Venkaiahnaidu
-
మాజీ గవర్నర్ కన్నుమూత
బెంగళూరు: జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన జస్టిస్ రమా జోయిస్ (89) కన్నుమూశారు. బెంగళూరులో అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆయన మృతికి ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్రమంతులు, కర్నాటక ముఖ్యమంత్రి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కన్నా ముందు రమా జోయిస్ న్యాయమూర్తిగా, చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలను గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. 1932 జూలై 27వ తేదీన కర్నాటకలోని శివమొగ్గలో రమా జోయిస్ జన్మించారు. 1959లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. అంచలంచెలుగా ఎదుగుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. చాలా రచనలు చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పదిలపర్చేందుకు కృషి చేశారు. In the demise of Justice Rama Jois, the nation has lost a noted jurist who made rich contribution in the courts, Parliament and administration. A fierce opponent of the Emergency, he was a renowned writer and authority on Indian jurisprudence. Condolences to his family & friends. — President of India (@rashtrapatibhvn) February 16, 2021 అత్యవసర పరిస్థితి కాలంలో రమా జోయిస్ అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి జైల్లో ఉన్నారు. ఆ పరిచయం కొనసాగింది. పదవీ విరమణ అనంతరం 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం రమా జోయిస్ను గవర్నర్‌గా నియమించింది. జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు అతి కొద్దికాలం మాత్రమే గవర్నర్‌గా కొనసాగారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన రాసిన ఎన్నో రచనలు భావి న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆయన మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను కీర్తించారు. Justice (Retd.) M. Rama Jois was a towering intellectual and jurist. He was admired for his rich intellect and contributions towards making India’s democratic fabric stronger. Saddened by his demise. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti. — Narendra Modi (@narendramodi) February 16, 2021 -
కరుణకు వెంకయ్య పరామర్శ
సాక్షి, చెన్నై : మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతున్న ద్రవిడ మున్నేత్ర కగజం(డీఎంకే) పార్టీ అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరిలు పరామర్శించారు. కరుణానిధి రాజకీయాల్లో అపర చాణక్యుడని, ఆయన ఎన్నో సంస్కరణలకు ఆద్యుడని సీతారాం ఏచూరి అన్నారు. కరుణ ఆరోగ్యంపై స్టాలిన్‌ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయన త్వరలోనే సంపూర్ణం ఆరోగ్యంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కరుణానిధికి రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరుణానిధికు ఉపరాష్ట్రపతి పరామర్శ
-
‘నియంత్రణతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ’
మొహాలీ: స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయనీ, నియంత్రణ ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో ఎవ్వరూ మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించడం చేయకూడదని ఆయన హితవు పలికారు. పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. లౌకికవాదం, సహనం అనేవి భారతీయుల డీఎన్ఏలో ఉన్నాయనీ, దేశంలో ఎక్కడో జరిగిన సంఘటనలు మొత్తం దేశ వైఖరిని ప్రతిబింబించలేవని వెంకయ్య పేర్కొన్నారు. -
వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..
