హైదరాబాద్‌లో అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన: ఎన్ని రోజులంటే.. | PMJ Jewels Largest Wedding and Half Saree Jewellery Exhibition in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన: ఎన్ని రోజులంటే..

Published Fri, Mar 7 2025 4:34 PM | Last Updated on Fri, Mar 7 2025 6:32 PM

PMJ Jewels Largest Wedding and Half Saree Jewellery Exhibition in Hyderabad

మార్చి 7, 2025, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్‌లో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభమైంది.

ఈ ప్రదర్శన కార్యక్రమానికి.. PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రతీక్ జైన్, చక్రపాణి, పాండు గౌడ్, ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. మార్చి 7న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఆభరణాల ప్రదర్శనలో 20,000 కంటే ఎక్కువ PMJకు చెందిన హ్యండ్‌ మేడ్‌ డిజైనర్ ఆభరణాలను ప్రదర్శిస్తారు.

వివాహ ఆభరణాలు, హాఫ్ సారీ ఆభరణాలతో పాటు.. ఈ ప్రదర్శనలో రోజువారీ దుస్తులు, ఫెస్టివల్‌ క్రియేషన్‌లు కూడా ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేక సీజన్‌లకు మాత్రమే కాకుండా ఆఫీసు, పార్టీలతో పాటు సాధారణ దుస్తులకు కూడా అనుకూలంగా ఉంటాయి.

ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన.. బ్యూటీ డిజైన్‌లు ఉంటాయి. ఇవి కాలాతీత సంప్రదాయాన్ని సమతుల్యం చేయడంతో పాటు ఫ్యాషన్ డిజైన్‌లను ప్రతిబింభిస్తున్నాయి. వజ్రాలు, బంగారం, పోల్కీ, సాలిటైర్‌లలో విస్తృత శ్రేణి డిజైన్‌లతో.., ఈ ప్రదర్శనలో సాంప్రదాయ డిజైన్‌లు మొదలు ఆధునిక హంగుల వరకు సమకాలీన సౌందర్యంతో అలరిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement