హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.
తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్‌పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.
తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment