వామపక్ష నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
తిరుపతి తుడా: తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని అడ్డుకుంటారని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులను..కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. మన్నవరం తరలింపు యోచనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వామపక్ష శిబిరాన్ని పోలీసులు సోమవారం ముట్టడించారు. శిబిరంలో ఉన్న వారిని బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొందింది. పోలీసు చర్యలను కమ్యూనిస్టులు ప్రతిఘటించారు. మహిళలను సైతం ఈడ్చుకెళ్ళి వ్యాన్ ఎక్కించారు. గో బ్యాక్ వెంకయ్యనాయుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెసై ్టన వారిలో సీపీఎం, సీపీఐ జిల్లా నేతలు కుమార్‌రెడ్డి, రామానాయుడు, పెంచలయ్య, మహిళలు ఉన్నారు.