న్యూఢిల్లీ : దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో వెంటనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న ఆయన భారతదేశానికి 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరి అంచనాలకు అందకుండా వెంకయ్యానాయుడి ఎన్డీయే నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈయనపై పోటీ చేసిన మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీకి ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనప్రాయమేనని అనుకున్న విషయం తెలిసిందే. రైతు కుటుంబం నుంచి.. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడి ప్రస్థానమంతా చాలా ఆసక్తిగా కనిస్తుంది. ముఖ్యంగా ఆయనకు ఆభరణం మాట. చక్కటి మాటలతో ఆయన ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేయగలరు. ఏ అంశాన్నయినా విశ్లేషించగలరు. విద్యార్థి దశ నుంచి తనలో మొలకెత్తిన నాయకత్వ లక్షణాలను పొదివిపట్టుకున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అందుకున్నారు. సొంత ప్రతిభతోపాటు తాను ఎంతో నమ్ముకున్న పార్టీని కడవరకు అంటిపెట్టుకునే ఉన్నందుకే ఆయనను ఈ అదృష్టం దక్కిందని చెప్పాలి. వెంకయ్య బాల్యం గురించి సంక్షిప్తంగా.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెం అనే గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లేవారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు. రాజకీయాలవైపు.. ప్రతికూల పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకునే ఆయన రాజకీయాల్లో అజాత శత్రువనే చెప్పాలి. సమయస్ఫూర్తి, వాగ్ధాటి ఆయన సొంతం లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొని విద్యార్ధి నేతగా మారారు. ఉద్యమంలో అరెస్టై తొలిసారి జైలుకు వెళ్లిన ఆయన తర్వాత జయప్రకాశ్ నారాయణ్(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తొలిసారి 1977లో జనతా పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో ఇందిర ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లోనే ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ హయంలో కూడా రెండోసారి విజయం సాధించారు. 1987 డిసెంబర్ 31 నుంచి నాలుగు రోజులపాటు విజయవాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో 45నిమిషాలపాటు వెంకయ్య చేసిన ప్రసంగం నాటి అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీలను అమితంగా ఆకర్షించింది. దీంతో ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రవేశం దొరికినట్లయింది. ఆ తర్వాత ఆయన జాతీయ నేతగా వివిధ పదవులు నిర్వహించారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ ప్రస్తానం 1973-74 : ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు 1974-75 : లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ యువజన సంఘర్ష్ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్ 1977-80 : జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు 1978-83 : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక 1980-83 : ఏపీ భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి 1983-85 : ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (భాజపా శాసనసభపక్ష నేత) 1988-93 : ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 1993-2000 : భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి 1998 : కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998-99 : హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు. 2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 2002-04 : భాజపా జాతీయ అధ్యక్షుడు 2004 : కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక 2014-: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి. కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. 2016 : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక 2017 : ఆగస్టు 5న ఉపరాష్ట్రపతిగా ఎన్నిక -
ఎక్కడికక్కడే అరెస్టులు
తిరుపతి తుడా: తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని అడ్డుకుంటారని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులను..కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. మన్నవరం తరలింపు యోచనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వామపక్ష శిబిరాన్ని పోలీసులు సోమవారం ముట్టడించారు. శిబిరంలో ఉన్న వారిని బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొందింది. పోలీసు చర్యలను కమ్యూనిస్టులు ప్రతిఘటించారు. మహిళలను సైతం ఈడ్చుకెళ్ళి వ్యాన్ ఎక్కించారు. గో బ్యాక్ వెంకయ్యనాయుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెసై ్టన వారిలో సీపీఎం, సీపీఐ జిల్లా నేతలు కుమార్‌రెడ్డి, రామానాయుడు, పెంచలయ్య, మహిళలు ఉన్నారు. -
నేడు తిరుపతిలో ప్రముఖుల పర్యటన
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. వీరు సోమవారం జరగనున్న ఎస్వీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కేంద్రమంత్రి జిల్లాలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
వెంకయ్యనాయుడితో చంద్రబాబు బేటి
-
సోనియాతో వెంకయ్య నాయుడు భేటీ
పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్‌లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ఉండటం, అందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం ఉండటం వంటి కారణాలవల్లే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశం సజావుగా జరిగిందని, పార్లమెంటు కార్యకలాపాల్లో మద్దతుకోసమే ఆమెను కలిసినట్లు చెప్పారు. తాము చేసే ప్రతిపనిని ప్రతిపక్షాలకు తప్పక వివరిస్తామని, వారు విలువైన సూచనలిస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. అధికారపక్షం, మిత్రపక్షం సమన్వయంతో ముందుకెళితేనే బాగుంటుందని తెలిపారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లను అరికట్టేందుకు సహకరిస్తాం
సాక్షి, తిరుమల: ‘‘తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ శేషాచల అడవుల్లో ఉన్న అపారమైన ఎర్రచందనం కలపను అక్రమార్కులు దోచుకుపోతున్నారు. అలాంటి వారి ఆగడాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది.’’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే విషయంపై గతంలో కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా శేషాచలం ఎర్రచందనాన్ని కాపాడాలని కోరానని తెలిపారు. శనివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుమల పవిత్రత, ప్రశాంతతను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు మహద్వారం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నా.. క్యూలోనే వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. తమ ఇలవేల్పు అయిన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. వాజ్‌పేయి, నరేంద్రమోడి ప్రధానులు కావాలని గతంలోనే కోరుకున్నానని, ఆ కోరికను స్వామివారు తీర్చారన్నారు. ప్రస్తుతం విడిపోయిన తెలుగు రాష్ట్రాలు అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్టు తెలిపారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి కావడంతో దేశానికి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. భారత్ ముందున్న అనేక సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు నరేంద్రమోడి అని కొనియాడారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తిరుపతి అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు మంత్రికి ప్రత్యేక దర్శనాలు చేయించి లడ్డూ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. -
విశాఖకు చోటేది?
