boat capsize
-
ముంబై సముద్ర తీరంలో పడవ ప్రమాదం
-
పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్
ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్కమల్’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్ కొత్త ఇంజన్ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.Mumbai boat accident VIDEO । बोटींच्या अपघाताचा EXCLUSIVE थरारक व्हिडीओ #NDTVMarathi #MumbaiBoatAccident #gatewayofindia pic.twitter.com/aQsaWhGRCs— NDTV Marathi (@NDTVMarathi) December 18, 2024VIDEO CREDITS: NDTV Marathi एलिफंटाकडे जाणारी प्रवासी बोट उलटली;बचावकार्य युद्धपातळीवर सुरु #gatewayofindia #eliphanta #Inframtb @TheMahaMTB pic.twitter.com/Oo3DtaKxp5— Gayatri Shrigondekar (@GShrigondekar) December 18, 2024 -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
రాకాసి అలల పని పడుతూ గస్తీ కాసే బోట్లు (ఫొటోలు)
-
ఆఫ్రికాలో పడవ బోల్తా.. 15 మంది మృతి
ఆఫ్రికన్ దేశమైన మారిటానియా సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ సమాచారాన్ని తెలియజేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300 మంది ఉన్నారు. మారిటానియా రాజధాని నౌవాక్చాట్కు సముద్రమార్గంలో పడవ చేరుకుంటున్న సమయంలో అది బోల్తా పడింది. ఈ పడవ ఏడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పడవలో అధికశాతం మంది సెనెగల్, గాంబియన్ ప్రజలు ఉన్నారు.నౌక్‌చాట్‌లో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందడం, సముద్రంలో 195 మందికి పైగా జనం గల్లంతుకావడం తమకు చాలా బాధ కలిగించిందని ఐఓఎం ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారిలో 10 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. -
ఒడిశా మహానదిలో పడవ బోల్తా
-
సముద్రంలో బోటు బోల్తా...అందరూ సురక్షితం..
-
Gujarat: పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి
వడోదర: గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్ అవడం, పిల్లలెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. #WATCH | Gujarat: Vadodara MP Ranjanben Dhananjay Bhatt says, "The NDRF team is carrying out the rescue operation. The children have been taken to different hospitals...Strict action will be taken in this matter." pic.twitter.com/TsbhTrGPGK — ANI (@ANI) January 18, 2024 #WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh — ANI (@ANI) January 18, 2024 ఇదీచదవండి.. భారత స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన -
విశాఖపట్నం : ఫిషింగ్ హర్బర్‌లో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్లు (ఫొటోలు)
-
దారుణం: 34 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా..
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 34 మంది పాఠశాల విద్యార్థులతో భాగ్మతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8 — mishikasingh (@mishika_singh) September 14, 2023 ఈ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. అటు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Cases: కేరళలో ఐదుకి చేరిన నిఫా కేసులు.. బాధితులతో 706 మంది డైరెక్ట్ కాంటాక్ట్ -
వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ..
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తూ గ్రీసు వైపుగా వచ్చి మునిగిపోయిన బోటులో ప్రాణాలు దక్కించుకున్న కొందరు విస్తుపోయే నిజాలను చెబుతున్నారు. గ్రీసు తీర రక్షక దళాల బృందాలను చూడగానే వారు మమ్మల్ని కాపాడతారని అనుకున్నాము కానీ వారే మా పడవ మునిగిపోవడానికి కారణమని చెప్పారు. ఇటీవల ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు వలస వస్తోన్న ఒక బోటు నీటమునిగిన సంగతి తెలిసిందే. 750కు పైగా వలసదారులు ప్రయాణిస్తున్న ఆ బోటు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా 104 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్, సిరియా, ఈజిప్టు దేశాలకు చెందినవారే. అయితే వీరిలో ప్రాణాలు దక్కించుకున్న ఈజిప్టు వ్యక్తిని అసలేం జరిగిందని ప్రశ్నించగా.. గ్రీసు సమీపంలోకి రాగానే దూరంగా రక్షక దళాలు కనిపించడంతో మమ్మల్ని కాపాడమని అరిచాము. వారు తాడు వేసి మమ్మల్ని రక్షిస్తారని అనుకుంటే మమ్మల్ని కిందకి లాగేశారని అన్నాడు. సిరియాకు చెందిన మరో మృత్యుంజయుడు చెబుతూ.. వారు మా పడవకు ఒకపక్కన తాడు కట్టి బలంగా లాగడంతో బోటు మునిగిపోయిందని అన్నాడు. వీరిద్దరూ చెప్పినదాని బట్టి చూస్తే గ్రీసు తీర రక్షక బృందాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పొట్ట చేతపట్టుకుని జీవనబండిని లాగించాలని ఐరోపా వైపు పయనమైన శరణార్థుల్లో 104 మంది మినహాయిస్తే మిగిలిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా? -
గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు. లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు. మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు. పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు. బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! -
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు
ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు. స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు. "అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్ పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్‌లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి. సాధారణంగా షార్క్‌లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. A kayaker was fishing over a mile offshore in Windward Oahu, Hawaii, when a tiger shark slammed into his boat. https://t.co/d0QzzJODZT pic.twitter.com/P7GStEQvRx — CNN (@CNN) May 16, 2023 -
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పడవ బోల్తా
-
విహార యాత్రలో విషాదం..
-
కేరళ బోటు విషాదం.. ప్రమాదానికి కారణాలు అవేనా?
కేరళలో జరిగిన బోటు ప్రమాదం 22 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం సెలవు కావడంతో సంతోషంగా గడిపేందుకు వచ్చిన అనేక కుటుంబాల్లో తీరాన్ని విషాదాన్ని నింపింది. మలప్పురం జిల్లాలో డబుల్ డెక్కర్ హౌజ్ బోటు మునిగిపోవడంతో అందులోని టూరిస్టులంతా నీటిలో పడిపోయిన విషయం తెలిసిందే. తానూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనలో బోటు యజమానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణాలు! గా పడవ బోల్తా పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానికిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోటులో సామర్థానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ఇద్దరు మహిళలు మృతి నిబంధనల ఉల్లంఘన బోటు మునిగిపోవడం చాలా విషాదకరమైన, దురదృష్టకర సంఘటన అని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే కున్హాలికుట్టి విచారం వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత హౌస్‌బోట్స్ రైడ్స్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన హౌస్‌బోట్‌కు ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్ కూడా లేదు. 40 మంది టికెట్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే చాలామంది టికెట్ తీసుకోకుండానే పడవ ఎక్కిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అండర్ వాటర్ కెమెరాల సాయంతో గాలింపు మలప్పురం బోటు దుర్ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాత పడ్డారు.వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ఎనిమిది మందిని కాపాడి ఆసుప్రతికి తరలించారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విహారయాత్రకు వచ్చి వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారికోసం ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అండర్ వాటర్ కెమెరాల సాయం గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు.. ప్రముఖుల సంతాపం బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుంటుబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. మలప్పురంలో హౌజ్ బోటు బోల్తాపడిన వార్తతో ఆందోళన చెందానని, తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు రాహుల్ గాంధీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లలో అధికారులకు సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఘటనా స్థలానికి సీఎం పినరయి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బోటు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే అత్యవసర సహాయక చర్యను చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా బోటు ఘటన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా నేడు సంతాపదినం ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. తానూర్‌కు చెందిన స్థానికులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi — PMO India (@PMOIndia) May 7, 2023 సీఎం విచారం.. ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు. Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends. — Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023 చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత -
నెల్లూరు : తోడేరు చెరువులో బోటు ప్రమాదం
-
నెల్లూరు: తోడేరు చెరువులో ఆరుగురు యువకుల గల్లంతు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. ప్రమాదం నుంచి తెలియగానే.. కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు ఆయన. ఈ అర్ధరాత్రికి ఆయన తోడేరుకు చేరుకోనున్నట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారాయన. -
ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని..
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్‌లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తున్న ఓడలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో ఓడలో 230 మంది ప్యాసెంజర్లు, 10 మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అకస్మాతుగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయం తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. 17 వేల ఐలాండ్స్కు నిలయమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 2018లో కూడా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఓడ మునిగిన ఘటనలో 167 మంది జలసమాధి అయ్యారు. 19991లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇండోనేసియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విషాద ఘటన కావడం గమనార్హం. చదవండి: బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా? -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం
-
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 23 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరో ప్రమాదం జరిగింది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 70 మంది ఉన్నట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఇంకా ఎంతమైంది అదృశ్యమయ్యారని కచ్చితంగా సంఖ్య చెప్పలేమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. జలాంతార మార్గాలు చాలా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మేలో ఓ పడవ వేగంగా వెళ్లి భారీ ఓడను ఢీకొట్టిన ఘటనలో 26 మంది చనిపోయారు. చదవండి: దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం -
ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి
బతుకుదెరువు కోసం వలసవెళ్లిన 77 మంది బోటు ప్రమాదంలో దుర్మరణం చెందారు. లెబనాన్ నుంచి యూరప్ వెళ్లే క్రమంలో సిరియా తీరంలో పడవ మునిగి ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బోటులో మొత్తం 150 ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సిరియా సహాయక బృందాలు రంగంలోకి దిగి సముద్రంలో మునిగిన వారిని కాపాడారు. ప్రస్తుతం 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది లెబనీస్ పౌరులే ఉన్నారు. సిరియా పోర్టు నగరం టార్టస్ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇంతటి విషాద ఘటన ఇటీవలి కాలంలో చోటుచేసుకోలేదని సిరియా అధికారులు పేర్కొన్నారు. అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చాలా మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్‌లో ప్రజలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బులేక, పనిచేయడానికి ఉపాధి దొరకక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పడవల్లో సముద్ర మార్గం ద్వారా ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. చిన్నసైజు బోట్లలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల అవి మునిగిపోయి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. చదవండి: చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి -
తృటిలో తప్పిన పెద్ద పడవ ప్రమాదం
పి.గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పెద్ద పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సీజన్లో గోదావరికి రెండోసారి వరదలు వచ్చిన నేపథ్యంలో.. మానేపల్లి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయలంకలోని వరద బాధితులకు సర్పంచ్ పితాని చంద్రకళ భర్త నరసింహారావు రోజూ పడవపై వాటర్ టిన్నులు తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇదేవిధంగా నరసింహారావు, వలంటీర్లు కౌరు నందు, షేక్ రెహ్మాన్, చిన్నం రవీంద్ర 40 వాటర్ టిన్నులు తీసుకుని ఆదివారం శివాయలంకకు బయల్దేరారు. ఆ పడవలో కౌరు శ్రీను, పుచ్చకాయల సత్యనారాయణ, పడవ నడిపే వ్యక్తులు మల్లాడి ఏడుకొండలు, రామకృష్ణ ఉన్నారు. ఏటిగట్టు నుంచి 300 మీటర్ల దూరం వెళ్లేసరికి కేబుల్ టీవీ మెయిన్ లైన్ వైరు పడవకు అడ్డం పడింది. దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన పడవ వైనతేయ గోదావరి నదిలో బోల్తా పడింది. ఆ ప్రాంతంలో నది సుమారు 10 అడుగుల లోతు ఉంది. అందులో ఉన్న 8 మంది అతికష్టం మీద సమీపంలోని మెరక ప్రాంతంలోని రోడ్డు పైకి చేరుకుని వరద నీటిలో నిలుచున్నారు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన మరో పడవను పంపించి, నదిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తరలించారు. వలంటీర్ రవీంద్ర నదిలో మునిగి నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
అర్ధరాత్రి ఘోరం.. వలసదారుల పడవ బోల్తా పడి 17 మంది మృతి!
నసౌ: వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయి 15 మంది మహిళలు సహా మొత్తం 17 మంది మృతి చెందారు. వారంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ దీవి బహమాస్‌లో జరిగింది. పడవలోని మరో 25 మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి. న్యూప్రోవిడెన్స్‌కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని.. ఎంత మంది ఉన్నారనేదానికి స్పష్టత లేదని పేర్కొన్నాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఓ వ్యక్తి, ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు. ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ట్విన్ ఇంజిన్ స్పీడ్ బోట్ సుమారు 60 మందితో రాత్రి ఒంటిగంటకు బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ పడవ మియామీకి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బహమాస్ ప్రజలు, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి యాత్రలపై హెచ్చరిస్తూనే ఉంది.’ అని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతీ ప్రధాని అరియెల్ హెన్రీ. ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం విడిచి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. గత ఏడాది జులైలో హైతీ అధ్యక్షుడు జెవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
చెరువులో చేపల మేత వేస్తూ..
జగ్గయ్యపేట: చేపల చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో సాగవుతున్న చేపల చెరువు రక్షణకు ఒంగోలుకు చెందిన మేడా వెంకట్రావ్ (27), భార్య, ఇద్దరు పిల్లలతో కాపలాదారునిగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన వల్లెపు ప్రవీణ్ (22) కూలీ పనుల్లో భాగంగా చెరువు వద్దకు వెళ్లాడు. కాపలాదారు వెంకట్రావ్, ప్రవీణ్ చేపలకు మేత వేసేందుకు ఒడ్డునున్న ఇనుప రేకు పడవతో చెరువులోకి వెళ్లి మేత వేస్తుండగా.. ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. దీంతో ఒడ్డున ఉన్న భార్యా, పిల్లలు కేకలు వేయడంతో సమీపంలోని పంట పొలాల్లో ఉన్న కూలీలు పరుగున వచ్చారు. చెరువులో పైకి తేలిన వెంకట్రావ్‌ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అప్పటికి ప్రవీణ్ ఆచూకీ లభించలేదు. చిల్లకల్లు ఎస్ఐ చిన్నబాబు సిబ్బందితో వచ్చి ప్రవీణ్ కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది. ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వెంకట్రావు తండ్రి ఇదే చెరువుకు కాపలాదారుడిగా ఉంటూ గతేడాది గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వెంకట్రావ్ ఏడాదిగా చెరువుకు కాపలాదారుడిగా ఉంటున్నాడు. -
సీలేరు నదిలో నాటు పడవ బోల్తా
సాక్షి, తూర్పుగోదావరి: సీలేరు నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వై.రామవరం మండలం తెలుగు క్యాంప్ వద్ద ఘటన జరిగింది. చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..! -
సముద్రంలో పడవ బోల్తా.. జాలరి గల్లంతు
అచ్యుతాపురం (అనకాపల్లి): సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడటంతో ఓ జాలరి గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా పూడిమడక తీరంలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇంజన్ లేని బోటులో పూడిమడకకు చెందిన తిక్కల వెంకన్న, మరో ముగ్గురు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక బోటు బోల్తా పడింది. వీరిలో తిక్కల వెంకన్న (50) గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురూ బోటును తిరగేసి వెంకన్న కోసం గాలించారు. అయినా జాడ కానరాకపోవడంతో ఒడ్డుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేటకు వెళ్లిన వారిలో వెంకన్నతో పాటు అతని కుమారుడు రాజు కూడా బోటులో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర చెప్పారు. -
బందరువానిపేట తీరంలో విషాదం
-
ఉప్పాడ సముద్ర తీరం లో బోటు బోల్తా
-
పడవలు బోల్తా ఘటన: ఆరుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, విశాఖపట్నం: సీలేరు నదిలో నాటుపడవలు బోల్తా ఘటనలో గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం రేపు(బుధవారం) గాలింపు చర్యలు చేపట్టనున్నారు. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటన విదితమే. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో ఐదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. చదవండి: విశాఖ హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య -
విశాఖపట్నం: సీలేరు రిజర్వాయర్‌లో నాటు పడవ బోల్తా
-
సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా
విశాఖపట్నం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడ బోల్తా పడ్డాయి. ఈ ఘటన సీలేరుగుంట వాడ దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రెజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో అయిదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు. ► సీలేరు నాటు పడవల ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులు ఒడిశా వాసులైనా పూర్తి సహాయం అందించాలని అధికారుకు తెలిపారు. అవసరమైతే నేవీ సహాయం తీసుకోమని మంత్రి అవంతి అధికారులను ఆదేశించారు. చదవండి: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు -
రాజస్తాన్ చంబల్‌నదిలో పడవ బోల్తా..
-
రాజస్తాన్ చంబల్‌నదిలో తీవ్ర విషాదం
జైపూర్ : రాజస్తాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించగా మరో 14 మంది గల్లంతయ్యారు. పడవలో మొత్తం 25 నుంచి 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొందరు గజ ఈతగాళ్లు ఇప్పటికే నదిలో దిగి బాధితులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పడవలో కొందరు బైక్‌లను కూడా తీసికెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక బృందాలతో చంబల్ నది మొత్తం జల్లెడ పడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా) -
ఆ జ్ఞాపకం... ఓ విషాదం
రంపచోడవరం : దేవీపట్నానికి సమీపంలోని కచ్చులూరు వద్ద పాపికొండలకు చేరువలో పర్యాటకులతో వెళ్తున్న వశిష్ట బోటు గోదావరిలో మునిగి మంగళవారానికి ఏడాది అవుతోంది. నాటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అప్పటి నుంచీ పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. మునిగిపోయిన ఈ బోటును వెలికి తీసేందుకు 38 రోజులు పట్టింది. కచ్చులూరు గిరిజనుల సాహసం ఫలితంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. 46 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. (వారిని గోదారమ్మ మింగేసిందా?) బోటు బయలుదేరినప్పటి నుంచీ...సెప్టెంబరు 15న పోచమ్మ గండి నుంచి రాయల్ వశిష్ట బోటు ఉదయం 9.30కు బయలుదేరింది. అక్కడి నుంచి దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు చేరిన సమయంలో అనుమతుల విషయంలో పోలీసులతో వాగ్వివాదం జరిగి, తిరిగి బోటు ప్రయాణం పాపికొండల వైపు సాగింది. మధ్యాహ్నం 1.48 గంటలకు కచ్చులూరు మందం వద్దకు చేరింది. అక్కడ కొండ మలుపు వద్ద కచ్చులూరు మందంలో బోటు ఒక్కసారిగా కుదుపునకులోనై మునిగిపోయింది. కచ్చులూరు, తూటిగుంట గిరిజనులు బోటు మునిగిపోతుండంగా 26 మందిని కాపాడారు. (6.3 లక్షల చొప్పున సాయం) 24 గంటలు గడవక ముందే గోదావరిలో బోటు మునిగిన ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అధికారులు అందజేశారు. ప్రమాదం జరిగిన 24 గంటలలోపే బోటు మునిగిన ప్రాంతాన్ని ఏరియాల్ వ్యూ ద్వారా గుర్తించారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతుల వద్దకు వెళ్లి పరామర్శించారు. బోటును వెలికితీసేందుకు... కచ్చులూరు మందంలో మునిగిన వశిష్ట బోటును వెలికితీసేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించాయి. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా బోటు జాడను కనిపెట్టలేకపోయారు. బోటు వెలికితీతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్స్ ధర్మాడి సత్యం బృందానికి అప్పగించారు. గోదావరిలో మునిగిన బోటును ఐరన్ రోప్, క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలం కావడంతో, ప్రైవేట్ డైవర్లు బోటు అడుగు భాగానికి వెళ్లి బోటుకు రోప్ బిగించడంతో కథ సుఖంతామైంది. బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాల గాలింపు, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు, వారి బంధువులకు మృతదేహాలు అప్పగింత వరకు అధికారులు ఎంతో శ్రమించారు. -
బ్రెజిల్లో పడవ ప్రమాదం: ‘టైటానిక్’ను తలపించేలా..
బ్రెజిల్: అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్ ఉపనది జారి నది గుండా వెళ్తున్న రెండస్తుల ఫెర్రి రివర్ బోట్ మునిగి 18 మందికి పైగా మృతి చెందగా.. 30 మంది కనిపించకుండా పోయినట్లు బ్రెజిల్ అధికారులు సోమవారం వెల్లడించారు. అమెజాన్ ఉపనది అయినా జారి నదిపై వెళ్తున్న ఫెర్రి శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించగా, 46 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో మరో 30 మంది ప్రయాణికులు ఉన్నారని వారు కనిపించడం లేదని అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. ఇక వారి కోసం విమానాలు, హెలికాప్టర్ల, రక్షణ దళాల ద్వారా గాలింపులు చర్యలు చేపట్టినట్లు కూడా చెప్పారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బ్రెజిల్ నావికాదళం తెలిపింది. అమెజాన్ దాని ఉపనదులలో ఫెర్రి బోట్లు తరచూ ప్రయాణిస్తుంటాయని, ఈశాన్య బ్రెజిల్‌లోని అమాపా రాజధాని మకాపా నగరం నుండి ‘అన్నా కరోలిన్ 3’ అనే ఫెర్రీ పడవ శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరినా ఈ పడవ పారాలోని టారెంకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ‘అన్నా కరోలిన్ 3’ పడవను మరో పడవను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటన నుంచి బయట పడిన వండర్లియా మోంటెరియో అనే మహిళా మీడియాతో మాట్లాడుతూ.. ‘పడవ మునిగిపోతున్నట్లు గమనించి అందరూ భయంతో కేకలు వేశారు. దీంలో అటువైపు వస్తున్న మరొ పడవలో మా అరుపులను గమనించి ఘటన స్థలానికి వచ్చింది. కాగా అప్పటికే పడవ దాదాపుగా మునిగిపోయే స్థితి చేరుకుంది’ అని చెప్పింది. పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్ ఈ క్రమంలో తన భర్త, కుమారుడితో కలిసి తాను పడవ కిటికి గుండా తప్పించుకుని మరో పడవలోకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నామని పేర్కొంది. ఇక కొంతదూరం వెళ్లి వెనక్కి చూసే సరికి పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వివరించింది. కాగా కళ్లేదుటే రెప్పాపాటులో జరిగిన ఈ ఘటన నుంచి తాను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని. ఈ పడవ ప్రమాదం.. ‘టైటానిక్’ సినిమాను తలపించేలా ఉందని చెప్పింది. కాగా ప్రమాదానికి గురైనా ఈ ప్రాంతం చాలా మారుమూలలో ఉన్నందున రెస్క్యూ హెలికాప్టర్లు రావడానికి తొమ్మిది గంటలు సమయం పట్టిందని అధికారలు తెలిపారు. -
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా
సాక్షి, కొమురం భీం: జిల్లాలోని చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామం సమీపంలోని ప్రాణహితనదిలో నీటి ప్రవాహానికి నాటు పడవ బోల్తాపడింది. కర్జెల్లి రేంజ్‌కు చెందిన బాలకృష్ణ, సురేష్ అనే ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లెంతు అయినట్లు తెలుస్తోంది. సద్దాం అనే మరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పడవ నడిపే వ్యక్తి, మరొకరు సురక్షితంగా ప్రమాదం నుంచి నుంచి బయటపడ్డారు. వీరితోపాటు మొత్తం ఆరుగురు ఈ పడవలో ఎక్కినట్లు తెసుస్తోంది. మహారాష్ట్రలోని అహేరి నుంచి గూడెంకు వస్తుండగా.. అధిక నీటి ప్రవాహంతో పడవలోకి నీరు చేరింది. దీంతో నాటు పడప ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది. కాగా గల్లంతు అయిన ఇద్దరు బీట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం కావటంతో గూడెం వాళ్లు మహారాష్ట్రకి వెళ్లినట్లు తెలుస్తోంది. -
బోటు ప్రమాదం : 6.3 లక్షల చొప్పున సాయం
సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. కార్మిక శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.6.30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ బాధిత కుంటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. పడవ ప్రమాదంలో చనిపోయిన గొర్రె రమాదేవి, బస్కె రేణుక, కొమ్ముల పుష్ప, కొండూరు కౌసల్య, బస్కె లలితకు కార్మిక శాఖ తరపున గుర్తింపు కార్డులు ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. అయినా వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం కొంత ఊరట. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారం మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.6.30 లక్షలకు పెంచారు. సీఎం ఆదేశాల మేరకు పడవ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉన్నాం. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ రాష్ట్రం వారితో సమానంగా పరిహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బోటు ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు గుర్తింపు కార్డులు వచ్చేలా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ప్రీమియం మొత్తం చెల్లించి కార్మికులకు అండగా ఉన్నారు’అని చెప్పారు. -
పాతాళానికి పతనం
-
బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు
రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం క్రైం: తమ వారి మృతదేహాల కోసం 38 రోజులపాటు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కడచూపు దక్కకపోయినా.. ఇన్నాళ్లకు తమ వారి మృతదేహపు ఆనవాళ్లయినా దొరికాయని కొందరు.. తమ వారి ఆచూకీ నేటికీ దొరక్క మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గతనెల 15న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాద ఘటనలో.. బోటు వెలికితీత చివరి రోజైన మంగళవారం బోటులోనే 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో బుధవారం ఉదయం వారంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. తల ఉంటే మొండెం లేకపోవడం, మొండెం ఉంటే తల లేకపోవడంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. లభ్యమైన ఏడు మృతదేహాలలో ఐదింటిని కాకినాడకు చెందిన సంగాడి నూకరాజు (55), మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ (62), నల్గొండ జిల్లా హలియా గ్రామానికి చెందిన సురభి రవీంద్ర (25), వరంగల్ జిల్లా కడిపి కొండ గ్రామానికి చెందిన కొమ్ముల రవి (40), బస్కే ధర్మరాజు (48) మృతదేహాలుగా గుర్తించారు. ఆరో మృతదేహం తల, మొండెం లేకుండా కింది భాగం మాత్రమే ఉండగా.. అది మంచిర్యాలకు చెందిన కారకూరి రమ్యశ్రీ (24)దని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అతి పాత పట్టిసీమకు చెందిన బోటు సహాయకుడు కర్రి మణికంఠదని అతని తండ్రి నరసింహారావు చెప్పారు. ఎటూ తేల్చకోలేని అధికారులు దాని శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. దుస్తులు, తాయెత్తు ఆధారంగా.. కాకినాడకు చెందిన బోటు సరంగు (డ్రైవర్) సంగాడి నూకరాజు మృతదేహాన్ని ఆయన వేసుకున్న టీషర్ట్ ఆధారంగా అతని కుమారుడు ధర్మారావు గుర్తించారు. వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బస్కే ధర్మరాజును అతను వేసుకున్న బ్లూషర్ట్, బ్లాక్ ప్యాంట్ ఆధారంగా అతని బంధువులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కొమ్ముల రవి మృతదేహాన్ని జేబులో ఉన్న ఆధార్ కార్డు, పర్సు ఆధారంగా, కాకినాడకు చెందిన బోటు అసిస్టెంట్ డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ మృతదేహాన్ని మెడలో తాయత్తు, వేసుకున్న టీషర్ట్ ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నల్గొండ జిల్లా హాలియాసాగర్‌కు చెందిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ సురభి రవీంద్ర మృతదేహాన్ని అతడు ధరించిన రెడీమేడ్ షర్ట్ ఆధారంగా అతని సోదరుడు మహేష్ గుర్తించాడు. ఆ పుర్రె ఎవరిదో.. ఏడో మృతదేహానికి సంబంధించి తల (పుర్రె) మాత్రమే ఉండటంతో అది మహిళదా, పురుషునిదా అనే విషయం తేలలేదు. దానిని ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించి డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి ఉందని వైద్యాధికారి సీహెచ్ రమేష్‌కిశోర్ తెలిపారు. ఈ బాలుడెవరో.. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట లభించిన బాలుడి మృతదేహాన్ని విశాఖపట్నానికి చెందిన మధుపాడ అఖిలేష్ (5) లేదా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6)దిగా భావిస్తున్నారు. అఖిలేష్ మేనమామ ఆ మృతదేహం తమ వాడిది కాదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు. మొత్తంగా మూడు మృతదేహాల శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. -
రమ్య దొరకలే..!
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): ఎట్టకేలకు నీట మునిగిన పడవను బయటకు తీశారు. అందులో మాత్రం కారుకూరి రమ్య(23) మృతదేహం లభించలేదు. పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పాపికొండల టూరు తీరని విషాధం నింపిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన సెప్టెంబర్ 15 ఇంజినీర్స్ డే రోజున జరగగా సరిగ్గా నేటికి 39 రోజులైంది. రమ్య కుటుంబ సభ్యులు కడసారి చూపుకోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి సుదర్శన్–భూలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె రమ్య(23), కుమారుడు రఘు ఉన్నారు. సుదర్శన్ విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా భార్య గృహిణి. కుమార్తె రమ్య బీటెక్ పూర్తి చేసి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సబ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించింది. విధుల నిమిత్తం వరంగల్ వెళ్లి అక్కడి నుంచి పాపికొండలు విహారయాత్రకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ విహార యాత్రలో భాగంగా 15వ తేదీ ఆదివారం పాపికొండలు గోదావరిలో పడవ మునిగి అంతా గల్లంతయ్యారు. నాటి నుంచి గల్లంతైన రమ్య నేటికీ 39 రోజులైనా ఆచూకీ మాత్రం లభించలేదు. 11 రోజులైనా కన్నబిడ్డ జాడ లభించక పోవడంతో గత నెల 25వ తేదీన సంఘటనా స్థలంలోని గోదావరి వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపించి కర్మకాండలు చేశారు. మూడు రోజులుగా మరోసారి నీటి మునిగిన పడవను వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం వారి బృందం తీవ్ర ప్రయాత్నాలు చేసింది. మూడు రోజుల కిందట పైకి వచ్చే సమయంలో అదుపు తప్పినా కొంత ప్రయోజనం కనబడింది. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు సత్యం బృందం పడవను బయటకు తీసుకురాగలింది. ఆ పడవలో మొత్తం 8 మృతదేహాలు లభించగా అందులో మాత్రం రమ్య మృతదేహం కానరాలేదు. పడవలో మరో 4 మృతదేహాలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ఆస్పత్రికి పంపిస్తామని అధికారులు చెప్పడంతో రమ్య కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అంతా రాజమండ్రి ఆస్పత్రి వద్ద రమ్య కడసారి చూపుకు పడిగాపులు కాస్తున్నారు. దిగాలుగా కుటుంబ సభ్యులు... మూడు రోజులుగా పడవను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయనే మేరకు రమ్య తల్లిదండ్రులు భూలక్ష్మి–సుదర్శన్‌లతో పాటు వారి కుమారుడు రఘు, మరికొంత మంది వారి కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది రాజమండ్రి వెళ్లారు. అయితే మంగళవారం పడవను బయటకు తీయగా అందులో రమ్య మృతదేహం లేకపోవడంతో ఇన్నాళ్లు నిరీక్షణ కన్నా ఈ రోజు తమ కుమార్తె ఆచూకీ లభిస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. రాత్రి కావడంతో పడవను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెప్పడంతో మరో చికటి గడచి తెల్లవారితే కానీ తెలియదు. -
బోటు వెలికితీత.. అత్యంత బాధాకరం
-
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత
-
బోటు వెలికితీత.. హృదయ విదారక దృశ్యాలు
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు.అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును బయటకు తీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ధర్మాడి బృందం బోటును ఒడ్డుకు చేర్చింది. బోటును వెలికితీయడంతో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి. (చదవండి : కచ్చులూరు వద్ద బోటు వెలికితీత) ప్రమాదం జరిగి 38 రోజు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. బోటు పూర్తిగా ధ్వంసమైంది. బోటు శిథిలాల్లో మృతదేహాలు చిక్కిపోయాయి. ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు,కుటుంబ సభ్యులు విచారంలో మునిగారు. దుర్వాసన వస్తుండంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆచూకీ లభించనివారి వివరాలు: కర్రి మణికంఠ, తండ్రి నరసింహారావు, పట్టిసీమ పోలవరం.. మధుపాడ కుశాలి, తండ్రి రమణబాబు, విశాఖపట్నం మధుపాడ అఖిలేష్ (5), తండ్రి రమణబాబు, విశాఖపట్నం తలారి గీతా వైష్ణవీ (5), తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం,. తలారి ధాత్రి (18నెలల) తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), తండ్రి,మహేశ్వరరెడ్డి, నంద్యాల.. సంగాడి నూకరాజు (58), (బోటు డ్రైవర్) తండ్రి కామరాజు, జగన్నాధపురం, కాకినాడ పోలాబత్తుల సత్యనారాయణ (50) (డ్రైవర్), తండ్రి, అప్పారావు, కాకినాడ, చిట్లపల్లి గంగాధర్ (35), తండ్రి సత్యనారాయణ, నర్సాపురం.. కొమ్ముల రవి (40), తండ్రి శామ్యూల్, కడిపికొండ వరంగల్ కోడూరి రాజకుమార్(40), తండ్రి గోవర్ధన్, కడిపికొండ, వరంగల్ బస్కీ ధర్మరాజు, తండ్రి కొమరయ్య, వరంగల్.. కారుకూరి రమ్యశ్రీ (22), తండ్రి సుదర్శన్, నన్నూరు మంచిర్యాల్. సురభి రవీందర్ (25), తండ్రి వెంకటేశ్వరరావు, హాలీయా నల్గొండ -
బోటును వెలికితీయడంతో బయటపడ్డ మృతదేహాలు
-
కచ్చులూరు వద్ద బోటు వెలికితీత
-
రాయల్ వశిష్ట బోటు వెలికితీత
సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. రోప్ సాయంతో బయటకు తీశాం : ధర్మాడి సత్యం రోప్‌ల సాయంతోనే బోటును బయటకు తీశామని ధార్మడి సత్యం అన్నారు. బోటు బయటకు తీయడంలో తన బృందంతో పాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
చిక్కినట్టే చిక్కి.. పట్టుజారిన బోటు
-
బోటు ముందుకు.. శకలాలు బయటకు
రంపచోడవరం/దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనుల్లో సోమవారం మరికొంత పురోగతి కనిపించింది. బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్‌ఫామ్, బోటు క్యాబిన్‌లోని కొంత భాగం, హైడ్రాలిక్ గేర్‌రాడ్, రెయిలింగ్‌లోని కొంత భాగం, బోటు టాప్‌పై ఉండే ప్లాస్టిక్ షీట్, బోటు నేమ్ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారటంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు. పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బోటు ముందు భాగం 30 అడుగులు, వెనుక భాగం నది వైపు 50 అడుగుల లోతులో ఉన్నట్లు వారు చెప్పారు. -
రాయల్ వశిష్ట ఆచూకీ దొరికింది..
-
టీడీపీ అలా చేసుంటే.. బోటు ప్రమాదం జరిగేదా?
సాక్షి, కాకినాడ : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. బోటు ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందని.. అందులో ప్రభుత్వ వైఫల్యం లేదని తెలిపారు. బోటు ప్రమాదంపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని తెలిపారు. బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సహకాలు అందజేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదాలు జరిగనప్పుడే.. నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు కనీసం ఆ కుటుంబాలకు సంతాపం కూడా తెలుపలేదని విమర్శించారు. తొక్కిసలాటకు కారకులైన వారిపైన చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు బోటు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయడాన్ని తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ఉన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయకపోతే.. నీటిపై నడిచి వెళ్తారా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. 250-300 అడుగుల లోతున ఉన్న బోటును బయటకు తీయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. బోటును తీయగలం అని ఎవరైనా ముందుకు వస్తే.. అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. -
లంగరుకు చిక్కింది బోటా.. కొండ రాయా!
రంపచోడవరం/దేవీపట్నం: గోదావరిలో గల్లంతైన ప్రైవేట్ టూరిజం బోటు ‘రాయల్ వశిష్ట పున్నమి’ వెలికితీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దేవుడు గొంది వద్ద గోదావరి వైపు గల ఇసుక మేటను వేదికగా చేసుకుని ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనులు చేపట్టింది. బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతానికి ఐరన్ పంటు, ఏపీ టూరిజం బోటు సహాయంతో వెళ్లి ఐరన్ రోప్‌లను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతంలో వలయం మాదిరిగా నదిలోకి జారవిడిచి ఉచ్చులా బిగించారు. దానికి బలమైన వస్తువు చిక్కుకున్నట్టు గుర్తించారు. ఆ వస్తువు బోటా లేక కొండ రాయా అనేది ఇంకా తేలలేదు. అది ఏమిటనేది మంగళవారం తేలుతుందని చెబుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు బోటును వెలికి తీసేందుకు అవసరమైన రోప్‌లు, కప్పీలతో దేవీపట్నం నుంచి సత్యం బృందం బయలుదేరింది. దేవుడు గొంది ఇసుక దిబ్బల నుంచి ఏపీ టూరిజం బోటు, ఐరన్ పంటు సహాయంతో రెండు వేల అడుగుల పొడవున్న ఐరన్ రోప్‌ను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతం మీదుగా వలయంలా గోదావరిలోకి విడిచిపెట్టారు. రోప్‌కు ఒకవైపు గల చివరి భాగాన్ని (కొస) గోదావరి ఒడ్డున ఉన్న బలమైన చెట్టుకు కట్టారు. రెండో కొసను ఒడ్డున ఉన్న మెషిన్ సహాయంతో బిగించుకుంటూ వచ్చారు. అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో బోటును వెలికి తీసే పనులు నిలిపివేశారు. గోదావరి శాంతించడంతో భయంకరమైన సుడులు తగ్గాయి. నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉండటంతో బోటును వెలికి తీసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రేపటి నుంచి ఆపరేషన్ రాయల్ వశిష్ట
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీతకు రేపటి (ఆదివారం) నుంచి ఆపరేషన్ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాంచీని వెలికితీస్తామని కొందరు ముందుకు వచ్చారని.. వారు ఇచ్చిన సలహాలపై కమిటీ వేశామన్నారు. కమిటీ సూచన మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం(బాలాజీ మెరైన్)కు లాంచీ వెలికితీత పనులు అప్పగించామని వెల్లడించారు. గత పది రోజులకు పైగా లాంచీ మునిగిన ప్రదేశంలో ఈ బృందం ఉండటంతో అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన వచ్చిందన్నారు. వెలికితీత కోసం రూ.22.70 లక్షల వర్క్ ఆర్డర్ ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొనే ప్రతిఒక్కరికి రిస్క్ కవరేజ్ ఉండాలని.. పూర్తి భద్రత చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. తాడు సాయంతో లాంచీ వెలికి తీస్తానని సోషల్ మీడియాలో తెలిపిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కూడా ఈ ఆపరేషన్‌కు సహకరిస్తానని తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. ఇంకా ఆచూకీ లభించాల్సిన 15 మంది పర్యాటకుల డెత్ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామని చెప్పారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. -
కచ్చులూరు హీరోలకు సర్కారు కానుక
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం : ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన గిరిజన మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసినట్లు వివరించారు. ఈ దుర్ఘటనపై శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కచ్చులూరు గ్రామస్తులు ఇంతటి సాహసానికి ఒడిగట్టకపోయి ఉంటే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. కష్టతరమైనప్పటికీ బోటును వెలికితీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. కాగా, ప్రమాదంలో గల్లంతైన ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. గాలింపు చర్యలు నేటికీ కొనసాగుతున్నాయని.. ఆచూకీ తెలియని వారి డెత్ సర్టిఫికెట్లను కుటుంబసభ్యులు అడుగుతున్నందున దానిని పరిశీలించి జీవో తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రమాదంపై త్వరలో నివేదిక ఇదిలా ఉంటే.. రెండు మూడు వారాల్లో బోటు ప్రమాదంపై నివేదిక వస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. బోటును తీసే సామర్థ్యం ఉందని కొందరు ముందుకు వస్తున్నందున వారి ప్రతిపాదనలను పరిశీలించి అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎవరైనా బోటు తీస్తామని ముందుకు వస్తే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు అస్పష్టమైన జీవో జారీచేశారని.. కానీ, స్పష్టమైన జీవోను తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా పాల్గొన్నారు. మరో మృతదేహం లభ్యం కాగా, బోటు ప్రమాదానికి సంబంధించి శుక్రవారం మరో మృతదేహం లభించడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. కడియపులంక వద్ద గోదావరిలో లైఫ్ జాకెట్‌తో ఉన్న పురుషుడి మృతదేహాన్ని బురదలో గుర్తించారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు.. తెలంగాణ విద్యుత్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న కారుకూరి రమ్యశ్రీ (24) ఆచూకీ కోసం ఆమె సోదరుడు, బావ ఎదురుచూస్తుండగా, మరికొందరి కుటుంబ సభ్యులు కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్నారు. డెత్ సర్టిఫికెట్లు ఇస్తే వెళ్లిపోతామని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
అన్నీ సం‘దేహా’లే..!
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం: బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు ఎదురు చూస్తున్నారు. వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనమూనాలు సేకరించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన కాకినాడ సర్పవరం జంక్షన్‌కు చెందిన బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పోతాబత్తుల కుమార్ అంటుండగా, ఇదే బోటు ప్రమాదంలో గల్లంతైన బోటు సహాయకుడు పశ్చిమగోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ(24)దిగా అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించి రిపోర్టు ఆధారంగా మృతదేహం సంబంధిత వ్యక్తులకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయాధికారి టి.రమేష్ కిషోర్ తెలిపారు. మృతదేహాల కోసం ఎదురుచూపులు బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అంకం పవన్ కుమార్, అతడి భార్య అంకం వసుంధరా భవానీ మృతదేహాల కోసం పవన్ కుమార్ మేనమామ రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూస్తున్నారు. ఇతడిని రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిచి మృతదేహాల జాడ తెలిస్తే మీకు సమాచారం అందిస్తామని, మీరు వెళ్లవచ్చని అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మృతదేహాల ఆచూకీ లభించే వరకూ ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారుల వద్ద అన్నారు. బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కోసం అతడి తల్లి పోతాబత్తుల వెంకాయమ్మ, కుమారుడు పోతాబత్తుల కుమార్, ఇతర బంధువులు ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాత పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహం కోసం అతడి తండ్రి కర్రి నరసింహరావు, తల్లి పద్మావతి, సోదరి ఎదురు చూస్తున్నారు. రక్త నమూనాల సేకరణపై స్పష్టత ఇవ్వని అధికారులు వాడపల్లి వద్ద లభించిన మృతదేహం కోసం రెండు కుటుంబాల నుంచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు బంధువుల రక్త నమూనాలు సేకరిస్తామని బుధవారం సాయంత్రం పోలీసులు బాధిత కుటుంబాలకు తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండాలని సూచించారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల్లోపే బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నా వీరి రక్త నమూనాలు సేకరించలేదు. పైగా వీరికి సమయానికి రావాలని చెప్పిన అధికారులు సైతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనిపించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలవరం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ తీసుకు వస్తే విజయవాడలో రక్తసంబంధీకుల రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మూడు గుర్తు తెలియని మృతదేహలు ఇప్పటికే డీ కంపోజైన దృష్ట్యా వాటికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని రోజులు మృతదేహాలు భద్రపరిస్తే వాటి వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటి నుంచి రక్త నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. -
లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే ప్రాణగండం
‘సాక్షి’ ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం/ఐ.పోలవరం(రంపచోడవరం): గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటులో టూరిస్టులు లైఫ్ జాకెట్లు తీసేయడం వల్లే భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరగడానికి ముందు బోటులో ఉన్న వారంతా లైఫ్‌జాకెట్లు వేసుకున్న ఫొటోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 15న బోటు పోశమ్మగండి వద్ద బయలుదేరి దేవీపట్నం పోలీసు స్టేషన్ దాటి ముందుకు వెళ్లిపోయింది. బోటు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించి అక్కడి ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ వెనక్కు తీసుకొచ్చి తనిఖీ చేశారు. ఆ సమయంలో బోటులో ఉన్న ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా లైఫ్‌జాకెట్లు ధరించే ఉన్నారు. బోటుకు అనుమతి ఉందని బోటు పర్యవేక్షకుడు ఉత్తర్వులు చూపించడంతో మిగిలిన వారు లైఫ్ జాకెట్లు వేసుకోవాలని చెప్పి ఎస్ఐ స్టేషన్‌కు వచ్చేశారు. తనిఖీ పూర్తయిన అరగంటలోనే బోటు కచ్చులూరు మందం వద్దకు వెళ్లేసరికి సుడిగుండంలో మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. తనిఖీ అనంతరం టూరిస్టుల్లో సగం మందికి పైగానే లైఫ్‌జాకెట్లు తీసేశారని ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఆరోజే చెప్పారు. బోటులో డ్యాన్స్ ప్రోగ్రాంను ఆస్వాదించేందుకు లైఫ్ జాకెట్లు తీసేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 15 మంది ఆచూకీ కోసం గాలింపు బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు మందం సమీపంలో ఆదివారం మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ బోటులో మొత్తం 77 మంది ప్రయాణించినట్టు అధికారులు నిర్ధారించారు. వీరిలో 26 మంది బయటపడగా, గత వారం రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పోలవరం మండలం ఎదుర్లంక వద్ద ఆదివారం గోదావరిలో లభ్యమైన మరో పురుషుని మృతదేహాన్ని పోలీసులు బోటు ప్రమాదానికి సంబంధించినదై ఉంటుందనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మృతదేహంపై వెంట్రుకలన్నీ పూర్తిగా ఊడిపోయాయి. శరీరంపై డ్రాయర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో గుర్తించలేని 2 మృతదేహాలున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ నిలిచిపోయిందంటూ పలు పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. హర్షకుమార్కు నోటీసు మాజీ ఎంపీ హర్షకుమార్కు రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ శనివారం నోటీసు జారీ చేశారు. బోటు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే వాటితో రంపచోడవరం వచ్చి అందజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
బోటు ప్రమాదంపై కిషన్‌రెడ్డి సమీక్ష
సాక్షి, తూర్పు గోదావరి: కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విపత్తు నివారణ కమిటీతో సమావేశమయ్యారు. ఆదివారం రాజమండ్రిలో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని, ముందుగా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ బోట్లయినా సరే నిబంధనలు కచ్చితంగా పాటించేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదానికి గురైన బోటును గుర్తించేందుకు నేవీ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లిన తరువాత నిపుణులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలోనే ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. కచ్చులూరు వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బోటు బయటకు తీసే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఏం సహాయం కావాలన్నా అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించి బోటును బయటకు తీయడానికి ప్రయత్నిస్తాన్నారు. బోటు ప్రమాదానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు. -
బోటులో వెళ్లింది 77 మంది
సాక్షి ప్రతినిధి బృందం, రాజమహేంద్రవరం : దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రమాద ఘటనలో మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన సమయంలో బోటులో 73 మంది ఉన్నారని తొలుత భావించారు. కానీ బాధితులు, కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమయంలో బోటులో 77 మంది ఉన్నట్టు లెక్కగట్టారు. ప్రమాదం జరిగిన ఆదివారం నుంచి గురువారం వరకూ 34 మృతదేహాలు లభ్యం కాగా.. శుక్రవారం విశాఖకు చెందిన మ«ధుపాడ అరుణ (26) మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 35కు చేరింది. ఏపీæకు చెందిన 9 మంది, తెలంగాణకు చెందిన ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీ తెలియాల్సిన వారి పేర్లు 1. సంగాడి నూకరాజు (55), బోటు డ్రైవర్, కాకినాడ 2. పోతాబత్తుల సత్యనారాయణ (60), అసిస్టెంట్ డ్రైవర్, కాకినాడ 3. చెట్లపల్లి గంగాధర్ (35), నరసాపురం, పశ్చిమ గోదావరి 4. మధుపాడ కుషాలి (3), విశాఖపట్నం 5. మధుపాడ అఖిలేష్ (5), విశాఖపట్నం 6. తలారి గీతావైష్ణవి (5), విశాఖపట్నం 7. తలారి ధాత్రిఅనన్య (2), విశాఖపట్నం 8. బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), నంద్యాల (ప్రస్తుతం ఉంటున్నది విశాఖలో) 9. కర్రి మణికంఠ (24), బోటు సహాయకుడు, పాత పట్టిసీమ 10. సురభి రవీందర్ (25), హాలియాసాగర్, నల్గొండ జిల్లా 11. అంకెం పవన్‌కుమార్ (50), ఉప్పల్, హైదరాబాద్ 12. అంకెం వసుంధర భవాని (43), ఉప్పల్, హైదరాబాద్ 13. కొమ్ముల రవి (40), కడపికొండ, వరంగల్ 14. కొండూరి రాజ్‌కుమార్ (40), కడిపికొండ, వరంగల్ 15. కారుకూరి రమ్యశ్రీ (22), నన్నూరు, మంచిర్యాల 16. బసికె ధర్మరాజ్ (48), కడిపికొండ, వరంగల్ -
ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’కి ఆటంకాలు
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు చేపట్టిన ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం సంప్రదాయ పద్ధతిలో ఇనుప తాడు, ఇనుప కొక్కేలు, లంగరుతో నిర్వహించాల్సిన ప్రక్రియ శుక్రవారం ప్రారంభించడానికి వీలుపడలేదు. 25 టన్నుల బరువైన బోటును 214 అడుగుల లోతు నుంచి బయటకు తీసుకురావాలంటే 100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రేన్ లేదా బుల్డోజర్ అవసరం. భారీ క్రేన్‌ను బోటు మునిగిపోయిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, దేవీపట్నం ఫెర్రీ పాయింట్ నుంచి మంటూరు దాకా 8 కిలోమీటర్లు, మంటూరు నుంచి దేవుడిగొంది వరకు 5 కిలోమీటర్లు రహదారి ఇందుకు ఏమాత్రం అనువుగా లేదు. 4 అడుగులు వెడల్పైన ఈ రోడ్డు ఎగుడుదిగుడుగా ఉంది. భారీ క్రేన్‌ను 10 టైర్ల లారీలోకి చేర్చి, ఆ కొండ రోడ్డు నుంచి ఘటనా స్థలానికి దగ్గర్లోని ఇసుక తిన్నెలపైకి తీసుకురావడం అసాధ్యమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డును 10 అడుగుల వెడల్పు రహదారిగా విస్తరిస్తే గానీ క్రేన్ తీసుకురావడం కష్టమని తేల్చారు. ముంబయి మెరైన్ మాస్టర్స్‌కు చెందిన గౌర్‌బక్సీ ఆధ్వర్యంలోని బృందం తీసుకెళ్లిన ఛాయాచిత్రాల నివేదిక శుక్రవారం జిల్లాకు రాలేదు. బోటు వెలికితీత ఆపరేషన్ నిర్వహించేందుకు భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై బక్సీ నివేదిక కోసం ఎదురుచూశారు. ఆ నివేదిక శనివారం నాటికి వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పారు. బోటులో పదికి పైగా మృతదేహాలు! బోటు ప్రమాదంలో గల్లంతైన వారిని వెలికితీసేందుకు అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బోటు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించిన సుడిగుండాలున్న పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వస్తోంది. అటువైపు వెళ్లేందుకు మత్స్యకారులు సైతం సాహసం చేయలేకపోతున్నారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావడంతో బోటు లోపల ఏసీ క్యాబిన్లో చిక్కుకున్న మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతోనే దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో 10కి పైగానే మృతదేహాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటు మునిగిపోయినప్పుడు ఏసీ క్యాబిన్లో ఒక జంట, వాష్‌రూమ్‌లో ఒకరు, కింద హాలులో ఏడుగురు ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చులూరు మందం వద్ద సంఘటనా స్థలం, దేవీపట్నం ఫెర్రీ పాయింట్లో 144 సెక్షన్‌ను అధికారులు అమలు చేస్తున్నారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మచిలీపట్నం పోర్టు అధికారి ఆదినారాయణను ప్రభుత్వం నియమించింది. ఆయన శుక్రవారం రాత్రి ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. -
‘నన్ను రక్షించి’.. గుండెల్లో ‘గోదారి’ సుడి
సాక్షి,తిరుపతి: అందమైన పొదరిల్లులాంటి కుటుంబం. భర్త, పాపే ఆమె లోకం. ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. గోదావరిలో బోటు రూపంలో మృత్యువు వెంటాడింది. సుడిగుండాలు ఒక్కసారిగా వారిని లాగేసుకుని ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. బోటు మునక ప్రమాదంలో భర్త సుబ్రహ్మణ్యం, కూతురు హాసిని తిరిగి రాని లోకాలకు చేరుకోవడం తిరుపతి వాసి మధులతకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. పీడకలలా వెంటాడుతున్న ఆ విషాదాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... సెలవులు కలిసి రావడంతో... మా మామగారు చనిపోయి 9నెలలైంది. ఆయన అస్థికలను గోదావరిలో కలిపేందుకు రాజమండ్రికి శనివారం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్లో బస చేశాం. ఆదివారం ఉదయం 9గంటల వరకు హోటల్ గదిలోనే ఉన్నాం. అప్పటికే బోటు వారు పదేపదే ఫోన్లు చేశారు. బోటు బయలుదేరుతోంది త్వరగా రమ్మంటూ.. అస్థికలు కలిపి... బోటు బయల్దేరి ఉంటుంది. ఇక ఇప్పుడు వెళ్లి నా బోటును అందుకోలేమని అనుకున్నాం. కోటిలింగాలరేవు వద్ద అస్థికలను కలిపి గల్లిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని వద్దామని నిర్ణయించుకున్నాం. 11.30గంటల ప్రాంతంలో అస్థికలను కలిపేశాం. అయితే అప్పటికి బోటు(మృత్యువు) మా కోసం ఎదురుచూస్తోంది. పోలీసులు ప్రయాణికుల వివరాలను సేకరించుకున్నాక 11.40 గంటల ప్రాంతంలో బోటులో బయల్దేరాం. సరదాగా గడిపాం... బోటులో అందరూ సంతోషంగా ఉన్నారు. డ్యాన్సులు వేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మా పాప హాసిని వాళ్ల నాన్నను కూడా డ్యాన్స్ చేయాలని పట్టుబట్టింది. మా ఆయన ఎప్పుడూ రిజర్వ్‌డుగా ఉంటారు. అలాంటి ఆయన పాప కోసం డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. మరో పది నిమిషాల్లో... మరో పది నిమిషాల్లో ఒడ్డున చేరి భోజనం చేయాల్సి ఉంది. ఇంతలో ఒకతను(గైడ్) గోదావరిలోనే ప్ర మాదకరమైన ప్రాంతం ఇది. ఇక్కడ దాదాపు 300అడుగులకు పైగా లోతు ఉంటుంది. సుడిగుండాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో బోటు కాస్త కుదుపులకు లోనవుతుంది. అయితే ఎవరూ కంగారు పడకండి అని చెప్పిన నిమిషంలోనే బోటు ఒక వైపు ఒరిగిపోయింది. అంతవరకు సంతోషంగా గడిపిన మాకు ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగిపోయింది. నన్ను రక్షించి... బోటు ఒక వైపు ఒరిగిపోవడంతో అందరూ నీళ్లలో పడిపోయారు. మా ఆయన నన్ను అమాంతంగా పైకి లాగారు. పాపను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే భయంకరమైన అలలు, సుడిగుండం వల్ల వారు గల్లంతయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కళ్ల ముందే కకావికలం అయ్యింది. తేరుకునేలోపు అంతా అయిపోయింది. ప్రాణాలను పణంగా పెట్టారు బోటు మునిగిపోతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కచ్చలూరు గ్రామస్తులు గమనించి వెంటనే∙స్పందించారు. చిన్నచిన్న పడవలలో వచ్చి చేరుకున్నారు. నీటిలో మునిగిపోతున్న వారిని ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారు. వారి సాహసంతోనే 16మంది ప్రాణాలతో బయటపడ్డాం. భద్రతా ప్రమాణాలు పాటించలేదు ఇదివరకే గోదావరిలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. చాలా మంది మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బోటు నడిపేవారు భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. స్కూల్ ట్రిప్‌కు వెళ్తాను.. ‘సుబ్బూ’! హాసిని వాళ్ల నాన్నను నాన్న, డాడీ అని సంభోదించదు. సుబ్బూ..! అని పిలుస్తుంది. వారిద్దదూ అంత స్నేహంగా ఉండేవారు. అలా పిలవద్దని మందలించినా ఆయన మాత్రం తనని అలాగే పిలవనీ బాగానే ఉందంటూ నవ్వేవారు. ఈ నెల 14న శనివారం స్కూల్లో ట్రిప్ ఏర్పాటుచేశారు. స్నేహితులతో కలిసి వెళ్తాను సుబ్బూ అని చెప్పింది. అయితే ఆయన మాత్రం వద్దని చెప్పారు. తాతయ్య అస్థికలు కలపడం ముఖ్యమా.. స్కూల్ ట్రిప్ ముఖ్యమా? అని అడిగారు. ఎక్కడ తండ్రి నొచ్చుకుంటాడోనని సరేనంది. ఒక వేళ స్కూల్ ట్రిప్‌కు వెళ్లమని ఉన్నా... లేక మా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉన్నా.. మా అందమైన జీవితం మరోలా ఉండేది అని చెబుతుంటే.. దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. మళ్లీ ఆమె నోట మాట పెగల్లేదు..ధారాపాతంగా కళ్లు వర్షించసాగాయి.. వేదన గోదావరి సుడిగుండమై గుండెలో జ్ఞాపకాలు సుడులు తిరుగుతుంటే..!! చదవండి : ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’ -
రామడుగులో విషాదఛాయలు
సాక్షి, హాలియా: రామడుగు గ్రామం ఒక్కసారిగా కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. గోదావరి లాంచీ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారనే వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలై కంటిమీద కునుకులేకుండా పోయింది. తమ కుమారుడి ఆచూకీ లభించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశపడ్డ కుటుంబ సభ్యులకు పాశం తరుణ్‌రెడ్డి(27) విగతజీవిగా మారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రామడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుచ్చులూరు సమీపంలో గోదావరి నదిఒడ్డుకు చేరిన తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వారి బంధువులకు తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని అప్పగించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకుని మంగళవారం రాత్రి 12 గంటలకు గ్రామానికి తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. విగతజీవిగా మారిన తరుణ్‌రెడ్డిని చూసి రామడుగు వాసులు ఘోల్లుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నకుమారుడు తరుణ్‌రెడ్డి ఇక తిరిగిరానిలోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు గుం డెలవిసెలా రోదించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రంలో చుట్టి తీసుకురావడంతో వారు చూసి తట్టుకోలేక పోయారు. తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం రామడుగులో కుటుంబ సభ్యులు తరుణ్‌రెడ్డికి అశ్రనయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌రెడ్డి కడసారి చూపుకోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రామడుగు శోకసంద్రంగా మారిపోయింది. నాలుగు రోజులైనా లభించని సురభి రవీందర్ ఆచూకీ.. పాపికొండల పర్యటనకు వెళ్లి లాంచీ ప్రమాదంలో గోదావరిలో గల్లంతయిన హాలియా పట్టణానికి చెందిన సురబి రవీందర్ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజులు గడిచినా రవీం దర్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కచ్చలూరులోనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో హాలియాలో వారి తల్లితండ్రులు సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు నేతల పరామర్శ.. రామడుగు గ్రామానికి తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు గ్రామానికి చేరుకుని తరుణ్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్ మజ్జిగపు వెంకట్రామ్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, సైదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. -
చివరి చూపైనా దక్కేనా..!
సాక్షి, విశాఖపట్నం : ఎక్కడున్నారో.. ఏమైపోయారో.. చివరి చూపైనా దక్కుతుందా.. అని గోదారి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. గోదారమ్మ ఆగ్రహానికి గల్లంతైన తమ కుటుంబ సభ్యుల్ని కడసారి చూసేందుకు ఎదురు చూసీ.. చూసీ.. కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇప్పటికే 11 మంది మృతదేహాలు స్వగృహాలకు చేరుకున్నాయి. ఇంకా ఆరుగురి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 18 మంది గల్లంతవ్వగా వారిలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గోపాలపురం గ్రామానికి చెందిన భూసాల లక్ష్మి ఇంటికి చేరుకున్నా కళ్లముందే తన బంధువులను కోల్పోయిన ఘటన నుంచి తేరుకోలేదు. అందరితో వెళ్లి ఒంటరిగా వచ్చిన లక్ష్మి షాక్‌లోనే ఉంది. గల్లంతైన 17 మందిలో ఇప్ప టి వరకూ 11 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ఓవైపు ప్రతికూల వాతావరణం ఎదురవుతున్నా సూర్యాస్తమయం వరకూ బాధితుల ఆచూకీ కోసం సహాయక బృందాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఆయన భార్య అరుణకుమారి, పిల్లలు అఖిలేష్, కుషాలి ఆచూకీ లభ్యం కాలేదు. ఆరిలోవ దుర్గాబజారు ప్రాంతానికి చెందిన తలారి అప్పల నర్సమ్మ మృతదేహం మాత్రమే దొరకగా.. ఆమె వెంట వెళ్లిన మనవరాళ్లు గీతా వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ దొరకలేదు. గాజువాకకు చెందిన బాచిరెడ్డి స్వాతి, ఆమె కుమార్తె హాన్సిక మృతదేహాలు మంగళవారం దొరకగా భర్త బాచిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి మృతదేహం బుధవారం లభించడంతో స్వస్థలం నంద్యాల తరలించారు. అతని కుమారుడు విఖ్యాత్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మిగిలిన వారి మృతదేహాలు స్వగృహానికి చేరుకున్నాయి. ఏ ఇంట చూసినా కన్నీటి సంద్రమే కనిపిస్తోంది. ఉన్నవారిని విగతజీవులుగా పంపిచావు.. మిగిలిన వారినైనా ప్రాణాలతో కాపాడు.. లేకుంటే.. కనీసం కడచూపునకైనా నోచుకోనివ్వు భగవంతుడా అంటూ ప్రతి కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది. కొనసాగుతున్న సహాయక చర్యలు.. బుధవారం రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. తెల్లవారింది మొదలు సూర్యాస్తమయమయ్యే వరకూ రక్షణ బృందాలతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపడుతోంది. తమ వారి ఆచూకీ ఈ రోజైనా దొరకకపోతుందా అనే ఆశతో బంధువులు, కుటుంబ సభ్యులు గోదారి గట్టుపైనే నిరీక్షిస్తున్నారు. -
మరో ఆరు మృతదేహాలు లభ్యం
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: ప్రైవేట్ టూరిజం బోటు ప్రమాద ఘటనలో నాలుగో రోజు బుధవారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఒక మృతదేహం లభించాయి. గాలింపు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నాలుగో రోజు కూడా జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధం బోటులో ప్రయాణించిన పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధత నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం బోటులో 73 మంది ప్రయాణించగా.. తొలిరోజు 8, మూడో రోజు 20, నాలుగో రోజు బుధవారం 6 కలిపి ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీని బట్టి చూస్తే మరో 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీ లభించని వారి వివరాలుంటే తెలియజేయాలని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెవెన్యూ అధికారులు మైక్ ప్రచారం చేశారు. గల్లంతైన వారి బంధువులు ఇచ్చిన మరో 5 పేర్లను కలుపుకుని మరో 18 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రకారం చూస్తే బోటులో ప్రయాణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుందంటున్నారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎంపీ భరత్, ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. బోటు వెలికితీతకు అధిక ప్రాధాన్యం బోటును వెలికి తీసి.. అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నదులు, సముద్రాల్లో మునిగిపోయిన బోట్లను వెలికి తీయడంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వం రప్పించింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ఫైర్ సిబ్బంది మృతదేహాలను గాలిస్తున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఒక బృందం వచ్చింది. కాకినాడ పోర్టు డైరెక్టరేట్ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో మునిగిన బోటును వెలికితీసేందుకు కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం ఆధ్వర్యంలో మరో బృందం రంగంలోకి దిగింది. 2 వేల అడుగుల పొడవైన బలమైన నైలాన్ తాడు, ఐరన్ రోప్, కప్పీలు ఇతర సామగ్రితో బోటును వెలికితీసే పనులు సాగుతున్నాయి. వడి నొక్కేస్తోంది.. సుడి తిప్పేస్తోంది ‘గోదావరిలో వడి ఎక్కువగా ఉంది. ప్రమాద ప్రదేశంలో సుడిగుండాలు తిప్పేస్తున్నాయి. నీటి అడుగున ఉన్న లాంచీ సమీపంలోకి వెళ్లడమే కష్టంగా ఉంది. దీనిని బయటకు తీయడం సవాల్‌గా మారింది’ అని కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం చెప్పారు. కచ్చులూరు వద్ద మునిగిన బోటును సంప్రదాయ పద్ధతిలో వెలికితీసేందుకు సత్యం బృందం రంగంలోకి దిగింది. గతంలో నాగార్జున సాగర్, బలిమెలలో మునిగిన లాంచీలను ఆ సంస్థ వెలికి తీసింది. దాంతో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే పనిని సత్యంకు అప్పగించారు. కచ్చులూరు వద్ద బోటును వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమైన సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అక్కడి సుడిగుండాలు మా బోట్ల కూడా తిప్పేస్తున్నాయి. చాలా రిస్క్ చేయాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు పనిచేశాం. గురువారం ఉదయం మళ్లీ పనులు ప్రారంభిస్తాం. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడితేగానీ బోటును తీయడం సాధ్యం కాదు’ అని వివరించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా గోదావరి పడవ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.3 లక్షలు, స్వల్ప గాయాలకు గురైన వారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
బోటు ప్రమాదం: కొనసాగుతున్న సహాయక చర్యలు
-
పడవ జాడ కోసం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: గోదావరి నదిలో 72 మంది పర్యాటకులతో ప్రయణిస్తున్న ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట గల్లంతై మంగళవారం సాయంత్రానికి 53 గంటలు గడిచాయి. ప్రమాదానికి గురైన బోట్‌ను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావికాదళం బృందాలు శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రైవేట్ బోటు ఆదివారం గోదావరిలో మునిగిపోయింది. అదే రోజు సాయంత్రం విపత్తుల నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు, నేవీ హెలికాప్టర్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంట తీసుకొచ్చిన అత్యాధునిక కెమెరా సహాయంతో నీటి అడుగున బోటు జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీకి చెందిన డ్రాగర్ కంపెనీ తయారు చేసిన ఆధునిక యంత్రాన్ని నేవీ అధికారులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఈ యంత్రం ద్వారా రెస్క్యూ టీమ్ సభ్యుడిని బోటు వద్దకు పంపించి, సురక్షితంగా వెనక్కి తీసుకురావొచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. గత మూడు రోజులుగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్ ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఘటనా స్థలంలో ఈదురు గాలులతో కూడిన ››వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మృతదేహాల జాడ వెతికే పనిలో.. కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన ప్రదేశంలో మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. కచ్చులూరు మత్స్యకారులకు చెందిన 17 బోట్లతోపాటు రెస్క్యూ టీమ్ బోట్లు కచ్చులూరు నుంచి పోలవరం కాఫర్ డ్యామ్ వరకు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరికి మూడు సార్లు వరదలు వచ్చాయి. బోటు బోల్తా పడిన సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి గోదావరిలో నీటి మట్టం పది అడుగుల మేర తగ్గింది. దీంతో గల్లంతైన వారి మృతదేహాలు గోదావరి ఒడ్డున పొదల్లో చిక్కుకునే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా బంగారు తల్లీ.. నేనూ మీతో వస్తా..
-
ఇంకా విషాదంలోనే... లభించని రమ్య ఆచూకీ
సాక్షి, మంచిర్యాల : తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపాన కచ్చులూరు వద్ద ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవ నీటమునిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్, కర్ణమామిడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువ ఇంజినీర్లు గల్లంతైన విషయం తెలిసిందే. కర్ణమామిడి పునరావాస కాలనీకి చెందిన బొడ్డు లక్ష్మణ్(26) నిర్మల్ జిల్లా భైంసా మండలంలో విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మణ్ మృతదేహం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో లభించింది. ఉదయం నుంచి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులరాకతో ఆ ఇంటి వాతావరణం అంతా విషన్నవదనాలతో మునిగిపోయింది. లక్ష్మన్ తల్లి శంకరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అర్దరాత్రి వచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. తల్లడిల్లుతున్న రమ్య తల్లి... నంనూర్ గ్రామానికి చెందిన కారుకూరి రమ్య గోదావరిలో గల్లంతై రోజున్నర గడిచినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గోదావరిని జల్లెడ పడుతున్నా ఆచూకీ తెలియడం లేదు. రమ్య తండ్రి సుదర్శన్ సంఘటనా స్థలానికి బంధువులు, స్నేహితులతో వెళ్లారు. రమ్య మంచిర్యాలలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. హైదరాబాద్ రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ డిప్లమా చేసింది. అనంతరం హైదరాబాద్‌లోనే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ బీటెక్ పూర్తి చేసి అతి తక్కువ సమయంలోనే విద్యుత్‌శాఖలో సబ్ ఇంజనీర్‌గా కొలువు సాధించింది. ఉద్యోగం చేస్తూ నెలరోజుల వేతనం పొందిన రమ్య వరంగల్‌లోని విద్యుత్ శాఖా సమావేశానికి హాజరై పాపికొండలు విహార యాత్రకు వెళ్లి అనుకోని ఘటనలో గల్లంతైంది. ఈ సంఘటన ప్రతిఒక్కరినీ కదిలించగా తల్లి భూలక్ష్మి పడుతున్న ఆవేదన చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. తిరిగి మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. -
గల్లంతైన వారి కోసం నిలువెల్లా కనులై..
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి): బోటు ప్రమాదంలో నరసాపురానికి చెందిన ముగ్గురు గల్లంతుకావడంతో ఈ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఘోరం జరిగి రెండురోజులు గడుస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. నిలువెల్లా కనులై క్షణక్షణం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈఓ వలవల రఘురామ్, గన్నాబత్తుల ఫణికుమార్(బాలు), చెట్లపల్లి గంగాధర్ నివాసాల వద్ద విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బయటపడ్డ మండల గంగాధర్ కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. మహిళలకు చెప్పకుండా..! జరిగింది ఘోర ప్రమాదమని గల్లంతైన వ్యక్తుల బంధువుల్లో పురుషులకు మాత్రమే తెలుసు. ఇక వారు సజీవులుగా వస్తారనే నమ్మకం కూడా వారికి లేదు. అయితే గల్లంతైన వ్యక్తుల భార్యాపిల్లలకు, తల్లులకు ఈ విషయం తెలి యదు. ఏదో చిన్న ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నారని పురుషులు ధైర్యం చెబుతున్నారు. పలకరింపులకు ఇళ్లకు జనం వస్తున్నా.. విషయం బయటే చెప్పి లోపల ఏమీ మాట్లాడొద్దని బతి మాలుకోవడం చూపరుల హృదయాలు కలచివేస్తోంది. కారణం గల్లంతైన ముగ్గురూ 40 ఏళ్ల లోపు వయసువారే. చిన్నచిన్న పిల్లలు, తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నవారు. పైగా ఇందులో కొందరు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు. దీంతో గల్లంతైన వారి నివాసాల వద్ద మాటల్లో చెప్పలేని దయనీయ పరిస్థితి నెలకొంది. పేపర్లు కంటపడకుండా జాగ్రత్త వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు వేడంగి (పుట్టిల్లు)లో ఉన్నారు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతున్నారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక పట్టణంలోని ఇంట్లో రఘురాం తల్లి ఉంది. ఆమె గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. చుట్టాలు, స్నేహితులు ఇళ్లకు రావడంతో ఆమెకు కంగారు పట్టుకుంది. ఏం జరిగింది.. రఘు ఎక్కడ అంటూ మాటమాటకు ఆరాతీస్తోంది. ఆమెను ఓ గదిలో పెట్టి అత్తారింటికి వెళ్లాడు అంటూ చెబుతున్నామని రఘురామ్ స్నేహితుడు చెప్పారు. తల్లికి తెలీనివ్వకుండా.. చెట్లపల్లి గంగాధర్ ఇంటివద్ద పరిస్థితి మరీ దయనీయం. గంగాధర్‌కు తండ్రిలేడు. బంధువర్గం కూడా పెద్దగా లేదు. వృద్ధురాలైన తల్లి వరలక్ష్మి ఇంటివద్దనే ఉంది. కొడుకు రెండు రోజులుగా ఇంటికి ఎందుకు రాలేదో కూడా ఆమెకు ఇప్పటికీ తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పారు. సోదరికి మాత్రం విషయం తెలిసింది. తల్లికి చెప్పకుండా ఆమె గుండెలవిసేలా రోధిస్తోంది. ఆశగా నిరీక్షిస్తున్న ఫణికుమార్ భార్య పట్టణంలో ప్రముఖ న్యాయవాది గన్నాబత్తుల వల్లభరావు కుమారుడు ఫణికుమార్ ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇతనికి భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భార్యకు విషయం తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పడంతో ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. తండ్రి వల్లభరావు కూడా తన కొడుకుకు ఏమీ కాదని వచ్చేస్తాడని విలపిస్తూ నిరీక్షిస్తున్నాడు. రాజమండ్రిలో పడిగాపులు గల్లంతైన వారి సమీప బంధువులు, స్నేహితులు కొంతమంది ప్రమాదం వార్త తెలిసిన వెంటనే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతుండటంతో తమవారి జాడ తెలుస్తుందని అక్కడే పడిగాపులు కాస్తున్నారు. చదవండి : గాలింపు కొనసాగుతోంది: ఏపీఎస్డీఎమ్ఏ -
బోటు ప్రమాదం: జీవో అమలు చేసి ఉంటే
సాక్షి, అమరావతి : పడవ ప్రమాదాలు ఎన్ని జరిగినా, ఎందరి ప్రాణాలు నీటిలో కలిసినా గత సర్కారు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు బోల్తా పడిన సంఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బోటు ఆపరేటింగ్ నిబంధనలను మార్చుతూ 2018 జూన్ 8న జీవోఎంఎస్ నంబరు 14 జారీ చేసింది. బోటు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలో సూచించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు, జీఓ అమలుపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షించారు. పలు ఫెర్రీల్లో స్థానికులు ఏమాత్రం సురక్షితం కాని బోట్లు నడుపుతున్నారని గుర్తించారు. లైఫ్ జాకెట్లు లాంటి రక్షణ సామగ్రి లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడం కోసం బోట్లు నడిపే వారికి తగిన శిక్షణ, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఏమి చేయవచ్చో, ఏమి చేయరాదనే అంశాలపై అవగాహన కోసం ఫెర్రీ పాయింట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించారు. బోట్లలో ప్రయాణికుల సంఖ్యకు సరిపడా లైఫ్ జాకెట్లు కచ్చితంగా సిద్ధంగా ఉంచాలని, ఫెర్రీల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి : భద్రతా నియమాలకు అనుగుణంగా ఉన్న బోట్లను మాత్రమే అదీ రిజిస్ట్రేషన్ ఉన్న వాటినే అనుమతించాలని 2018 జూన్ 8న ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో భద్రత చర్యల నిమిత్తం బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, నిఘా, పటిష్ట రక్షణ చర్యల అమలు బాధ్యతను ఒకే నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా జీవోలో ఉంది. అయితే గత ప్రభుత్వం వేటినీ పాటించలేదు. జీవో జారీ చేసి గాలికొదిలేసిందని మాత్రం స్పష్టమైంది. -
లాంచీ ప్రమాదంలో మరో కుటుంబం!
సాక్షి, విశాఖపట్నం : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మరో కుటుంబం గల్లంతయినట్టు వెల్లడైంది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో ‘మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్ జీరో), హైదరాబాద్’ అనే ఉండేసరికి అంతా తెలంగాణకు చెందిన కుటుంబంగా భావించారు. అయితే.. విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సోమవారం సాయంత్రం రాజేశ్వరమ్మ అనే మహిళ ఫోన్ చేయడంతో బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మరో కుటుంబం గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోనున్న లూఫిన్ ఫార్మాలో పనిచేస్తున్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హన్సిక (4)ను వెళ్లారు. వారి కారులోనే విశాఖలోని బుచిరాజుపాలేనికి చెందిన ఎంవీ సీతారామరాజు (52) కూడా ఉన్నారు. వారంతా రాజమహేంద్రవరంలో ఆగి పాపికొండలకు వెళ్లడానికి లాంచీ ఎక్కారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆందోళన చెందిన మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. -
మరో 12 మృతదేహాలు లభ్యం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్‌గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా లాంచీలోని మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయిన విషయం తెలిసిందే. -
315 అడుగుల లోతులో బోటు
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విశాఖ, మంగళగిరి ప్రాంతాల నుంచి 60 మంది, విశాఖ, కాకినాడ నుంచి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఓఎన్జీసీ హెలికాప్టర్, 8 రకాల బోట్లు, 12 ఆస్కా లైట్లు, ఆ ప్రాంతాలకు చెందిన ఈతగాళ్లు గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. ప్రమాదానికి గురైన బోటు జాడను గుర్తించేందుకు గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి ప్రవాహంలోనే వెతుకుతున్నారు. వారు కూడా కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు. ఈ పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనంటున్నారు. బోటును గుర్తించేందుకు ‘సైడ్ స్కాన్ సోనార్’: నేవీకి చెందిన డీప్ డైవర్స్‌తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది. వీరి వద్ద ఉన్న ‘సైడ్ స్కాన్ సోనార్’ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు. ధవళేశ్వరం వద్ద 175 గేట్లు మూసివేత ఉభయ గోదావరి జిల్లాల్లోని సరిహద్దుల వెంబడి గాలింపు చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతున్నాయి. మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలను ఏర్పాటు చేశారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. -
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ
బోటు ప్రమాద స్థలి నుంచి సాక్షి బృందం: గోదావరిలో ప్రైవేట్ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. వెళ్లొస్తానని.. ఇలా వెళ్లావా తల్లీ.. ‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్ రమ్య తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రమాద స్థలానికి వచ్చిన ఆ తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు. చివరకు బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (24) బోటు ప్రమాదంలో గల్లంతయింది. తండ్రి సుదర్శన్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ కావడంతో ఆదే శాఖలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంది. కష్టపడి చదివి ఇటీవల విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే కనపడకుండా పోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రమ్య ఆచూకీ కోసం వచ్చిన ఆమె మామయ్య రామచంద్రయ్య ఈ విషయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేనొక్కడినే బయటపడ్డా.. తాలిబ్ పటేల్, సాయికుమార్, నేను స్నేహితులం. పాపికొండల అందాలను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆదివారం బోటులో ఎక్కాం. మధ్యాహ్నం భోజనం చేద్దామని బోటు కింది అంతస్తుకు చేరుకున్నాం. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఉన్నట్టుండి బోటు డ్రైవర్ గోదావరిలో దూకేశాడు, అతని వెనుకనే నేనూ దూకేశా. మా వాళ్లు లోపల ఉండిపోయారు. గిరిజనులు పడవలు వేసుకొచ్చి నన్ను ఒడ్డుకు చేర్చి కాపాడారు. మా వాళ్లు ఎక్కడున్నారో? తెలియడం లేదు. – తాలిబ్ మజర్‌ఖాన్ జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఇంకేముందిలే జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. ఆదివారం కదా.. అని పాపికొండల అందాలను చూసేందుకు మా అన్న కుమారుడు విష్ణుకుమార్ వచ్చాడు. ప్రమాద విషయం తెలిసి నేను ఇక్కడకు వచ్చాను. ఏ వైపు నుంచి అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నా. – వేపాకులు నాగేశ్వరరావు,నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా చివరి నిమిషం వరకూ సహాయక చర్యలు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తాం. ఘటన స్థలాన్ని పరిశీలించాం. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ కమిషనర్ అనురాధ తొలుత బోటు బయటికి తీస్తే అందులో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై స్పష్టత వస్తుంది. బోటు 300 అడుగుల కంటే లోతులో ఉండటంతో బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసం మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. అప్పుడే మరికొందరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించాల్సి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు.. సమన్వయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బందాన్ని రంగంలోకి దింపాం. – అనురాధ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ -
ప్రమాదంపై సీరియస్
-
గణేష్ నిమజ్జనం: 28మంది దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: గణేశ్ నిమజ్జం సందర్భంగా పలు రాష్ట్రాల్లో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు భోపాల్‌లో సుమారు 28 మంది దుర్మరణం చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. ఒక్క మహారాష్ట్రలోనే 17మంది నిమజ్జనం సందర్భంగా నీట మునిగారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. అమరావతిలో నలుగురు, రత్నగిరిలో ముగ్గురు, నాసిక్, సింధుదుర్గ్, సతరాలో ఇద్దరు చొప్పున, థానే, ధులే, బుల్దానా,భందారాలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక భోపాల్‌లో ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 16మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఢిల్లీతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు యమునా నదిలో గణపతి నిమజ్జనం సందర్భంగా మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం కర్ణాటకలోని కేజీఎఫ్ పట్టణంలో నిమజ్జనంలో పాల్గొన్న ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. -
గణేశ్ నిమజ్జనంలో తీవ్ర విషాదం : 11 మంది మృతి
భోపాల్ : గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా భోపాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భోపాల్‌లోని ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. భోపాల్ ఐజీ యోగేష్ దేశ్‌ముఖ్ అందించిన సమాచారం ప్రకారం పడవలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 11మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో అయిదుగురి ఆచూకీ గల్లతైంది. వీరి ఆచూకీ కోసం గత ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. ఎస్‌డిఇఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ విషాదంపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. Madhya Pradesh: 11 bodies recovered at Khatlapura Ghat in Bhopal after the boat they were in, capsized this morning. Search operation is underway. More details awaited. pic.twitter.com/mEMSJdzhE9 — ANI (@ANI) September 13, 2019 -
చైనాలో పడవ బోల్తా 10 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నైరుతి భాగంలోని గుయిజోవూలోని బీపన్ నదిలో ఓ పడవ బోల్తా పడడంతో 10 మంది మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు తాము 11 మందిని రక్షించామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో మొత్తం 29 మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవ యజమాని కూడా అందులోనే ప్రయాణిస్తున్నాడు. -
సముద్రంలో 20 గంటలకు పైగా...
విజయనగరం, పూసపాటిరేగ: చింతపల్లి బర్రిపేటకు చెందిన నాటుపడవ ఆచూకీ భోగాపురం మండలం ముక్కాం సముద్రం రేవులో చింతపల్లి మెరైన్ పోలీసులకు లభించింది. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి బర్రిపేట గ్రామానికి చెందిన మైలపల్లి అప్పన్న (30) ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సముద్రంలో వేటకు నాటుపడవపై వెళ్లాడు. చింతపల్లి తీరంలో వేట చేస్తుండగా బోల్తాపడిన నాటు పడవ గాలులకు ముక్కాం తీరం వైపు కొట్టుకెళ్లిపోయింది. అయితే అప్పన్న ఎంత గట్టిగా కేకలు వేసినా సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో ఎముకలు కొరికే చలిలో సుమారు 20 గంటల పాటు గడిపాడు. పడవ గల్లంతు విషయం తెలుసుకున్న మెరైన్ ఎస్సై జి.రామారావు సిబ్బందితో సహా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం పలువురు మత్స్యకారులతో 20 ఇంజిన్ పడవలపై గాలించగా.. ముక్కాంనకు 12 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో నాటుపడవపై ఉన్న అప్పన్న కనిపించాడు. వెంటనే అతడ్ని క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడ్ని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి సింహాచలం, మైలపల్లి తాతలు పరామర్శించారు. -
వహ్వారే.. వల్కిరే..!
సినిమా చూసేందుకు థియేటర్లు.. ఇష్టమైన భోజనం ఆరగించేందుకు రెస్టారెంట్లు.. ఆర్ట్ గ్యాలరీలు.. ఈత కొలనులు అబ్బో.. షాపింగ్‌మాల్స్.. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.. ఇవన్నీ ఉన్నవి ఏ మల్లీకాంప్లెక్స్లోనో లేదా ఫైవ్ స్టార్ హోటల్లోనో కాదు.. ఈ ఫొటోలోని బోటు.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బోటుగా చరిత్రలోకెక్కనుంది. దాదాపు రెండు ఫుట్‌బాల్ కోర్టుల వైశాల్యానికి సమానంగా ఉంటుంది. 229 మీటర్ల పొడవుండే ఈ బోటు ఒక కొన నుంచి మరో కొన వరకు దాదాపు 24 బస్సులను ఒకేసారి పార్కింగ్ చేయొచ్చు. వల్కిరే ప్రాజెక్టుగా పిలిచే ఈ బోటును రూపొందించేందుకు దాదాపు రూ.56 వేల కోట్లు ఖర్చు కానుంది. ఇందులో దాదాపు 52 మంది అతిథులు, 92 మంది సిబ్బంది ఉండొచ్చు. ఇది గంటకు దాదాపు 46 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దక్షిణ కొరియాకు చెందిన చుల్హన్ పార్క్‌కు ఇలాంటి బోటును తయారుచేయించుకోవాలని చిన్నప్పటి కల. ఇందుకోసం దాదాపు 8 నెలల పాటు బోటు డిజైనర్లతో మాట్లాడి.. ఆఖరికి పామర్ జాన్సన్ అనే డిజైనర్‌తో తనకు ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద బోటు అరబ్ రాజు ఖలీఫా బిన్ జయెద్ అల్ నయన్ వద్ద ఉంది. ఇది 180 మీటర్ల పొడవు ఉంది. -
గంగమ్మా... బతికేది ఎలాగమ్మా..!
కృష్ణాజిల్లా, మచిలీపట్నం సబర్బన్: పూడిక దశకు చేరుకున్న గిలకలదిండి సముద్రపు మొగ సముద్రపు మత్య్స వేటకు ప్రధాన అడ్డంకిగా మారింది. అర మీటరు లోతు మాత్రమే ఉన్న నీళ్లలో వేట కు వెళ్లలేక బోట్లన్నీ హార్బర్ వద్దే నిలిచిపోవడం మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం తమ పాలిట శాపంగా మారిందని తీరంలోని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా తీర ప్రాంతంలో సముద్రపు మత్య్సవేట కు ప్రసిద్ధి చెందిన గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నేడు వెలవెలబోతోంది. ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలో వేట కొనసాగించే 180 మెకనైజ్డ్ బోట్లు, 220 మోటరైజ్డ్ బోట్లు హార్బర్ వద్దే నిలిచిపోతున్నాయి. ఫలితంగా వందలాది టన్నుల చేపలు, రొయ్యలు, పీతల సేకరణకు బ్రేక్‌పడి ఎగుమతులు జరగకపోవడంతో మత్య్సకారులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు వర్ణణా తీతం. మచిలీపట్నంతో పాటు గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్య్సకారులు దీనిపై ఆధారపడ్డారు. ప్రస్తుతం బోట్లపై పని చేసే డ్రైవర్లు, కలాసీలు అత్యధికంగా నిజాంపట్నం, అమలాపురం ప్రాంతాలకు చెందిన వారే. పూడిపోయిన మొగ గిలకలదిండి హార్బర్ నుంచి సముద్రం వరకు సుమారు 1.5 మీటర్ల దూరం. ఐదు నుంచి ఏడు రోజులు సముద్రంలో వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు, రెండుమూడు రోజులు వేట సాగించే మోటరైజ్డ్ బోట్లు హార్బర్ నుంచి ఈ మార్గం ద్వారానే సముద్రంలోకి వెళ్లాల్సి ఉం టుంది. తీసుకొచ్చిన మత్య్స ఉత్పత్తులను హార్బర్‌లోనే వేలం పాటల ద్వారా విక్రయాల జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న మత్య్సకా రుల వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో 20 ఏళ్ల క్రితం పూడిపోయిన సముద్రపు మొగను డ్రెజ్జింగ్ చేశారు. అయితే ఆలల తాకిడి కారణంగా క్రమక్రమంగా మొగ పూడికదశకు చేరుకుంటోంది. మూడేళ్లుగా ఈ పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా మోటరైజ్డ్ బోటు సముద్రంలోకి వేటకు వెళ్లాలంటే కనీసం రెండు మీటర్లు లోతు తప్పనిసరి. అంతకన్నా తక్కువ లోతు ఉంటే బోటు అడుగు భాగం మట్టిలో కూరుకుపోతుంది. ప్రస్తుతం సముద్రపు మొగ వద్ద అర కిలోమీటరు దూరం మట్టి తీవ్ర స్థాయిలో మేట వేసిందని కలాసీలు చెబుతున్నారు. అంతేకుండా రోజురోజుకీ తీర ప్రాంత పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో సముద్రంలో ఇసుక దిబ్బలు ఏర్పడినట్లు మత్య్సకారులు చెబుతున్నారు. సముద్రం పాటు సమయంలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ దిబ్బలు సముద్రపు వేటకు ప్రతికూలంగా మారుతున్నాయి. గతంలో 50 మీటర్లు మాత్రమే మొగ పూడిపోవడంతో పోటు సమయం చూసుకుని బోట్లు వేటకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం అత్యధిక దూరం పూడిపోవడంతో హార్బర్ వద్దే రోజుల తరబడి బోట్లు నిలిచిపోతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి ఇలా నెలకు నాలుగుసార్లు వచ్చే తీవ్ర పోటు నీటిని ఆధారంగా చేసుకునే బోట్లు వేటకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే వేట ముగిం చుకుని తిరుగు ప్రయాణంలో తీవ్ర పోటు నీటి కోసం రెండుమూడు రోజులు మొగ వద్దే వేచి ఉండాల్సి ఉంటున్నామని మత్య్సకారులు వాపోతున్నారు. పోటు సమయం చూసుకోకుండా ముందుకు నడిపిన కారణంగా ఇప్పటి వరకు ఐదు బోట్లు మేట వేసిన మట్టిలో కూరుకుపోయాయి. అత్యధిక లోతులోకి కూరుకుపోవడంతో బోటు అడుగు భాగం పూర్తిగా దెబ్బతిని పనికిరాకుండా పోయినట్లు పలువురు బోటు యజమానులు చెబుతున్నారు. అంచనాలతో సరి తీవ్రస్థాయిలో మేట వేసిన మట్టిని డ్రెజ్జింగ్ చేసి తొలగించాలని మత్య్సశాఖ అధికారులు రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మేటను తొలగించేందుకు రూ. 255 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి తెలిపారు. మొగ వద్ద ఉన్న పరిస్థితులను మత్య్సశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాంశంకర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. అప్పట్లోనే పర్యావరణ అనుమతులు, నిధుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా బందరు పోర్టు నిర్మాణ అంశం మొగ డ్రెజ్జింగ్ పనులకు ప్రధాన అడ్డంకిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొగ డ్రెజ్జింగ్ పనులు చేపడితే పోర్టు నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఏంయూడీఏ అధికారులు డ్రెజ్జింగ్ను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందుల్లో మత్య్సకారులు మచిలీపట్నంలోని వేలాది మత్య్సకార కుటుం బాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గిలకలదిండి హార్బర్ పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వేలాది టన్నుల చేపలు, రొయ్యలును ప్రాసెసింగ్ చేయడం, వలల మరమ్మతులు, ఐస్ విక్రయాలు జరపుతూ కొందరు జీవనోపాధి సాగిస్తుంటే మరికొందరు ఎండు చేపల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. సముద్రపు వేటకు అంతరాయం ఏర్పడిన నాటి నుంచి వేలాధి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మత్య్సకారులు వాపోతున్నారు. నడపడానికి కూడా ఇబ్బందే దాదాపు అర కిలోమీటరు పాటు మొత పూడిపోయింది. పాటు సమయంలో నేల కనిపిస్తుంది. నెలకు నాలుగుసార్లు వచ్చే అత్యధిక పోటు నీళ్లను చూసుకుని బోట్లను సముద్రంలోకి తీసుకెళ్తున్నాం. కొన్నిసార్లు బోట్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. వేటకు వెళ్లి వారానికి ఒకసారి వస్తాం. వేట ముగించుకుని వచ్చేపుడు రెండుమూడు రోజులు మొగ దగ్గరే ఉండాల్సి వస్తోంది. నాతో పాటు చాలా మంది డ్రైవర్లు ఇతర ప్రాంతాల వారే. మేట వేసిన మట్టిని తొలగించి మొగను అభివృద్ధి చేయాలి. – పెదశింగు నాగేశ్వరరావు, బోటు డ్రైవర్, అమలాపురం నిధులొస్తే పనులుప్రారంభిస్తాం మొగ వద్ద ఉన్న దారుణమైన పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. మరో నెల రోజుల్లో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనంతరం నిధులు విడుదల కాగానే డ్రెజ్జింగ్ పనులు ప్రారంభించి పూడిక తీత చర్యలు తీసుకుంటాం.–రాఘవరెడ్డి, డీడీ, మత్య్సశాఖ -
బోటులో చెలరేగిన మంటలు
-
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం
-
మధ్యదరాలో 170 మంది జలసమాధి!
ట్రిపోలి: ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్ బయల్దేరిన రెండు పడవలు మధ్యదరా సముద్రంలో మునిగిపోయిన ప్రమాదాల్లో కనీసం 170 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అందులో ఒకటి లిబియా తీరంలో మునిగిపోగా, మరొకటి మొరాకో సమీపంలో మరో పడవను ఢీకొట్టి గల్లంతైనట్లు తెలిసింది. లిబియా తీరంలో ప్రమాదానికి గురైన పడవలో 120 మంది ప్రయాణిస్తున్నారని, అందులో ముగ్గురిని ప్రాణాలతో కాపాడినట్లు ఇటలీ నేవీ ప్రకటించింది. మిగతా వారి జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. మొరాకో సమీపంలో వేరే పడవ మరో పడవను ఢీకొనడంతో 53 మంది వలసదారులు గల్లంతైనట్లు స్పెయిన్ సహాయక బృందాలు వెల్లడించాయి. ఈ రెండు ప్రమాదాల్లో ఎందరు మృతిచెందారో ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, లిబియాకు ఉత్తరంగా ఉన్న జువారా పట్టణంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవ నుంచి 47 మందిని కాపాడినట్లు జర్మనీ సహాయక బృందాలు తెలిపాయి. గత ఏడాది మధ్యదరాలో 2 వేల మందికి పైగా వలసదారులు మృతి చెందడమో, గల్లంతవడమో జరిగింది. -
మధ్యదరా సముద్రంలో మునిగిన వలసదారుల పడవ
-
తెలుగు ప్రజలందరినీ కలిచివేసిన ఘటనకు 12ఏళ్లు
-
చెరువులో పడవ బోల్తా
పశ్చిమగోదావరి, నల్లజర్ల (ద్వారకాతిరుమల): చెరువులో చేపలకు మేత వేస్తున్న సమయంలో పడవ బోల్తాపడి ఇద్దరు యువకులు నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఈ ఘటన నల్లజర్ల మండలం దూబచర్ల శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అనంతపల్లికి చెందిన కనుమూరి కిషోర్ (23) తండ్రి రాజు ఏడాది క్రితం చనిపోయారు. దీంతో తల్లి అమ్మాజీతో కలసి దూబచర్ల గాంధీ కాలనీలోని తాత తాడిగడప కృష్ణ వద్ద ఐదేళ్ల నుంచి ఉంటున్నాడు. రోజూ కిషోర్ అదే కాలనీకి చెందిన స్నేహితుడు తాడిగడప రమేష్ (33)తో కలసి కూలీ పనులకు వెళుతున్నాడు. వీరిద్దరు ఎక్కువగా ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోస్తుంటారు. ఇదిలా ఉంటే కిషోర్ మేనమామ తాడిగడప నాగు గాంధీకాలనీ సమీపంలోని వడ్డోడి కుంట పంచాయతీ చెరువును లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్నాడు. చెరువులో రోజూ ఉదయం, సాయంత్రం కూలీలు చేపలకు మేత వేస్తుంటారు. అయితే గురువారం ఉదయం కూలీలు ఎవరూ లేకపోవడంతో కిషోర్, రమేష్ రేకు పడవపై చెరువులోకి వెళ్లి మేత వేస్తున్నారు. ఈ సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వారిద్దరూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన నల్లజర్ల పోలీస్టేషన్, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. నల్లజర్ల పోలీసులు, భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక బోటు ద్వారా చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కిషోర్, రమేష్‌ను బయటకు తీయగా అప్పటికే రమేష్ మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కిషోర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు రమేష్‌కు భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిషోర్‌కు ఇంకా వివాహం కాలేదు. అక్రమ తవ్వకాలే ప్రాణాలు తీశాయి స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలే కిషోర్, రమేష్‌ను బలిగొన్నాయని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి చెరువులో మట్టిని ఇష్టానుసారం తవ్వేయడం వల్ల లోతు పెరిగిపోయిందని, అందువల్లే వారిద్దరు ప్రాణాలను కోల్పోయారని అంటున్నారు. ఈ చెరువు సమీపంలో ఉన్న ఆర్సీఎం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కిషోర్, రమేష్‌ల అకాల మరణంతో దూబచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
బోట్లలో భద్రత ప్రశ్నార్థకం
సాక్షి,విజయవాడ: పర్యాటక శాఖ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. బోట్లల్లో పరిమితికి మించి ఎక్కించడం.. లైఫ్ జాకెట్లు లేకుండా నదిలోకి తీసుకెళ్లడం చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా భవానీ ద్వీపానికి సందర్శకుల తాకిడి బుధవారం బాగా పెరిగింది. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కిటకిటలాడాయి. సందర్శకుల భద్రతను నీళ్లకు వదిలేశారు. లైఫ్ జాకెట్లు లేకుండా... కృష్ణానదిలో పడవ మునిగి 22 మంది చనిపోయిన ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.. అయినప్పటికీ పర్యాటక శాఖ పాఠం నేర్వలేదు. నదిలో ప్రయాణించే బోట్లలో ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు వేసుకోవాలనే నిబంధన ఉంది. లైఫ్ జాకెట్ వేసుకోని వారిని బోట్లలోకి అనుమతించకూడదు. నిర్ణీత సభ్యుల కంటే ఎక్కువమంది బోటులోకి ఎక్కించ కూడదు. అయితే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మందిని బోటులోకి ఎక్కించారు. 50 మంది ఎక్కాల్సిన బోటులోకి 75 మందిని అనుమతించారు.ప్రయాణికులకు కావాల్సిన లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచలేదు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్కడ లేరు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రైవేటు బోట్లదీ అదే తీరు.. ప్రైవేటు బోట్లు నిబంధనలకు నీళ్లు వదలి యథేచ్ఛగా నదిలో విహారం చేశాయి. జలవనరులశాఖ, పర్యాటక సంస్థ, రెవెన్యూ అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
నర్మదా నదిలో పడవ మునక : ఆరుగురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం నుంచి 36 మందిని కాపాడి స్ధానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నదీమతల్లికి పూజలు చేసేందుకు మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్‌గావ్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులని చెప్పారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. -
60 గంటలైనా ఆచూకీ లేదు
విశాఖపట్నం , నక్కపల్లి/ఎస్‌రాయవరం (పాయకరావుపేట): కాకినాడ నుంచి ఈ నెల 10న వేటకు వెళ్లి పెథాయ్ తుపానుకు సముద్రంలో చిక్కుకున్న రేవుపోలవరం, వాడచీపురుపల్లికి చెందిన ఐదుగురు మత్య్సకారుల ఆచూకీ ఇంకా లభ్యంకా లేదు. స్థానికంగా వేట సాగకపోవడంతో రేవుపోలవరం గ్రామానికి చెందిన వాడబదుల ప్రసాద్, వాడబదుల కోటి, «వాడబదుల ధనరాజ్తోపాటు వాడచీపురుపల్లికి చెందిన మసేను, ప్రసాద్ కాకినాడకు వలసవెళ్లారు. అక్కడినుంచి ఈ నెల 10న మెకనైజ్డ్ బోటుపై యజమానితోపాటు కూలికోసం సముద్రంలో వేటకు వెళ్లారు. సుమారు 30 నాటికన్ మైళ్ల దూరంలో వేట సాగిస్తున్నారు. ఒక సారి వేటకు వెళ్తే పదిరోజుల వరకు తిరిగిరారని, పదిరోజులకు సరిపడా ఆహార సామగ్రి తీసుకెళ్తారని బంధువులు, తోటి మత్య్సకారులు చెప్పారు. అయితే ఈనెల 10న వేటకు బయలు దేరిన వీరికి పెథాయ్ తుపాను సమాచారం అందింది. దీంతో వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో సముద్రంలో అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు గల్లంతయినట్లు స్థానికులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తాము సురక్షితంగానే ఉన్నామని.. కంగారు పడొద్దని.. ఒడ్డుకు చేరుకుంటామని కుటుంబ సభ్యులకు తోటి మత్య్సకారులకు సమాచారం ఇచ్చిన వీరి ఆచూకీ తర్వాత లభించలేదు. సోమవారం ఉద యం నుంచి తుపాను తీవ్రవాయుగుండంగా మా రి కాకినాడ సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో సముద్రంలో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. తిరుగు ప్రయాణంలో ఉన్న తమవారు ఏ రాత్రికైనా ఇళ్లకు చేరుకుంటారని ఆ«శపడ్డ ఆ కుటుంబాలకు నిరాశేఎదురైంది. మంగళవారం కూడా వీరి ఆచూకీ లభించలేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్య్సకారుల కోసం అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి సాయం అందలేదని, ఆచూకీ కనుగొ నడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన చెందుతున్నారు. గల్లంతైన వారు కేవలం వేటే ఆధారంగా కుటుంబాలను పోషిస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లు, లైసెన్స్ కలిగిన ఇంజిన్ తెప్పలపై యజమానులతో పాటు, కూలికి వెళ్తుంటారు. ఒక్కో తెప్ప/ బోటులో ఆరునుంచి 8 మంది వెళ్తుంటారు. వీరు కాకినాడకు ఆరుమాసాల క్రితం వలస వెళ్లారు. ఈ నెలా ఖరుకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయి తే తుపాను రావడంతో వీరంతా సముద్రంలో చిక్కుకోవడంతో ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారోతెలియక భయాందోళన చెందుతున్నారు. కాకినాడ నుంచి కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం వైఫల్యం రేవుపోలవరం మత్య్సకారులు గల్లంతైన విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆ గ్రామాన్ని సందర్శించి బంధువులతో మాట్లాడా రు. అక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అధైర్యపడొద్దని, తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి గల్లంతైన వారిని సురక్షితంగా ఇళ్లకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐదుగురు మత్య్సకారులు గల్లంతయి మూడ్రోజులు గడుస్తున్నా ఆచూకీ కనుగొనే విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని బాబూ రావు విమర్శించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి సహాయ కార్యక్రమాలు చేపట్టడంకూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గల్లం తైన వారిలో కడు పేదలున్నారని, సొంత తెప్పలు లేకపోవడంతో కూలి కోసం బోట్లపై యజమానులతో కలసి వేటకు వెళ్లారని చెప్పారు. గల్లంతైనవారి కోసం కుటుంబీకులు ఎంతో ఆతృతతో ఎదు రు చూస్తున్నారని, ఇప్పటిౖMðనా ప్రభుత్వం స్పం దించి కోస్ట్ గార్డులను సముద్రంలోకి పంపించి వెతికించాలని కోరారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీతో ఫోన్లో మాట్లాడి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబా లకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
గల్లంతై.. గట్టున చేరి..
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): కరప మండలం ఉప్పలంక గ్రామం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన రెండు బోట్లు పెథాయ్ తుపాను ప్రభావంతో గల్లంతయ్యాయి. వాటిల్లోని 14 మంది మత్స్యకారుల జాడ తెలియరాకపోవడంతో వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు నిద్రాహారాలు మాని కళ్లల్లో ఒత్తులు వేసుకుని రేయింబవళ్లు ఎదురు చూశారు. తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని వేయి దేవుళ్లను వేడుకున్నారు. చివరకు వారి ప్రార్థనలు ఫలించాయో ఏమో కానీ, గల్లంతై న మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరారని మంగళవారం రాత్రి సమాచారం అందింది. ఒక బోటు అంతర్వేది వద్ద, మరో బోటు కొత్తపాలెం వద్ద ఉన్నట్టు మత్స్యశాఖ అధికారులు గుర్తిం చారు. వాటిల్లోని మత్స్యకారులను ఫోనులో మా ట్లాడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. ఉప్పలంక గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మిడి గంగావతి భర్త కామేశ్వరరావుకు చెందిన 3255 నంబరు బోటులో ఏడుగురు, ఆయన తమ్ముడు బొమ్మిడి శివకు చెందిన 3306 నంబరు బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 12న సముద్రంలో వేటకు వెళ్లారు. పెథాయ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి వచ్చేయాలని వారికి బంధువులు సమాచారమందించారు. దీంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో తుపాను తీవ్రత ఎక్కువవడంతో వారి బోట్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఒక బోటులో బొమ్మిడి శ్రీను (ఉప్పలంక), గంటా కృష్ణ (పగడాలపేట), సూరాడ అయ్యన్న (పగడాలపేట), అరదాడి రాము (పగడాలపేట), గేదెల ముసలయ్య (ఉప్పలంక), చోడిపల్లి సూర్యారావు (చొల్లంగి), లంకే ఏసు (ఉప్పలంక) ఉన్నారు. రెండో బోటులో ఆకుల వెంకటరాజు (ఉప్పలంక), గలగళ్ల కామేశ్వరరావు (పగడాలపేట), నీలపల్లి వీరబ్బాయి (పగడాలపేట), దండుప్రోలు వెంకటేశులు (చినవలస), ఓలేటి వీరబాబు (ఏటిమొగ), పంతాడి దుర్గ (ఉప్పలంక), పాలెపు ప్రసాద్ (ఉప్పలంక) ఉన్నారు. తమవారి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు మాజీ సర్పంచ్ గంగావతి ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బొమ్మిడి శివ తల్లి నూకరత్నం (మాజీ సర్పంచ్ గంగావతి అత్త) కుమారుని ఆచూకీ కోసం విషణ్ణవదనంతో ఎదురు చూసింది. గ్రామంలోని మహిళలు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మూడేళ్ల క్రితం భర్త కామేశ్వరరావును పోగొట్టుకున్నానని, ఇప్పుడు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. బోట్లు, మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని బంధువులు కోస్ట్‌గార్డ్, ఫిషరీస్ శాఖలకు అందించారు. కోస్ట్‌గార్డ్ కమాండెంట్ శ్యామ్‌కుమార్, విశాఖపట్నంలోని నేవీ డీఐజీ నవదీప్ రాజుల పర్యవేక్షణలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఆరు నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన రెండు నౌకలతో ప్రత్యేక బృందాలు గల్లంతైన బోట్ల కోసం గాలించాయి. కోస్ట్‌గార్డ్, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్ల సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కన్నబాబు పరామర్శ ఉప్పలంకలో బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మంగళవారం పరామర్శించారు. సముద్రంలో చిక్కుకున్నవారు క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పి ఓదార్చారు. మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోనులో వివరించారు. జగన్మోహన్రెడ్డి స్పందించి, ఫోనులో మాజీ సర్పంచ్ గంగావతి భర్త కామేశ్వరరావుతో మాట్లాడారు. ‘‘అధైర్యపడకండి. వేటకు వెళ్లినవారందరూ క్షేమంగా తిరిగివస్తారు’’ అని ధైర్యం చెప్పారు. మరో 20 మంది క్షేమం కాకినాడ సిటీ: పెథాయ్ తుపానులో చిక్కుకున్న మరో మూడు బోట్లు తీరానికి చేరడంతో వాటిల్లోని మరో 20 మంది మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట గ్రామాలకు చెందిన 13 మంది మత్స్యకారులు గత మంగళవారం రెండు బోట్లలో సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్ అయిపోవడంతో సముద్రంలో ఉన్న ఓఎన్జీసీ ఆయిల్ రిగ్గుల వద్దకు వారు చేరుకున్నారు. అక్కడే బోట్లను నిలిపివేసి, వారిని రక్షించాలని మూడు రోజులుగా కోరినా అధికారులు స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. చివరకు ఒక రిగ్గు వద్ద ఉన్న ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు కమాండెంట్ పి.శ్యామ్‌కుమార్ ఆదేశాల మేరకు ఓఎన్జీసీ సిబ్బంది రక్షించి, రిగ్గులో ఆశ్రయం కల్పించారు. వారిని మంగళవారం ఉదయం కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌పై కాకినాడ తీసుకువచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మరో రిగ్గు వద్దకు చేరిన దుమ్ములపేటకు చెందిన వాసిపల్లి దానయ్యకు చెందిన బోటు తుపాను తీవ్రతతో సముద్రంలో మునిగిపోయింది. దానిపై ఉన్న ఆరుగురు కళాసీలను, పర్లోవపేటకు చెందిన వాడమొదలు కోటయ్య (బంగారయ్య) బోటుకు చెందిన మత్స్యకారులు రక్షించి, తమ బోటుపై ఎక్కించుకున్నారు. అందులో మరో ఏడుగురు మత్స్యకారులున్నారు. ఆయిల్ అయిపోవడంతో ఆ బోటు గాలివాటానికి మచిలీపట్నం వైపు వెళ్లి నాగాయలంక సమీపంలోని స్వర్ణగొందికి చేరుకుంది. మొత్తం 13 మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వారిని కాకినాడ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఎదురుచూస్తున్నాం సముద్రంలోకి వేటకు వెళ్లిన నా తమ్ముడు శివ, మరో 13 మంది ఇంతవరకూ తిరిగి రాలేదు. మూడేళ్ల క్రితం నా తండ్రి కామేశ్వరరావు వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఇంతలోనే ఇలా జరిగింది. వేటకు వెళ్లినప్పడు ఇటువంటివి జరుగుతాయని, మూడు రోజుల్లో తిరిగి వస్తారని ధీమాతో ఉన్నాం. శివకు పదేళ్ల నుంచి వేటకు వెళ్లే అనుభవం ఉంది. ఏదో దరికి చేరుతారని నమ్మకంగా ఉన్నాం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మాట్లాడాడు. సిగ్నల్స్ లేక సమాచారం అందడం లేదు. కోస్ట్‌గార్డ్, నేవల్ సిబ్బంది గాలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కురసాల సత్యనారాయణ ఇతర నాయకులు వచ్చి పరామర్శించారు. జగన్మోహన్రెడ్డి సార్‌తో మాట్లాడించారు. చాలా ధైర్యం చెప్పారు. వారు క్షేమంగా ఉన్నారనే కబురు చెప్పలేని ఆనందాన్నిచ్చింది. – బొమ్మిడి కామేశ్వరరావు(మాజీ సర్పంచ్ భర్త), ఉప్పలంక -
నీటి మీదప్రాణాలు..
పర్ణశాల: భద్రాచలం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న రామయ్య పుణ్యక్షేత్రం పర్ణశాల.. ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి.. బోటు షికార్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇదే అదునుగా భావిస్తున్న ఇక్కడి బోట్ల యజమానులు పంచాయతీ శాఖ నిబంధలనకు తుంగలో తొక్కుతూ.. భక్తుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. సరదాగా గోదావరిలో విహరిద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా భావించే యాజమాన్యం బోటులో పర్యాటకులను లెక్కకు మించి ఎక్కించుకుంటున్నారు. బోటులో షికార్ చేసే పర్యాటకుడికి సెఫ్టీ జాకెట్ ఇవ్వకపోవడంతో ఎదైనా ప్రమాదం జరిగితే ప్రణాలు నీళ్ల పాలు కావాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోటు షికార్ పేరుతో పర్యాటకులను గోదావరి మధ్యలోని ఇసుక దిబ్బెల వద్ద దించడంతో ఆ ప్రాంతంపై ఆవగాహన లేని పర్యాటకులు నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి. అయినా బోటు నిర్వాహకుల తీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి మీదప్రాణాలు.. పర్ణశాల ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు, పర్యాటకులు తప్పకుండా గోదావరిలో బోటు షికార్ చేయకుండా వెనుతిరగరు. నిండుగా వుండే గోదావరిలో విహరించేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో పర్యాటకుల ఆసక్తిని క్యాష్ చేసుక9ునేందుకు బోటు నిర్వాహకులు నిబంధనలకు నీళ్లు తొక్కుతున్నారు. వాస్తవానికి పాటాదారుడు పంచాయతీ నిబంధలన ప్రకారం బోట్ షికార్ నిర్వహించాలి. కాని ఇక్కడ అలా జరగడం లేదు. యాజమాన్యం నింధనలకు విదుద్ధంగా లెక్కకు మించి పర్యాటకులను బోట్లలో ఎక్కిస్తున్నారు. పంచాయతీ నిబంధనలు ఇవీ.. బోట్ షికార్ నిర్వాహకులు పంచాయతీ నిబంధనల ప్రకారం గోదావరిలో బోటును నడపాల్సి ఉంటుంది. ప్రతి బోటుకు లైసెన్స్ ఉండాలి.కండిషన్‌ను ప్రతిరోజు తనిఖీ చేయాలి. బోటు ఎక్కిన ప్రతి ఒక్కరికి లైవ్జాకెట్ వేయాలి. పంచాయితీ అధికారులు సూచించిన లెక్క ప్రకారం బోటులో పర్యాటకులను ఎక్కించుకోవాలి. బోటు గోదావరి మధ్య వరకు వెళ్లి వెనుతిరగాలి. బోటు నడిపే వ్యక్తులకు దానిపై పూర్తిస్థాయిలో పట్టు ఉండేలా చూసుకోవాలి. -
ఫిట్‌లెస్ పడవలు
కృష్ణాజిల్లా, తాడేపల్లి రూరల్(మంగళగిరి): అధికారం ముసుగులో బరితెగిస్తున్నారు.. నది గర్భాన్ని దోచుకుంటున్నారు.. నిబంధనలకు తిలోదకాలుస్తున్నారు.. అడ్డగోలుగా తవ్వకాలకు పాల్పడుతున్నారు.. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు.. వివరాలు.. రాజధాని పరిధిలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. మూడు రోజుల క్రితం తుళ్లూరు మండలం లింగాయపాలెంలో యువకుడు మృతి చెందాడు. అయినా క్వారీని యథాతథంగా నిర్వహించారు. దీంతో ఓ పడవ ప్రమాదవశాత్తు శుక్రవారం నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో ఐదుగురు కార్మికులు ఉన్నారు. కృష్ణానది ఒడ్డున వంద మీటర్ల దూరంలో పడవ మునిగిపోవడంతో, కార్మికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బుధవారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలేనికి చెందిన పి.దుర్గాప్రసాద్ మృతి చెందిన ఘటన మర్చిపోకముందే ఇసుకరీచ్‌లో పడవ మునగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఈ విషయాన్ని బయటకు చెబితే మీ అంతు చూస్తామని ఇసుక మాఫియా, టీడీపీ నాయకులు బెదిరించడంతో, జరిగిన ఘటనలను బయటకు చెప్పడానికి కార్మికులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కనిపించని రెవెన్యూ సిబ్బంది.. టీడీపీ నాయకులు ఆధీనంలో ఉన్న ఏ ఇసుకరీచ్‌లో కూడా అధికారులు, రెవెన్యూ సిబ్బంది కనిపించరు. నామాత్రంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. వారికి అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ తరలించడం, కేటాయించిన స్థలంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు ఎక్కడ..? నది, సముద్రం, పెద్ద పెద్ద చెరువుల్లో పడవలు నడపాలంటే కాకినాడ పోర్టులో తర్ఫీదు పొంది, లైసెన్స్ పొందాల్సి ఉంది. ప్రస్తుతం ఇసుక రీచ్‌లో పడవలు నడుపుతున్న డ్రైవర్లకు ఒక్కరికి కూడా లైసెన్స్‌లు లేవు. బుధవారం మునిగిన పడవ డ్రైవర్‌కు లైసెన్స్ లేదని కార్మికులు చెబుతున్నారు. పడవలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కాకినాడ పోర్టులో తీసుకోవాల్సి ఉంది. లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, రాయపూడి, పెనుమాక క్వారీల్లో నడిపే పడవల్లో ఒక్క పడవకు కూడా లైసెన్స్‌లు లేవు. ఈ ఇసుకరీచ్‌లన్నీ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోర్టు అధికారి ఏమన్నారంటే.. కృష్ణానది ఎగువ ప్రాంతంలో తిరుగుతున్న పడవల ఫిట్నెస్ గురించి వివరణ కోరగా మచిలీపట్నం పోర్టు ఫిట్నెస్ అధికారి దుర్గానాగమల్లేశ్వరరావు స్పందిస్తూ ఆ బాధ్యత మా ఒక్కరిదే కాదని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు కూడా ఉందని, వారు గుర్తించి మాకు వివరాలు అందించాలని చెప్పారు. ప్రస్తుతానికి ఏడు ఇసుక పడవలకు మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. మాకన్నా ఎక్కువ బాధ్యత కాకినాడ పోర్టు వారికి ఉందని చెప్పుకొచ్చారు. -
ప్రారంభమైన ఎఫ్1హెచ్2ఓ పోటీలు
-
రేస్.. జోష్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ రేసింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వాన జోరులో రయ్యిమంటూ కృష్ణమ్మ అలలపై పడవలు దూసుకెళుతుంటే.. ఒడ్డున ఉన్న సందర్శకులు ఉత్సాహం ఉరకలెత్తింది. తొలి రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 14 దేశాలకు చెందిన 9 జట్ల నుంచి 19 మంది రేసర్లు పాల్గొంటున్నారు. ఓవర్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేశాం : కలెక్టర్ లక్ష్మికాంతం పవర్ బోటు రేసింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి మీద, మట్టి, గాలిలోనూ ఓవర్ క్రాఫ్ట్‌లు నడుస్తాయని చెప్పారు. ఆదివారం పార్ములా –4 రేస్ 20 నుంచి 25 నిమిషాలపాటు జరుగుతుందన్నారు. 19 లూప్‌లు ఏర్పాటు చేశామని, 250 కి.మీ వేగంలో బోట్లు దూసుకెళతాయని చెప్పారు. 100 కోట్ల ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూస్తారని ఆయన వివరించారు. -
విజయవాడ : ఆహ్లాదం.. ఆహ్వానం
-
మల్లూకి అతిథిగా అల్లు
అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మల్లు (మలయాళీ) అభిమానులు అల్లు అర్జున్‌ని ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోలానే కేరళ లో కూడా అల్లు అర్జున్ సినిమాలు అదే స్థాయిలో సందడి చేస్తాయి. తాజాగా కేరళలో జరుగుతున్న 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు కేరళ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌కు భార్య స్నేహాతో కలసి హాజరయ్యారు బన్నీ. కేరళ గవర్నర్ పళనిసామి సదాశివన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మలయాళ వస్త్రధారణలో అలరించారు అల్లు అర్జున్. ‘‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ను తెల్ల జెండా ఊపి, ఆరంభించే గౌరవాన్ని ఇచ్చినందుకు కేరళ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. ఇటీవలే కేరళ భారీ వరదలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాధితులకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. -
అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం
కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావ్వాల్సిందిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ పోటీలు ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరస్సులో జరగనున్నాయి. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై బన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక బన్నీకి కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అతని సినిమాలు అక్కడ కూడా మంచి కలెక్షనను రాబడతాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
కృష్ణా నదిలో పవర్ బోటింగ్ రేస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎఫ్1 హెచ్2ఓ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలకు అమరావతి వేదిక కానుంది. 14 ఏళ్ల తర్వాత ఈ పవర్ బోటింగ్ రేస్ భారత్‌లో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 350 మంది డ్రైవర్లు నవంబర్ 16 నుంచి 18 వరకు కృష్ణా నదిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. తొలిసారి ఇద్దరు మహిళా డ్రైవర్లు కూడా ఎఫ్1 హెచ్2ఓ రేస్‌లో పాల్గొంటుండటం విశేషం. 2018 గ్రాండ్ ప్రి సీజన్లో మొత్తం ఏడు రేస్‌లకు గాను ఇప్పటికే పోర్టిమావో (పోర్చుగల్), లండన్, ఎవియాన్ (ఫ్రాన్స్), చైనాలలో రేస్‌లు జరిగాయి. ఐదో రేస్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్వహిస్తున్నారు. తర్వాతి రెండు యూఏఈలో జరుగుతాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ మెగా పవర్ బోట్ రేసింగ్ ఈవెంట్‌కు యూనియన్ ఇంటర్నేషనల్ మోటోనాటిక్ (యూఐఎం) గుర్తింపుంది. ఈ పోటీల్లో అమరావతి పేరుతో జట్టు కూడా బరిలో ఉంది. స్వీడన్‌కు చెందిన జొనాస్ అండర్సన్, ఎరిక్ ఎడిన్ ఈ జట్టు డ్రైవర్లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా అన్నారు. గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బోట్ రేసింగ్‌ను పెద్ద సంఖ్యలో చూసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్1 హెచ్2ఓ ప్రతినిధి మార్కో పీట్రినీ, స్పాన్సర్ ఇండియా ఎక్స్ట్రీమ్కు చెందిన సందీప్ మండవ కూడా పాల్గొన్నారు. -
పడవ బోల్తా: అధికారులు సేఫ్, ఒకరు మృతి
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ పడవ ప్రమాదానికి గురయింది. ముంబై నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలో శివాజీ స్మారక్ వద్ద సముద్రంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పడవలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జైన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు చనియారు. మిగిలిన వారిని రక్షించామనీ కోస్ట్ గార్డ్ పీఆర్వో వెల్లడించారు. పడవలో మొత్తం 25 మంది ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. శివాజీ స్మారక నిర్మాణ పనులను పరిశీలించేందుకు రెండు స్పీడ్ బోట్లలో వెళ్తుండగా సీఎస్, ఎమ్మెల్సీ ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. మరో బోటులో 40 మంది పాత్రికేయులు ఉన్నారు. శివాజీ స్మారకానికి 2.6 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాళ్లను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా శివాజీ స్మారకం పనులను నిలిపివేశారు. #UPDATE: Police confirmed that there were 25 people on board the capsized boat. 24 were evacuated safely earlier; one body recovered by State Control Room: Indian Coast Guard PRO — ANI (@ANI) October 24, 2018 -
కృష్ణానదిలో ఇసుక పడవ మునక
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజి కృష్ణానది ఎగువ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో ఇసుక పడవలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాని పర్యవసానమే మంగళవారం తెల్లవారు జామున కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం ఇసుక రీచ్ సమీపంలో ఒక పడవ నీటమునిగింది. ఆ సమయంలో పడవ మీద నలుగురు కార్మికులు ఉన్నారు. ఈత రావడంతో ఈదుకుంటూ నది మధ్యలో నుంచి ఎలాగోలా బయటకు వచ్చారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారులకు కృష్ణానదిలో పడవ మునిగిందనే విషయమే తెలియకపోవడం గమనార్హం. నిబంధనలు ఇలా.. కృష్ణానదిలో పడవ తిరగాలంటే విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో రిజర్వ్ కన్జర్వేటర్ అనుమతి తీసుకోవాలి. పడవ ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు, ఇంజన్ పని విధానం, అది మోయగల బరువు సామర్థ్యాన్ని నిర్ధారిస్తూ సర్టిఫై చేయాలి. అంతేకాకుండా పడవ నడిపేవారు కాకినాడలో శిక్షణ పొంది లైసెన్సు తీసుకోవాల్సి ఉంది. పట్టించుకోని అధికారులు ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతి వరకు ప్రతిరోజూ ఇసుకలోడుతో వేల పడవలు తిరుగుతున్నాయి. వాటిని ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. సంవత్సరానికి కృష్ణాతీరంలో ఏదో ఒకచోట 10 నుంచి 15 పడవలు మునిగిపోతున్నాయి. గతంలో ప్రకాశం బ్యారేజి సమీపంలో ఇసుక పడవ మునిగిపోయింది. పడవ మునగకుండా ప్రయత్నిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు తప్ప, తిరిగే పడవలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఉద్ధండరాయనిపాలెంలో మునిగిపోయిన పడవను ఇసుక మాఫియా బయటకు తీయకుండా వదిలేసింది. క్వారీలో ఎవరూ లేని సమయంలో దాన్ని బయటకు తీద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండ్రోజుల పాటు పండుగ సెలవలు రావడంతో ఎవరికీ తెలియకుండా పడవను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు క్వారీలో కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆ చుట్టుపక్కల కనిపించకపోవడం విశేషం. పడవ మునిగిన విషయం తెలియదు.. ఇసుక పడవ మునిగిన విషయమై ఇరిగేషన్ డీఈ గోపీనా«థ్‌ను వివరణ కోరగా, పడవ మునిగిన విషయం తమకు తెలియదని తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయం మచిలీపట్నం పోర్టు వారు చూస్తున్నారని, కృష్ణానది ఎగువ ప్రాంతంలో సందర్శకులను తరలించే బోట్ల ఫిట్నెస్ సర్టిఫికెట్లు మాత్రమే మేం పరిశీలిస్తామన్నారు. మచిలీపట్నంలో అనుమతి తీసుకున్నది లేనిది ఎవరు పరిశీలిస్తారు అని ప్రశ్నించగా, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. -
టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం
-
126 మంది జల సమాధి
నైరోబి: టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో గురువారం పడవ మునిగిన ఘటనలో 126 మంది మృతి చెందారు. సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియాæ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. బాధితులంతా బుగొలొరా పట్టణంలో జరిగిన సంత నుంచి తిరిగి వస్తున్నారు. ఉకారా తీరం 50 మీటర్ల దూరంలో ఉందనగా కిందికి దిగే ప్రయత్నంలో అంతా పడవకు ఒకే వైపునకు చేరడంతో పడవబోల్తాపడింది. ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి నిర్వాహకుల వద్ద ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. వందమందిని మాత్రమే తీసుకెళ్లే ఎంవీ న్యెరెరె అనే ఈ పడవలో రెట్టింపు సంఖ్యలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది. పాతకాలం నాటి ఈ పడవలో ప్రయాణికులతోపాటు పెద్ద మొత్తం లో సిమెంటు, మొక్కజొన్న, పండ్లు వంటి లగేజి కూడా ఉందని చెబుతున్నారు. టాంజాని యా, ఉగాండా, కెన్యాల పరిధిలో 27వేల చద రపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న విక్టోరియా లేక్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. -
షేమ్ టు సేమ్
సాక్షి,తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీడియా ముందుకొచ్చి ‘‘అది చేస్తాం.. ఇది చేస్తాం’’ అని చెప్పి ఆనక మిన్నుకుండిపోవడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పోటీ పడుతున్నారు.దీనికి కోనసీమలో లంక గ్రామాలకు రవాణా కల్పించడంలో చేసిన ప్రకటనలే నిదర్శనం. జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక మొండి–సలాదివారిపాలెం మధ్య వృద్ధ గౌతమిలో పడవ బోల్తా పడిన ఘనటలో ఒక మహిళతో సహా ఏడుగురు విద్యార్థినులు గల్లంతయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థినుల జాడ ఇప్పటికీ లేదు. వారం రోజలు గాలించి వదిలేశారు. అప్పట్లో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ గోదావరి దాటి లంకల్లోకి వెళ్లే ఎనిమిది ముఖ్యమైన ప్రాంతాల్లో రెండు మూడు నెలల్లో పంట్లు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు అక్కడ ప్రభుత్వం తరఫున స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రోజులు దాటి నెలలు గడిచినా వాటిని ఏర్పాటు చేయలేదు. ఆయన కూడా హామీ ఇచ్చారు.. గత నెల 22న గోదావరి వరదలపై సమీక్షకు వచ్చిన సీఎం చంద్రబాబు వద్ద మీడియా స్పీడు బోట్ల ఏర్పాటు అంశాన్ని లేవనెత్తగా 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని సీఎం కూడా హామీ ఇచ్చారు. రేపటితో ఆ గడువు ముగుస్తోంది. కానీ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఆదివారం ఐ.పోలవరం మండలం రామాలయం పేట– జి.మూలపొలం మధ్య వృద్ధ గౌతమిలో పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ఓ మోటారు సైకిల్ నదిలో పడిపోగా అదృష్టవశాత్తూ పడవలో ఉన్న 30 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ఆ ఘటన తర్వాత ప్రమాదాలు.. పశువుల్లంక మొండి ప్రమాదం తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. కొన్ని త్రుటిలో తప్పాయి. గత నెల 20న ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద పడవ తాటి చెట్టుకు ఢీకొని నదిలో బోల్తా పడింది. ఈ ఘనటలో బుచ్చి మహేశ్వరరావు అనే 26 ఏళ్ల యువకుడు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. పడవలో ఉన్న మరో 14 మంది నదిలో పడిపోయినా బ్యాగులు, కూరగాయల సంచులు పట్టుకోవడం ద్వారా బతికి బయటపడ్డారు. ఇదే విధంగా ఆదివారం రామాలయం పేట– జి.మూలపొలం మధ్య ప్రమాదం జరిగింది. 30 మంది ప్రజలు, మోటారు సైకిళ్లతో వెళుతున్న పడవలో సరంగు ఓ పక్కకు వెళ్లడంతో పడవ వాలి మోటారు సైకిల్ నదిలో పడింది. వెంటనే సరంగు మధ్యలోకి రావడంతో పడవ యథాస్థితికి వచ్చింది. అప్పటికే పడవలో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఏ మాత్రం ఒక్కరు లేచి కంగారు పడినా పడవ బోల్తా పడేది. ఇందులో రోజువారీ కూలి పనులకు వేళ్లే మహిళలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణ హానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ గారూ ఇకనైనా మేల్కొండి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో కలెక్టరేట్ వద్ద ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే కలెక్టర్ కార్తికేయ మిశ్రా వేలాది మంది సమస్యను కళ్లారా చూసినా పట్టించుకోకపోవడం లంక వాసులకు శాపంగా మారింది. స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామని తాను ఇచ్చిన హామీని కలెక్టర్ కార్తికేయ మిశ్ర మరచిపోడం విడ్డూరంగా ఉంది. పశువుల్లంక ప్రమాద సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, నావీదళం, ఇతర శాఖాధికారులు, సిబ్బంది వందల సంఖ్యలో గల్లంతైన వారి కోసం వారం రోజులపాటు వెతికారు. హెలికాప్టర్‌తోనూ గాలించారు. రూ.కోట్లు ఖర్చు చేశారు. మరో మారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.. కోనసీమ ప్రాంతంలో పశువుల్లంక మొండి– సలాదివారిపాలెం, గుత్తున దీవి– గోగుల్లంక, జి.మూలపొలం– రామాలయంపేట, గంటిపెదపూడి– పేదపూడి లంక, పల్లంకుర్రు– పెద్దలంక, కరవాక– వాడలరేవు, గోదావరి ఎగువన ఏజెన్సీ ప్రాంతంలోని కూనవరం– రుద్రమకోట, దేవీపట్నం– సింగనాపల్లి మధ్య పంట్లు ఏర్పాటు చేసే వరకు స్పీడు బోట్లు తిప్పడం వల్ల ప్రాణ నష్టం నివారించవచ్చు. ఆ దిశగా ఇకనైనా కలెక్టర్ కార్తికేయ మిశ్ర అడుగులు వేయాలని కోనసీమ లంక గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. -
అస్సాంలో బోటు పల్టీ.. ముగ్గురి మృతి
గువాహటి: అస్సాంలో ఘోర ప్రమాదం సంభవించింది. గువాహటి నుంచి దాదాపు 36 మందితో బ్రహ్మపుత్ర నది మీదుగా ఉత్తర గువాహటి నగరానికి వెళుతున్న నాటు పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు 10 మందిని రక్షించగా, మరో 12 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంజిన్ చెడిపోవడంతో నాటు పడవ సమీపంలోని ఓ రాయిని ఢీకొని పల్టీ కొట్టిందని కామరూప్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కమల్ కుమార్ తెలిపారు. ఈ పడవలో నిబంధనలకు విరుద్ధంగా 18 మోటార్‌సైకిళ్లను తీసుకెళ్తున్నారనీ, మొత్తం ప్రయాణికుల్లో 22 మందికే సరైన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం సోనోవాల్ విచారణకు ఆదేశించారు. -
అటల్జీ అస్థికల నిమజ్జనంలో అపశ్రుతి
-
అటల్జీ అస్థికల నిమజ్జనంలో అపశ్రుతి
లక్నో : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం సందర్భంగా శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. అస్థికలు నదిలో నిమజ్జనం చేయానికి వెళ్లిన బీజేపీ నేతల పడవ బోల్తా పడడంతో పలువురు నాయకులు నదిలో పడిపోయారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఉత్తర ప్రదేశ్‌లో బస్తీ నదిలో అస్థికలు నిమజ్జన సమయంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పడవలో ప్రయాణించిన వారిలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ రమాపాటి రామ్ త్రిపాఠి, ఎంపీ హరీష్ ద్వివేది, ఎమ్మెల్యే రామ్ చౌదరి, సీనియర్ బీజేపీ నేతలు, ఎస్పీ దిలీప్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఒడ్డుకు సమీపంలో పడవ తలకిందులు కావడంతో పోలీసు సిబ్బంది నదిలోకి దూకి అందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎక్కువ మంది ప్రయాణించడం వల్లే పడవ తలక్రిందులైందని అధికారులు పేర్కొన్నారు. -
నా బిడ్డ ఏమైపోయాడో..
ఓ పక్క గోదావరి వరద ప్రమాదకరంగా ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరిలో బోట్లు, పడవల రాకపోకలను నిషేధించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. లంక గ్రామాలకు రాకపోకలకు మరో దారి లేకపోవడంతో నాటు పడవలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ముమ్మిడవరం మండలం గురజాపులంక గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడడంతో ఒక యువకుడు గల్లంతు అయ్యాయి. అందులో ఉన్న 14 మంది ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలను దక్కించుకున్నారు. తూర్పుగోదావరి ,ముమ్మిడివరం: ఉదయమే పొలం నుంచి పాలకేన్లతో ఇంటికి చేరుకునే రైతులతో కళకళలాడే ఆ లంక గ్రామాలు సోమవారం శోకసంద్రంగా మారాయి. గౌతమి గోదావరి పాయలో పడవ బోల్తా పడడంతో గురజాపులంక గోదావరి తీరం ఆక్రందనలతో మార్మోగింది. మండలంలోని కమిని శివారు గురజాపులంక గోదావరి పాయలో నాటు పడవ పెనుగాలులకు అదుపు తప్పి ఒడ్డున ఉన్న తాడి చెట్టును ఢీకొని బోల్తా పడడంతో ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. అందులో ఉన్న 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పాల కేన్లతో పడవ ఎక్కారు లంకాఫ్ ఠానేల్లంక శివారు కూనాలంకకు చెందిన 15 మంది రైతులు గౌతమి గోదావరి పాయ మధ్య ఉన్న దుప్పిలంకలోని వారి పొలాల్లో ఉన్న పశువుల నుంచి పాలు తీసుకుని నాటు పడవ ఎక్కారు. పడవ ఒడ్డుకు చేరే సమయంలో ఈదురుగాలులకు పడవ అదుపు తప్పి ఒడ్డున ఉన్న తాడి చెట్టును ఢీకొని బోల్తా పడింది. పడవలో ఉన్న నల్లా బుచ్చి మహేశ్వరరావు (26) గల్లంతయ్యాడు. ఒక పక్క ఈదురు గాలులు, గోదావరి ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నా పడవ బోల్తా పడిన వెంటనే ప్రవాహ వేగానికి ఎదురీదుకుంటూ కొందరు ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు ఒడ్డున ఉన్న ముళ్ల కంచెలు పట్టుకుని బయటపడ్డారు. లేనిపక్షంలో పెను ప్రమాదమే జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అమలాపురం ఆర్డీఓ డి.వెంకటరమణ, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నా బిడ్డ ఏమైపోయాడో.. పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే బిడ్డ ఉదయం పాలు తీసుకువస్తానని వెళ్లి ఏమైపోయాడోనని గల్లంతైన బుచ్చి మహేశ్వరరావు తల్లిదండ్రులు బాలరాజు, వరలక్ష్మి బోరున విలపిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ కుమారుడు పడవ ప్రమాదంలో గల్లంతైన విషయం తెలిసి ఆ కుటుంబ సభ్యుల రోదిస్తుంటే చూపరులను కలచివేసింది. శోక సంద్రంలో నిండు గర్భిణి గల్లంతైన మహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన భారతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు నిండు గర్భిణి. ఈ నెల 30న ప్రసవం అవుతుందని వైద్యులు తెలిపారు. పుట్టింటిలో ఉన్న ఆమెకు.. గోదావరిలో భర్త గల్లంతైన విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిచింది. మరో పది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చే ఆమె భర్త గల్లంతు కావడంపై ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బెండకాయల మూటే రక్షించింది ప్రమాదం జరిగిన పడవలో ఉన్న బెండకాయల మూటే రక్షించింది. పడవ బోల్తా పడటంతో నీట మునిగాను. కంగారుతో ఒంట్లో దడ ప్రారంభమైంది. కాళ్లూ చేతులు ఆడలేదు. మునిగిపోతాననుకున్నాను. నీటిపై తేలుతున్న బెండకాయల మూట కనిపించింది. దాన్ని పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాను.– నల్లా విష్ణుమూర్తి, ప్రమాదం నుంచి బయట పడ్డ రైతు -
విద్యార్థుల పడవ మునక.. 22 మంది మృతి..!
ఖర్టోమ్, సుడాన్ : నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందనీ, ప్రమాద సమయంలో పడవలో 40 మంది విద్యార్థులున్నారని సునా వార్తా సంస్థ తెలిపింది. నదిలో తీవ్ర అలజడి రేగడంతో ఇంజన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు మర బోట్లలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మిగతావారిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. పిల్లలంతా ప్రైమరీ విద్యనభ్యసిస్తున్నవారే. -
సముద్రంలో బోటు గల్లంతు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఫిషింగ్ బోటు సముద్రంలో గల్లంతైంది. బోటులో దుమ్మలపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు ఫైబర్ బోటు వెళ్లింది. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పడవ ప్రమాదం.. ముగ్గురి మృతి
తిరువనంతపురం : కొచ్చి తీరంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వివరాలు... మంగళవారం తెల్లవారుజామున చెత్తువా తీరంలో చేపలు పట్టేందుకు మూనంబం నుంచి 15 మంది మత్స్యకారులు పడవలో బయల్దేరారు. వీరంతా ప్రయాణిస్తున్న పడవను భారీ నౌక ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాం : కేరళ ఫిషరీస్ మంత్రి ఈ ఘటనపై స్పందించిన కేరళ ఫిషరీస్ మంత్రి జే మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ... హెలికాప్టర్, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ‘ప్రమాద బాధితులను రక్షించడమే మా తక్షణ కర్తవ్యం. మత్స్యకారుల పడవ నిబంధనలు అతిక్రమించి నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. అయినా ఆ విషయం ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. ప్రమాదానికి కారణమైన పడవను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నామని’ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం కూడా కొచ్చి తీరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విదేశీ నౌక ఢీకొనడంతో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. -
సముద్రంలో ఏడు బోట్లు బోల్తా
శ్రీకాకుళం : తీరంలో మరోమారు ‘అల’జడి రేగింది. ఇటీవల సోంపేట తీరంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడిన ఘటనలో ఒకరు చనిపోవడం.. ఏడుగురు గాయపడిన ఘటన జిల్లావాసులు కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితే సోమవారం గార మండలంలో చోటు చేసుకుంది. అలల ఉద్ధృతికి ఏడు బోట్లు బోల్తా పడిపోయాయి. ఈ ఘోరంలో మైలపల్లి లక్ష్మణ, గంగట్ల లక్ష్మణ తీవ్రంగా...మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. బోట్లు బోల్తాపడిన సమాచారంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. చేపల వేట కోసం వెళ్లిన తమవారు ఎలా ఉన్నారోనని భీతిల్లిపోయారు. అదృష్టవశాత్తు అంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.గార: వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కొద్ది రోజులుగా మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడం లేదు. అయితే రోజుల తరబడి వేటకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను జలపుత్రులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సోమవారం కొంతమంది ధైర్యం చేసి బోట్లపై వేటకు బయలు దేరారు. అయితే అలల హోరులో వారి సాహసం పని చేయలేదు. దీంతో తీరానికి వచ్చేయాలనే తాపత్రయంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరినీ అందోళనకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే.. బందరువానిపేట, మొగదాలపాడు గ్రామాల్లో 174 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. మత్స్యకార పెద్దలకు తెలియకుండా ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 56 మంది 11 బోట్లపై సోమవారం వేకువజామున సముద్రంలోకి వేటకు వెళ్లారు. అప్పటికే సముద్రంలో గాలుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేట సురక్షితం కాదని భావించి తీరానికి తిరుగుముఖం పట్టారు. ఈ ప్రయత్నంలోనే బందరువానిపేట తీరానికి చెందిన ఐదు, మొగదాలపాడు గ్రామానికి చెందిన రెండు పడవలు సముద్రంలో బోల్తాపడిపోయాయి. అయితే మత్స్యకారులంతా వాటిని గట్టిగా పట్టుకొని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా.. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. అలాగే మరో నాలుగు పడవుల్లో ఉన్నవారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. గాలి హోరు.. అలల ఉద్ధృతి కారణంగా బందరువానిపేట తీరం నుంచి ఉదయం 7 గంటల సమయంలో బోట్లపై నుంచి వెనక్కి వస్తున్న గంగట్ల లక్ష్మణ బోటు ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున పైకెగిసిన అలకు బోల్తా కొట్టింది. దీంతో లక్ష్మణరావుతో పాటు అందులో ఉన్న మైలపల్లి లకు‡్ష్మయ్యకు గాయాలయ్యాయి. వీరిని అదే బోటులో మిగిలిన మత్స్యకారులు అత్యంత కష్టంపై ఒడ్డుకు చేర్చారు. అనంతరం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో పడవ బోల్తా పడిన సంఘటన 5 వేలు జనాభా కలిగిన బందరువానిపేట గ్రామంలో దావానంలో వ్యాపించడంతో కలకలం రేగింది. ఏఏ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. ఎంతమంది వెళ్లారన్న సంగతి వారి కటుంబ సభ్యులు తీరానికి వచ్చేంతవరకు తెలియని పరిస్థితితో అందరిలో ఆందోళన రేగింది. 9 గంటల సమయం నుంచి సముద్రంలో గాలుల తీవ్రతతో పాటు అలల ఉద్ధతి కొంత తగ్గడంతో మిగిలిన బోట్లలో ఉన్నవాంతా ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించారు. బందరువానిపేటకు చెందిన శివకోటి లక్ష్మణరావు, కొమర తాతారావు, మురమంద చిన్నారావు, దుమ్ము కృష్ణలకు చెందిన నాలుగు పడవులు ఒకదాని తర్వాత ఒక్కక్కటి ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో మళ్లీ అలలు ఉద్ధృతి పెరగడంతో బోల్తా పడ్డాయి. మరో నాలుగు పడవులు అలకి అలకి మధ్య ఉన్న తక్కువ క్షణాల వ్యవధిలో సురక్షితంగా మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. బోల్తా పడిన పడవుల్లో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గాయాలపాలవ్వడం, మరో 10 మంది శ్వాస సంబంధిత ఇబ్బందులు కలగడంతో వారిని చికిత్స కోసం స్థానిక వైద్యాధికారి సుమన్ 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనలో నాలుగు ఇంజిన్లు పాడవ్వగా, 5 వలలు, రెండు జామితాళ్లు గల్లంతాయ్యాయి. మత్స్యశాఖ అధికారి శాంతారావు సంఘటన స్థలానికి వచ్చి బాధితుల వివరాలను సేకరించారు. జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. మొగదాలపాడు నుంచి బందరువానిపేట తీరానికి.. మొగదాలపాడు గ్రామానికి చెందిన చీకటి శ్రీరాములు, చీకటి సూర్యనారాయణ పడవుల్లో 8 మంది వేటకు బయలుదేరారు. ఆ పడవులు రెండు సముద్రంలో ఉన్న విండ్‌తో బందరువానిపేట తీరం వరకు వచ్చేశారు. 11 గంటల సమయంలో బందరువానిపేట పడవులు ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం గమనించిన మొగదాలపాడు మత్స్యకారులు కూడా ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో వారి పడవలు కూడా బోల్తా పడ్డాయి. అయితే వీటిలో ఉన్నవాంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సముద్రంలో బోటు బోల్తా
సఖినేటిపల్లి (రాజోలు): తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రంలో గురువారం మధ్యాహ్నం మత్య్సకారుల బోటు తిరగబడింది. ఈ బోటులోని మత్య్సకారులు ఆరుగురూ క్షేమంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. వీరందరూ విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామానికి చెందినవారు. సముద్రంలో సహచర బోటుదారులు వీరిని రక్షించి ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. పల్లిపాలెం కేంద్రంగా చేసుకుని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మత్య్సకారులతో కలసి విశాఖపట్నం జిల్లాకు చెందిన అర్జిల్ మసేన్, మైలపల్లి రాజారావు, అర్జిల్ అప్పారావు, ఓసుపల్లి సత్తెయ్య, చింతపల్లి బలరాం, అర్జిల్ జగ్గారావు గురువారం ఉదయం బోటుపై వేటకు సముద్రంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అలల తాకిడికి వీరి పడవ ఒక్కసారి తిరగబడింది. దీంతో వారు బోటుపైకి చేరుకుని సాయం కోసం కేకలు వేశారు. వారిని గమనించిన కొంతమంది బోల్తా పడిన బోటుతో సహా వారందరినీ రెండు బోట్లల్లో అంతర్వేది బీచ్ ఒడ్డుకు తీసుకువచ్చారు. ఒడ్డుకు చేరుకున్న వీరిని అమలాపురం ఆర్డీవో బి.వి.రమణ, ఎస్ఐ పవన్‌కుమార్ పరామర్శించారు. బోటు తిరగబడిన వెంటనే ఇంజిన్లోకి నీరు చేరి నడిసముద్రంలో బోటు నిలిచిపోయిందని, సహచర మత్య్సకారులు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారని బాధితులు అధికారులకు చెప్పారు. వీరికి రామేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి నూకరాజు వైద్య పరీక్షలు చేశారు. వీరికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ డీజే సుధాకర్‌రాజు, ఎఫ్‌డీవో సంజీవరావును ఆర్డీవో రమణ ఆదేశించారు. దెబ్బతిన్న బోటు, సముద్రంలో కొట్టుకుపోయిన వలలకు నష్టపరిహారంపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్టు ఆర్డీవో తెలిపారు. వీఆర్వో పోతురా>జు బాబులు, సర్పంచి చొప్పల చిట్టిబాబు,మాజీ సర్పంచి వనమాలి మూలాస్వామి పాల్గొన్నారు. -
షికారు.. మరింత హుషారు!
సాక్షి, హైదరాబాద్: అసలే వర్షాకాలం.. ఒకింత చలి.. ఒక్కోసారి ఉక్కపోత... కాంక్రీట్ జంగిల్లో ప్రజలు ఉండలేక రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరానికి బారులు తీరుతున్నారు. పర్యాటకుల సరదాకు తగినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ)అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్పీడు బోట్లు , సాంస్కృతికానందాన్ని పంచే ఖైరున్నీసా, భాగమతి బోట్లే కాక మరి కొన్నింటిని తీసుకువస్తున్నారు. బోటు షికారుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు’తీసుకురానుండటంతో షికారుకే కొత్త హుషారు రానుంది. లుంబినీ పార్కు బోటింగ్ పాయింట్లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరుతున్నాయి. ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యాటకులు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. అందులో కొత్తగా వచ్చే ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్ల’కు మరింత గిరాకీ రానున్నది. చూడటానికి బంగారు వర్ణంలో హుందాగా కన్పిస్తుండటంతో అందులో షికారుకు అందరూ మక్కువ చూపే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలు, ప్రత్యేక సెలవుదినాల్లో పర్యాటకులు ఇక్కడి బోట్లలో జలవిహారానికి ముచ్చటపడతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ టైపు బోట్లు రెండు త్వరలో సాగర్‌లోకి ప్రవేశం చేయగానే వాటికి పేరు పెట్టాల్సి ఉంది. వేడుకలు... ఆనందమే... పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు వంటి చిన్న కార్యక్రమాలు ఇందులో చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టీల కోసం వీటిని అద్దెకు ఇస్తామని టీఎస్‌టీడీసీ అధికారులు చెబుతున్నారు. ఇవి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ఖైరున్నీసా హోటల్ టైపులో ఉంటుంది. కానీ, ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లకు చుట్టూ గ్లాస్(అద్దం), పైన టాప్ కూడా గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అంటే కింది భాగం తప్పా బోట్ అంతా అద్దంతో తయారు చేసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా బస్సు టైపు బోట్లు దర్శనమిస్తాయి. విభిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేనట్లు సరికొత్తగా ఉండాలని టీఎస్‌టీడీసీ అధికారులు ప్రత్యేకంగా వీటిని తయారు చేయిస్తున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోటు నమూనా రెండు విభిన్న రకాలు... విభిన్న రేట్లు.. సాగర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి. కుర్చీలు ఎటువైపు అయినా అమర్చుకొనే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఫిక్స్డ్ సీట్ల బోట్లు ఉంటాయి. ఇందులో పర్యాటకులు ఇంట్లో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. నచ్చిన చోట, నచ్చిన వైపు సీట్లు వేసుకొని కూర్చొనే వెసులుబాటు ఉంటుంది. దీనికి పెద్ద ఇంజన్లు ఉండవు. అవుట్ బోర్డు మోటార్స్ –2 అమర్చి ఉంచుతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు రెండు రకాలున్నాయి. ఒకదానిలో 32 నుంచి 50 సీట్లు, రెండోది 80 నుంచి 100 సీట్లు ఉంటాయి. ఇందులో నదిలో విహరిస్తున్నట్లు ఉంటుంది. వీటి విలువ రూ.కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులో ఉన్న బోట్లు ఇవే... హుస్సేన్‌సాగర్‌లో చిన్నవి, పెద్దవి మొత్తం 17 బోట్లు ఉన్నాయి. మరో ఐదు రిపేరులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు రాబోతున్నాయి. మూలన పడిన ఫ్యారా సెయిలింగ్, జెడ్ స్కీ బోట్లను సైతం మరమ్మతులు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. - విందులు వినోదాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే వీలున్న ఖైరున్నీసా, భాగమతి బోట్లల్లో 40 నిమిషాలపాటు సాగరంలో విహరించవచ్చు. భగీరథిలో 200 మంది వరకూ విహరించవచ్చు. - 5 మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బుద్ధుడి వద్దకు తీసుకెళ్లి తీసుకొస్తాయి. 2 డీలక్స్బోట్లు అందుబాటులో ఉన్నాయి. - రాజహంస పడవలో హుందాగా అలలపై 15 నిమిషాలపాటు తేలియాడి రావొచ్చు. వీటికితోడు స్పీడుబోటులో సాగర్‌లో దూసుకుపోవాలంటే నడిపే వ్యక్తితో పాటు ఒక్కరే ప్రయాణించవచ్చు. ఆకర్షించేందుకు ప్రణాళికలు పర్యాటకంగా సాగర్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీకెండ్లో ఒక్కొక్క రోజు వేలమంది పర్యాటకులు బోటింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే క్రమక్రమంగా లుంబినీ పార్కు బోటింగ్ యూనిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశ పెట్టబోతున్నాం. హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లుంబినీ పార్కు సందర్శించి బోటింగ్ చేయాలనే ఆలోచనకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ -
బతుకుజీవుడా
పొట్టకూటి కోసం 9 మంది మత్స్యకారులు ఎప్పటిలానే సముద్రంలో వేటకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఒకరు వేరే బోటులో వెళ్లిపోగా మిగిలిన ఎనిమిది మంది సోనాబోటులో గమ్యానికి బయలుదేరారు. ఇంతలో వాతావరణంలో మార్పులతో కడలి కల్లోలంగా మారింది. దీంతో వారు వస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి.. నడిసంద్రంలో ఎటు వెళుతున్నారో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూకేసి గుప్పెడుపేట తీరానికి చేరుకున్నారు. మరో నలుగురు బోటులోనే ఉండిపోయారు. ఈ బోటు అలల ఉద్ధృతికి గుప్పెడుపేట–ఉమిలాడ గ్రామాల్లోని తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి వీరిని ప్రాణాలతో రక్షించారు. పోలాకి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, మైలపల్లి శ్రీను, బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య, బర్రి మసేను, గోవింద అప్పన్న ఈనెల 9వ తేదీ సోమవారం విశాఖపట్నం నుం చి సోనాబోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. అక్కడి నుంచి బారువా తీరం వరకు వచ్చి 20వ తేదీ శుక్రవారం ఉదయాన్నే విశాఖకు తిరుగు పయనమయ్యారు. వీరిలో ఒకరు అదే ప్రాంతానికి చెందిన వేరే బోటులో వెళ్లిపోయారు. మిగిలిన 8 మంది సోనాబోటులో ప్రయాణిస్తున్నారు. వారిలోని బర్రి తాతయ్య, వాసుపల్లి నరసింహ, బర్రి మసేను, గోవింద అప్పన్న, మైలపల్లి శ్రీను విశ్రాంతి తీసుకోవడానికి బోటులోని గదిలోకి వెళ్లిపోయారు. బర్రి అమ్మోరు, బర్రి ఎర్రయ్య, గనగళ్ల తాతయ్య బోటుపైనే ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం జీపీఎస్ పని చేయకపోవటంతో బోటు గతి తప్పింది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో పోలాకి మండలంలోని గుప్పెడుపేట గ్రామం వైపు వస్తుండగా అలల ఉద్ధృతికి బోటు బోల్తాపడింది. బోటుపై ఉన్న బర్రి అమ్మోరు, బర్రి యర్రయ్య, గనగళ్ల తాతయ్య సముద్రంలోకి దూకి ఈదుకుంటూ గుప్పెడుపేట ఒడ్డుకు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలోని సంతబొమ్మాళి మండలంలోని ఉమిలాడ తీరానికి.. ప్రమాదానికి గురైన సోనాబోటు ఉదయం 6 గంటలకు కొట్టుకొచ్చి ంది. బర్రి తాతయ్య, మైలపల్లి శ్రీను, వాసుపల్లి నర్సింహ, బర్రి మసీను, గోవింద అప్పన్న లోపలే చిక్కుకున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. 35 టన్నుల బరువైన బోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పెద్ద క్రేన్ అవసరం ఉన్నా.. అలాంటి ఏర్పాటు జరగలేదు. స్థానికులే చొరవతీసుకుని దాదాపు 6 గంటల పాటు శ్రమించి యంత్రాల సాయంతో బోటును కట్ చేసి నలు గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చే ర్చారు. బోటులోని మైలపల్లి శ్రీను(22) అనే ఒక మత్య్సకారుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అధికారుల మధ్య సమన్వయలోపం అత్యవసర పరిస్థితిలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో సహాయక చర్యలు డీలా పడ్డాయి. ఫైర్ సిబ్బంది గానీ అత్యవసర సేవా విభాగాలకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గానీ హాజరుకాలేదు. ఇక పోలీసులు, మెరైన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నా అక్కడి పరిస్థితులను బట్టి చేసేదిలేక చేతులెత్తేశారు. గుప్పెడుపేట వైద్యాధికారి బలగ మురళి క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించి 108లో రిమ్స్‌కు తరలించారు. మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, భావనపాడు మెరైన్సీఐ సాయిసత్యారావు, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, పోలాకి తహసీల్దార్ జె.రామారావు, తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. హడావుడే తప్ప అధికారులు చేసిందేం లేదు సంఘటనా స్థలంలో అధికారులు హడావుడే తప్ప చేసిందేం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్రేన్ తెప్పించలేకపోయారు. ఇక్కడి యువకులు సాహసం చేయకపోతే నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి. బాధిత మత్స్యకారులను, బోటు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలి. – లండ యర్రయ్య, మత్స్యకారసంఘ నాయకుడు, గుప్పెడుపేట గంగమ్మ తల్లే కాపాడింది రాత్రి బోటు పల్టీ కొట్టిన తర్వాత ఎవరికి వారు నడిసముద్రంలో విడిపోయాం. ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది. ఈ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను ముందు ఒడ్డుకు వచ్చాను. అదే బోటులో మా నాన్న బర్రి తాతయ్య కూడా ఉన్నారు. ఇద్దరం క్షేమంగా బయటపడ్డాం. – బర్రి యర్రయ్య, మత్స్యకారుడు, చింతపల్లి -
పడవలను ఫోటో తీసినందుకు జైలు శిక్ష
ఎథెన్స్ : ఆర్మీకి చెందిన రెండు పడవలను ఫోటో తీసిన దంపతులకు పోలీసులు జైలు శిక్ష విధించారు. తాము ఏ తప్పు చేయలేదని, పర్యటన నిమిత్తం ఆ దేశానికి వచ్చామని చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బందుల పాలుచేశారు. ఈ సంఘటన గ్రీసు దేశంలోని ఎథెన్స్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన దంపతులు పమెలా, మైకేల్ క్లియరీ పర్యటన నిమిత్తం గ్రీసు దేశానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఐలాండ్ ఆఫ్ కాస్‌లోని ఓ ఓడరేవుకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మైకేల్ ఓడరేవులో నిలిపి ఉన్న రెండు ఆర్మీ పడవలను ఫోటో తీశాడు. ఇది గమనించిన ఓ ఆర్మీ సైనికుడు మైకేల్ ఫోన్లో తీసిన ఫోటోలను తొలగించాలని, పాస్‌పోర్ట్‌లు చూపించాలని ఆదేశించాడు. దీంతో భయపడ్డ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని బ్రిటన్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో వారిని అడ్డగించిన పోలీసులు వారి చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాము గూఢాచారులం కాదని ఆ దంపతులు ఎంతమొత్తుకున్నా వారు విడిచి పెట్టలేదు. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ముందు వారు తమ గోడును వెళ్లబోసుకోగా ఆయన వారిని ఊరికి పంపటానికి అంగీకరించాడు. అయితే వారి ఫోన్లను గ్రీసు పోలీసులకు అప్పగించి, బ్రిటన్‌లోని ఓ లాయర్‌తో వాదనలు వినిపించాలని షరతు విధించాడు. స్వదేశానికి చేరుకునన్న ఆ దంపతులు లాయర్‌ను ఏర్పాటు చేసుకుని వాదనలు వినిపించారు. కొన్ని వారాల తర్వాత కేసు నిలబడలేకపోయింది. దీంతో గ్రీసు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను సైతం వెనక్కు పంపించారు. -
వైరల్ వీడియో: చూస్తుండగానే మునిగిపోయింది
ముస్సోరి: సరదాగా సాగుతున్న పడవ ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్టోన్ కౌంటీలోని టేబుల్ రాక్ నదిలో గురువారం సాయంత్రం పడవ నీట మునిగింది. 31 మందితో ప్రకృతి అందాలను తిలకించడానికి బయల్దేరిన డక్ బోట్ (బాతు పడవ) నది మధ్యలో ఉండగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు విరుచుకుపడడంతో అలలు ఎగసిపడి పడవ నీట మునిగింది. శాంతంగా ఉన్న నదీ జలాలు తుపాను కారణంగా ఉగ్ర రూపం దాల్చి 13 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఘటనలో నలుగురు గల్లంతవగా మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి గురవుతున్న పడవను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ప్రయాణీకుల హాహాకారాలు, పడవ ప్రమాదం ఆసాంతం వీడియోలో నిక్షిప్తమైంది. -
వైరల్ వీడియో: 13 మందిని బలిగొన్న అలలు
-
సంస్కృతుల సమ్మేళన వారధి
భామిని శ్రీకాకుళం : ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు వారధిగా, తెలుగు–ఒడియా సంస్కృతుల సమ్మేళనానికి సహకరించేందుకు రథ సారధులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న వంశధార నదిని దాటేందుకు పడవ ప్రయాణాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో పరీవాహక ప్రాంతాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమమైంది. మండలంలోని బత్తిలి నుంచి కీసర వరకు గల గ్రామాల ప్రజలు ప్రయాణాలు, వ్యాపారాలకు సమీపంలోని ఒడిశా గ్రామాలపై ఆధారపడి ఉన్నారు. అయితే... ఇటీవల వంశధారలో భారీగా వరదలు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రవాహం తగ్గడంతో నాటు పడవల ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈతలో అనుభవజ్ఞులైన మత్స్యకారులే స్థానికంగా పడవలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకం. ప్రస్తుతం మండలంలోని బత్తిలి, నేరడి–బి, పసుకుడి, లివిరి, సొలికిరి, తాలాడ, తాలాడ రేవుల్లో పడవలు నడుపుతున్నారు. మత్స్యకారులే సాయం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కలపతో చెక్కిన కర్ర పడవుల స్థానంలో ఇసుప బోట్లు వచ్చాయి. వెదురు గెడల సాయంతో నడిపే విధానానికి ఫుల్స్టాప్ చెప్పి ఇంజిన్లు బిగించి పడవులు నడుపుతున్నారు. నదిలో వరద పెరిగినా అప్రమత్తంగా ఉండేందుకు ఇంజిన్లు సహకరిస్తున్నాయి. ఇటీవల మత్స్యశాఖ అందించిన బోటు కూడా నదిలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరోవైపు అత్యవసర సమయాల్లో పడవలు నడిపే స్థానిక మత్స్యకారులే వరదలు వచ్చే సమయంలో అధికారులకు సహకరిస్తున్నారు. -
బోటింగ్ టెర్రర్!
