Jewellers collections
-
సోమాజిగూడ జ్యువెలరీలో మెరిసిన నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)
-
సీజనల్ స్పెషల్ : ఈ స్పెషల్ జ్యూయల్లరీ చూశారా!
వేసవిలో కాటన్ డ్రెస్సుల ప్రాముఖ్యత గురించి తెలిసిందే. అలాగే, ఈ సీజన్‌కి టెక్స్టైల్ జ్యువెలరీ అంతే స్పెషల్‌గా ఉంటుంది. ఎంచుకునే ఫ్యాబ్రిక్ ఏదైనా చేతితో రూపొందించే ఈ జ్యువెలరీ కొనుగోలు ఖర్చూ తక్కువే. అలాగే, ఎవరికి వారు నచ్చినట్టు ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. యువతను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచే ఈ స్పెషల్ జ్యువెలరీ అంతే తాజాదనపు అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రకృతికి దగ్గరగా.. ఫ్యాబ్రిక్ ఎంపిక! పువ్వులంటేనే ప్రకృతి తెలియపరిచే ప్రేమ భాష. డిజైనర్ స్టూడియోలలో వాడగా ఉపయోగించిన మెటీరియల్‌తో అందమైన పూలను తయారుచేయవచ్చు. వాటిని పూసలు, జరీ దారాలతో ఆభరణాలుగా మార్చవచ్చు.ఈ పువ్వుల ఆభరణాలు దుస్తుల అందాన్ని మరింతగా పెంచుతాయి. పాదం నుంచి తల వరకు ప్రతి ఆభరణాన్ని వస్త్రాలంకరణతో మెప్పించవచ్చు. చందేరీ, సిల్క్, నెటెడ్, కాటన్ వంటి ఏ మెటీరియల్ అయినా ఈ ఆభరణాల తయారీలో ఉపయోగించవచ్చు. గార్మెంట్స్, బీడ్స్, జరీ లేదా కాటన్ దారాలను ఉపయోగించి చేసిన నెక్‌పీస్‌లు సంప్రదాయ చీరల మీదకే కాదు వెస్ట్రన్ డ్రెస్సుల మీదకూ ప్రత్యేక హంగుగా నిలుస్తున్నాయి. కాటన్ దారాలు, క్లాత్‌తో తయారుచేసిన పువ్వులను ఉపయోగించి చేసిన బన్ క్లిప్స్ వేసవి సీజన్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్‌కి కాంబినేషన్‌గా సిల్వర్ లేదా ఇతర లోహాలతో తయారైన మువ్వలు, గవ్వలు, జూకాలను జత చేయవచ్చు. దీని వల్ల ఈ జ్యువెలరీకి మరిన్ని హంగులు అమరుతాయి. -
'నా సామిరంగ’ మూవీ హీరోయిన్ చుడిదార్‌లో లుక్ మాములుగా లేదుగా!
‘నా సామిరంగ’ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి.. అలరించిన నటి.. ఆశికా రంగనాథ్!. తెలుగు, కన్నడ కల్చర్స్ సిమిలర్‌గానే ఉంటాయి. అందుకే కొంతమంది ఆమెని తెలుగు అమ్మాయనే అనుకున్నారు. పైగా నటి అనుష్కగారితో పోలుస్తూ జూనియర్ అనుష్క అని పిలవడం విశేషం. ఇక ఆశికా రియల్ లైఫ్‌లోనూ తన ట్రెండీ, ట్రెడిషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. అందుకు అమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఇక్కడ.. రుడ్రెస్ బ్రాండ్: మహిమా మహాజన్ ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మహిమా.. తన పేరు మీదే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించి తన చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. బ్రైడల్ కలెక్షన్స్‌తో పాపులర్ అయింది. ఇండోవెస్టర్న్ డిజైన్స్‌కి కూడా ఫేమస్. అమ్మాయిలకు హాట్ ఫేవరేట్ ఈ బ్రాండ్! ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ. 45,900/- జ్యూలరీ బ్రాండ్: హౌస్ ఆఫ్ క్యూసీ 2016లో ఆన్లైన్లో మొదలైన ఈ బ్రాండ్.. తన అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకూ నోటెడ్ అయింది. ఎవరి వారికైనా నప్పే, ఎవరైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్ ఆఫ్ క్యూసీ’ ప్రత్యేకత. ఈమధ్యే హైదరాబాద్, బెంగళూరులలో స్టోర్స్ ఓపెన్ చేశారు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: స్టన్నింగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!
