామపక్షాలు చేరుకున్నాయి. చివకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టకుని ఒక చోట, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక చోట గెలిచాయి. 2018 ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశాయి. మునుగోడు ఉప ఎన్నికతో.. బీఆర్ఎస్ తో దోస్తీ 2023 ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళతాయని భావించినా, అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలు వేదికగా ఆ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని పేర్కొంటూ ఆ పార్టీతో జతకట్టాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచిందని అంతా భావించినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వామపక్షాలను కరివేపాకులా తీసి పక్కన పడేశారు. 2023 ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సమయంలో తమ మిత్రపక్షాలుగా భావిస్తున్న వామపక్షాలతో మాటమాత్రంగా కూడా చర్చలేవి జరపకుండా ఏక కాలంలో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీపీఎం, సీపీఐ పోటీ చేయాలని భావించిన స్థానాలు కూడా ఉండడం విశేషం. దీంతో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చెడిందని, పొత్తు లేనట్టేనన్న అర్థమై పోయింది. జాతీయ రాజకీయాల్లో భాగంగా ‘ ఇండియా ’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావించినా.. ఆ పార్టీల మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. దాదాపు తెలంగాణలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండక పోవచ్చని, ఒంటరిగానే వామపక్షాలు పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో వామపక్ష పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎవరి జయాపజయాల్లో కీలకం కానుందన్న సమీకరణలు మొదలయ్యాయి. వామపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి..? చివకు కనీసం ఉభయ కమ్యూనిస్టుల పార్టీల మధ్యనైనా సరైన అవాగాహన కుదురుతుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. :::మిత్రా. ఎన్ -
కామ్రేడ్లు..నోళ్లకు తాళాలేసుకున్నారు
"టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తూ కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై సహజంగానే చంద్రబాబు నోరు మెదపరు. ఆయన తనయుడు లోకేష్ కూడా ప్రయోజకుడై ఈ అవినీతిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనా మౌన దీక్షలోనే ఉంటారు. ఆయనకు అనుకూలంగా వార్తలు వండి వార్చడానికే ఉన్నాయి కాబట్టి కొన్ని జేబు మీడియాలూ ఏమీ ఎరగనట్లు చప్పుడు చేయకుండా ఉండిపోతాయి. చంద్రబాబు నాయుడికి మిత్ర పక్షీయుడు కాబట్టి జనసేన అధినేత పవన్ కానీ...ఆయన పార్టీ నేతలు కానీ ఐటీ నోటీసుల గురించి పొరపాటున కూడా ప్రశ్నించరు. కామ్రేడ్లు కూడా నోళ్లకు తాళాలు వేసుకున్నట్లు మౌనంగా ఉండిపోవడం ఏంటి? అని వామపక్ష మేథావులు మండి పడుతున్నారు." చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజధాని అమరావతిలో సచివాలయంతో పాటు కొన్ని భవనాల నిర్మాణ పనులకు సంబంధించి షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఆ క్రమంలో పల్లోంజీ కంపెనీ నుండి నకిలీ ఇన్ వాయిస్ ల పేరుతో డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడి పిఏ శ్రీనివాసు సూచించిన విధంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించేసి చంద్రబాబు చెప్పిన ఖాతాకు పంపేశారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 118 కోట్ల 90లక్షల రూపాయలకు పైనే ఇలా నిధులను భోంచేసినట్లు సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు పంపారు. ఈ డబ్బును ఏవిధంగా మీ సొంతం చేసుకున్నారో చెప్పండి మహాశయా అని ఆ నోటీసుల్లో ప్రశ్నించారు. ఐటీ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానాలు లేక కాదు. ఉన్నాయి. కాకపోతే అవి ఆయన పీకకి చుట్టుకునేవి కావడంతో ఆయన బెల్లం కొట్టిన రాయిలా ఏం మాట్లాడ్డం లేదు. చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేష్ పేరును కూడా ఐటీ నోటీసుల్లో ప్రస్తావించారు. లోకేష్ బినామీ కిలారు రాజేష్ పేరు కూడా చాలా స్పష్టంగా ఉంది. కొడుకు పుట్టినపుడు కాదు..వాడు ఎదిగి ప్రయోజకుడు అయినప్పుడు తండ్రిగా గర్వపరడాలంటారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తనతో పాటు తన తనయుడు కూడా అక్రమార్గంలో దూసుకుపోతూ ప్రయోజకుడు అయినందుకు గర్వపడుతూ ఉండచ్చని పాలక పక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ ఐటీ నోటీసులపై జాతీయ మీడియాలో కథలు కథలు గా వార్తలు ప్రచురితమవుతూ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నోటీసుల గురించే అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు మాత్రం ఈ నోటీసులతో తమకి సంబంధం లేదనుకున్నారో లేక చంద్రబాబు అవినీతి గురించి మనమెందుకు మాట్లాడదాలనుకున్నారో తెలీదు కానీ ఇది తమ సబ్జెక్ట్ కాదని పక్కన పెట్టేసినట్లున్నారు. తాను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎలాగూ చంద్రబాబు అవినీతిపై ప్రశ్నించే సాహసం చేయరని పాలక పక్ష నేతలు అంటున్నారు. బాబు అనుకూల మీడియా ఉన్నదే బాబును కాపాడ్డానికి కాబట్టి ఆ మీడియా కూడా ఐటీ నోటీసుల ఊసెత్తడం లేదు. మిగతా వాళ్లు సైలెంట్ గా ఉండడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ.. కామ్రేడ్లు కూడా సైలెంట్ అయిపోవడమే దిగజారుతోన్న రాజకీయాలకు పతనమవుతోన్న విలువలకూ నిలువెత్తు నిదర్శనం అంటున్నారు వామపక్ష మేథావులు. కమ్యూనిస్టులు మరీ ఇంతగా పతనం చెందుతారని ఊహించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -సీఎన్ఎస్ యాజులు సీనియర్ జర్నలిస్ట్ 'సాక్షి' -
కంగుతిన్న కామ్రేడ్లు...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు. తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. కార్యాచరణపై సమావేశాలు బీఆర్ఎస్ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టార్గెట్ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
కర్నాటక ఫలితాల ఎఫెక్ట్: ఈసారి పక్కా ప్లాన్‌తో ఎర్రన్నలు, అందుకే ఈ మౌనం
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటాయనే చర్చ మొదలైంది. రాజకీయ పోరులో కమలం ప్లేస్‌లోకి హస్తం పార్టీ రావడంతో లెఫ్ట్ నేతలు సైలెంట్‌గా పరిస్థితిని గమనిస్తున్నారు. గతంలో మాట ఎలా ఉన్నా.. పొత్తుల గురించి ఇప్పుడే ఓపెన్ కావద్దని నిర్ణయించుకున్నారట ఎర్రన్నలు. ముందుగా బలగం ఉన్న నియోజకవర్గాల్లో బలం పెంచుకునే పని ప్రారంభించారట. ఇంతకీ వారి సైలెన్స్ వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.. కారులోనే అనుకున్నారు, కానీ.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత బలం ఉందని చెప్పుకోగల జిల్లా ఏదైనా ఉందంటే.. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ జిల్లాకు చెందినవారే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడానకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ తమ మనసులోని మాట బయటపెట్టారు కూడా. వారు తమ నియోజకవర్గాల్లో చాలా కాలం క్రితమే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు మద్దతిచ్చిన వామపక్షాలు.. సాధారణ ఎన్నికల్లో కూడా కారులోనే ప్రయాణం చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ లెఫ్ట్ పార్టీల మీద కూడా ప్రసరించింది. అందుకే పరిస్థితులు ఎలా మారతాయో అన్న ముందు జాగ్రత్తతో ప్రస్తుతానికి పొత్తుల విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. (చదవండి: ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు) తొందర పడితే ఇబ్బందులు.. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందు రాష్ట్రంలో కారు, కమలం మధ్యే పోటీ అన్నట్లుగా వార్ జరిగేది. కాని కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అన్నట్లుగా మారింది. ఇప్పుడు బీజేపీ మూడో ప్లేస్‌లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తన శక్తినంతా కూడదీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో తొందరపడి పొత్తుల విషయం ప్రకటిస్తే.. అసలుకే ప్రమాదం వస్తుందని లెఫ్ట్ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ.. చర్చించే ముఖ్యాంశాలు ఇవేనా!) ఎన్నికలు వచ్చేలోగా తమకు పట్టు ఉన్న 30 సెగ్మెంట్లలో బలం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలని డిసైడయ్యారు. ఇద్దరం కలిసికట్టుగా ఉంటే.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చని, లేదంటే అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా మండలి సీటు ఇస్తామని మభ్య పెట్టే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నాయి. తమకు తాముగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపించకూడదని, బలాన్ని పెంచుకుంటే అటు కాంగ్రెస్ గాని.. ఇటు బీఆర్ఎస్ గాని ఎవరో ఒకరు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకే మరికొంతకాలం మౌనం పాటించనున్నట్లు తెలుస్తోంది. మనమే తొందరపడి సర్దుబాటు కోసం ప్రయత్నిస్తే డిమాండ్ పడిపోద్దని లెఫ్ట్ పార్టీల నాయకత్వం భయపడుతోంది. అలాగాకుండా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల వైపు నుంచి పొత్తుల ప్రతిపాదన వస్తే మనం డిమాండ్ చేయవచ్చని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. కారు, హస్తం ఏదైనా ఒక్కటే.. ఇచ్చే సీట్లను బట్టే పొత్తులు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆ తప్పులే కొంప ముంచాయా?.. ఎందుకిలా జరిగింది?
కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి దిక్సూచి అని ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు అభిప్రాయపడడం ఆసక్తికర పరిణామమే. కాకపోతే తాను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నట్లుగా కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు చారిత్రక తప్పిదాలు చేస్తూ పోతున్నారు. తత్ఫలితంగా వారు దేశంలో నానాటికి కునారిల్లిపోతున్నారు. నిజమే! ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల పక్షాన ఉంటారని అంతా అనుకునేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన విపక్షం ఉండాలని, అందులోను కమ్యూనిస్టులు వంటివారు ఉంటే దేశానికి ప్రయోజనకరమని గతంలో భావించేవారు. కానీ ప్రజల నమ్మకాన్ని వారే వమ్ము చేసుకున్నారు. రైట్ టైమ్ -రాంగ్ డెసిషన్, రాంగ్ టైమ్- రైట్ డెసిషన్ అన్న నానుడి వీరికి బాగా వర్తిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. స్వాతంత్ర పోరాట సమయంలో కొన్నిసార్లు కమ్యూనిస్టులు అనుసరించిన వైఖరులు విమర్శకు గురి అయ్యాయి. అయినా వారి దేశ భక్తిని ఎవరూ శంకించేవారు కారు.. ఆ తర్వాత నిజాం సంస్థానంపై జరిగిన పోరు, సాయుధ రైతాంగ పోరాటాలలో కమ్యూనిస్టులు ఎదుర్కున్న కష్టాలు ఇన్నీ,అన్నీ కావు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయగలిగారు. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం సాగించడం ద్వారా తీవ్రంగా నష్టపోయిందని చెబుతారు. చాలా మంది యోధులను కోల్పోవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. తదుపరి ఎన్నికల రాజకీయాలలోకి రాక తప్పలేదు. కానీ అనతికాలంలోనే రష్యా లైన్, చైనా లైన్ గా పార్టీ నేతలు విడిపోయి, అనంతరం రెండు ప్రధాన పార్టీలుగా కమ్యూనిస్టులు ఏర్పడ్డారు. సీపీఐ నుంచి వేరుపడ్డ సీపీఎం క్రమేపీ పుంజుకుని పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో అధికారం సాధించింది. అయినా కమ్యూనిస్టుల చీలికలు ఆగలేదు నక్సలైట్ ఉద్యమం దేశంలోనే పెద్ద సంచలనం. భయానకం, ప్రభుత్వ అణచివేతను తట్టుకోవడం అంత తేలిక కాదని రుజువైనా ఇప్పటికీ పీపుల్ వార్ గ్రూప్ పేరుతోనో, మరో పేరుతోనో అడవులలో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎంల మధ్య ఏదో రూపంలో గొడవలు సాగుతుండేవి. కొన్ని చోట్ల ఇరువైపులా హత్యలు చేసుకునేంతగా కక్షలు పెరిగాయి. ఉదాహరణకు గతంలో ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన కలహాలకు పలువురు బలి అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలు క్యాడర్ ను కలిగి ఉన్నా సీపీఎందే పై చేయి అవుతూ వచ్చింది. కానీ ఆ పార్టీ కూడా ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతింది. ముప్పైమూడేళ్లపాటు నిరాటంకంగా పశ్చిమబెంగాల్లో పాలన చేసిన సీపీఎంకు ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం చారిత్రక విషాదం అని చెప్పాలి. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ఆ పార్టీని ఇలా పతనం చేశాయని అంటారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే, దానిని ఆ పార్టీ వదలుకోవడం కూడా పెద్ద తప్పిదంగా చాలా మంది పరిగణిస్తారు. 1991 కి ముందు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకతతో ఉన్న సీపీఎం 2004 నాటికి ఆ పార్టీతో కలవక తప్పలేదు. 1971లో ఇందిరాగాంధీతో రాజకీయ సంబంధాలు నెరపిన సీపీఐ ఆ తర్వాత కాలంలో దూరం అయింది. 1989 లో బీజేపీతో కలిసి వీపీ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. మూడో ఫ్రంట్ అనో, మరొకటనో రకరకాల ప్రయోగాలు చేసిన వామపక్షాలు 2004 నాటికి కాంగ్రెస్ తో జతకట్టక తప్పలేదు. దానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయకుండా నూక్లియర్ ఒప్పందం పేరుతో 2009 నాటికి కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. దాంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రమేపి క్షీణించడమే తప్ప ఎదుగుదల లేకుండా పోయింది. తాజాగా సీపీఐ జాతీయ హోదాను కూడా కోల్పోయింది. సీపీఎం కేరళలో మాత్రం అధికారం సాధించగలిగింది. అందులో సీపీఐ కూడా ఒక భాగస్వామిగా ఉంది. 1996లో మాత్రం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఇద్దరు సీపీఐ నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉండేవారు ప్రముఖ నేత ఇంద్రజిత్ గుప్తా వారిలో ఒకరు. కానీ ఆ పరిణామాలను పార్టీకి పెద్దగా ఉపయోగించుకోలేకపోయారని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా రెండు పార్టీలు రెండు లైన్ లు తీసుకున్నాయి. సీపీఐ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉద్యమం చేస్తే, సీపీఎం సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంది. ఈ రెండు విధానాలలోను ఈ పార్టీలకు కలిసి వచ్చిందేమీ లేదనే చెప్పాలి. చివరికి ఆంధ్ర, తెలంగాణలలో శాసనసభలలో పార్టీలకు ప్రాతినిద్యం లేకుండా పోయింది. కొంతకాలం టీఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్) కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లను బుజ్జగించడం వల్లో, , లేక బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారనే కారణంతోనో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్నట్లుగా సీపీఐ,సీపీఎం నేతల ప్రసంగాలను బట్టి అర్ధం అవుతుంది. బీఆర్ఎస్ తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందా అన్న ఆశతో ఎదురు చూడవలసిన పరిస్థితిలో పార్టీలు పడ్డాయి. ఇక ఏపీలో అయితే మరీ చిత్రమైన పరిస్థితి. బీజేపీ మద్దతు కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతుంటే, సీపీఐ మాత్రం తెలుగుదేశంతో కలవడానికి వెంపర్లాడుతోంది. బీజేపీతో కలవం అంటూనే ఆ పార్టీ నేతలతో కలిసి రాజధాని ఉద్యమంలో చేతులెత్తుతుంటారు. పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసే వామపక్షాలు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే, దానిని స్వాగతించకపోగా ఆయన ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నామని చెబుతుంటారు. ఈ విషయంలో సీపీఎం కొంత బెటర్ . సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పు చేతలలో ఉంటారన్న విమర్శలు ఎదుర్కుంటుంటారు. రాజధానిలో పేదలకు స్థలాలు ఇవ్వద్దన్న వారితో కలిసి ఈ పార్టీ పనిచేస్తుంటుంది. పేదలకోసం పలు స్కీములు అమలు చేస్తున్న జగన్ ను వ్యతిరేకించడం చారిత్రక తప్పిదమే అవుతుందేమో! జగన్ పేదల కోసం అమలు చేస్తున్న స్కీములను సీపీఎం అగ్రనేత , దివంగత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి ఉంటే స్వాగతించి ఉండేవారని సీనియర్ నేత పాటూరి రామయ్య వ్యాఖ్యానిస్తే, సీపీఎం నాయకత్వం ఆయనను తప్పు పట్టడం చిత్రమే. వామపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవడంలో అంత సఫలం కాలేకపోతున్నాయని, హైదరాబాద్ లో జరిగిన సభలో ఉభయ పార్టీల అగ్రనేతల ఉపన్యాసాలను విశ్లేషించుకుంటే అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకత, ఇప్పుడు బీజేపీపై గుడ్డి వ్యతిరేకత పెంచుకుంటున్నారు. గతంలో టాటా, బిర్లా తదితర పారిశ్రామిక సంస్థలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రస్తుతం రిలయన్స్ అంబానీ, అదాని వంటివారిని వ్యతిరేకిస్తున్నారు. కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశంలో కూడా కార్పొరేట్ సంస్థలను ఎలా ప్రోత్సహిస్తున్నది తెలుసుకుంటే మన కమ్యూనిస్టులు ఎటు వైపు పయనిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ పారిశ్రామకి సంస్థలో అయినా తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపడం తప్పు కాదు. కానీ ఆ సాకుతో అసలు పెద్ద పరిశ్రమలను వ్యతిరేకిస్తున్న తీరు వారికి ప్రయోజనం కలిగించదు. ఒకప్పుడు కంప్యూటర్ లను వీరు వ్యతిరేకించేవారు .కానీ సాంకేతిక పరిజ్ఞానం అపారంగా పెరిగిన తరుణంలో వాటిని అనుసరించక తప్పలేదు. ఇక మీడియా బారన్ రామోజీరావుకు చెందిన మార్గదర్శి గ్రూపులో జరిగిన అవకతవకలపై సీపీఐ కూడా అచ్చం తెలుగుదేశం మాదిరే మాట్లాడింది తప్ప, హేతుబద్దంగా స్పందించలేదు. ఒకప్పుడు సీపీఐ ,సీపీఎం లు కలిసి పనిచేసి ఉంటే మంచి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఉండేవారు. 1952లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఆనాడు జరిగిన ఎన్నికలలో ఈ ప్రాంతం వరకు చూసుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు దాదాపు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. తదుపరి 1955 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రకాశం పంతులు, ఎన్.జి.రంగా వంటివారిని కలుపుకుని కమ్యూనిస్టులను పూర్తిగా దెబ్బతీసింది. అప్పట్లో అధిక విశ్వాసంతో కమ్యూనిస్టు పార్టీ దెబ్బ తింది. తదుపరి ఎప్పటికీ కోలుకోలేకపోయింది. కమ్యూనిస్టు పార్టీ స్పేస్‌ను పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆక్రమించేశాయి. దాంతో ఆ పార్టీలపై ఆధారపడవలసిన దయనీయ స్థితి వామపక్షాలకు సంక్రమించింది. 1952 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ తో పోటాపోటీగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వామపక్షం ఇప్పుడు ఉనికిని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంది. ఈ సంక్షోభం నుంచి వామపక్షాలు బయటపడగలతాయా అంటే సంశయంగానే ఉంది. వామపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కాకపోతే ఇప్పటికే బాగా ఆలస్యం అయిందనే సంగతి ఆ పార్టీల నేతలకే బాగా తెలుసు అని చెప్పవచ్చు. - కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ చదవండి: ఏది నిజం?: బాబే.. ప్రైవేటు మాస్టర్.. అంతా చేసింది ఆయనే.. ఒక్క ముక్క రాయని ఈనాడు -
పొత్తుల్లేవ్.. అవగాహనే! అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడంపై దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో మూడోసారీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుని, పోటీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ మాత్రం ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలిసింది. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ మద్దతు తీసుకున్న తరహాలోనే.. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ రెండు పారీ్టలతో అవగాహనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు కమ్యూనిస్టు పారీ్టలకు ఉన్న సంప్రదాయ ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నట్టు సమాచారం. లెఫ్ట్ పార్టీలు సీట్లు కోరుతాయనే ప్రచారమున్నా.. సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తులో భాగంగా కనీసం రెండేసి అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్).. మూడోసారి కూడా ఒంటరిగానే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు పెద్దల సభలైన శాసన మండలి, రాజ్యసభ పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అవగాహన కుదిరిందని.. పోటీ, పొత్తులు, సీట్లు తదితరాలపై స్పష్టతకు కొంత సమయం పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పనితీరు.. సర్వేలు.. నివేదికలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పారీ్టలు కూడా పాదయాత్రలు, సభలు, సమావేశాల పేరిట హడావుడి చేస్తుండటంతో.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పడు మదింపు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలు సంస్థల సర్వేలతోపాటు నిఘా వర్గాల నివేదికలు కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో విపక్ష నేతల బలాబలాలను అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించినా.. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని ప్రస్తుతం సంకేతాలు ఇస్తున్నారు. సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బలమైన నేతలు కూడా ఉండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందనే అంశంపై స్థానిక కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆయా చోట్ల టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానానికి కూడా కత్తిమీద సాములా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో గెలిచే సామర్థ్యం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండటంతో.. అవసరమైన చోట వారికి పోటీ అవకాశం దక్కనున్నట్టు వివరిస్తున్నాయి. అరడజను నియోజకవర్గాల్లో పూర్తిగా కొత్తవారికి లేదా ఇతర పారీ్టల్లోని బలమైన నేతలను చేర్చుకుని టికెట్ కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి పారీ్టలో క్షేత్రస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జులను నియమించి, ఆ జాబితాలను పార్టీ కార్యాలయంలో అందజేయాలని సీఎం కేసీఆర్ సుమారు నాలుగు నెలల క్రితమే ఆదేశించారు. ఈ ప్రక్రియ ముందుకు సాగని నేపథ్యంలో త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఇన్చార్జుల నియామకానికి గడువు విధించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఓటర్ల జాబితా వడపోతపై దృష్టి సారించారు. కొత్తగా నమోదైన ఓటర్లు, యువత, ఓటరు జాబితాలో పేరుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారి వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా సిద్దం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని.. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు మార్చి మొదటి వారంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చదవండి: ప్రత్యామ్నాయమా.. ఒంటరిపోరా! -
అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
బొల్లోజు రవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నాన్నతో గడిపిన కాలం గుర్తుంది... లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు. మరో తండ్రిలా క్యాస్ట్రో... నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు. ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం... క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది. క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు.. క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే. నాన్న కమ్యూనిస్టు... నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. పుస్తకం రాస్తున్నా.. నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ! -
పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?
తాడేపల్లి: నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని, మరి అటువంటిది అమరావతి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కోరుకోరని, పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు పేర్ని నాని. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబుకు కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణ అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. ‘సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా?, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?, చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారు. చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యం. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్లో నిజమైన కమ్యూనిజం ఉందా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకెందుకు అంత భయం’ అని పేర్ని నాని నిలదీశారు. -
డబ్బు రాజకీయాల వల్లే వామపక్షాలకు దెబ్బ: సురవరం
సాక్షి, హైదరాబాద్: డబ్బు రాజకీయాల వల్లనే ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరా టం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే కమ్యూనిస్టు పార్టీ పట్ల రాజ కీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను, తప్పుడు మాటలను మాట్లాడుతారని అన్నారు. వారికి ఎర్రజెండా అంటేనే భయమన్నారు. ‘సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ’ సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సుధాకర్‌రెడ్డి ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్య క్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, మాజీ ఎంఎల్ఎ పీ.జె చంద్రశేఖర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధా న్యత అవసరం’ అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రసంగించారు. సురవరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొత్త పోరా టాలకు రూపకల్పన చేయాలని, అందుకోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాలని పేదల నుండి పెద్దల వరకు కోరుతున్నారని చెప్పారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
వామపక్షాల తీరు మారాలి.. పక్క పార్టీల వైపు ఆశగా చూస్తూ..
భారత్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్‌తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే. ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు. మొన్నటిదాక టీఆర్ఎస్ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్ఎస్లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్‌లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు. వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్ -
పొత్తు తెచ్చిన చిక్కులు.. గులాబీ పార్టీలో టెన్షన్
తెలంగాణలో ఎర్ర పార్టీలు, గులాబీ పార్టీ ఏకమవుతున్నాయా? మునుగోడు ఫలితం వారిని మరింత దగ్గర చేసిందా? అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ పొత్తు ఖరారైందా? అవుననే అంటున్నాయి వామపక్షాల శ్రేణులు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సీట్లు కూడా పంచుకుంటున్నారు. మరి గులాబీ పార్టీలో సిటింగ్‌లు, ఆశావహుల రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది? వారు ఏం చేయబోతున్నారు? పాలేరులో ఎవరు పోటీ? ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనరల్ సీట్లు. ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలేరుకు కందాల ఉపేంద్రరెడ్డి ఎమ్మెల్యే. ఈ సీటు కోసం కందాల, మాజీ మంత్రి తుమ్మల మధ్య పోరు సాగుతోంది. ఇంతలో పాలేరు నియోజకవర్గంలో ఎర్ర జెండా ఎగురుతుందంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్ జిల్లాలో సంచలనం రేపింది. గులాబీ కోటలో టెన్షన్ పెరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పాలేరులో తానే పోటీ చేస్తానని పార్టీ సర్కిల్స్‌లో తమ్మినేని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. మరి సిటింగ్ ఎమ్మెల్యే కందాల, సీటుపై ఆశపడుతున్న తుమ్మల పరిస్తితి ఏంటనే చర్చ జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతోంది. గ్రౌండ్లో ఎంట్రీ ఇచ్చేశారు వామపక్షాలతో పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని గులాబీ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. అయితే పొత్తుపై అగ్ర నాయకులకు క్లారిటీ ఉందని, గులాబీ, ఎర్ర పార్టీల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాల్సిన రోజులొస్తున్నాయని సూచనలు అందుతున్నాయి. ఇంతలో పాలేరు నియోజకవర్గం పరిదిలోని ముత్తగూడెంలో జరిగిన సిపిఎం నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం పొత్తుపై చేసిన కామెంట్స్ జిల్లాలో సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరబోతోందని తమ్మినేని కార్యకర్తలకు చెప్పారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో నాలుగు నెలలుగా పర్యటిస్టున్న తమ్మినేని వీరభద్రం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల శ్రేణుల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే గులాబీ పార్టీ శ్రేణులే ఈ పరిణామాల్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముచ్చటగా ముగ్గురికి ఆశలు పాలేరు సీటు సీపీఏంకు ఇస్తే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు పరిస్థితేంటన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఇద్దరు నేతలు టికెట్ పై ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాలేరు తనకే టికెట్ వస్తుందని, మరోసారి తాను ఎమ్మెల్యే కావడం ఖాయమని కందాల అనేక సార్లు చెప్పారు. ఇటు తమ్మల నాగేశ్వరరావు కూడ టికెట్ పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇటివలే ములుగు జిల్లా వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం తాను కేసీఆర్ వెంటే ఉంటానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మలకు పాలేరు టికెట్ పై కేసీఆర్ ఇంటర్నల్‌గా ఏమైన భరోసా ఇచ్చారా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో నడిచింది. ఇద్దరు నేతలు టికెట్ కోసం తీవ్రస్థాయిలో పోటి పడుతుంటే మధ్యలో సీపీఎం వచ్చి టికెట్ తనకే అనడంతో అసలు పాలేరు టీఆర్ఎస్లో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లయితే పాలేరు సిటింగ్ ఎమ్మెల్యే కందాల, మాజీ మంత్రి తుమ్మల కచ్చితంగా జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ నుంచి వచ్చేవారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. పాలేరులో ఇంకా ఎన్ని రాజకీయ సంచలనాలు జరుగుతాయో చూడాలి. చదవండి: తెలంగాణలో మరో పాదయాత్ర?.. ఆ నాయకుడెవరు? -
కమ్యూనిస్టులతో ‘కారు’ జర్నీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కామ్రేడ్లు ‘కారు’తో కలిసి ప్రయాణించిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారితో జట్టు కట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరిట దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ సీపీఐ, సీపీఎం మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ మినహా భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి సాగే దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష, రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న వైనం తదితరాలపై భవిష్యత్తులో టీఆర్ఎస్ సాగించే పోరాటంలోనూ వామపక్షాలను భాగస్వామ్యం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల్లో ఢిల్లీ వేదికగా జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇటు తెలంగాణతోపాటు జాతీయస్థాయిలోనూ కలిసి నడిచేందుకు కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు ఇరు పార్టీల నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్.. 2009 ఎన్నికల్లో టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేసి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కమ్యూనిస్టులకు గణనీయమైన ఓటు బ్యాంకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టులతో మైత్రీ కుదిరిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు ఆ పార్టీలకు కేటాయించే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తమకు గణనీయ ఓటు బ్యాంకున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టులు ఆరు నుంచి పది స్థానాలు కోరే అవకాశమున్నట్లు సమాచారం. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులతో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలకు పట్టు ఉండటం కొంతమేర కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కమ్యూనిస్టులు కోరే స్థానాలివే.. సీపీఎం, సీపీఐలతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఇప్పటికే టీఆర్ఎస్ సంకేతాలివ్వడంతో 2023 ఎన్నికల్లో తమకు కేటాయించే స్థానాలపై త్వరలో స్పష్టత కోరే అవకాశమున్నట్లు తెలిసింది. పదేళ్లుగా అసెంబ్లీలో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీపీఐ, సీపీఎం కృతనిశ్చయంతో ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ మనుగడకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం తప్పనిసరి అని రెండు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం మధిర, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడ లేదా హుజూర్‌నగర్‌ను.. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంతోపాటు మరికొన్ని స్థానాలను సీపీఐ కోరే అవకాశముంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పాలేరు నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ లేదా హుజూర్నగర్ నుంచి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, హుస్నాబాద్ నుంచి సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. -
Munugode: బీజేపీ ఓటమి.. కమ్యూనిస్టులకు సంతోషమెందుకు?
మునుగోడు విజయం ఎవరికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది? బీజేపీని ఓడించినందుకు గులాబీ పార్టీ కంటే ఎర్ర పార్టీలే ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నది నిజమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక క్రమంగా ఉనికి కోల్పోతున్న వామపక్షాలకు మునుగోడు టానిక్‌లా పనిచేస్తుందా? టీఆర్ఎస్తో మునుగోడు పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? మునుగోడు ఒకప్పుడు సీపీఐకి కంచుకోట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక, స్థానిక సంస్థల్లో కూడా కూనారిల్లిపోతూ... కేడర్ చెల్లాచెదురవుతున్నా.. చేసేది లేక చేష్టలుడిగి చూస్తున్నారు అగ్ర నాయకులు. లెఫ్ట్ పార్టీల విజయం అనే మాట విని చాలాకాలం అయిపోయింది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఒకప్పుడు సీపీఐకి కంచుకోట. అటువంటి చోట ఎన్నోసార్లు గెలిచిన కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోగా... గతంలో విజయం సాధించిన సీపీఐ సోదరపార్టీ సీపీఎంతో కలిసి ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతివ్వాల్సి వచ్చింది. ఓడిన బీజేపీ రెండో స్థానానికి చేరింది. అయినప్పటికీ బీజేపీ ఓటమిలో తమ ప్రమేయం ఉండటం సీపీఐ, సీపీఎంలకు ఎంతో సంతోషాన్నివ్వడమే గాదు..వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్లయింది. కారెక్కడమే కామ్రెడ్లకు బెటరా? మునుగోడులో ఎలాగైతే టీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఓడించగలిగామో... భవిష్యత్‌లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ సైద్ధాంతిక శత్రువైన కమలం పార్టీకి అధికారం దక్కకుండా గులాబీ పార్టీతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సూది, దబ్బనం పార్టీలు అన్న నోటితోనే... ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో లెఫ్ట్ పార్టీల వల్లే గెలిచాం అని చెప్పడంతో ఎర్ర పార్టీల నేతలు ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నారట. ఏడాదిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తమకు బలమున్న స్థానాల్లో చెరో పది అడగాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా చెరో ఎంపీ సీటు కూడా అడిగే ఆలోచన చేస్తున్నాయట. ఇక ఎన్నికలు వచ్చే వరకు టిఆర్ఎస్ తో ఉమ్మడి కార్యాచరణకు కూడా సిద్ధం అవుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. ఇక్కడ బూస్ట్.. అక్కడ సపోర్ట్ బీజేపీపై ఉమ్మడిగా చేసే పోరాటానికి తెలంగాణలో ప్రధాని పర్యటనను అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కార్యాచరణలో ఇరుపక్షాలకు ప్రయోజనాలు దాగున్నాయి. లెఫ్ట్ పార్టీలకు తెలంగాణలో బూస్టింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కోసం సీపీఎం, సీపీఐల మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని లెఫ్ట్ పార్టీలు టిఆర్ఎస్ సహాకారంతో ఎలాగైనా అడుగు పెట్టాలని చూస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో కూటమి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి సక్సెస్ కాదని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తు లేనేలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య స్నేహం కుదిరే చాన్స్ లేదు. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగిస్తున్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్‌ను కాదని టీఆర్ఎస్తో పొత్తు కొనసాగించగలుగుతారా? మునుగోడు బాటలో నడిచి తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ పాదం మోపాలని రాష్ట్రంలోని రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. ఈ పూర్వ రంగంలో లెఫ్ట్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ముందడుగు వేస్తాయా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
‘కమ్యూనిస్టులు కూడా కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’
తిరువనంతపురం: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగవుతున్నట్లు చెప్పారు. ‘భారత్ నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని పేర్కొన్నారు అమిత్ షా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అమిత్ షా. వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’.. బీజేపీపై నితీశ్ విమర్శలు -
Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!
సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడంపైనే కమ్యూనిస్టులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం, సీపీఐ పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు సీట్లపై దృష్టి పెట్టి అధికార పార్టీతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అలా సర్దుబాటుకు అధికార పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు టీఆర్ఎస్వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నికలపై కమ్యూనిస్టులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా నియోజకవర్గ సమావేశాలతోపాటు జిల్లా కార్యవర్గ సమావేశాలను నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే లాభమా..? లేక శత్రువును ఓడించేందుకు మరొకరికి మద్దతు ఇవ్వాలా..? అన్న ఆలోచనలు చేశాయి. అందులో కొందరు పోటీ చేయాలని, మరికొందరు మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. తాము పోటీ చేస్తే.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయని, తద్వారా బీజేపీ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి. చదవండి: (వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా) మద్దతుపైనే ఆలోచన.. రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీచేయగా.. సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక 2018 ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఎం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)గా పోటీలో నిలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే తాము పోటీ చేసే కంటే మరొకరికి మద్దతు ఇస్తేనే బీజేపీని అడ్డుకోగలమన్న ఉద్దేశంతో సీపీఎం, సీపీఐ ఉన్నట్లు తెలిసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తాము సహకరిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీలకు కనీసంగా రెండు మూడు సీట్లను పొత్తులో భాగంగా సాధించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ముందు పెట్టినట్లు తెలిసింది. -
Munugode Bypoll: పోటీయా? మద్దతా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్‌తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అనేకసార్లు గెలిచినా అది పొత్తుల వల్లే సాధ్యమైందని, పూర్తిగా సొంత బలమే కారణం కాదని సీపీఐ నాయకులు కొందరు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్విభజన వల్ల గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత మేరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల పరోక్షంగా బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంటుందని, అదే ఖాయమైతే బరిలో ఉండకూడదని సీపీఐ భావిస్తున్నట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ సీపీఐ తన అభ్యర్థిని బరిలోకి దింపితే మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఈ నెల 15 తర్వాత సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. (క్లిక్: మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) టీఆర్ఎస్కా? కాంగ్రెస్‌కా? సీపీఐ పోటీ చేయని పక్షంలో బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీని ఓడించగలిగేది టీఆర్ఎస్సా? కాంగ్రెస్సా? అన్నది ఇప్పుడు కీలకమని సీపీఐ, సీపీఎం నేతలంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయా? అలా వెళ్లడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందా? లేక కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంటుందా? టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీల్లో ఎన్నికల నాటికి బీజేపీని ఓడించే సత్తా ఎవరికి ఉంటుందన్న దానిపై ఆధారపడి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. (క్లిక్: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్ ఇస్తే..) -
తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు బలపడే పరిస్థితి వస్తుందా ??
-
కదంతొక్కిన కమ్యూనిస్టులు..
కరీంనగర్: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఆందోళనకు సంఘీభావంగా కరీంనగర్లో కమ్యూనిస్టులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో కరీంనగర్‌కు చేరుకొని నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగర పురవీధుల గుండా సాగిన ర్యాలీలో.. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నూతన వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని ఉభయ కమ్యునిస్టులు డిమాండ్ చేశారు. -
'మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తున్నారు'
సాక్షి, విజయవాడ: కార్మికుల సమ్మె, రైతాంగ ఆందోళనలకు మద్దతుగా ఎంబీవీకే భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ప్రజాపోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రజలను గాలికొదిలేస్తున్నారు. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు. కార్పొరేట్ వర్గాల ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ సామాన్య ప్రజల వేతనాలు మాత్రం పడిపోతున్నాయి. రైతు బిల్లులు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రైతులు, కార్మికులు రొడెక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం' అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఈనెల 26, 27వ తేదీల్లో జరిగే అఖిలభారత సమ్మె కరోనా వచ్చిన తర్వాత జరిగే అతిపెద్ద ప్రజా ఉద్యమం. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారు. ఒకవైపు కాషాయ ఎజెండా అమలు చేస్తునే మరొకవైపు కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ, అదానీ మాత్రమే బాగుపడ్డారు. చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా వీరికి అప్పగిస్తున్నారు. కేంద్ర తీరుకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు, రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు' అని సీపీఐ రామకృష్ణ అన్నారు. -
ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు? జగద్గురువులు, చక్రవర్తులు సత్కవీశులు, సైన్యనాథులు మానవతులగు మహారాజ్ఞులు కానరారేమీ? పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ, ఏవి తల్లీ...? కవి వాక్కులో, ఆ ప్రశ్నపరంపరలో ఎంతటి చారిత్రక పరిణామ క్రమం దాగి ఉందో అర్థం అవుతుంది. వర్తమాన ప్రపంచంలో, ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు తొలగకుండానే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశించి ఆవహించిన మనలాంటి సామాజిక రాజకీయ వ్యవస్థల్లో అనేక ఆటంకాల మధ్యనే సాధ్యం కాగల ప్రజాహిత సంస్కరణలకు నడుం కట్టగల యువనేతలు, యువ రాజ కీయవేత్తలు తలెత్తడం చరిత్రకు కొత్తేమీకాదు. అలాంటి వారు మనం ఊహించేంత విప్లవకారులో, రాడికల్సో కాకపోయినా పేద, మధ్య తరగతి ప్రజల ఈతిబాధల్ని అర్థం చేసుకుని తమ శక్తియుక్తులను ప్రజాహిత సంస్కరణలను అమలుపర్చడానికి నడుం కట్టినవారై ఉండొచ్చు. చీకటి ఉన్న చోట చిరుదీపాల్ని వెలిగించి మార్గనిర్దేశం చేసే వాళ్లు విప్లవకారులే కానక్కర్లేదు. సంస్కరణవాదులే కావచ్చు. గత ఔన్నత్యాన్ని మర్చిపోయారా? ఈ గుర్తింపునకు దూరమైనందువల్లనే ఎన్నో ఏళ్లుగా పోరాటాల అను భవంలో తలపండిన ఎంతోమంది వామపక్ష నాయకులున్నా, డెబ్బై, ఎనభైఏళ్ల త్యాగాల చరిత్ర ఉన్నా – నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి కొన్ని వామపక్షాలు, అందులోని కొందరు నాయకుల ప్రవర్తన మాత్రం ప్రజ లకు నిరాశ కలిగిస్తోందని చెప్పక తప్పదు. ఆ పక్షాలకు చెందిన కొందరి ప్రవర్తన, వైఖరి చివరికి ప్రజాహిత సంస్కరణలకు కూడా వ్యతిరేకించినవిగా ప్రజల మనస్సుల్లో రిజిస్టర్ కావటం వామపక్షాల గత ఔన్నత్యానికి మంచిది కాదు. ఈమాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే–గతంలో ఆంధ్రరాష్ట్రంలో 1940వ దశకంలో కరువు పరి స్థితులు తాండవిస్తున్న రోజుల్లో కరువు కోరలనుంచి రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ చీలి కలు లేకుండా ఉమ్మడిగా ఒక్క త్రాటిపైన నడుస్తున్న శుభ ఘడియలో బందరు కాల్వలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరి ఆహ్వానం లేకుండానే భారీస్థాయిలో పూడికలు తీసిన మహోన్నత చరిత్రను మరవలేము. ఈ ప్రజాహిత కార్యక్రమానికి ప్రత్యక్షంగా నడుం బిగించి, నిర్మాణ కార్యక్రమానికి నాయకత్వం వహించిన అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావు ప్రభృతులు. ఆనాడు కాంగ్రెస్ వారు ఆ కాల్వల పూడికలు తీయడంలో పాలుపంచుకోవడా నికి నిరాకరించారని మరిచిపోరాదు. ఆ పూడికల కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీతో సంబంధం లేనివారు కూడా ఆ ఉమ్మడి ప్రజా హిత కృషిలో పాలుపంచుకున్నారు. చివరికి నాటి కమ్యూనిస్టు పార్టీలో కూడా ఈ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనే విషయంలో కొన్ని రకాల గొణుగుళ్లు, సణుగుళ్లు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని సుందరయ్య తన ఆత్మ కథలో కూడా రాసుకున్నారు. ఆ చరిత్రలో కరువు కాలంలో బందరు కాల్వలకు పూడికలు తీసి పేద రైతు, వ్యవసాయ కార్మికుల ఉసురు నిలిపేటట్టు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషిని సుందరయ్య ఇలా వివరించారు. వలంటీర్ల సమీకరణ కోణంలో అతిపెద్ద విజయం ‘‘ఈ మధ్యకాలంలోనే (కరువుకాలం) మేము చేపట్టిన మరో కార్య క్రమం బందరు కాల్వ పూడికలు తీయడం.. కాలువ లోతట్టు పూడు కుపోయి లోతు తగ్గిపోయి, పొలాలకు నీళ్లుసరిగా పారని స్థితి ఏర్ప డింది. ఇంజనీర్లకు తగినంత మంది కూలీలు దొరక్క బందరు కాల్వ పూడిక తీత చేపట్టలేకపోయారు. ఆ పరిస్థితిలో మేము ముందు కొచ్చి, నామమాత్రపు వేతనాలకు ఆ పూడిక బాధ్యతను నిర్వర్తిస్తామని ఇంజ నీర్లకు చెప్పాం. ఆ మేరకు పనిచేయాలని పార్టీ సభ్యులకు పిలు పిచ్చాం. వాలంటీర్లకు భోజన వసతి సౌకర్యాలకు మాత్రమే మేము ఏర్పాటు కల్పించాం. ఇతరులకు వసతి సౌకర్యం కల్పించాం. అలా బందరు కాల్వ తూర్పు గట్టు కాల్వ తవ్వే పని నెలరోజుల్లోపు పూర్త యింది. శ్రామికుల పార్టీగా వలంటీర్ల సమీకరణ కోణం నుంచి చూస్తే అప్పటికిది చాలా పెద్ద విజయమే. ఈ కృషి రైతాంగంపై గొప్ప ప్రభావాన్ని కలగచేసింది. ఈ విషయంలో మనం మరీ సంస్కరణ వాదులుగా మారిపోతున్నా మని విమర్శ కూడా కొంతమంది నుంచి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం నిర్వహించవలసిన పనులని వారన్నారు. మనం అంత పెద్ద బరువును మీద వేసుకుని ఉండాల్సిందా లేదా అన్నదానిపై ఆంధ్రకమ్యూనిస్టు పార్టీ కమిటీలో కూడా విభేదాలొచ్చాయి. ఏమైనప్పటికీ అత్యధికులు మాత్రం ఈ కార్యక్రమం (కాల్వ పూడికలు తీయడం) మంచిదని భావించారు. ఆ విధంగా నా వాదన సరైందని రుజువైంది. పార్టీ, కేంద్రకమిటీ కూడా కాల్వ పూడి కల తీత కార్యక్రమాన్ని కొనియాడింది. నిజానికి ఆ తర్వాత జరిగిన నేత్రకోన మహాసభలో ప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో అమలు చేయదగిన ఉదాహరణగా అందరి కార్యకర్తల అనుభవాన్ని పేర్కొన్నది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రలోని గ్రామాల్లో సాగునీటి కాల్వల తవ్వకం చెరువుల పూడిక తీతను చాలా విస్తృత స్థాయిలో చేప ట్టాము.’’ బాబు నీడలో కొందరు వామపక్ష నేతలు ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, నాయకుల బాధ్యత, ప్రవర్తన ఎలా ఉండాలో, దానిపై ఆధారపడే కార్యకర్తల కార్యాచరణ కూడా ఉంటుం దని తమ జీవిత కాలంలో నిరూపించిన వారు సుందరయ్య, రాజేశ్వర రావులు. ఆనాడు ఎవరో బొట్టుపెట్టి పిలిస్తేనే పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు కదిలి వచ్చినవారు కారు. ఆ నిర్మాణ కార్య క్రమంలో గాంధీజీ స్ఫూర్తి కూడా నాటి ఆంధ్రా కాంగ్రెస్‌కు లేదు. కాగా, అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం, పదవీ స్వీకార సభ లగాయతు ఈరోజు దాకా, అతని దీర్ఘ పాదయాత్ర స్ఫూర్తి ద్వారా కదిలివచ్చిన తెలుగు ప్రజా బాహుళ్యం, ‘నవరత్నాల’ హామీని ఆచరణలో అక్షరాల అనుభవిస్తున్నారన్నది నగ్న సత్యం, పచ్చి నిజం! గోపీచంద్ నవలలోని ‘అసమర్థుడి జీవయాత్ర’ కొనసాగించ వలసి వచ్చి, అవినీతి మినహా మరొక యావత్తు లేకుండా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి అభాసుపాలైన నేటి ప్రతిపక్ష నాయ కుడు చంద్రబాబు నీడలోనే రకరకాల వేషాలలో వామపక్షాలలోని కొందరు నాయకులు కాలక్షేపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజనకు, ఆ సాకు చాటున పదవిని ఆంధ్రలో కాపాడుకోవడానికి తనకు తానై రహస్యంగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముందు విభ జనపై సంతకంచేసి ముక్కుముఖంలేని రాజధానిని ఎంపిక చేశాడు. అదీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు, ఆ పేరిట తనకూ, వంది మాగధులకు ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కాబోయే రాజధాని భూములపై స్పెక్యులేషన్ వ్యాపారానికి గజ్జెకట్టినవాడు బాబు. అమరావతి పేద రైతుల్ని మభ్యపెట్టి, వారి భూముల సరిహద్దులు చెరిపి, వారిని బికారులు చేయడానికి సన్నద్ధమయ్యాడు, వంది మాగధులందరికీ ‘తిలా పాపం తలా పిడికెడు’ వంతున భూముల్ని దోచిబెట్టి అందులో ఒక వామపక్షంలో తనకు కొమ్ముకాస్తున్న ఒక రిద్దరు మిత్రులకు కూడా అవినీతిలో భాగం చేశాడని, అందుకే బాబు అక్రమ ధర్మాలన్నింటికి ‘తలూపి’నట్టు లోకం కోడై కూస్తోంది. ఆ అపవాదు నుంచి కొందరు వామపక్షీయులు తక్షణం బయటపడాల్సి ఉంటుంది. నెగటివ్ ధోరణి ప్రజావ్యతిరేకం! అలాగే రాష్ట్రాధికారానికి వచ్చిన నాటి నుంచి యువనేత జగన్‌ను ముప్పెరగొన్న సమస్యలు అసాధారణమైనవి. ప్రధానంగా సామాన్య మధ్యతరగతి రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, మహిళాభ్యుదయా నికి అనేక కనీస ప్రజాహిత సంస్కరణలను దేశంలో ఒక్క కేరళ మినహా అనితరసాధ్యంగా అమలు జరుపుతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు వచ్చింది. దానికితోడు కరోనా వైరస్ మహమ్మారి ఎదురైనా, దాన్ని తట్టుకుని ఒకవైపున ప్రజల ఆరోగ్య భాగ్యాన్ని రక్షించి కాపాడుకొనే ప్రయత్నంలో వైఎస్ జగన్ తీసుకున్న ప్రజా వైద్య రక్షణ చర్యలూ దేశ ప్రజల, వివిధ రాష్ట్రాల ప్రశంసలూ అందు కుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌కు అంతో ఇంతో అండగా, చేదోడు వాదో డుగా వామపక్షాలు ఆచరణలో పూర్తిగా నిలవకపోయినా– ‘దీవులు’ మాదిరిగా అనంతపూర్‌లో రాంభూపాల్ సీపీఎం జిల్లా కార్యదర్శి, కడపలో ఈశ్వరయ్య (సీపీఐ) ప్రభృతులు మాత్రం క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా, సంక్లిష్ట సమయాల్లో తమ క్యాడర్‌ను కాపాడుకోవాలన్నా, కష్టకాలంలో ప్రజలకు ఆచ రణలో అండగా నిలవాలన్నా ‘నెగెటివ్ ధోరణులు’ మానుకోవాలి. ఈ ఇరువురు స్థానిక వామపక్ష నాయకులు మినహా ప్రస్తుత కాలంలో ఆచరణలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న వామపక్షీయులు ‘కలికాని కైనా’ కనిపించకపోవడం విచారకరం. కనీసం ఆనాటి ‘బందరు కాల్వల పూడికతీత’ పనుల్లో పాల్గొన్న కార్యకర్తల కృషినుంచైనా స్ఫూర్తిని చేరుకోవాలి. తెలంగాణలో కూర్చుని ఆంధ్ర రాజకీయాలు నడపగోరే చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోకండి. జోగి, జోగి రాసు కుంటే రాలేది బూడిదే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మండలి రద్దుపై లెఫ్ట్ యూ టర్న్!
సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు, శాసన మండలి వంటివి దండగమారి వ్యవస్థలుగా అభివర్ణించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నాయి. ఈ రెండు వ్యవస్థలు ఆరో వేలు లాంటివని, వీటివల్ల ప్రజాధనం వృథా కావడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని గతంలో వాదించిన లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతం అందుకు భిన్నమైన గళం వినిపిస్తుండడం గమనార్హం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి రద్దు ప్రతిపాదన చేసినప్పుడు అందుకు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు ఇప్పుడు స్వరం మార్చారు. విధానాలు మారిపోతాయా? రాష్ట్రంలో శాసన మండలి రద్దు ఆలోచనే అప్రజాస్వామికమని సీపీఎం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలనే రద్దు చేస్తారా? అని సీపీఐ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయా పార్టీల్లోని సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వాలు మారినప్పుడల్లా కమ్యూనిస్టు విధానాలు మారిపోతాయా? అని నిలదీస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో శాసన మండలి రద్దు తీర్మానాన్ని తాము సమర్థించామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నేత ఒకరు గుర్తుచేశారు. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లోనే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి. ఇటీవలి వరకు జమ్మూకశ్మీర్లోనూ మండలి ఉండేది. రాష్ట్ర హోదా రద్దయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత అక్కడ కూడా శాసన మండలి రద్దయ్యింది. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు ఉండేవి. తర్వాత అవి రద్దయ్యాయి. శాసన మండళ్లు వద్దని చెబుతున్న కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ను రద్దు చేస్తామనే ప్రతిపాదన వచ్చీ రాకమునుపే అన్యాయం, అప్రజాస్వామికం అనడం దేనికి సంకేతమని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ, ఆరెస్సెస్‌కు అడ్డుకట్ట వేద్దాం!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశానికి బీజేపీ, ఆరెస్సెస్‌ల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నా యని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై మూకదాడులు, హత్యలు వంటివి నిత్యకృత్యంగా మారడం ఆందోళనకరమన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆరెస్సెస్ ముందుండి ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు.. కేత్రస్థాయి కేడర్‌ను ‘మిలిటరైజేషన్’ చేసే దిశగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లపై పోరుకు విస్తృతస్థాయిలో అన్ని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నా రు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక తొలిసారి నగరానికి వచ్చిన సందర్భంగా రాజాతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.. దేశప్రయోజనాల దృష్ట్యానైనా.. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, వామపక్ష, ఇతర ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఐక్యతతో పోటీచేసి సత్ఫలితాలు సాధిం చాయి. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో విపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోవడంతో బీజేపీ, భాగస్వామ్యపక్షా లు లాభపడ్డాయి. దీనినుంచి అన్ని లౌకిక, ప్రజాతంత్రశక్తులు పాఠం నేర్చుకోవాల్సి ఉంది. బీజేపీ, ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే అన్నిపార్టీలు ఒకే వేదికపైకి రావాలని సీపీఐ కోరినా అది సాధ్యపడలేదు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల అవసరాలను దృష్టిలోపెట్టుకుని దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరముంది. అన్ని సెక్యులర్, ప్రజాస్వామ్య పార్టీలన్నీ కూడా వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. సీట్ల సర్దుబాటు తదితర అంశాల్లోనూ ఇదే వైఖరితో ముం దుకు సాగితే సమస్యలుండవు. బీజేపీ, ఆరెస్సెస్ ఓటమి ప్రధానలక్ష్యంగా విపక్షాలు సర్దుబాటు ధోరణితో పనిచేయాలి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వామపక్షాల పాత్ర కీలకంగా మారింది. ముందుగా మా పార్టీ పునర్వ్యవస్థీకరణ ముందుగా మా పార్టీని అన్నిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి.నిత్యం ప్రజాసమస్యలపై పోరాడేందుకు సిద్ధం చేయాలి. వామపక్ష, కమ్యూనిస్టు శక్తుల ఐక్యత, పునరేకీకరణ తక్షణ అవసరం. ఈ విషయాన్ని సీపీఐ ఎప్పుడూ ప్రస్తావిస్తూ అందుకోసం యతి్నస్తోంది. సైద్ధాంతిక ప్రాతిపదికన వామపక్ష ఐక్యత ను కోరుకుంటోంది. కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ‘లెఫ్ట్’ ఐక్యత చారిత్రక అవసరం కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణకు సంబంధించి గతంలో సీపీఐ ప్రధానకార్యదర్శి ఇంద్రజిత్‌గుప్తా, సీపీఎం ప్రధానకార్యదర్శి హరికిషన్ సూర్జిత్ సమావేశమై ఒక జాయింట్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. రాష్ట్రస్థాయిల్లోని ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేసి వామపక్ష ఐక్యతసాధన దిశలో చర్య లు చేపట్టాలని సూచించారు. అయితే ఈ ప్రక్రియ ఆ తర్వాత కొనసాగలేదు. వామపక్ష, కమ్యూనిస్టుల ఐక్యత, పునరేకీకరణ నేటి అవసరం. జెండర్, జనరేషన్ గ్యాప్ అధిగమించాలి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసి యువత, మహిళల ప్రాతినిధ్యం పెంచడం.. తగిన శిక్షణనివ్వడం ద్వారా సామాజిక మార్పుకు వారథులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దళితులు, ఆదివాసీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం పెరిగింది. వీరికి కమ్యూనిస్టులు దగ్గరకావాల్సి ఉంది. వీరిలో చురుకైన కేడర్‌ను పారీ్టలో భాగస్వాములను చేయాలి. జెండర్, జనరేషన్ గ్యాప్‌ను అధిగమించాల్సి ఉంది. సోషల్‌మీడియా సెల్ ఏర్పాటు.. సీపీఐ జాతీయస్థాయిలో ఒక సోషల్‌మీడియా సెల్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రస్థాయిల్లోనూ దీనిని ఏర్పాటుచేయాలని సూచించాము. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై పార్టీ వైఖరిని వివరించేందుకు ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పార్టీలకు తెలియజేశాం. కాంగ్రెస్ విధానాలు మారాలి దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీలోనే ఇబ్బందికరపరిస్థితులు తలెత్తడం, కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలతో పార్టీ అధికారిక వైఖరిని విభేదిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సొంత విధానాల్లో కొన్నిం టిని వదులుకోవాలి. దేశప్రయోజనాల కోసం కొన్ని విధానాలను మార్చుకుని ముందుకు తీసుకెళ్లాలి. సెక్యులర్ విలువల పరిరక్షణకు పెద్దపీట వేసి, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, తదితర అంశాల్లో మార్పులు చేపడితే ప్రయోజనం ఉంటుంది. -
పార్టీ విధానాలు ప్రజల్లోకి..!
సాక్షి, హైదరాబాద్: ఉభయ కమ్యూనిస్టుపార్టీలు తాము పోటీ చేసిన నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారా న్ని బాగానే నిర్వహించగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమ తమ పార్టీల రాజకీయవిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభు త్వాల అప్రజాస్వామిక విధానాలు, వైఖరిని ఎండగట్టగలిగామని భావిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపి, మళ్లీ సంస్థాగతంగా పార్టీల పటిష్టతపై దృష్టి పెట్టేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లో రెండుపార్టీల నేతలు, కార్యకర్తలు చురుకుగా భాగస్వాములు కావడం ద్వారా కేడర్‌లో నూతనోత్తేజం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేరళలోని వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తుండడంతో ఆ పార్టీపై వామపక్షాలు అనుసరించే ధోరణి, వైఖరిలో కొంతమార్పు వచ్చింది. సీపీఐ, సీపీఎంల 4 సీట్లలో పరిస్థితి ఖమ్మం లోక్‌సభ: ఖమ్మం సీపీఎం అభ్యర్థిగా బి.వెంకట్ పోటీ చే శారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఉండడంతో గెలుపుపై ఏమాత్రం అంచనాలు లేవు. సీపీఎం అభిమానులతోపాటు వామపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్లు పడతాయనే ఆశాభావంతో ఉన్నారు. నల్లగొండ లోక్‌సభ: టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ నెలకొనడంతో సీపీఎం ఇక్కడ గెలుపుపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. మల్లు లక్ష్మీని పోటీకి దింపడం ద్వారా ఇతరవర్గాల ఓట్లతోపాటు కొంతమేర మహిళల ఓట్లు కూడా సాధించే అవకాశాలు న్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీవిధానాల ప్రచారంతోపాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కల్పించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ: ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్‌లలో వామపక్షాలకు కొంత మద్దతు ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో సీపీఐ అభ్యర్థిగా గోదా శ్రీరాములు పడే ఓట్లు తక్కువగానే ఉండొ చ్చని అంచనా వేస్తున్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిని పోటీకి నిలిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబాబాద్ లోక్‌సభ: సీపీఐ అభ్యర్థిగా కల్లూరి వెంకటేశ్వర్రావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో పార్టీపరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేతులెత్తేయడం తో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైనట్టుగా వామపక్షపార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు. -
వేర్వేరుగానే వామపక్షాల పోటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టుపార్టీలైన సీపీఐ, సీపీఎంల పొత్తు ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరి 2 స్థానాల్లో వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈమేరకు గురువారం 2 పార్టీలు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీ లు పోటీచేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎవరి దారి వారు చూసుకోవాలనే 2 పార్టీలు నిర్ణయించాయి. ఇరు పార్టీలు పోటీచేసే స్థానాల్లోనైనా సహకారం ఏమేరకు ఉంటుందన్న దానిపైనా స్పష్టత లేదు. మఖ్దూంభవన్‌లో బుధవారం జరిగిన సీపీఐ,సీపీఎం ఐదో దఫా చర్చల్లోనూ వీటి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పొత్తులు, రాజకీయవిధా నంపై తమ కార్యదర్శి వర్గభేటీలో చర్చించాక, జాతీయ నాయకత్వం సలహాలు తీసుకుని సీపీఎం రాష్ట్ర పార్టీకి ఫోన్లో నిర్ణయాన్ని తెలియజేస్తామని సీపీఐ చెప్పినట్టు సమాచారం. రాత్రివరకు సీపీఎం నాయకులకు సమాచారం అందకపోవడంతో తాము నిర్ణయించుకున్న పంథాలోనే ముందుకెళ్లాలని సీపీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
క్రాస్‌రోడ్స్‌లో కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు పూర్వవైభవం సాధించడం సాధ్యమా? ‘గుర్తింపు సంక్షోభం’ఎదుర్కొంటున్న ఈ పార్టీలు మళ్లీ ఉనికి చాటుకుని రాజకీయాల్లో నిలవగలవా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలే కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులను వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంతోపాటు ఎన్నికల రాజకీయాల్లో ఉన్న ఎంఎల్ పార్టీలు సైతం ‘క్రాస్‌రోడ్స్’లో నిలిచి ఉన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు విడివిడిగా ఎంచుకున్న ఎత్తుగడలు, వ్యూహాలు కుదేలయ్యాయి. కేవలం మూడుసీట్ల కోసం కాంగ్రెస్ ప్రజాఫ్రంట్‌లో సీపీఐ భాగస్వామి కావడం, తన సొంత సీటు కోసం పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తాపత్రయపడిన తీరుపై ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ విధానాలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కూటమి పేరిట కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టడంపై పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుసరించిన పద్ధతులను ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ నివేదికలో ఎండగట్టింది. వేర్వేరు పద్ధతులు అవలంబించినా కనీసం ఒక్కో సీటు అయినా గెలవకపోగా, కొన్నేళ్లుగా ఈ పార్టీలకు సంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న చోట్ల కూడా పడాల్సిన ఓట్లు పడకపోవడంతో ఎన్నికల రాజకీయాల్లో ఈ పార్టీల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గత ఏడు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ, ఏపీల్లో వామపక్షాలు ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయి... కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలు వదిలేసి, పచ్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడింది. ఈ పార్టీల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు డబ్బు, కుల ప్రభావం వంటి పలు బలహీనతలకు లోనవుతున్నారు. ఇక కొందరు నాయకులైతే అవకాశవాద రాజకీయాలు సైతం చేస్తున్నారు. మధ్యతరగతి అవకాశవాద రాజకీయాలనే ప్రధాన స్రవంతి రాజకీయాలుగా ఈ పార్టీల నాయకులు తీసుకొస్తున్నారు. 1990లో మొదలైన నయా ఉదారవాద విధానాలతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఈ పార్టీలపైనా డబ్బు ప్రభావం పడింది. డబ్బులు లేకపోతే ఎన్నికల్లో గెలవమనే పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఏర్పడ్డాయి. – డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకులు కమ్యూనిస్టు పార్టీల ప్రతిష్ట దెబ్బతింది పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుపార్టీల ప్రతిష్ట దెబ్బతింది. ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించే దిశలో కృషి చేయాల్సిన వామపక్షాలకు ఆ స్వప్నమే కొరవడితే పరిస్థితులు మరో రకంగా మారతాయి. అధికార, బూర్జువా పార్టీలు ఎన్నికల రాజకీయాలను డబ్బు, కులం, ఇతర ప్రభావాలతో తమకు అనుకూలంగా మలుచుకోవడంతో 1970 దశకం నుంచి కమ్యూనిస్టుపార్టీల అస్తిత్వం తగ్గుముఖం పట్టడం మొదలైంది. – ప్రొ.జి.హరగోపాల్, పౌరహక్కుల నేత సమస్యలపై పోరాటంలో విఫలం ప్రజల మౌలిక సమస్యలపై పోరాడటంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమవుతున్నాయి. ప్రజల ఎజెండానే చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో సంబంధా లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులు, ప్రజల సమస్యల లోతుల్లోకి వెళ్లలేకపోతున్నాయి. 1991 నుంచి నూతన ఆర్థికవిధానా లు, సంస్కరణల అమలు వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించలేకపోయారు. – జీవన్‌కుమార్, మానవహక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) -
బాబే ప్యాకేజీకి అంగీకరించారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబే అంగీకరించారు కదా అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రెండో రోజు ధర్నా కొనసాగింది. ధర్నా అనంతరం ఎంపీ డి.రాజా ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పలు విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి రూ. 3,500 కోట్లు ఇస్తే అక్కడ ఏమీ నిర్మించలేకపోయారని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో కేవలం ఐదు ప్రధాన భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులు ఇవ్వాలని ఉందన్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ. 350 కోట్ల నిధులను త్వరలో విడుదల చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. దీనిపై నేతలు స్పందిస్తూ.. ఏపీకి ప్యాకేజీ నిధులు సరిపోవని, ప్రత్యేక హోదా ఇవ్వాలని జైట్లీని కోరారు. మౌలిక సదుపాయాల కల్పనకే 90 శాతం నిధులు ఖర్చవుతాయని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా విభజన హామీలు అమలు చేయాలని కోరారు. రాజకీయ మార్పుతో హామీల సాధన: ఏచూరి అంతకుముందు ధర్నాలో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కేంద్రంలో రాజకీయ మార్పు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలు సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీని ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రాజకీయ మార్పు అవసరమని, దాని కోసం అందరం కలసి పోరాడుదామని పేర్కొన్నారు. ధర్నాలో సీపీఐ నారాయణ, రామకృష్ణ, సీపీఎం మధు, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్: తలోదారిలో కామ్రెడ్స్
ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండే కమ్యూనిస్టుపార్టీలకు జిల్లాలో మంచి పట్టుండేది. చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకర్తలతో పాటు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఎర్రజెండా ఎగరలేదు. చాలా చోట్ల పోటీ చేసినా ఎక్కడా విజయం సాధించలేదు. పార్టీలు, నేతల మధ్య సిద్ధాంత విభేదాలు, ఆధిపత్య పోరే అందుక కారణం. సాక్షి, బోధన్: జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలకు ఘనమైన చరిత్రే ఉంది. దశాబ్దాల క్రితం నుంచి పార్టీ నిర్మాణం చేపట్టి, ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పార్టీ అనుబంధ సంఘాల నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కార్మికులను సంఘటితం చేసి, వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాయి. విద్యార్థి, యువత, మహిళా, అసంఘటిత రంగ కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం గళమెత్తుతూనే ఉన్నాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు తలోదారిలో వెళ్తుండడంతో కామ్రేడ్లు అధికారం దక్కించుకోలేక పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేసినా ఎర్రజెండా పార్టీల అభ్యర్థులు ఓటమి మూటగట్టుకుంటున్నారు. సిద్ధాంత విభేదాలు, రాజకీయ ఎత్తుగడ తదితర అంశాల్లో కమ్యూనిస్టు పార్టీల్లో విభేదాలు చోటు చేసుకుని ఎన్నికల్లో తలోదారిలో నడుస్తున్నాయి. బోధన్, రూరల్ వంటి నియోజక వర్గంలో క్రియాశీలకంగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం దక్కలేదు. దశాబ్దాలు గడిచినా అధికార పీఠం దక్కలేదు. సమరశీల పోరాటాల ఘన చరిత్ర బోధన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం), ఆర్ఎస్పీ, ఎంసీపీఐ (యూ) పార్టీలు నిరంతరం కార్మికులు, పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయి. గతంలో జిల్లాలో జరిగిన చారిత్రాత్మక పోరాటాల్లో నియోజక వర్గానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు కీలక పాత్ర వహించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిరక్షణకు ఎగువ భాగంలో నిర్మించిన సింగూర్ ప్రాజెక్టును ఇందూరు జిల్లాకే కేటాయించాలని నిజాంసాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 1986, 1997లలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలే నేతృత్వం వహించాయి. దశాబ్దాల నుంచి ఇప్పటివరకూ బీడీ కార్మికుల పోరాటాలకు ప్రాతిని«ధ్యం వహిస్తున్నాయి. 2000 సంవత్సరంలో కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా, 2002లో చంద్రబాబు హయాంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా పోరాటం చేశాయి. ఫ్యాక్టరీ భూములు పేదలకు పంచాలని జరిగిన భూపోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకతాటిపై నిలిచి ఉద్యమించాయి. మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు సమరశీల పోరాటాలు చేపట్టాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడుపాలని, ప్రైవేట్ కంపెనీ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలని కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఏకతాటిపై నిలిచే కమ్యూనిస్టులు.. ఎన్నికల వేళ మాత్రం తలోదారిలో వెళ్తుండడంతో అధికారానికి దూరమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయా కమ్యూనిస్టు పార్టీలలో అంతర్గతంగా నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాల కారణంగా కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావడం లేదని, అందువల్లే దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై పని చేస్తున్ననా కమ్యూనిస్టులకు అధికారం దక్కడం లేదని విశ్లేషిస్తున్నారు. ప్రతి సారీ ఓటమే.. 1952లో బోధన్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం ఇక్కడ విజయం సాధించారు. సీపీఐ, సీపీఎం ఎన్నికల వేళ చెరో కూటమిలో చేరి విడిపోతున్నారు. విప్లవ పార్టీ అయిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ 1989లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఆ పార్టీ డివిజన్ ప్రతినిధి చిక్కెల లక్ష్మణ్ పోటీ చేసి ఓడిపోయారు. 1994లో న్యూడెమోక్రసీ అభ్యర్థిగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా మాజీ కార్యదర్శి సుధారాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ఎంసీపీఐ అభ్యర్థిగా కోటగిరి మండలానికి చెందిన యార్లగడ్డ సాయిబాబా కూడా పెద్దగా పోటీ ఇవ్వలేక పోయారు. 2014 ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థిగా యార్లగడ్డ సాయిబాబా పోటీ చేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉండగా, సీపీఎం నేతృత్వంలో ప్రజా సంఘాలతో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తుండగా, సీపీఐ పోటీకి దూరంగా ఉంది. -
కామ్రేడ్ల కయ్యం... ఎవరికి లాభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. వామపక్ష పార్టీల్లో బలంగా ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీలు ఈ ఎన్నికల్లో చెరోపక్షం వహించడానికి దాదాపు సిద్ధమయ్యాయి. మహాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటిపార్టీ)లో భాగస్వామిగా ఉండటానికి సీపీఐ నిర్ణయించింది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై భాగస్వామ్య పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి కూడా వచ్చాయి. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ పోటీచేయాల్సిన సీట్ల సంఖ్య, పోటీచేసే స్థానాలు వంటివాటిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. సీపీఎం అగ్రభాగంలో ఉంటూ బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్)ను ఏర్పాటుచేసింది. వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంస్థలతో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో వేదికను ఏర్పాటుచేసింది. దీంతోపాటు ఇప్పటికే దాదాపు 60 మందితో అభ్యర్థుల జాబితాను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలో భాగస్వామిగా ఉంటూ సీపీఐ, బీఎల్ఎఫ్ను ఏర్పాటుచేసిన సీపీఎం పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. వామపక్షవాదుల్లో అసంతృప్తి వామపక్ష పార్టీల మధ్య వైరంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మిగిలిన చిన్నచిన్న కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేయాల్సిన సీపీఐ, సీపీఎంలు పరస్పరం విమర్శలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో సీపీఎం, సీపీఐ అభ్యర్థులు పరస్పరం పోటీపడే పరిస్థితులున్నాయి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరంలో ఉండాలనే నిర్ణయంలో భాగంగానే బీఎల్ఎఫ్ను ఏర్పాటు చేసినట్టుగా సీపీఎం నేత లు వాదిస్తున్నారు. పొత్తులతో ఇప్పటికే వామపక్ష ఉద్యమాలు చాలా బలహీనపడ్డాయని, ఇంకా స్వతంత్రంగా వ్యవహరించకుంటే మరిం త నష్టం జరుగుతుందని సీపీఎం నేతలు వాదిస్తున్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాల ను బలోపేతం చేయడానికి సీపీఐ బీఎల్ఎఫ్లో చేరాల్సిందని, కాంగ్రెస్ పార్టీతో కలవడమే సరైంది కాదని అంటున్నారు. అయితే సీపీఐ నేతలు ఈ వాదనను తిప్పికొడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించే శక్తులతో కలవడమే సరైందని సీపీఐ వాదిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఎల్‌ఎఫ్‌కు, వామపక్షాలకు టీఆర్ఎస్ను ఓడించే స్థాయిలో శక్తి లేదని సీపీఐ వాదిస్తోంది. టీఆర్ఎస్ను ఓడించడానికి ఐక్యంగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం మంచి నిర్ణయం కాదని అంటున్నారు. టీఆర్ఎస్ను ఓడించడానికి అన్ని పార్టీలతో కలిసి పోరాడటం మినహా మరో మార్గం లేదంటున్నారు. అందుకే అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్నామని సీపీఐ నేతలు వాదిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా సీపీఎం పరోక్షంగా టీఆర్ఎస్కు సహకరిస్తున్నట్టేనని సీపీఐ వాదిస్తోంది. సీపీఎం కూడా మహాకూటమిలో చేరితే బాగుండేదని సీపీఐ నేతలు అంటున్నారు. ఏదేమైనా ఈ పార్టీ లు వేరుగా పోటీపడటం సరికాదని వామపక్షపార్టీల సానుభూతిపరులు చెబుతున్నారు. -
సీపీఎస్‌ను తక్షణం రద్దు చేయండి
సాక్షి, అమరావతి: కమిటీలతో కాలయాపన చేయకుండా రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. సీపీఎస్ రద్దు కోరుతూ విజయవాడలోని దాసరి భవన్లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల సమస్యగా ఉన్న సీపీఎస్ రద్దు కోసం జరుగుతున్న పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని ప్రకటించారు. పోరాటాన్ని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసులను ప్రయోగించడం దారుణమన్నారు. ఛలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా అరెస్టులు చేసినప్పటికీ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకుని ఉద్యమం నిర్వహించడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారికి ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడపై కత్తిలా ఉన్న సీపీఎస్ కన్పించడంలేదని, అందుకే అసెంబ్లీ ముట్టడిలో ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు లేడని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకుంటే నవంబర్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం చేసిన తీర్మానం వివరాలను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతామని చెప్పారు. సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత జల్లి విల్సన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పోలారి, ఆమ్ఆద్మీ నేత పోతిన వెంకట రామారావు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్, ప్రధాన కార్యదర్శులు బాబురెడ్డి, జి.హృదయరాజు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అ«ధ్యక్షుడు చలసాని రామారావు, శ్రామిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు కళ్లేపల్లి శైలజ, వీఆర్వో సంఘ నాయకుడు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. సీపీఎస్ రద్దు ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పొట్టకొట్టే సీపీఎస్ రద్దు కోసం జరిగే ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి చెప్పారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి నుంచి సీపీఎస్ రద్దు కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఉద్యమానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారని తెలిపారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, హెలికాఫ్ట్టర్, విమానాల్లో చక్కర్లు కొట్టేందుకు కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్న చంద్రబాబుకు పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయడానికి మనసు రావడంలేదని మండిపడ్డారు. 35 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన వ్యక్తికి పెన్షన్ భరోసా కూడా లేకుండా చేస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ రద్దు విషయంలో ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. -
వామపక్షాల దారి ఎటు?
