bhargavi kunam
-
Fashion: పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు..! ప్రత్యేకత ఏమిటంటే!
Fashion Collection- Actress Poorna Styling: చిన్న రోల్ ఇచ్చినా సరే తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్ఫెక్షన్ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్ఫెక్ట్ బ్రాండ్లను ఇష్టపడుతుంది! పెటల్స్బై స్వాతి.. హైదరాబాద్‌కు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2019లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. తొలుత హాబీగానే మొదలుపెట్టినా తర్వాత జ్యూయెలరీ డిజైన్‌ను సీరియస్‌గానే తీసుకుంది. కుందన్ , జాదూ, జిర్కాన్ జ్యూయెలరీ, గోల్డ్ ఇమిటేషన్ జ్యూయెలరీని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలు. సంప్రదాయ లుక్‌ను ఇచ్చే నగలే కాకుండా ఇండో వెస్ట్రన్ పద్ధతిలోనూ అభరణాలను డిజైన్ చేస్తోంది. భార్గవి కూనమ్.. .. అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కలబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్లైన్ లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: భార్గవి కూనమ్ ధర: రూ. 54,000 జ్యూయెలరీ (కమ్మలు) బ్రాండ్: పెటల్స్ బై స్వాతి ధర: రూ. 2,400 నాకు సంప్రదాయ దుస్తులే ఇష్టం. చీరలు, చుడీదార్లలో సౌకర్యంగా ఫీలవుతాను. పండగలు, ఫంక్షన్స్‌కు వీటినే ప్రిఫర్ చేస్తా. మోడర్న్ దుస్తులు నాకు అంతగా నప్పవు. – పూర్ణ -దీపిక కొండి చదవండి: Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’.. Temple Jewellery: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం! -
చందేరీ సిల్క్ డిజైన్స్.. లైట్ అండ్ బ్రైట్
చూస్తే చూపు తిప్పుకోనివ్వనంత బ్రైట్నెస్ కట్టుకుంటే లైట్ వెయిట్నెస్ అదే, చందేరీ చమక్కు. చందేరీకి అంచుగా బెనారస్ సిల్క్ జత చేరినా.. గద్వాల పట్టు కలిసి నడిచినా ముచ్చటైన డిజైన్‌గా మెరిసిపోతోంది. సంప్రదాయ డ్రెస్ డిజైన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు భార్గవి కూనమ్. హైదరాబాదీ డిజైనర్ భార్గవి వివిధ రకాల చేనేతలతో అందమైన దుస్తులను రూపొందిస్తారు. వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చే డిజైన్స్‌కు పేరెన్నిక గన్న డిజైనర్ చందేరీ సిల్క్‌తో చేసిన డిజైన్స్ ఇవి. లైట్.. బ్రైట్ కాంబినేషన్లో రూపొందించిన ఈ డిజైన్స్ గురించి మరింత వివరంగా... టచందేరీ సిల్క్ డ్రెస్సులు, శారీస్ ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్‌లో ఉన్నాయి? మన దేశీయ చేనేతలు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. వాటిలో చందేరీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కోరా సిల్క్ మిక్సింగ్‌తో చందేరీ సిల్క్‌ను నేస్తారు. కలర్స్ బ్రైట్‌గా, స్పేషల్‌గా ఉంటాయి. చిన్న బుటీ, అంచులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. చేనేతకారులను కలిసి, మాదైన ప్రత్యేక డిజైన్స్ చెప్పి ఈ చీరలను నేయిస్తాం. దీని వల్ల ఏ చీర అయినా, ఫ్యాబ్రిక్ అయినా మరో రెప్లికా అంటూ ఉండదు. మీరు చేసిన కాంబినేషన్స్? చందేరీ లెహంగాలను రూపొందిస్తే ఏవైనా రెండు, మూడు కాంబినేషన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాను. బెనారస్, గద్వాల, కంచిపట్టు అంచులు ఉంటాయి. వీటి వల్ల లెహంగా లుక్ గ్రాండ్‌గా మారిపోతుంది. వీటికి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి, ప్లెయిన్ బ్లౌజ్‌లు, గ్రాండ్‌గా అనిపించే పట్టు దుపట్టాలను కాంబినేషన్‌గా ఉపయోగిస్తాం. చందేరీ సిల్క్ దుస్తులు ఏ సీజన్‌కి బాగుంటాయి? ఏ సీజన్‌కైనా బ్రైట్నెస్ తెస్తాయి ఇవి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావడంతో రాబోయే వివాహ వేడకలకు, వేసవి కాలానికి సౌకర్యంగా, మరింత బాగుంటాయి. | ఎవరెవరికి.. ఏ వయసు వారికి చందేరీ ఫ్యాబ్రిక్ దుస్తులు, చీరలు బాగుంటాయి? అన్ని వయసుల వారికి చందేరీ నప్పుతుంది. అయితే, బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీనేజ్, యంగేజ్ వారికి చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఆకర్షణీయమైన దుస్తులను రూపొందింవచ్చు. వీటిని ఏ కాంబినేషన్లో ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు? లెహంగా లేదా శారీ బ్రైట్ కలర్ ఎంచుకుంటే బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండాలి. కొంచెం ఇండోవెస్ట్రన్ టచ్ కూడా దీనికి ఇవ్వచ్చు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లతో ఆ ప్రయోగం చేయవచ్చు. అయితే, సందర్భం, వేడుకను బట్టి ఇక్కడ ఇచ్చిన డిజైన్స్‌ను ఎంచుకోవచ్చు. -
బోట్‌నెక్ బ్లౌజ్ కట్
లేడీస్ టైలర్ ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకునేవారు బ్లౌజ్‌లలో బోట్‌నెక్ స్టైల్‌ను బాగా ఇష్టపడుతున్నారు. ఆభరణాల అలంకారాలు అంతగా అవసరం లేని బోట్‌నెక్ స్టైల్ కట్ గురించి ఈ వారం ... బోట్‌నెక్ స్టైల్‌ను మొదట్లో పాశ్చాత్యులు టీ షర్ట్స్, నైట్‌వేర్, స్వెటర్స్, కాక్టెయిల్ డ్రెస్సులకు ఉపయోగించేవారు. ముఖ్యంగా నావికులు తెలుపు, సమాంతర చారలు గల బోట్‌నెక్ జాకెట్లు, స్వెటర్లు ఉపయోగించేవారు. అక్కడ నుంచే ఈ తరహా స్టైల్‌ను భారతీయ డిజైనర్లు తీసుకున్నారు. సంప్రదాయ చీరల మీదకు ఎన్నో రకాల డిజైనర్ బ్లౌజ్‌లు వచ్చినట్టే బోట్‌నెక్ డిజైన్ బ్లౌజ్ కూడా బాగా నప్పింది. దీంతో ఆధునిక వనితలు ఈ తరహా నెక్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. బోట్నెక్లో ప్రధానమైనవి * మెడ భాగానికి దగ్గరగా, వెడల్పుగా, ముందు వెనుకలు సమాంతరంగా ఈ నెక్ డిజైన్ ఉంటుంది. * రౌండ్ నెక్ బ్లౌజ్‌కి - బోట్‌నెక్ బ్లౌజ్‌కి మిగతా శరీర కొలతలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఒక్క నెక్లైన్ కొలతల్లోనే మార్పు ఉంటుంది. రౌండ్ నెక్ బ్లౌజ్ మాదిరి బోట్‌నెక్ స్టైల్‌కి ముందు (ఫ్రంట్) భాగంలో హుక్స్ రావు. వెనుక భాగాన హుక్స్ లేదా జిప్ లేదా చేతుల కిందుగా రెండువైపులా (సైడ్స్) జిప్... ఇలా వారి వారి ఇష్టాలను బట్టి డిజైన్ చేసుకోవచ్చు. కట్ చేయాల్సిన విధానం... కత్తెరతో కొలతలు తీసుకున్న ప్రకారం పేపర్‌ను కట్ చేయాలి తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నిలువుగా మధ్యకు మడవాలి. దానిని మధ్యకు మరో మడత వేసి, ముడతలు లేకుండా సరిచేయాలి. సరిచేసిన క్లాత్ మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి దీని ప్రకారం క్లాత్‌ను సరిగ్గా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. లైనింగ్ బ్లౌజ్ ... కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను కట్ చేసుకున్నాక దానిని బట్టి లైనింగ్ క్లాత్‌ను కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాలంటే... క్లాత్‌ని కట్ చేయడానికి ముందు కొలతలు వేసి, దాని ప్రకారం డిజైన్ చేయించుకోవాలి. క్లుప్తంగా! పేపర్ మీద శరీర కొలతలను బట్టి బ్లౌజ్ డిజైన్ తీసుకొని, తర్వాత క్లాత్ కట్ చేసుకోవాలి. అందుకు పేపర్ చార్ట్, మార్కింగ్కి టైలర్స్ చాక్ తీసుకోవాలి. చార్ట్‌ను నిలువుగా మధ్యకు మడిచి, శరీర కొలతలను బట్టి డిజైన్ గీసుకోవాలి. (మార్చి 27 సంచికలో ఇచ్చిన కొలతల గురించి ఈ వారం క్లుప్తంగా) మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే ... (అన్ని ఛాతి చుట్టుకొలతల చార్ట్ మార్చి 27 సంచికలో ఇచ్చాం) నిలువుగా వెనుక భాగం స్టాండర్డ్ లెంగ్త్ 13 1/2 అంగుళాలు . ముందు భాగం 14 అంగుళాలు. * చుట్టుకొలత ముందు భాగం 