ఎన్నో రకాల జ్యువెలరీలు చూసుంటారు. ఇలాంటి జ్యువెలరీని చూసే అవకాశమే లేదు. ముఖ్యంగా మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్‌తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. చాక్లెట్లు, దీపావళి టపాసులతోటి విభిన్న అలంకరణాలు చూసుంటారు. ఇలా డ్రైఫ్రూట్స్‌తో జ్యువెలరీని మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి అద్బుతంః అన్నంత రేంజ్లో ఉన్నాయి ఆ డ్రైఫ్రూట్ నగలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో మహిళ ధరించిన నగల్లో.. చెవికి పెట్టుకునే జుంకాల దగ్గర నుంచి వడ్డాణం వరకు అన్నింటిలో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. జ్యువెలరీ కూడా భలే వెరైటీగా చూడముచ్చటగా ఉంది. కాకపోతే అమ్మో డ్రై ప్రూట్స్‌ని అలా వేస్ట్ అయిపోతున్నాయే! అని చివుక్కుమంటోంది మనసు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఇలానే ఫీల్ అవ్వతూ.. సదరు మహిళపై మండిపడుతున్నారు. ఆహారాన్ని వృధా చేస్తోదంటూ తిట్టిపోశారు. అయినా ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ బంగారంతో సమానం అలాంటి వాటిని ఇలా అలంకరణకు ఉపయోగిస్తావా? అంటూ తిట్ట దండకం మొదటు పెట్టారు. ఏదీఏమైనా వెరైటీగా ఉండేందుకుక ట్రై చేయడంలో తప్పులేదు. అయితే అది సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి లేదంటే విమర్శల పాలవ్వక తప్పదు. View this post on Instagram A post shared by Vasudhaa Makeover (@vasudhaa_makeover) (చదవండి: పెళ్లిని ఇలా పర్వెక్ట్గా ప్లాన్‌తో చేస్తే..సూపర్‌గా ఉంటుంది!) -
JKJ జ్యువెలరీ వారి గ్రాండ్ లాంచ్ డైమండ్ పోల్కీ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో నటి తేజస్వి మదివాడ ఇంకా ప్రముఖులు హాజరయ్యారు. (ఫోటోలు)
-
స్టోన్స్ జ్యువెలరీతో స్టార్స్‌లా మెరిసిపోతున్న మగువలు!
ఆభరణాలలో రాళ్లు అనగానే మనకు వజ్ర వైఢూర్యాలు గుర్తుకు వస్తుంటాయి. సంప్రదాయ ఆభరణాలలో పొదిగిన రత్నాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. కానీ, వేషధారణలో ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని ఇష్టపడినట్టే ఆభరణాలనూ వెస్ట్రన్ లుక్‌ను తీసుకువస్తున్నారు డిజైనర్లు. ధరించిన వెస్ట్రన్ డ్రెస్‌కు మరిన్ని హంగులు తీసుకురావడానికి రంగు రంగుల రాళ్లతో ఫ్యాషన్ జ్యువెలరీ రూపుదిద్దుకుంటోంది. స్టోన్ జ్యువెలరీని ధరించినవారు వేడుకలో ఎక్కడ ఉన్నాస్టార్లలా మెరిసిసోతున్నారు. స్టోన్ స్టార్స్ అని కితాబులు అందుకుంటున్నారు. ఇటీవల అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాషన్ జ్యువెలరీలో స్టోన్ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది. బ్రాస్ మెటల్‌తో...రాళ్లను పట్టి ఉంచాలంటే అందుకు తగిన గట్టి తీగల అల్లిక కూడా ఉండాలి. దానికి అనువైన లోహంగా ఇత్తడి డిజైనర్ల చేతిలో కొత్తగా మెరుస్తోంది. దీనితో స్టోన్ జ్యువెలరీని ఇండోవెస్ట్రన్ దుస్తులకు తగ్గట్టు ధరించేలా విన్నూతమైన డిజైన్స్‌ని మన ముందు కనువిందు చేస్తున్నాయి.. వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈ డిజైన్స్. రంగు రాళ్లు అచ్చమైన బంగారు ఆభరణాల్లో రత్నాలను పొదగడం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెల్రీలో రంగు రాళ్లను ఉపయోగించి డిజైన్స్రూపొందిస్తున్నారు. సిల్వర్, స్టీల్ మెటల్తోనూ రంగు రాళ్లు కనువిందు చేస్తున్నాయి. తక్కువ ధరలో అతివల చూపులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. రాళ్లలోనూ రెప్లికా.. రాతి యుగంలో తమను తాము కాపాడుకోవడానికి రకరకాల లోహాలు, జంతువుల ఎముకలు, రంగు రాళ్లను ఆభరణాలుగా వాడుతూ వచ్చేవారు. నాగరికత మారుతున్న కొద్దీ డిజైన్స్‌లో మార్పులు వచ్చాయి కానీ, రాతి రూపం అలాగే ఉంటోంది. పిన్స్, బ్రోచెస్, రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్‌లు, పొడవైన హారాలు, రాళ్ల వరసలు .. వీటిలో పూసలు కూడా జత చేరి మరింత హంగులతో స్టోన్ జ్యువెలరీ ముస్తాబు అవుతోంది. ఖరీదు ఎక్కువైన రత్నాలనే కాదు వాటి రెప్లికాలుగా రంగు రాళ్లతోనూ సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ డిజైన్లు సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఇటీవల అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాషన్ జ్యువెలరీలో స్టోన్ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది. (చదవండి: అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!) -
పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్‌కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్‌లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్‌కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్‌ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్‌గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్‌ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్‌లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్‌ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్‌కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్‌ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్‌తో సతమ్ మంచి సక్సెస్‌ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్‌కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్‌లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్‌లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్‌కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్‌మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్‌గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్ ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి.. ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000 జోయ్ అలుక్కాస్.. కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
నేర్చుకున్నది ఎప్పటికీ వృధా కాదు!
ఇతిహాసాల్లోని పాత్రలకు తమ అభినయంతో వెండితెర మీద ప్రాణం పోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పరీక్షలో నెగ్గి.. సీతగా జీవించింది కృతి సనన్ ‘ఆదిపురుష్’లో! ఆ టాలెంట్‌కి ఫ్యాషన్ స్టయిల్ని క్రియేట్ చేసే చాన్స్ దక్కించుకున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. అర్పితా మెహతా... సాధారణంగా చాలా మంది తల్లులు .. కూతుళ్లకు చీరకట్టి.. ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. కానీ అర్పితాకు మాత్రం అమ్మకు చీరకట్టడమంటే ఇష్టం. పండుగలు, వేడుకలకు అమ్మ, అమ్మమ్మకు చక్కగా చీరకట్టి.. అలంకరించి సంబరపడేది. అలా బాల్యంలోనే.. తన ప్యాషన్ ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్ఎన్డీటీ యూనివర్సిటిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. ఆమ్రపాలీ జ్యూలరీ ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలీ’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. ఇందులో నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలూ ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలను రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలీ జ్యూలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలోనూ, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూలరీలోనూ లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్: అర్పిత మెహత చీర ధర: రూ. 2,50,000 బ్లౌజ్ ధర: రూ. 40,000. (చదవండి: రోజ్ ఫెస్టివల్..ఎటు చూసి గూలబీ పూల గుత్తులే..!) -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) -
Fashion: పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు..! ప్రత్యేకత ఏమిటంటే!