కేంద్ర మంత్రి వర్గంలో జిల్లాకు ప్రాతినిథ్యం శూన్యం వెంకయ్యకు బెర్త్ ఖరారవడంతో హరిబాబుకు చేజారిన అవకాశం మలి విడతలోనూ కష్టమే గతంలో జిల్లా నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు సాక్షి, విశాఖపట్నం: దేశ కొత్త ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో విశాఖకు చోటు దక్కలేదు. తొలి విడత కేటాయించే మంత్రి పదవుల్లో విశాఖ పార్లమెంట్ నుంచి హరిబాబుకు అవకాశం లభిస్తుందని అంతా అంచనా వేశారు. హరిబాబు సీమాంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కావడంతో కచ్చితంగా ఏదొక పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది. కానీ సోమవారం నాటి కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారంలో ఆయనకు ఆ అవకాశం దక్కకుండా పోయింది. మలివిడత మంత్రి పదవుల కేటాయింపులో ఆయనకు అవకాశం లభిస్తుందని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. అసలు హరిబాబుకు మంత్రి పదవి లభించడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు మోడీ మంత్రివర్గంలో చోటిచ్చారు. దీంతో వెంకయ్య సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదవి దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ తరపున అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి కేటాయించారు. కర్ణాటక రాజ్యసభ కోటాలో వెంకయ్యను పదవి వరించింది. ఇప్పుడు మూడో పదవిగా హరిబాబుకు రాష్ట్రం నుంచి ఇవ్వడానికి మోడీ సుముఖంగా లేనట్టు సమాచారం. మరోపక్క ఎంపీగా గెలిచిన తర్వాత కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని హరిబాబుతోపాటు ఆయన అనుచరులు గట్టిగా నమ్మారు. పైగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో హరిబాబు అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సీనియార్టీతో ఈసారి మంత్రి పదవితోపాటు కేంద్ర ఐటీ శాఖ వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికితోడు హరిబాబు కూడా గెలిచిన తర్వాత పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు. తీరా ఇప్పుడు పదవి రాకపోవడంతో ఆయన అనుచర వర్గాలు నిరాశలో కూరుకుపోయాయి. తర్వాత ప్రకటించే జాబితాలోనూ అవకాశం దక్కకపోవచ్చని తెలియడంతో నిరాశ చెందుతున్నాయి. వెంకయ్యనాయుడు, హరిబాబు ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి రావడంతోపాటు ఒకరకంగా ఇద్దరు స్నేహితులు కూడా. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరికి పదవి దక్కగా మరొకరికి అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి కొత్త ప్రధాని ప్రకటించిన మంత్రివర్గంలో ఈ ప్రాంతానికి చోటు దక్కకపోవడం విశాఖవాసులను నిరాశపర్చింది.