మొహాలీ: స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయనీ, నియంత్రణ ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో ఎవ్వరూ మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించడం చేయకూడదని ఆయన హితవు పలికారు. పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగించారు. లౌకికవాదం, సహనం అనేవి భారతీయుల డీఎన్‌ఏలో ఉన్నాయనీ, దేశంలో ఎక్కడో జరిగిన సంఘటనలు మొత్తం దేశ వైఖరిని ప్రతిబింబించలేవని వెంకయ్య పేర్కొన్నారు.