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అశ్రిత పక్షపాతం, అహంకార ధోరణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలిపోవాలని బాబు కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ బాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో అవసరం తీరాక మిత్రపక్షాలతో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభు త్వాన్ని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా వామపక్షాలు భావిస్తున్నాయి. ఆ కర్తవ్య నిర్వహణకు కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఏ కూట మిలోనూ ఎన్నికల ముందు చేరడానికి తాము సిద్ధంగా లేమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాతే వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఏర్పడే వివిధ పార్టీలకు వచ్చే సీట్లను బట్టి ప్రభుత్వాన్ని ఎవరితో కలసి ఏర్పాటు చేయాలో నిర్ణ యిస్తామని ఈ పార్టీ తెలిపింది. కాంగ్రెస్‌ను, బీజేపీని ఒకే గాటిన కట్టేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. తమ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికల పొత్తులు నిర్ణ యించుకునే స్వేచ్ఛను పార్టీ శాఖలకు సీపీఎం ఇచ్చింది. జలంధర్‌లో 1978లో జరిగిన పదో జాతీయ మహాసభల సందర్భంగా సీపీఎం వ్యవ స్థాపక ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇలాంటి సూచన చేశారు. ఆయన ప్రతిపాదన అప్పట్లో వీగిపోయింది. నాటి సుందరయ్య సూచన ఆచరణాత్మక రూపం దాల్చేందుకు నేటి సీపీఎం వైఖరి కొంతవరకు దోహదం పడుతోందని ఆశిం చవచ్చు. ఈ నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాన్న ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలో సీపీఎం ఓ చరిత్రాత్మక ప్రయో గానికి రెండు సంవత్సరాల ముందే స్వీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగుతున్నప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం సూచిం చిన సమైక్య విధానంతో తెలంగాణ ప్రజల మనోభా వాలకు భిన్నంగా వ్యవహరించింది. అంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే కొంత బలం కలిగిన పార్టీగా ఉన్న∙సీపీఎం ప్రజలకు దూరమైంది. తిరిగి తెలంగాణ ప్రజలతో మమేక మయ్యే అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. ఇందులో భాగంగా ‘బహుజన వామపక్ష సంఘటన’ ఆవిర్భావంలో ప్రధాన పాత్ర వహిం చింది. హైదరాబాద్‌లో ‘లాల్–నీల్’ ఐక్యత నినాదం మొదటిసారి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్‌లో ప్రకటించారు. నిజానికి ఎన్నికల్లో కూడా బహుజన, వామపక్ష సంఘటన పేరుతో పాల్గొనాలని నిర్ణయించింది. దళిత, ఆది వాసీ, నేత, గీత తదితర వృత్తుల వారికి తగినన్ని స్థానాలను సైతం కేటాయిస్తామని ప్రకటించింది. సీపీఎం కృషి అభినందనీయమే కాక అనుసరణీయం కూడా. దేశంలో మార్కిజాన్ని అనుసరించాలంటే శ్రామికవర్గ పోరాట మార్గమే సరిపోదు. పార్టీ నేతలు పుట్టుకతో వచ్చిన వర్గ దృక్పథాన్ని వదిలించుకోవ డమే కాదు, ఆధిపత్య కుల అహంకారాన్ని విడి చిపెట్టడం కూడా అవసరం. బాబు పాలనకు ముగింపే ప్రధాన కర్తవ్యం నేటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో కంటే మరీ అధ్వానంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రలో బీజేపీని ఓడించడమన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. సీఎం బాబు నాయ కత్వంలోని టీడీపీ పాలన నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోగతి, శాంతి సౌభాగ్యాలకు ప్రధమ శత్రువు. కనుక వామపక్షాల కర్తవ్యం తెలుగుదేశం పార్టీని ఓడించడమే. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాల నను వ్యతిరేకిస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నారు. నరేంద్ర మోదీకి నాలుగేళ్లు సాగిలపడిన తెలుగుదేశం బూటకాన్ని తెలుగు ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అలాగే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి మోదీ ప్రజా వ్యతిరేక చర్యలను వేనోళ్ల పొగిడింది చంద్ర బాబు అన్న సంగతి కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు మోదీపై లాలూచీ కుస్తీకి చంద్రబాబు తెర తీశారు. ఈ పరిస్థితుల్లో బాబు టీడీపీ పాలనకు చర మగీతం పాడటం రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం. ఇదే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూ నిస్టులు గుర్తించాల్సిన వాస్తవం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు– ఇదీ చంద్ర బాబు నైజం. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవ నినాదం అందించి, అంతవరకు ఓటమెరుగని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన ఎన్టీఆర్ చంద్రబాబుకు పిల్లనిచ్చి, రాజకీయ పునర్జన్మ కూడా ప్రసాదించారు. పదవీ వ్యామోహంతో బాబు ఎన్టీఆర్‌నే పదవీచ్యుతుడ్ని చేసిన విషయం మరచిపోలేము. ఆ విషయం నేటి తరం యువతకు కూడా నిరంతరం గుర్తు చేయాలి. గెలుపుపై ధీమా లేకనే బీజేపీతో బాబు పొత్తు! 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీపై తెలుగుదేశం ఒంట రిగా పోటీచేసి విజయం సాధించగలదనే నమ్మకం లేకనే చంద్రబాబు అప్పటికే వీస్తున్న మోదీ హవాను వాడుకోవాలనుకున్నారు. వెంటనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అంతకు ముందు 1999, 2004లో కూడా ఏబీ వాజ్పాయ్ ప్రధానిగా ఉండగా బీజేపీతో చేతులు కలిపారు. 2004లో పరాజయంతో ఇక ఎన్న టికీ బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటిం చారు. కాని ఒట్టు తీసి గట్టున పెట్టి 2014లో ప్రధాన మంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి మోదీ అండతోనే ఎన్ని కల్లో పాల్గొన్నారు. అయినా ఆంధ్రలో బీజేపీ బలం సరిపోదని భావించి, సినీ హీరో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతు ఇవ్వమని అర్థిం చారు. అయితే అందుకు బదులు జనసేనకు రాజ్య సభ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఈ విషయం ఇటీవలే పవన్ కల్యాణ్ స్వయంగా ప్రక టించారు. ఇలా మాట తప్పడం, తప్పుడు వాగ్దా నాలతో ‘పోయేదేముంది మాటే కదా.. వచ్చేది పదవి కదా’ అనే ధోరణి చంద్రబాబుది. అప్పటికి తెలుగు దేశం అధినేత నైజం తెలియని పవన్ ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీకి సహకరించారు. నిజానికి నాడు తెలుగుదేశం పార్టీకి ఈ సహకారమే లేకపోతే ఆ ఎన్నికల్లో ఓడిపోయేది. ఇక చంద్రబాబు మోసానికి బలైన పార్టీల్లో వామపక్ష పార్టీలూ ఉన్నాయి. 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుడ్ని చేసిన చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు వామపక్షాలు అండగా ఉన్నాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇదే ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీలకు కాలంచెల్లిందని హేళన చేశారు. అయినా 2009లో మళ్లీ ఆ కమ్యూనిస్టుల వద్దకే వెళ్లి మహా కూటమిలో చేరాలని చంద్రబాబు అభ్యర్థించారు. అందుకు రెండు కమ్యూనిస్ట్ పార్టీలూ అంగీకరించి మహాకూట మిలో చేరినా ఫలం దక్కలేదు. ఎంతో అనుభవ మున్న కమ్యూనిస్టులు ఎలా చంద్రబాబు బుట్టలో పడ్డారో తెలియదు. 2014లో చంద్రబాబు మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారం సంపాదించారు. ఇలాంటి చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకో వడం, ఎన్నికల్లో చేతులు కలపడం పొరపాటని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు బహిరంగ ఆత్మ విమర్శ చేసుకోలేదు. కాపులకు ద్రోహం చేసింది ఎవరు? వామపక్షాలు పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపి, తృతీ యఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీపీఎం నేత బీబీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాది రిగా ఓట్ల కోసం వైఎస్ఆర్సీపీ ప్రజలను వంచిం చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంలో ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తామని ఈ పార్టీ గతంలోనే స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు కార ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము అంతకు మించి ప్రస్తుత రిజర్వేషన్ల అమలు చేయడం సాధ్యం కాదు కనుక చంద్రబాబులా ఓట్ల కోసం రిజర్వేషన్లు వచ్చేలా చూస్తామని చెప్పలేనని వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అంటే కాపు లను గాలికొదిలేశారని కాదు. వారికి తమ పరిధిలో ఎంత ఎక్కువ మేలు చేయగలనో అంత ఎక్కువగా చేస్తానని, కాపు కార్పొరేషన్‌కు నిధులు రెట్టింపు చేసి, కాపుల సంక్షేమానికి కృషిచేస్తానని కూడా చెప్పారు. నాలుగేళ్ల పాటు తానిచ్చిన కాపు రిజర్వేషన్ హామీని తుంగలో తొక్కిన తెలుగుదేశం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇలాంటి స్వభావం వైఎస్ఆర్సీపీది కాదు. అమలు చేయగలిగితేనే హామీ ఇవ్వాలి. వాగ్దానం చేశాక నిలబెట్టుకోవాలి. కాపు లకు మేలు జరిగే పోరాటానికి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్సీపీ హామీ ఇస్తూనే ఉంది. 2014లో చంద్రబాబు అవకాశవాద రాజకీయా లను మరోసారి ఆచరణలో అమలు చేసి విజయం సాధించారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, జనసేన మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చారు. ఈసారి ఈ తరహా రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు సాధ్యపడకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం అవి నీతి, అశ్రిత పక్షపాతం, అహంకార, ఆధిపత్య ధోర ణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. పైగా బాబుది మాటల గారడీయేగాని ఆయన కార్య శూరుడు కాదన్న భావన కూడా ఈ నాలుగేళ్లలో బలపడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి వ్యతి రేకంగా పడే ఓట్లు చీలిపోవాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. కిందటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ లకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్లేమీ రాని మాట నిజమే. అయితే, ఇంకా వామపక్షాలకు ప్రజల్లో ఎంత లేదన్నా ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా పేరు ప్రతిష్ట లున్నాయి. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యా మ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ చంద్రబాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది జరగని పక్షంలో ఎన్నో కూటములు, పార్టీలు ఎన్ని కల్లో పోటీ చేస్తే తన వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలు గుదేశం విజయం సాధిస్తుందని ఆయన భావిస్తు న్నారు. ఏదో దింపుడు కళ్లెం ఆశ చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో అవసరం తీరాక మిత్ర పక్షాలతో తెలుగుదేశం వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆస న్నమైంది. వ్యాసకర్త: డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
రెడ్‌స్టార్ మాదాలకు అశ్రునివాళి
హైదరాబాద్: అభ్యుదయ చిత్రాల కథానాయకుడు, రెడ్‌స్టార్ మాదాల రంగారావుకు బంధువులు, అభిమానులు, కమ్యూనిస్టు పార్టీల నేతలతోపాటు పలు పార్టీల కార్యకర్తలు, ప్రజానాట్యమండలి కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. మాదాల భౌతికకాయానికి రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నగరం నుంచి ప్రత్యేక వాహనంలో భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. మాదాల కుమారుడు రవి స్వయంగా పర్యవేక్షించి అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ అంతిమయాత్ర నిర్వహించారు. ‘ఎర్రసూర్యుడా..’ అంటూ విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. చితికి నిప్పంటించే ముందు ప్రజాయుద్ధనౌక గద్దర్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తమ గీతాలాపనలతో మాదాలకు ఘనంగా నివాళులు అర్పించారు. చితికి నిప్పంటించిన కుమారుడు, పలువురు ప్రముఖులు తండ్రి చనిపోతే కుమారుడు చితికి నిప్పంటించడం ఆనవాయితీ. కాగా, మాదాల రంగారావుకు మాత్రం కుమారుడు మాదాల రవితోపాటు సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రామకృష్ణ, బీవీ రాఘవులు, వందేమాతరం, ప్రముఖ సినీనటులు జీవితా రాజశేఖర్ దంపతులు వేర్వేరుగా చితికి నిప్పంటించారు. మాదాలకు ఇష్టమైన ఎర్రటి టీషర్ట్‌పైనే భౌతికకాయాన్ని చితిపైకి చేర్చి నిప్పటించడం విశేషం. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, సీపీఐ ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ బాషా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతోపాటు పలువురు సీపీఐ, సీపీఎం, ప్రజానాట్యమండలి ప్రతినిధులు, అభిమానులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
విశాల ఐక్యత నేటి అవసరం
కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ అనుకూల మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రు శిబిరంలో కలుపడమే కాకుండా ‘కమ్యూనిస్టులదే అంతిమ విజయం’ అనే భావనను సమర్థించకపోవడమే తీవ్ర తప్పిదం అంటే ఎలా? ఇటీవల రాజస్థాన్‌లో 2 లోక్‌సభా స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు స్థానాల్లో బీజేపీ పరాజయాన్ని చవిచూసింది. ఇంతకు ముందు ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆ విజయం బీజేపీకి గానీ, మోదీకి గానీ ప్రత్యేకించి పేర్కొనదగినది కాకపోగా, గతంలో కంటే తక్కువగా పోలైన ఓట్ల శాతంతో భారీగా నష్టపోయింది. ఆమేరకు కాంగ్రెస్ పార్టీ లాభపడింది. అదే విధంగా బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయమే సాధించింది. ఉపఎన్నికలను కొట్టి పారేయడం కుదరదు. బహుశా గతంలో రెండు సార్లు.. అధికారంలో ఉన్న పార్టీ ఉపఎన్నికలలో ఇలా ఓడిపోవడం జరగలేదు. అది రాజస్థాన్‌లో బీజేపీ మాత్రమే సాధించిన రికార్డు. అలాగే తమిళనాడులో జరిగిన ఇటీవలి ఉపఎన్నికలలో బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లకంటే కూడా తక్కువ వచ్చి, 1300 ఓట్లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఈ 67 ఏళ్ల రిపబ్లిక్ చరిత్రలో ఒక శాసనసభ ఉప ఎన్నికలో ఇంత తక్కువ ఓట్లు సాధించిన ప్రధాన జాతీయ పార్టీ ఏదీ లేదు. భారతదేశం వివిధ జాతుల సముదాయం అన్న వాస్తవాన్ని గుర్తించకుండా మొత్తం దేశాన్ని ఏకశిలా సదృశమైన అఖండ హిందూరాజ్యంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాను శాయశక్తులా అమలు జరిపేందుకు తీవ్రకృషి చేస్తోందని ఈ నాలుగేళ్ల బీజేపీ, మోదీజీల వ్యవహార శైలి వలన తేటతెల్లమవుతున్నది. దేశానికి ఈ పరిస్థితి దాపురించడానికి, బీజేపీ ఇంతటి స్థాయికి ఎదగడానికి, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైన అధ్వాన పాలన కారణమని ఇతర ప్రతిపక్షాలు సహజంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తాయి. ఆ విమర్శ వాస్తవమే. కానీ బీజేపీకి లేని బలాన్ని సంతరింపచేయడంలో మిగిలిన బీజేపీయేతర పార్టీల, వ్యక్తుల పాపం కూడా లేకపోలేదు. ఉదా.కు బిహార్‌లో నితీశ్ కుమార్ నిర్వాకం ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో కలిసి బిహార్‌లో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీని మట్టిగరిపించి గద్దెనెక్కిన నితీశ్ కుమార్ ఈ మధ్యనే తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన ఆర్జేడీకి, లాలూకు వెన్నుపోటు పొడిచి పచ్చి అవకాశవాదంతో బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా అందలం మీద కులుకుతున్న విషయం మనకు తెలిసిందే కదా. అవకాశవాదానికి మారుపేరు బాబు ఇక మన రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం వ్యవహారం తెలిసిందే కదా. వెన్నుపోటు అనే పేరుతో ఎవరైనా సినిమా తీయదల్చుకుంటే అది చంద్రబాబును ఉద్దేశించేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశమూ ఉంది. మోదీ అధికారంలో ఉండగా గుజరాత్లో మతకల్లోలాల సందర్భంగా 3 వేలమంది (అత్యధికంగా ముస్లింలు) మారణ హోమానికి గురైనప్పుడు మోదీ మన రాష్ట్రానికి వస్తే కారాగారంలో వేసి శిక్షిస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికిన విషయం తెలుగు ప్రజలు మర్చిపోలేదు. 2004 ఎన్నికలనాటికి వాజ్‌పేయితో, బీజేపీతో కలిసి ఎన్నికలలో జతకట్టి ఓటమి పాలైన సందర్భంగా ఇక బీజేపీతో ఎన్నికలపొత్తు పెట్టుకోనని రాజకీయ ప్రతిజ్ఞ చేసిన పెద్దమనిషి చంద్రబాబు. కానీ 2014 ఎన్నికల్లో ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి మోదీతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక వామపక్షాల పాత్ర కూడా బీజేపీ నేడు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడింది. నిజానికి బీజేపీకి, ఆ పార్టీ సైద్ధాంతిక స్ఫూర్తి ఆర్ఎస్ఎస్కు భావజాలపరంగా మార్క్సిస్టు దృక్పథంతోనే ప్రధమ శత్రుత్వం ఉంటోంది. ఈ నేపధ్యంలో మార్క్సిస్టులు పరస్పరం ఆ ఊరికీవూరు ఎంత దూరమో ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం అన్నట్లుగా ఉండటం సరైంది కాదు. ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ సభ్యత్వం లేనంత మాత్రాన తమకు తెలిసినంతలో మార్క్సిజం పట్ల నిబద్ధత కలిగి ఉంటున్నవారు–కమ్యూనిస్టు పార్టీల ఆచరణ, వాటి ఎత్తుగడల లోపాలపై విమర్శిస్తూ ఉండవచ్చు. అది మన పిల్ల వాడు తప్పు చేస్తుంటే హెచ్చరించడం, సరిదిద్దుకోమని చెప్పడం వంటిది. అలా విమర్శించినంత మాత్రాన ఆ వ్యక్తిని కమ్యూనిస్టు పార్టీకి శత్రువుగా పరి గణించడం సబబు కాదు. పొత్తు విషయంలోనే విభేదాలు! ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి, విభేదించాలి అనే సూత్రబద్ధతకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీల్లోనే అంతర్గతంగా చర్చలు, వాదాలు జరిగి ఓటింగ్ వరకు వెళుతున్న ఘటనలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలనే విషయమై పుచ్చలపల్లి సుందరయ్య సీపీఎంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో తీవ్ర చర్చ జరిగింది. 42 ఏళ్ల తర్వాత సీపీఎం పార్టీ అఖిల భారత మహాసభ జరగనున్న సందర్భంగా అలాంటి పరిస్థితే మళ్లీ ఏర్పడింది. మోదీ, షాల బీజేపీ పార్టీ మతతత్వ ధోరణులకు వ్యతిరేకంగా రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయంలో సీపీఎంలో విభేదాలున్నాయనే వార్త వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ వ్యతిరేక, బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని కూటమి ద్వారా పోరాడాలనీ, ఆ పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పోరాటంలో పాల్గొనే అర్హత కోల్పోయిందని అలాగే ఇతర పెట్టుబడిదారీ పార్టీలు కూడా కాంగ్రెస్ లాగే ఉదార ఆర్థిక విధానాలనే అనుసరిస్తున్నాయని, కనీస వామపక్షాలతో తప్ప ఇలాంటి వాటితో కలిసి వేదిక పంచుకునే ప్రశ్న రాదని, గతంలో విశాఖపట్నంలో చేసుకున్న తీర్మానానికే కట్టుబడి ఉండాలని, మునుపటి పార్టీ ప్రధాన కార్యదర్శి, నేటి పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ప్రతిపాదించారని వార్త. ఈ ఇరువురి వాదనల మధ్య ఓటింగులు జరిగి, ఒక దశలో ప్రకాశ్ వాదన నెగ్గిందని, తర్వాత కేంద్రకమిటీలో ఏచూరి వాదన నెగ్గిందని అయితే మహాసభ చివర జరిగిన కేంద్రకమిటీ భేటీలో తిరిగి ప్రకాష్ వాదనే 8 ఓట్ల తేడాతో నెగ్గిందని హిందూ పత్రికలో వార్త చూశాము. ప్రకాష్ కరత్ వాదన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ కాదు. కాంగ్రెస్ కూడా బీజేపీ అంత మొరటు మతతత్వ పార్టీ కాకపోయినా, కొంత సున్నితమైన మతతత్వ పార్టీయే అని కరత్ వాదన. ఇదే సమయంలో విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్లో, మోదీ మతతత్వ, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడిన పార్టీలన్నింటితోపాటు కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని పోరాడాలి అని తీర్మానం చేశారు. దానిపై సీపీఎం నుంచి సానుకూల స్పందన లేదు. కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు, సాధారణ కష్ట జీవులు, వర్ణ (కుల) వ్యవస్థ పద ఘట్టన కింద నలిగిపోతున్నవారు, మతోన్మాదంతో పాటు ఉదారవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా దైనందిన జీవనంలో అష్టకష్టాలు పడుతున్నవారు.. వీరందరూ కూడా రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కానరాని ఐక్యత విషయంలో నిస్పృహకు గురవుతున్నారు. వామపక్షాల ఐక్యత గురించి సీపీఐ, సీపీఎం తరచుగా ప్రబోధిస్తుంటాయి. కానీ ప్రస్తుత కీలక సమయంలో అయినా ఐక్యతకు భిన్నంగా ఉండే ప్రకటనల పట్ల కాస్త సమతుల్యతతో ఉండటం అవశ్యం. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ఆర్థిక విధానాల్లో కోటీశ్వరుల కొమ్ము కాస్తూ, నిరుపేదల పట్ల, దిగువ మధ్య తరగతి పట్ల నిర్లక్ష్యం వహించి సాధారణ ప్రజల జీవితం దుర్భరం చేయడం వాస్తవమే. దానికి తోడు బీజేపీ కరడుగట్టిన మతతత్వంతో హిందూ, హిందూయేతర ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచి హిందూ మత ఓటు బ్యాంకు కోసం పరమత ద్వేషాన్ని రెచ్చగొడుతూ, ప్రజానీకాన్ని మధ్యయుగాల అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగేళ్ల పాలనలో అది ఎన్ని దుశ్చర్యలకు పాల్పడిందో తెలిసిందే. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ కాదని చెబుతూ దాన్ని బీజేపీతో కలిపి ఒకే గాటన కట్టడం వాస్తవం కాదు. ఆ మాటకొస్తే మైనారిటీల తరఫున నిలబడినందువలన హిందూమతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న అపప్రథకు సీపీఎం కూడా గురైంది. అంత మాత్రాన అది నిజమేనా? మతతత్వ పాలనే ప్రథమ శత్రువు ఏది ఏమైనా మోదీ, షాల అప్రకటిత నియంతృత్వ పాలనను, దాని ఉన్మత్త ఏకశిలా సదృశ జాతీయతను, దాని శ్రామిక వ్యతిరేక సిద్ధాంతాన్ని, ప్రజల జీవనాన్ని అధోగతిలోకి నెడుతున్న మతతత్వ దుర్మార్గాన్ని వ్యతిరేకించడం ప్రస్తుతం అవసరం. నాడు అత్యవసర పరిస్థితిలో సుందరయ్య కూడా కాంగ్రెస్ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా జనతాపార్టీతో కలిసి వ్యవహరించడం తప్పు అనలేదు. అలా సాగిస్తూనే, ఉమ్మడి ఎన్నికల కార్యక్రమాలు, ఉపన్యాస వేదికలు పనికిరావని ఆయన హెచ్చరించారు. నేటి పరిస్థితిలో అదే వైఖరి సరైనదవుతుంది. వామపక్ష నాయకత్వాన ఇలాంటి ప్రయత్నం సాగాలి. ఈ సందర్భంలో ఎన్నో రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను, నేతలను కలుపుకురావాలి. అందుకు ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. తొలి పార్లమెంటులో నెహ్రూ ప్రధాని కాగా, సుందరయ్య ప్రధాన ప్రతిపక్ష నేత. నేడు పార్లమెంటులో పార్టీ స్థాయి ఎలా ఉంది? నేడు ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ కానీ, సీపీఎం కానీ ఒక్క స్థానాన్ని అయినా పొందగల స్థితి ఉన్నవా? అని కొందరు కమ్యూనిస్టులకు, సానుకూల తటస్థులైన మేధావులకూ సందేహాలుండే అవకాశం ఉంది. ఇలా పార్టీల క్షీణ స్థితిని గుర్తుచేసి జాగ్రత్తపడాలని హెచ్చరిస్తే అలాంటి వారిని బీజేపీ మేధావుల సరసన చేర్చి వ్యవహరించే వారిపట్ల కమ్యూనిస్టులు సైతం అప్రమత్తతతో ఉండాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి విప్లవాత్మకత కూడా ఈ పార్టీల నుంచి ఆశించే భౌతిక, స్వీయాత్మక స్థితీ నేడు లేదు. కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే కమ్యూనిస్టుల స్థితి మరింత ఆశాజనకంగా ఉండేదన్న సదుద్దేశంతో విమర్శించినంత మాత్రాన వారందరినీ శత్రుశిబిరంలో కలపటం భావ్యం కాదు. పైగా కమ్యూనిస్టులదే అంతిమ విజయం అనే భావనను సమర్థించకపోవడమే అలాంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదుల తీవ్ర తప్పిదమన్నట్లుగా హద్దులు దాటిన విమర్శనాస్త్రాలతో వ్యంగ్యంగా అపహాస్యం చేయబూనడం కమ్యూనిస్టు పార్టీల లక్ష్యాలను, వారి ఓర్పు నేర్పులను బూడిదలో పోసిన పన్నీరు చేస్తాయి. కమ్యూనిస్టులు తమను తాము ఒంటరి చేసుకునే అలాంటి తుంటరి పనులకు, రచనలకు, దూరంగా ఉండి ఆ మహత్తర కర్తవ్యంలో వీలైనంత మంది ప్రజానీకాన్ని రాసిరీత్యా, వాసి రీత్యా కూడా తమ మిత్రులుగా నిలబెట్టుకునే కృషి చేయడం చాలా అవసరం! - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
అవి కాలం చెల్లిన పార్టీలు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లినవని, దేశంలో ఆదరణ కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడం ఆ పార్టీల దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలు నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. చౌకబారు వ్యాఖ్యలతో సీపీఐ నేత నారాయణ వార్తల్లో ఉండాలనుకుంటున్నారని, ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. స్కిల్ ఇండియా ద్వారా రాష్ట్రంలోనూ లక్షలాది మందికి ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. -
‘ఉపాధి హామీ’ని నీరుగార్చే యత్నాలు: చాడ
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కొరతతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ చట్టాన్ని బలోపేతం చేసి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై హింస పెరుగుతున్నా, ఈ ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా, ఈ ఏడాది 1,983 కేసులు నమోదైనా, నివారించడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉస్తేల సృజన, ఎన్.జ్యోతి, ఎం.నళిని, ఎస్.ఛాయాదేవి, సదాలక్ష్మి పాల్గొన్నారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు
తిరుపతి తుడా: తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని అడ్డుకుంటారని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులను..కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. మన్నవరం తరలింపు యోచనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వామపక్ష శిబిరాన్ని పోలీసులు సోమవారం ముట్టడించారు. శిబిరంలో ఉన్న వారిని బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొందింది. పోలీసు చర్యలను కమ్యూనిస్టులు ప్రతిఘటించారు. మహిళలను సైతం ఈడ్చుకెళ్ళి వ్యాన్ ఎక్కించారు. గో బ్యాక్ వెంకయ్యనాయుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెసై ్టన వారిలో సీపీఎం, సీపీఐ జిల్లా నేతలు కుమార్‌రెడ్డి, రామానాయుడు, పెంచలయ్య, మహిళలు ఉన్నారు. -
ఏం సాధించారని సంబరాలు?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ప్రభుత్వమని.. ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు వాగ్దానాల అమలు సవ్యంగా లేదని విమర్శించారు. బుధవారం పార్టీ నాయకులు డీజీ నరసింహారావు, టి.జ్యోతి, జి.రాములుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కేజీ టు పీజీ అమలుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ ఏమాత్రం ముందుకు సాగడం లేదని, రెండు పడకల ఇళ్లకు అతీగతీ లేదని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో 4,5 లక్షల ఎకరాల రైతుల భూ మిని ప్రభుత్వం కాజేస్తోందని ఆరోపించా రు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 123, 214 ఏ విధంగా నష్టదాయకమో రుజువుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కొత్త జిల్లాల ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తోందని, అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదని అన్నారు. మేము అంతర్జాతీయ వాదులం... కమ్యూనిస్టు పార్టీలుగా తమది జాతీయస్థాయి కాదని, అంతర్జాతీయ వాదులమని ఒక ప్రశ్నకు తమ్మినేని బదులిచ్చారు. సీపీఎంకు జాతీయహోదా విషయంలో ప్రభుత్వం నిర్ణయించే ప్రాతిపదికలు వేరని, డబ్బు, కులం, మతం, తదితర అంశాలతో వీటిని నిర్ధారిస్తుంటారన్నారు. తమకు ప్రజ లు ఇచ్చే హోదాలే ముఖ్యమని, సీట్లు, ఓట్లు కాదని అన్నారు. -
సీమ సమస్యలపై తాడోపేడో తేల్చుకుంటాం
కర్నూలు(అర్బన్):రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి అంతుచూస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామక్రిష్ణ, పి.మధు హెచ్చరించారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సీమలోని సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గత నెల 20న చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభమైన బస్సు యాత్ర శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో భారీ ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల జిల్లా కార్యదర్శులు కె.ప్రభాకర్‌రెడ్డి, కె.రామాంజనేయులు అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరి ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. చంద్రబాబుది నాలుకా.. తాటిమట్టా కర్నూలు జిల్లా అభివృద్ధికి 27 వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుది నాలుకా.. లేక తాటిమట్టా ? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ..రెండేళ్లు అవుతున్నా అభివృద్దిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారడన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ స్థానంలో కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎలాంటి రాజకీయ విలువలు లేవన్నారు. రూ.27,350 కోట్లు అడిగితే రూ.50 కోట్లు ఇస్తారా? రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కోసం రూ.27,350 కోట్లు ఇవ్వాలంటే, కేవలం జిల్లాకు రూ.50 కోట్లు ఇస్తే అభివృద్ధి సాధ్యమవుతుందా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ప్రశ్నించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో వందలాది మంది రైతులు, చేనేత కార్మికులు ఆకలి చావులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి కరువు, ప్రజల ఇబ్బందులను చూసి పాలకులు తల వంచుకోవాలన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వల్ల పాలెగాళ్ల రాజ్యం వస్తుందే తప్ప, ఎలాంటి అభివృద్ధి జరగదరన్నారు. సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, రాయలసీమ సబ్ కమిటీ సభ్యులు జి.ఓబుల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, సీపీఐ నగర కార్యదర్శి ఎస్ఎన్ రసూల్, జిల్లా సమితి సభ్యులు ఎస్.మునెప్ప, సీపీఎం నగర కాార్యదర్శి గౌస్‌దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు, రాయలసీమ కన్నీటి గాథలపై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సభకు ముందు నంద్యాల చెక్‌పోస్టు నుంచి సభాస్థలి వరకు కామ్రేడ్లు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. -
సైద్ధాంతిక విస్మృతి కమ్యూనిస్టులకు ‘శాపం’!
విశ్లేషణ మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత పెరగవలసిన ప్రస్తుత దశలో అవి మరింతగా బలహీన పడుతున్నాయి. కొద్దిమాసాల క్రితం జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికలూ, నిన్నా మొన్నటి బీహార్ ఎన్ని కలూ, నేటి వరంగల్ ఎన్నికల దాకా వామపక్షాల పాత్ర, వాటి వైఫల్యాలు మనం గమనించినవే. పైగా మితవాద బి.జె.పికి ప్రత్యామ్నాయ వేదికగా ఢిల్లీ, బిహార్ ఎన్ని కలలో కొన్ని పార్టీలు ముందుకొచ్చారు. కానీ బి.జె.పిని విమర్శించడంలో ముందుండే వామపక్షాలు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పోషించిన పాత్ర ఏమిటి? ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, ఉనికిని కాపాడుకోవడం పేరిట విడిగా సంఘటనలు కట్టి ఎన్నికల గోదాలోకి దిగాయి. కాగా, సుదీర్ఘకాలంపాటు ఈ పార్టీలు ప్రతి ఎన్నికలలోనూ ఏదో ఒక బూర్జువా పక్షంతో జట్టుకడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా ఇప్పుడు తమ మహాసభలలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక ముందు ఏ బూర్జువా పక్షం తోను ఎన్నికల పొత్తులు పెట్టుకోబోమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అయితే విడిగా సంఘటనలు కట్టి పోటీ చేసిన ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో కూడా అవి డిపాజిట్ లను కూడా కోల్పోయి పరాజయం పాలవడం గమ నార్హం. ఇక తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల అభ్యర్థి సంపాదించిన ఓట్లకంటే దరిదాపు రెట్టింపు ఓట్లను ‘‘శ్రమ శక్తి పార్టీ’’గా పోటీ చేసిన అభ్యర్ధి పొందడాన్ని కూడా గుర్తించాలి. మరి ఇంతటి దారుణ వైఫల్యాల దిశగా వామ పక్షాలు ఎందుకు దిగజారాయి? అనేకమంది విమర్శిస్తున్నట్లుగా ఈ పార్టీల ‘‘పిడివాదమా’’? లేకుంటే ఆ పార్టీలే తరచుగా తమ ఆత్మవిమర్శన డాక్యుమెంటులలో పేర్కొనే ‘పార్లమెంటరిజంకు లోనవ్వడం’ అనే బలహీనతా? ఈ ప్రశ్నకు జవాబును చెప్పుకోకుండా, భవిష్య త్తులో కూడా కమ్యూనిస్టు పార్టీలు పురోగమించడం అసాధ్యం! కాగా కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ బలహీనతలకు లోనయ్యాయనే వాదనలో కొంత నిజం ఉన్నా, ఈ కారణం వామపక్షాల వైఫల్యానికి సంబంధిం చిన మూలాలను సంపూర్ణంగా చూడడానికి సరిపోదు. భారత్‌తో సహా వివిధ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం వెనుక కారణాలను మనం కేవలం పార్ల మెంటరిజంలోనే కాక ఇతరేతరంగా కూడా చూడాలి. కమ్యూనిస్టులు పార్లమెంట్లలో పాల్గొనటానికి సంబంధించి రష్యా విప్లవ క్రాంతదర్శి లెనిన్ పదే పదే ప్రస్తావించిన ఒక అంశం ‘‘పరిస్థితి విప్లవకరంగా లేనపుడు కూడా, విప్లవకర మనోస్థితిని కలిగి ఉండడమే నిజమైన విప్లవకారుడి లక్షణం’’. పార్లమెంటరీ రాజకీ యాలవంటి ఏ మాత్రం రొమాంటిసిజం లేని పోరాట పద్ధతులలో పాల్గొంటూనే, కమ్యూనిస్టులు తమ పోరాట మనోస్థితిని కాపాడుకోగలగాలన్నది దీని సారాంశం. లెనిన్ వివరించిన మరో అంశం: ‘‘విమర్శ.. అత్యంత తీక్షణమైన, నిర్దాక్షిణ్యమైన, రాజీలేని విమర్శ పార్లమెంటరిజం మీదా, పార్లమెంటరీ కార్యకలాపాల మీదా కాక, పార్లమెంటరీ ఎన్నికలనూ, పార్లమెంటరీ వేదికనూ విప్లవ, కమ్యూనిస్టు పద్ధతిలో వినియోగించు కోవడం చేతకాని నాయకులమీద, అంతకంటే ఎక్కు వగా ఇష్టం లేని నాయకులమీద చేయాలి...’’ స్థూలంగా కమ్యూనిస్టు సిద్ధాంతం పార్లమెంటరిజానికి సంబం ధించీ, పోరాట మనోస్థితి గురించి చెబుతున్నదాని సారాంశం ఇది! కాబట్టి మన కమ్యూనిస్టు పార్టీలు తమ లోపాలకు పార్లమెంటరిజాన్ని సాకుగా చూపటం కూడా సైద్ధాంతిక బలహీనతే. దీంతోనే కమ్యూనిస్టు పార్టీల పరి స్థితి ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మేదిగా’ మారిపోయింది. వామపక్షాలు తమ సైద్ధాంతిక మూలాలనుంచి దూరంగా జరిగిపోవటం, అంతకు మించి వాటికి ఏర్ప డిన సైద్ధాంతిక విస్మృతిలోనే వాటి బలహీనతలు, పత నానికి మూల కారణాలున్నాయి. ఈ అంశాన్ని పరిశీ లిద్దాం. 1939- 45 నాటి రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ చారిత్రక విజయంతో తూర్పు యూరోప్‌లో ఒక సోషలిస్టు శిబిరమే ఏర్పడటం వంటివి ప్రపంచ పరిస్థితిలో గణనీయమైన మార్పును తెచ్చాయి. ఆ కాలంలో వివిధ దేశాలకు చెందిన పలువురు నేతలూ, ప్రజలూ సోవియట్ అభిమానులయ్యారు. తమ తమ దేశాలకు సంబంధించి ఎటువంటి లోతైన, సమగ్ర పరిశీలనా, అధ్యయనం లేకుండానే ప్రత్యక్షంగానో, పరో క్షంగానో సోవియట్ యూనియన్ దిశానిర్దేశంలో నడవ డం అనేది అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలకు అలవా టుగా మారింది. ఈ పార్టీలూ, వాటి నాయకత్వంలో అధికభాగం పరిమాణాత్మకంగా ఎదిగాయే కానీ, వాటి సైద్ధాంతిక పటిమ మాత్రం క్షీణించింది. ఈ క్రమంలోనే, 1991లో సోవియట్ పతనంతో ఈ పార్టీలు మరింత తీవ్ర అస్థిత్వ సమస్యలోకి పడిపో యాయి. గతంలోలాగా కనీసం పడికట్టు మాటలూ, నినాదాలూ, యాంత్రికమైన పనితీరు నిర్వహించిన స్థాయిలో కూడా ఈ పార్టీలు నిలబడలేకపోయాయి. చివరికి పరిస్థితి నిన్నటి ‘‘ఇలా మిగిలాం’’ దశ నుంచి నేడు ‘ఇలా మిగిల్చారు’ దశకు చేరింది. అంటే, కమ్యూ నిస్టు పార్టీలు తమ ప్రభను కోల్పోవడానికీ కారణం ఆ పార్టీల అంతర్గత సైద్ధాంతిక డొల్లతనంలోనే అధికంగా ఉంది. దాంతో వాటి స్థితి నేడు సంపూర్ణంగా దిగ జారింది. అందుకే నేడు విప్లవాలూ, పెనుమార్పులూ ప్రపంచంలో ఎంత అవసరం అనేది పక్కన పెడితే, మనుగడ కొనసాగింపు కోసం కమ్యూనిస్టు పార్టీలలో అంతర్మథనం రూపంలో విస్పోటనలు కచ్చితమైన అవసరం. ఇది జరిగి, ఆ పార్టీలు నిలబడలేకపోతే, చరిత్ర తన ముందడుగుకు కావల్సిన శక్తులను తానే సృజించు కుంటుంది. లాటిన్ అమెరికాలోను, పలు చోట్ల జరుగు తోంది ఇదే. కాబట్టి, ఇతర పాలక పక్షాల గెలుపోటము లను నిర్ణయించగల తమ నిన్నటి స్థితినీ, స్థాయినీ కూడా కోల్పోయిన భారత కమ్యూనిస్టు పార్టీలు ఇక కోల్పోయేందుకు ఏముంది? డిపాజిట్లు మినహా... అని ప్రజ లు భావించే దుస్థితి నుంచి బయటపడేందుకు ఉన్న ఒక ప్రధాన మార్గం ఏదంటే.. ఎన్నికలలో పోటీల గురించీ, దీర్ఘ దృష్టిలేని రాజకీయ కార్యాచరణ గురించి కాక ఆత్మ విమర్శతో కూడిన ఒక సుషుప్తావస్తలోకి, అంతఃస్థితిలోకి కొంతకాలం పాటైనా వెళ్ళడమే...! (వ్యాసకర్త: డి.పాపారావు, సామాజిక విశ్లేషకులు సెల్: 9866179615) -
కులాన్ని మరచి దారి విడిచి..?
