Fashion: Actress Poorna In Bhargavi Kunam Saree Cost 54K Speciality - Sakshi
Sakshi News home page

Actress Poorna: ‘పర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే!

Published Sun, Aug 21 2022 9:54 AM | Last Updated on Sun, Aug 21 2022 1:03 PM

Fashion: Actress Poorna In Bhargavi Kunam Saree Cost 54K Speciality - Sakshi

Fashion Collection- Actress Poorna Styling: చిన్న రోల్‌ ఇచ్చినా సరే  తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్‌ఫెక్షన్‌ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌లను ఇష్టపడుతుంది!

పెటల్స్‌బై స్వాతి.. 
హైదరాబాద్‌కు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 2019లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. తొలుత హాబీగానే మొదలుపెట్టినా తర్వాత జ్యూయెలరీ డిజైన్‌ను సీరియస్‌గానే తీసుకుంది.

కుందన్‌ , జాదూ, జిర్కాన్‌  జ్యూయెలరీ, గోల్డ్‌ ఇమిటేషన్‌  జ్యూయెలరీని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలు. సంప్రదాయ లుక్‌ను ఇచ్చే నగలే కాకుండా ఇండో వెస్ట్రన్‌  పద్ధతిలోనూ అభరణాలను డిజైన్‌ చేస్తోంది. 

భార్గవి కూనమ్‌..
.. అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కలబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్‌ కలెక్షన్స్‌, దుపట్టాలకు ఈ బ్రాండ్‌ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్‌ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్‌ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్‌ ఫెవరేట్‌ డిజైనర్‌.

ఆర్కిటెక్చర్, ఇంటీరియర్‌ డిజైన్‌లో మాస్టర్స్‌ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్‌  ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌ లోనూ లభ్యం.

బ్రాండ్‌ వాల్యూ
చీర బ్రాండ్‌: భార్గవి కూనమ్‌
ధర: రూ. 54,000

జ్యూయెలరీ (కమ్మలు)
బ్రాండ్‌: పెటల్స్‌ బై స్వాతి
ధర: రూ. 2,400

నాకు సంప్రదాయ దుస్తులే ఇష్టం.  చీరలు, చుడీదార్లలో సౌకర్యంగా ఫీలవుతాను. పండగలు, ఫంక్షన్స్‌కు వీటినే ప్రిఫర్‌ చేస్తా. మోడర్న్‌ దుస్తులు నాకు అంతగా నప్పవు. – పూర్ణ
-దీపిక కొండి  

చదవండి: Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్‌ బ్రాండ్‌’..
Temple Jewellery: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement