బోట్‌నెక్ బ్లౌజ్ కట్
లేడీస్ టైలర్
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకునేవారు బ్లౌజ్‌లలో బోట్‌నెక్ స్టైల్‌ను బాగా ఇష్టపడుతున్నారు. ఆభరణాల అలంకారాలు అంతగా అవసరం లేని బోట్‌నెక్ స్టైల్ కట్ గురించి ఈ వారం ...
బోట్‌నెక్ స్టైల్‌ను మొదట్లో పాశ్చాత్యులు టీ షర్ట్స్, నైట్‌వేర్, స్వెటర్స్, కాక్‌టెయిల్ డ్రెస్సులకు ఉపయోగించేవారు. ముఖ్యంగా నావికులు తెలుపు, సమాంతర చారలు గల బోట్‌నెక్ జాకెట్లు, స్వెటర్లు ఉపయోగించేవారు. అక్కడ నుంచే ఈ తరహా స్టైల్‌ను భారతీయ డిజైనర్లు తీసుకున్నారు. సంప్రదాయ చీరల మీదకు ఎన్నో రకాల డిజైనర్ బ్లౌజ్‌లు వచ్చినట్టే బోట్‌నెక్ డిజైన్ బ్లౌజ్ కూడా బాగా నప్పింది. దీంతో ఆధునిక వనితలు ఈ తరహా నెక్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు.
బోట్‌నెక్‌లో ప్రధానమైనవి
* మెడ భాగానికి దగ్గరగా, వెడల్పుగా, ముందు వెనుకలు సమాంతరంగా ఈ నెక్ డిజైన్ ఉంటుంది.
* రౌండ్ నెక్ బ్లౌజ్‌కి - బోట్‌నెక్ బ్లౌజ్‌కి మిగతా శరీర కొలతలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఒక్క నెక్‌లైన్ కొలతల్లోనే మార్పు ఉంటుంది. రౌండ్ నెక్ బ్లౌజ్ మాదిరి బోట్‌నెక్ స్టైల్‌కి ముందు (ఫ్రంట్) భాగంలో హుక్స్ రావు. వెనుక భాగాన హుక్స్ లేదా జిప్ లేదా చేతుల కిందుగా రెండువైపులా (సైడ్స్) జిప్... ఇలా వారి వారి ఇష్టాలను బట్టి డిజైన్ చేసుకోవచ్చు.
కట్ చేయాల్సిన విధానం... కత్తెరతో కొలతలు తీసుకున్న ప్రకారం పేపర్‌ను కట్ చేయాలి తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నిలువుగా మధ్యకు మడవాలి. దానిని మధ్యకు మరో మడత వేసి, ముడతలు లేకుండా సరిచేయాలి. సరిచేసిన క్లాత్ మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి దీని ప్రకారం క్లాత్‌ను సరిగ్గా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి.
లైనింగ్ బ్లౌజ్ ...
కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను కట్ చేసుకున్నాక దానిని బట్టి లైనింగ్ క్లాత్‌ను కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది.
హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాలంటే... క్లాత్‌ని కట్ చేయడానికి ముందు కొలతలు వేసి, దాని ప్రకారం డిజైన్ చేయించుకోవాలి.
క్లుప్తంగా!
పేపర్ మీద శరీర కొలతలను బట్టి బ్లౌజ్ డిజైన్ తీసుకొని, తర్వాత క్లాత్ కట్ చేసుకోవాలి. అందుకు పేపర్ చార్ట్, మార్కింగ్‌కి టైలర్స్ చాక్ తీసుకోవాలి. చార్ట్‌ను నిలువుగా మధ్యకు మడిచి, శరీర కొలతలను బట్టి డిజైన్ గీసుకోవాలి.
(మార్చి 27 సంచికలో ఇచ్చిన కొలతల గురించి ఈ వారం క్లుప్తంగా)
మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే ...
(అన్ని ఛాతి చుట్టుకొలతల చార్ట్ మార్చి 27 సంచికలో ఇచ్చాం)
నిలువుగా వెనుక భాగం స్టాండర్డ్ లెంగ్త్ 13 1/2 అంగుళాలు . ముందు భాగం 14 అంగుళాలు.
* చుట్టుకొలత ముందు భాగం 14, వెనకభాగం 14 అంగుళాలు తీసుకోవాలి.
* బోట్ నెక్ (వెనకవైపు) - 3 1/2 అంగుళాలు. ఫ్రంట్ నెక్ 4 1/2 అంగుళాలు.
* భుజాలు 6 1/2 అంగుళాలు
* షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) - 4 అంగుళాలు
* ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2
* ముందు భాగం డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి.
* ముందువైపు ఛాతిభాగాన్ని సమానకొలతల్లో అంటే, 34లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి.
భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్
నిర్వహణ: నిర్మలారెడ్డి
ఫొటోలు: శివమల్లాల