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న పర్యాటకాభివృద్ధి తిరోగమనంలో సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో విఫలమవుతోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే భాగ్యనగరంలోని సందర్శనీయ స్థలాల వద్ద సరైన రక్షణ చర్యలు లేక ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకు ఉదాహరణ హుస్సేన్ సాగర్‌లో విహారమే. లుంబినీ పార్కులో ఉన్న బోటింగ్ పాయింట్ తెలంగాణ రాష్ట్రపర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో నడుస్తోంది. సాగర్ జలాల్లో విహారానికి ఇక్కడి నుంచే బోట్లు తిప్పుతున్నారు. ఇక్కడ తిరిగే బోట్లను అధికారులు ఆర్భాటంగా అందుబాటులోకి తెస్తున్నా.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడం లేదు. అన్ని బోట్లదీ అదే తీరు.. సాగర్‌లో ఒకే ఇంజిన్‌తో ఉండే ఐదు మెకనైజ్డ్ బోట్లను తిప్పుతున్నారు. ఇవి తరచూ సాంకేతిక లోపంతో హుసేన్సాగర్ మధ్యలోనే అగిపోతున్నాయి. దీంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. వీటికి మరమ్మతులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా పూర్తి స్థాయిలో మాత్రం పనిచేయడం లేదు. ఫాంటన్ బోట్లు.. సుమారు 70 మంది ప్రయాణించే ఈ బోటుకు రెండు ఇంజిన్లు ఉండాలి. కానీ ఒక్క ఇంజిన్‌తోనే తిప్పుతున్నారు. ఏడాది కిత్రం ఒక ఇంజిన్ పాడైంది. దాని గురించి మాత్రం పట్టించుకోలేదు. ప్రయాణికులు సాగర్‌లో షికారు చేస్తున్నప్పుడు ఉన్నఫళంగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. సాగర్‌లో ఆగిపోయిన ప్రతిసారి మరో బోటును పంపి టూరిస్టులను ఒడ్డుకు తీసుకవస్తున్నారు. దీనికి ప్రతి మూడు నెలలకు ఓసారి ఇంజిన్, గేర్ ఆయిల్ మార్చాలి. కానీ ఆరు నెలలుగా ఆ పనులు చేపట్టలేదు. రిపేరులో మూడు స్పీడు బోట్లు టీఎస్‌టీడీసీ నడిపే ఐదు స్పీడ్ బోట్లలో మూడు రిపేర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం తిరిగే రెండు బోట్లు కూడా టూరిస్టులతో సాగర్‌లో తరచుగా ఆగిపోతున్నాయి. ఈ బోటులో షికారుకు వెళ్లినవారు సాగర్‌లోను.. టికెట్ తీసుకున్నవారు ఒడ్డున గంటల తరబడి ఎదురుచూడ్డం పరిపాటిగా మారింది. పెద్ద బోట్లపైనా నిర్లక్ష్యం సాగర్‌లో భగీరథి, ఖైరున్నీసా, భాగమతి పెద్ద బోట్లు తిరుగుతున్నాయి. వినోద కార్యక్రమాలు సైతం ఉండే వీటిలో 80 నుంచి 100 మందికి పైగా పర్యాటకులు షికారు చేయవచ్చు. ఏప్రిల్‌లో రిపేరుకు వెళ్లింది. ఒక్కొక్క బోటుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్, ఒక స్విమ్మర్ ఉండాలి. కానీ మూడు నెలలుగా ఒక హెల్పర్, ఒక సెక్యూరిటీ మాత్రమే వెళ్తున్నారు. డీలక్స్ బోట్లు డల్.. పది మంది ప్రయాణించే డీలక్స్ బోటు తరచూ ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి ఆగిపోతోంది. వీటికి వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు, రిపేర్ చేసేందుకు ప్రత్యేకంగా మెకానిక్‌ను నియమించినా పట్టించుకున్న దాఖలా లేదు. రాజహంస బోటు సైతం సాంకేతిక లోపంతో ఆడపాదడపా నడుస్తోంది. పర్యాటకుల్లోనూ భద్రతపై నిర్లక్ష్యం టీఎస్‌టీడీసీ అధికారులు పర్యాటకుల భద్రత కోసం లైఫ్ జాకెట్లను ఆయా బోట్లలో ఉంచారు. బోటింగ్ సిబ్బంది లైఫ్‌జాకెట్లు ధరించాలని చెప్పినా పర్యాటకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే అధికారులు మేల్కొని చర్యలు చేట్టాలి. జాగ్రత్తలుతీసుకుంటున్నాం.. లుంబినీ పార్కులోని బోటింగ్ పాయింట్ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. బోటింగ్ డ్రైవర్లకు జీతాలు పెంచాం. మరిన్ని కొత్త బోట్లు తీసుకురాబోతున్నాయి. పర్యాటకులు లైఫ్ జాకెట్స్ ధరించేలా చూడాలని సిబ్బందికి ముందే చెప్పాం. మరోసారి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తా. టూరిస్టుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటాం. – మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ -
అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ
సాక్షి, ముమ్మిడివరం : అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ అని రోదిస్తూ గోదారి గట్టున తమ బిడ్డల ఆచూకి కోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రుల వేదన చూపరులను కలచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలో గోదావరి నదిలో పిల్లలు గల్లంతై ఆరు రోజులు గడచినా ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మృతదేహాలు లభ్యమైనవారి రోదన ఒకవైపు, ఆచూకీ తెలియని విద్యార్థినుల కుటుంబ సభ్యుల వేదన మరోవైపు.. లంక గ్రామాల్లో అలముకున్న హృదయ విదారక దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద ఈ నెల 14న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థినులు, ఒక వివాహిత గల్లంతైన విషయం తెలిసిందే. ఐదు రోజులు ముమ్మర గాలింపు చర్యల చేపట్టగా ముగ్గురు విద్యార్థినులతో పాటు ఓ వివాహిత మృత దేహం లభ్యమయ్యాయి. మరో ముగ్గురు బాలికల ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన విద్యార్థినులు కొండేపూడి రమ్య, పోలిశెట్టి అనూష, సుచిత్రల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన అనూష, సుచిత్ర ఆచూకీ తెలియక వారి తల్లిదండ్రులు పోలిశెట్టి మాచరయ్య, వీరవేణి బోరున విలపిస్తున్నారు. మాచరయ్య వీరవేణికి ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె అనూష చదువులో çమంచి మార్కులు తెచ్చుకుంటూ వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. రెండో కుమార్తె సుచిత్ర. మాచరయ్య మూడో కుమార్తె కనక మహాలక్ష్మి తన అక్కలకు ఏమైందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇంట్లో గడుపుతోంది. కొండేపూడి రమేష్‌కుమార్, దుర్గలకు నలుగురు కుమార్తెలు కాగా గల్లంతైన రమ్య నాలుగో కుమార్తె. తండ్రి ఆర్కెష్ట్రాలో పని చేస్తుండటంతో రమ్య పాటలు పాడుతూ ఉండేది. అందరితో కలిసి మెలిసి ఉండే రమ్య దూరం కావడంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగిపోయింది. ఆరో రోజు కూడా ప్రత్యేక బృందాలు గోదావరి తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మత్య్సకారులు మర పడవలపై గాలింపు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ రూ.3.50 లక్షల సాయం ఐ.పోలవరం: పడవ ప్రమాదంలో మృతిచెందిన, గల్లంతైన వారి కుటుంబాలకు వైఎస్సార్ సీపీ తమ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు ఆర్థికసాయం అందించింది. గురువారం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం, రామచంద్రాపురం కోఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చెల్లుబోయిన వేణు పశువుల్లంక రేవు దాటి లంక గ్రామాలైన సలాదివారిపాలెం, శేరులంకలకు వెళ్లి ఏడు కుటుంబాలకు సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బోస్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. -
బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం
-
‘గోదారి ప్రమాదాలపై ప్రభుత్వం తీరు మారాలి’
సాక్షి, తూర్పు గోదావరి: గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో టీడీపీ ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని వైఎస్సార్ సీసీ నేతలు మండిపడ్డారు. హుటాహుటిన సహాయక చర్యలు అందించడానికి లైఫ్ జాకెట్లను కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. గోదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గత శనివారం గోదారిలో పిల్లర్‌ను ఢీకొట్టి పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతయిన ఏడుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణు, సతీస్‌బాబు, చిట్టిబాబు, రామచందర్ రావు, ముని కుమారి, జనార్దన్ రావు, నాగేశ్వర రావు తదితరులు గురువారం పరామర్శించారు. వలసల తిప్ప, శేర్లంక, సలాదివారి పాలెం, సీతారామపురం గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిజేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గాలింపు కోసం మరో 17 బోట్లు
సాక్షి, రాజమహేంద్రవరం : ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద వృద్ధ గౌతమి పాయలో శనివారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో నలుగురి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. మత్స్యకారుల సహయంతో గాలింపు బృందాలు నిరంతరం అన్వేషిణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 17 బోట్లతో సముద్రపు మొగలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్లతో పాటు అవసరమైన చోట్ల పంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెయ్యికిపైగా లైఫ్ జాకెట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. స్కూలు పిల్లలతో పాటు ప్రజలు నది దాటేటప్పుడు లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా ధరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
యానాంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
గల్లంతైన మరో మృతదేహం లభ్యం
-
చంద్రబాబుకి పబ్లిసిటి పిచ్చి పట్టింది
-
కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
లంకంతకష్టం!
-
మూడో రోజు లభ్యంకాని అందరి ఆచూకీ
-
మూడో రోజూ నిరాశే
సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం/ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తా ఘటనలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సముద్రం, నది కలిసే భైరవపాలెం మొగ వద్ద కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన తిరుకోటి ప్రియ (8వ తరగతి) మృతదేహాన్ని స్థానిక మత్య్సకారులు గుర్తించారు. ఆదివారం రాత్రి గల్లా నాగమణి అనే మహిళ మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి సోమవారానికి 3 రోజులవుతున్నా మిగతా ఐదుగురు విద్యార్థినుల జాడ కానరాకపోవడంపై వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంతాపంగా బాలికలు విద్యను అభ్యసిస్తున్న పశువుల్లంక పాఠశాల, మురముళ్ల మార్కెట్, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. మొత్తం 19 బృందాలతో వెతుకులాట గల్లంతైన సుంకర శ్రీజ, కొండేపూడి రమ్య, పోలిశెట్టి వీర మనీషా (పదో తరగతి), పోలిశెట్టి అనూష (తొమ్మిదో తరగతి), పోలిశెట్టి సుచిత్ర (ఆరో తరగతి)ల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డ్స్, అగ్నిమాపక దళం, ఏపీఎస్పీఎఫ్, డీప్ డైవర్స్ 160 మంది 19 బృందాలుగా విడిపోయి నదిలో గాలిస్తున్నాయి. వీరికి అదనంగా స్థానిక మత్స్యకారులు ఇంజిన్ పడవలతో అన్వేషిస్తున్నారు. నాలుగు డ్రోన్ కెమెరాలు, నేవీ హెలికాప్టర్ కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రమాదం జరిగిన పశువుల్లంక నుంచి యానాం మీదుగా గౌతమీ నది సుమారు 22 కిలోమీటర్లుంది. ఈ ప్రాంతాన్ని గాలింపు బృందాలు జల్లెడ పడుతున్నాయి. నదికి ఇరువైపుల అంచుల్లో మృతదేహాలు చిక్కుకునే అవకాశం ఉండటంతో వెతుకుతున్నారు. సముద్రంలోకి కొట్టుకుపోయే అవకాశం చనిపోయిన వారి మృతదేహాలు 24 గంటలకు ఉబ్బి నీటిలో తేలతాయని అధికారులు, మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. తిరుకోటి ప్రియ మృతదేహం సముద్రం సమీపంలో దొరికింది. ప్రస్తుతం గోదావరిలో వరద మొదలైంది. గత కొద్దిరోజుల నుంచి మొదలైన వరద క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం 3.5 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద, సోమవారానికి 4 లక్షల క్యూసెక్కులు దాటడంతో నదీ ప్రవాహం మరింత పెరిగింది. ఘటన జరిగిన ప్రదేశం సముద్రానికి సమీపంలోనే ఉంది. దీంతోమృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాయన్న అనుమానాలు బలపడతున్నాయి. కాగా, నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ తెచ్చిన ఐఆర్బీ బోట్లతో ప్రయాణించలేకపోతున్నారు. మత్స్యకారుల ఇంజిన్ బోట్లు, యానాం టూరిజం విభాగానికి చెందిన టూరిజం బోట్ల సహాయంతో సిబ్బంది గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యలను డిప్యూటీ సీఎం చినరాజప్ప, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు దాట్ల బుచ్చిరాజు, ముమ్మిడివరం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్, పి.సతీశ్ కుమార్, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్గున్నిలు పర్యవేక్షించారు. దుఖఃసాగరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ పిల్లల జాడ తెలియక ఓ వైపు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటే, ఆ విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోపాటు సహచర విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. ఆటపాటలతో కలసిమెలసి తిరిగే తమ స్నేహితురాళ్ల జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. మా స్నేహం మరువలేనిది శ్రీజ, నేను ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో కలిసి చదువుకుంటున్నాం. నోట్ బుక్స్ కొనాలన్నా, మరుసటి రోజు పాఠశాలకు డుమ్మా కొట్టేయాలన్నా ఇద్దరిదీ ఒకటే నిర్ణయం. ఆటపాటల్లో శ్రీజ చలాకీగా ఉండేది. శ్రీజ ఆచూకీ ఇంకా లభించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నా. – జగడం దివ్యశ్రీ (పదో తరగతి) బాగా చదవడానికి తపన పడేది పోలిశెట్టి సుచిత్ర బాగా చదవడానికి తపన పడేది. రోజూ అతికష్టం మీద శేరుల్లంక నుంచి సుమారు రెండు కిలోమీటర్లు సైకిల్‌పై గోదావరి రేవు వరకూ వచ్చి, పడవపై గోదావరి దాటి, కిలోమీటర్ కాలినడకన పాఠశాలకు వచ్చేది. ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే నివృత్తి చేసేది. ఎంతగానో సహకరించేది. – సఖిలే సుమ హాసిని (6వ తరగతి) మీకంటే ముందే వెళ్లిపోతా మీకు చదువు చెప్పే అవకాశం మూడేళ్లే ఉంది.. మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు, ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని నేను తరగతిలో హితబోధ చేశాను. వెంటనే పోలిశెట్టి అనూష నిలబడి ‘సర్...మీ కంటే ముందు మేమే వెళ్లిపోతాం’ అని అంది. అలా అన్న 3 రోజులుకే అనూష మా నుంచి దూరమైంది. – కంభంపాటి సూర్యనారాయణ (బయాలజీ ఉపాధ్యాయడు) పడవ ప్రమాదానికి ముందు విద్యార్థుల వనం–మనం ప్రతిజ్ఞ యానాం: పడవ ప్రమాదం జరగకముందు శనివారం ఉదయం స్థానిక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులు ‘వనం–మనం’ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఫొటో అందరితో కన్నీరుపెట్టిస్తోంది. ఈ ఫొటోలో ముందు వరుసలో 4వ తరగతి విద్యార్థిని తిరుకోటి ప్రియ ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం ఉంది. గలైంతైన మిగిలిన విద్యార్థినులు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ప్రియ మృతదేహం సోమవారం స్ధానిక మత్స్యకారుల గాలింపులో లభ్యమైంది. -
పడవ ప్రమాదం: శోక సంద్రంలో తోటి విద్యార్ధులు
-
కన్నీరే..గోదారై
-
కానరాని చిన్నారుల ఆచూకీ.. రెండవ రోజుకి గాలింపు చర్యలు
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రెండు రోజులు కావస్తున్నా గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన ఆ ఆరుగురు బాలికల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకోసం మూడంచెల గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్‌లో 15టీములు పాల్గొన్నాయి. ఈ సహాయక చర్యల్లో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు నేవి హెలికాఫ్టర్‌తో అధికారుల సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు నిన్న రాత్రి గాలింపు చర్యల్లో లభ్యమైన గల్లా నాగమణి మృతదేహాన్ని స్వగ్రామం షేర్‌లంకకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోంది తూర్పుగోదావరి : గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్‌కు పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోందని జిలా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో మొత్తం 15టీములు పాల్గొన్నాయన్నారు. వర్షం లేకపోవటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. -
రెండు రోజులైనా లభ్యం కాని విద్యార్థినుల ఆచూకీ
-
ప్రాణాంతకమైనా పడవ ఎక్కాల్సిందే..
అధునాతన రహదారులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా అవేమీ వారికి అక్కరకు రావు. అటు ఏజెన్సీలో కావచ్చు, ఇటు కోనసీమలో కావచ్చు.. ఇప్పటికీ అనేక గ్రామాలకు రహదారులు లేవు. విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అవసరం ఏదైనా వారు నదులనో, నదీ పాయలనో, కాలువలనో నిత్యం దాటి వెళ్లి రావాల్సిందే. ఇందుకు నాటు పడవలే దిక్కు. వాటిలో కనీసం లైఫ్ జాకెట్ల వంటి రక్షణ ఏర్పాట్లు కూడా ఉండవు. పైగా పడవ సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. మార్గం మధ్యలో ఏదైనా జరగరానిది జరిగితే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే. మే 15న దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటనను మరువక ముందే ఐ. పోలవరం మండలం వృద్ధ గౌతమి పాయలో పశువుల్లంక– సలాదివారిలంక మధ్య శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగించే రేవుల్లో భద్రతను పరిశీలిద్దాం. కూనవరం/వీఆర్‌పురం: కూనవరం – పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామాల మధ్య గోదావరి నదిపై ప్రయాణికులను దాటించే ఫెర్రీ నిర్వహణ దారుణంగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.లక్షల్లో పాట పాడుకొని ఆ సొమ్ము ఎప్పుడు రాబట్టుకుందామా అనే యావ తప్ప పాటదారుడికి ప్రయాణికుల కనీస భద్రత పట్టదు. నాలుగు విలీన మండలాల ప్రజలు, వేలేరుపాడు, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాలకు రాకపోకలు సాగించాలంటే ఈ రేవు ఒక్కటే మార్గం. సీజన్లో రోజుకు సుమారు 500 నుంచి వెయ్యి మంది ఈ ఫెర్రీ పాయింట్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కేవలం 20 మంది సామర్థ్యం కలిగిన ఇంజన్ పడవలో పరిమితికి మించి 50 మందిని పైగా ఎక్కిస్తారు. మూడు నుంచి నాలుగు మోటార్ సైకిళ్లు కూడా అందులో ఉంటాయి. గోదావరి నిండుగా ప్రవహించే సమయంలో సైతం పాటదారుడు లాంచీ ఏర్పాటు చేయడు. మర పడవలో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేవు దాటాల్సిందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫెర్రీ పాయింట్లో లాంచీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో శనివారం నుంచి పడవ ప్రయాణాన్ని పాటదారుడు నిలిపి వేశాడు .అలాగే మండలంలోని పోచవరం పంచాయతీలోని పోలిపాక – ఇంజరం గ్రామల మధ్య నడిపే మరపడవ వద్ద సైతం భద్రాతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవని ప్రయాణికులు చెబుతున్నారు. రహదారులు లేని గ్రామాలు నాలుగు వీఆర్ పురం (రంపచోడవరం): వీఆర్ పురం మండలంలోని తుమ్మిలేరు పంచాయతీ పరిధిలోని రహదారి మార్గం లేని నాలుగు గ్రామాల్లో 661 మంది ప్రజలు జీవిస్తున్నారు. తుమ్మిలేరులో 87 కుటుంబాలకు చెందిన 300 మంది, కొండేపూడిలో 19 కుటుంబాలకు చెందిన 70 మంది, కొల్లూరులో 32 కుటుంబాలకు చెందిన 153 మంది, గొందూరులో 30 కుటుంబాలకు చెందిన 138 మంది ఉన్నారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలకు ఏ అవసరం వచ్చినా పడవ ఎక్కి గోదావరి నదిలో 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తేనే బాహ్య ప్రపంచమైన పోచవరానికి చేరుకునేది. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణిస్తే మండల కేంద్రం రేఖపల్లి చేరుకుంటారు. ప్రతి సోమవారం వీఆర్ పురం వారపు సంతకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. వచ్చిన పడవపైనే తిరిగి వెళుతుంటారు. దేవీపట్నం మండలం మంటూరు లాంచీ ప్రమాదం తరువాత ఈ ప్రాంతంలో రోజుకు ఒక పర్యాయం చొప్పున గోదావరి నదిలో తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 గ్రామాలను కలుపుతూ రాకపోకలు సాగించే సర్వీస్ బోట్‌ను అధికారులు నిలిపివేశారు. లంక గ్రామాల వారిదీ అదే దుస్థితి పి.గన్నవరం: నియోజకవర్గంలో నదీ పాయలపై వంతెనలు లేకపోవడంతో లంక గ్రామాల ప్రజలు ప్రమాదం అంచున పడవలపై ప్రయాణిస్తున్నారు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి రేవులో వరద ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారి లంకల ప్రజలు ప్రమాదకర స్థితిలో పడవలపై వెళుతున్నారు. ఈ గ్రామాల్లో ఐదు వేల మంది నివశిస్తున్నారు. వరదల సీజన్లో మూడు నెలల పాటు విద్యార్థులు రోజూ పడవలపై ప్రయాణించి పాఠశాలలు, కళాశాలలకు వెళతారు. విద్యార్థులు ఇళ్లకు తిరి గి వచ్చేవరకూ తల్లిదండ్రులు ఆందోళనతో ఉంటున్నారు. వంతెన నిర్మించేందుకు 2014లో శంకుస్థాపన చేసిన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నంలంక–కె.ముంజవరం, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం–కోటిపల్లి రేవుల్లో నిత్యం వేలాది మంది ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులోని అయోధ్యలంక, ఆనగర్లంక, పెదమల్లంక గ్రామాల ప్రజలు కూడా వరదల సమయంలో పడవలను ఆశ్రయిస్తున్నారు. 2012లో ఐదుగురి మృతి పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం వద్ద వశిష్ట నదీ పాయలో 2012 నవంబర్ 18వ తేదీ సాయంత్రం ఇంజన్ బోటు అదుపుతప్పి మత్స్యకార కుటుంబాలకు చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. ప్రయాణం.. ప్రమాదం చింతూరు (రంపచోడవరం): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య సీలేరు నదిలో ప్రజలు ప్రాణాంతక పరిస్థితుల్లో నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. చింతూరు మండలంలోని పొల్లూరుకు ఆవలి ఒడ్డున ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని తగరికోట, తొంగూడెం, పూసగూడెం, మన్నెంకొండ, పొల్లూరు గ్రామాల ప్రజలు నాటు పడవలపై సీలేరు నదిని దాటుతున్నారు. పొల్లూరు, మోతుగూడేల్లో నివాసముంటున్న చాలామంది నదిని దాటి ఒడిశాకు వెళుతుంటారు. ఆయా గ్రామాల ప్రజలకు ఎలాంటి పని ఉన్నా పొల్లూరు, మోతుగూడెం రావాల్సిన పరిస్థితి తప్పడం లేదు. వారు రాజమహేంద్రవరం, భద్రాచలం వంటి పట్టణా లకు వెళ్లాలన్నా పడవలపై నదిని దాటాల్సిందే. కాగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి వదులు తున్న నీటితో సీలేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ఉద్ధృతిని కూడా లెక్కచేయకుండా నాటు పడవల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. దినదిన గండంగా.. దేవీపట్నం (రంపచోడవరం): దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలోని మంటూరు, తున్నూరు, కొండమొదలు పంచాయతీల పరిధిలోని 20 గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం లేదు. ఏడు వేల జనాభా కలిగిన ఈ గ్రామాల ప్రజలు తెల్లవారితే పడవ ప్రయాణం చేయాల్సిందే. వీరంతా గిరిజనులే. దేవీపట్నం రావాలంటే కనీసం మూడు గంటల పాటు పడ వ ప్రయాణించాలి. ఈ గ్రామాల ప్రజలు రహదారి ప్రయాణం చేయాలంటే కొండమొదలు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వైపున గల శివగిరికి, మంటూరు నుంచి వాడపల్లికి పడవపై దాటుకుని వెళ్లాలి. ఆయా తీర గ్రామాలకు లింకు రోడ్లు కూడా లేనందున పక్క గ్రామానికి పోవా లన్నా పడవ ప్రయాణమే దిక్కు. దేవీపట్నం నుంచి అవతల ఒడ్డున గల సింగనపల్లికి తిరిగే ఫెర్రీ రేవు పడవ ద్వారా రోజూ 500 మంది వరకూ నాటు పడవ ద్వారానే ప్రయాణం చేస్తా రు. దేవీపట్నం వైపు నుంచి పోలవరం ప్రాజెక్టులో పనిచేసేందుకు రోజూ సుమారు 300 మంది రోజువారీ కూలీలకు పడవ ప్రయాణమే దిక్కు. -
నిర్లక్ష్యమే శాపమైంది
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రతి రోజూ తమను నదిని దాటించే పడవే తమ కుటుంబాల్లో కన్నీళ్లను నింపుతుందని లంక గ్రామాల వాసులు భావించలేదు. పడవ నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్ల బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. లంకల్లోని కుటుంబాల వద్ద ఏటా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా పడవ నిర్వహణను గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన పడవ పరిశీలిస్తుంటే నిర్లక్ష్యపు జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పడవలో ఇంజిన్ ఫ్యానుకు ఉండాల్సిన మూడు రెక్కలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంది. మరో రెక్క సగం మేర విరిగి ఉంది. ఇలా ఒకటిన్నర రెక్క ఉన్న ఇంజిన్‌తోనే పడవను నడుపుతున్నారు. పాతకాలం నాటి ఇంజిన్, పలుమార్లు ప్రయత్నిస్తేగాని స్టార్ట్ కాదు. ఇలాంటి ఇంజిన్ పడవలో 12 వందల కుటుంబాలను నది దాటిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 200 మంది విద్యార్థులు ఆ పడవలోనే నది దాటుతూ ఉంటారు. శనివారం పడవ బయలుదేరడం ఒక్క నిమిషం ఆలస్యమైనా.. ప్రైవేటు స్కూల్లో చదువుతున్న మరో 25 మంది చిన్నారులు ఆ పడవలో ప్రయాణించి ఉండేవారు. ఈ విషయాన్ని తలుచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. కమిని, వలసలతిప్ప, పొట్టితిప్ప, సలాదివారిపాలెం, శేరిలంక, శ్రీరామపురం, పిల్లెంక, కొత్తలంక, గురజాపలంక తదితర లంకల్లో 1,200 కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరందరూ పుశువుల్లంక వద్ద గోదావరి దాటితేగానీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. పశువుల్లంక నుంచి మరో 3కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణిస్తే మురమళ్ల వద్ద కాకినాడ–అమలాపురం ప్రధాన రహదారిపైకి చేరుకుంటారు. వీరిని నది దాటించి, తీసుకువచ్చేందుకు ఏడాదికి గుంపగుత్తగా పడవ నిర్వాహకుడు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రతి ఏటా ఫిబ్రవరిలో పశువుల్లంక పంచాయతీ పెద్దలు వేలంలో కొంత మొత్తానికి ఈ పనిని కేటాయిస్తున్నారు. ఈ ఏడాది కొత్తలంకకు చెందిన వెంకటేశ్వర్లు వేలంలో పడవ నిర్వహణను దక్కించుకున్నారు. మోటారు సైకిల్ ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.1,800, మోటారు సైకిల్ లేని వారికి రూ. 800 చొప్పున ధర నిర్ణయించారు. ఈ లెక్కన ఏటా రూ.12 లక్షలు వసూలు చేస్తున్నారని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీనికి అదనంగా సంత రోజైన బుధవారం ప్రతి ఒక్కరూ రూ. 10 అదనంగా చెల్లించాలి. ఈ స్థాయిలో ఆదాయం వస్తున్నా కూడా పడవ నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. -
కానరాని జాడ
సాక్షి, రాజమహేంద్రవరం/నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రోజున్నర గడిచినా గల్లంతైన తమ వారి జాడ కానరాక విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాఠశాలకు వెళ్లి వస్తామని చెప్పిన తమ పిల్లలు తిరిగిరాకపోవడాన్ని ఆ కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. పడవ ప్రమాదం వార్త తెలిసినప్పటి నుంచి ఆ ఆరుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు గోదావరి ఒడ్డునే ఉండి తమవారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తమ పిల్లలను తలచుకుంటూ నది ఒడ్డున కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గోదావరిని సహాయక బృందాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. భారీ వర్షం, నదిలో నీటి ఉధృతితో గాలింపు చర్యలకు ఆటకం కలుగుతున్నా నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు ధ్రువీకరించారు. గల్లంతయిన మహిళ గల్లా నాగమణి మృతదేహం రాత్రి ఏడు గంటల సమయంలో లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కిలోమీటర్ దూరంలోని కొమరిగిరి వద్ద నది ఒడ్డున మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థుల కోసం రాత్రి కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. యానం బేస్‌క్యాంప్ కేంద్రంగా జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్), నేవీ, కోస్ట్‌గార్డ్, అగ్నిమాపక దళం, నాటు పడవలతో స్థానిక మత్య్సకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. నదిని జల్లెడ పడుతున్న దళాలు.. పడవ బోల్తా పడిన పశువుల్లంక నుంచి యానం–ఎదరులంక బ్రిడ్జి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాయలుగా విడిపోయింది. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గౌతమి నుంచి వృద్ధ గౌతమి పాయ విడిపోయి తిరిగి తాళ్లరేవు మండలం గౌరవపాలెం వద్ద గౌతమిలో కలుస్తోంది. గౌతమి పాయ యానం మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం యానం–ఎదుర్లంక బ్రిడ్జికి ఎగువన, సముద్రం వైపున గాలింపుపై దృష్టి సారించింది. 64 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 9 బోట్ల సహాయంతో కమాండెంట్ అజయ్మండల్ పర్యవేక్షణలో గాలిస్తున్నాయి. మరోవైపు ఏపీఎస్డీఆర్ఎఫ్ చెందిన కమాండెంట్ జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 74 మంది సిబ్బంది, వీరికితోడుగా 34 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, విశాఖ నుంచి వచ్చిన నావికాదళ సిబ్బంది, కోస్ట్ గార్డ్స్, గజ ఈతగాళ్లు, యానం సమీప ప్రాంతాల మత్య్సకారులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌నూ గాలింపు పనులకు వినియోగించారు. ఎన్డీఆర్ఎఫ్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా యానంలోని రాజీవ్ బీచ్ నుంచి అధికారులు గాలింపు దళాలకు సూచనలు చేశారు. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు గోదావరి నదిలో నౌకాదళ బృందాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయని విశాఖలోని ఈఎన్సీ కార్యాలయం వెల్లడించింది. సాగర సంగమమే లక్ష్యంగా అన్వేషణ... వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవశేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు భారీ ఎత్తున వరద నీరు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కోనసీమ మీదుగా ప్రవహించి గోదావరి పాయలు సముద్రంలో కలుస్తున్నాయి. వరద ప్రవాహంతో నదిలో వడి ఎక్కువగా ఉంది. దీంతో గల్లంతయిన వారు ఒకే చోట, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉండరన్న అంచనాతో గాలింపు బృందాలు ఉదయం నుంచి ప్రమాద స్థలం దిగువన, సాగర సంగమం లక్ష్యంగా అన్వేషణ సాగించాయి. నాటు పడవలను అరికడతాం: చినరాజప్ప గోదావరిలో పడవ ప్రమాదంలో గల్లంతైన బాలికలు, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఆదివారం తెలిపారు. బేస్ క్యాంపు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి చంద్రన్న బీమా యోజన ద్వారా రూ.5 లక్షలు, ఆచూకీ దొరకని ఆరుగురు బాలికల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. లంక గ్రామాల్లో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తూ ఉంటారని, పలు ప్రాంతాల్లో నిర్మాణాల్లో ఉన్న వంతెనలు పూర్తయితే నాటు పడవలను రద్దు చేస్తామని తెలిపారు. పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. దుఃఖసాగరంలో లంక గ్రామాలు అమలాపురం టౌన్/ముమ్మిడివరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక–మొండిలంక వృద్ధ గౌతమి నదీ పాయలో శనివారం సంభవించిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు విద్యార్థులు, ఓ వివాహిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ఈ దుర్ఘటనతో గోదావరి మధ్య దీవిలో ఉన్న సలాదివారిపాలెం, వలసలతిప్ప, పొట్టితిప్ప, శేరులంక, సీతారామపురం, కొత్తలంక గ్రామాల్లో విషాదం అలుముకుంది. గల్లంతైన వారి ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కన్నీటి గాధ. వీరందరికీ పడవ ప్రమాదం కట్టలు తెగే దుఃఖాన్ని మిగిల్చింది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ లంక గ్రామాల్లో ‘సాక్షి’ బృందం ఆదివారం పర్యటించింది. బాధిత కుటుంబాలను పలకరించగా వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే ఇంటిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. సీతారామపురం లంకకు చెందిన పోలిశెట్టి మాచరరావు ఓ వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. అనూష, సుచిత్ర, కనక మహాలక్ష్మి. అనూష (9వ తరగతి), సుచిత్ర (6వతరగతి) పశువుల్లంక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. రోజూలాగే శనివారం అక్కాచెల్లెళ్లు పడవ ఎక్కి గోదావరి దాటి పాఠశాలకు వెళ్లారు. తిరుగు ముఖంలో ప్రమాదంలో చిక్కుకుని గల్లంతయ్యారు. వారి తల్లి వీరవేణిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఏడాది కిందటే అనూష పుష్పవతి వేడుక చేశానని తండ్రి మాచరరావు తలుచుకుని కుమిలిపోతున్నాడు. బాగా చదివి ఉద్యోగం చేస్తాననేది మనీషా తండ్రి తాతాజీ ఆవేదన ‘నేను బాగా చదవి ఉద్యోగం చేస్తాను. అప్పుడు మీరు కష్టపడకుండా చూసుకుంటానని అనేది.. నా చిట్టితల్లి ఇప్పుడు గోదావరి పాలైపోయింది’.. అని పడవ ప్రమాదంలో గల్లంతైన పోలిశెట్టి మనీషా (10వ తరగతి) తండ్రి పోలిశెట్టి సూర్యనారాయణ (తాతాజీ) విలపిస్తూ చెప్పాడు. అనూష, సుచిత్రల తండ్రి మాచరరావు, తాతాజీ స్వయాన అన్నదమ్ములు. సీతారామపురం లంకలోనే ఇరుగుపొరుగు ఇళ్లు. ఆ ఇద్దరి అన్నదమ్ముల ఇళ్లలో ముగ్గురు ఆడపిల్లలను గోదావరి పొట్టన పెట్టుకుంది. గల్లంతైన తమ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని ఆపడం ఎవరితరం కావడంలేదు. తాతాజీ సైకిల్‌పై కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తాడు. వనమహోత్సవానికి వెళ్లి బలి పడవ ప్రమాదంలో గల్లంతైన షేర్‌లంకకు చెందిన కొండేపూడి రమ్య (9వ తరగతి)కి చదువు, పాటలంటే ప్రాణం. బాగా చదవడమే కాదు బాగా పాడుతుంది కూడా. తండ్రి రవికుమార్ వ్యవసాయ కూలీ. ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వీరంతా రోజూ పడవపై గోదావరి దాటి వెళ్లి చదువుకుంటున్నారు. రెండో శనివారం కావడంతో ముగ్గురు ఇంటి వద్దే ఉండిపోయారు. వన మహోత్సవం కార్యక్రమానికి పాఠశాల తెరవడంతో రమ్య వెళ్లి గోదావరికి బలైందని ఆమె కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. వర్షం వచ్చినా బడి మానని శ్రీజ పడవ ప్రమాదంలో గల్లంతైన సలాదివారిపాలేనికి చెందిన సుంకర శ్రీజ (10వ తరగతి) వర్షం వచ్చినా బడికి మానేది కాదని చదువంటే అంత ఇష్టంగా చదివేదని కుటుంబీకులు ఆమె జ్ఞాపకాలను తలుచుకుని కుమిలిపోతున్నారు. శ్రీజ తండ్రి వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలీ. అబ్బాయి శాంతికిరణ్ అమలాపురంలో డిగ్రీ చదువుతున్నాడు. తమ ఇంటి ఏకైక ఆడపిల్ల ప్రమాదంలో గల్లంతు కావడంతో ఆ కుటుంబం విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. తల్లి పరలోకం.. తండ్రి పరదేశం.. పడవ ప్రమాదంలో గల్లంతైన వలసలతిప్ప లంక గ్రామానికి చెందిన తిరుకోటి ప్రియ (8వ తరగతి) తల్లి ఐదేళ్ల కిందటే మరణించింది. ఆమెకు అక్క ఉంది. ఇంటర్ చదువుతోంది. పిల్లలను తమ బంధువుల పర్యవేక్షణలో ఉంచి ఆమె తండ్రి ఏడాదిన్నర కిందట ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అప్పటి నుంచి రాలేదు. పిల్లల చదువులకు అక్కడ నుంచే డబ్బులు పంపిస్తున్నాడు. తన కుమార్తె గోదావరిలో గల్లంతైందని తెలిసి తండ్రి శోకతప్త హృదయంతో ఇంటికి బయల్దేరాడు. ఉంగరం విడిపించేందుకు వెళ్లి.. పడవ ప్రమాదంలో గల్లంతైన షేర్‌లంకకు చెందిన గెల్లా నాగమణి (30) గృహిణి. భర్త దుర్గారావు వ్యవసాయ కూలీ. ఇటీవల కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన ఉంగరాన్ని విడిపించేందుకు మురమళ్ల వెళ్లింది. తిరుగు ప్రయాణంలో పడవ ప్రమాదానికి గురైంది. పెళ్లై పదేళ్లవుతున్నా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న ఆమె.. తల్లి కాకుండానే గోదావరి తల్లి ఒడిలో కడతేరిపోయిందని ఆమె కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు. -
పడవ ప్రమాదం.. మహిళ మృతదేహాం లభ్యం..