Fashion Collection- Actress Poorna Styling: చిన్న రోల్ ఇచ్చినా సరే తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్ఫెక్షన్ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్ఫెక్ట్ బ్రాండ్లను ఇష్టపడుతుంది! పెటల్స్బై స్వాతి.. హైదరాబాద్‌కు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2019లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. తొలుత హాబీగానే మొదలుపెట్టినా తర్వాత జ్యూయెలరీ డిజైన్‌ను సీరియస్‌గానే తీసుకుంది. కుందన్ , జాదూ, జిర్కాన్ జ్యూయెలరీ, గోల్డ్ ఇమిటేషన్ జ్యూయెలరీని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలు. సంప్రదాయ లుక్‌ను ఇచ్చే నగలే కాకుండా ఇండో వెస్ట్రన్ పద్ధతిలోనూ అభరణాలను డిజైన్ చేస్తోంది. భార్గవి కూనమ్.. .. అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కలబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్లైన్ లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: భార్గవి కూనమ్ ధర: రూ. 54,000 జ్యూయెలరీ (కమ్మలు) బ్రాండ్: పెటల్స్ బై స్వాతి ధర: రూ. 2,400 నాకు సంప్రదాయ దుస్తులే ఇష్టం. చీరలు, చుడీదార్లలో సౌకర్యంగా ఫీలవుతాను. పండగలు, ఫంక్షన్స్‌కు వీటినే ప్రిఫర్ చేస్తా. మోడర్న్ దుస్తులు నాకు అంతగా నప్పవు. – పూర్ణ -దీపిక కొండి చదవండి: Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’.. Temple Jewellery: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం! -
అత్యద్భుతమైన డిజైన్లతో ఆభరణాల ప్రదర్శన (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ ధరించిన ఐవరీ ఫ్లోరల్ సారీ ధర ఎంతంటే!
Dimple Hayathi In Bhargavi Kunam Ivory Floral Saree: సినిమా చాన్స్ ఇమ్మని తొక్కిన ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ గడపలో ‘ఒంటి రంగు చూసుకున్నావా?’ అన్నట్టు వ్యక్తీకరించిన తిరస్కారపు చూపులను ఎదుర్కొంది డింపుల్ హయాతి. బాధపడింది. కానీ కుంగిపోలేదు. నిరుత్సాహపడింది కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమే ఇప్పుడు ఆమె తెర మీద కనిపిస్తే చప్పట్లు కొట్టేలా చేస్తోంది. అవకాశాల వెల్లువను ఆమె ఇంటి ముందుకు మళ్లించింది. ఆ ఆత్మవిశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ఒక కారణం డింపుల్లోని ప్రతిభ అయితే ఇంకో కారణం.. ఆమెను మెరిపించే ఫ్యాషన్ బ్రాండ్స్. అవేంటో చూద్దాం.. భార్గవి కూనమ్ భార్గవి కూనమ్ అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కళబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేసింది. అదే ప్రత్యేకతగా నిలిపింది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర : ఐవరీ ఫ్లోరల్ (భార్గవి కూనమ్) ధర: రూ. 34,800 థియా జ్యూయెలరీ థియా అంటే వెలుగు, మెరుపులకు ప్రతిరూపమైన గ్రీకు దేవత. ఈ బ్రాండ్‌ను స్థాపించింది అమెరికాలో స్థిరపడిన దక్షిణ కొరియా వనిత ఇరేన్. దాదాపు 20 ఏళ్లు కార్పోరెట్ ఉద్యోగం చేసి.. విసిగి వేసారి ఆ ఉద్యోగాన్ని వదిలి తనకు నచ్చిన స్పా, సెలూన్, బొటిక్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడే జ్యూయెలరీ మీద ఆమె దృష్టి పడింది. ముందు తన కోసం తాను నగలను డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అవి తన బోటిక్స్‌కు వచ్చే ఆడవాళ్లను ఆకర్షించడం గమనించి జ్యూయెలరీ డిజైన్లోనూ మెలకువలను నేర్చుకుంది. తక్కువ కాలంలో ఆమె సృజన బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో 2012లో ‘థియా జ్యూయెలరీ’ని స్థాపించింది. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతీసంప్రదాయాలు, అభిరుచుల కలయికే ఈ బ్రాండ్ ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. జ్యూయెలరీ: పర్ల్స్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: థియా జ్యూయెలరీ మైండ్‌లో భయాన్ని పెట్టుకొని కాదు మది నిండా కలలు నింపుకొని సాగాలి. నీమీద నీకున్న నమ్మకమే నీ లక్ష్యాన్ని చేరుస్తుంది.– డింపుల్ హయాతి ∙దీపిక కొండి -
Amritha Aiyer: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర లక్ష రూపాయలకు పైమాటే!
Amritha Aiyer Dress By Seema Gujral: అమృతా అయ్యర్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటూ పరిచయమై.. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ అభిమాన ధనాన్ని పెంచుకుంటోంది. ఆమె సినిమాలే కాదు ఫ్యాషన్ బ్రాండ్స్ పట్లా అంతే నిక్కచ్చిగా ఉంటుందని ఈ డిజైనర్ వేర్ చూస్తే తెలిసిపోతుంది. సీమా గుజ్రాల్.. కళ్యాణ వేదిక మీద పెళ్లి కూతురు రాజకుమారిలా కనిపిస్తోందంటే.. ఆమె సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది అని అర్థం. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా.. కేవలం ముగ్గురు ఉద్యోగులను నియమించుకుని 1994లో సీమా ప్రారంభించిన ఓ ఫ్యాషన్ హౌస్ ఇప్పుడొక పాపులర్ వెడ్డింగ్ వేర్ బ్రాండ్‌గా మారింది. దాదాపు చాలామంది సెలబ్రిటీల పెళ్లిబట్టలను ఆమే డిజైన్ చేసింది. అభిరుచికి తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది. పండోరా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో పండోరా ఒకటి. 1982లో డెన్మార్క్‌లో ప్రారంభించిన ఈ బ్రాండ్.. గత ఐదు దశాబ్దాలుగా అరుదైన, అందమైన డిజైన్స్‌లో ఆభరణాలను అందిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటూనే ఉంది. కారణం ఇందులో పనిచేసే ఆభరణాల నిపుణులే. సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాలకు చెందిన 2,600 హస్తకళా నిపుణులు ఈ ఆభరణాలను రూపొందిస్తుంటారు. ఎక్కువగా థాయ్‌లాండ్‌కు చెందిన వారే కావడంతో మన దేశ సంప్రదాయ ఆభరణాలు కాస్త తక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ. అయితే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది మరి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. నా టేస్ట్‌కు తగ్గట్టే నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు. ఇప్పటి వరకూ నా టేస్ట్‌కు తగ్గట్టే నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. – అమృతా అయ్యర్. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: సీమా గుజ్రాల్ ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ బ్రాండ్: పండోరా ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Amala Paul: అమలాపాల్ కట్టిన చీర ధరెంతో తెలుసా? -
రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి
బంజారాహిల్స్: సీఏం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలంటే.. హైదరాబాద్‌లో నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని ప్రిన్స్ మోజంజాహ్ మనవడు హిమాయత్ అలీ మీర్జా అన్నారు. రూ.99వేల కోట్ల విలువ చేసే నిజాం జ్యువెలరీ హైదరాబాద్‌కు రావాలంటే ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని మషెల్లా మంజిల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని తాను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానని తెలిపారు. ప్రస్తుతం నిజాం ఆభరణాలు ఆర్బీఐ కస్టడీలో ఉన్నాయని.. వాటిని హైదరాబాద్ తరలించాలని 4 నెలల క్రితం ప్రధానమంత్రి మోదీకి తాను లేఖ రాశానన్నారు. అందుకు ప్రధాని సుముఖత చూపుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారన్నారు. అందుకే... రాష్ట్ర ప్రభుత్వం భద్రతతో కూడిన మ్యూజియం నిర్మించి ఇస్తే వెంటనే తరలిస్తామని కిషన్‌రెడ్డి ఇటీవల హామీ ఇచ్చారని చెప్పారు. నిజాంకు సంబంధించిన 2 వేల ఎకరాల భూములు 70ఏళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల నిరుపయోగంగా ఉన్నాయని.. ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తానని, అనువైన స్థలం ఎంపిక చేసి అక్కడ మ్యూజియం నిర్మించాలని అన్నారు. ఈ మ్యూజియం నిర్మాణంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరుగుతుందని, సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దీనివల్ల పర్యాటకంగానూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా నిజాం భూములను స్వాధీనం చేసుకొని మ్యూజియం నిర్మించాలని ఆయన కోరారు. -
సెట్ కాదన్న డ్రెస్సే కొంటా..! నా ఫేవరేట్ బ్రాండ్ ఇదే..: హెబ్బా పటేల్
‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే.. నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్ ఇస్సా స్టూడియో... ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్‌గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను. చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో ధర: రూ. 34,000 ఆర్నీ బై శ్రావణి.. ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కు మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్‌కి పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. -
బెజవాడలో మహేష్‌బాబు సందడి
-
మోదీ ఫోటోతో గోల్డ్, సిల్వర్ బిస్కెట్లు..
సూరత్ : ధనత్రయోదశి సందర్భంగా సూరత్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన బంగారు, వెండి కడ్డీలు విక్రయిస్తున్నారు. మోదీ బొమ్మతో రూపొందిన గోల్డ్ బార్లను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని జ్యూవెలర్ చెబుతున్నారు. ప్రతి దీపావళికి లక్ష్మీదేవి, గణేష్‌లను కొలుస్తారని, ప్రధాని మోదీ కూడా తమకు భగవంతుడేనని, ఈ ఏడాది ప్రధాని మోదీ బొమ్మతో కూడిన గోల్డ్, సిల్వర్ బార్లను కొనుగోలు చేసి పూజిస్తామని ఓ కస్టమర్ చెబుతున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో దివాళీ సందర్భంగా ఆయన బొమ్మతో బంగారు, వెండి కడ్డీలు రూపొందిచాలనే ఆలోచన తనకు కలిగిందని జ్యూవెలరీ షోరూం యజమాని మిలన్ చెప్పుకొచ్చారు. గతంలోనూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల ఫోటోలతో మిలన్ గోల్డ్ రాఖీలను తయారుచేశారు. 22 కేరట్ల బంగారంతో తయారుచేసిన ఈ కాఖీలు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు. -
ధన్‌తెరాస్ జోష్
దీపావళి వేళ సరికొత్త జ్యువెలర్స్ కలెక్షన్స్ నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. ధన్‌తెరాస్ సందర్భంగా బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణా జ్యువెలర్స్ ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్స్ సోమవారం విడుదల చేసింది. పార్టీ, ఫెస్టివల్ కలెక్షన్స్‌తో పాటు ఉద్యోగాలు చేసే వనితల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెండెంట్ సెట్స్, టాప్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. తొలిసారిగా చెన్నై ధరలకు అనుగుణంగా కేవలం రూ.15 వేలకే వజ్రాలు పొదిగిన నగలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆఫర్ ఈ నెల 26 వరకు ఉంటుంది. - సాక్షి, సిటీప్లస్