14, వెనకభాగం 14 అంగుళాలు తీసుకోవాలి. * బోట్ నెక్ (వెనకవైపు) - 3 1/2 అంగుళాలు. ఫ్రంట్ నెక్ 4 1/2 అంగుళాలు. * భుజాలు 6 1/2 అంగుళాలు * షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) - 4 అంగుళాలు * ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2 * ముందు భాగం డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి. * ముందువైపు ఛాతిభాగాన్ని సమానకొలతల్లో అంటే, 34లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి. భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ నిర్వహణ: నిర్మలారెడ్డి ఫొటోలు: శివమల్లాల -
పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్‌లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి. విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు. చేనేత..కళనేత.. మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్‌తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్‌లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రాచీన కళ.. టైటా... ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు. - అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు యాంటిక్ లుక్‌తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
పెద్దంచు... కొత్త చీర
సంప్రదాయం ఉట్టిపడుతూనే సవాళ్లను ఎదుర్కొనేంత ధీమాగా కనపడాలన్నదే ఆధునిక మహిళ ఆంతర్యం. నవతరం మహిళ మనసెరిగిన డిజైనర్లు కంచిపట్టుకూ, క్రేప్కూ క్రియేటివిటీని జోడిస్తున్నారు. బ్రొకేడ్ను, బెనారస్నూ... పెద్ద పెద్ద బార్డర్లతో, ట్రెడిషనల్ డిజైన్లతో అమర్చి... సంప్రదాయ వేడుకలకు వైవిధ్యాన్ని తీసుకువస్తున్నారు. చూపులతోనే అల్లుకుపోయే... చక్కదనాల పెద్దంచు చీరలు ఈ శ్రావ ణానికి ప్రత్యేకం. 1- సంప్రదాయపు వేడుక... ఆకుపచ్చని చందేరీ చీరకు జరీ వర్క్ గులాబీల అంచు. 2- ఆధునిక కళ ..శాటిన్ షేడెడ్ చీరకు ముత్యాల అంచు. 3- ముచ్చటగొలిపే... పెద్ద బార్డర్ పైన మరో డిజైనర్ అంచు.కట్టడి చేసే ఆకర్షణకు... హాఫ్‌వైట్ పట్టు చీరకు జర్దోసీ అంచు. 4- అబ్బురపరిచే వైవిధ్యం..సాదా కంచి పట్టుచీరకు పెద్ద అంచు, దానిపైన వర్క్ చేసిన మరో చిన్న అంచు. లక్ష్మీదేవిలా అలంకరించుకునేందుకు మగువలు ఈ మాసాన ముచ్చటపడుతుంటారు. కళను పెంచే కలర్ చీరలు ఉంటే సరి, లేదంటే కొత్త డిజైన్ల కోసం మార్కెట్‌ను జల్లెడపడుతుంటారు. కానీ, ఉన్న చీరలనే కొత్తగా మార్చేస్తే.. మీ ఆలోచనకు సరికొత్త రూపం ఇవ్వడానికే ఈ డిజైనర్ చీరలు కొలువుదీరాయి. ఆకుపచ్చ చందేరీ చీరకు జరీ పువ్వుల గులాబీ అంచును, చివరన సన్నని లేస్‌ను జతచేయాలి. అదే రంగు బ్లౌజ్ ధరిస్తే పండగ శోభ రెట్టింపు కాకుండా ఉండదు. ప్లెయిన్ మస్టర్డ్ కలర్ కంచిపట్టు చీరకు జర్దోసీ వర్క్ చేసిన నీలాకాశం రంగు అంచును, పల్లూను జత చేరిస్తే వినూత్న కళతో వెలిగిపోతుంది. హాఫ్‌వైట్ బెనారస్ పట్టు చీరను పసుపు, గులాబీ, వంగపండు రంగు శాటిన్ అంచులతో తీర్చిదిద్దడంతో చూపులను కట్టిపడేస్తుంది. గులాబీరంగు పట్టు క్లాత్‌పై చేసినస్వరోస్కి వర్క్ అబ్బురపరుస్తుంది. సిల్వర్ బార్డర్ గల ఎరుపు రంగు బ్రొకేడ్ చీరకు అంచుపైన కుందన్ వర్క్ చేసిన మరో చిన్న అంచును జత చేయడంతో పండగకు దీపకళను తీసుకువచ్చింది. ఎరుపు, వెండి రంగుల కలయికతో ఉన్న శాటిన్ చీరకు ముత్యాలు పొదిగిన అంచు ప్రధాన ఆకర్షణగా మారింది. పెద్ద అంచులు ఇప్పుడు ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉన్నాయి. ఉన్న వాటికే ఇలా ఆకర్షణీయమైన సొబగులు అద్ది, కొత్తగా అందమైన చీరలను మీరూ రూపొందించుకోవచ్చు. ఇవి ఏ వేడుకలోనైనా ప్రత్యేకతను చాటుతాయి. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్