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో నదిలో గల్లంతైన వారిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది. కొమ్మలపల్లి వద్ద గల్లా నాగమణి మృతదేహాన్ని గాలింపు చర్యలో సిబ్బంది గుర్తించారు. గల్లంతైన ఆరుగురి విద్యార్ధుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సలాదివారిపాలెం లంక నుంచి పశువలలంకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాఫ్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత లేదు..! గోదావరి నదిలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. యానం బీచ్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోజులో 45 నిమిషాలు మినహా వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాక విద్యార్థినుల కోసం హెలికాప్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత రావడం లేదని కలెక్టర్ చెప్పారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. మూడు డ్రోన్లు కూడా వినియోగిస్తామని తెలిపారు. రేపు కూడా ఆపరేషన్ కొనసాగుతుందని తెలియజేశారు. గల్లంతైన విద్యార్ధుల వివరాలు.. తిరుకోటి ప్రియ(14), 8వ తరగతి, వలసలతిప్ప, ముమ్మిడివరం మండలం సుంకర శ్రీజ(15), 10వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి వీర మనీషా(15), 10వ తరగతి పోలిశెట్టి అనూష(13), 9వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి సుచిత్ర (11), 6 వ తరగతి, సలాది వారి పాలెం కొండేపూడి రమ్య(14), 9వ తరగతి, శేరిలంక -
గోదావరిలో పడవ ప్రమాదం.. ఓ మహిళ మృతదేహాం లభ్యం
-
‘పడవ ప్రమాదం.. అక్కడి ఎమ్మెల్యేదే బాధ్యత’
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్పందించారు. మలాపురంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వనం-మనం కార్యక్రమంలో పాల్గొనడం కారణంగానే పిల్లలు గల్లంతయ్యారని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అక్కడి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆమె సూచించారు. పోలవరం బిల్లులు ఏవీ పెండింగ్ లేవు అని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు. కన్నీరే.. గోదారై.. -
గోదావరి నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
పడవ ప్రమాదం: వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
-
ఇంకా దొరకని ఆ ఏడుగురి ఆచూకీ
సాక్షి, పశువుల లంక (తూర్పు గోదావరి) : గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలవరం మండలం పశువుల లంక వద్ద వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆదివారం ఉదయం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. శనివారం ప్రభుత్వ కార్యక్రమం ‘వనం-మనం’లో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ వీరు గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 23మంది సురక్షితంగా బయటపడ్డారు. రెండో శనివారం అయినప్పటికీ.. సెలవు రద్దు చేసి.. ‘వనం-మనం’ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. పిల్లల ఆచూకీ కోసం రాత్రంతా ఘటనాస్థలంలోనే ఉన్న తల్లిదండ్రులు వారి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం. కొనసాగుతున్న సహాయక చర్యలు ఆదివారం ఉదయం వర్షంలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డైవర్స్ నీళ్లలోకి దిగి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. గోదావరి దిగువన సముద్రంలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గోదావరి పొడవునా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయి.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. పిల్లలు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, వారి బంధువులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
గోదావరిలో విషాదం
-
గట్టు చెరెవరకూ గండమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఈ ఫొటోలోని పడవను చూశారా? పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడిచింది. ఇదెక్కడో కాదు తాజాగా మంటూరు–వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నడిచిన పడవిది. రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్ జాకెట్లు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉభయ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించి ప్రయాణికులతో నడిచింది. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద ఘటనకు చేరుకునేందుకు ఈ పడవలపైనే ప్రయాణాలు సాగాయి. జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలు తిప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు చోద్యం చూశారు. లాంచీలు తిరగకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో పడవలపైనే స్థానికులు రావల్సి వచ్చింది. ఒక్కొక్క పడవపై 25 మందికి మించి ప్రయాణించిన దృశ్యాలు కన్పించాయి. ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా లాంచీ ప్రమాద ఘటనా స్థలి వద్ద అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కానీ, ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతో పాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురైతే, పడవల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మచ్చుకు ఇక్కడ జరిగిన పరిణామాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ జిల్లాలో చాలా చోట్ల జరిగేది ఇదే. రహదారుల్లేక, ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తోందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. అసలు ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై ప్రయాణికుల్ని బలితీసుకుంటున్నాయి. అలాంటి పడవ ప్రయాణాలను ఇంకెంత తీవ్రంగా తీసుకోవాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, జిల్లాలో ఆ దిశగా పర్యవేక్షణ చేయడం లేదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదన్న నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. పడవ ప్రయాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగాక అయ్యో పాపం అంటూ హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో పడవ ప్రయాణాలు సాగిస్తున్న గ్రామాలివే ► ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. ► ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి 10మంది చనిపోయారు. ► తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరిటికాయ లంక, శేరిలంక, కొత్తలంక ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో తొమ్మిది మంది వరకు మృతి చెందారు. ► మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నం లంక–కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ► పి.గన్నవరం మండలంలోని కనకయ్యలంక–దొడ్డిపట్ల, ఎల్.గన్నవరం– కోడేరులంక గ్రామాల ప్రజలకూ పడవలే గతి. ► కొత్తపేట మండలంలోని తొగరిపాయకు వెళ్లేందుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు.ఆలమూరు మండలంలో వరదలొచ్చినప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు పడవపైనే వెళ్లాల్సి ఉంటుంది. ► కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం–కేదారిలంక గ్రామానికి పడవపైనే ప్రయాణాలు సాగిస్తుంటారు. ► కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ పరిధిలోని రామాలయంపేట, జీ. మూలపొలం మధ్య, తల్లంకుర్రు–కేశనకుర్రుపాలెం మధ్య, కుండలేశ్వరం– కేశనకుర్రుపాలెం మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు. ► వీఆర్‌పురం మండలంలోని తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు, కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకు పడవపై వెళ్తుంటారు. ► తాజాగా లాంచీ ప్రమాదం జరిగిన దేవీపట్నం మండలంలోనైతే 17 గ్రామాలకు పడవలు, లాంచీలే ఆధారం. సర్కార్ చిన్నచూపు – గ్రామాలకు ప్రయాణ ముప్పు రహదారి సౌకర్యం లేని గ్రామాలన్నింటికీ నాటు పడవలే ఆధారం. వాటి మీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. వాస్తవానికైతే పైన చెప్పిన 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు రహదారుల్లేక పోవడం వల్ల అధికారులు, సిబ్బంది సైతం అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లేవు. అంతెందుకు తాజాగా లాంచీ ఘటనలో మృతి చెందినవారు ఉన్న కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాటివాడ గ్రామాల్నే తీసుకుంటే.. అక్కడ కనీస సౌకర్యాల్లేవు. గ్రామాలకు రహదారులు లేవు సరే.. కనీసం ఫోన్ సౌకర్యం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం మరమ్మతులకు గురైనా ఇంతవరకు పట్టించుకోలేదు. కచ్చులూరు గ్రామంలోనైతే పది రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. ఇటీవల కురిసిన గాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను రోజులు గడుస్తున్నా పునరుద్ధరించలేదు. ఇక, వైద్యం పరిస్థితీ అంతే. వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారంతా పడవలు, లాంచీల మీద ప్రయాణాలు సాగించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. ఆయా గ్రామాల్లో టెలిఫోన్, విద్యుత్ సౌకర్యాల సంగతి పక్కన పెడితే ప్రయాణమే ప్రమాదకరంగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాకపోకలకు వీలుగా రహదారులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో.. ఇంకెన్ని ప్రమాద ఘటనలు జరగాలని చూస్తుందో చూడాలి. -
ఇంకెందరు బలి కావాలో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద, నిన్న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని మంటూరు సమీపంలో, నేడు ఐ.పోలవరం మండలంలో... ప్రాంతం ఏదైనా కన్నీటి గాథ మాత్రం ఒక్కటే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో చాలాగ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. బయటి ప్రపంచానికి రావాలంటే జనం నాటు పడవలను ఆశ్రయించడం తప్ప మరోదారి లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి అనుమతి లేని బోట్లపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు కనిపించకపోవడం గమనార్హం. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, తూతూమంత్రంగా విచారణ సాగించడం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. నిర్వాహకుల అజాగ్రత్త తూర్పు గోదావరి జిల్లాలో అనుమతి లేని బోట్లే అధికం. వీటిలో నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పడవల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకైక ఆధారం లైఫ్ జాకెట్లే. నాటు పడవల్లో లైఫ్ జాకెట్లు కనిపించడం లేదు. కొన్ని బోట్లలో ఉన్నా వాటిని బయటకు తీయడం లేదు. ఓ మూలన పడేస్తున్నారు. పైగా ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయన్న దానిపై అధికారుల వద్ద సరైన సమాచారం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రతిఏటా ఏప్రిల్‌లో రెన్యూవల్ చేయడం, పడవలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం షరా మామూలుగా మారిపోయింది. నిర్వాహకుల నుంచి లంచాలు దండుకుని నిబంధనల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కేవలం రెండే ఉన్నాయి. అధికారికంగా నడిచే మిగతా 64 బోట్లు ప్రైవేట్ వ్యక్తులవే. ఇవి కాకుండా అనధికారికంగా మరో 100 నాటు పడవలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా తిరుగున్న పడవలపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాకపోకలకు పడవలే ఆధారం తూర్పు గోదావరి జిల్లాలో జనం నిత్యం ప్రమాదాల మధ్యే ప్రయాణం సాగిస్తున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం పలంకురు మధ్య ప్రయాణానికి పడవలే దిక్కు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప, ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామానికి పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏజెన్సీ పరిధిలోని దేవీపట్నం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే పడవలు తప్ప మరో గత్యంతరం లేదు. మామిడికుదురు, పి.గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం, ఆలమూరు, కడియం, సీతానగరం, రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. - లైసెన్స్డ్ డ్రైవర్ మాత్రమే పడవ నడపాలి. - డ్రెస్‌కోడ్ తప్పనిసరిగా పాటించాలి. - పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే తొలుత 15 రోజులపాటు లైసెన్స్ రద్దు చేయొచ్చు. - బోటులో లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ఉండాలి. లైఫ్ జాకెట్లు ధరిస్తేనే ప్రయాణికులను ఎక్కించాలి. - ప్రతి పది మంది ప్రయాణికులకొక లైఫ్ రింగ్ అందుబాటులో ఉంచాలి. - పడవలో ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా ఉంచాలి. - ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. -
కన్నీరే.. గోదారై
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండో శనివారం.. పాఠశాలలకు సెలవు రోజు.. విద్యార్థులు ఇంటి వద్ద ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన సమయం. కానీ, ‘వనం–మనం’ కార్యక్రమంలో తప్పనిస రిగా పాల్గొనాలంటూ సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం. అమాయకులు బలైపోతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదు. పదో తరగతి లోపు విద్యార్థినులే.. గోదావరి నదిలో మే 15వ తేదీన లాంచీ బోల్తా పడి 19 మంది గిరిజనులు జలసమాధి అయిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం గోదావరి పాయ అయిన వృద్ధ గౌతమిలో నాటు పడవ ప్రమాదానికి గురైంది. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంకకు దాదాపు 30 మందితో బయల్దేరిన నాటు పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొట్టి ఓ పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులే. వారంతా పదో తరగతి లోపు చదువుతున్న వారే. మిగిలిన 23 మందిని స్థానికులు కాపాడారు. ఆచూకీ దొరికేనా? ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాధితుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సముద్రానికి దగ్గరగా ఉండే వృద్ధ గౌతమి పాయ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి వస్తున్న గోదావరి వరద నీరు ఈ పాయ గుండానే సముద్రంలో కలుస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీ అంత సులువుగా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రమాదం జరిగిందిలా.. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంక, శేరి లంక, కొత్త లంక గ్రామాలకు వెళ్లేందుకు మొండిల్లంక రేవు వద్ద 30 మంది నాటు పడవ ఎక్కారు. పడవ డ్రైవర్ సాయంత్రం 4.05 గంటలకు ఇంజిన్ స్టార్ట్ చేశారు. కాసేపు మొరాయించిన ఇంజిన్ కొద్దిసేపటికి పనిచేయడం ప్రారంభించింది. ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరం వెళ్లాక మళ్లీ ఆగిపోయింది. సరిగ్గా అదే ప్రదేశంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పడవ అదుపు తప్పింది. పక్కనే నిర్మాణంలో ఉన్న వంతెన మూడో పిల్లర్‌ను ఢీకొని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పిల్లర్ బేస్‌పైకి ఏడుగురు ఎక్కారు. మిగిలినవారు కూడా పిల్లర్ బేస్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పడవ మరింత కిందికి ఒరిగిపోయింది. దీంతో 17 మంది నదిలో పడిపోయారు. మరో ఆరుగురు పడవలోనే ఉండిపోయారు. సరిగ్గా అదే సమయానికి వంతెన నిర్మాణ పనుల సూపర్వైజర్ మధుబాబు నదిలోని ఓ పంటుపై ఉన్నారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా గమనించిన ఆయన తక్షణమే ఆవలి ఒడ్డుకు వెళ్లి తమ కంపెనీకి చెందిన ఇంజిన్ బోటులో పడవ మునిగిన చోటుకు వచ్చి కొందరిని రక్షించారు. అప్పటికే వీపున స్కూల్ బ్యాగులతో ఉన్న విద్యార్థినులు నీటిలో మునిగిపోతూ చేతులు ఊపుతున్నారు. మధుబాబు వారి చేతులు పట్టుకుని పైకి లాగారు. అలా దాదాపు పది మందిని రక్షించారు. నదిలో బోటు ఒరిగిపోవడాన్ని గమనించిన శేరిలంక వాసి కొండేపూడి సంజీవ్ మరో పడవలో వెళ్లి ఆరుగురిని రక్షించారు. ప్రమాదానికి గురైన పడవను నడుపుతున్న డ్రైవర్ సలాది వెంకటేశ్వరరావు సురక్షితంగా తప్పించుకున్నాడు. నీటిలో ఒరిగిన పడవ నదీ ప్రవాహ వేగానికి కిలోమీటర్ మేర కొట్టుకుపోయి శేరిలంక వైపు ఆగింది. వాస్తవానికి ఈ పడవ కేవలం 15 మంది ప్రయాణించడానికే సరిపోతుంది. కానీ, రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులతోపాటు మరో ఎనిమిది మోటార్ సైకిళ్లను ఎక్కించారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలి పడవ ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా జిల్లా పార్టీ నాయకులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ మండపేట: అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు పడవ ప్రమాదం ఘటన సమాచారం అందడంతో తక్షణమే అక్కడకు వెళ్లాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్, చెల్లుబోయిన శ్రీనివాస్, నాయకులు కర్రి పాపారాయుడులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో కూడా గాలించాలి పడవ ప్రమాదం నదీ ముఖ ద్వారం వద్ద జరిగిన నేపథ్యంలో గల్లంతైన వారికోసం గోదావరి నదిలోనే కాకుండా సముద్రంలో కూడా కోస్ట్‌గార్డ్, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాలని పిల్లి సుభాష్‌చంద్రబోస్ సూచించారు. ఘటనా స్థలం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడిందని, నిబంధనలు మేరకు వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పవన్, రఘువీరా దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక దగ్గర గోదావరి నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పడవ ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. పుస్తకాల బ్యాగే ప్రాణాలు కాపాడింది.. పశువుల్లంక జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. స్కూల్ ముగించుకుని అందరితోపాటు ఇంటికి చేరుకునేందుకు పడవ ఎక్కాను. కొంత దూరం వెళ్లేసరికి ప్రమాదం జరిగింది. పడవ ఒరిగిపోవడంతో గోదావరిలో పడిపోయాను. నా భుజానికి తగిలించుకున్న స్కూల్ బ్యాగ్ నన్ను నీటిలో తేలేలా చేసింది. దీంతో బ్యాగ్‌ను వదలకుండా పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా ఇంతలో నన్ను ఎవరో రక్షించారు. – జ్ఞానకుమార్ గల్లంతైనవారు వీరే.. పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఐ.పోలవరం మండలం సలాదివారిపాలేనికి చెందిన సుంకర శ్రీజ (పదో తరగతి), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి రమ్య (పదో తరగతి), పోలిశెట్టి వీరమనీషా (పదో తరగతి), తిరుకోటి ప్రియ (ఎనిమిదో తరగతి), పోలిశెట్టి అనూష (తొమ్మిదో తరగతి), పోలిశెట్టి సుచిత్ర (ఆరో తరగతి)తోపాటు వివాహిత గెల్లా నాగమణి (30) ఉన్నారు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గల్లంతయ్యారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే తప్ప వాస్తవ సంఖ్య ఎంత అన్నది చెప్పలేమని అధికారులు అంటున్నారు. నా బిడ్డ ఏమైపోయిందో.. కళ్ల ముందు మహలక్ష్మిలా తిరిగే మనవరాలు ఒక్కసారిగా కనిపించక ఓ అమ్మమ్మ ఆవేదన. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే కుమార్తె ఏమైందో తెలియక ఓ తల్లి బాధ. చదువే ప్రాణంగా భావించే కుమార్తెలు కానరాక ఓ తండ్రి కలవరం. ఇవీ ప్రమాదం ప్రాంతంలో కనిపించిన విషాద దృశ్యాలు. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కానరాక ఆవేదనతో బంధువుల చేస్తున్న ఆక్రందనలు అక్కడి వారందరినీ కదిలించివేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తారని భావించిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇప్పుడు కానరావడంలేదని, తాము ఏం చేయాలని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. చదువుల కోసం విద్యార్థులైనా, సరుకుల కోసం పెద్దలైనా, ఉపాధి పనులు కోసం కూలీలైనా నిత్యం గోదారి దాటి వెళ్లాల్సిందేనని, నాటు పడవల్లో గోదావరి దాటడం దినదిన గండమేనని వారు చెబుతున్నారు. నా మనవరాలు ఎలా ఉందయ్యా.. నా మనవరాలు ఎలా ఉందో చెప్పండయ్యా అంటూ బోటు ప్రమాదంలో గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ సిగిరెడ్డి సత్యవతి విలపించిన తీరు అక్కడి వారందరినీ కంట తడి పెట్టించింది. ప్రమాదం విషయం తెలుసుకున్న సత్యవతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు గోదావరి ఒడ్డుకు చేరుకుని విలపించారు. శ్రీజ ఎక్కడుందో తెలపండంటూ కనిపించిన వారిని సత్యవతి అడగడం కలిచివేసింది. – సిగిరెడ్డి సత్యవతి, గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ ఆరుగురిని రక్షించాను.. స్కూల్‌కు వెళ్లిన నా కుమారుడు వెంకటరుషి ఇంటికి తీసుకువెళ్లేందుకు గోదావరి ఒడ్డుకు వెళ్లాను. ఇంతలో ఒక పడవ ఆ ఒడ్డు నుంచి వస్తూ కనిపించింది. ఇందులో నా కొడుకు ఉన్నాడని ఎదురు చూస్తుండగా వచ్చే పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురయింది. ఏం జరిగిందో తెలిసేలోపే కొంత మంది గోదావరిలో పడిపోవడం కనిపించింది. కొందరు పిల్లర్ ఎక్కడం గమనించిన నేను వెంటనే గోదావరిలోకి దూకి ప్రమాద స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించాను. – కొండేపూడి సంజీవ్, ప్రత్యక్ష సాక్షి, శేరిలంక. యథావిధిగా స్కూల్‌కు సెలవిచ్చి ఉంటే.. ప్రతీ రెండో శనివారం స్కూల్‌కు సెలవిచ్చేవారు. ఏదో వన మహోత్సవమట.. మొక్కలు నాటాలనీ ఈ శనివారం పిల్లల్ని స్కూల్‌కు రమ్మన్నారు. సెలవు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యేవారు కాదు. నా ముగ్గురు కుమార్తెల్లో అనూష, సుచిత్రలకు చదువంటే ప్రాణం. ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదు. – గల్లంతైన అనూష, సుచిత్ర తండ్రి పోలిశెట్టి మాచర్రావు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నారు.. పడవలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నందువల్లే ప్రమాదం జరిగింది. ఇదే పరిస్థితి రోజూ ఉంటుంది. మనుషులనే కాకుండా వాహనాలను, గేదెలను పడవలో ఎక్కిస్తారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదంలో నా మరదలు గెల్లా నాగమణి, అన్నయ్య కూతురు రమ్య గల్లంతయ్యారు. రమ్య పాఠశాలకు, మరదలు నాగమణి కిరాణా సరుకులు కోసం వెళ్లారు. – బాధితుడు కొండేపూడి చంటిబాబు మృత్యుంజయులు.. పశువుల్లంక మొండి రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన గుర్రాల ఫణికుమార్ భార్య సుగుణ, రెండేళ్ల కుమార్తె సిరితో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు పడవ ఎక్కారు. పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో సుగుణ తాను వేసుకున్న జర్కిన్‌లో రెండేళ్ల పిల్లను పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. అయితే సిరి తీవ్ర అస్వస్థతకు గురయింది. చిన్నారిని ముమ్మిడివరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంటోంది. -
గోదావరి నదిలో పడవ ప్రమాదం