కొత్త కోణం ఒక సామాజిక వ్యవస్థగా కులాన్ని అర్థం చేసుకుంటేనే దాన్ని నిర్మూలించగలం. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే కమ్యూనిస్టులు కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణ కు దిగలేకపోయారు. కలిసివచ్చే శక్తులన్నిటితో ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యారు. భారత దేశ చరిత్రంతా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రేనన్న అంబేద్కర్ విశ్లేషణను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో గత చరిత్రను విస్మరించి, భవిత కోసం చీకట్లో వెతుకులాట సాగించాల్సి వస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి తొమ్మిది దశాబ్దాలు దాటింది, నూరేళ్ళ పండుగకు చేరువవుతున్న ఈ సమయంలో మన దేశంలో కమ్యూ నిస్టు ఉద్యమ గమనాన్ని, పురోగమనాన్ని ఒక్కసారి పునరావలోకనం చేసుకో వడం అవసరం. తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నో మలుపులను, మరెన్నో అనుభవాలను చవిచూసింది. మహాప్రవా హంగా ప్రారంభమైన ఉద్యమం అనేక పాయలుగా విడిపోయింది. అయినా అన్నిటి తల్లి వేరు మార్క్సిజమే. కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీలపైనా, వాటి కార్యాచరణపైనా రకరకాల అభిప్రాయాలు న్నాయి. ఏది ఏమైనా, భారత రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం గణనీయంగా ఉంది. 1925లో ప్రారంభమైన కమ్యూనిస్టు ధార ఎన్నో ప్రవాహాలను సృష్టించింది. ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ మహా ప్రవాహంలోని ఒక జలపాతమే. సైద్ధాంతిక అవగాహనే తప్పు 1970లలో మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం పేరుతో నూతన శక్తిగా ఆవిర్భవించిన నక్సలైటు పార్టీలు సైతం అన్ని రంగాల్లో తమదైన ముద్రను వేసి, మార్క్సిజానికి నూతన జవసత్వాలనందించాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలలో పలువాటిపై కమ్యూనిస్టు, మార్క్సిస్టు భావజాలం చెరగని ముద్ర ఉన్నదనడం నిస్సందేహం. కమ్యూనిస్టు పార్టీలను అంటిపెట్టుకొని ఉంటూ వచ్చిన ప్రజానీకంలో తొంభై శాతం అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవారే... ప్రధానంగా దళితులు, ఆదివాసులు. అయితే కులం విషయంలో కమ్యూనిస్టులు అనుసరించిన విధానం సైద్ధాంతికంగా సరైనది కాదు. ఫలితంగా ఈ శక్తులన్నీ క్రమేణా కమ్యూనిస్టు పార్టీలకు దూర మవుతూ వచ్చాయి. సీపీఐ, సీపీఎం నుంచి విప్లవ పార్టీల దాకా అందిరిదీ కులాన్ని ఒక సామాజిక సమస్యగా చూసే ధోరణే. కానీ ఒక సామాజిక వ్యవస్థగా కులాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటేనే దాన్ని నిర్మూలించే మార్గాలను కనుగొనగలం. కమ్యూనిస్టులు కులాన్ని వ్యవస్థగా గుర్తించి ఉంటే, వారి కార్యాచరణే వేరుగా ఉండేది. ఈ అవగాహనా రాహిత్యం ఫలితంగా.. కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణను రూపొందించుకోలేకపోయాయి. ఈ పోరాటంలో కలిసివచ్చే శక్తులన్నిటినీ గుర్తించి, ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో విఫలం చెందాయి. ఇక్కడే భారతదేశ సామా జిక వ్యవస్థను అర్థం చేసుకోవడంలో మన కమ్యూనిస్టు పార్టీలన్నీ విఫలమ య్యాయి. ‘ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే’ అని మార్క్స్ అన్నాడంటారే గానీ, భారత దేశ చరిత్ర అంతా కుల వ్యవస్థకు, ప్రత్యేకించి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్రేనంటూ అంబేద్కర్ చేసిన విశ్లేషణను పరిగణనలోకైనా తీసుకోం. పర్యవసానంగా గత చరిత్రను విస్మరించి, భవిత కోసం చీకట్లో వెతుకులాట సాగిస్తున్నాం. కుల వ్యతిరేక పోరాటల చరిత్రే ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవం 2,500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుని నాయకత్వంలో జరిగింది. అశోకుడి పాలనలో అది వ్యవస్థీకృత మైంది. ప్రతీఘాతుక విప్లవం ద్వారా బ్రాహ్మణిజం లేదా నేటి హిందూ మతం తిరిగి ఆధిపత్యాన్ని సాధించింది. వర్ణ వ్యవస్థగా ప్రారంభమైన అంత రాల వ్యవస్థ కుల వ్యవస్థగా స్థిరపడింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిరం తర పోరాటాలు జరిగాయి. మత సంస్కరణ ఉద్యమాలుగా కనిపించే అవి... బ్రాహ్మణిజాన్ని సవాలు చేసి, కుల వ్యవస్థ పునాదులనే ప్రశ్నించాయి. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దినాటి అశ్వఘోషుడి ‘వజ్రసూచి’ నుంచి, ఆ తర్వాతి కాలంలో బసవేశ్వరుడు, రామానుజుడు, కబీర్, నానక్, వేమన, బ్రహ్మం గారు, ఆధునిక కాలంలో ఫూలే, అయోతీదాస్, అయ్యంకాళి. నారాయణ గురు, భాగ్యరెడ్డి వర్మ, రామస్వామి నాయకర్, సాహు మహారాజ్‌ల ప్రతిఘటనోద్యమాలు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. వీటి పునాదుల మీదనే, ప్రజాస్వామ్య వ్యవస్థ లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ సాగించిన పోరాటాలు కులవ్యవస్థను నైతికంగా దెబ్బతీయగలిగాయి. తరతరాలుగా సమాజంపై ఆధిపత్యం వహించిన మనుస్మృతిని పాతరేసి, సమానత్వ ప్రాతిపదికపై రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది. కుల వ్యవస్థను కూల్చే దారి ఇదే కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు సమస్యల ప్రాతిపదికపై కులానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాయి. పలు విజయాలను సైతం సాధించాయి. భూమి సమస్య, అంటరానితనం, వెట్టిచాకిరీ, కూలి రేట్ల సమస్యలపై ఆధిపత్య కులా లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాయి. వాటినే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలన్నారు. అయితే ఇవేవీ హిందూ మతం పునాదులపై ఏర్పడిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలని అవి గుర్తించలేకపోవడం ఒక విషాదం. కాగా, సమాజాన్ని వ్యాఖ్యానించడం కాదు, దాన్ని మార్చడమెట్లా అనేదే ముఖ్యమని మార్క్స్ చెప్పినట్టే... కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను శోధించి, దాన్ని నిర్మూలించే కార్యక్రమాన్ని అందించినది అంబేద్కర్. కులవ్యవస్థ ప్రభావం, పరిణామాలపై ఆయన సవివరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఆధిపత్యం కొనసాగింపుగానే కులవ్యవస్థ ఉనికిలో ఉన్నదనీ, అది శ్రమ విభజనకు గాక, శ్రామికుల విభజనకు పూనుకున్నదనీ ఆయన తెలిపారు. ప్రజల మధ్య అది అంతరాల దొంతరలను తయారు చేసింది. వాటికి హెచ్చుతగ్గులను ఆపాదించి, ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయిం చడానికి అవసరమైన నియమాలనే ధర్మంగా చలామణి చేసింది. హిందూ మతం అందుకు తాత్విక భూమికను అందించింది. ఫలితంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో నిచ్చెన మెట్లలాంటి కులవ్యవస్థ పై మెట్టున ఉన్న కులాలకు ఆస్తి, అధికారం, హోదా, స్థాయి, జ్ఞానం మీద గుత్తాధిపత్యం లభించాయి. సేవలు చేయడం, అట్టడుగున పడి ఉండడమే తమ పూర్వజన్మ కర్మగా భావించేట్టుగా కింది కులాల మెదళ్లను తయారు చేశారు. అందుకే మన దేశంలో కులాలను బట్టే పేదరికం, నిరక్షరాస్యత, నిరు ద్యోగం, అణచివేత, అనారోగ్యం, పంపిణీ జరిగింది. కులం అన్ని రంగా లనూ ప్రభావితం చేస్తున్నది. రాజకీయ రంగంలో సైతం కులాలను బట్టే హోదాలు లభిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కొన్ని కులాల గుత్త సొత్తుగా మారాయి. జ్ఞానం కూడా కులం ప్రాతిపదికపైనే అందుబాటులోకి వస్తున్నది. ఒకరకంగా చెప్పాలంటే, కుల వివక్ష, అణచివేతలే మన దేశ ప్రాథమిక సమస్యలన్నిటి కీ కారణాలని చెప్పాల్సి ఉంటుంది. కులాన్ని సమాజంలో వేళ్లూనుకున్న ఒక వ్యవస్థగా అర్థం చేసు కోవాలి. అప్పుడు మాత్రమే కుల వ్యతిరేక పోరాటం బహుముఖంగా సాగాల్సి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించగలుగుతాం. కులాన్ని ఒక చిన్న సమస్యగా చూడడం వల్లనే విస్తృతంగా, లోతుగా పాతుకుపోయిన దాని వేళ్ళను గుర్తించడంలో విఫలం అవుతున్నాం. దీని నుంచి బయటపడాలి. ఇందుకు అంబేద్కర్ సిద్ధాంతాలే మార్గదర్శకాలు. ‘‘అధికారం అంటే ఆర్థికాధికారం ఒక్కటే అనే సిద్ధాంతాన్ని మానవ సమాజ చరిత్ర పరిశోధకులెవ్వరూ ఒప్పుకోరు. భారతదేశంలో పైసాలేని సాధువులకు కోటీశ్వరులు విధేయులై ఉండడమే దీనికి నిదర్శనం. మతం సమస్తాధికా రాలకు మూలాధారమనే సత్యాన్ని భారత చరిత్ర అంతా నిరూపిస్తూనే ఉంది’’ అన్న అంబేద్కర్ మాట అక్షర సత్యం. అంబేద్కర్ ఆదర్శ సమాజమే మార్గం కులాన్ని ఒక సమస్యగా భావించి, కుల వివక్ష, అణచివేతలను రాజకీయా ధికారం ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయంతోనే కమ్యూనిస్టులు ఇంతవరకూ ఉన్నారు. అంబేద్కర్ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘‘విప్లవానికి ముందే కుల వ్యవస్థతో కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఢీ కొనక పోతే, విప్లవం తరువాతయినా వారు దానితో తలపడక తప్పదు. మరొక విధంగా చెప్పాలంటే, నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారేస్తే తప్ప రాజకీయ సంస్కరణనుగానీ, ఆర్థిక విప్లవాన్నిగానీ సాధించలేవు’’ అంటూ ఆయన కుల వ్యవస్థ నిర్మూలన ప్రాధాన్యతను వివరించారు. అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక వర్గాలూ, సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు, విప్లవకారులు కుల వ్యవస్థ నిర్మూలన ప్రాతిపదికపై ఉద్యమించాల్సిన అవసరమున్నది. అంబేద్కర్ ప్రతిపాదించిన ఆదర్శ సమాజం దానికి ఉమ్మడి ప్రాతిపదిక కాగలిగితే బాగుంటుంది. ‘‘కులం అక్కరలేదనుకుంటే మరి మీరు చెప్పే ఆదర్శ సమాజం ఎలాంటిదని ఎవరైనా అడిగితే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు లక్ష్యాల మీద ఆధారపడిన సమాజమని నేనంటాను. ఆదర్శ సమాజం మార్పునకు అనుకూలమైనదిగా ఉండాలి. స్తబ్దుగా ఉండకూడదు. ఒక చోట మార్పు జరిగితే, ఆ మార్పు మిగతా విషయాలపైన ప్రభావం కలిగించాలి’’ అని ఆయన వివరించారు. ఆ ఆదర్శ సమాజం ప్రాతిపదికగా, కమ్యూనిస్టులూ, సామాజిక ఉద్యమాలూ, సంస్థలూ ఐక్యం కావాల్సిన అవసరమున్నది. ఈ తొంభై సంవత్సరాల కమ్యూనిస్టు అనుభవం నుంచి ఈ గుణపాఠాన్ని నే ర్వగలిగితే భారతదేశం దశ, దిశ మారుతాయి. (వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213) -
ఏపీకి ప్రత్యేక హోదా సీరియస్ అంశం
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ నాయకుల సమావేశాన్ని తప్పుపట్టడం అర్థరహితమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయవాద దేశభక్తి సంస్థ అని ఆయన గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరుపై ఆ సంస్థ సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.... ఆర్ఎస్ఎస్ నేతలతో తమ ఆలోచనలు పంచుకున్నామని చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఎటువంటి తీర్మానాలు మాత్రం జరగలేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సీరియస్ అంశమని తెలిపారు. ఆ అంశాన్ని ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌కు అప్పగించారని పేర్కొన్నారు. విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది.... ఆ తర్వాత సరిదిద్దే ప్రయత్నాలు చూడా చేయలేదని వెంకయ్యనాయుడు ఆ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానిని పక్కనపెట్టి 10 జన్‌పథ్ ఆదేశాలు ఇచ్చేది ఎద్దేవా చేశారు. విజయవాడ దుర్గమ్మ వారధికి తమ ప్రభుత్వం రూ. 330 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. త్వరిత గతిన ఈ నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను కోరామన్నారు. విజయవాడ మెట్రో రైలుపై కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కమ్యూనిస్టులు రష్యా, చైనా దేశాలకు వెళ్లి మార్గదర్శకాలు తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో తమ పార్టీపై... తమ నేతలపై కమ్యూనిస్టులు మాట్లాడే అర్హత లేదని వెంకయ్య చెప్పారు. -
రాష్ట్రాలు రెండు.. కష్టాలు మెండు
విశ్లేషణ తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమ పునర్వైభవానికి లభించిన ఆ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. కాగా ఏపీలోని బాబు టీడీపీ ప్రభుత్వం రైతు, శ్రామిక వ్యతిరేకిగా తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది. భూసేకరణ పేరిట అది రైతుల భూములను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతోంది. కమ్యూనిస్టులే చొరవ చూపి విపక్షాల తో కలసి సమరశీల పోరాటాలు చేపట్టడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు రెండయ్యాయి. ఆ చరిత్రను చర్విత చరణంగా చెప్పుకోవడం అనవసరం. అయితే ఆ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీలు చూపిన అవగాహన, ఆచరణలను విస్మరిస్తే రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కో వడం, ఉద్యమాన్ని పురోగమింపజేయడం అసాధ్యం. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండు పట్ల సానుకూలంగా స్పందించడంలో కమ్యూనిస్టులు, ప్రత్యేకించి సీపీఎం నేతలు పూర్తిగా విఫలమయ్యారు. కొంత తాత్సారం చేసైనా సీపీఐ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి మద్దతునిచ్చింది. ఏదేమైనా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ, మరి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆ ఉద్యమ నేత కేసీఆర్ నిరంకుశ స్వభావాన్నే చూసి తెలంగాణ సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, భిన్న సామాజిక వర్గాలు, కవులు, కళాకారులు, మహిళలు ముక్త కంఠంతో వ్యక్తపరుస్తున్న మనోభావాలను గుర్తించి, గౌరవించి అండదండ లందించడంలో విఫలమయ్యాయి. పుట్టుకతో సంక్రమించిన వ్యాధి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితిని ‘అంతర్గత వలసవాదం’గా అభివర్ణిం చడం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ నీరు, ఉద్యోగాలు, విద్యా ఉపాధి అవకాశాలు తదితర మౌలిక జీవనాధార రంగాల్లోని వివక్షనే గాక, సంస్కృతి కంగా కూడా దశాబ్దాల తరబడి హేళనను ఎదుర్కొన్న ప్రజలు పడ్డ ఆవేదన తక్కువేమీ కాదు. ఈ వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉండివుంటే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. తెలంగాణలో కమ్యూ నిస్టు ఉద్యమ పునరుజ్జీవనానికి లభించిన గొప్ప అవకాశాన్ని కమ్యూనిస్టులు చేజార్చుకున్నారు. సీపీఎం క్యాడర్లు, దిగువ స్థాయి నేతలు పలువురు ఈ అంశాన్ని గుర్తించినా కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నిరంకుశ త్వం వారి చేతులను కట్టేసింది. భాషాప్రయుక్త రాష్ట్రాలనే యాంత్రిక అన్వ యంతో సీపీఎం ఉలిపికట్టెగా మిగలడం విషాదం. మన దేశంలోని జాతుల సమస్య లోతుపాతులకు వెళ్లడాన్ని ఈ వ్యాస పరిధి అనుమతించదు. అయినా ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు. అయితే అటూ, లేకపోతే ఇటూ అంటూ ఏదో ఒక కొసకు కొట్టుకుపోకుండా సమతుల్యంతో వ్యవహరించలేకపోవడం అనే వ్యాధి మన కమ్యూనిస్టు పార్టీలకు పుట్టుకతోనే సంక్రమించింది. లెనిన్ రష్యా పరిస్థితులకు చెప్పిన విడిపోయే హక్కుతో సహా జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని మన కమ్యూ నిస్టులు ఒక దశలో మక్కీకి మక్కీగా మన దేశంలోనూ అన్వయిం చారు. ఇక ఇటీవలి కాలంలో ప్రభువుని మించిన ప్రభుభక్తిని ప్రదర్శి స్తూ...‘‘మా దేహం ముక్కలైనా సరే, దేశాన్ని ముక్కలు కానివ్వం’’ అనే వైఖరి చేపట్టారు. ఫలితంగా సామ్రాజ్యవాద అనుకూల గుత్తాధిపతుల పాలనలోని వివిధ ప్రాం తాల, భాషల, ఉపజాతుల, జాతుల న్యాయమైన కోర్కెలను సైతం గుర్తించ లేని అంధత్వం ఆవహించింది. నేటికీ రగులుతున్న ఈశాన్య భారతం, కశ్మీర్ మొదలు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం వరకూ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ముందుకొస్తున్న జాతుల సంఘర్షణలన్నిటి మధ్య సమకాలిక సమన్వయాన్ని సాధించగల సృజనాత్మకత చింతన కమ్యూనిస్టు నాయకత్వాలకు కొరవడింది. ఇది సమకాలీన భారత భౌతిక వాస్తవిక పరిస్థితులను, వాటి ప్రాధాన్యాన్ని చిన్నచూపు చూస్తూ... ఎప్పుడు దప్పికైతే అప్పుడు బావి తవ్వడానికి పూనుకునే ప్రాప్తకాలజ్ఞతకు చిరునామాగా మన కమ్యూనిస్టు పార్టీలు మారాయి. సీపీఎం 21వ జాతీయ మహాసభల ముసా యిదా తీర్మానం ఇంత స్పష్టంగా కాకున్నా ఈ విషయాన్ని గుర్తించింది. తెలుగు ఐక్యతలోని భిన్నత్వం రాష్ట్ర విభజన తర్వాతే రెండు ప్రాంతాల మధ్య భౌతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్లోని భిన్నత్వం వెలుగులోకి వస్తోంది. ‘జాతి’ నిర్వచనంలో భాష ప్రధానాంశం గనుక సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను రెండు జాతులనలేం. ఆంధ్రప్రాంతమంతా ప్రత్యక్షంగా ఆంగ్లేయుల పాలన కిందున్నప్పుడు తెలంగాణ నిజాం సంస్థానంలో భాగంగా ఉంది. సీమాంధ్ర లోని ఆంధ్ర తీరప్రాంతంగా కాగా, తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం. వ్యవసాయాభివృద్ధిలోని భిన్నత్వానికి అది ఒక ముఖ్య కారణం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్య చారిత్రక భూమిక. నాటి పోరాటానికి ఆంధ్ర ప్రాంతం అండదండై నిలిచింది, త్యాగాలు చేసింది. సీమాంధ్రలో ‘సంక్రాంతి’ పెద్ద పండుగైతే, తెలంగాణలో ‘బతుకమ్మ’ గొప్ప పండుగ . ఇరు ప్రాంతాల ప్రజలు మాడ్లాడేది భిన్న మాండలీకాలతో కూడిన తెలుగు భాషే. అయినా ఇటీవలి వరకు తెలంగాణ తెలుగు సినిమాల్లో అవహేళనకు గురైంది. నాకు తెలిసినంతలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా ఏ తెలంగాణ నేత విగ్రహమూ సీమాంధ్రలో ఎక్కడా లేదు. కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి తదితర సీమాంధ్ర నేతల విగ్రహాలే కాదు, వారి పేర్లతో పార్కులు సైతం తెలంగాణలో కనిపిస్తాయి. తెలంగాణలోని ఉన్నతోద్యోగాలన్నిటి లోనూ సీమాంధ్రులు సాపేక్షికంగా అధికం. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి అందుకు భిన్నం. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వ్యతిరేక ఐక్య పోరు అవశ్యం ఒకప్పుడు ఉమ్మడి రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పరిపాలనా ప్రభలను వెలిగించిన చంద్రబాబు తెలుగుదేశం నేటి ఏపీలో అధికారం నెరపుతోంది. రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా అది తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది కూడా. ‘‘నేనిచ్చిన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడింది’’ అని అక్కడా, ‘‘అన్యాయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని’’ ఇక్కడా... ఏ రోటికాడ ఆ పాట పాడగల నీతి చంద్రబాబు సొంతం. కాబట్టి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌లను కలుపుకొని ఐక్య పోరాటాలను సాగించాలి. అంతేగానీ ‘ప్రత్యేక హోదా’ను కోరుతూ అఖిల పక్షాన్ని తీసుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలంటూ ఆయన వెనుక నిలవాల్సిన అగత్యం లేదు. రుణ మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల వాగ్దానాల అమలుకై కమ్యూనిస్టు పార్టీలే చొరవచేసి విపక్షాలతో కలసి సమైక్య పోరాటం చేపట్టడమే అత్యుత్తమం. పైగా భూసేకరణ పేరిట బాబు ప్రభుత్వం నిరంకుశంగా రైతుల భూములను హరించి విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకున్న నేపథ్యంలో అలాంటి ఐక్య, సమరశీల పోరాటాలు సాగించే అవకాశాలు, ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల సమన్వయం తెలంగాణ సామాన్య ప్రజానీకంలో టీఆర్ఎస్, కేసీఆర్‌లను తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఇంకా బలంగానే గుర్తింపుంది. కేసీఆర్‌పై రైతు వ్యతిరేక ముద్రా లేదు, ఆయన పాలనపట్ల అంత పెద్ద వ్యతిరేకతా లేదు. కాబట్టి కమ్యూని స్టులు కేసీఆర్‌ను తక్షణ లక్ష్యంగా చేసుకొని పోరాడగల పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్ఎస్ సాధారణ అభిమానులుగా ఉన్నవారు సైతం ఆవశ్యకమైనవిగా భావించే వివిధ సమస్యలపై, రంగాల్లో ఐక్య ఉద్యమాల నిర్మాణానికి తగు రూపాలను ఎంచుకోవాలి. ‘సమైక్య’ వైఖరి వల్ల పార్టీకి, ప్రజలకు మధ్య ఏర్పడ్డ అగడ్తను పూడ్చుకోవడంపై ముందుగా సీపీఎం దృష్టిని కేంద్రీకరిం చాలి. సామాజిక రంగంలో ప్రత్యేకించి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటా లకు కమ్యూనిస్టులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నాటి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తదుపరి విప్లవ కమ్యూనిస్టుల కృషి, ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలు తెలంగాణలో సాంస్కృతిక రంగానికి అత్యంత శక్తివంతమైన పోరాట ఆయుధంగా మలచాయి. ఆట, పాటా నేటికీ ప్రజలను కదిలించగలుగు తున్నాయి. కమ్యూనిస్టులు సామాజిక పోరాటాలను సాంస్కృతిక పోరాటాల తో సమన్వయించి, వర్గపోరాటాలకు జోడించాలి. ముందుగా ప్రజలను వారు తమ వైపు తిప్పుకోవాలి. తెలంగాణలో సుదీర్ఘకాలంగా కమ్యూని స్టులకున్న పలుకుబడి అందుకు తోడ్పడుతుంది. ఈ అంశాన్ని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ గుర్తించినట్టే కనిపిస్తోంది. ఇటీవల అది ‘‘ప్రైవేటు రం గంలో కూడా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలి’’ అనే నినాదం చేపట్టిం ది. అది బలమైన ఐక్య ఉద్యమ నిర్మాణం దిశగా వేస్తున్న ముందడుగనే భావించాలి. అయితే గతంలో మండల్ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో పాలకవర్గాలు అగ్రవర్ణాల భావోద్వేగాలను రెచ్చగొట్టిన అనుభవం నుంచి గుణపాఠాలను తీసుకోవాలి. ప్రైవేటు రిజర్వేషన ్లలో అగ్రవర్ణాల, కులాల పేదలకు 5 శాతం రిజర్వేషన్ల కల్పన వంటి పద్ధతులను రూపొందిం చుకోవాలి. ఏది ఏమైనా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్ష రాజకీయాల పునర్వైభవానికి ముందు షరతని విస్మరించలేం. రెండు రాష్ట్రాల భిన్న భౌతిక వాస్తవికతలకు అనుగుణంగానే కమ్యూనిస్టులు ఎత్తుగడలను రూపొందించుకుని ముందుకు సాగాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు ‘ఇద్దరు చంద్రులు’ ముఖ్యమంత్రులంటూ మీడియా అంటోంది. కానీ ఆ ఇద్దరు చంద్రులలో తిథులననుసరించి వచ్చే ‘కళా కాంతులు’, ‘కాంతి విహీనతల’ను విస్మరించ రాదు. ఈ అసిధారావ్రతంలో ప్రజలతో మమేకమై కమ్యూనిస్టులు విజయం సాధిస్తారని ఆశిద్దాం! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720) -
సీఎం పర్యటనపై మండిపడుతున్న కమ్యూనిస్టులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై ఆ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. అనంత కరువు నివారణలో చంద్రబాబు విఫలం అయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోలేదని జిల్లావ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటను నిరసనగా సీపీఎం నేతలు కలెక్టరేట్ ముందు 20 గంటలు ప్రజా జాగరణ చేపట్టనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన తీవ్రతరం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గుంతకల్లు, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో హంద్రీనీవా కాల్వ గట్టులపై నిద్ర చేపట్టనున్నట్టు వారు తెలిపారు. -
బాబూ.. ఇన్ని పచ్చి అబద్ధాలా?
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ శనివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై వామపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. గవర్నర్‌తో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను చెప్పించారని ధ్వజమెత్తాయి. విభజన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఏ సమస్యకూ పరిష్కారం చూపకపోవడాన్ని ఆక్షేపించాయి. విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన పథకాలను, నిధుల్ని రాబట్టడంలో ప్రభుత్వ దివాళాకోరుతనం కొట్టొచ్చినట్టు కనిపించిందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు వేర్వేరు ప్రకటనల్లో విరుచుకుపడ్డాయి. మరో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇంత హడావిడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశాయి. ఇదో కొత్త పల్లవా? ఇటీవలి వరకు 2020 అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 2050 విజన్ అంటున్నారని, సమస్యలకు పరిష్కారం చూపి ఆ తర్వాత 2050 గురించి ఆలోచించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధించే తీరేనా ఇది.. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా సాధన వ్యవహారంలో ప్రభుత్వ తీరును సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. కనీసం నోరు విప్పి కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా లేదా? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే ఆత్మగౌరవమా? అని నిప్పులు చెరిగారు. -
‘రియల్’ దందా కోసమే సచివాలయం తరలింపు'
హైదరాబాద్ సిటీ : రియల్ ఎస్టేట్ దందా కోసమే ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపు యోచన చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపును వ్యతిరేకిస్తూ గురువారం ఓ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... పది కమ్యూనిస్టు పార్టీలు సీఎంను కలవాలని అనుమతి కోరితే ఇంత వరకు కనికరించలేదన్నారు. వాస్తు ప్రకారంగా పాలించడం రాజ్యాంగ విరుద్ధమని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రజలు సహించరని ఆయన చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా రోజుకో హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నిజాం కాలంలో స్థాపించిన ఆస్పత్రిని తరలించడం సబబుకాదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాతిపదిక రాజ్యాంగంలో ఉన్న విలువలని అన్నారు. నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెట్టుబడులను తీసుకొస్తూ ధ్వంసం చేస్తున్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ఎంసీపీఐయూ నాయకులు ఎం.డి.గౌస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ఆర్ఎస్పీ నాయకులు జానకిరాము, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సురేందర్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, నాయకులు భూతం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
'పునరేకీకరణతోనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి'
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ద్వారానే దేశంలో కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనే శక్తిమంతమైన ప్రత్యామ్నాయం అవతరిస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే పార్టీగా ఉండాలని ఆకాక్షించారు. కాగా, సీపీఐ మిగిలిన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఐక్య పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చిలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానంలోనూ కమ్యూనిస్టుల పునరేకీకరణ ప్రాధాన్యంపై చర్చిస్తామని సురవరం తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని విమర్శించారు. నల్లధనం దేశానికి రప్పిస్తే ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షలు అందుబాటులోకి వస్తాయని చెప్పి, గత ప్రభుత్వం లాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూనే.. ఆయుధాలు తయారు చేయవద్దని, వాటిని తామే సరఫరా చేస్తామన్న అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి సాగిలపడుతోందని సురవరం ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే విగ్రహాలను దేశమంతా పెడతామని ప్రకటనలు చేస్తుంటే దానిపై ప్రధాని, బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. గాంధీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నిరసనగా గాంధీ జయంతి రోజును మత సామరస్య- జాతీయ సమైక్య దినంగా జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాం ప్రభుత్వ పాలన పాఠ్యాం శంగా చేర్చాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్పటి పాలనలో పోరాటాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించే తీరు కూడా వాటిలో చేర్చాలని సూచించారు. అంత మోజుంటే ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా : చంద్రబాబు తీరుపై నారాయణ మండిపాటు ప్రతిదానికి సింగపూర్, జపాన్ గురించే మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అంతగా మోజుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగపూర్‌కే లీజుకివ్వొచ్చుగా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని లీజుకిస్తే ఇక్కడా వాళ్లే పాలన చేస్తారుగా అని ఎద్దేవా చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తుంటే చంద్రబాబు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. -
దళిత ఉద్యమాలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలం
హైదరాబాద్: అభ్యుదయ దళిత ఉద్యమాల చరిత్రను గుర్తించడంలో కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సమాంతర ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భీమ్‌సేన నాయకుడు బి.శ్యాంసుందర్ 105వ జయంతి వేడుకలు ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన గద్దర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాల కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే కమ్యూనిస్టు పార్టీలు పుట్టినా ఉద్యమ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కమ్యూనిస్టులు వెనుకబడిపోయారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక నిజాంలను పొగుడుతున్న పాలకులు, అప్పటి ప్రజాస్వామిక ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని గద్దర్ ప్రశ్నించారు. కార్యక్రమంలో ‘సజీవ దహనం’,‘ శ్యాంసుందర్ ఉద్యమ ప్రస్థానం’ ‘భూదేవతావోంకా మేనిఫెస్టో’ పుస్తకాలను ఆవిష్కరించారు. కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది పూటకో మాట మాట్లాడే సీఎం కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఎక్కువ మాట్లాడితే కేసీఆర్‌కు మరింత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు అవుతుందన్నారు. కాబట్టి మీడియా కూడా ఇలాంటి విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. లక్ష నాగళ్లతో రామోజీ ఫిలింసిటీని దున్నేస్తామన్న కేసీఆర్, చివరకు రామోజీరావు కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ, దలిత్ వాయిస్ ఎడిటర్ వి.టి.రాజశేఖర్, భారతీయ భీమ్‌సేన నాయకులు హెచ్.శ్రేయస్కర్, రచయిత మక్సూద్, ఓయూ స్కాలర్ కుమారస్వామి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఎఐఎవైఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్, ఎంఐఎం నేత మోహన్‌రావు పాల్గొన్నారు. ఓయూలో... ఉస్మానియా యూనివర్సిటీ: భీమ్‌సేన స్థాపకుడు, అణగారిన దళితజాతుల విముక్తినేత బత్తుల శ్యాంసుందర్ 105వ జయంతిని ఓయూలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన శ్యాంసుందర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీడీఎఫ్ పరిశోధకులు డాక్టర్ నాగం కుమార్, మంచాల లింగస్వామి, ప్రభాకర్, అరుణ్, ప్రవీణ్, దివాకర్, కార్తీక్, మధు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలమైన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల హామీల అమలులో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల్లో జాప్యానికి నిరసనగా 10 వామపక్ష పార్టీలు బుధవారం హైదరాబాద్‌తోపాటు, వివిధ జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించాయి. హైదరాబాద్‌లో ఊరేగింపుగా వచ్చిన 10 వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్), ఇతర వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ ర్యాలీ జరిపారు. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వివిధ పార్టీల నేతలు కలెక్టరేట్ రెండోగేటు వద్ద బైఠాయించారు. వరంగల్‌లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఆందోళనలో సీపీఐ నేత గుండా మల్లేశ్ మాట్లాడుతూ హామీల అమలుపై అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా, హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రుణమాఫీ మాటలకే పరిమితం కాగా.. అప్పుల భారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ నుంచి ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నిం చారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిలో ఆయన మాట్లాడారు. -
2 శాఖల ఏర్పాటుకు లెఫ్ట్, బీజేపీ కసరత్తు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన నాటికి ప్రక్రియ పూర్తికి యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు కమిటీల ఏర్పాటుకు వామపక్షాలు, బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. 29వ రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావ తేదీ ప్రకటించే నాటికి ఈ ప్రక్రియనూ పూర్తి చేయాలని యోచిస్తున్నాయి. ఇందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ నాయకత్వాలను కోరాయి. జాతీయ పార్టీల ప్రస్తుత నిబంధనావళి ప్రకారం కొత్త కార్యవర్గాలను పార్టీ మహాసభల్లో ఎన్నుకోవడం ఆనవాయితీ. సీపీఐ, సీపీఎం, బీజేపీ నూతన కార్యవర్గాలు ఏర్పడి ఏడాదిన్నర కూడా కాలేదు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి, వామపక్షాలలో రాష్ట్ర కార్యదర్శుల పదవులు కీలకమైనవి. మహాసభల్లో కాకుండా నూతన కార్యవర్గాలను ఎన్నుకునే అవకాశం లేనందున ప్రస్తుతం తాత్కాలిక కమిటీలను నియమించి ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నాయి. బీజేపీలో ఆయితే తెలంగాణకు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డినే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగే తెలంగాణ ప్రాంత పదాధికారుల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ సీనియర్లు డాక్టర్ కె.హరిబాబు, సోము వీర్రాజు, శ్రీనివాసరాజుల్లో ఒకర్ని నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 27న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ రాష్ట్ర సమితి సమావేశాల్ని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఈనెల 27న, పార్టీ కార్యవర్గం వచ్చేనెల 6న సమావేశం కానున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సీపీఐ సీమాంధ్ర కమిటీ కన్వీనర్ పదవిపై గుంటూరు జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రస్తుత కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామకృష్ణ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్రాంతాలకయితే ప్రస్తుత కార్యదర్శివర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు, చాడా వెంకటరెడ్డి, అజీజ్‌పాషా రేసులో ఉన్నారు. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న కె.నారాయణను దేశ రాజధానికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వచ్చేనెలలో సీపీఎం నిర్ణయం సీపీఎం కూడా దాదాపు ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. తెలంగాణ ప్రాంత పార్టీ బాధ్యతలను ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాముల్లో ఎవరో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుత కార్యదర్శి బీవీ రాఘవుల్ని ఢిల్లీ సెంటర్‌కు పంపే పక్షంలో అదేస్థాయి ఉన్న నేత కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ కేంద్రంలో పని చేస్తున్న కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. శ్రీనివాసరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శనివారమిక్కడ జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈవిషయమై చర్చ జరిగినప్పటికీ ఎటూ తేల్చుకోలేక పోవడంతో వచ్చేనెల 1, 2 తేదీల్లో జరిగే సీపీఎం కేంద్ర కమిటీకి ఈ వ్యవహారాన్ని నివేదించాలని భావించినట్టు తెలిసింది. -
ఒక్కటైన ఐదు కమ్యూనిస్టు పార్టీలు